సత్యాన్వేషి- చందమామకధ !

-


సత్యాన్వేషి- చందమామకధ !


-

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి

శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా! ఏ లక్ష్యం సాధించాలని నువ్విలా శ్రమప

డుతున్నావో నాకు తెలియదు. లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకున్న వివేకులూ, తపస్సంపన్నులూ సైతం ఒక్కొక్కసారి అనాలోచితంగా క్షణికమైన నిర్ణయాల తో, తమ

జీవిత లక్ష్యాలకు దూరమై, అపమార్గం పాలవుతారు. నువ్వు అలాం టి పొరబాటు

చేయకుండా ఉండగలందులకు వీలుగా, నీకు శశాంకుడనే ఒక తపస్సంపన్నుడి కథ

చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:

శశాంకుడు సువర్ణపురి రాజపురోహితుడి ఏకైక కుమారుడు. రాజు మార్తాండవ ర్మ

కుమారుడు స్వర్ణకీర్తి, శశాంకుడూ ఒకే ఈడు వాళ్ళు. పదహారవయేట వర కు ఒకే

గురుకులంలో విధ్యాభ్యాసం చేశారు. బాల్యం నుంచి మంచి మిత్రులు.

రాజు మార్తాండవర్మ తన కుమారుణ్ణి క్షాత్రవిద్యలు అభ్యసించడానికి

వింధ్యప ర్వత సానువులలో ఉన్న విష్ణుచంద్రుడి గురుకులానికి పంపాలని

నిర్ణయించా డు. అందువల్ల రాకుమారుడు స్వర్ణకీర్తి, తన మిత్రుణ్ణి వదిలి

వెళ్ళవలసి వచ్చింది.

శశాంకుడికిచిన్నప్పటి నుంచే ప్రాపంచిక విషయాలపట్ల ఒక విధమైన అనాసక్తత ఉండేది. అది

క్రమంగా విరక్తిగా పరిణమించింది. లౌకిక సుఖాలను త్యజించి, తపస్సు

చేయడానికి సమీప అరణ్యానికి వెళ్ళాడు. కొన్ని సంవత్స రాలపాటు కఠోర తపస్సు

చేశాడు. కొంతకాలానికి ఫలాలనూ, కందమూలా లనూ భుజించడం కూడా మాని వేశాడు.

కేవలం తులసీతీర్థంతోనే ప్రాణాలు నిలుపుకుంటూ, తపస్సు ద్వారా అనేక సిద్ధులు

సాధించాడు. నీళ్ళ మీద నడ వగలిగే వాడు. గాలిలో ఎగరగలిగేవాడు. అయినా

లౌకికశక్తులన్నీ కేవలం క్షణి కాలు; మరణాన్ని జయించే మహొన్నత స్థితిని

పొందాలి, అదే శాశ్వతమైనది అని భావించి తన కఠోర తపస్సును కొనసాగించాడు.

శశాంకుడు చేస్తూన్న తపస్సు గంధర్వలోకంలో కలవరం పుట్టించింది. శశాంకు డు

చేస్తూన్న కఠోర తపస్సును చూసి గంధర్వులు ఆశ్చర్యపోయారు. తన సింహాసనం

ఆక్రమించడానికే శశాంకుడు ఇలా కఠోర తపస్సు చేస్తున్నాడని అనుమానించి

గంధర్వరాజు భయకంపితుడయ్యాడు. శశాంకుడిచేత ఏదైనా పాపకార్యం చేయిస్తే ఆయన

తపోశక్తి నశించిపోగలదని ఆశించి, అందుకొక పథకం ఆలోచించాడు.

గంధర్వరాజు దైవజ్ఞుడి రూపంతో సువర్ణపురికి వెళ్ళి రాజును దర్శించి, “రాజా! తమ కుమారుడు స్వర్ణకీర్తికి ఈ భూప్రపంచానికే చక్రవర్తి అయ్యే యోగం

ఉన్నది. అయితే చిన్న అవరోధం ఏర్పడింది. దానిని తొలగించడం తండ్రిగా నీ

బాధ్యత కాదా?” అన్నాడు.

“నా బాధ్యత నెరవేరుస్తాను. ఏమిటో సెలవివ్వండి స్వామీ,” అన్నాడు రాజు.

“సర్వజీవకోటి యాగం చేయాలి. అంటే, మీ రాజ్యంలో వున్న జంతు

పక్షిజాతులన్నింటి లోనూ ఒక్కొక్క ప్రాణిని తెచ్చి యజ్ఞంలో బలి ఇవ్వాలి,” అన్నాడు దైవజ్ఞుడు.”అలాగే!” అన్నాడు రాజు. “అయితే ఒక్క విషయం!” అని ఆగాడు దైవజ్ఞుడు. “ఏమిటి?” అని అడిగాడు రాజు. “జంతు వులను మామూలు మనిషి బలి ఇవ్వకూడ దు.

ఆకలి దప్పులను జయించిన తపోసంపన్నుడే ఆ పని చేయాలి. తులసి తిర్థంతోనే

ప్రాణాలు నిలుపుకున్న తపశ్శాలి అయితే మరీ ఉత్తమం!” అన్నాడు దైవజ్ఞుడు. “అలాంటి తపోధనుడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు రాజు. “ప్రయత్నిస్తే ఫలితం

సిద్ధిస్తుంది! మనోరథ సిద్ధిరస్తు,” అని ఆశీర్వదించి దైవజ్ఞు డు అక్కడి

నుంచి వెళ్ళిపోయాడు.

తన కుమారుడు చక్రవర్తి కాగలడన్న ఊహ రాజు హృదయంలో ఆనందతరం గాలను

పుట్టించసాగింది. ఎలాగైనా యజ్ఞాన్ని చేసి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు.

రాజ్యంలోని జంతు పక్షిజాతులన్నింటిలోనూ ఒక్కొక్క దానిని యజ్ఞానికి సిద్ధం

చేయమని భటులను ఆజ్ఞాపించాడు. రాజ్య ప్రజల క్షేమం కోసం మునుపెవ్వరూ చేయని

సర్వజీవకోటి యజ్ఞం చేస్తున్నట్టు చాటింపు వేయించాడు. ఆ యజ్ఞాన్ని

జరిపించడానికి ఆకలిదప్పులు లేని తపోసంపన్ను డు కావాలనీ, అటువంటి మహనీయుడు

కంటబడితే తెలియజేయమనీ ప్రకటించాడు.

ఐదవరోజు ఒక బోయవాడు రాజదర్శనానికి వచ్చి, అడవిలో ఒక ముని తప స్సు చేస్తున్నాడని, ఆయన ఆహారం తీసుకోవడం తాను ఎన్నడూ చూడలేదనీ చెప్పాడు.

రాజు మంత్రిని పిలిచి, “తమరు వెంటనే వెళ్ళి, ఆ మునిని యజ్ఞ నిర్వహణకు

పిలుచుకురండి. ఆయన ఏది అడిగినా ఇవ్వడానికి వెనుకాడకండి,” అని ఆజ్ఞాపించాడు.

మంత్రి బోయవాడి వెంట అరణ్యానికి వెళ్ళి, శశాంకుణ్ణి కలుసుకుని సంగతి

వివరించి,” మహాత్మా, రాజ్యానికి అంతటికీ క్షేమం సమకూర్చే యజ్ఞం మీహస్తాలతో నిర్వహించాలి. ప్రత్యుపకారంగా మీరేం కోరినా ఇవ్వడానికి మహ రాజు

సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు, రాజు తమను తన ప్రధాన సలహా దారుగా

నియమిస్తారు. భావితరాలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దడానికి వీలుగా మీకు

ఆశ్రమ సమీపంలోనే గురుకుల పాఠశాలను ఏర్పాటుచేయగలరు,” అన్నాడు. అయితే

శశాంకుడు అందుకు అంగీకరించక తల అడ్డంగా ఊపుతూ, “యజ్ఞంపేరుతో జంతువులను

వధించడం పాపం. అది నా సిద్ధాంతాలకు విరుద్ధం,” అన్నాడు.

“రాజుగారుతమకు ప్రశాంతమైన ఉద్యానవ నం మధ్య బ్రహ్మాండమైన భవనం నిర్మించి ఇవ్వగ లరు.

అందులో మీరు సకలవిధ సౌఖ్యాలనూ అనుభవించవచ్చు,” అన్నాడు మంత్రి. “అవన్నీ

మానవులు ఆశించతగ్గ గొప్ప సంపదలే కావచ్చు. నా లక్ష్యసాధనకు అరణ్యమే సానుకూల

ప్రదేశం,” అన్నాడు శశాంకుడు. మంత్రి మరేమి మాట్లాడలేక రాజ్యానికి

తిరిగివచ్చి, రాజుకు జరిగిన సంగతి చెప్పాడు. రాజు ఆవేశంతో, “ఆ తపస్వికి, నా కుమార్తెనిచ్చి వివాహం జరిపించి, నా రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పు,” అన్నాడు.

రాకుమారి భార్గవి తండ్రి మాటలు విని దిగ్భ్రాంతి చెందింది. కుమార్తె

భయాన్ని గ్రహించిన రాజు, “భయపడకు, మొదట యజ్ఞం పూర్తికానీ. ఆ తరవాత

జరగవలసినవన్నీ నేను చూసుకుంటాను,” అని ధైర్యం చెప్పాడు. మునిని

వంచించాలన్న తండ్రి కుతంత్రం నచ్చకపోయినప్పటికీ, ప్రజల క్షేమందృష్ట్యా

భార్గవి తండ్రి మాట కాదనలేక మౌనం వహించింది.

రాకుమారి మంత్రి వెంట అరణ్యానికి బయలుదేరింది. మంత్రి మునిని దర్శించి, “మహాత్మా! తమరు వచ్చి యజ్ఞం జరిపించినట్టయితే, మా రాకుమారి భార్గవి తమకు

అర్ధాంగి కాగలదు. రాజు మార్తాండవర్మ తదనంతరం తమరే సువర్ణపురాధీశులు

కాగలరు. ఇది మహారాజుగారి విన్నపం!” అన్నాడు.

శశాంకుడు యువరాణిని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్థుడయ్యాడు.

అనిర్వచనీయమైన విచిత్ర అనుభూతికి లోనయ్యాడు. అంతవరకు ఉన్న జీవిత

లక్ష్యాన్ని మరిచిపోయి, “ఈ సౌందర్యరాశిని వివాహమాడి, రాజ్యానికి

రాజునవుతాను. సరే.. అలాగే,” అన్నాడు. మంత్రి తెచ్చిన బంగారు రథం ఎక్కి

రాజధానికి చేరుకున్నాడు.

యజ్ఞవాటిక సిద్ధమయింది. వేలాది జంతువులు, పక్షులు విశాలమైన మైదానంలోకి

చేర్చబడ్డాయి. రాజూ, మంత్రీ వెంటరాగా శశాంకుడు చేతిలో ఖడ్గం ధరించి

యజ్ఞకుండాన్ని సమీపించాడు. యజ్ఞకుండానికి పక్కన బలికి సిద్ధంగా ఒక ఏనుగునునిలబెట్టారు. ప్రథమ బలిగా ఏనుగును నరకడానికి శశాంకుడు ఖడ్గాన్ని

పైకెత్తాడు. జరగనున్న దారుణాన్ని గ్రహించి ఏనుగు భయంతో తొండమెత్తిఘీంకరించింది. మరుక్షణమే అక్కడ చేరిన జంతువు లన్నీ ఒక్కసారిగా దిక్కులు

పిక్కటిల్లే విధంగా దీనంగా విలపించాయి. శశాంకుడు ఉలిక్కిపడి ఒకసారిచుట్టుపక్కల కలయచూసి, చేతిలోని ఖడ్గంతో తన శిరస్సు యజ్ఞకుండలో పడేలా

ఖండించుకున్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా! శశాంకుడు రాకుమారి అద్భుత సౌందర్యానికి

ముగ్ధుడై, రాజ్యకాంక్షతో జంతుబలి ఇవ్వడానికి అంగీకరించాడు కదా? మరి, జంతువులకు బదులు తన శిరస్సునే ఖండించుకున్న ఆయన విపరీత చర్యకు కారణం

ఏమిటి? జంతువులన్నిటినీ ఒకే చోట ఒక్కసారిగా చూడడంతో భయబ్రాంతుడై చిత్త

చాంచల్యానికి లోనయ్యాడా? లేక రాజు మనోగతాన్ని గ్రహించి యజ్ఞం కాగానే తనను

మోసగించగలడని ఊహించి, ఆశాభంగంతో ఈ దారుణానికి పూనుకున్నాడా? శశాంకుడి

దారుణ చర్యకు అసలు కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా

చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “శశాంకుడు శిరస్సు ఖండించుకోవడానికి కారణం ఆయన

భయభ్రాంతుడు కావడమో, చిత్తచాంచల్యానికి లోనుకావడమో, ఆశాభంగానికి

గురికావడమో కాదు. శశాంకుడు ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి లేని

సత్యాన్వేషి అన్న సంగతి మరిచిపోకూడదు. అటువంటి విరాగి రాకుమారిని చూడగానే

విచిత్రమైన అనుభూతికిలోనై, రాజ్యకాంక్షతో మంత్రి వెంట బయలుదేరాడు. అది

గంధర్వుల మాయాజాలం! అంటే గంధర్వులు ఆయన మనసులో భ్రమను కల్పించారు. ఏనుగు

ఘీంకారం; జంతువుల, పక్షుల దీనాలాపనలు మంచు తెరలాంటి ఆ భ్రమను తొలిగించాయి.

ఆ క్షణమే ఆయన తన తప్పును గ్రహించాడు. ఇన్ని అమాయక ప్రాణులను బలి ఇవ్వడా

నికి అంగీకరించిన పాతకానికి ఈ జన్మలో నిష్కృతి లేదని భావించాడు. ప్రాయ

శ్చితంగా శిరస్సును ఖండించుకుని మునుముందైన పరిణితి చెందిన మానవు డిగా

జన్మించి, తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్న ఆశయంతోనే ఆ చర్యకు

ఒడిగట్టాడు!” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయ మై, తిరిగి చెట్టెక్కాడు. -(కల్పితం)





Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!