Monday, June 30, 2014

“గ్రావిటీ” కన్నా మన ఖర్చు తక్కువే – మోడీ


“గ్రావిటీ” కన్నా మన ఖర్చు తక్కువే – మోడీ

మనం గ్రావిటీ నుండి బయట పడే శ టీ లైట్స్ తక్కువ ఖర్చు తో 

పంపుతున్నాం....

హాలీవుడ్ లో “గ్రావిటీ” మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఏడు ఆస్కార్ అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. గ్రావిటీ చిత్రంలోని కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేశారట.

పీఎల్ఎస్వీ-సీ23 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన “గ్రావిటీ”ప్రయోగం విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోడీ “గ్రావిటీ” చిత్రానికి అయిన ఖర్చు కంటే మార్స్ మిషన్ ప్రయోగానికి అయిన ఖర్చు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నడిపిస్తూ మన శాస్త్రవేత్తలు భారతదేశ ఘనతను చాటారని ప్రశంసించారు మోడీ. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే, 2013 లో విడుదలైన “గ్రావిటీ” సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్ఫోన్సో తెరకెక్కించారు. ఈ చిత్రం దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందించబడింది.

Sunday, June 29, 2014

హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు.

హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు.

దానితేజస్సు సర్వ వ్యాప్తమైఉంటుంది. అందులోనే లోకములన్నీ కనుపిస్తాయి.

బాల కృష్ణుడు ఈదీపశిఖలో కనుపింఛే బ్రహ్మాండాన్నే తన నోటిలో యశొదకు చూపిస్తాడు. 

.

ఈజ్యోతి అతి సూక్ష్మమైనది. కృష్ణుడు నోరుతెరచి తన హృదయాంతర్గతమైన జ్యోతినే యశోదకు చూపిస్తాడు. చిత్తముయొక్క విక్షేప శక్తివలన ఆమె అబ్బురపడి చూస్తూ ఉండిపోయినది. ఆమె యశోద. అంటే యశమును ఇచ్చునది. ఆమెద్వారా ఈ సంఘటన లోకానికి తెలిసినది. ఆయన యశస్సు లోకానికి చాటిచెప్పినది.ఆమెకు జగత్తుకు కారణమైన బిందువుని చూపిస్తే , ఆమెకు దానిలోని లోకములన్నీ కనుపించాయి. అర్జునునికి ఒక్క విశ్వరూపం మాత్రమే చూపించాడు. కృష్ణుడు ఆమె అవిద్యను ఆమెకి తిరిగి ఇచ్చివేశాడు. ఆమె కృష్ణుని దివ్యత్వంతెలుసుకోలేదు

. బాలునికి ఏగాలో సోకినది. అని అనుకొని విభూతి పెట్టి ఉంటుంది

తిరుపతి వెంకట్ కవులు....

తిరుపతి వెంకట్ కవులు....

ఆ జంట కవుల పూర్తి నామధేయములు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

దివాకర్లవారిది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండ గండి గ్రామం.

తల్లిదండ్రులు:-శేషమ - వేంకటావధాని.

ప్రజోత్పత్తి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమీ బుధవారం జననం.(1872).

.

చెళ్ళపిళ్ళ వారిది తూర్పు గోదావరి జిల్లా,ధవళీశ్వరం సమీపమున గల కడియము గ్రామం.

తల్లిదండ్రులు:- చంద్రమ్మ - కామయ్య.

ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమ వారం.(1870)

.

ఈ జంట కవులు నర్మోక్తులతో, హాస్య సంభాషణతో, చతుర వచో విలాసంతో, సభాసదులను ఆనంద పరవశుల్ని చేసే వారు. వాగ్గాంభీర్యంతో ప్రత్యర్థుల్ని అవాక్కయేలా చేసేవారు. సరస సంభాషణలో కూడా వీరుతక్కువవారేంకాదు.

.

ఒకపర్యాయం వీరు మండపేటలో కళాభిజ్ఞత, లోకజ్ఞత, రసజ్ఞత గల " మణి " అనఁబడే వేశ్యను చూచి, ఆమె చేసిన నాట్యాన్ని చూచారు. చాలా సంతోషింఛారు. అభినందించారు.

అంతటితో ఊరుకోక ఆమెతో కొంటెగా " మణి మామూలుగా ఉండే కంటే " కడియం " లో ఉంటే సార్థకత లభిస్తుంది. శోభస్కరంగా ఉంటుంది. అన్నారు. (వారిది కడియం గ్రామమేకదా! అక్కడుంటే--- ఊఁ ----అన్ని విధాలా చాలా బాగా ఉంటుందని వారి నర్మ గర్భ సంభాషణా సారాంశం.)

.

వెంటనే ఆమె ఆకవులతో చమత్కారం ఉట్టిపడేలాగా సమాధానం చెప్పి వారిని మరింత మెప్పించింది.

ఏమందో చూడండి.

మహాకవులు మీకు తెలియని దేముంది? స్వచ్ఛమైన మణి (ఆమె నిర్మల అన్న మాట.)కడియంలో ఉంటే యేమిటి? పేటలో(మండపేట, ఆమె నివాస గ్రామం) ఉంటే యేమిటి?

వెంకట శాస్త్రిగారి చతురతకు దీటైన చతురతనామె కనఁబరచింది కదూ?

శ్రవణానందం

శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.

.

సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు

వాలు చూపులు రెండు వేలు సేయు

నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు

విర్రవీగుట లారువేలు సేయు

పదమొక్కటియె సేయు పదివేల వరహాలు

లావణ్యమది యొక లక్ష సేయు

బలుసోయగమె సేయు పది లక్షల వరాలు

కులుకు నడక తీరు కోటి సేయు

.

ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు

నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు

నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు

నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!

.

అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో?

Saturday, June 28, 2014

మనిషి ఆశాజీవి..

మనిషి ఆశాజీవి.......

.మనిషి ఆశాజీవి. ఎంత ఆశాజీవి అంటే, లక్ష రూపాయల జీతం కోసం కష్టపడి, ఉదోగ్యం సాధించినా, ఇంకో లక్షవస్తే బాగుండని దాని కోసం ప్రయత్నిస్తాడు. 

అది సాధిస్తే, ఇంకో లక్షకోసం. ఆస్తుల విషయంలో కూడా అంతే. ఎన్ని ఆస్తులున్నా, ఇంకా ఇంకా కూడబెట్టాలన్న తపన. 

కొన్ని తరాలను పోషించదగ్గ సంపద ఉన్నా, ఇంకా పోగు చేసి, మరింత ధనవంతుడిని కావలనే తపన, ఏదో వెంపర్లాట. 

ఇది జీవితాంతం ఉంటుంది. నిజానికి జీవితం మొత్తం ఈ వెంపర్లాటలోనే గడిచిపోతుంది. యవ్వనంలో సంపాదించడం కోసం కష్టపడతాడు, 

ముసలివయసు రాగానే రోగాలను నయం చేసుకోవడం కోసం మొత్తం సంపద ఖర్చు చేస్తాడు. ఇదంతా గమనించిన వ్యక్తిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. చచ్చేటప్పుడు నేను వీటిని కట్టుకుపోను, మరి వీటి కోసం ఇంత ఆందోళన ఎందుకు అనిపిస్తుంది. 

మరణం తర్వాత మనిషి వెంబడి వచ్చేవి కర్మల ఫలితాలు, అంటే పాపపుణ్యాలు మాత్రమే.

Friday, June 27, 2014

చాల్లేవమ్మా నాకు చెప్పవచ్చేవు....

చాల్లేవమ్మా నాకు చెప్పవచ్చేవు....నోరు మూసుకొని మూల కూర్చో...

అత్తగారు అంటే ఎలా ఉండాలో నాకు చెప్పా వచ్చేవు... 

లలితా పవారు తో ..మన కాంతం...

x

షావుకారు జానకి...కృష్ణకుమారి... స్వంత తో బుట్టువులు...

షావుకారు జానకి...కృష్ణకుమారి...
స్వంత తో బుట్టువులు...

x

హింది సూర్యకాంతం......లలితా పవర్....

హింది సూర్యకాంతం......లలితా పవర్....

x

మన అమ్మ లక్కలు....చాయాదేవి...సూర్యకాంతం. (Shadow Devi....Sun Shine,)

మన అమ్మ లక్కలు....చాయాదేవి...సూర్యకాంతం.

(Shadow Devi....Sun Shine,)

రాధ ఎవరు?

రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ.

గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ


Thursday, June 26, 2014

కొంటెబొమ్మల బాపు

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

ఇలా కూనలమ్మ పదం వ్రాసి,ప్రముఖ కవి ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు.

Wednesday, June 25, 2014

బుస కొట్టబోతున్న బస్సు చార్జీలు !

బుస కొట్టబోతున్న బస్సు చార్జీలు !

మొన్ననే రైల్వే చార్జీలు ఒక కూత కూసేసాయి !

ఇప్పుడు తాజాగా బస్సు కస్సు బుస్సుమంటోందన్నమాట !

వీటికి తోడు,,,నెల నెలా గ్యాస్ గయ్యిమంటుందట !

ఉల్లి మల్లీ ఘాటైపోతున్నదట !

బియ్యం కొందామంటే బయ్యమేస్తుందట !

కందిపప్పు కొండెక్కింది !

కరెంటు షాక్ కొడుతున్నది !

వాయించి "వేయించు" కోవడమేఈ కొత్త పాలనలో !

నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం

 నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం

-వింజమూరి వెంకట అప్పారావు

 

ఆధునికాంధ్ర సాహితీ జగత్తులో ” ఆకులు రాలని, పూలు వాడని, నిత్య వసంతారామం కృష్ణశాస్ర్తి సాహిత్యోద్యానవనం” అని  నాటి నేటీ మేటీ కవుల , విమర్శకుల అభిప్రాయం. అది కాదనలేని వాస్తవం.. ఒక సుందర దృశ్యాన్ని చూసినా, ఒక మనోహర కవితను చదివినా కృష్ణశాస్తి స్మృతి మన మనో వీథిలో తళుక్కుమనకమానదు.

 

వ్యక్తిని మహోన్నతుడిగాను , మహా మనిషి గాను, మహాకవి గాను, యుగకర్త గాను మలచడంలో జన్మత: అతనికి సంక్రమించే  ప్రతిభా పాఠవాలే గాక, వంశపరంపరాగత గుణాలు..గణాలు.. తల్లిదండ్రుల శిక్షణాదికాలు కొంతవరకు , విద్యాబుద్ధులు కొంతవరకు,  పుట్టిపెరిగిన వాతావరణము కొంతవరకు, గురు ప్రభావము,, మిత్ర సహవాసము, సమకాలీన ఉద్యమ ప్రభావము, నాటి సామాజిక ఆర్ధిక, రాజకీయాది స్థితి గతులు, మరికొంతవరకూ తోడ్పడతాయి. ఇవన్నీ కృష్ణశాస్త్రి జీవిత, వ్యక్తిత్వ, వికాసాభ్యున్నతులకేవిధంగా

దోహదపడ్డాయో వీరి కవితలలో, సినీగీతాలలో స్పష్టంగా గోచరిస్తాయి.  విరహ వేదనను అత్యంత హృద్యంగా మరెవరూ  వ్రాయలేనంతగా అక్షరాలను పొదివి వాడేది వారి కలం .

 

ఆలోచనల్లో పుట్టిన సాహిత్యం… వెయ్యికాలాలు వర్థిల్లుతుందట. సరిగ్గా అలాంటివే దేవులపల్లి

కృష్ణశాస్త్రి సాహిత్యం. విరహవేదనను ఎంత హృద్యంగా వర్ణించారో చూడండి ఆయన.

 

క్షణాలు రాళ్ళుగా మారి కదలడం లేదట. మనసులోరూపం మాత్రం అలానేఉందట. పోనీవెళ్దామా అంటే… కుదరడం లేదట. అసలు వేదన ఎంత మధురంగా ఉంటుందా అని… చదివిన వారికితొలిసారిఅనిపిస్తుంది….

 

ఏ సీమల ఏమైతివోఏకాకినినా ప్రియా.. ఏకాకినినా ప్రియా..

ఏలాగీవియోగాన వేగేనోనా ప్రియా..

ఏలాగీమేఘమాసమేగేనోప్రియా.. ప్రియా.. ప్రియా..

ఘడియ ఘడియ ఒక శిలయైకదలదు సుమ్మీ..

 

ఎద లోపల నీరూపము చెదరదు సుమ్మీ..

పడిరావాలంటేవీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ..

దారులన్నియు మూసెదశ దిశలు ముంచెత్తె..

నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ..

ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీగర్భకుహరాల..

తమస్వినీగర్భకుహరాల..

 

లోకమంతా పాకినవిపగటివెలుగులు..

నాకు మాత్రం రాకాసిచీకట్ల మూలుగులు..

రాకాసిచీకట్ల మూలుగులు..

 

ఎపుడు నీపిలుపు వినబడదోఅపుడు నా అడుగు పడదు..

ఎచటికోపైనమెరుగక ఎందుకోవైనమందక నా అడుగు పడదు..

 

నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? అంటూ దేవులపల్లి వారు తన మనసులోని భావాలని  ప్రకటిస్తూ నవ్వేవారు నవ్వనీ అని తన కవితతో విమర్శకులకు సవాల్ విసిరిన ధీశాలి.

 

నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?

కలవిహంగము పక్షముల దేలియాడి తారకా మణులలో

తారనై మెరసి మాయ మయ్యెదను నా మధురగానమున!

 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

మొయిల దోనెలలోన పయనంబొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పాడుచు

చిన్కునై పడిపోదు నిలకు

 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

తెలిమబ్బు తెరచాటు చెలిచందమామ

జతగూడిదోబూచిసరసాల నాడి

దిగిరాను దిగిరాను దివినుండిభువికి

 

నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు?

శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు

 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేడె పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనం

బాడి వే రొక్క సుమకాంత వ్రీడ

బో గొట్టి క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పూవునకును పోవుచునుందు

 

నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు?

పక్షిసయ్యెద చిన్నిఋక్ష మయ్యెదను

మధుప మయ్యెద చందమామ నయ్యెదను

మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను

 

అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను

పాట నయ్యెద కొండవాగు నయ్యెదను

పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను

ఏలొకోయెప్పుడోయెటులనోగాని

మాయ మయ్యెద నేను మారిపోయెదను.

 

నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు?

నా యిచ్ఛయేగాక నా కేటివెరపు

 

దేవులపల్లి వారి దేశభక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి అక్షరం దేశభక్తిమయం .. ఈ దేశభక్తి గేయం లో ఆయన వాడిన ప్రతి పదం పండిత పామరుల నోళ్ళపై పలికింపబడిన శక్తి  దేవుల పల్లి కృష్ణశాస్త్రి అక్షరాలది.

 

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి దివ్యధాత్రి..

జయ జయ జయ సత సహస్ర

నర నారి హృదయ నేత్రి..

 

జయ జయ సస్యామల

సుస్యామల చల శ్చేలాంచల

జయ వసంత కుసుమ లత

చలిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయశయ

ళాక్షరుణ  పద యుగళ

 

జయ దిశాంత గత శకుంత

దివ్య గాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పధ విహరణ

జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణ…!

 

దేవులపల్లి కలం నుండి  కవితలు,గీతాలు,గేయాలు జలపాతమై జాలువారాయి.. తెలుగు నేలను, తెలుగు వారిని తేటతెనుగులో తడిపి ముద్దచేశాయ్.. ఆ మనోహరపరిమళాలు ఏళ్లతరబడి సువాసనలు వెదజల్లుతూనే వుంటాయ్.. దేవులపల్లి వారిని గురించి తెలియజేయాలంటే పుటలు చాలవు .. వారికి ఇది వ్యాస రచయిత సమర్పించుకుంటున్న ఓ చిరు పుష్పం మాత్రమే..!

 

Sunday, June 22, 2014

ఏముంది విశాఖలో......

ఏముంది విశాఖలో......(కవిత:---హెచ్చార్కె)

ఎప్పుడైనా తను జ్ఙాపకం వస్తుంది

జీడిమామిడి చెట్ల మెత్తని నీడల్లో

మొదటి సూర్య స్పర్శ కోసం, తన కోసం

పొంచి వున్న నేను జ్ఙాపకం వస్తాను

ఏముంటాయి క్లాసురూంలో

అదే నన్నయ లేదా భట్టుమూర్తి

తువ్వాలు దుశ్శాలువా సవరించి

మహాప్రస్థానం పద్యాల్లో గర్జించే పదాలకు

నింపాదిగా‍ అర్థాలు చెప్పే మాష్టార్లు, బయట

నల్లగా మెలికలు తిరిగి, పాం పడగల్లా లేచి,

నిట్టనిలువుగా పడిపోయే రోడ్లు... అంతే,

ఏమీ ఉండవు:

చిరాగ్గా తల తిప్పి, అటు వైపు చూస్తే

నునుపు రాతి మీద కదిలే అద్దపు సెల పాటలా

... పగలు కదా, వెన్నెలకు బదులుగా...

ఒక చెంప మీదుగా జారే సూర్యుడు, 

పగటి కాంతిని మెత్త బరిచే మత్తు మగత,

వస్తువులు ఉండీ లేకుండే అంతర్మధ్యం

రామకృష్ణా బీచ్‍లో కూడా ఏమీ ఉండదు

జిగురు సాయంత్రపు బొటన వేళ్లతో

ఇసుకను దున్నుతున్న కొన్ని దిగుళ్లు

ఎప్పుడు ఏ తప్పు చేసిందో, రాతి ఒంటిని వంచి,

ముక్కు నీటికి రాస్తున్న ఆకుపచ్చ డాల్ఫిన్,

దూరంగా, ఘీంకార స్వరంతో మూలుగుతూ

కదిలే కొండలా ఇంకొక ఓడ... అంతే,

ఏమీ వుండవు:

ఇసుకలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేలోగా ఒక చోట

నీరెండ జలతారు పరుచుకుని కూర్చున్న సముద్ర దేవత

ఆ తరువాత చీకటి ముసిరినా, అప్పుడు చీకటి ముసిరిందని

కొన్ని యుగాల తరువాత గాని రెండు బుర్రలకు తట్టనివ్వని

ఒక దినకర చంద్రుడు

ఎంత పని వడినా విశాఖ వెళ్లాలని అపించదు

ఏముంది? ఏమీ ఉండదు ఇప్పుడు, విశాఖలో ...

అమ్మ ఒక ఆకాశం.....

అమ్మ ఒక ఆకాశం, బిడ్డకు సొంత దేహంతో అన్నం పెట్టే అమ్మ

ఆమ్మకు తప్ప ఇక ఎవరికి, ఎవడికి వంగినా అది శిరస్సు కాదు

కృష్ణుని పేరు ఏమిటి?

కృష్ణుని పేరు ఏమిటి? 

ఎవరు పెట్టారా పేరు? చిన్నప్పుడు బారసాల (బాలసారె) వంటి సంస్కారములు జరిగినట్లు ఎక్కడా వినలేదే? పుట్టగానే తండ్రి వసుదేవుడు యమునను దాటించి నందుని ఇంట్లో విడిచి వచ్చాడు.

 తండ్రి బియ్యంలోపేరు వ్రాసి నామకరణం చేయాలి. తల్లితండ్రుల నివాసం కారాగారం. వ్రేపల్లెలో తరచు పూతనాది రాక్షసుల రాకపోకలు. ఒకనాడు గర్గమహర్షి వచ్చాడు. నందయశోదలు కృష్ణుని బాలారిష్టములను గురించి బెంగ పెట్టుకొని ఆయనకు కృష్ణుని చూపింఛారు. 

ఆయన నవ్వుతూ ఈబాలుడు ఎవరనుకొన్నారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సకలదేవతాస్వరూపుడు. విష్ణువే. గోలోక కృష్ణుడు. మీపిల్లవాడు కాదు. దేవకీవసుదేవులబిడ్డడు. మీకు ఆడపిల్ల జన్మించినది. మీకు తెలియకుండా ఈ మార్పిడి జరిగినది. 

ఈయనకు మనము పెట్టే పేరులేదు. కృష్ణుడు అనే పిలవండి. పైగానల్లనివాడు. ఆపేరు సార్థకము. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు)

శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు.

శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి? 

చిత్తమంటే మనస్సు అనే అంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే..

గోపికలు మొదట్లో "మధురానగరిలో చల్ల నమ్మబోదూ" అని తిరిగేవారు. 

ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నా మరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూ గుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా, ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహ వారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనే ఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో "చిత్తవృత్తి నిరోధం." గోకులంలో అందరూ మానినులే. అందరి హృదయాలలోనూ కృష్ణుడే. ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవం జరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితో మధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లో చిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటే చిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.

Saturday, June 21, 2014

పొడుపు కథలు

పొడుపు కథలు

    1)అడవిలో పుట్టి అడవిలో పెరిగి మాఇంటికొచ్చి తైతక్కలాడింది?

                 కవ్వం

     2)అమ్మ అంటే దగ్గరకొస్తాయి,నాన్న అంటే దూరం జరుగుతాయి. ఏమిటవి?

                  పెదవులు

    3)కాసేపటికొకసారి వాటంతట అవే టపటప కొట్టుకుంటాయి.ఏమిటవి?

                కనురెప్పలు

    4)గోడమీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చేపోయేవారిని వడ్డిస్తుంటుంది.ఏమిటది?

                తేలు

    5)పళ్ళున్నా కొరకలేనిది. ఏమిటది?

               దువ్వెన

    6)నడిచేకొద్దీ తగ్గేది?

               దూరం

    7)రెండువైపులా చెవులున్నా వినలేనిది?

              గంగాళం

    8)నీదేకానీ నీకన్నాఇతరులే ఎక్కువ వాడతారు?

              నీ పేరు

    9) పెరిగేదే కానీతగ్గనిది.ఏమిటది?

              వయసు

   10)తెల్లబడితే మాసిపోయేది.ఏమిటి?

            బ్లాక్ బోర్డు

మనం తింటున్నఇడ్లీ.

ఇప్పుడు మనం తింటున్నఇడ్లీ, ఒకప్పుడు మన పూర్వులు తిన్న ”ఇడ్డెన” ఒకటే.. తెలుగునాట నాలుగు వ౦దల ఏళ్ళుగా ప్రసిద్ధి పొ౦దిన ఆయుర్వేద గ్రంథం ‘యోగరత్నాకరం’లో ఆనాటి తెలుగువారి ఆహార పదార్థాల వివరాలు కన్పిస్తాయి. దీని గ్ర౦థకర్త ఆ౦ధ్రుడు కావచ్చునని పండితులు నిర్ధారించారు కూడా! ‘ఇండరీ’ అనే ఒక వ౦టక౦ ఇ౦దులో ఉ౦ది. మినప్పప్పు(లేదా పెసర పప్పు)ని రుబ్బి అల్లం, జీలకర్ర కలిపి ఆవిరిమీద ఉడికించినవి ఈ ఇండరీలు. వీటినే ఆవిరికుడుములు లేదా “వాసెనపోలి” పేర్లతో మొన్నమొన్నటిదాకా పిలిచేవారు. అప్పట్లో ఇ౦డరీలని కూడా పిలిచి ఉ౦టారు. ఉప్పుడురవ్వ కలపకుండానే వీటిని తయారు చేసుకున్నారని గమని౦చాలి.

చాయి పది రుపాయలైన చప్పుడు చెయ్యకుండా తాగుతాము ..

చాయి పది రుపాయలైన చప్పుడు చెయ్యకుండా తాగుతాము ..

14 లక్షల ఉద్యోగులని ఆదుకొనే రైల్వే శాఖ 40 రూపాయలు పెంచితే మాత్రం గోల గోల చేస్తాము .. 

ధరలు పెంచకుండా మంచి సిగ్నలింగ్ వ్యవస్త కావలి,

ఇంకా కొత్త లైన్స్ కావాలి అంటే రైల్వే మాత్రం ఎలా తెస్తుంది స్వామి

శ్రీకృష్ణా యదుభూషణా.

శ్రీకృష్ణా యదుభూషణా.

(పోతనామాత్యుడు..)

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

x

అసలు శ్రీకృష్ణుడు ఎవరు?

అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి? 

కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. పైగా అది యుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన.

Painting ..Keshav.Keshav.

Friday, June 20, 2014

Bhagavatha - Narakasura vadham

 
Bhagavatha - Narakasura vadham


Indra reports to Krishna about the demon Naraka's atrocities. Naraka had snatched Varuna's (Indra's brother) umbrella, the insignia of sovereignty, and also Aditi's (Indra's mother) ear rings and evicted her from her abode in mount Mandara. Narakasura was the son of mother earth, Bhoodevi. The Lord had conferred a boon on mother earth, that Naraka would not be killed by him without her consent.

Krishna, along with Satyabhama, flies on Garuda to Pragjyotishapura, the capital of Narakasura's abode in Pragjyotisha (now Assam). Pragjyotisha was well fortified on all sides, with heavy artillery and mountain ramparts.  The was made inaccessible due to its belts of water, fire and wind, encircled with myriad snares laid by Naraka's associate and follower, the five-headed Mura. Flying with great speed on Garuda, Krishna shatters the ramparts with his mace, Kaumodaki. With his arrows and his discus Sudarshana, he destroys the fortifications of weapons, and destroys the snares with his sword.  He blows on his conch, Panchajanya. The sound, like a clap of thunder, breaks down the hearts of the gallant warriors of Mura -- and draws the demon Mura out of the waters. Brandishing his trident, the terrible demon with amazing splendour, challenged Krishna with a roar, filling the entire atmosphere. In a quick battle, Mura is killed by Krishna. His sons who retaliate, were also vanquished in a fight. 

Naraka was enraged to see his generals decimated. With his army of sea-born elephants, Narakasura rushes forth at Krishna with his javelin, Shataghni; Krishna responds by sending his accurate arrows with peculiar wings. Garuda also helps by fighting the elephants with his bill, wings and claws and makes them retreat. His army thus assailed by Garuda, Naraka fights on, alone. His javelin was shaken off by Garuda, as though it were a flower garland. Naraka, riding an elephant, picks up a pike to strike at Krishna. Krishna lops off Naraka's head with his sharp-edged discus. His fallen head shone with a lovely diadem and the dazzling ear-rings of Aditi. Mother earth approaches Krishna and hands over the umbrella of Varuna, the ear-rings of Aditi, and a Vyjayanthimala (a garland of colourful forest flowers, interspersed with gems) for Krishna to wear. Bowing low, Bhoodevi extolls Krishna: " Nama: Pankajanabhaya! Nama: Pankajamaline! Though appearing as the son of Vasudeva, you are really Vishnu. You are the cause of all matter and the embodiment of perfect knowledge. Hail to you! Pray, place your palms on the head of Naraka's son, Bhagadatta and protect him." Krishna ensures security to Bhagadatta and enters the opulent palace of Naraka. He saw thousands of  warrior women, abducted from various gods, siddhas and demons, staying in that luxurious palace. In their minds, all the women set their hearts on Krishna and pray, "May he be my husband and let providence approve of this."  Krishna sent them all in closed palanquins to Dwaraka, along with valuable treasures, horses, elephants and chariots.

Krishna flies to the abode of Indra and hands over the umbrella and the ear-rings of Aditi. Indra, in turn, worships Krishna along with his consort Satyabhama.

Satyabhama urges Krishna for the Parijatha tree to be planted in her palace. Krishna uproots the tree and places it on the back of Garuda -- he vanquishes the gods who oppose him* and returns to Dwaraka. 

Assuming as many forms as the brides, brought from Pragjyotishapura, Krishna espoused with due ceremony all those damsels (sixteen thousand and hundred, all of them being part manifestations of Ramaa), in different mansions severally in the same hour. He also performed his duties scrupulously as a householder, living with each spouse severally, immensely adored by each one of them.

---------------------------------- 

*(Hardly moments after paying obeisance to Krishna and Satyabhama, Indra opposes Krishna,  his purpose having been accomplished.  Shukha says, although wise, the gods possessed of satva guna choose to be ungrateful out of ignorance. He says 'Accursed is opulence'.)

Posted 23rd December 2012 by keshav keshav

ఆలోచనలు

ఆలోచనలు


ఆలొచనల్లో వేడి, వాడి లేకపోతే యువకులైన వ్రుద్దాప్యాన్ని అనుభవించవలసిందే.


పుట్తుకతో అందరికీ గొప్ప భావాలు కలగవు. ప్రపంచాన్ని చూసి, మనుషులు పడే బాధలు, పెనుగులాట బతుకును చూసి, ఇదేం జీవితం అనుకుంటే ---- అప్పుడు అన్వేషణ మొదలవుతుంది.

సంస్కృతి

సంస్కృతి


ఎవరి రొట్టెను వారే తినడం ప్రకృతి.


పక్కవారి రొట్టెను లాక్కుని తినడం వికృతి.


మన రొట్టెను కొంత పక్కవారికి తినడానికి ఇస్తే అదే సంస్కృతి.మనకున్నంతలో, మనకున్నదాంట్లో నుంచి కొంతభాగం పక్కవాళ్లతో పంచుకోవడమే మన సంస్కారం, మన సాంప్రదాయం.

హద్దు

హద్దు


హద్దు దాటితే ఎవరైనా ఒకటే.


ఎలాంటి వారైనా సరే...ఎంతటివారైనా సరే...హద్దుల్లో ఉంటూ జీవితాన్ని గడపాలి.


హద్దు మీరితే దానికి తగిన శిక్షను అనుభవించి తీరాల్సిందే.


ఇది ఖచ్చితమైన దైవ నిర్ణయం.


సత్య ధర్మాలను ఆచరిస్తూ సక్రమార్గంలో నడుచుకున్న వారినే దైవం ఆదరించి ముక్తినిస్తుంది.


అలా కానప్పుడు భూమికి భారాన్ని కలిగించే పాపాత్ములుగానే ఏదో ఒక కారణాన్ని చూపి హద్దు మీరిన వారిని నశింపచేస్తుంది దైవం.


ఇది అక్షర సత్యం.


ధర్మానికి నష్టం కలిగినప్పుడల్లా సంధర్భానికి తగ్గట్టు ఏదో ఒక రూపంలో దైవం అవతరించటం సర్వసాధారణమైన విషయం.

Thursday, June 19, 2014

శ్రీ నారాయణ రెడ్డి (సినారే) గారి మీద తనికెళ్ళ భరణి ఛలోక్తులు:

శ్రీ నారాయణ రెడ్డి (సినారే) గారి మీద తనికెళ్ళ భరణి ఛలోక్తులు:

సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు, పుప్పొడి అక్షరాలూ..

అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది

జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె

తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె

ఇంతింతై విశ్వంభర నంత చూసినారె

జ్ఞానపీటి పైన జానపదములేసినారె

ఆపద చుట్టుముట్టినప్పుడు దైవానికి మొక్కుతారు.

ఆపద చుట్టుముట్టినప్పుడు దైవానికి మొక్కుతారు. ఏవేవో మొక్కుబడుల రూపంలో దైవనికి ఇవ్వజూపుతారు.


బలమైన నమ్మకం ఉండటం మంచిదే కానీ అవసరార్ధం చేసే ప్రార్ధనకున్న విలువ ఏమంత గొప్పది కాదు.


ఎవరి శక్తికి సమానమైన శక్తి వేరొకరికి లేదో అతడే భగవంతుడన్నాయి శాస్త్రాలు.

మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది "

భీష్మ ' చిత్రాన్ని సమీక్షిస్తూ ముళ్ళపూడి వారు:

" మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది " అని రాసారు.

ఇలా రాయడానికి కారణం ' మాయాబజార్ ' చిత్రానికి సంభాషణలు మొదటి సగానికి తాపీ ధర్మారావు గారు, రెండో సగానికి ఆరుద్ర గారు రాసారు. అదీ సంగతి."

Wednesday, June 18, 2014

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు విగ్రహం

ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది.

తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది.


తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల (F)ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.


శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.


అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.


ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు

బియాస్ నది ఘటన

పిల్లల చితికి నిప్పు పెట్టడమే తండ్రి కి గుండె కోత..

అసలు పిల్లలే కనిపించకుండా పోతే 

అదీ ఎంతో ప్రయత్నం తరువాత కూడా అంటే 

ఆ తల్లిదండ్రుల మానిసికి స్థితి మరీ ఘోరం.,..

........బియాస్ నది ఘటన

'గురజాడ అడుగుజాడ.'

మహాకవి గురజాడ అప్పారావు నూట యాభయ్యో జయంతి (2012) సందర్భంగా రచయిత్రి ఓల్గా వెలువరించిన సాహిత్య వ్యాసాల సంకలనం 'గురజాడ అడుగుజాడ.' గురజాడ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం' నాటకం. ఒక్కమాటలో చెప్పాలతో గురజాడ మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, 'కన్యాశుల్కం' నాటకం ఒక్కటీ ఒక ఎత్తు. అర్ధం చేసుకోగలిగిన వారికి అర్ధం చేసుకోగలిగినంత. సమకాలీనం కాదనో, మరొకటనో పక్కన పెట్టేవారితో ఎలాగో ఏ పేచీ లేనే లేదు. 


అత్యంత సహజంగానే ఓల్గా తన వ్యాసాల్లో కూడా 'కన్యాశుల్కం' కి పెద్ద పీట వేశారు. మొత్తం తొమ్మిది వ్యాసాలున్న ఈ సంకలనంలో ఆరు వ్యాసాలు 'కన్యాశుల్కం' నాటకాన్ని గురించీ, అందులోని పాత్రలని గురించీ ఉన్నాయి. 'మధురవాణి' అభిమానులకి మనసు నిండిపోయే వ్యాసం 'మానవత్వం పరిమళించే మధురవాణి' ఈ సంకలనంలో మొదటి వ్యాసం. "కన్యాశుల్కం ఆచారానికి బలైపోయిన బుచ్చెమ్మనూ, బలి కాబోతున్న సుబ్బినీ, వేశ్య అయిన మధురవాణి రక్షించడమే కన్యాశుల్క నాటక సారాంశం. అణచివేతకి గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే ఆ అణచివేత నుండి బయటపడగలరనే ఆశను కల్పించింది మధురవాణి" అంటారు ఓల్గా. 


'బాల్య వివాహాల చర్చ - కన్యాశుల్కం' 'కన్యాశుల్కం - కుటుంబ వ్యవస్థ' ఈ రెండూ 'కన్యాశుల్కం' నాటక రచనా కాలం నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని లోతుగా చర్చించిన వ్యాసాలు. వృద్ధుడైన లుబ్దావధాన్లు పసిపిల్ల సుబ్బిని వివాహం చేసుకోవడం ద్వారా అటు సుబ్బి మీద, ఇటు తన కూతురు మీనాక్షి మీద పెత్తనం చేయాలనుకోడాన్ని విశ్లేషిస్తూ "ఇద్దరు స్త్రీలను రెండు భిన్న ప్రయోజనాలు కలవారిగా విభజించి పాలించడానికి హిందూ కుటుంబంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి" అంటారు రచయిత్రి.


ఇక, "కన్యాశుల్కం నాటకంలో కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించటమంటే మొత్తం పితృస్వామిక వ్యవస్థను గురించి ఆలోచించటమే అవుతుంది. అప్పటికి అమలులో ఉన్న కుటుంబ వ్యవస్థనూ, రాబోయే మార్పులనూ, మధ్యలో సంధి దశనూ సమర్ధవంతంగా ప్రతిఫలించిన నాటకం కన్యాశుల్కం" అన్న విశ్లేషణతో ఏకీభవించకుండా ఉండలేం. పూటకూళ్ళమ్మ, అసిరి, బైరాగి.. ఈ మూడూ కూడా చాలా చిన్నవిగా, నాటకాన్ని మొదటిసారి చదివినప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రల్లాగా అనిపిస్తాయి. ఒక్కో పాత్రనీ ఒక్కో వ్యాసంలో విశ్లేషించారు ఓల్గా. 


నిజానికి గురజాడ వితంతువుల జీవితంలోని ఒక్కో పార్శ్వాన్ని ఒక్కో పాత్ర ద్వారా చిత్రించారు. బుచ్చెమ్మ, మీనాక్షి, పూటకూళ్ళమ్మ.. ముగ్గురూ వితంతువులే.. కానీ ముగ్గురివీ భిన్న జీవితాలు. "పూటకూళ్ళమ్మ గిరీశం తన ఇరవై రూపాయలూ అన్యాయంగా కాజేశాడని తెలియగానే అతన్ని తన్నడానికి చీపురు కట్టతో బయల్దేరింది. దెబ్బ రామప్పంతులికి తగిలింది గానీ తన్నే సమర్ధన పూటకూళ్ళమ్మ కి ఉందని నిరూపితమైంది. ఆ ధైర్యానికి కారణం ఆమె తన శ్రమను విలువకట్టి బతకడమే కావొచ్చు - అది గయ్యాళి తనం గా కనపడినా ఆమెకైతే ఒక తెగింపు వచ్చింది" అన్నది ఓల్గా పరిశీలన. 


'కన్యాశుల్కం' లోని బ్రాహ్మణ సమాజాన్ని బ్రాహ్మణేతర దృష్టి కోణం నుంచి చూపిన పాత్ర అసిరి. బహు చిన్నగా కనిపించే ఈ పాత్రని గురించి విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలు జరిగాయని విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది నాకు. ఓల్గా సైతం లోతైన పరిశీలన చేశారు అసిరిని గురించి. "కన్యాశుల్కం లో బ్రాహ్మణ భావజాలాన్ని, వారి కపటత్వాన్ని సూటిగా పదునైన మాటలతో విమర్శించింది మధురవాణి అయితే పరోక్షంగా వారి మాయలను, అవినీతిని వారికే తెలిసేలా మాడు పగలగొట్టింది అసిరి," అంటారు 'అసిరి' వ్యాసంలో. రాజ్యం, మతం, పితృస్వామ్యం, వ్యాపారాల మధ్య ఉన్న బలమైన ముడిలో బైరాగి లాంటి వారి పాత్ర ఏమిటో చెబుతుంది 'కన్యాశుల్కం లో బైరాగి పాత్ర' వ్యాసం. 

మురళి గారి రచన.


Tuesday, June 17, 2014

అల వైకుంఠ పురంబులో

పోతన తెలుగు భాగవతం నుండి.
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభి యై.
కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు.

x

Monday, June 16, 2014

మహావీరుడు కానీ మహనీయుడు కాడు..

కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు..

(Vanam Venkata Varaprasadarao)

' యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్న మహాభారత /ఇతిహాస కథనము గురించి ప్రస్తావిస్తూ మహాభారతంలోని ప్రతి పాత్రకు ఈ ట్రాజిక్ ఫ్లా ఉన్నది. ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు అని నేను అంటే మా క్లాస్ మేట్స్ ఒకటే చప్పట్లు! యిది స్వోత్కర్ష కోసం కాదు, ఆ అంశం భారతీయులకు, వాల్మీకికి, వ్యాసులవారికి కొత్త విషయము కాదు అని చెప్పడం కోసమే అప్పుడు నా భావాలను చెప్పింది, ఇప్పుడు మిత్రులకు చెప్తున్నది కూడా.

దుర్యోధనునికోసం తన సర్వస్వాన్ని అర్పించిన కర్ణుడికి తను చేతున్న దానముల ఫలితం దుర్యోధనునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అని తెలిసీ ఆ దానాలు చెయ్యడం దుర్యోధనుడిని వంచించడం, తానూ ఆత్మ వంచన చేసుకోవడమే తప్ప మరేమీ కాదు. ఒక ఇతిహాసముగా పరిశీలించినా కేవలం ఒక కవి కల్పనగా పరిగణించినా ఇది సత్యము. అన్నీ ఒక ఎత్తు, యుద్ధం మొదలైతే భీష్ముని మీది కోపంతో, అయన యుద్ధరంగంలో ఉన్నంత కాలం నేను యుద్ధ భూమిలో అడుగుబెట్టాను అని 'సహాయ నిరకరణం' చేయడం మరీ స్వామిద్రోహమే!

వంచనతో విద్యనూ నేర్చుకున్నాడు, అదీ పనికిరాకుండా పోతుంది అన్న విషయము తెలిసీ దుర్యోధనుడిని ఎగేశాడు. ఆ తర్వాత కూడా తన దానముల పరంపరను కొనసాగించాడు, ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంత కాలము తను అజేయుడు అని తెలిసికూడా! చివరికి యుద్ధసమయం వచ్చినప్పుడు తోడు లేకుండా పోయాడు దుర్యోధనునికి.

ఉత్తర గోగ్రహణం సమయంలోనూ, చిత్ర రథునితో యుద్ధ సమయంలోనూ దుర్యోధనుని ప్రక్కనే ఉన్న కర్ణుడు అర్జునుని ఏం చేయగలిగాడు? యతో ధర్మస్తతో జయః అదీ కాలము నేర్పిన నీతి.

చివరికి ఒక స్త్రీని నిండు సభలో దుస్తులు లాగేసి అవమానిస్తున్నప్పుడు కూడా వారించలేదు సరికదా, తన తొడ చూపించి దుర్యోధనునికి సైగ చేసి, వాడు తన ఎడమ తొడ చరిచి ద్రౌపదిని వచ్చి కూర్చోమని సైగ చేసి, ఆ తొడ విరిగి యుద్ధభూమిలో పొర్లేదాకా తీసుకొచ్చాడు.

'పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః' అన్న ఆ(క)ర్షవాక్యం సమిత్రుడి లక్షణాలను చెప్తుంది. తెలిసీ తెలియక చేతున్న పాపాలను వారించేవాడు, హితమును ఆలోచించేవాడు, తన రహస్యాలను దాచిపెట్టేవాడు, తన మంచి గుణములను అందరికీ తెలియజెప్పి ఆ గుణములను పెంచుక్నేలా ప్రోత్సహించేవాడు, ఆపద వచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళని వాడు, అవసర సమయములో తోడు, నీడ, సూచన, సహాయం, ప్రోత్సాహములనిచ్చి ఆదుకునేవాడు... వాడు మిత్రుడు అని మిత్రలక్షణములను చెప్పారు పూర్వీకులు. వీటిలో ఏ ఒక్క లక్షణమూ లేనివాడు కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు.

Sunday, June 15, 2014

"పుష్పవిలాసం" ....

నలవైఆరేళ్ళక్రిందట్నే అంటే అరవై ఎనిమిదిలో చంద్రాభొట్ల సత్యనారాయణమూర్తి గారు ఒక పద్యరచయిత గారు "పుష్పవిలాసం" అనే పేరుతో ముప్ఫైనాలుగు పద్యాల ఖండికనొకదాన్ని వ్రాసినారు.ఈరోజు వారు స్వయంగా సభలో చదివి వినిపించినారు.

ఎంతోఅందమైన ఛందోబద్ధమైన పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాప పద్యాలకు దీటైన పద్యాలలో పువ్వులను కోయవద్దని తరుణులకు తను చెప్పబోగా ఒక చిన్ని పువ్వు కోయకుండా మా బ్రతుకులను నిరర్థకం చేయవద్దని నిష్ఠురమాడినట్టు (జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అభిమాని వీరు, మాటమాటకు వారి ని తలచుకుంటూనే పద్యపఠన గావించినారు గాని ఇది నా వాదన అంటూ ) వ్రాసినారు.

"హరి చరణాలనో , తరుణుల శిరో భూషణాలుగా కాక తొడిమనుంచి సోలి, రాలి మాతృగర్భంలో మేము సమాధికావలెనా?

మీ కవితాసౌరభాలు రసజ్ఞులను అలరించాలని మీరు కోరినట్టే మా పరిమళాలు జగత్తును అలరించాలని మేము కోరరాదా?

నానాగుణవర్ణాదులలో కదంబమాలగా మేము అందగించినట్టు నానాగుణవర్ణాదులున్న మానవజాతి ఐకమత్యమనే సూత్రంలో అందం చేకూర్చాలని మా మౌనసందేశం కోసి మాలగా కడితేనే కదా!

గుచ్చినా, సూదులు గుచ్చినా మా ముక్తి కొరకే అయితే తప్పేముంది.మీ వైద్యులు శస్త్రచికిత్సలో మిమ్మల్ని బాధపెట్టే కదా మీకు మంచి చేస్తారు! ఇదీ అలానే కదా!"

ఎంతో నచ్చింది నాకు. వారు తోచింది వ్రాసుకుంటున్నారంట కానీ ప్రచురణ జోలికి పోవడం లేదంట. కాశీలో దైవసాన్నిధ్యంలో కాలం గడుపుతున్నారు

Saturday, June 14, 2014

'సంజీవి పర్వతం'

మనమంతా 'సంజీవి పర్వతం' అని వాడే సంస్కృత నామానికి అన్నమయ్య గారు "మందుల కొండ" అనే అందమైన తెలుగు రూపాన్నిచ్చారు. ఇలాంటివి తెలిసినవారు ఇక్కడ ఉంచితే అందరికీ తెలుస్తాయి కదా!

మన మన్యం....

మన మన్యం....


ఆ పెద్ద డాక్టరుగారి పేరే సూర్యభగవానుడు.

మనందరం అజ్ఞానమనే పెద్ద జబ్బుతో బాధపడుతున్నాం. దానికి చికిత్స కావాలి. 

ఆ చికిత్స ఇచ్చే శాస్త్రం కూడా భారతదేశంలోనే లభిస్తున్నది. అదిగానీ లభించిందా పెద్ద జబ్బు పోతుందిట.

 ఏం జబ్బు అంటే పుట్టడం, చావడం అనే సంసారపు జబ్బు పోతుంది. అది జబ్బు అనే మనకు అనిపించడం లేదు. అదే అసలైన జబ్బు అని ఆరోగ్యం బాగుపడే యోగం వున్నవాడు మాత్రమే పోల్చుకోగలడు. వాడు మాత్రమే చికిత్సా పద్ధతి చూస్తాడు. అందుకు పెద్ద జబ్బు ఏదంటే సంసారం పెద్దజబ్బు. దీనికో పేరుంది భవరోగం. భవరోగం అంటే పుట్టడం, చావడం ఒక జబ్బుట. చావడంతో పోదుట. తర్వాత మరొకటి మొదలవుతుంది.

 "చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిం" - అదో పెద్ద జబ్బు. కనుక జబ్బులు మళ్ళీ ఇప్పుడు మూడు రకాలైపోయాయి. మానసిక జబ్బులు, శారీరక జబ్బులు, అజ్ఞానపు జబ్బులు. ఈ మూడు జబ్బులూ పోగొట్టుకోవడానికి

 ఎవడైనా ఒక్క డాక్టర్ వుంటే చెప్పండి! ఆ పెద్ద డాక్టరుగారి పేరే సూర్యభగవానుడు.

Bramhasri Samavedam Shanmukha Sarma


స్వభాష- శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు.

స్వభాష- శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు.

ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి 

జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- 

మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? 

కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... 

అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. 

ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? 

ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. 

తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.

విరటుని వాత్సల్యం.

విరటుని వాత్సల్యం........కామేశ్వర రావు భైరవభట్ల గారు.

."ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది!"

.

తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె

మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం

పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ

ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్.

.

తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో సవరించాడట.

.తిక్కన గారు వర్ణించిన పితృవాత్సల్యానికి నేను కూడా ముగ్ధుడ నయ్యాను. పిల్లలు అతి త్వరగా పెద్దయిపోతారు.తర్వాత ముద్దు చేస్తామన్నా దగ్గఱికి రారు. ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.

.

Friday, June 13, 2014

గోపికా వస్త్రాపహరణము


భాగవతము -- పోతన - గోపికా వస్త్రాపహరణము

ఇంతుల్ తోయము లాడుచుండ మగవారేతెంతురే వచ్చిరా

ఇంతల్ సేయుదురే కృపారహితు లై యేలోకమం దైన నీ

వింతల్ నీతల బుట్టె గాక మరి యేవీ కృష్ణ యో చెల్లా నీ

చెంతన్ దాసుల మై చరించెదము మాచేలంబు లిప్పింపవే !

ఒయీ కొంటేవాడా ! ఆడువారు నదీ స్నానము చేయుచుండగా మగవారు వత్తురా ? ఇంత అల్లరి చేయుదురా ? ఈ వింత ఆలోచన నికే గలిగినది కృష్ణా ! నీకు దాసులమై ఉందుము మా వలువలు మా కిమ్ము.

వచ్చెదము నీవు పిలిచిన

నిచ్చెద మేమైనగాని యెటు చొరమనినన్

జోచ్చేదము నేడు వస్త్రము 

లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా !

కృష్ణా నీవు రమ్మనిన వచ్చెదము. నివదిగినది ఇచ్చెదము. అక్కడికిపోమ్మనిన అక్కడికి పోయెదము. మా వస్త్రములు మాకిచ్చి కరుణించ వయ్యా ! నగ్నముగా నదీ స్నానము దోషమని, వ్రతభంగమగునని, అందుకు పరిహారముగా ఆ కన్యలందరూ బయటకు వచ్చి తనకు మ్రొక్క మనెను.

అన్నమయ్య...

అన్నమయ్య...

నాటికి నాడుకొత్త నేటికి నేడు గొత్త

నాటకపు దైవమవు నమో నమో

సిరుల రుక్మాంగదు చేతి కత్తిధారఁ దొల్లి

వరుస ధర్మాంగదుపై వనమాలాయ

హరి నీకృప కలిమినట్లనే అరులచే

కరిఖడ్గధార నాకు కలువదండాయ

మునుప హరిశ్చంద్ర మొనకత్తిధారఁ దొల్లి

పొనిగి చంద్రమతికిఁ బూవుదండాయ

వనజాక్ష నీకృపను వరశత్రులెత్తినట్టి - 

ఘన కడ్గధార నాకుఁ గస్తూరివాటాయ

చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి

కలుషముఁ బెడఁబాపి కాచినట్టు

అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి

యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ

Thursday, June 12, 2014

కృష్ణుడు రోహిణిలో పుట్టాడు...


కృష్ణుడు రోహిణిలో పుట్టాడు కాబట్టి అప్పటినుంచి మేనమామకి గండమ్ అని వచ్చిందంటారు. 

రోహిణిలో పుట్టినందుకు కృష్ణుడు కంసుని చంపలేదు. దాడి దుశ్చర్యలని దునుముటకే చంపాడు. 

జ్యోతిశ్శాస్త్రమ్ గొప్పదనాన్ని ఇలాంటి తెలివితక్కువ ఓవర్ లోడ్స్ తో కించపరచకూడదు. దానివల్ల జాతి గొప్ప శాస్త్ర విజ్ఞానాన్ని కోల్పోయే అవకాశాలు మెండు. 

పైగా దానికి నాస్తిక గోల తోడై మరింత చికాకు..

మా ఆవిడది ఆశ్లేష. మాకు పెళ్ళై 34 ఏళ్ళు నిండబోతున్నాయి. మా అమ్మ ఇంకా నిక్షేపంగా వున్నారు.. పోలేదు. ఆవిడ వేరే ఎక్కడైనా వున్నారేమో అనే పాయింటు లాగేవారికి తెలియజేయునదేమనగా మేమంతా ఒకే గూటి పక్షులం. అదండి. సంగతి.

అన్నట్లు మా బాబాయి ఒకాయన మఖ. ఆయన పెళ్ళి నా కళ్ళ ముందే జరిగింది. అంటే నేను చిన్నపిల్లవాడిననుకోండి. వాళ్ళ మామగారు (అంటే మా అమ్మని గన్న తండ్రి) నిక్షేపంలా ఓ ఎనభై పైచిలుకు బ్రతికేసి మరీ బాల్చీ తన్నారు. రోగాలు నిల్. ఈ విశాఖ కాండిడేట్ నాకు మా కుటుంబం ఎగ్జామ్పుల్ దొరకలేదు.... అదీ విషయం. ఈ కధలోని నీతిః

మన నూకలు మన రేషన్ కి వేరేవారితో సంబంధంలేదు. ఎవడి సంచి(తమ్) వాడిదే

నన్నయ్యగారి గడుసుదనం..

నన్నయ్యగారి గడుసుదనం..

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క

నెంతయును సంతసంబున గుంతిదేవి

రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి

కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! 

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. 

బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం!

Wednesday, June 11, 2014

అమ్మభాషలోనే అసలు ఏడుపు

అమ్మభాషలోనే అసలు ఏడుపు

బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. తల్లి కడుపులో ఉన్నంత కాలం తల్లి మాట్లాడుతుండగా వింటూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరించే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదనం మాతృభాషలోనే ఉంటుందని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.

            ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారాంశం. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్నం(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ “యాస” అనే మాటని “భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడటం జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, తెలుగు, సంస్కృత౦ మొదలైన భాషలలో లయపర౦గా ఉన్నతేడాలు మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయలలో తేడాలు ఎలా ఉంటాయో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సాధారణ౦గా జెర్మన్ పదాలు పై స్థాయి ను౦చి కి౦దిస్థాయికి వస్తాయని,  ఫ్రెంచి పదాలు క్రి౦దిస్థాయి ను౦చి పై స్థాయికి వెడతాయనీ గుర్తించారు. ఫ్రెంచి భాషలో త౦డ్రిని “papaa” అని ఆరోహణ౦లో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణ౦లో పలుకుతారట.  జెర్మన్, ఫ్రెంచి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తర౦గాలు sound tracks ని ప్రయోగాత్మక౦గా విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువస్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు. ఆకలి వలన, అసౌకర్య౦ వలన, వ౦టరితనం వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని విశ్లేషి౦చారు. జెర్మన్ బిడ్డల రోదనం హెచ్చుస్థాయి ను౦చి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి ను౦చి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు తేలింది.“వా…వ్హ్” అని ఏడ్చే బిడ్డకీ “హ్వో…యీ…” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ విధ౦గా గమనించారు. పుడుతూనే “mam…mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్…మ” అని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మనం కూడా గమనించవచ్చు. ఏడుపుకు భాష ఉంది. అది మాతృభాషలో ఉంటుంది.

           జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వ౦ వహి౦చారు. తల్లి గర్భంలో ఉండగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడుతుందనేది ఈ పరిశోధనల సారాంశం. ఎలా మాట్లాడుతుంది? తన ధ్వనులతో మాట్లాడుతుంది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మనం మన ధ్వనులను నేర్పి౦చటం ప్రార౦భిస్తా౦. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తా౦. కానీ, మనం నేర్పి౦చటం మొదలు పెట్టకుండానే, ఇ౦కా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే ఈ నేర్చుకోవటాలన్నీ స్వయ౦గా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ.  దీన్ని మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో  “pre-adaptation for learning language” అంటారు. మాతృభాష ప్రభావ౦తో బిడ్డ మనసు రూపొంది, మాతృభాషలోనే అది పరిణతి పొందుతుంది. మాతృభాషకు అతీత౦గా బిడ్డను పె౦చాలని చూస్తే అది మానసిక దౌర్బల్యాన్ని కలిగిస్తు౦దని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థ౦ చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతుందని ఈ పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.

            “నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్” అనే సుశ్రుతుని ఆయుర్వేద సిద్ధాంతాన్ని ఇక్కడ పరిశీలించాలి.  తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావ౦ చూపుతాయి. అలాగే,  బిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరించటం వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగుతాయని ఈ సిద్ధాంత౦ చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌతాయి.  కాబట్టి, నాలుగవనెల గర్భవతిని “దౌహృదిని” అంటారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రెండు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగటంలో మాతృభాష నిర్వహిస్తున్నపాత్ర ఎ౦తయినా ఉందని దీన్ని బట్టి అర్థం అవుతో౦ది.

మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతథంగా వినిపించవు. నీటిలో చేపలు వాటి శరీరాంగాలను౦చి, ఎముకలను౦చీ మెదడుకు చేరిన ధ్వని తర౦గాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటి లో౦చి తల్లి భాషను స్వీకరించటం ప్రార౦భిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడి౦చారు. అందుకే, వివిధ భాషలు వినిపించే గ౦దరగోళ వాతావరణ౦లో నెలలు నిండిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

అర్జునుడు పద్మవ్యూహం గురించి కడుపులో బిడ్డకు చెప్పిన కథలో అసాధ్యంలేదన్నది వాస్తవ౦.  నెలలు నిండుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల సంకరభాష అదేపనిగా వింటే, దాని చెడు ప్రభావ౦ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపైన తప్పకుండా పడుతుందన్నమాట! గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తర౦గాలను స్వీకరించ గలుగుతుందని కూడా ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

          మాతృభాషల మీద కార్పోరేట్ విద్యారంగం తీవ్రమైన అఘాయిత్యాలు జరుపుతున్న రోజుల్లో, 2009 నవ౦బర్ 5న కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ “సైకో లింగ్విస్టిక్స్” అంశంమీద తొలి పరిశోధన వెలువడి౦ది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2009 మే, 16న “ప్రపంచంలోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను సంరక్షి౦చే కార్యక్రమాలు చేపట్టా”లని (A/RES/61/266) తీర్మానం చేసిన నేపధ్య౦లో ఈ పరిశోధనా౦శాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.  

భాషాసంస్కృతులకు జాతులు పునర౦కిత౦ కావాలని యునెస్కో సంస్థ 2010 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ౦ సందర్భంగా పిలుపునిచ్చి౦ది. అందుకు అనుగుణ౦గా మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ య౦త్రాంగం గానీ గట్టిగా స్పంది౦చిన సందర్భాలు లేవనే చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూనైనా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా  తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబంధనని  కార్పోరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తే, “పులిని చూసి వాత” అన్నట్టు మధ్య తరగతి విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకొవాలని ప్రయత్నించాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ ధోరణి కొనసాగుతూ వస్తో౦ది. అందువలన “తెలుగు రావటం” అనే తప్పు తమ విషయ౦లొ జరిగి పోయి౦దనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగి,  అది మనోదౌర్బల్యానికి దారితీస్తో౦ది. తెలుగు రాని తెలుగుబిడ్డ తెలుగు వచ్చినవాడితో పోలిస్తే, మానసిక౦గా బలహీనుడే అవుతాడు.

 “మాకు తెలుగు రాదండీ” అని  గొప్ప చెప్పుకోవటం విద్యారంగం సృష్టి౦చిన వెర్రి ప్రభావమే!  పిల్లల కోసం తల్లిద౦డ్రులు కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇ౦ట్లో ఇ౦గ్లీషులో మాట్లాడుకోవాలసిన దుస్థితిని కావాలని విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టి౦ది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు కునేందుకు మనకు పరాయి భాషలో నేర్చిన మాటలు చాలవు. మాతృభాషను దెబ్బతీస్తే ఏ దేశంలో నయినా ఇలానే జరుగుతుంది. మనో దౌర్బల్యం పెరిగి, బలహీనమైన తరాలు తయారవుతాయి.

మాతృభాషలోనే పెరగటం అనేది పిల్లల హక్కుగా చట్టం తీసుకు రావలసిన సమయం ఇది.  జాతి సిగ్గు పడాల్సిన మైదుకూరు, విశాఖ, విజయవాడ లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్ర౦లో జరగకుండా ఉండాలంటే, ప్రాధమిక విద్యలో మాతృభాషని తప్పని సరి చేయటం ఒక్కటే పరిష్కార మార్గ౦. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు బాగా రావటం కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పి౦చాలని మనం గుర్తించాలి.

ఆ౦గ్లాన్ని కాదు, ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే ఇ౦గ్లీషు మానస పుత్రుల మాతృ ద్రోహాన్నే ఇక్కడ ప్రశ్నిస్తున్నది! అవును! ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ, మాతృద్రోహమూ గా పరిగణి౦చి తీరాలి!

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు -- దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షము నుండి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?

కలవిహంగమ పక్షముల దేలియాడి

తారకా మణులలో తారనై మెరసి

మాయ మయ్యెదను నా మధురగానమున!

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


మొయిలు దోనెలలోన పయనం బొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పొడుచు చిన్కునై పడిపోదు నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాల నాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేడె పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనం బాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బో గొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పూవునకును పోవుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను

మధుప మయ్యెద చందమామ నయ్యెదను

మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను

అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను

పాట నయ్యెద కొండవాగు నయ్యెదను

పవన మయ్యెద వార్దిభంగ మయ్యెదను

ఏలొకో యెప్పుడో యెటులనో గాని

మాయ మయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?


.............................................................................................కృష్ణపక్షము  (1925) 

Tuesday, June 10, 2014

నా పేరు బుడుగు

నమస్తే, నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. కావాలంటే మా బాబాయిని అడుగు.


హదేంటి, బుడుగు మళ్ళీ వచ్చేశాడు అని హాశ్చర్య పోయారా? హాశ్చర్యమెందుకు, నేనెక్కడికన్నా వెళ్తే కద? నేను, రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గానా పెసూనాంబ, మా వీధి చివర జెట్కా వాడు, ఎక్కడికీ పోమట. ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లోనే ఉండి పోతామట. ఇలా అని ఈ మధ్య చాలా మంది చెప్పారు. చాలా మంది అంటే ఫది మంది కంటే ఎక్కువ మంది లే.


ఆ సంగతి నాకెలా తెలుసు అంటారా? ఇదిగో, మొన్నే బిళ్ళలు కొనుక్కుని వస్తూంటే, మా ఊరి స్కూలు ముందు ఒక పెద్ద సబ జరుగుతూంది. సబ అంటే బోలెడు చాల మంది కలవడం. అందులొ కుంచెం మంది స్టేజు ఎక్కి మాట్లాడుతారు. ఎక్కువ మంది కింద నిల్చోనో, కూర్చోనో వింటారు. ఒక్కో సారి ఈ వినాల్సిన జనం గాఠిగా అరిచేస్తూంటారు. దీన్నే నినాదాలు చేయడం అంటారు. అంటే నాకు తెలీదు. నేను ఎప్పుడన్నా నినాదాలు చేస్తే మాత్రం గోపాళం ఖోప్పడేస్తాడు, “ఒరేయి బుడుగు అలా అరవద్దన్నానా, వెధవ కానా,” అని.


నన్ను చూడగానే స్టేజ్ మీద నుంచి ఒక నలుగురు దూకి వచ్చేశారు. బిళ్ళలు లాక్కోవడానికేమో అనుకుని పక్క సందులోంచి పారిపోదామనుకున్నా. కాని అంతలో గుర్తొచ్చింది, నేను చిన్న వాడినా చితక వాడినా, అవసరమైతే వాళ్ళకి ప్రైవేట్ చెప్పైనా సరే, నా బిళ్ళలు కాపాడ్డానికి తయారయి పోయాను.


కానీ ఆ నలుగురు వచ్చింది బిళ్ళలు లాక్కోవడానికి కాదట. నాకు సంతాపం తెలపడానికట. సంతాపం అంటే ఓదార్చడం, అంటే నాకు తెలీదు.


“బడుగూ, బడుగూ, బంగారు తండ్రి, నీకెన్ని కష్టాలు వచ్చాయి,” నన్ను పట్టుకుని ఘొల్లుమన్నాడు ఒక పెద్దాయన. నిజం చెప్పొద్దూ, నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్ని సార్లు చెప్పాలి వీళ్ళకి నా పేరు బుడుగు అని? “నా పేరు బుడుగు, నేనొక పిడుగు” అని నా గురించి చెప్పుకునేంతలో, “ముళ్ళపూడి రవణ గారు మనందరిని వదిలి వెళ్ళిపోయారు,” అని మళ్ళీ ఘొల్లుమన్నాడు.


“ఒరేయి, పెద్దాయన గారు, ఈ రవణ గారు ఎవరు రా?” అని అడిగాను నేను.


“నిన్ను సృష్టించిన మనిషి,” చెప్పాడు వాడు.


“ఒరేయి, పెద్దాయన గారు, సురిష్టించడం అంటే ఏంట్రా?” మళ్ళీ అడిగాను నేను.


“అంటే, అంటే, ఆయన నిన్ను పుట్టించిన వాడు,” తడుముకుంటూ అన్నాడు వాడు.


నాకు వెంటనే అవమానం వచ్చింది. అవమానం అంటే సందేహం. అంటే నాకు తెలీదు. ఎందుకంటే, గోపాళం రాధ నన్ను పుట్టించిన వాళ్ళని ఒక సారి బామ్మ చెప్పింది. మరి ఈ రవణ గారు ఎవరు?


“కొయి, కొయి, నన్ను పుట్టించింది గోపాళం, రాధ,” అన్నాను నేను.


“కాని వాళ్ళని సృష్టించింది కూడా రవణ గారే,” అన్నాడు పెద్దాయన.


ఇంకెలా చచ్చేది! “మరైతే ఆయన్ని నేను చూడలేదుగా?” కూసింత దిగులుగా అన్నాను నేను.


“ఆయన కూడా నిన్ను చూడలేదులే, నువ్వాయన మానస పుత్రుడివి,” అన్నాడు పెద్దాయన గారు.


మళ్ళీ నాకు ఖోపమొచ్చేసింది. నేనేమన్నా చిన్న వాడినా చితక వాడినా. ఇలా నాకు అర్థం కాని మాటలు చెప్తే నాకు ఎంత అనుమానం. అదే అన్నాను నేను పెద్దాయన గారితో.


“అంటే ఆయన నువ్వు ఉండాలనుకున్నాడు. నువ్వు పుట్టేశావు,” చెప్పాడు ఆయన.


నాకు వెంటనే అవమానం వచ్చేసింది. అవమానం అంటే సందేహం అని చెప్పాగా. మళ్ళీ నన్ను అడగొద్దు.


“మరి ఆయన లేకపోతే, నేనెలా ఉంటాను,” అన్నాను నేను.


“అదే మరి. మానస పుత్రుడివి కాబట్టి, ఆయన లేకపోయినా, నువ్వుంటావు.”


నాక్కుంచెం అర్థం అయ్యింది, కుంచెం కాలేదు.


“మరి రాధా గోపాళం?” అడిగాను నేను.


“రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గాన పెసూనాంబ, మీ వీధి చివర జెట్కా వాడు, అందరూ తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారు,” గంభీరంగా చెప్పాడు పెద్దాయన గారు.


“అవును, అవును,” అని నినాదాలు చేశారు సబకి వచ్చిన జనమంతా.


అదిగో! అలా తెలిసింది నాకు. కాబట్టి మీరేం బెంగ పెట్టుకోకండి, రవణ గారు లేకపోయినా నేను మాత్రం మీతోనే ఉంటాను. ఆయన కాకపోతే, తేటగీతి మురళినో, ఆయన అభిమానుల్లో ఇంకెవరో, నా గురించి రాస్తూ, నన్ను మీరెవ్వరు మర్చిపోకుండా చూస్తారు. మరదే రవణ గారి గొప్పదనం!

x

పాకీపిల్ల....

పాకీపిల్లవటంచు నిన్ను నిరసింపo జూతురమ్మా;స్వయం

పాక స్వాములు కొంతమంది, ఇది యే పాపంబో;మూన్నాళ్ళల్లో

నే కన్నుల్ తలకెక్కి వెనక గన రీ నిర్భాగ్య దామోదరుల్

పాకీ దే గద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ;

''పాకీ దానిగ'' నాడి పోసుకొను ఈ పాపిష్టి లోకమ్ము నీ

''బాకీ '' తీర్చుకోనగలేదు జగదంబా;జన్మ జన్మాలకున్

(కరుణశ్రీ గారి రచన నుండి.)

Thursday, June 5, 2014

అరుదైన పద్యాలు (అంతర్జాల సేకరణ)

అరుదైన పద్యాలు (అంతర్జాల సేకరణ)

ఒకతెకు జగములు వణకున్;

అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్;

ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా;

పట్టపగలె చుక్కలు రాలున్

భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా ప్రమాదకరమని లేదా చాలా శక్తివంతురాలని భావము.

కవితా కన్య రసజ్ఞత కవి కన్నా

రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;

నవ కోమలాంగి సురతము

భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును?

భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది.

పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం;

అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః

భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది.

నక్కలు బొక్కలు వెదకున్;

నక్కరతో యూర పంది యగడిత వెదకున్;

కుక్కలు చెప్పులు వెదకున్;

దక్కెడి నా లంజకొడుకు తప్పే వెదకున్.

భావము: నక్కలు ఎప్పుడూ బొరియల కోసం వెదుకుతాయి, ఆవసరానికి ఊర పంది పెంట వెదుకుతుంది, కుక్కలు చెప్పుల కోసం వెదుకుతాయి, కాని లంజ (వేశ్య)యొక్క పుత్రుడు మాత్రం ఏప్పుడూ ఇతరుల తప్పులే వెదుకుతాడు.

ఆడుదానిఁ చూడ నర్థంబుఁ జూడఁగా

బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు

బ్రహ్మయాలి త్రాఁడు బండిరేవునఁ ద్రెంప

విశ్వదాభీరామ వినురవేమ

భావము: స్త్రీని చూసినా, ధనాన్ని చూసినా సృష్టికర్త అయిన బ్రహ్మ కు కూడా రిమ్మ తిరిగే కోరిక పుడుతుంది. బ్రహ్మ భార్య అయిన సరస్వతి యొక్క తాళిబొట్టు బండి రేవు వద్ద త్రెంపాలి. అనగా స్త్రీకి, డబ్బుకి లోంగని వాడు లేడని వేమన భావం.

ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా

యాలుఁగా దది మరగాలు కాని

యట్టియాలు విడచి యడవి నుండుట మేలు

విశ్వదాభిరామ వినర వేమ!

భావము: భర్త మాటకు అడ్డం వచ్చే గయ్యాళితో కాపురం చేయుటకంటే అడవిలో జీవించడం మేలు అని కవి భావన.

చదువెందుకు చంకనాకనా

మూడెనుములు మేపుకున్న

పాలిచ్చును, వెన్నిచ్చును, నెయ్యిచ్చున్

అవి అమ్ముకొన్న ధనమొచ్చున్

భావము: చదువుకొని ఇబ్బందిపడేకన్నా మూడు గేదెలను మేపుకొని వాటి నుండి వచ్చే పాలు, వెన్న, నెయ్యి అమ్ముకొని ధనం సంపాదించడం మేలు.

మధువు మైకమునిచ్చు

మగువ సుఖమునిచ్చు

ఈ రెండింటి వల్ల ఖర్చు హెచ్చు

ఆ పై సకల రోగములు వచ్చు

భావము: మధువు (మద్యపానం) మత్తునిస్తుంది. స్త్రీ లైంగిక సుఖాన్ని అందిస్తుంది. కాని ఈ రెండింటి వల్ల ఖర్చు అధికమవుతుంది. ఆ తర్వాత అన్ని రకాల రోగాలు వస్తాయి.

ఖగపతి అమృతము తేగా

బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగమొక్కై జన్మించెను

పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

భావము: గరుత్మంతుడు అమృతం తీసుకొస్తుండగా అది బుగబుగమని భూమిపై పడి పొగాకు మొక్కగా మొలిచింది. అందుకే పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడు అని కవిభావన.

దారెరుగని వాడును గో

దారిన తానొక్కమారు తడవని వాడును

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి

భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు, ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము. ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.

వడిసెల చేత బట్టుకుని వావిరి చక్కని పైట జార గా

నడుము వడంక గా బిరుదు నాట్యము సేయగ గొప్పు వీడ గా

దుడ దుడ మంచె యెక్కె నొక దొడ్డ మిటారపు గమ్మ కూతురున్

దొడ దొడ మంచ మెక్కె నొక దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్

భావము: వడిసెల చేతపట్టుకొని నడుస్తుంటే, పైట జారుతుంటే, నడుము ముడతలు పడుతుండగా, పిరుదులు నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతుంటే ... ఒక గొప్ప కమ్మ కూతురు గబగబా వరి చేలలో ఉన్న మంచె ఎక్కింది, గబగబా గొప్ప రెడ్డి కూతురు మంచం ఎక్కేసింది.

వడిసెల అనగా పూర్వం వరిచేలల్లో బియ్యపు గింజల్ని తినడానికి వచ్చే పక్షులను తరమడానికి ఉపయోగించే సాధనం. మంచె అనగా చేలల్లో పడుకుంటానికి కర్రలతో నిర్మించిన మంచంలాంటిది.

పూర్వం కమ్మ, రెడ్డి కులాల వారు గ్రామాల్లో పెత్తనం చేసేవారు. ఇది తీరు నచ్చని కవి వ్యగ్యంగా ఈ కవిత్వం వ్రాశాడు.

ముక్కోటి దేవు లందురు

మ్రొక్కగ తా జింహ్వ లేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండ ముచ్చై పుట్టున్

కవులు పొగడువేళ, కాంతలు రతివేళ,

సుతులు ముద్దువేళ, శూరవరులు

రణము సేయువేళ, " రా" కొట్టి పిలుతురు

పాడి యదియు మిగుల భణితికెక్కు

భావము: కవులు తమను పొగడు వేళ, స్త్రీలు రతి సమయంలోను, పిల్లలు ముద్దుపెట్టు సమయంలోను, వీరులు యుద్ధ సమయంలోను రమ్మని పిలుస్తారు అని కవి భావము.కవితా కన్య రసజ్ఞత కవి కన్నా

రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;

నవ కోమలాంగి సురతము

భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును?

భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది.

పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం;

అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః

భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది.

నక్కలు బొక్కలు వెదకున్;

నక్కరతో యూర పంది యగడిత వెదకున్;

కుక్కలు చెప్పులు వెదకున్;

దక్కెడి నా లంజకొడుకు తప్పే వెదకున్.

భావము: నక్కలు ఎప్పుడూ బొరియల కోసం వెదుకుతాయి, ఆవసరానికి ఊర పంది పెంట వెదుకుతుంది, కుక్కలు చెప్పుల కోసం వెదుకుతాయి, కాని లంజ (వేశ్య)యొక్క పుత్రుడు మాత్రం ఏప్పుడూ ఇతరుల తప్పులే వెదుకుతాడు.

ఆడుదానిఁ చూడ నర్థంబుఁ జూడఁగా

బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు

బ్రహ్మయాలి త్రాఁడు బండిరేవునఁ ద్రెంప

విశ్వదాభీరామ వినురవేమ

భావము: స్త్రీని చూసినా, ధనాన్ని చూసినా సృష్టికర్త అయిన బ్రహ్మ కు కూడా రిమ్మ తిరిగే కోరిక పుడుతుంది. బ్రహ్మ భార్య అయిన సరస్వతి యొక్క తాళిబొట్టు బండి రేవు వద్ద త్రెంపాలి. అనగా స్త్రీకి, డబ్బుకి లోంగని వాడు లేడని వేమన భావం.

ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా

యాలుఁగా దది మరగాలు కాని

యట్టియాలు విడచి యడవి నుండుట మేలు

విశ్వదాభిరామ వినర వేమ!

భావము: భర్త మాటకు అడ్డం వచ్చే గయ్యాళితో కాపురం చేయుటకంటే అడవిలో జీవించడం మేలు అని కవి భావన.

చదువెందుకు చంకనాకనా

మూడెనుములు మేపుకున్న

పాలిచ్చును, వెన్నిచ్చును, నెయ్యిచ్చున్

అవి అమ్ముకొన్న ధనమొచ్చున్

భావము: చదువుకొని ఇబ్బందిపడేకన్నా మూడు గేదెలను మేపుకొని వాటి నుండి వచ్చే పాలు, వెన్న, నెయ్యి అమ్ముకొని ధనం సంపాదించడం మేలు.

మధువు మైకమునిచ్చు

మగువ సుఖమునిచ్చు

ఈ రెండింటి వల్ల ఖర్చు హెచ్చు

ఆ పై సకల రోగములు వచ్చు

భావము: మధువు (మద్యపానం) మత్తునిస్తుంది. స్త్రీ లైంగిక సుఖాన్ని అందిస్తుంది. కాని ఈ రెండింటి వల్ల ఖర్చు అధికమవుతుంది. ఆ తర్వాత అన్ని రకాల రోగాలు వస్తాయి.

ఖగపతి అమృతము తేగా

బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగమొక్కై జన్మించెను

పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

భావము: గరుత్మంతుడు అమృతం తీసుకొస్తుండగా అది బుగబుగమని భూమిపై పడి పొగాకు మొక్కగా మొలిచింది. అందుకే పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడు అని కవిభావన.

దారెరుగని వాడును గో

దారిన తానొక్కమారు తడవని వాడును

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి

భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు, ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము. ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.

వడిసెల చేత బట్టుకుని వావిరి చక్కని పైట జార గా

నడుము వడంక గా బిరుదు నాట్యము సేయగ గొప్పు వీడ గా

దుడ దుడ మంచె యెక్కె నొక దొడ్డ మిటారపు గమ్మ కూతురున్

దొడ దొడ మంచ మెక్కె నొక దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్

భావము: వడిసెల చేతపట్టుకొని నడుస్తుంటే, పైట జారుతుంటే, నడుము ముడతలు పడుతుండగా, పిరుదులు నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతుంటే ... ఒక గొప్ప కమ్మ కూతురు గబగబా వరి చేలలో ఉన్న మంచె ఎక్కింది, గబగబా గొప్ప రెడ్డి కూతురు మంచం ఎక్కేసింది.

వడిసెల అనగా పూర్వం వరిచేలల్లో బియ్యపు గింజల్ని తినడానికి వచ్చే పక్షులను తరమడానికి ఉపయోగించే సాధనం. మంచె అనగా చేలల్లో పడుకుంటానికి కర్రలతో నిర్మించిన మంచంలాంటిది.

పూర్వం కమ్మ, రెడ్డి కులాల వారు గ్రామాల్లో పెత్తనం చేసేవారు. ఇది తీరు నచ్చని కవి వ్యగ్యంగా ఈ కవిత్వం వ్రాశాడు.

ముక్కోటి దేవు లందురు

మ్రొక్కగ తా జింహ్వ లేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండ ముచ్చై పుట్టున్

కవులు పొగడువేళ, కాంతలు రతివేళ,

సుతులు ముద్దువేళ, శూరవరులు

రణము సేయువేళ, " రా" కొట్టి పిలుతురు

పాడి యదియు మిగుల భణితికెక్కు

భావము: కవులు తమను పొగడు వేళ, స్త్రీలు రతి సమయంలోను, పిల్లలు ముద్దుపెట్టు సమయంలోను, వీరులు యుద్ధ సమయంలోను రమ్మని పిలుస్తారు అని కవి భావము