Posts

Showing posts from 2014

పెద్దాపురం పెళ్లి .!

Image
 పెద్దాపురం పెళ్లి .! .  నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి.  ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. .  మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మలు  ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిర

"ఆరుద్ర బాతాఖూనీ"

Image
'జ్యోతి' పత్రికలో అచ్చుతప్పులపై ఆరుద్ర "ఆరుద్ర బాతాఖూనీ" పేరిట ఓ శీర్షిక నిర్వహించేవారు. అందులో కొన్ని అచ్చు తుప్పులు చెత్తగించండి! ) . 'చల్ మోహన రంగా ! నీకు నాకు జోడు కరచెను గదరా! . చచ్చు బుడ్డి బాగా వెలగదు.! . డాక్టర్లు రోగుల పర్సు చూసి వైద్యం చేస్తారు! . అక్షరాలు మారటం వల్ల అర్ధం ఎలా మారుతుందో ఆరుద్ర చమత్కారంగా చెప్పారు! x

లవణరాజు కల.!

Image
లవణరాజు కల' గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం.! . ఇతివృత్తం.! . లవణుడు కొలువుదీరి గారడీ చూడడం, ఒక తెల్లని గుర్రము పుట్టడం, అతను దాని మీద ప్రయాణము చేయడం, అది అంతటా తిరిగి ఒక అడవిలో పడగా ఒక చెట్టుతీగవల్ల క్రింద వాలడమూ, ప్రయాణ బడలిక వల్ల నిదుర చెందడం, అపుడిలా కలగాంచడం. అదియొక సంధ్యా సమయము. ఆకలితో వున్న లవణరాజుకు మధురగీతం వినిపించింది. లవణుడా వంక కెళ్ళాడు. ఒక సుందరి కనిపించింది. ఆమెపై మనసుపడి ఆమె ప్రేమను కోరి ఆరగించాడు. ఆమెను వివాహమాడి ఆ మాలపల్లెలోనే ఉన్నాడు. ఇంతలో మామ మరణించాడు. మాలవాడను మడ్డితన మల్లుకుంది. లవణదంపతులు అడవిని బట్టారు. సతీపతులు ఇద్దరూ చితిలో దూకారు. తరువాత లవణుడు మేల్కొని తన స్వప్నసుందరికై విచారింపసాగాడు. ఇంతలో ఆ స్వప్నసుందరి వచ్చింది. అందర్నీ అద్భుతాశ్చర్యాలు అలుముకున్నాయి. లవణుడు ప్రియా పరిశ్వంగములో ఒళ్ళు మరిచాడు. దీనిని గురజాడ బహు నిపుణంగా అద్భుత సన్నివేశాలతో నడిపాడు . కొన్ని పద్యాలు.! మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరు వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి, కులము కలదట నరుల వ్

సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.! (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) .

Image
సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.! (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) . సీ. కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు కాఁబోలు వీరు విగత జీవబాంధవు-లడలుచుండిరి మహార్తారవములఁ గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌-నెమకుచుండిరి కపాలముల కొఱకు గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-పలలంపు బువ్వంపు బంతి సాగెఁ జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల. . గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల మసనమునఁ గాల్పరే కద మనుజులార? కాఁపు లేదనుకొంటిరేమో పదండు దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు. ....... శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌ నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌. .......... ఓహో! ఎవ్వతె వీవు? స్రగ్ధర: పడతీఁ యేకాకివై నిర్భయమున నిటకున్‌ వచ్చి నా యాజ్ఞ లేకీ నడిరేయిన్‌ వల్లకాట న్శవ దహన విధి న్సల్పుచున్నావుగా! ఛీ చెడుగా చాల్లాలు పోపో చె

రామయణం అంతా విన్నాక...అడిగిన ప్రశ్న.!

Image
రామయణం అంతా విన్నాక...అడిగిన ప్రశ్న.! x

కిన్నెరసాని పాటలు...........................................1. కల్పన.!

Image
కిన్నెరసాని పాటలు...........................................1. కల్పన.! . కిన్నెర మహాపతివ్రత. అందరు తెలుగుకన్నెలకు మల్లేనే ఉద్విగ్నహృదయ. ఎక్కువ తెలుగుకుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ళ పోరాటం ఆ యింట్లోనూ వెలిసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కిన్నెరమీద నిందలారోపించడం పని అయింది. ఒకప్పుడు ఆవిడ చేసిన నింద భరించడం కష్టమైంది. కిన్నెరహృదయం శోకంచేత ప్రళయసముద్రం అయింది. కిన్నెర భర్త ఏంచేస్తాడు? తల్లిని కాదనాలేడు, భార్యను ఓదార్చుకోనూలేడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు. . వనములను దాటి 'వెన్నెల బయలు' దాటి తోగులను దాటి దుర్గమాద్రులను దాటి పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు 'రాళ్ళ వాగు' దాటి పథాంతరములు దాటి అచట కిన్నెరసాని - నా యాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నదించు ...

వాతాపి గణపతిం భజేహం ..!

Image
వాతాపి గణపతిం భజేహం ..! . వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | | భూతాది సంసేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినత యోగినం విశ్వకారణం విఘ్నవారణం పురాకుంభ సంభవమునివర ప్రపూజితం త్రికోణ* మధ్యగతం మురారీ ప్రముఖ ద్యుపాసితం మూలాధారా క్షేత్రాస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నితంతరం నిటల* చంద్రఖండం నిజ వామకర విదృతేక్షు దండం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | | . ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ కృతిలో త్రికోణ అనే పదం త్రిభువన గా, నిటల  . అనే పదం నిఖిల గా, ఘంటసాల గానంచేసిన వినాయక చవితి చిత్రంలో పాడారు.

ప్రమీలార్జునీయము.!

Image
ప్రమీలార్జునీయము.! . మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు.  ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు.  ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు.  అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

అద్వైతం.! .........(మహా కవి శ్రీ శ్రీ)

Image
అద్వైతం.! (మహా కవి శ్రీ శ్రీ) . ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు తంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణం_లో, నా జీవన నిర్వాణం_లో నీ మదిలో డోలలు తూగీ, నా హృదిలో జ్వాలలు రేగీ నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే, విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవవిహంగం నా పగిలిన మరణమృదంగం చిగురించిన తోటలలోనో, చితులించిన చోటులలోనో వలయములై చలించినపుడే, విలయములై జ్వలించినపుడే కాలానికి కళ్ళెం వేస్తాం, ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. నీ మోవికి కావిని నేనై, నా భావికి దేవివి నీవై నీ కంకణ నిక్వాణం_లో నా జీవన నిర్వాణం_లో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం (A.C.Swinburne తన రచనలలో, ముఖ్యంగా A Match అనే  గీతంల

'మాతృషోడశి'.!

Image
'మాతృషోడశి'.! 'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను .. ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి, . ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు. . ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.'

అమవస నిసి

Image
అమవస నిసి - ’పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర ’ఆకలి రాజ్యమ్ము’ నందు నిరుద్యోగ యువత కందించె దివ్యోపదేశ - మభిమానవతులైన అతివల బ్రతుకుల ’అంతు లేని కథ’ల నరయ జెప్పె - మానవ సంబంధ మాలిన్యముల నల్గు ’గుప్పెడు మనసు’ల గుట్టు విప్పె - అభ్యుదయ సమాజ మందు మార్గాలకై  ’రుద్ర వీణ’ల నెన్నొ మ్రోగ జేసె - ఒకొక ’టిది కథ కాదు’ – ’మరో చరిత్ర’! - యన్న స్థాయిలో ’చిత్రాల’ నతడు తీర్చె - ’దాద ఫాల్కే పురస్కృతి’ దక్కి, తనకు - ఆ పురస్కృతియే గర్వ మందె నాడు! ’బాల చంద్రు’డా? కాదయ! భారతీయ చలన చిత్ర నభో పూర్ణ చంద్రు డతడు! అతని మృతి చిత్రరంగాన కమవస నిసి! అతని స్మృతికి నివాళి, బాష్పాంజలిదియె!

పోతన - శ్రీమద్భాగవతం.!

Image
పోతన - శ్రీమద్భాగవతం.! . నీ దిక్కు గానివారికి నే దిక్కును లేదు వెదక నిహపరములకున్ మోదింపదలచువారికి నీ దిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా! (పద విభాగం: నీ, దిక్కు, కానివారికిన్, ఏ దిక్కును, లేదు, వెదకన్, ఇహ, పరములకున్,  . మోదింపన్, దలచువారికి, నీ, దిక్కే, దిక్కు, సుమ్ము, నీరజనాభా!) ‘ఓ పద్మనాభా (నాభిలో పద్మం కలిగి ఉన్న విష్ణుమూర్తి)! . నువ్వే ఆధారం (దిక్కు) అనుకోనివారికి ఎంత వెతికినా శరణు (దిక్కు) ఉండదు.  . ఈ లోకంలో, పరలోకంలో ఆనందంగా ఉండాలనుకునేవారికి నువ్వే ఆధారం,’ . అని రామావతారాన్ని స్తుతించారు,పోతన గారు.

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .!

Image
నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .! . ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం.  తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు. .  19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. ‘స్ర్తీ కి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వ

చిన్న జీవితం .!

Image
 చిన్న జీవితం .! . కొంత మందికి ఎప్పుడు దుఃఖంలో ఉండటం ఇష్టం ,  ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తారు ,  ప్రపంచం కూడా వాళ్లకి అలాగే కనిపిస్తుంది , . కొంతమంది మనసులో ఎంతో దుఖాన్ని దాచుకుని ప్రపంచానికి ఏంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు ,  మనిషికి కావలసినది తృప్తి , ఎదో లేదని భాదపడి  ఉన్నవాటితో ఆనందాన్నిపొందలేకపోతే జీవితాంతం వారు దుఖసాగారంలోనే మునిగి ఉండాలి , చిన్న జీవితం మీ కోసం జీవించండి , మీతో ఉన్నవారిని ఆనందంగా ఉంచండి

నందమూరి తారక రామారావు.!

Image
నందమూరి తారక రామారావు నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము . సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. . మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, . ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు  ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో.  . పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. . పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. . ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన

బుడుగు...

Image
అన్నట్టు చెప్పటం మరిచాను.  నాకేమో ఉంగాబాషా, పిచిక బాష, చికబాష, క బాష, బాష, ష అవన్నీ తెలుసు. నాకు కబాష సీగానపెసూనాంబ నేర్పింది. కానీ దానికి తెలుగు కూడా బాగా రాదు.  నన్ను బురుగు, బులుగూ అని అంతుంది. దానికి అసలు మాతలాద్దమే చేతకాదు. నాకిన్ని మాటలు ఎవరు నేర్పారు అనుకుంటున్నారా. రమణ.  వాడి ఫ్రెండ్ ఉన్నాడే బాపు వాడు నాకు ఆకారం ఇచ్చి, నా చేత చాలా వేషాలు వేయించాడులే.

బుడుగు వెంకటరమణ.!

Image
హాస్యమందున అఋణ అందె వేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మా!

ఘల్లున మ్రోవగ గజ్జెలు

Image
(మంచి పద్యం కవి గారు పేరు తెలియదు.నా గోల నుంచి.) . ఘల్లున మ్రోవగ గజ్జెలు ఘల్లున మ్రోవగ గజ్జెలు ఝల్లున పొంగెను ఎడదలు జవరాండ్రలకున్ తెల్లని గోవుల వెంబడి నల్లని గోవిందుడురుక నాట్యపు భంగిన్ నల్లనివాడైన బాలకృష్ణుడు తన తెల్లని ఆవులను తోలుకొని పోవుటకు సిద్ధమై, వాటివెంట ఉరుకగా, ఆయన పాదములకు ఉన్న గజ్జెలు ఘల్లుమన్నవి. ఆ రవము వినగానే నందవ్రజములో ఉన్న యవ్వనవతుల హృదయములు ఒక్కసారిగా ఝల్లుమని ఆనందంతో ఉప్పొంగాయి.

మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?

Image
మన వాళ్ళొట్టి వెధవాయిలేనా? . ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌! మళ్ళీ ముఖం వేలవేసినావ్‌?? సొర్గానికి పోయినా సవితి పోరు తప్పనట్టు అమరలోకం లాటి అమెరికాకి వచ్చినా ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం అనే పదార్థం మీ నాన్న బుర్రలో మోడరన్‌ థాట్స్‌ వున్న సైజులో కూడా లేదే అని గుక్క పట్టి దుఃఖిస్తున్నావా? నాన్సెన్స్‌!! డబ్బుల హోదా కులాల బాధా కన్న దేశంలో కన్నా యీ “ఉన్న” దేశంలోనే మిక్కుటవని ఖేదపడుతున్నావా? డబుల్‌ నాన్సెన్స్‌!! ఎవరో అన్నట్టు మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్‌!! . ఐనా అసలు తెలుగు వాళ్ళకి ఐకమత్యం అవసరం అన్న వాజెమ్మెవడో చెబితే వాడి జేజెమ్మ క్కూడా బేజారెత్తేలా ఒక్క ఘంట బిగిన ఏకధాటిగా లెక్చరిద్దును! దాంతో వాడు డంగై పోయి నాలిక్కటుకూ కటుకూ కరుచుకుని హన్నన్నా తొందరపడి పోయి మాటే గదా మన సొమ్మేం బోయిందని రెXంత మాటన్నానూ అని ఊళ్ళో వాళ్ళందరికీ మందువిందు యిచ్చి మరీ ప్రాయశ్చిత్తం చేసేసుకోడూ? కాకపోతే ఏవిటయ్యా ఐకమత్యంలో వున్న గొప్పతనం? తెలుగు వాడిని చూస్తే తెలీదూ నిజానికి ఐకమత్యం వల్ల వొచ్చేది గొప్పతనం కాదు గొప్ప పతనం అని! అసలూ, బృహన్నారదీయం పదహారో ఆశ్వాసంలో ఏమన్నాడూ “కాంపిటీషన్‌ ఈజ్‌ ద

***ఈనాటి సినిమాల గురించి భానుమతి గారి అభిప్రాయం***

Image
***ఈనాటి సినిమాల గురించి భానుమతి గారి అభిప్రాయం*** నేటి సినిమాల్లో కథా గమనం తీరు మారిపోతోందని, కథానాయకుడు, కథానాయికల పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీసేలా పాత్రలను రూపొందిస్తున్నారని సీనియర్ నటీమణి, బహుముఖ ప్రజ్ఞావంతురాలైన భానుమతీ రామకృష్ణ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. మేలిమి బంగారం లాంటి నాటి సినిమాల్లో అల్లరి మూకల నుంచి తనను కాపాడిన వాడికి హీరోయిన్ మనసిచ్చి ప్రేమించేదని, నేటి సినిమాల్లో ప్రతినాయకుడిలా ప్రవర్తించే హీరోనే కథానాయిక ప్రేమిస్తున్నట్లు చూపించడం వైపరీత్యమేనని ఆమె అనేవారు. సినిమా పరిశ్రమలో కాలూనిన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ చెన్నై నగరాన్నే తన శాశ్వత చిరునామాగా చేసుకున్న డాక్టర్ భానుమతి ఏ తెలుగు లేదా తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేటి సినిమాల్లోని ఇలాంటి విపరీత ధోరణులను ఖండించేవారు. అంతేగాక తాను రాసిన తన స్వీయ చరిత్రలో సైతం ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆమె ఈ వ్యాసకర్తకు స్వయంగా చెప్పారు. నాటి సినిమాల్లో విలన్ లక్షణాలు కథకు తగ్గట్టుగా ఉండేవని, నేటి చిత్రాల్లో విలన్ అంటే నరరూప రాక్షసుడిగానే చూపిస్తూ ఆ పాత్ర చేత భయానకమైన పనులు చేయ

బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.!

Image
బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.! . ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తమ ఊర్వశీ ప్రవాసం లోంచి వివరాలీ విభావరీ విలాసాల నీ మసలు చరణ మంజీరము గుసగుసలో అన్న గేయం విన్నప్పుడు చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము అన్నీ మాయమయి పొయి నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో ఆ రాత్రంతా నిద్రపోలేదు. x

నారాయణతీర్థులు.!

Image
నారాయణతీర్థులు.! . ’కృష్ణలీలా తరంగాలు’ . .కృష్ణంకలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం.... . అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .! . నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు. బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు. తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?" "బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..." "అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"! "ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ "ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..." "ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప... మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారిక

“పోతన్న తెలుగుల పుణ్యపేటి.”

Image
“పోతన్న తెలుగుల పుణ్యపేటి.” . “నా గీతం జాతిజనుల గుండెలలో ఘూర్ణిల్లా”లని ఆకాంక్షించాడు ఆధునిక కవి.. . ఆ కొలబద్దకు సరిగ్గా అతికిపోయే కవి పోతన. . ఆయన పద్యాలు జాతిజనుల గుండెల్లోనే కాదు రసనల మీద కూడా నివసిస్తున్నాయి .. విశ్వనాథ వారన్నట్లు “పోతన్న తెలుగుల పుణ్యపేటి.” . సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల? సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేల? వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల? గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేల? తే. ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదుజలముల నుండవే సకల నదులు పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు ధన మదాంధుల కొలువేల తాపసులకు ఈ పద్యం బమ్మెర పోతనామాత్యునిది. ఆయన ఆంధ్రీకరించిన మహాభాగవతం ద్వితీయ స్కంధం . పడుకోడానికి ఇంత నేల ఉండగా తల్పాలూ శయ్యలూ కావాలా? తినడానికి దేవుడిచ్చిన చేతులుండగా బంగారూ, వెండీ పళ్ళాలు కావాలా? నార చీరలూ, పట్టలూ ఉండగా పీతాంబరాలు అవసరమా? ఉండటానికి గుహలుండగా ఆశ్రమాలూ ప్రాసాదాలూ అవసరమా? తినేందుకు చెట్లు పండ్లిస్తుండె, తాగేందుకు నదులు నీరిస్తుండె. ఇంటింటా ఉం

హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు?.

Image
హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు?. . . హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్నది చాలా మంది దంపతులకు తెలీదు.  మన సంస్కృతీ, సంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడడం ఆచారం.  . పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు. . అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు. .  పెళ్ళీ డు వచ్చిన ఆడపిల్లలు చక్కగా చూడముచ్చటగా ఉంటారు.  . వివాహానికి యోగ్యమైన అమ్మాయిని చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా అగ్ని ఆమెను రక్షించగా అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు. . అందుకని “అగ్నిసాక్షిగా పెళ్లి ” అనే మాట వచ్చింది. . వేదాలలోని ప్రధమ శబ్దం అగ్ని, ఆ అగ్నిని ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు. “దారాధీన స్తథా స్వర్గః పిత్రూణా మా త్మన స్సహ “ . అని పెద్దలంటారు. తన పితృలందరికీ స్వర్గం లభించాలంటే, ముందుకాలంలో తానూ తరించాలంటే అది సాధ్యమయ్యేది, భార్య కనబోయే సంతానం ద్వారా కదా!  అలాంటి స్వర్గానికి తీసుకుపోగల అవకాశం బార్య ద్వారా లభిస్తుంటే ఆమెను గౌరవించాలి కదా!

పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.!

Image
పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.! . ఇందుగలడందులేడని  సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషం.  కాని అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ శ్రీహరినే ధ్యానించేవాడు. దాంతో కొడుకుపైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడా? అని కొడుకును ప్రశ్నిస్తాడు.  . అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానమే ఈ పద్యం. విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు. ఓ రాక్షసరాజా! ఇది సత్యం.  . ఈ పద్యంలో, ‘ఇందు, అందు, ఎందెందు, అందందే’ అనే పదాలు వచ్చాయి . ఇవన్నీ ఒకేలాంటి పదాలు కావటం వల్ల వినడానికి చాలా హాయిగా ఉంటాయి.  అంతేకాదు ఇలాంటివి నేర్చుకోవటం కూడా తేలిక.

భాగవతము - బొమ్మెర పోతనామాత్యుడు.!

Image
భాగవతము - బొమ్మెర పోతనామాత్యుడు.! . శా. కల్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణింపుచున్‌ ముక్త వై కల్యుం డెవ్వఁడు తృప్తు డౌ, నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్‌. ! . క. భూషణములు సెవులకు బుధ తోషణము లనేక జన్మ దురితౌఘ విని శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్‌. ! . (బొమ్మెర పోతనామాత్యుడు.) x

భాగవతం లోనూ నరకాసుర వధ ఘట్టం!

Image
భాగవతం లోనూ నరకాసుర వధ ఘట్టం! .అక్కడ పోతన వ్రాసిన ఆ పద్యాన్నీ చిత్తగించండి.. . పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. . . మ.  అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్ దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్ . పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. . చాలా ప్రసిద్ధమైన పద్యం

భాగవతము - రుక్మిణీ కల్యాణము.!

Image
భాగవతము - రుక్మిణీ కల్యాణము.! . మ.  . ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ ము\న్‌ గైకొన్న చందంబున\న్‌ జగతీనాథులఁ జైద్య పక్షచరులన్‌ సాళ్వాదులం గెల్చి భ ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుత\న్‌ రాజీవగంధిన్‌ రమా భగవత్యంశభవ\న్‌ మహాగుణమణి\న్‌ బాలామణిన్‌ రుక్మిణిన్‌. . x

అన్నమాచార్య కీర్తనలు.!

Image
అన్నమాచార్య కీర్తనలు ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!! ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది యీ పాదమే కదా యెలమి( బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!! యీ పాదమే కదా యిభరాజు దల(చినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!! యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!! బ్రహ్మ కడిగిన –పాదము బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!! 1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము బలితలమోపిన పాదము తల(కక గగనము దన్నిన పాదము బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!! 2.కామిని పాపము గడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!! 3.పరమ యోగులకు( బరిపరి విధముల పరమొస(గెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

Image
దేవాదిదేవ.!..........కరుణశ్రీ. . తెల వారకుండ మొగ్గలలోనజొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసి పోయితివేమొ దేవాదిదేవ ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు కూర్చుండ మా యింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి x

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

Image
ప్రాభాతి.!............(కరుణశ్రీ.) . . రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా! x

మన గిరీశం.:---

Image
మన గిరీశం.:--- . నువ్వు "టెల్గూ" వాడివి కావూ ? " అయినవారికి ఆకుల్లో , కానివారికి కంచాల్లో" అన్న అచ్చ "టెల్గూ" సామెతను గౌరవించవూ ? ఆ నానుడికి ఆర్ధమేమిటిట !..  విసిరిపారేసే విస్తర్లలో అయినవారికి, కడిగి దాచుకొనే కంచాల్లో కానివారికి వడ్డించాలనే కదా !  మరి ఆ సామెతకు పట్టం కట్టాలన్న "సత్సంకల్పం"తోనే కదూ , మీ "కొత్త మేస్టార్లు"న్నూ .. స్కూళ్లల్లో నుంచి మనదైన తెలుగును ఆవలకు నెట్టి , మనది కాని ఇంగ్లీషును అందలమెక్కిస్తుంట !.  జాగ్రఫీ, గీగర్ఫీ, ఆల్జీబ్రా , ఇంగ్లీషుతోపాటు తెలుగులోనూ నా వద్ద శిష్యరికం చేసిన నీకు ఇంత చిన్న విషయం అర్ధం కాకపోవడమేమిటోయ్ !  అసలు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. అటువంటిది ఎడ్యుకేషన్ లో నా దగ్గర తర్ఫీదైన నువ్వు ఇలా మాట్లాడటమేమిటి!  "సున్నా" గొప్పదనాన్ని గుర్తించకుండా ఎంతసేపూ ఒకట్లు , పదులూ అంటూ నువ్వు అంకెల్నే పట్టుకుని వేలాడింది చాలక , నా సావాసం చేయడం చేతనే నిన్ను మీ కొత్త మేస్టార్లు పక్కన పెట్టారని అభాండం వేస్తావ్ ?  "ది ఎలెవన్ కాజెస్ టు అడోర్ ది జీరో" విషయమై నేనిచ్చిన లెక్చర్లు వంట

పెళ్లి అయిన కొత్తలో.:--

Image
పెళ్లి అయిన కొత్తలో.:-- మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు. అందులో ఈ గేయం ఉంది.  . పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు పాపాయి దంతాలు మంచి ముత్యాలు . నాకు ఏమి అర్ధం కాలేదు. మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు. మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది. నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను. ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు.. కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది. సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్నాను. మొత్తానికి చాలాసార్లు ఈ

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు....

Image
సంపదలో మరుపులు ఆపదలో అరుపులు........ దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అని దాశరధి గారు ధైర్యం తెచ్చుకుంటే దేవుడికేం హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు అంటూ శ్రీ శ్రీ గారు బాధపడతారు దేవుడ్ని గురించిన నిరంతర చింతన సృష్ట్యాది నుండీ జరుగుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుణ్ణి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. పాలకడలిపై శేషతల్పం మీద పడుకున్నావా దేవా అని ఒక భక్తుడు దేవుడి సౌఖ్యాన్ని చూచి పులకరించిపోతాడు. అఖిల జగతిని సృష్టి జేసి, ఆడి పాడి అంతలోనే ఈ బొమ్మలాట ఆపుతావు నటన సూత్రధారీ అని ఒక కవి చమత్కరిస్తాడు. అసలు దేవుడనే వాడు ఉన్నాడా అని మనిషికి సందేహం కలిగితే, మనుషులనే వారున్నారా అని దేవుడికే అనుమానం వచ్చిందని ఒక సందేహాల స్వామి సెలవిస్తాడు. పండితులంతా దేవుణ్ణి గురించి పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంటే జాన పదులు గూడా దేవుడి మీద పరిశోధనలు చేసి పద్యాలల్లారు. పళ్ళు ఊడిన ముసలోళ్ళు మాత్రం దంతాలు పటపటా కొరుకుతున్నారు. సి. నారాయణ రెడ్డి కూడా అట్లాంటి దేవుడి నీడలో వేదన మరచి పొమ్మంటాడు. అయితే ఆరుద్ర, ఆత్రేయ లాంటి వాళ్ళకు దేవుడు ఒక్కడే అన

ఆచార్య ఆత్రేయ....

Image
ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు.  అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో.  ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, .  డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీ గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు. . వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.

దంపతులు..:-

Image
దంపతులు..:- నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.  . నేనేం మాట్లాడుతున్నానో నీకు బోధపడడం లేదు. . అయినా కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకొంటూనే ఉన్నాం "  ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా?  . "ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే... అందుకే ప్రేమిద్దాం...  . ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం....

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ:--

Image
"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...భోజ్యేషు మాతా శయనేషు రంభా. .అపురూపమైనదమ్మ ఆడజన్మ.... ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..." అని ఓ పక్కన రాస్తూనే ఉంటారు...ఇంకో పక్కన ఇల్లాళ్ళు అగచాట్లు పడుతూనే ఉంటారు. . ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే.... "నీ సాధింపు తట్టుకోలేకపోతున్నా" అంటూ తాగి వస్తారు. "తాగేప్పుడు మీకు ఇల్లాలు జ్ఞాపకం ఉండదా" ??? అంటూ ప్రశ్నిస్తుందా అమాయక ఇల్లాలు.. "నిజం చెప్పమంటావా ? తాగినప్పుడు నేను ప్రతి బాధనూ మరిచిపోతాను" అంటాడు భర్త. పెళ్ళికి ముందు "నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం" అన్న వ్యక్తి పెళ్ళైన తరువాత ఇలా ఎలా మాట్లాడేస్తాడు ? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.  ఇదేదో బలవంతపు పెళ్ళో లేక పెద్దలు కుదిర్చి చేసిన సాంప్రదాయాల పెళ్ళిళ్ళ విషయంలోనోనే కాదు జరుగుతున్నది... "నీకు నేనూ, నాకు నువ్వూ...ఒకరికొకరం నువ్వూ నేనూ..." అనుకొంటూ పెద్దలను, సమాజాన్ని సైతం ఎదిరించి పెళ్ళి చేసుకొన్న ప్రేమైక జీవుల వ్యధ కూడా.... "ఎందుకిలా ?" అని అడగడం కూడా అనవసరమే... దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలుసు... కాకపోతే ఎవరి చేదు వారిది.....

భూషణములు వాణికి నఘ పేషణములు .....

Image
పోతన - శ్రీమద్భాగవతం ! . భూషణములు వాణికి నఘ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు గల్యాణవి శేషణములు హరిగుణోపచితభాషణముల్! . పదవిభాగం:  భూషణములు, వాణికిని, అఘ, పేషణములు, మృత్యు, చిత్త, భీషణములు, హృత్తోషణములు, కల్యాణ, విశేషణములు, హరిగుణోపచిత, భాషణముల్. . భావం: విష్ణుమూర్తిని వర్ణిస్తూ, ఆయనలో ఉన్న సుగుణాలను కీర్తిస్తూ పలికే పలుకులు  సరస్వతీదేవికి అలంకారం అవుతాయి. అంతేకాదు సకల పాపాలను పోగొడతాయి. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మృత్యువును నివారిస్తాయి. శుభాలు కలుగచేస్తాయి.

‘పాడుతా తీయగా సల్లగా...’

Image
నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో  ‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి;  . ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు. ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి. ‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన.. ‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో- కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం. ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో - గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

వాలీ, కర్ణుడూ!

Image
వాలీ, కర్ణుడూ! . విజేతలంటే ఎవరికైనా ఇష్టమే! కానీ పరాజితుల్లోనూ కొందరు తమ ప్రత్యేక లక్షణాలతో ఆకట్టుకుంటారు. పురాణేతిహాసాల విషయానికొస్తే... రామాయణంలో వాలీ, భారతంలో కర్ణుడూ అలా నాకు ఇష్టంగా అనిపిస్తారు. ఇద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. చెట్టు చాటు నుంచి దూసుకొచ్చిన రామబాణానికి వాలీ;  రథం కుంగి నిస్సహాయంగా ఉన్నపుడు అర్జున బాణానికి కర్ణుడూ! భీష్ముడు అర్థరథుడిగా చేసి అవమానించినా తర్వాత కౌరవ సేనకు సర్వసైన్యాధిపత్యం వహించిన కర్ణుడి పేర ఏకంగా ఓ పర్వమే ఉంది; ‘కర్ణుడు లేని భారతం’ అని మాట పుట్టింది. ఈ స్థాయిలో వాలికి, రామాయణంలో ప్రాధాన్యం లేకపోయినా ఆ పాత్రలో ఆకర్షణ ఉంది. ఎదుటివ్యక్తిలోని శక్తిని లాగేసుకునే ప్రత్యేకత వాలిది. సహజ కవచ కుండలాలు కర్ణుడి విశిష్టత. వీటివల్ల నాకు ప్రాథమికంగా ఆ పాత్రలపై ఆసక్తి పెరిగి వుండొచ్చు. వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, సుగ్రీవుడు అన్నను నిందిస్తూ యుద్ధానికి రమ్మని సవాలు విసురుతుండగా కిష్కింధ అంత:పురంలో వాలీ, తారల మధ్య నడిచే సంభాషణ ఎంతో భావగర్భితంగా ఉంటుంది.  . కర్ణుడి విషయానికొస్తే.. తనను ఆదరించిన కౌరవుల పక్షాన చివరిదా

ఒక ఝలక్

Image
ఒక ఝలక్  . * ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు.  నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు!  మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. .

Image
సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. . . "మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.! . ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా. . అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"న

అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు....By Smt.Kondaviti Satya vathi .

Image
అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు....By Smt.Kondaviti Satya vathi . . నా జీవితంలో ప్రేమకే స్థానం పూజకి లేదు . నా చేతులు పాటుపడతాయ్ ప్రార్ధన చెయ్యవు . నా కోరికలు నేను తీర్చుకోవాల్సినవే ఏ శక్తి,భక్తి తీర్చేవి కావు . నా సాష్టాంగ ప్రణామం నా కన్నవాళ్ళకే కపట సన్నాసులకు కాదు . నాకు జీవితమంటే అలుపెరుగని పోరాటమే అర్ధింపులు,వేడికోళ్ళు అస్సలుండవ్ . నా ఇంట్లో పూజ గదులుండవ్ ప్రేమ గదులుంటాయ్ పుస్తకాల గదులూ ఉంటాయ్ . నన్ను నేను సమర్పించుకునేది నా లోని ఆత్మవిశ్వాశానికే ఏ అతీత శక్తికో ,మరేదో అదృశ్యశక్తికో కానే కాదు ప్రజలు పోరాటాలు మర్చిపోవాలంటే గుళ్ళవేపు తోలెయ్యడమే . భూములు దురాక్రమించాలనుకుంటున్నావా ఏం ఫర్వాలేదు అక్కడో గుడి కట్టేయ్ . ప్రజల కళ్ళు గుళ్ళ మీద నీ కళ్ళు భూముల మీద . ఆధునిక ఆదాయ వనరు అడ్డదిడ్డంగా కట్టేసిన గుళ్ళు . అమ్మ గుళ్ళంటూ కట్టి చూపించేది మళ్ళీ అంగాంగ ప్రదర్శనే . ప్రభుత్వ కార్యాలయాల్లో పూజలా??? సెక్యులరిజం జిందాబాద్ . గవర్నమెంటాఫీసులు ప్రలందరివీ పూజలు చేసే హక్కు ఎవ్వరికీ లేదు . పూజ వ్యక్తి

ఒక స్త్రీ స్వగతం....

Image
ఒక స్త్రీ స్వగతం....  . అమ్మాయిలు - ఆంటీలు తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి. . 'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు. ఇలా పుట్టిన మాటల్లో . నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు. . ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

Image
సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.! . తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు:  . జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స య్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భా జనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్ . భావం:  మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

దేవుడా ఓ .. FB దేవుడా …

Image
దేవుడా ఓ .. FB దేవుడా … నాకు రాయడానికి ” WALL” ఇచ్చావ్ ..  నొక్కడానికి ” LIKE “ఇచ్చావ్ ..  తోక లాగ ” TAG ” పెట్టావ్ .. నస పెట్టడానికి ” CHAT ” అన్నావ్ .  గొప్పలు చెప్పడానికి ” STATUS ” ఇచ్చావ్ …  అందం చూపడానికి ” PHOTOS ” ఇచ్చావ్ …  అల్లరి పిడుగుల కి ” GROUP “లు పెట్టావ్ .. క్లాసు లీడర్స్ కి ” PAGE “లు చూపెట్టావ్ . .  న…వ్వులు ” OPEN ” అన్నావ్ ..  నసుగుడు “SECRET ” అన్నావ్ ..  చాడీలు “SHARE ” చెయ్ అన్నావ్ ..  “APPLICATIONS ” తో మాయ చెయ్ అన్నావ్ ..  నోట్స్ రాయని నాతో , Facebook లో ” NOTES ” రాయిస్తున్నావ్ ..  నా ” POST ” లని అందరికీ చూపించి , నవ్వులు పూయిస్తున్నావ్ ..  అందుకే నువ్వు నాకు నచ్చావ్ … I like you somuch

పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం..

Image
పోతన - శ్రీమద్భాగవతం....... పంచమ స్కంధం.. . బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే నెండమావుల గని యేగు మృగము కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు నొక్కచోట నిలువకుందురెపుడు . . ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు . డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు. లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు ఎక్కడా నిలకడగా ఉండక నిరంతరం పరుగులు పెడుతుంటారు. అల్పధనుడు విశ్రమాస్థానముల దృప్తి బొందకొరుల ధనము బొందగోరి యరిగి వారి వలన నవమానముల బొంది యధికమైన దుఃఖమనుభవించు . ధనం తక్కువగా ఉన్నవాడు, అంటే కొద్దిపాటి ఆస్తి మాత్రమే ఉన్నవాడు,  తనకు ఉన్న ధనం, గృహం, విశ్రాంతి మందిరాలతో తృప్తి చెందడు.  అంతటితో ఊరుకోక పక్క వారి ధనాన్ని కూడా పొందాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఇతరుల వలన అవమానాలు పొందుతాడు. అంతేకాక మరింత దుఃఖాన్ని అనుభవిస్తాడు. . అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది వినిమయమున గడుబ్రవృద్ధమైన వైరములను బొంది పోరాట వొందుదు రాత్మ చింతలేక యనుదినంబు . . కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన లావాదేవీల కారణంగా ఒకరితో ఒకరిక

ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి,.....

Image
ఎక్కడనో జనించి,పరమేశ్వరు డిచ్చిన గాలి పీల్చి, వే రొక్కరి జోలికేగక, యెదో భుజియించి , సరోవరాలలో  గ్రుక్కెడు నీళ్ళు గ్రోలి, విను త్రోవల నేగెడు రాజహంసపై  రక్కసి బుద్ధి చెల్లునె? మరాళ మరాళ శరాగ్ను లోర్చునే? -- కరుణశ్రీ.  (“కరుణశ్రీ” అనే కావ్యం నుండి. హంసను గాయపరచిన దేవదత్తునితో సిద్ధార్థుడు)