Posts

Showing posts from March, 2018

మగవాడు నల్లత్రాచు ఆడది-కోపం వస్తే బుస కొట్టే నాగు పాము !

Image
మగవాడు నల్లత్రాచు ఆడది-కోపం వస్తే బుస కొట్టే నాగు పాము ! - తాళ్ళపాక తిమ్మక్క తొలి కవయిత్రి.  రాయగా రాయగా తొలి కావ్యం ''సుభద్రా కల్యాణం'' రాసింది. రాసి, . ''పొలతి! నమ్మగరాదు పురుషులనెపుడు/పలురీతి కృష్ణసర్పములైయుండ్రు''అని . మగవారిని నిం దించింది. (కృష్ణసర్పం అంటే నల్లత్రాచు).. రాదే సఖి నమ్మ రాదే సఖి ..  మగవారని ఇల నమ్మ రాదే సఖి ... అన్న సత్యభామ పాట గుర్తు చేస్తుంది... మగవాడు నల్ల త్రాచు. ఆడది-కోపం వస్తే బుస కొట్టే నాగు పాము. -

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?

Image
సప్త వ్యసనాలు అంటే ఏమిటి? ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే 1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు. 2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో) 3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలు

భర్తృహరి సుభాషితం-

Image
భర్తృహరి సుభాషితం- - నీరము తప్త లోహమున నిల్చి’ అని ఒక శ్లోకం ఉంది. ‘పడిన స్థానాన్ని బట్టి, నీటి బిందువు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని  దాని అర్థం. వేడి ఇనుముపై పడితే క్షణంలో ఆవిరైపోతుoది. దగుల్బాజీలతో కలిస్తే విద్యార్ధి  జీవితం ఆ విధంగా పనికిరాకుండా పోతుంది. అదే నీటిబిందువు తామరాకుపై పడితే, మోటార్ బైకుల మీదా, బీరుటిన్నులమీదా కొన్నాళ్లపాటుమెరిసి సాయంత్రానికి ఆవిరైపోతుంది. అలాంటి విద్యార్ధులు కాలేజీలో హీరో, హీరోయిన్లలా చలామణీ అయి, బయటకు రాగానే కాలగర్భంలో కలిసిపోతారు.  అదే బిందువు ముత్యపు చిప్పలో పడినట్లయితే ముత్యంలా మారుతుంది. తాను ఎక్కడ పడాలో నీటి బిందువు చేతిలో లేదు. దాన్ని విధి నిర్ణయిస్తుంది. కానీ ఆ శక్తి, యుక్తి మనకి ఉంది. ఒక తల్లి కొడుకుని ఒక స్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది.  స్వామి చదువుకున్నవాడు. ఙ్ఞాని. "స్వామీ! నా కొడుకు తెలివైన వాడే కానీ మాట వినడు. చదువు తప్ప అన్ని విషయాల్లోనూ ఆసక్తి వున్నది. వాడికేదైనా చెప్పి మార్చండి" అన్నది. "ఏం చెప్పను? దేని గురించిచెప్పను?" అని స్వామి చిరునవ్వుతో అడిగాడు. అక్కడ ఒక తారు రోడ

కుంభ కర్ణుడు :--

Image
కుంభ కర్ణుడు :-- . కుంభ కర్ణుడు రావసురుని తమ్ముడు. తను మహా సోమరి, భారి కాయం కలిగిన వాడు, అతి బలవంతుడు .కుంభ కర్ణుడు నిద్ర, బోజన ప్రియుడు తను రోజులు, వారలు,నెలలు,సంవస్త్సరాలు అయిన సరే నిద్రతో గడిపేస్తాడు. ఒకవేళ నిద్ర లేగిసిన ఆహరం తీసుకోని మళ్ళి నిద్రకు ఉపక్రమిస్తాడు. . రావణాసురుడు ప్రహస్త కు చేపినవిదంగా కుంభ కర్ణుని నిద్ర లేపుటకు మాధపాటు ఏనుగులను, అనేకమైన సైన్యాన్ని మ్రుదంగాలని, వాయిద్యాలని, కుంభకర్ణుడు బోజన ప్రియుడు కనుక తనకు ఇష్టమైన ఆహరంను, తాగుటకు పాయసం,పళ్ళరసాలు,పళ్ళ నుండి ,పుష్పాల నుండి తీసిన మధువును తీసుకువెళ్ళాడు. . కుంభ కర్ణుడు సమీపించి తన పైకి ఏనుగులను, సైన్యాన్ని ఎకించి తోకించాడు. ఆపాటికి లేగవక పోయే సరికి మాధపాటు ఏనుగుల గింకరాలను, వేయిద్యలను వాయిస్తూ తోకుచుండగా కుంభ కర్ణుడికి మెలుకువ వచ్చింది .ఆ మెలుకువ రావటంతోనే తనను ఆపాటి దాకి నిద్ర లేపుతున సైన్న్యాన్ని విసిరి నెల కేసి కోట్టి ...చంపేస్తాడు. . విషయాన్నీ తెలుసుకొని రావననుని సభ కు వెడతాడు.

శ్రీ ఆంజనేయ స్తుతి!

Image
శ్రీ ఆంజనేయ స్తుతి! (ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు.) .  గోష్పదీకృత వారాశిం, మశకీకృత రాక్షసమ్. రామాయణ మహామాలా,రత్నం  వందే నిలాత్మజమ్. అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,  కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్ మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,  వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం ,  పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం. యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.  బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్. బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత  అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్  ఇతి ఆంజనేయ స్తుతి

సూత ఉవాచ:

Image
సూత ఉవాచ: ఖగపతి యమృతముతేగా భుగభుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచెట్టై జన్మించెను పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ |క| ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వున్నది. (గురజాడ వారి కన్యా శుల్కం నుండి.)

పోతన- సరస్వతీదేవి !

Image
పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. .  అతని యీ రెండు పద్యాలు అతి మధరం. . :శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! . భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి! ఇక రెండో పద్యం: "క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్! . ఏదేమయినా క

మతం....... అధికారం !

Image
మతం....... అధికారం ! మతం అధికారం లో వున్నప్పుడు , అది స్వేచ్చా జీవులను హిమ్చించిన్ది.వారి నోళ్ళు నొక్కింది . ఈ దేశం లో శాఖా భేదాన్ని సైతం సహించిన దాకలాలు లేవు . అధికారం మతాన్ని ఆశ్రయించిన చారిత్రిక దశలో దౌస్త్యాలు చేయించింది మతం . చేయించి న ది మతం అదుపాజ్ఞలలో వున్న అధికారం ..  ఇది వాస్తవం . అధికారం తనంతట తాను , ఎలాటి శిక్షలను అమలు చేయదు -- దానికి మత ఆమోద ముద్ర కావాలి --  మతం చెప్పిన తీర్పు అధికారానికి శిక్షను వేచే శక్తిని ఇస్తుంది . సామాన్య జనాల నోళ్ళు దైవ భయం తో కుట్టేస్తుంది .... గత చరిత్ర , వర్తమానం మనకు కళ్ళకు కట్టినట్టు  చూపెడుతున్న సత్యం ఇదే ... అందు వల్ల దౌష్ట్యం చేపించే మత తత్త్వం పోవాలి ... మతాన్ని అడ్డు పెట్టుకుని ద్రోహాలు చేచే అధికార తత్వమూ పోవాలి .. అంటే సిద్ధాంతాలు విసృతం కావాలి .. పాత దురభిప్రాయాలను నిర్ములిన్చుకుంటూ ,  సంఘ సిద్ధాంతాలతో ముందుకు కదలాలి ,, -

ద్రౌపది!

Image
ద్రౌపది! .  ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది.  ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? . సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతి

మొక్క నాట రండి మేలు కలుగు!

Image
శుభోదయం ! - మా అక్క గారి పద్యాలు ! (శ్రీమతి తరణి కంటి /వింజమూరి సూర్య లక్ష్మి స్వయానా మా అక్కగారు .. వారు వ్రాసిన  కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాను,) .  మొక్క నాట రండి మేలు కలుగు! రచన .. శ్రీమతి తరణి కంటి (వింజమూరి ) సూర్య లక్ష్మి . 1. శ్రీలు పొంగు వారు శిరులొలి కేభూమి  వనములెన్నొ గలిగి వెలుగు భూమి నాటికైభవంబు నేడు తలచుకుంటు మొక్క నాట రండి మేలు కలుగు. . 2. వాన లెట్లు కురియు వనములు లేకుండ (నరకంగ)  పంట లేల పండు పడక వాన  ఎట్లు బతుక గలరు పంట లేక జనులు  మొక్క నాట రండి మేలు కలుగు. . 3. అడవి సంపదంత అణగారి పోకుండ  ముందు తరములకును మేలు గలుగ  అడవు లవసరంబు అమలుజేయవలయు  మొక్క నాట రండి మేలు కలుగు.  . 4. మూడు కాళ్ళ ముసలి మొక్కలు నాటంగ  జనుల కపుడు వింత గాను దోచె  నాటి మొక్క లన్ని నేడు వృక్షాలయ్యె  మొక్క నాట రండి మేలు కలుగును. 5. అడవులన్ని పలుచ బడిపోవు చుండగ  జంతుజాల మంత అంతరించు. మానవళికలను ముప్పు వాటిల్లదా?  మొక్క నాట రండి మేలు కలుగును.  . 6. ప్రకృతి సహజమైన పనులు చేయుమెపుడు  చదురు మదురు దాన్ని చెయకెపుడు. సహజ సంపదంత సమతుల్య

రాతిని నాతి చేసిన సుర హ్రద జన్యు పదమ్ము

Image
ఈ పద్యం నాకైతే బాగానే నచ్చింది. మీ అభిప్రాయం చెప్పండి. - ఉ|| రాతిని నాతి చేసిన సుర హ్రద జన్యు పదమ్ము నావనే రీతిగ మార్చునో యనుచు రేగిన శంకలు సత్యమే సుమీ! ప్రీతిగ లోకమాత మురిపెమ్ముగ నొత్తెడు పాద పద్మముల్ ఖ్యాతిగ లోకవాసుల నఘమ్ములు మాపుట వింత గాదులే! (రవి వర్మ చిత్రం )

వరదరాజ స్వామి!

Image
వరదరాజ స్వామి! - వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది.  స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో  ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి. ఒక సందర్భంలో భగవద్రామానుజులని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరద రాజ స్వామే మారు వేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు. ఈ వరదరాజ స్వామి యజ్ఞగుండంలో ఉద్భవించాడు కాబట్టి ఆయనకు తాపం ఎక్కువట.  అందుకే వరదరాజ స్వామి ప్రియ భక్తుడైన తిరుకచ్చినంబి ఆయనకు వింజామర సేవ ప్రారంభించారు. తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో ముఖాముఖి మాటలాడగల మహా భక్తుడు. భగవద్రామానుజులు ’వార్తా షట్కము’ అనే ఆరు ప్రశ్నలకు సమాధానం ఈయన ద్వారానే వరదరాజ స్వామి ని అడిగి తెలుసుకున్నారు. ఇంతటి మహిమాన్వితమైన వరదరాజ స్వామి గురించి ఒక పద్యం. ఆ|| యజ్ఞగుండ మందు అవతరించిన వాడు యజ్ఞకర్త ఎంచ నజుడు కాగ కాంచిపురమునున్న ఘనుడు వరదరాజు  ధన్యమగును జన్మ తలచినంత.

యాతమేసి తోడినా ఏరు ఎండదు!

Image
యాతమేసి తోడినా ఏరు ఎండదు! . యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు ఆ దీపముండదు | ౧ పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది కడుపుకోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో || ౨ అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీమునెత్తురులు పారే తూము ఒక్కటే మేడమిద్దెలో ఉన్నా సెట్టు నీడ తొంగున్నా నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా || -

పేగుతీపి !

Image
పేగుతీపి ! - తల్లీ కొడుకూ అడవి మార్గాన వెడుతుంటే ఓ నది అడ్డం వచ్చింది. తల్లి ముందుగా ప్రవాహంలోకి దిగి కొడుకును తన చేయి పట్టుకోమంది. ‘అలా కాదు నువ్వే నా చేయి పట్టుకో’ అన్నాడు కొడుకు. ‘తేడా ఏముంది’ అడిగింది తల్లి. ‘పెద్ద అల వస్తే నేను నీ చేయి వొదిలేసి నా దారి చూసుకుంటాను. అదే నువ్వు పట్టుకుంటే నాకు ఎంతో భరోసా. ఏం జరిగినా నా చెయ్యి వొదిలి పెట్టవు. నువ్వు మునిగయినా సరే నన్ను బయట పడేస్తావు. అదే తేడా’ అన్నాడు కొడుకు. - (రాజా రవి వర్మ చిత్రం.)

దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.!

Image
దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.! పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని. రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు. అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన సమస్యన

భారత మాతాకీ వందనం !

Image
భారత మాతాకీ వందనం ! - బంగరు పూవులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం జీవనదులతో సిరులొలికించే చిర యశస్వినికి వందనం పావన ఋక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం హిమవదాది సుమహీధరాల విలసిల్లిన మాతకు వందనం అమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం సత సహస్ర నర నారీసంస్తుత చరణ పంకజకు వందనం దివ్య శిల్పులను దివ్య గాయకుల తీర్చిన జననికి వందనం దేశదేశముల కాదర్శమ్ముల తెలిపిన మాతకు వందనం -

మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు !

Image
మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు ! ... మంచి గురువు.... వెర్రి బాగుల శిష్యుడు లోనే వక్ర భాష్యము ఉన్నది. ద్రోణుడు మంచి గురువా? ఎవరికి? అర్జునునికా? ఏకలవ్యునికా?  ద్రోణుడి విలువిద్యా ప్రావీణ్యత గురించి ఎవరికీ అనుమానంలేదు. అర్జునునికి విలువిద్య నేర్పడమే కాక అతనిని మించినవాడు ఉండడని మాట ఇచ్చాడు.  ఏకలవ్యుడు ద్రోణునే గురువుగా ఆరాధించి స్వయంకృషితో విలు విద్య నేర్చుకుని, తన విద్యను తాను ఆరాధించిన ద్రోణునికి ప్రదర్శించాడు. అంటే ఏకలవ్యుడు ఉత్తమ శిష్యుడు. ద్రోణుడు అతనికి మంచిగురువు కాలేక పోయాడు. అర్జునుని మించిన విలుకాడు తన యెదుటనే ఉన్నాడు.  ఇది సహించలేక ద్రోణుడు నీచమైన అధర్మము చేశాడు. గురుదక్షిణగా అతని విద్యనే పరోక్షంగా కోరాడు. ఇంద్రుడు కర్ణునివద్ద కవచ కుండలములు దానం కోరినట్లే. ఇక్కడ కులాల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుని కథలో ఆయన అనేకులకు అనుగ్రహం చూపాడు.  వారిలో బ్రాహ్మణుల సంఖ్య అతి తక్కువ.  నాదృష్టిలో ఆకాలపు బ్రాహ్మణులు శ్రీకృష్ణావతారము వలన  ప్రయోజనం పొందలేదు.

పేదరాశి పెద్దమ్మకధ !

Image
పేదరాశి పెద్దమ్మకధ ! - అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు , కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచిగా పెళ్ళిళ్ళు చేసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను – అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాన

కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటే అర్థం తెలుసా?

Image
కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటే అర్థం తెలుసా? ‘‘కృష్ణం వందే జగద్గురుమ్‌’’ అనేది చాలా ప్రాముఖ్యం చెందిన మాట. జగద్గురువంటే జగత్తుకే గురువు.  కృష్ణం వందే జగద్గురుమ్‌ అనే మాటకు కృష్ణభగవానుడు సమస్త జగత్తుకు గురువని అర్థం వస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించే వ్యక్తినే గురువు అనే పదం సూచిస్తుంది. జ్ఞానమనే అంజనాన్ని కళ్లకు పూసి అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని తొలగించే మహనీయుడే గురుదేవుడు.  అంటే కళ్లకు వెలుగు ప్రసాదించి జగత్తును సరైన  దృష్టితో చూడగలిగే భాగ్యం కలిగించినవాడే గురువు.  - కరారవిందే పదారవిందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందా మనసాస్మరామి

కాజల్-

Image
- కాజల్- (Venkateswararao Gonella గారు కాజల్ గురించి  చాల అందముగా చెప్పారు. 1/2. మత్తేభము : అలినీలాలక, గామ వల్లభ ముఖిన్, యంగాంగ దత్తూ రపుం గలికిన్, కొండొకచో దిసాంగ రససంగ్రామస్సముత్సా హనో ల్లలన య్యోజిత లాలినిన్ రసిక లీలా లాలస నీమె, " కా జలగర్వాలు" చనుద్వయంబును కటిన్ సారించ మో హంబగున్. (అలినీలాలక = ఆడు తుమ్మెదవంటి అందమైన శిరోజములు కలది యైన /గా - కామ వల్లభ ముఖిన్ = చంద్ర బింబము వంటి ముఖము కలదానిని /యం - అంగాంగ దత్తూరపుం గలికిన్ = నున్నని శరీరంతో శోభిలు స్త్రీని /కొండొకచో = వేరొకచోట /దిసాంగ రససంగ్రామస్సముత్సాహ=........ /ల్ల - లలన య్యోజిత =....... /లాలినిన్ = విలసన స్త్రీని /రసిక =రసికను /లీలా లాలస నీమె = శృంగార చేష్టల నిష్టపడి కోరు ఈమెను /కాజలగర్వాలు = కాజల్ ను /చనుద్వయంబును కటిన్ సారించ మోహంబగున్ =......) - 2. ఉత్పలమాల : చాపము కాజ లోల మన, చక్కటి మోమును పాద ముల్ గొనల్,  యే పరిరంభమాన గుణ యేపుగ నామెను లాగి బ ట్టి బం ధోపగతిన్ బురిన్ బిగి రసోచిత భంగిమ నోజస స్ఖ ల త్తూపున నేసి యీప్సితము దోచెద, సూన శరంబు కై వడిన్. (చాపము కాజ లోల

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ!

Image
శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారూ!  - సుబ్రహ్మణ్యశాస్త్రిగారు జగము ఎరిగినవాడు: జగము తన్నెరిగినవాడు. మరిన్నీ, విశేషించి బ్రాహ్మణుడు.  అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన:  గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు ఆయన సాహితీ సమరాంగణము. వారి పోకడలూ, మెలకువలూ ఆయన వాక్యములు. వారి కష్టసుఖాలు ఆయన చెప్పిన కథలు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు కొన్నైనా చదివితే తెలుగుకుటుంబాల ఆపేక్ష, అంతఃఅకరణాలు ఎలాటివో, ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది! ‘వడ్లగింజలూ మించే కథ ఉందా! ‘యిల్లుపట్టిన వెధవాడపడుచూ అలా మరొకరు వ్రాయగలిగేరా? ‘అనుభవాలూ-జ్ఞాపకాలూ’ నూరేండ్ల తెలుగుతనపు కూలంకష క్రోడీకరణ కాదా! అది వేయేళ్ళపాటు, పదింబదిగ చదువుకోవలసిన గ్రంథం కాదా! తెలుగు మాగాణముతోబాటు, మీగడ తరకలైన శ్రీ శాస్త్రిగారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా! *** శ్రీపాదవారిలో పండితులున్నారు, కవులున్నారు, వైద్యులున్నారు, వర్తకులున్నారు! ఇక చిరస్మరణీయులైన శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పండితుడు, కవి, వైద్యుడు, వర్తకుడు సరసంగా తానై, ఛాందసము వన్నె తెచ్చిన సంస్కారి. శ్రుతిపక్వమైన పట్టుదల రాణిం

దశావతార స్తుతి:-10.- (కల్కి అవతారం .)

Image
దశావతార స్తుతి:-10.- (కల్కి అవతారం .) - "శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - - కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు. "కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన. కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి. "అవతారం" అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగి

దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు! (చిత్రం ..వడ్డాది పాపయ్యగారి.. దానం.)

Image
దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు! (చిత్రం ..వడ్డాది పాపయ్యగారి.. దానం.) దానం చేయాలని ప్రముఖంగా చెబుతుంది, సనాతన ధర్మం.. ’పెట్టందే పుట్టదు’ అనీ అంటుంది. ’చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంతా’ అంటారు.  ’పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు.  దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు, శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం. ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు,చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వ

దశావతార స్తుతి:-9. (బౌద్ధ అవతారాం .)

Image
దశావతార స్తుతి:-9. (బౌద్ధ అవతారాం .) - 'దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - (ఇక్కడ రెండు వాదనలు కలవు .రెంటిని పొందు చేస్తున్నాను .) మొదటి వాదం : నమో బౌద్ధ అవతారాయ దైత్యస్త్రీ మానభంజినే అచింత్యాశ్వత్థ రూపాయ రామాయాపన్నివారిణే అని ” శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం” లో ఉంది. దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు ” గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి. ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది. త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు ! సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పార

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .! .

Image
ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి .! . ఈ శరీరానికి ఒక్కటే ప్రయోజనం! ‘బోధన’ను బయలు పరచడం ఉపన్యాసాలు ఆపివేయడం తోటే ఈ శరీరం మరణిస్తుంది. - తనను తాను సంరక్షించుకోవాలనుకోవడం, మార్పులకు అవరోధం కలిగించాలనుకోవడం... మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ ఆసక్తి. జీవితంలో సరళమైన మార్పులు తీసుకువచ్చి మనసుకు వయసు రాకుండా చూసుకోవచ్చు. అందుకు విస్తృతమైన అవగాహన అవసరం. . "నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని విముక్తి చెయ్యాలి." నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు. . ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. . *ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు. ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు. *సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు. * అన్ని జీవనకళల్లోకి ధ్యానం ఉన్నతమైనది. *అసలైన విప్లవం

డొక్కా సీతమ్మ గారు !

Image
డొక్కా సీతమ్మ గారు ! - వీరు డొక్కా సీతమ్మ గారు. గోదావరి జిల్లా లో వుండేవారు. తమ ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండుగా భోజనం పెట్టె వారుట.  ఆ రోజుల్లో బ్రిటిష్ రాణి గారు ఈవిడ గారి గుంరించి విని తన పట్టాభిషేకం సమయానికి సీతమ్మ గారిని తీసుకు వెళ్లాలని అలోచించారు. కానీ సీతమ్మ గారు సముద్రం దాటి వెళ్ళరు కనుక, గోదావరి జిల్లా కలెక్టర్ ను సీతమ్మ గారి గ్రామానికి పంపి, ఆమె ఫోటో లండన్ పంప మని కలెక్టర్ ని ఆదేశించారు.  కలెక్టర్ గారు సీతమ్మ గారి వద్దకు వెళ్లి ఆమె ఫోటో కోసం అడిగితే వల్ల కాదన్నారు ఆమె. అప్పుడు కలెక్టర్ గారు ఆవిడ కాళ్ళ వెళ్ళా పడి, అమ్మా మీరు నాకు ఫోటో ఇవ్వకపోతే నా వుద్యోగం ఊడుతుందని చెప్పటంతో సీతమ్మ గారు ఫోటో తీయించుకున్నారు. ఆ విధంగా సీతమ్మ గారి ఫోటో బ్రిటిష్ రాణి వద్దకు లండన్ చేరింది.  రాణి తన పట్టాభిషేకం రోజు సీతమ్మ గారి ఫోటో ప్రక్కనే ఉంచుకుని పట్టాభిషేకం చేయించుకున్నారుతా. అంతటి పేరున్న అన్నపూర్ణ మాత ను తలచుకోవటం ఆమె ఫోటో చూడగలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను.  మిత్రులు చాలా అంది యీ ఫోటో చూసిఉండరు. అందరూ తిలకించి ఆమె ఆశీర్వాదం పొందుతారని పోస్ట్ చేసాను.

దశావతార స్తుతి:-8- (కృష్ణావతారం.)

Image
- దశావతార స్తుతి:-8- (కృష్ణావతారం.) - " కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - సకల కళల పూర్ణావతారం.. కృష్ణావతారం భగవానుని దశావతారాలను నిశితంగా పరిశీలిస్తే సృష్టి, పరిణామక్రమాలు అర్థమవుతాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాలు పది.  ఇందులో మత్స్యం (చేప) కేవలం జలచరం. కూర్మం (తాబేలు) జలంలోనూ, భూమిపైనా సంచరిస్తుంది. అందుకే ఇది ఉభయచరం. వరాహం కేవలం భూచరం. నాలుగు కాళ్ల నుంచి రెండు కాళ్ల జీవిగా ఎదిగే క్రమంలో సగం జంతువు సగం మనిషి రూపంతో అవతరించింది నారసింహం.  పూర్ణంగా మానవదేహం పొందినా మరుగుజ్జుగా కనబడే రూపం వామన అవతారం. సంపూర్ణమైన భౌతిక ఎదుగుదల ఉన్నా, మనోబుద్ధులు వికాసం పొందని ఆటవికునికి సంకేతం పరశురాముడి అవతారం. వికాసం చెందిన మానవుడు ఎలా ఉండాలి? ధర్మాధర్మ విచికిత్సను ఎలా చేయాలి? మనిషి సంఘజీవిగా ఎలా ఎదగాలి? సంఘంలో తోటి మానవులతో ఎలా ప్రవర్తించాలి? అని తెలపటానికి ఆవిర్భవించిన సంపూర్ణ మానవ అవతారమే

Abhimanam Songs - Oho Basthi Dorasani - Akkineni Nageswara Rao, Savitri,...

ఓహో బస్తి దొరసాని ' పాటకి మాతృక హిందీ అయినా అందులో 'హాయ్' ఉంది. ఇప్పుడే గుర్తు వచ్చిన ఒక హిందీ కాపీ పాట. రెండు బాషలలోను నాకు ఇష్టం. పల్లవి: ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 1 ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది హాయ్.. ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 2 కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది హాయ్... ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరస

కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టి పుట్టాలి ☝

Image
కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టి పుట్టాలి ☝ ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి .బోల్డంత తేడా ఉంది.మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా వెయ్యరు,మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా వెయ్యరు ఇవన్నీ కాదు పెసరట్ మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా అదీ లేదు అలాంటప్పుడు మీ పెసరట్ కి కాకినాడ పెసరట్ కి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట ఒప్పుకోవాలి కదా. ఆరోగ్యం కోసం ఆయిల్ ఫుడ్ కూ దూరం గా ఉంటున్న జనం ఇంక నెయ్యి అంటే ఒప్పుకుంటారా..కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం కోరికని కంట్రోల్ చేసుకోవడం తప్పదనే రోజుల్లో బతికేసేవాళ్ళం ఇవి తింటే ఎలాగా అంటే అదీ నిజమే.అందుకే తినడానికి కూడ రాసిపెట్టి ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు ఇంత స్పెషల్ గా ఉండే కాకినాడ పెసరట్ల లో ఏవుందీ అంటే.. బుల్లి బుల్లి పెసరట్లని వేసి చుట్టూ బాగా నెయ్యి వేసి అట్లపైన కొద్దిగా ఎండుమిర్చి కారం చల్లి ఆపైన కొద్దిగా (నీటిలో నానపెట్టిన) పచ్చి పెసరపప్పుని కూడా వేస్తూ ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు,అల్లం ముక్కలు,కొద్దిగా జీల

-దశావతార స్తుతి:-7.- (రామావతారం. )

Image
  -దశావతార స్తుతి:-7.- (రామావతారం. ) - "సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - ధర్మరక్షాస్వరూపమే రామావతారం: రామః అంటే ఆనందస్వరూపుడు. రామనామస్మరణ చేస్తే ఆనందం లభిస్తుంది. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుంది. భవభయజనితమైన అజ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడమే ఆనందం. దాన్ని ప్రసాదించే తారకబ్రహ్మస్వరూపుడు రాముడు. అహల్యను పాపం నించి ఉద్ధరించి శాపం నుంచి కాపాడి పతితపావనుడైయ్యాడు. అనేక యుగాలనుంచి తనకోసం తపస్సు చేస్తున్న ఋషులు వద్దకు తానే స్వయంగా వెళ్ళి అనుగ్రహించిన కారుణ్యస్వరూపుడు. రామావతారం రక్షకావతారం. శ్రీరామ అంటేనే రక్షణ లభిస్తుంది. ఋషులను రక్షించడమంటే ఋషులతో పాటు వారు ప్రతిష్ఠించిన ధర్మాన్ని రక్షించడం. ధర్మము అంటే జగతిని పట్టి నిలిపేదని అర్ధం. ఏ ధర్మాలు మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతాయో అటువంటి ధర్మాల్ని ప్రతిష్టించడానికై నారాయణుడు నరుడై అవతరించి అందరిచేతా ఆరాధింపబడి పూర్ణబ్రహ్మ ఉపాస

భవబంధాలు !

Image
భవబంధాలు ! - విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో, భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరిజనం అందరూ వారం రోజులుగా శాస్ర్తిగారి గీతోపన్యాసాలు విని పరవశించి పోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్ర్తిగారు ఇలా చెప్పారు: ‘‘మహాజనులారా! ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమంవుంది. మోక్షసాధనకై నిరంతరం ప్రయత్నిస్తూవున్నప్పుడే, మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.'' ఊరిజనం బరువెక్కిన హృదయాలతో, శాస్ర్తిగారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు. భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగిరాగానే, వీర్రాజు పరవశంతో, ‘‘అమ్మమ్మా! ఆ శాస్ర్తిగారు ఎంతటి మహాపండితులో గదా! జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా!'' అన్నాడు పేర్రాజుతో. ‘‘అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు!'' అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక క్షణం ఆగి, ‘‘శాస్ర్తిగారి మాటలు విన

అందమయిన కందం.!

Image
అందమయిన కందం.! . నిగమ శర్మ మిత్రులతో కలసి అత్యవసర పని మీద వెళ్తూ దారిలో కలసిన సానిదాన్ని చూస్తూ ఆగి పోతే .. మిత్రుల మందలింపు.... - కందము: దరి సానిదాని నిగ నిగ మరి మరి గని, మాపని సగమాపగ గాదా ! సరిగా గని పద నిగమా ! సరిసరి! మా పనిని సరిగ సాగగ నిమ్మా! (చిత్రం -వడ్డాది పాపయ్య గారు.) -

-దశావతార స్తుతి:-6.- (పరశురామావతారం .)

Image
-దశావతార స్తుతి:-6.- (పరశురామావతారం .) "క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని  (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు. ఒకసారి రేణుక నదీజలాన్ని తేవడానికి వెళ్ళింది. అక్కడ అప్సరసలతో క్రీడించే గంధర్వరాజును చూసి, వానిపై రేణుకకు కొంచెం స్పృహ కలిగింది. ఆలస్యంగా వచ్చిన ఆమె మనసును జమదగ్ని గ్రహించి, ఆగ్రహించి, ఆమెను వధించమని తమ కుమారులను ఆజ్ఞాపించాడు. అన్నలెవరూ తల్లిని వధించలేదు కనుక పరశురాముణ్ణీ వరం కోరుకోమ్మంటే – తల్లి, అన్నలపై ఎలాంటి ద్వేషం లేనందువల్ల వారిని తిరిగి బతికించమన్నాడు! అందుకే వారు మళ్ళీ బతికారు – భాగ. (9-16-8) పరశురాముడు అవతారపురుషుడైనా అతణ్ణి ఓడించిన సందర్భం ఒకటుంది. శివధనస్సు విరిచి, వివాహితుడై సీతాదేవితో వచ్చే దశరథరాముణ్ణి ఎదిరించి పరశురాముడు భంగపడ్డాడు . –

సీతమ్మ చెప్పిన పులి – బాటసారి కధ ! (చాలా చక్కటి గొప్ప నీతి కధ)

Image
సీతమ్మ చెప్పిన పులి – బాటసారి కధ ! (చాలా చక్కటి గొప్ప నీతి కధ) రావణసంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. “అమ్మా ఇకపై ఈ లంకా రాజ్యాన్పి ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగినది. మీరు ఇక్కడి నుండి బయలుదేరేముందు ఒక్క ఆఙ్ఞ ఇవ్వండి తల్లి.. మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరిని సంహరిస్తాను”అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి హనుమా! నీకు ఓ కధ చెబుతా విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవిగుండా వెలుతున్నాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తనపైకి రాబోగా తన ప్రాణాలను అరచేతబట్టుకుని పరుగులు పెడతాడు. పులికూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుకొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి వున్న కొమ్మ పై కొమ్మలో ఓ ఎలుగుబంటి వుంటుంది. అది చూసిన పులి “ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి తోసేయ్.. తినేసి వెల్లిపోతాను” అంటుంది.  వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను” అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తుంది. రాత్రి అవుతుంది. ఎలు

అలమేలు మంగ! .

Image
అలమేలు మంగ! . అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది. లక్ష్మియే అలమేలు.... శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు. వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద

దశావతార స్తుతి:-5. (వామనావతారం .)

Image
దశావతార స్తుతి:-5. (వామనావతారం .) - "భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం. నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - వామనుడికి బలి మూడు పాదముల నేలను ధారాదత్తం చేశాడు. వామనుడు ఒక పాదమును నేలపై ... మరొక పాదమును ఆకాశం పై పెట్టి మూడవ పాదం దేనిపై మోపాలంటూ అడిగాడు. దాంతో వచ్చినది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించిన బలి, మూడవ పాదమును తన తలపై మోపమని కోరాడు. బలి గుణ సంపదకు మెచ్చిన శ్రీమహావిష్ణువు, అతని తలపై మూడవ పాదమును మోపి సుతల లోక రాజ్యమునకు రాజును చేశాడు..