గుండెను తాకితీరాలి

గుండెను తాకితీరాలి 

NSK Chakravarthi గారు ఇంగ్లీష్ లో ఓ చిన్న కధ పోస్ట్ చేశారు.

అది యెంత గొప్పగా హృదయాన్ని తాకిందంటే వెంటనే క్షణం ఆలశ్యం చేయకుండా తెలుగులో అందరితో పంచుకోవాలని అనిపించింది.

తండ్రి చనిపోగానే ఒక్కగానొక్క కొడుకు తల్లి విషయం ఏం చేయాలని ఆలోచించాడు. కర్మ కండలు పూర్తికాగానే తీసుకువెళ్ళి ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు. చాలా కాలం తరువాత ఆశ్రమం వాళ్లు తల్లికి సీరియస్ గా వుందని కబురు చేస్తే వెళ్లాడు. అప్పటికే ఆమె ఇప్పుడో అప్పుడో అనేట్టు వుంది. కొడుకుని చూడగానే దగ్గరకు తీసుకుని చెప్పింది.

'బాబూ చూడరా ఈ గదిలో ఫ్యాన్ లేదు. దోమలు చంపేస్తున్నాయి. తిండి కూడా అలాగే వుంది. ఏదో వండి మొహాన పడేస్తారు. నువ్వు ఎలాగైనా వీలు చేసుకుని ఇక్కడ అన్ని గదుల్లో ఫ్యాన్లు పెట్టించరా. అలాగే ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి భోజనం కూడా బాగుండేట్టు చూడు'

అతడికి ఆశ్చర్యం వేసింది. తల్లి తనకు ఏనాడు ఈ విషయాలు కబురు చేయలేదు. ఇప్పుడు అవసాన దశలో ఈ మాటలు యెందుకు చెబుతున్నట్టు. అదే అడిగాడు.

ఆమె సమాధానం అతడి కళ్ళు తెరిపించిందో లేదో తెలవకుండానే ఆమె కన్ను మూసింది.

'నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. రేపో మాపో మీ పిల్లలు నిన్ను ఇక్కడే చేరుస్తారు. నువ్వు ఇలా ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు చెబుతున్నాను.'


'నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. రేపో మాపో మీ పిల్లలు నిన్ను ఇక్కడే చేరుస్తారు. నువ్వు ఇలా ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు చెబుతున్నాను.'

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!