రాజకుమారి దమయంతి రాజ హంస తో ముచ్చట్లు ! చిత్రం...రాజ రవి వర్మ .

రాజకుమారి దమయంతి రాజ హంస తో ముచ్చట్లు !

చిత్రం...రాజ రవి వర్మ .

-

విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీమరాజు. 

ఆయన కూతురే దమయంతి. నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ప్రేమలో పడతారు. నలుని ఊహాచిత్రాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటుంది దమయంతి. 

ఆమె అందం గురించి స్వర్గలోకం రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి తిరుగు ఉండేది కాదు. ఆమె అందం గురించి స్వర్గలోకం వరకూ తెలిసింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు. 

-

అప్పటికే నలుని దగ్గర నుంచి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీమరాజు. 

నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి హంసతో రాయభారం పంపింది దమయంతి. నలుని కోసమే.. దమయంతి స్వయవరం రోజును ఆమె కళ్లు మొత్తం కూడా నలుని కోసమే వెతికాయి. నలుని చూడగానే ఆమె మనసు ఉప్పొంగింది. అయితే ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. మొత్తం ఐదుగురు నలుడులు ఒక నలుడు కాదు, పక్కన మరో నలుగురు నలులున్నారు. అప్పడు దమయంతికి అంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చింది. తన అంతఃపుర మందిరంలోకి అదృశ్యుడై వచ్చిన నలుడు దేవేంద్ర అగ్ని వాయువరుణ దేవుళ్ళు నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు. ప్రేమించిన నలుడినే పెళ్లాడింది అప్పుడు ఆమె తను కోరుకున్న వాణ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరిప్పుడు తన ముందున్న అయిదుగురు నలుని రూపధారుల్లో తన నలుడెవరో? సాయం కోరుతూ సరస్వతీ దేవిని ప్రార్థించింది. ఆ తర్వాత తను ప్రేమించిన నలున్నే మాలవేసి పెళ్ళాడింది దమయంతి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!