అమవస నిసి

అమవస నిసి

- ’పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

’ఆకలి రాజ్యమ్ము’ నందు నిరుద్యోగ

యువత కందించె దివ్యోపదేశ -

మభిమానవతులైన అతివల బ్రతుకుల

’అంతు లేని కథ’ల నరయ జెప్పె -

మానవ సంబంధ మాలిన్యముల నల్గు

’గుప్పెడు మనసు’ల గుట్టు విప్పె -

అభ్యుదయ సమాజ మందు మార్గాలకై 

’రుద్ర వీణ’ల నెన్నొ మ్రోగ జేసె -

ఒకొక ’టిది కథ కాదు’ – ’మరో చరిత్ర’! -

యన్న స్థాయిలో ’చిత్రాల’ నతడు తీర్చె -

’దాద ఫాల్కే పురస్కృతి’ దక్కి, తనకు -

ఆ పురస్కృతియే గర్వ మందె నాడు!

’బాల చంద్రు’డా? కాదయ! భారతీయ

చలన చిత్ర నభో పూర్ణ చంద్రు డతడు!

అతని మృతి చిత్రరంగాన కమవస నిసి!

అతని స్మృతికి నివాళి, బాష్పాంజలిదియె!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!