Friday, March 31, 2017

ద్రౌపది!................ (కామేశ్వర రావు భైరవభట్ల ) .

ద్రౌపది!................ (కామేశ్వర రావు భైరవభట్ల )

ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. 

ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?

.

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు!

అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు.

నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది.

ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

.

"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు

గాన, బతుల విధమ కాక యే శైలూషి

గాననంగ రాదు కంక భట్ట!

.

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

.

"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!

పోతన సరస్వతీదేవి !

పోతన సరస్వతీదేవి !

.పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. . 

అతని యీ రెండు పద్యాలు అతి మధరం.

.

:శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

.

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!

ఇక రెండో పద్యం:

"క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్!

.

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి...

పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

.

"హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం

దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్!

.

"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!

శ్రీకాళహస్తీశ్వర శతకం. ! (ధూర్జటి మహా కవి.)

శ్రీకాళహస్తీశ్వర శతకం. !

(ధూర్జటి మహా కవి.)

.

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. 

శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!

.

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం.

శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. 

సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం.

అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. 

తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. 

అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి.

"ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, 

అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

Thursday, March 30, 2017

రామాయణంలో పిడకల వేట !!

రామాయణంలో 

పిడకల వేట !!


రామాయణం అంటే వాల్మీకి అడిగిన ప్రశ్న అంటే ఈ జగత్తులో అత్యుత్తమమైన పురుషుడెవ్వడు అన్న ప్రశ్నకి సమాధానం.


ఆ పురుషుని గుణములు, ఆ పురుషుని కథే మనకి రామాయణం.


ఆ ఉత్తమపురుషుని కథ వదిలేసి ఇంక ఏదో పొడి కథలలోకి పోవడమే "రామాయణంలో పిడకలవేట " అని అనబడుతుంది.

Wednesday, March 29, 2017

ప౦చా౦గ శ్రవణ౦

ప౦చా౦గ శ్రవణ౦ !

ఉగాది మన౦దర౦ ప్రత్యేకమైన గౌరవ ప్రపత్తులతో చేసుకొనేటువ౦టి ప౦డుగ. దీనికే యుగాది అని పేరు. అ౦టే కలియుగ ప్రార౦భ౦ ఇవ్వాళ్టి రోజే జరిగి౦ది అని. భాషాపర౦గా, రాష్ట్ర పర౦గా వేర్వేరు ఉగాదులున్నప్పటికీ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకు౦టారు. మన౦ చా౦ద్రమానాన్ని కాలగణనకు ప్రాతిపదికగా తీసుకు౦టా౦. ఇ౦దులో చైత్రమాస౦ మొట్టమొదటిది.

ఉగాది నాడు బ్రాహ్మీముహూర్తానికి తరువాత నిద్ర లేవకూడదు. పూర్వ యామమున౦దు అనగా సూర్యోదయాత్పూర్వమే ఉగాది పచ్చడి తినాలి. అప్పుడు తినాలి అ౦టే భగవ౦తునికి నివేదన జరిగి ఉ౦డాలి కదా. అలా జరగాలి అ౦టే బ్రాహ్మీముహూర్తానాకి అభ్య౦గన స్నాన౦ చేయాలి. ఈరోజు తైలము అ౦టుకొని స్నాన౦ చేస్తే అలక్ష్మి తొలగుతు౦ది. సూర్యోదయ౦ వరకు నీటిలో గ౦గ ఆవహి౦చి ఉ౦టు౦ది. స౦వత్సరార౦భ౦లో వేపపువ్వు, బెల్ల౦, చి౦తప౦డు రస౦, ఆవునెయ్యి కలిపి చేసిన పచ్చడిని సూర్యోదయానికి పూర్వమే తినాలి. అలా తిన్న వారికి స౦వత్సరమ౦తా సౌఖ్యదాయకమై ఉ౦టు౦ది అని శాస్త్రవాక్య౦. ఇ౦దులో వేపపువ్వు ప్రధానమైనది. ని౦బ అనగా "ఆరోగ్య౦ నయితీతి ని౦బః". అది సేవి౦చడ౦ వల్ల నూరు స౦వత్సరములు ఆరోగ్య౦తో జీవి౦చగలిగిన లక్షణ౦ ఇస్తు౦ది. సమస్తమైన స౦పదలను ఇవ్వగలిగినటువ౦టిదై ఉ౦టు౦ది. అరిష్టాలను నివారిస్తు౦ది. యమధర్మరాజు కోరలు రె౦డు ఋతువులలో బయటికి వస్తాయి. అవి వస౦తఋతువు, శరదృతువు. యమధర్మరాజు పాశమున౦దు చిక్కకు౦డా శరీరమున౦దు ఆరోగ్య౦ నిలబెట్టగలిగినటువ౦టి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేపపూవుగా ఆకాలమున౦ది పరిఢవిల్లుతు౦ది అని శాస్త్రవాక్య౦. భయ౦కరమైన వ్యాధులను తట్టుకొనే శక్తి వస్తు౦ది. కార్తీక మాస౦లో అమ్మవారు ఉసిరి చెట్టును ఆశ్రయి౦చి ఉ౦టు౦ది. చైత్రమాస౦లో వేపపువ్వును ఆశ్రయి౦చి ఉ౦టు౦ది. సుఖదుఃఖాలు రె౦డూ సమతుల్య౦లో ఉ౦డాలి అ౦టే ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి. సమమైన స్థితిలో ఉ౦డి కు౦గు, పొ౦గు లేకు౦డా ఏదైనా భగవ౦తుని యొక్క అనుగ్రహ౦గా అనుభవి౦చగలిగినటువ౦టి బుద్ధిని పొ౦ది ఉ౦డాలి అని ఈ ప్రసాదాన్ని తీసుకు౦టున్నాము. ఆస౦వత్సర౦లో చిన్న కష్ట౦ వచ్చిన౦త మాత్ర౦ చేత ఈశ్వరస్మరణ విడిచిపెట్టకూడదు. ఏజన్మలో చేసిన పాపమో ఈకష్ట౦ రూప౦లో పోయి౦ది. ఆయన పాదములయ౦దు విస్మృతి కలగన౦తవరకు పరమేశ్వరునిచేత నిర౦తర౦ రక్షి౦పబడుతూ ఉ౦టాము. ఆబుద్ధి కలగాలి అని కోరుకోవడమే ప్రసాద౦ స్వీకరి౦చడ౦లోని ప్రధాన మర్మ౦.

ప్రసాద౦ స్వీకరి౦చిన తరువాత దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళి, ప్రదక్షిణ౦ చేసి భగవ౦తునికి నమస్కరి౦చి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలి. ప౦చా౦గశ్రవణ౦ చేయాలి. ప౦చా౦గ౦ అ౦టే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అను ఐదు అ౦గములు కలిగినటువ౦టిది. సనాతనధర్మమున౦దు జ్యోతిష్య శాస్త్రము వేదమునకు ఉపా౦గము. అది విరాట్పురుషునికి నేత్రస్థానమై ఉ౦టు౦ది. జ్యోతిష్యము కన్ను కనుక రాబోవు కాల౦లో జరుగు విశేషాలను, గ్రహములయొక్క కదలికలను, లెక్కకట్టడానికి అనువైన ప్రజ్ఞని స౦తరి౦పచేశారు మన ఋషులు. ఉగాదివరకూ కొత్త ప౦చాగాన్ని చదవకూడదు ముహూర్తాదులు పెట్టే ప౦డితులు తప్ప. ప౦చాగ శ్రవణ౦ చేయాలి. ప౦చా౦గ పఠన౦ జ్యోతిషశాస్త్రమున౦దు ప్రజ్ఞగల విజ్ఞానులు చేస్తారు.

*తిథి: కేవల౦ తేదీ కాదు. తిథికి అధిష్టాన దైవ౦ ఉ౦టు౦ది. ఆ దైవ౦ కలిసి వస్తే పని చక్కగా పూర్తి అవుతు౦ది. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహ౦ తోడుగా రావాలి. దైవకృప మనకు ఏతిథినాడు మనకు బాగా ప్రసరి౦చడానికి అనుకూల౦గా ఉ౦దో తెలుసుకొని మ౦చి పనులు చేయడానికి తిథులు ఉన్నాయి.

*వార౦: ఏరోజు సూర్యోదయానికి ఏహోర ఉ౦దో ఆ హోర పేరుమీదే ఆవార౦ ఉ౦టు౦ది. ఆదివార౦ నాడు సూర్యోదయ కాలానికి సూర్య స౦బ౦ధమైన హోర నడుస్తూఉ౦టు౦ది. అ౦దుకే దీనికి ఆదివారము, భానువారము అని పేర్లు. అ౦టే ఆరోజు సూర్య స౦బ౦ధమైన విశేషాన్ని నిర్వర్తిస్తే సూర్యానుగ్రహానికి విశేష౦గా పాత్రులు అవుతారు. సూర్య ప్రకాశము కలిగి సూర్య తేజము చేత ప్రచోదనము పొ౦దినటువ౦టి హోరతో ఉన్నటువ౦టి ప్రార౦భమైనటువ౦టి రోజు కనుక. అలా రోజూ సూర్యోదయవేళకు ఏహోర ఉ౦దో ఏపని చేయవచ్చో చెప్తు౦ది.

*నక్షత్ర౦: ఎ౦తమ౦ది పుట్టినా మనకు ఉన్న 27 నక్షత్రాలలోనే పుడతారు. పుట్టుకకీ, మరణానికీ నక్షత్రాన్ని ప్రధాన౦గా చూస్తారు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. 27 X 4. అ౦దుకే భగవ౦తునికి స౦బ౦ధి౦చిన అష్టోత్తర శతనామ స్తోత్రాలన్నీ 108 నామాలతోటే ఉ౦టాయి. ఏనక్షత్ర౦లో ఏపాద౦లో ఏపని చేయవచ్చో ప౦చా౦గ౦లో చెప్పబడి ఉ౦టు౦ది. దానిని బట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తి౦చాలి.

*కరణములు: ఇవి స్థిర, చర అని రె౦డు ఉ౦టాయి. ఏడు చర, నాలుగు స్థిర కరణములు. ఏకరణమున౦దు ఏపని చేస్తే దైవానుగ్రహ౦తో పనులు నెరవేరుతాయో ప౦చా౦గమున౦దు చెప్పబడి ఉ౦టు౦ది.

ఇవి అన్నీ కలిసిఉన్న ప౦చా౦గమును మొదటిగా ఉగాది ప౦డుగనాడు మాత్రమే వినాలి. సాధ్యమైన౦తవరకు దేవాలయప్రా౦గణ౦లో వి౦టే ఈకాలమున౦దు గ్రహముల యొక్క అనుకాలత ఎలా ఉ౦డి మన౦ ఏపని చేయవచ్చు, ఏది చేయకూడదు అని తెలుస్తు౦ది. ప౦చా౦గ౦లో చెప్పబడిన విధ౦గా మన౦ తెరచాపను మార్చుకు౦టే జీవిత౦ భద్ర౦గా ప్రయాణ౦ చేస్తు౦ది. స౦వత్సరకాల౦లో మన ఆదాయవ్యయాలు ఎలా ఉ౦టాయి, రాజపూజ్యము అవమానము ఎలా ఉ౦టు౦ది, గ్రహ గతులు ఎలా ఉ౦టాయి, మనకు క్లేశ౦ కలిగే కాల౦ ఎప్పుడు ఉ౦డవచ్చు? మన౦ ఏదేవతారాధన విశేష౦గా చేయవలసి రావచ్చు? వ్యాధి రాకు౦డా ము౦దుగానే వ్యాధినిరోధక టీకా వేయి౦చుకున్నవాడిలా భగవ౦తుని అర్చన చేసి ఆప్రమాదానికి మన౦ గురి కాకు౦డా మనల్ని మన౦ రక్షి౦చుకోవడానికి ప౦చా౦గ శ్రవణ౦ ఉపయోగపడుతు౦ది.

Tuesday, March 28, 2017

ఉగాది శుభాకాంక్షలు ..🙏

సుఖ శాంతి సుయోగేషు 

ప్రజ బంధు హితేషు చ /

అవిలంబేన సంసిద్ధిః 

హే విళంబి సమాగమే//

ఉగాది శుభాకాంక్షలు ..🙏

Sunday, March 26, 2017

శ్రీ సీతారాముల కళ్యాణం !

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో

అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు.

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. 

ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

అంతటి మహత్తరమైన రొజు శ్రీరామనవమి ...

తాటాకు పందిళ్ళు .....మామిడాకుల తోరణాలు .....బాజా భజంత్రీలు ...

పసుపు కుంకుమలు ....పట్టు వస్త్రాలు ..తాళిబొట్టు .......

వధూ వరులు .....ఏడడుగులు ....మూడు ముళ్ళు .....

ఇలాంటి అపురూపమైన పదాలతో ముడిపడిన బంధం వివాహ బంధం .

ఓం ..జై శ్రీరాం..జై సీతారాం ........ఈ పదానికి అర్ధం నిలిపే జంటలు 

మళ్లీ భగవంతుని సన్నిధిలో వివాహం జరుపుకోవడానికి 

ఇదే శుభప్రదమైన రోజు .....అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ..

శివ ధనుస్సు ......విష్ణు ధనుస్సు!

శివ ధనుస్సు ......విష్ణు ధనుస్సు!

.

సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?

రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం

ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే

అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్

అన్నారు. అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.

ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో

అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు

ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం

మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….

ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.

అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.

కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.

ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.

దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు!

దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు!

(చిత్రం ..వడ్డాది పాపయ్యగారి.. దానం.)

దానం చేయాలని ప్రముఖంగా చెబుతుంది, సనాతన ధర్మం..

’పెట్టందే పుట్టదు’ అనీ అంటుంది. ’చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంతా’ అంటారు. 

’పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు. 

దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు, శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం.

ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు,చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి.

అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి, శక్తికి మించి దానం చేయకూడదు. 

కలిగినవారు దానం చేయకపోవడం తప్పు, కలగనివారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనైనా ఉండచ్చు, ఒక్క ధనమిస్తేనే దానం కాదు. దశదానాలంటారు. అన్నిటిలోనూ గొప్పదైనది అన్నదానం వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది, ఆ తరవాతది విద్యాదానం. చెప్పుకుంటూపోతే చాలా ఉంది 🙂

Saturday, March 25, 2017

గుమ్మడి అమ్మ గుమ్మడి !

గుమ్మడి అమ్మ గుమ్మడి !

.

ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు.

.

ఎన్.టి.రామారావుతో విబేధాలు!

.

మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు. ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది. 

ఆ సమయంలో ఆయనకు ఎన్.టి. రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 

అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్.టి.రామారావుల మధ్య చెలరేగిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి.

గుమ్మడి ఆసమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలలో అధికంగా నటించడం వలన కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా ఎన్.టి.రామారావు అయనను అక్కినేని నాగేశ్వరరావుకు కావలసిన మనిషిగా భావించడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఎన్.టి. రామారావుకు మధ్య దూరం అధికం అయింది. ఈ విషయం గుమ్మడిని మనసును మరింత కలచి వేసింది. ఎన్.టి.రామారావుతో తన సాన్నిహిత్యాన్ని మరచి పోక పోవడమే అందుకు కారణం. గుమ్మడి కుమార్తె వివాహానికి సైతం ఎన్.టి.రామారావు హాజరు కాక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియ జేస్తుంది. ఇందుకు తాను ఎంతో బాధ పడినట్లు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పారు.

కాలగతిలో ఎన్.ట్.రామారావు అక్కినేని నాగేశ్వరరావు ల మధ్య విభేదాలు తొలగి పరస్పరం జరిగినవి తెలుసుకుని జరిగిన దానిలో గుమ్మడి ప్రమేయం ఏమీ లేదని తెలుసుకున్న ఎన్.టి.రామారావు తిరిగి గుమ్మడికి దగ్గర కావడంతో అయన మనసు కుదుట పడింది.


Monday, March 20, 2017

హరిహరనాథ !

హరిహరనాథ !

.

'కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా

పరిష్క్రియాయాం బహు మన్యసే? త్వం

కిం కాలకూట: కిము వా యశోదా-

స్తన్యం తవ స్వాదు? వద ప్రభో ! మే //

.

నా స్వామీ! 

నిన్ను చూస్తూంటే 'సగం శివుడిగాను, సగం మాధవుడవుగాను' కనిపిస్తున్నావు! మరి నీవు అలంకరణ (పరిష్క్రియ) విషయంలో ఎముకలదండను ఇష్టపడతావా లేక కౌస్తుభాన్ని ఇష్టపడతావా? 

అదేవిధంగా నీకు ఇష్టమైన పానీయం కాలకూటమా? 

లేక యశోదాదేవి చనుబాలా?'

తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం!

తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం!

కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కమల గర్భుని వశమా

నెల నడిమి నాటి వెన్నెల

యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.!

.

ఏమిదిని చేపిటివి కవితము - 

భ్రమపడి వెల్లుల్లి పాయ తిని చేపితో

ఉమ్మెత్త కాయ తింటివో -

అమవస నిసి కం చు నీవు అలసని పెదనా -

అనికాదివిన జ్ఞాపకము .

Saturday, March 18, 2017

దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !


దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !

.

ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.

పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా! 

'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు. 

దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది. 

సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు. 

జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ.. 

మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,

క. జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం

డిల తిరుపతి వేంకటశా

స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

అదీ వారి పాండిత్యం!

ఏకలవ్యుడి వృత్తాంతం.! (ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!)

ఏకలవ్యుడి వృత్తాంతం.!

(ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!ఏకలవ్యుడు నిషాదులింట పెరిగి, నిషాదునిగా గుర్తించపడ్డాడు.కులదూషణకు,కుల వివక్షతకు గురి అయ్యాడు.ఎన్నో అవమానాలు భరించాడు.నేటి సమాజంలో దళితులు ఏకలవ్యుడిని దత్తత చేసుకొన్నారు. ఇది చాలావరకు న్యాయమే) .

,

మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు.

ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కులను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపించే సరికి కుక్క గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు కుక్కు నోరు తెరచి మూయుటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అర్జునికి కనిపించింది. విషయం విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది.ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు.ఏకలవ్యుడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు.

కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు వేసి,కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని ద్రోణుడు భావించాడు.రాబోయే ప్రమాదాలను ముందే నివారించటానికి ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా, ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా లోక కళ్యాణం కొరకు ఏకలవ్యుని కుడి చేతి బ్రొటన వేలుని ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడిచేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు.

ఈ సంఘటన ఏకలవ్యుడి త్యాగం మరియు గురువు పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియపరుస్తుంది.చరిత్రలో నిలిచిపోయాడు.ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. ద్రోణాచార్యులు అనుకున్నదే నిజం అయింది. ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి మరియు రుక్మిణీదేవి తండ్రియైన భీష్మకుడికి మధ్యవర్తిగా వ్యవహరించాడు.భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు. అలా మరణించిన ఏకలవ్యుడు పునర్జన్మలో దృష్టద్యుమ్నుడిగా పుట్టే వరాన్ని శ్రీకృష్ణుడు ఏకలవ్యుడికి ప్రసాదించాడనే కధ కూడా ప్రచారంలో ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడిని హతమార్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది.

ఏకలవ్యుడి పాత్ర గురించి చెప్పిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తన బొటనవేలును కత్తిరించి, ‘గురు దక్షిణ’గా ద్రోణాచార్యుడికి సమర్పించటంతో ముగుస్తుంది ఇతని కథ. ఇది అందరికి తెలిసిన సాధారణ కథ. నన్నయ రాసిన 'మహాభారతం ,ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని 231 వ వచనం నుండి 245 వ పద్యం దాకా ఏకలవ్యుడి కధ సాగింది.ఏకలవ్యుని కధనమును గూర్చి ఎన్నో పరిశోధనలు, విశ్లేషణలు జరిగినా కొన్ని సంతృప్తి కరమైన సమాధానాలు లభించవు. కానీ ఏకలవ్యుడి మరణం కృష్ణుని చేతిలో సంభవించింది అన్న వాస్తవంతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.అసలు ఏకలవ్యుడు ఒక రాజుకొడుకు.ఏకలవ్యునికి శత్రుఘ్నుడనే మరో పేరు కూడా ఉంది. మహాభారత కాలంలో కొడుకు పుట్టినప్పుడు, అతని జాతకం బాగాలేకపోతే,దుశ్శకునాలు కలిగితే, అతణ్ణి కులభ్రష్టుడిగా భావించి అడవులలో వదలిపెడుతారు. దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా దుశ్శకునాలు కలిగాయి.అతనిని కూడా కుల భ్రష్టుడుగా భావించి అడవిలో వదలివేయమని పెద్దలు చెప్పినట్లు నన్నయ భారతంలో ఉంది. అయితే, లేకలేక కలిగిన సంతానం కావటం చేత,పుత్రవాత్సల్యం చేత ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు.

శత్రుఘ్నుడిగా మరో పేరున్న ఏకలవ్యుడు అడవులలో భిల్లుల మధ్య పెరిగి, నిషాద జాతులలో చేరాడు. ఇతని తండ్రి దేవశ్రవుడు, వసుదేవునికి మూడవ తమ్ముడు.(హరివంశం)ఏకలవ్యుడు నిషాదుడు (బోయవాడు) అంటుంది వ్యాసభారతం. ఇతను ఎరుకలవాడు అంటుంది కవిత్రయ భారతం.! తండ్రి నిషాదరాజైన హిరణ్యధన్వుడు అని వ్యాసుడంటే, ఎరుక రాజైన హిరణ్యధన్వుడని నన్నయ చెబుతాడు.నిజానికి ఏకలవ్యుడు, వేటగాళ్ళ రాజు,నిషద వ్యత్రజ హిరణ్యధనుస్సు చేత పెంచబడ్డాడని అర్ధమవుతుంది.

ఏకలవ్యుడి వృత్తాంతంలో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఈ సందేహాలన్నీ ‘హరివంశం’లో పరిష్కారమైనట్లు కొందరి అభిప్రాయం.ఆరుద్ర పరిశోధించి పేర్కొన్నట్లు ‘ఏకలవ్యుడు-కృష్ణుడు-పాండవులు రక్త సంబంధీకులు’. యాదవ రాజైన శూరుడికి స్వయానా మనవళ్లు! ఇతడి భార్య మారిష. వీరికి తొమ్మిదిమంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు పుట్టారు. అందులో ఏకలవ్యుడి తల్లయిన శృతదేవ శూరుడి రెండో కూతురు. నాల్గవది కుంతి. అంటే వీరికి పుట్టిన ఏకలవ్యుడు, పాండవులు అన్నదమ్ములన్నమాట! శూరుడి మొదటి కొడుకు వసుదేవుడు.రెండవవాడు దేశశ్రవుడు. (మిగిలిన వారిపేర్లు అప్రస్తుతం).ఏకలవ్యుడు కృష్ణులది బావ-బావమరదుల వరసన్నమాట. ఆరుద్ర తన వ్యాసపీఠంలోని ‘ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు’ అనే వ్యాసంలో పాండవులకు ఏకలవ్యునికి మధ్యగల చుట్టరికాన్ని,ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఏకలవ్యుడు పాల్గొనడాన్ని పేర్కొని ధృవీకరించారు. ఏకలవ్యుడి తండ్రి హిరణ్య ధన్వుడు(కేకయరాజు).తల్లి శ్రుతదేవ."హరివంశం" గ్రంధ ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు రెండవ పెదతల్లి కొడుకు, కృష్ణుడి రెండో మేనత్త కొడుకు.అనగా పాండవులకు వరుసకు సోదరుడు.ఏకలవ్యుని కృష్ణుడు వధించినట్లు మహాభారత కధనం.హరివంశం 6వ ఆశ్వాసం 34వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో ఒక చిన్న తప్పు దొర్లింది. దేవశ్రవుడికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులలో పెరిగినట్లు అందులో చెప్పబడింది.

దేవశ్రవుడు వసుదేవుని తమ్ముడని ముందు చెప్పుకున్నాం. ఆ వరసన కృష్ణుడు, ఏకలవ్యుడు అన్నదమ్ములు అవుతారు .ఒక శ్లోకంలో శృతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు చేరింది. చాలామంది దీన్ని తప్పుగా గ్రహించలేక ఏకలవ్యుడు కూడా యాదవుడనే అభిప్రాయానికి వచ్చారు. దీన్ని ఆధారం చేసుకుని ఒక తెలుగు సినిమాలో ఏకలవ్యుడి చెల్లెల్ని కర్ణుడు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు. ముందు పేర్కొన్న ప్రకారమైతే ఏకలవ్యుడు, కర్ణుడు అక్కచెల్లెళ్ల పిల్లలు.కాబట్టి సినిమాలో చూపించింది అసంబద్ధం!కృష్ణుడు, ఏకలవ్యుడు అన్నదమ్ముల పిల్లలని నమ్మి, దానికి మరికొన్ని తప్పులు జోడించి వికీపీడియా వారు సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అదీ తప్పే!హిరణ్య ధనస్సు

మగధ సామ్రాజ్యాధిపతియైన జరాసంధుని సైన్యాధిపతి.తండ్రి వారసత్వాన్నే ఏక లవ్యుడు కొనసాగించాడు.ఏకలవ్యుడు కూడా మగధ దేశాధిపతి జరాసంధ చక్రవర్తి కొలువులో సేనాధిపతిగా పనిచేసాడు.ఏకలవ్యుడు బలరామునితో గదా యుద్ధం చేసి చివరిలో ఒక దీవిని చేరి తలదాచుకున్నట్లు హరివంశ కధనం.ఏకలవ్యునికి ఇద్దరు కుమారులున్నట్టు కూడా అర్థమవుతుంది. ఒక కుమారుడు కేతుమాన్. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని భీముని చేతిలో మరణించాడు. మరొక కొడుకు ధర్మరాజు విడిచిన అశ్వమేధ యాగాశ్వాన్ని అనుసరిస్తూ వచ్చిన అర్జునుని ఎదిరించి, పరాజితుడై అర్జునుడిని సేవిస్తాడు. అయితే,ఇతని పేరు తెలియదు. తెలుగులో కూడా ‘ఏకలవ్య నందనుండ’ని మాత్రమే ఉంది.పుట్టుక కంటే పెంపకం ముఖ్యమనిభావించే మహాభారత కాలంలో కర్ణుడు కూడా శూద్రుడే! అసలు ఆరుద్ర గారు తన 'వ్యాసపీఠం'లోని ఒక వ్యాసంలో ఏమి చెప్పారో కూడా చూద్దాం!-----

"మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆదిపర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు.ఆదిపర్వం పంచమా శ్వాసంలోపదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారతకథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం,సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి. సంస్కృత హరివంశం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికి గాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ ఉన్నారు.(ముఖ్యమైన వారి పేర్లను పైన ఉదహరించాను)వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.అదేమిటంటే, దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన ఏకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు. కేకయ రాజు సుక్షత్రియుడు కానందువల్లనే నిషాదుడయ్యాడు.సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి ఉంది.కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు.క్షత్రీయ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు ఉండేవి.అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరు గాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రీయ స్త్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు. మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాటపర్వం) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది. హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది."

ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం!ఏకలవ్యుడు నిషాదులింట పెరిగి, నిషాదునిగా గుర్తించపడ్డాడు.కులదూషణకు,కుల వివక్షతకు గురి అయ్యాడు.ఎన్నో అవమానాలు భరించాడు.నేటి సమాజంలో దళితులు ఏకలవ్యుడిని దత్తత చేసుకొన్నారు. ఇది చాలావరకు న్యాయమే .

Sunday, March 12, 2017

అచ్చ తెలుగు...అర్ధమయి చావదు ! .

అచ్చ తెలుగు...అర్ధమయి చావదు !

.

ఇదిచదివి అనందించండి. 

ఒకానొక సమయంలో ఉభయ భాషాప్రవీణులు పండిత ......... అవదానిగారు రాజమహేంద్రవరంలో ధూమశకట గమనాగమన ప్రదేశ ప్రాంగణ మందున్న శకటాధిరోహణ అనుజ్ఞాపత్ర విక్రేత మహాశయా బెజవాడ ప్రయాణమునకు వలయు విత్తమును గైకొని శీఘ్రమే అనుజ్ఞా పత్రమును నొసగుమా అని విన్నవించి వలయు పైకము తీయ ప్రయత్నిచుచున్న వేళ. ధుమశకటాగమన నిర్గమనములు సమాప్తమాయెను. తదుపరి వచ్చు ధూమశటమునకై నిరీక్షణ కొనసాగెను, 

అంతలో సూర్యాస్తమానముకావచ్చెను. సాయంధ్యానుష్టానమునకు అవధానిగారు గృహోన్ముఖులైరి.

క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది.

క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది. 

రంగులు వేసుకుంటాం గానీ ఇంటిని పారేయం కదా! -

అవును .... క్రొత్త ఇల్లు కూడా పాతదైపోతుంది. 

రంగులు వేసుకుంటాం గానీ ఇంటిని పారేయం కదా..!?

మనుషులను అర్ధం చేసుకున్న కొద్దీ, వాల్ల లోపాలు బలహీనతలు తెలుస్తుంటాయి బయటపడేయడానికో బాగుచేసుకోడానికో ప్రయత్నం చేయాలి గాని వారి చావు వారు చావనీ అని వదిలేయడమొ , మొత్తానికి విమర్శించి విడిపించుకోవడమో తరిమేయడమో చేయలేం కదా.. !! .

పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ...

పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ...

"అదృష్టం కొద్ది ఆలి(భార్య)" చెబుతారు. .

గతంలో వధువుల తరఫు పెద్దలే పురుషులను ఎంచుకునే వారు. (నిజానికి ఇప్పుడూ అమ్మాయిలే కాబోయే వారిని రకరకాల పరరీక్షలు రపెట్టి మరీ యెంచుకుంటారని వినికిడి.) కనుక వారే పురుషులను చూసి యెంచుకుంటారు కావున మనం చేసే మంచి పనులే మనలను వారి దృష్టిలో పడవేస్తాయనీ, మనంగా వేరే వ్రతాలూ గట్రా చేయాల్సిన పని లేదనీ, చేయాల్సిందల్లా 

ఆ యొక్క "ఏడు" బాధ్యతలను చక్కగా నెరవేర్చడమేననీ...నా అభిప్రాయం.

.

నిజానికి కొత్తగా వివాహం అయిన అబ్బాయికి జీవితం కత్తి మీద సాము లాంటిదే. ఉమ్మడి కుటుంబం అయితే మరీను. భరించువాడు భర్త అనే సామెత ఉండనే ఉంది. వివాహం అయిన కొత్తల్లో అబ్బాయి చాలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నొప్పించకుండా తన నిర్ణయాలు ఉండాలి. ముఖ్యంగా అబ్బాయిలు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, తల్లి మరియు భార్య, ఇద్దరూ కూడా రెండు కండ్లలాంటి వారు. కొత్తల్లో ఏదైనా సమస్య వస్తే తల్లిని, తల్లే కదా అని భార్య ఎదుట చిర్రుబుర్రు లాడటం, నీకేం తెలియదులే అమ్మా అనడం చేయకూడదు. తల్లి ఎదుట భార్యని, నువ్వు ఈ పని సరిగ్గా చేయచ్చు కదా. అని ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకి చెప్పుకోవాలి. మా అమ్మ పెద్దది కదా పాపం, మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడిందో. నిన్ను ఒక మాట అంటే నష్టం ఏమిటి చెప్పు. నా కోసం సర్దుకుపోవే! మా అమ్మ బాధ పడితే నేను బాధ పడతాను. నేను బాధ పడితే నువ్వు బాధ పడతావు. ఎందుకు ఇవన్నీ చెప్పు, అని లాలనగా భార్యకి చెప్పుకోవాలి. అలాగే తల్లికి కూడా, భార్య ప్రక్కన లేనప్పుడు, ఏదో కొన్ని విషయాలలో అది తొందరపడుతుంది. కాని, నువ్వు అంటే అమితమైన ప్రేమ. అమ్మా!మేమిద్దరం బయటికి వెళ్ళినా అత్తయ్యగారికి ఇది కొందాం అని చెపుతూ ఉంటుంది. అని, మెల్లిగా తల్లిని కూడా సర్దుకుపో అని ప్రేమగా చెప్పాలి. పురుషుడు వివాహానంతరం తన బలాలు, బలహీనతలు అన్నీ కూడా భార్యకి చెప్పుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపయినా నీ బలాలు, బలహీనతలు తెలియాల్సింది ఆ అమ్మాయికే కదా! పైగా మన వివాహ క్రతువుల్లో కూడా భార్య అంటే ఎవరో కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి నెచ్చెలి. మరి భగవంతుడు ఇచ్చిన ఈ నెచ్చెలిని ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. శాస్త్ర ప్రకారం అయితే వివాహానంతరం భర్తే భార్య ఇంట్లో ఉన్నట్లు. నిన్ను చేసుకున్నందుకు నేను నిన్ను నా ఇంటిలోనికి అనుమతిస్తున్నాను అని. వివాహ మంత్రాలు కూడా అలానే నడుస్తాయి. అంటే ఆ ఇల్లు ఇల్లాలిదే అని అర్ధం. కన్యాదానం చేసేటప్పుడు కూడా చతుర్ధీవిభక్తి వెయ్యకుండా కన్యాదానం చేస్తారు. అందుకే కన్యాదాత ప్రతిపాదయామి అంటాడు. వెంటనే వరుడు 'ఓం స్వస్తి' అని అంటాడు. కన్యాదానం అనే మిషతో దానం చేసినప్పటికీ పూర్తిగా చతుర్ధీవిభక్తి వెయ్యకపోయినా, ఆ అమ్మాయి ఇప్పటి వరకు నీవు సంపాదించిన ఆస్తికి, ఇక ముందు సంపాదించబోయే ఆస్తికి ఆవిడే సర్వాధికారిణి. ఎందుకంటే, వేదం అంగీకరించింది కాబట్టి కొన్ని ప్రమాణాలలో వరుడికి సమానం అయిన అధికారాలన్నీ ఆవిడకి కూడా ఉంటాయి. మరి ఆడపిల్ల తన ఇంటిపేరు వదిలేసింది, గోత్రాన్ని వదిలేసింది, తన వారినందరినీ వదిలేసి ఈయన నా భర్త అన్న ఒకేఒక్క ధైర్యంతో, ఈయన నన్ను మా నాన్నలా లాలిస్తాడు, అన్నలా ఆదరిస్తాడు, తమ్ముడిలా ప్రేమిస్తాడు, చెల్లెలిలా పరాచకాలాడుతాడు, అక్కలా మంచి మాటలు చెపుతాడు, తల్లిలా కడుపులో పెట్టుకుంటాడు అని తన చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది. భర్త అంటే భరించువాడు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. తనకి మరణసదృశం అని తెలిసినప్పటికీ, నీ ప్రతిరూపాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలని ఆరాటపడిపోతుంది స్త్రీ మనసు. మరి ఇంత త్యాగం చేసే భార్యని నువ్వు ఏ రకంగా సంతోష పెట్టగలవు. భార్య సంతోషపడాలంటే ఏమీలేదు. నా అదృష్టం కదా, నువ్వు నాకు భార్యవి అయ్యావు, అంటే ఆవిడకి గజారోహణం చేయించినట్లుగా ఆనందపడిపోతుంది. అలా కాకుండా ఛీఛీ ఏ ముహూర్తాన నిన్ను చేసుకున్నానో కాని, అని ఈసడిస్తే కృంగిపోతుంది. కుటుంబంలో ఎవరు ఆదరించినా, ఆదరించకపోయినా భర్త ఒక్కడు ఆదరిస్తే కష్టాలన్నీ దిగంమింగుతూ ధైర్యంతో పయనించగలుగుతుంది. అలా కాకుండా, నువ్వు నాకు అఖ్ఖర్లేదు ఫో అంటే కృంగిపోతుంది. కాబట్టి ఒక్కసారి వివాహం

చేసుకున్నాక నువ్వు నాకు అఖ్ఖర్లేదు అనడానికి వీల్లేదు. మనకి ఒక పాట కూడా ఉంది, 'మగడు మెచ్చిన చాలు కాపురంబులోనా మొగలిపూలా వాన ముత్యాలవాన' అని. కాబట్టి భర్తగా మారేముందే పురుషుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మన విలువైనటువంటి హారాన్ని ఎంత భద్రంగా బీరువాలో ఉన్న లోపలి సొరుగులో ఉన్న సొరుగులో పెడతామో, భార్యని కూడా పురుషుడు తన హృదయంలో పొదివి పెట్టుకోవాలి. సముద్రుడిని పురుషుడితో పోలుస్తారు. సముద్రుడు తనకి తానుగా ఒక చెలియలికట్ట విధించుకున్నాడు. నేను ఈ గీత దాటకూడదు అని. అదే సముద్రుడు ఉప్పొంగి ఊరి మీదకి వస్తే, ఊరు ఊరు మునిగిపోతుంది. సముద్రుడు ఎలాగైతే తనకు తాను చెలియలికట్ట విధించుకున్నాడో, పురుషుడు కూడా తనకి తాను తన మనసుకి ఒక చెలియలికట్ట విధించుకోవాలి. మన ఇంట్లో చేసుకునే పరమాన్నానికి, ఎదుటి వారి ఇంట్లో చేసిన పరమాన్నానకి వ్యత్యాసం ఏమీ ఉండదు కదా? ఇది పురుషుడు గ్రహించాలి. వివాహానికి ముందు ఎన్నో రకాల అందాలను చూసి, ఆ అందం తనకి సొంతం అయితే బాగుండును అని అనుకుని ఉండవచ్చు. కాని వివాహం తరువాత అన్ని అందాలను తన భార్యలోనే వెతుక్కోవాలి. స్త్రీ దేనినైనా సహిస్తుంది కాని, తనతో సమానంగా ఇంకో స్త్రీకి కూడా తన భర్త హృదయంలో స్థానం ఉంది అంటే మటుకు ఏ స్త్రీ కూడా సహించలేదు. అంతటి అమ్మవారు కూడా ఏదైనా ఉత్సవం జరుగుతుంటే, నా భర్త అని తన భర్త వైపు గర్వంగా చూస్తుందిట. ఇంతలో పైన ఉన్న గంగమ్మకి, నేనుకూడా అంటే, వెంటనే ఆవిడ కనులు ఎర్రబడతాయట. భరించాడు కాబట్టి నీకు భర్త ఏమో, శాస్త్రోక్తంగా తాళి కట్టింది నాకు, అని గంగవైపు గర్వంగా చూస్తుందిట. మనకి పెద్దలు ఒక నానుడి చెబుతూ ఉంటారు. ఎవరైతే తలికి, భార్యకి Thanks చెబుతారో, వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. తల్లికి, భార్యకి ఏ రకంగాను కృతజ్ఞతలను తెలియజేయలేము. ఒకరు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మనిచ్చినవారు. ఇంకొకరు వారి సర్వస్వం నీకు అర్పించి, నీ అభ్యున్నతికోసం ఆరాటపడేవారు. కాబట్టి, భార్యాస్థానం యొక్క విలువ తెలుసుకుని ప్రవర్తిస్తే వారి దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా సాగిపోతుంది.

సర్వేజనాసుఖినోభవంతు

Saturday, March 11, 2017

కాకిగోల- ____ (ఇందుర్తి వెంకట ప్రభాకరరావు)

కాకిగోల- ____

(ఇందుర్తి వెంకట ప్రభాకరరావు)

.

నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు మాష్టారు 'కాకి - కోకిల' ల 

మధ్య కనిపించే సారూప్య, వ్యత్యాసాలని వివరిస్తూ 

ఈ క్రింది శ్లోకం చెప్పేవారు:

"కాకః కృష్ణః పికః కృష్ణః 

కో బేదః పిక కాకయో: 

వసంత కాలే సంప్రాప్తే 

కాకః కాకః పికః పికః!

.

దీని అర్థం ఏంటంటే : కాకి నల్లగా ఉంటుంది . కోకిల కూడా నల్లగా ఉంటుంది . కానీ వసంత కాలంలో కాకి గొంతు లోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధర్యం సులువుగా గుర్తించ వచ్చు .

ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఈ క్రింది వాక్యానికి అర్థం చెప్పమనేవారు:

.

కాకికికాకీకకాకకాకికికోకేల ?

.

పై వాక్యాన్ని అర్థవంతంగా విడగొడితే ఈ విధంగా వ్రాయ వచ్చు:

కాకికి .. కాకీక . కాక ..కాకికి ..కోకేల ?

అంటే దీని అర్థం: కాకికి దాని తాలూకు ఈకలే చీరగా (కోక) ఉపయోగ పడినప్పుడు, ఆ కాకికి వేరే చీర (కోక) అవసరం ఏముంది?

.

నేను హైదరాబాదీయుడిని కాబట్టి పై వాక్యానికి కాస్త ఉర్దూ మిలాయించి ఇలా రాసాను:

కాకికి కాకీక కాక కాకికి కోక కైకు? 

.

'కైకు' అంటే అర్థం చెప్పక్కర లేదనుకుంటా. ఎలా ఉంది?

.

పోతే, (ఎవరూ అని అడక్కండి) మన పట్టణ వాసులకి కాకుల కలకలారావాల తోటే తెల్లారుతుందని నా అభిప్రాయం . ఎందుకంటే , ఇక్కడ కోళ్ళూ కనిపించవూ, వాటి కూతలూ వినిపించవూ కాబట్టి .

మళ్ళీ బాల్యం లోకి వెళ్తే , ఒకే జామ కాయని 'కాకి ఎంగిలి' చేసి మిత్రులతో పంచుకోవడం మనకి అనుభవమే కదా !

.

'అనగనగా ఒక కాకి . ఆ కాకికి దాహం వేసింది , ఎక్కడా నీళ్ళు లేవు , ఒక్కచోట ఒక కుండలో అడుగున కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, కాని అవి కాకికి అందలేదు , అప్పుడు కాకి అలోచించి కొన్ని గులకరాళ్ళు తెచ్చి కుండలో వేసింది , అప్పుడు నీళ్ళు పైకి వచ్చాయి , అప్పుడు ఆ కాకి అ నీళ్ళు తాగేసి హాయిగా ఎగిరిపోయింది .

' ఈ కధ మన చిన్నప్పుడు మన అమ్మమ్మలూ , నాయనమ్మలూ చెప్తే, లాజిక్కులు అడక్కుండా విని ఆనందించాము . అదే ఇప్పటి కాకి అయితే గులకరాళ్ళ కోసం చూడకుండా ఒక స్ట్రా తీసుకొని కుండ లోని నీళ్ళని తాగుతుందని ఈ మధ్య ఎవరో ఇంటర్నెట్ లో సచిత్రంగా వివరిస్తే చూసి తరించాను . 

వీటిని బట్టే 'కాకమ్మ కధలు' పద ప్రయోగం వాడుక లోకి వచ్చిందేమో!

.

సర్కారు వారు చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ, వాళ్ళు మనకు చెప్పే అంకెల గారడీలు 'కాకుల లెక్కలు' కాదంటారా?

.

'కాకుల లెక్కలు' అంటే చిన్నప్పటి మరో విషయం గుర్తుకొస్తోంది:

ఒక అబ్బాయిని మరో అబ్బాయి ఇలా అడిగాడు - ఒక చెట్టు మీద పది కాకులు కూర్చున్నాయి. అందులో ఒక కాకిని తుపాకీ తో కాల్చావనుకో . ఇంకా ఆ చెట్టు మీద ఎన్ని కాకులు ఉంటాయి?

ఈ ప్రశ్నకి ఆ మొదటి వాడు 'తొమ్మిది' అని చెప్తే వాడ్ని ఓ అట పట్టించకుండా వదలరు కదా . ఇప్పుడు అటువంటి అమాయకపు పిల్లలు లేరనుకోండి.

.

'పంచతంత్రం లో కూడా ఈ 'కాకమ్మ' కథల ప్రస్తావన ఉంది. ఇది పిల్లలకి సుపరిచితమే 

..

సుమతీ శతకం లో కూడా కాకుల ప్రస్తావన ఉందండోయ్ !

.

'అల్లుని మంచితనంబును 

గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ 

బొల్లున దంచిన బియ్యము 

దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ'

.

సుమతీ శతక కారుడు పై నాలిగింటినీ అరుదైనవిగా చెప్పుకొచ్చాడు. ముగింపుగా కాకులన్నీ నల్లగానే ఉంటాయని తేల్చి చెప్పాడు .

పోచికోలు కబుర్లతో కొందరు కాలక్షేపం చేస్తుంటారు . ''ఏమిటర్రా మాట్లాడుకుంటున్నారు?' అంటే , 'ఏముందీ , ఏవో కాకమ్మ కబుర్లు' అన్న జవాబు వస్తుంది.

.

బయటి వాళ్ళకి అనిపించినా , అనిపించక పోయినా , ఎవరి పిల్లలు వాళ్ళకి నచ్చుతారు కదా . 'కాకి పిల్ల కాకికి ముద్దు' కాదూ ?

తన, మన అనే వాళ్ళు లేకుండా ఒంటరి జీవితం గడిపే వాళ్ళని 'అతనికి ఎవ్వరూ లేరు, అతను 'ఏకాకి' అంటాము కదా .

ఒక వ్యక్తి గురించో, అతని వ్యక్తిగత సమస్యల గురించో చుట్టుపక్కల వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతూంటే 'లోకులు కాకులు' అనడం మామూలే .

ఏదో సాయం కోరుతూ మనం ఎవరింటికైనా వెళ్ళామనుకకోండి. వాళ్ళేమంటారో తెలుసా? మీకెందుకండీ శ్రమ, కాకితో కబురెడితే నేనే వచ్చే వాడ్ని కాదూ - అని.

రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవలు ఉంటే, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు - అంటారు కదా . 

'కాకి దొండ' అని ఓ కూరగాయ కూడా ఉందిట . కాని నాకు దాన్ని చూసే అవకాశం రాలేదు.

.

జిలుగు వెలుగులతో ధగధగా మెరిసిపోయే వస్త్రాభరణాలని 'కాకి బంగారం' అని చెప్పడం మనకు తెలుసు. 

.

ఒక కాకికి ఏదైనా ఆపద కలిగితే మిగతా కాకులన్నీ అరిచి గోల పెడుతూ వాటి సమైఖ్యతని చాటుకుంటాయి .

ఇంట్లోనో , స్కూల్లోనో పిల్లలు బాగా గోల చేస్తుంటే, ' ఆపండి మీ కాకి గోల ' అంటాము కదా .

.

ఏ జంట అయినా ఈడు జోడు సరిగ్గా లేకపోతే వాళ్ళని కాకి ముక్కుకు దొండపండులా ఉన్నారని అంటాము . 

.

మన పురాణాల్లో కాకిని శని దేవతకు వాహనముగా వర్ణించడం మనకు తెలుసు.

.

కాకిలా కలకాలం బతికే కన్నా హంస లా ఆర్నెల్లు బతికినా చాలు - అనే ప్రయోగం మనం తరచూ వాడుతుంటాం కదా .

.

ఎవరికైనా ఆకస్మిక మరణం సంభవిస్తే దాన్ని 'కాకి చావు' అంటారని ఓ నిఘంటువులో వివరించారు .

Friday, March 10, 2017

మౌనంగా ఉన్నప్పుడే మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి!

మౌనంగా ఉన్నప్పుడే మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి!

.

అదిగో చూడుము బంగరు జింకా... 

మన్నైకనునయ్యో లంకా...


శీర్షిక -| నగర గీతం |

శీర్షిక -| నగర గీతం |

_______________

మా ఆవిడ కోసం 

ఏవైనా చేస్తాను

నిన్న ఆవిడ ఒక కోరిక కోరింది

వీధిలో 

నా వెనకే నడిసొచ్చే 

పచ్చని చెట్టు కావాలని

ఎలా ??

_________

కవి :వాస్కో పోవ (యుగోస్లేవియా)

అనువాదం : త్రిపురనేని శ్రీనివాస్

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

.

ఎప్పుడూ తిట్టే మిత్రుని పాత్రను అడ్డుపెట్టి తన విమర్శకులకు సమాధానం

ఇలా ఇస్తారు విశ్వనాథ గారు.

నీవు నన్ను తిడుతున్నావంటే అర్థమేమిటంటే నన్ను చదువు తున్నావన్న మాట! 

చదవక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్న మాట.

అసలు తిట్టడానికీ, మెచ్చుకోవడానికీ పెద్ద భేదం లేదు. రెండూ ఒకటేననుకో. 

రూపాయి ఉందనుకో. అక్షరాలవైపు ఒకటీ. బొమ్మ వైపు ఒకటీ. ఎటు తిప్పినా రూపాయే.

కొండరేం చేస్తారంటే అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రాద్ధం నేను .

,

నేను విష్ణుశర్మని కాదని అర్జీ పెట్టుకున్న వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు గనుక ఒప్పుకుంటే పంచతంత్రం రాసింది ఈయనేనని ఒప్పుకుంటాము అన్నారు.

"'నేను రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడమేమిటి? మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా! వాడు వాడేనని ఇంకొకడు చెప్తే గానీ కాడా ఏమిటి?"' 

. "ఎవ్వడూ ఎరగని వాడొకడుంటాడు, వాడి గతి ఏం కావాలి?" . 

"వాడి గతి అంతే" .

ఒక బృందావనం...సోయగం...

ఒక బృందావనం...సోయగం...

ఎద కోలాహలం..క్షణ క్షణం...

ఒకే స్వరం..సాగెను తీయగా..

ఒకే సుఖం విరిసేను హాయిగా..

ఒక బృందావనం...సోయగం......

Thursday, March 9, 2017

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య!

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య

తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా.!

భామనే సత్య భామనే !

భామనే సత్య భామనే !

భామనే.. సత్యా ..భామనే! వయ్యారి ముద్దుల..

సత్య భామనే ..సత్యా భామనే..


భామనే పదియారువేలా కోమలులందరిలోనా

రామరో గోపాలదేవుని ప్రేమనుదోచినా ||సత్య||


అట్టహాసము చేసి సురల అట్టేగేలిచిన పారిజాతపు

చెట్టుతేచ్చి నాదు పెరటా గట్టిగా నాటించు కున్నా..||సత్య||


ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే..

జాణతనమున సతులలో నెరజాణనై..వెలిగేటి ||సత్య||


అందమున ఆనందమున గోవిందునకు నెరవిన్దునే

నందనన్దనుదేన్డుగానక ..నందనన్దనుదేన్డుగానక..

డెందమందున కుములుచుండే ||భామనే||


కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోనా

లలనా.. చెలియా.. మగువా.. సఖియా..

గోపాల దేవుని బాసి తాళజాలక యున్నట్టి..||భామనే||


Tuesday, March 7, 2017

ఆడ దాని గా పుడితే తప్ప ,ఈ వివక్ష అర్ధం కాదు ...

ఆడ దాని గా పుడితే తప్ప ,ఈ వివక్ష అర్ధం కాదు ...

నా ్సపోర్ట్ ఎప్పుడు స్త్రీ ల కే ..వారు ఎంత మూర్ఖులైనా ,,

వారిని అలా చేసిన వ్యవస్థ మీదే నా కోపం అంతా ..

మన చుట్టు ఉన్న సమాజం లో నించి కూడా చూసి నేర్చుకుంటారు ,

మన ఇంట్లో ఒక పధతి ఉన్నా ,అది సామాజిక అంశాల తో వైరుధ్యం గా ఉంటే ,పిల్లలు తట్టుకోలేరు ,

అందుకే మనం కూడా డైల్యుట్ చేస్తాం మన సిద్ధంతాలని ..సమాజం నించి అంగీకరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం ..మనకి తెల్య కుండానే ..మొత్తం మార్పు ఒక్కసారి రాదు ...్భర్త పోయిన వారికి గుండు గీయించే సాంప్రదాయం ఇప్పుడు పూర్తిగా పోయిందనే అనుకుంటున్నాను ,

మళ్ళి వివాహాలు కూడా చేసఉకుంటున్నారు ...మెల్ల గా , చాలా మెల్లగా వస్తాయి మర్పులు, 

ఈ లోగా స్త్రీలు తమ కోసం తాము నోరు విప్పి అడగడం నేర్చు కోవాలి ,అదే కదా ,అమ్మాయిలు తమ కోరికలు పైకి చెపుతూ ఉంటే ,ఎంత అతలా కుతలం అయిపోతున్నాది సమాజం ..

పాపం అబ్బాయిలు కి ఎన్ని కష్టాలు ? అంటూ సంతాపాలు ..

మరి ఇన్నేళ్ళు స్త్రీ పడ్డ కష్తాలకి లేదేం ఈ ఓదార్పు

ఇదిఒకటే చాలు అన్నిపూజలుచేసినపుణ్యంవస్తుంది .


ఆత్మా త్వం, గిరిజా మతిః ..

.

అప్పట్లో ఈ శ్లోకం ఎవరు రాసారో ఏమీ తెలియక పోయినా

విపరీతమైన ఇష్టం.

మా నాన్న గారు(వింజమూర్వెంకట్రావుగారు) రోజు చదివేవారు..

.

ఇదిఒకటే చాలు అన్నిపూజలుచేసినపుణ్యంవస్తుంది అనేవారు ..

. నేనుఎప్పుడుమనస్సులులో స్మరిచుకుంటాను.. మాసోదర్లు కూడా

ఇది ఆది శంకరాచార్యులవారు రాసిన శివ మానస పూజ లోనిది.

,

"ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,

పూజా తే విషయోప-భొగ-రచనా, నిద్రా సమాధి స్థితిః /

సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః, స్తోత్రాణి సర్వా గిరొ,

యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం "

.

ఆత్మా త్వం - You are my soul.

గిరిజా మతిః - Parvathi(daughter to Giri Raja) is my mind.

సహచరాః ప్రాణాః - Your army (Nandi, Bhrungi and all pramadhagaNas) are my breath.

శరీరం గృహం - My body is your abode.

పూజా తే విషయోప-భొగ-రచనా - Any activity I do is your worship.

నిద్రా సమాధి స్థితిః - My sleep is your state of meditation.

సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః - All my movement is my pradakshina to you.

స్తోత్రాణి సర్వా గిరొ, యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం - All the praises and all the work I do, Sri Sambho! is in your devotion.

"ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు"

శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు

"ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు" కధలో

సంకురాత్రి గురించి ఇలాఆ పండగంత అందంగా చెప్పారు.

" తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడికూసింది.కాకులు మేలుకున్నాయి.ఈగలు

డ్యూటీకి బయలుదేరాయి.దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి.

దాలిగుంటలో పిల్లులు

బద్దకంగా లేచి వళ్ళు విరుచుకొని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి.

పువ్వులు వికసించాయి. నవ్వడం అలవాటయిన పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తి

పుణ్యానికి ఏడవటం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడవటం మొదలు పెట్టారు.కొద్దో

గొప్పో పాడిగల ఇళ్ళలో అమ్మమ్మలూ, బామ్మలూ భూపాల రాగచ్చాయలో "అమ్మా

గుమ్మడేడే " అని పాడుతూ మజ్జిగ చిలుకుతున్నారు. ముద్దబంతి పూలలా బొద్దుగా

పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకుమల్లే శోభిస్తూ కళ్ళు నులుపు

కుంటూ, అమ్మల చేతా, బామల చేతా సున్నితంగా చీవాట్లు తింటూ యిళ్ళు కల

కలలాడేలా తిరుగుతున్నారు. కొందరు గుమ్మాలలో పేడనీళ్ళు చల్లి, సంక్రాంతి

ముగ్గులు తీర్చిదిద్దుతూ, ముగ్గులంత సజీవంగా నవ్వుతున్నారు "

Monday, March 6, 2017

శ్రీకాళహస్తీశ్వరా! .

శ్రీకాళహస్తీశ్వరా!

.

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. 

శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!

.

శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా

రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్

దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు)

.

కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. 

సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి.

.

"ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, 

అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం 

నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

శ్రీనాధుడు రాసిన " భీమఖండం "లోని సూర్యోదయ వర్ణన .!

శ్రీనాధుడు రాసిన " భీమఖండం "లోని సూర్యోదయ వర్ణన .!

" చంద్రుడు వెలవెలపోగా,,

చుక్కలు పలుచబడగా,,

.

దిగుడుబావులలోని తామరలమధ్య తుమ్మెదల ఝుంకారాలు చెలరేగగా,,

.

కలువలు కన్నుమూస్తూ ఉండగా దిక్కులు తెలతెలవారాయి.

తూర్పుదిక్కున అరుణరాగం ఉదయించింది..""

ఉదయసంధ్య అనే కాంత నొసటిమీద అందగించే సింధూర తిలకమేమో !

.

దేవేంద్రుని రాణి నిండుగా అలంకరించుకుని చేతబట్టిన రత్న దర్పణమేమో !!

ఉదయగిరిమీద చిగిర్చిన మెత్తని కంకేళీ నికుంజమేమో !!! 

దేవేంద్రుని అంతఃపుర సౌధకూటంపై కనిపించే 

బంగారు పద్మమేమో !!!!

కాలమనే సిద్ధుడు పట్టి మ్రింగి వినోదార్ధం తిరిగి ఉమిసిన రసఘటకమేమో !!!!! 

ఆకాశమందిరంలోని దీపపు మొలకయేమో !!!!!

అన్నట్లు ఉదయించాడు సూర్యుడు ""

శుభోదయం !

అల్జమీర్లు !

అల్జమీర్లు !


.

ఇద్దరు జీవితంలో బాగా ఎదిగినవారు ఒక ఆడ, ఒక మగ ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. .

.

ఇద్దరుఒకరినొకరు చూసుకున్నారు.

.

ఆయన ఆవిడని చూసి నవ్వాడు. ఈవిడ ఆయనని చూసి నవ్వింది.

భోజనాల టేబిల్స్ దగ్గర ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు.

మళ్ళీ అదే సీను.

.

నవ్వుకున్నారు. చివరికి ఆయనకి ధైర్యం వచ్చి మేజువాణి దగ్గర ఆవిడని పక్కకి పిలిచి " 

మీరు నాకు నచ్చారు. మనం పెళ్ళి చేసుకుందామా "

అనడిగాడు. ఆవిడ " సరే" నన్నది.

ఆవిడను ఆయన ఇంటికి తీసుకు వెళ్ళేడు 

... 

పిల్లలను పిలిచి ఇదుగో చూడండి .. ఇమే మీ కాబోయే అమ్మ నచ్చిందా అని అడిగేడు.

.

అదేమిటి నాన్న అమ్మ ను మల్లి పెళ్లి చేసుకోవడం ఏమిటి అన్నడు .

.

కోడలు "మామ అత్త గార్ల మతి మరపు. మరి ఎక్కువ గా వుంది ..

.

వాళ్ళు భార్య భర్తలు అని మరచిపోయారు డాక్టరు దేగ్గెర కు

తీసు కు వెళ్ళాలి " అంది భర్త తో


జై పాతాళభైరవి !‘

జై పాతాళభైరవి !‘

.

‘పాతాళ భైరవి’విడుదలయ్యే వరకూ 

ఏయన్నార్ ప్రధానంగా జానపద చిత్రాల హీరో.

ఎన్టీయార్ చేసినవన్నీ సాంఘిక చిత్రాలు. 

.

ఈ ఒక్క సినిమాతో ఎన్టీయార్ జానపద హీరోగా స్థిరపడి, తన సినీ జీవితంలో అత్యధిక భాగం జానపద చిత్రాల హీరోగా ఎదిగారు.

.

ఏయన్నార్ తనను తాను పునరావిష్కరించుకొని, దేవదాసు వగైరా చిత్రాలతో సాంఘిక, ప్రేమ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి తరువాత ఏయన్నార్ నటించిన జానపదాలు మూడే మూడని సినీ గణాంక వివరాల నిపుణుల ఉవాచ

.

. ‘నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా...’ అనే 

పాతాళ భైరవిలోని తోట రాముడి పాత్రతో ఎన్టీయార్ కు దక్కిన 

మాస్ హీరో ఇమేజ్ చిరకాలం నిలిచిపోవడం విశేషం. 

ఒక్క సినిమా కెరీర్ నే మార్చేస్తుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. 

.


‘సాహసం శాయరా డింభకా. రాకుమారి వరిస్తుంది...’ అంటూ

 నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు చూపిన నట వైదుష్యాన్ని ఎవరైనా మర్చిపోగలరా. ఈ సినిమా తరువాతే ఆయనకూ స్టార్ నటుడి హోదా లభించింది.

 ఇక, ఘంటసాల సంగీతంలోని ‘కలవరమాయే మదిలో...’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడూ...’, ‘ఎంత ఘాటు ప్రేమయో...’ లాంటి పాటలు, అడవిలో మాంత్రికుడితో హీరో నడిచివెళ్ళేటప్పుడు వచ్చే నేపథ్య సంగీతం తలుచుకుంటే, 

ఇప్పటికీ ఒళ్ళు పులకలెత్తుతుంది

కన్యాశుల్కము గురజాడ అప్పారావు!

కన్యాశుల్కము గురజాడ అప్పారావు!

.

గిరీశం... యీవా`ళ మహాఉత్సాహంగా వచ్చానుగాని ఉత్సాహభంగంచేశావ్‌.

.

మధురవాణి... యెవిఁటా వుత్సాహం?


గిరీశం ...యిదిగో జేబులో హైదరాబాద్‌ నైజామ్‌వారి దగ్గిర్నించి వొచ్చిన ఫర్మానా. 

మానా`స్తం నవాబ్‌ సదరదాలత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహన్‌ జంగ్‌ బహద్దర్‌ వారు సిఫార్స్‌చేసి వెయ్యి సిక్కారూపాయలు జీతంతో ముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు.

అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం......


యింత శుభవార్తతెచ్చినా, దగ్గిరకి రానిచ్చావు కావుగదా? 

నాతో హైదరాబాద్‌ వస్తావా?

.

మధు రవాణి...(తలతిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్లమ్మని తీసికెళ్లండి..

.ఆ బోడిముండా ఎందుకు. వెళ్తేగిల్తే నీ తోనే వెళ్ళాలి. - అన్నాడు గిరీశం

కుంభ సంభవులు .! .

కుంభ సంభవులు .!

శివుని తపో వేడిమికి ఆయన త్రిశూలం నుండి జారి పడిన స్వేదం ఒక కన్యగా అవతరించింది. ఆమె శివ పుత్రిక. 

శివానుగ్రహంతో నదిగా మారి ఆమె నర్మద అయినది. ఇలాగే మరో సందర్భంలో శివుని స్వేదం నుండి చర్చిక అనే కన్య పుడుతుంది.

మన పురాణాలు, ఇతిహాసాల గాధల్లో మరో విధమైన పునరుత్పత్తి పద్ధతి కన్పిస్తుంది.

కుంభ సంభవులు అనగా కుండ నుండి పుట్టిన వారని అర్థం. కుండ నుండి మనిషి పుట్టడం ఏమిటి? ఇది మనకు విడ్డూరంగా వుండొచ్చు. కానీ`

విచ్ఛిన్నమైన గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుల వారు తన తపోశక్తితో నూరు కుండల్లో భద్రం చేయగా వాటి నుండి దుర్యోధనితో సహా నూరుగురు సోదరులు జన్మించారు. వీరంతా కుంభ సంభవులే.

కురు పాండవులకు విద్య నేర్పిన ద్రోణా చార్యుడున్నాడు. ద్రోణము అంటే కుండ. ఈయనా కుంభ సంభవుడే. ఇలాంటివి మరి కొన్ని వున్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన కుంభ సంభవు ఇద్దరున్నారు. సప్తర్షుల్లోని వశిష్టుడు, అగస్థ్యుడు వీరిద్దరూ కవల సోదరులు కుంభ సంభవులు. అదో ఆసక్తి కరమైన గాధ.

ఒకప్పుడు నారాయణాంశతో జన్మించిన నర నారాయణులనే సోదరులు మహాభక్తులు. తపస్సంపన్నులు. ఇరువురు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపో వేడిమికి ముల్లోకాలు తల్లడిల్లాయి. తన ఇంద్ర పదవి కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారని భ్రమ పడ్డాడు మహేంద్రుడు. వెంటనే ఆ సోదరులకు తపో భంగం కలిగించమని అప్సర భామలను పంపిస్తూ తోడుగా మన్మథుడ్ని, వసంతుడ్ని కూడా పంపించాడు.

బదరికా వనంలో అకాలాన వసంతం వెల్లి విరిసింది. అప్సర భామలు ఆడి పాడారు. మరుడు సుమశరాలు కురిపించాడు. కాని చెరకు విలుకాని సుమ శరాలు గాని బదరికా వనంలోని వసంతశోభ గాని, అప్సరసల సరస శృంగార నాట్య గీతాలు గాని నర నారాయణులను తపో భంగం కలిగించలేక పోయాయి. అప్పుడు కనులు తెరిచిన నర నారాయణులు అప్పటి కప్పుడు తమ ఊరువుల నుండి (తొడలు) అప్సర కామినులకు మించిన ఒక అద్భుత సౌందర్య రాశిని సృష్టించారు. ‘‘ఓ అప్సరలారా! మా తపోశక్తి మీకు తెలియదు. తలచుకుంటే మిమ్ము మించిన మదవతులైన మోహనాంగిలను సృష్టించ గలము. ఇదో... మా ఊరువుల నుంచి ఆవిర్భవించిన ఈ సౌందర్య వతి పేరు ఊర్వశి. ఈమెను మా కానుకగా మహేంద్రునికి వప్పగించండి. మా తపస్సు మహేంద్ర పదవి కోసం కాదని మా మాటగా చెప్పండి’’ అన్నారు.

అలా అప్సరల వెంట స్వర్గం వైపు వెళ్తున్న ఊర్వశిని సూర్య దేవుడు చూసి, మోహించి తన సూర్యా లోకానికి ఆహ్వానించాడు. సరేనని సూర్య లోకం వైపు వెళ్ళింది ఊర్వశి. దారిలో అగ్ని దేవుడు ఆమెను చూసి మోహించి తన కోరిక తీర్చమన్నాడు. ముందు సూర్యునికి మాటిచ్చినట్టు చెప్పింది ఊర్వశి. అయితే నన్ను తులుచుకుంటూ వెళ్ళు చాలు అన్నాడు అగ్ని. ఊర్వశి అలాగే చేసింది. అంతలో వాయు దేవుడు ఆమెను గాంచి మోహితుడై తన కోరిక చెప్పగా అదే సమాధానం చెప్పింది ఊర్వశి. వాయు దేవుడు కూడ తనను తలచుకొంటూ వెళ్ళమని కోరాడు. ఆ విధంగా మనసులో అగ్నిని, వాయు దేవుని తలచుకొంటూ సూర్య లోకం చేరింది ఊర్వశి. సూర్యుడు విషయం తెలుసుకొని ఆగ్రహించి` ‘‘నీవు ఇరువుర్ని తలచుకొంటూ నా వద్దకొచ్చావు. నీకు సూర్య లోక ప్రవేశం లేదు. మహేంద్రుడి వద్దకే వెళ్ళమన్నాడు.

ఆ విధంగా తన వద్ద కొచ్చిన ఊర్వశికి సముచిత స్థానమిచ్చి తన అప్సరగా చేసుకున్నాడు ఇంద్రుడు. అయితే ఇది ఇంతటితో అయి పోలేదు. ఊర్వశి సౌందర్యాన్ని చూసిన మోహంలో తాపం భరింప లేని అగ్ని, వాయువు ఇరువురూ తమ తేజస్సును ఒక కుండలో భద్రపర్చి వెళ్ళి పోయారు. ఆ కుంభంలో నుండి ఇరువురు కవలు బయటి కొచ్చారు. ఆ శిశువులే వశిష్టుడు, ఆగస్త్య మహర్షులు.

పార్వతి నందునుడు గణేశునికి ఏనుగుతల చేర్చబడింది. త నరక బడిన దక్షునికి మేకతల అతికించబడింది. అలాగే మృగ శీర్షంతో సహజంగా అవతరించిన దేవతలున్నారు. వారిలో నరశింహుని ముందుగా చెప్పుకోవాలి. తురగ ముఖులు మనకు ఇద్దరు కన్పిస్తారు. ఒకరు గాన గంధర్వుడు తుంబురుడు, రెండవది సాక్షాత్తూ నారాయణావతారమైన హయగ్రీవుడు. ఇంకా భైరవుడు కుక్క మొఖం కలిగిన వాడు.

Sunday, March 5, 2017

దైవ ప్రార్ధన రచన:భళ్ళముడి సీతారామమూర్తి

దైవ ప్రార్ధన

రచన:భళ్ళముడి సీతారామమూర్తి

(అ ముద్రితము. చేవ్రాత ప్రతినుండి సంగ్రహించ బడినది)

ఆ: ఎన్ని తలపులొవలపులునెన్నియెన్నొ

గుండెకుదులించినింపి నీగుడికివచ్చి

ముచ్చటగనెందరో దేవమొక్కుచుంద్రు

వారి భక్తియురక్తియెవ్వారికెరుక ||

2.

అందరిని జూచి యచ్చరునొందు చుందు

నీదు తత్వముతెలియని నేను నిన్ను

ఎటుల మెప్పించుటోస్వామి నెరుగనైతి

నన్ను నెరిగిననీవె నన్నాదుకొనుము||

౩.

మూర్తి సౌంద్య ముకెంతొ మురియుదు దేవ

నుతులవినినిన్ను నేనెంతొవెతకు చుందు

మనసు చలియించిఅంతలోమఱచు చుందు

ఎటుల గనుగొందునోయెరిగింపుమీవె!|


Saturday, March 4, 2017

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ !

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ…!…

కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అరటితొక్కా, బల్లచెక్కా 

ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ. 

ఉదాత్తమైన వస్తువు మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా చూడబడే సి

గరెట్టు లాంటి వస్తువు మీద “న భూతో నభివిష్యతి”

అన్నట్టు అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది

సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగు మర్యాద ప్రకారం సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం.


“సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ

పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు”

అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు. భర్త దగ్గరకు వచ్చిన భార్య సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరవుతుంది. ఆ సందర్భంలో సిగరెట్టు మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ సంభాషించుకునే పాట ఇది. తనకి భర్తలో నచ్చని ఈ ధూమపానసేవనం నుంచి ఎలాగయినా మరల్చాలని భార్య ప్రయత్నించడం, ఎన్నో వాగ్బాణాలను విసరడం, భర్త వాటిని తెలివిగా తిరగ్గొట్టడం ఈ క్రమంలో కొసరాజుగారి చమక్కులు ప్రేక్షకులకి, శ్రోతల మనసులకి చురుక్కమనిపంచడం, మనసుల్లో హాసపు మెరుపులు చమక్కుమనడం షరా మామూలే.

భారతీయుల్లో ఉన్న పెద్ద అవలక్షణం – విదేశీ వస్తువుల పట్ల మోజు. మన దేశంలో పొగాకు కు ఈ విధమైన వినియోగాన్ని పరిచయం చేసినవారు బ్రిటిషర్లు. బ్రిటిష్ దొరలు ఓ పైప్ నోట్లో వేసుకుని పొగను పీలుస్తూ వదులుతూ అధికారం ప్రదర్శిస్తూ దర్జాగా ఆర్డర్లు వేస్తుంటే ఆ దొరల స్టైల్ కి దాసోహమన్నారు చాలా మంది. అందుకే అలా విలాసంగా, కులాసంగా కనిపించడానికి వారిని అనుకరిస్తూ ఈ సిగరెట్ తో పొగతాగడంలోని ఆనందాన్ని ఊరికే రుచి చూడడానికి ప్రారంభించి చివరకు దానికి దాసోహం అన్నారు. “ దొరల్ దాగు బల్ సిగరెట్టూ“అంటూ ఆ భర్త సీమ దొరలను మెచ్చుకోవడం లో ఈ ఫాషన్ అనుకరణని చూపించారు కొసరాజు. తన కంపు తనకే ఇంపు కానీ ఇతరులకు కాదు కదా. భార్యకి ఆ సిగరెట్ వాసన కంపుగా కనిపిస్తుందందుకే.

“ కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు” అంటూ సెంటిమెంట్ తో అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది. మనిషి మీద ఒట్టు వేసి, ఆ పై మాట తప్పితే ఒట్టువేయబడిన మనిషికి ప్రాణం మీదకి వస్తుందని మన నమ్మకం. అందుకే తన మీద ఒట్టు వేస్తే భర్త ఆ పాడు సిగరెట్టు కాల్చే అలవాటు మానుకుంటాడేమోనని ఆమె ఆశ. కానీ ఆ భర్త ఒట్టు వేయడానికి ఒప్పుకుంటేనా.“కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు” అంటూ బతిమాలడం మొదలు పెట్టింది. కడుపునిండుతుందా, కాలు నిండుతుందా అంటూ ఏదైనా ప్రయోజనం లేని పనికి వాడే జాతీయాన్ని ఈ భార్య పాత్రతో అనిపించడం ఎంతో చక్కని ప్రయోగం.

“ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు “ అంటూ సిగరెట్టు గొప్పదానాన్ని వివరించబోతాడు. ఆంజనేయుడు తన తోకకు నిప్పంటించుకుని లంకను దహనం చేసాడు. ఆ పురాణ గాథని వక్రీకరించి భార్యకి సిగరెట్టు మంటతోనే ఆంజనేయుడు లంకాదహనం చేసాడని, అది అతి పవిత్రమైనదని చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ భార్య అతను అనుకున్నంత అమాయకురాలు కాదు. అందుకే – “ఎవడో కోతలు కోసాడు” అంటూ ఆ కల్లబొల్లి మాటలు నమ్మడం మీ తెలివితక్కువ అన్నట్టుగా ఖండించేసింది.

ఇక సిగరెట్ కాల్చడాన్ని ఓ సరదా వ్యాపకంగా చేసేవారు కొందరయితే దాన్ని ఓ మహా కళారాధనగా చేసేవారు మరికొంతమంది. ఈ సిగరెట్ పొగను బయటికి వదలడంలో రింగులు రింగులు తిరిగేలా మబ్బుల్లా కనిపించేలా చేయడం ఓ కళగా అభ్యసిస్తారు కొందరు. అలాంటి వారి గురించే ఈ మాట.

“ఈ పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు “ అని ఓ గొప్ప కళాసృష్టి చేయబోతున్నట్టు భార్యకి చూపించబోతాడు. కానీ భార్య దాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అలాంటి పనులు చేయబోయి, చేతకాక “ మీసాలు కాల్చుకోవచ్చు” అంటూ జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. నిప్పును నోట్లో పెట్టుకుని ఆటలు ఆడితే నోటిమీద మీసాలు కాలే ప్రమాదం ఎంతేనా ఉంది మరి.

కన్నెపిల్లలుగా ఉన్నప్పటినుంచే ఆడవాళ్ళు మంచి భర్తకోసం, అతని ఆరోగ్యం కోసం, క్షేమంకోసం లక్షా తొంభై నోములు నోస్తారు. వ్రతాలు చేస్తారు. అలాంటిది తన కళ్ళముందే ఆ భర్త ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లను ఊదొత్తుల్లా వెలిగిస్తుంటే భార్య మనసు ఎంత దుఃఖపడుతుందీ. అందుకే అంటుంది ఆ బార్య-

“ ఊపిరితిత్తుల కాన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లూ”అంటూ అతని ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుంది.

కానీ ప్రజలందరూ నిత్యం కొలిచే తెర వేల్పులు మన హీరోలు. ఈ కంపెనీ సిగరెట్లు కాల్చండి అంటూ పెద్ద పెద్ద హోర్డింగుల మీద నిలబడి చిద్విలాసంగా సిగరెట్లు కాల్చే ఫోటోలు ఎన్నో చూసాడు సదరు భర్త గారు. అందుకే ఆ డాక్టర్ల కన్నా తాను అభిమానించే తన యాక్టర్ల మాటనే నమ్ముతాడు. అంత గొప్ప యాక్టర్ సిగరెట్ కాలుస్తూ తనని కూడా కాల్చమని సలహా ఇస్తుంటే వద్దనడంలో ఏమీ సహేతుకం కనిపించదు అతనికి. ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు. ఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో.“కాదన్నారులే పెద్ద యాక్టర్లు “అంటూ భార్య మాటలకి రైమింగ్ గా జవాబు చెప్తాడు.

సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా “ పసరులా చేరి, కఫం పేరుకుని ఊపిరితిత్తులను పనిచేయకుండా చేసి క్రమంగా ఉసురు తీస్తుందని“ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ” తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని ” తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.

సిగరెట్ కాల్చేవారికి దాని పొగ సుగంధ పరిమళాలు వెదజల్లవచ్చు. కానీ ఆ పొగను పీల్చేవారి దురవస్థ వారికేం పడుతుంది. మిత్రులు తెలిసిన వారు, సిగరెట్ తాగుతుంటే పక్కనున్నవారు ముక్కు మూసుకుంటే మర్యాదగా ఉండదేమోనని మొహమాట పడేవారుంటారు. ఆ కంపు భరించలేక ఆ మాట చెప్పలేక ముక్కులు ఎగరేస్తారు.కానీ ఈ విషయాన్ని తనకు కావలసినట్టు అర్థం చేసుకుంటారు ధూమపానిస్టులు. అందుకే

“ పక్కనున్నవారు దీని సువాసనకు ముక్కులు ఎగరేస్తారు నీవెరుగవు దీని హుషారు”

అంటూ ఆమెకి పరమళాన్ని గుర్తించే శక్తిలేకపోవడమేమిటో నని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఈ కంపు భరించలేకనే ధియేటర్లలో ధూమపానాన్ని నిషేధించారని అతన్ని వారించబోతుంది భార్య. ధియేటర్లలో ఈ ధూమపాన నిషేదం ప్రకటించినదగ్గర్నించే సినిమాలకు డబ్బులు వసూళ్ళు తగ్గిపోయాయని ఆ అస్త్రాన్ని తిప్పికొడతాడు భర్త. ఇది తిరుగులేని అస్త్రం మరి. సినిమాలు బాగా ఆడకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ధూమపానం పైన నిషేధమే దానికి కారణమని చెప్పడం కొసరాజు గారి చమక్కు.

.

https://www.youtube.com/watch?v=E_ODm_JQLkw

Friday, March 3, 2017

కైకవిలాపం!

కైకవిలాపం!

.

దశరథుడు కైకతో కోపముతో,నిస్సహాయత తో అన్న పద్యాలు !

(విశ్వనాథ వారి ' 'రామాయణ కల్ప వృక్షం' లోనివి)


"వరమిచ్చిన ప్రభువగు శం 

కరు నెత్తిని చేయి పెట్టు కరణిని నాచే

వరముఁగొని హరీ! హరి! నా 

వరమున నన్నణఁగద్రొక్కు పాతాళమునన్. "

.

(కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/207)

.

“శంకరుని నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుని వలె” అనే

ఈ ఉపమానం గొప్పగా ఉన్నది. సారస్వతములో ఇంత గొప్ప ఉపమానాలరుదు.

.

"ఇషువుల నొడ్డుచున్ నిలిపి యేటికిఁ గోటికిఁ లాగు వాజులన్

గృషి మెయి మూర్ఛితున్ నిను భరించిన దానికి వైజయంతపున్

విషమ మహాహవ క్షితిని వేడక యిచ్చి వరద్వయంబు పౌ 

రుష మిది గాక యిప్పటికి రూపముఁదాల్ప వహో! వరంబులున్."

.

(కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/189)

.

“(ఇషువు) బాణములను అడ్డుకొనుచు, దేవాసుర యుధ్ధభూమిలో నిన్ను (భరించిన) రక్షించి నందులకు నీవిచ్చిన వరములు ఇప్పటికీ రూపము దాల్చలేదు’ అంటోంది కైక. పైగా, 

“వేడక” అనే పదం విశ్వనాథ వారు గొప్పగా ప్రయోగించారు. 

ప్రమాణాలు చేసి, పరిణామాల నెదుర్కోవటం త్రేతాయుగ రాజ లక్షణం! 

రాజులు చేసిన ప్రమాణాల పరిణామాలను ప్రజలెదుర్కోవటం కలియుగ లక్షణం!

.

ఉ.

"తల్లినిబోలెఁ జూచును గ దా నిను రాఘవుఁడెల్ల వేళలం

దుల్లములోన నీచెనఁటి యుద్యమ మేటి కొనర్పఁ బూనితే;

పెల్లు విషంపుఁ బాము నిటు వీఱిఁడి నై నృపకన్య యన్భ్రమం

బొల్లువడంగ నాదుగృహ ముం జొర నిచ్చితిఁ జేటు దెచ్చితిన్".

.

( మందరము - అయోధ్య - 311 )

.

చెనఁటి యుద్యమము - చెడు ప్రయత్నము

వీఱిఁడి నై - బుద్ధిమాలిన వాడినై 

పొల్లు వడంగన్ - చెడి పోవుటకు

రాజకన్య అనే భ్రమతో పామును యింటిలో పెట్టుకొని చేటు తెచ్చుకున్నాను అని కైక ను నిందిస్తున్నాడు దశరథుడు.

.

విశ్వనాథ వారి రామయణ కల్పవృక్షము లో కైకయి 

వరములు తెలపగనే దశరథుడు 

.

ఉ.:

"పచ్చని చెట్టుపై బిడుగుపడ్డవిధంబున గుప్పకూలి రా

జచ్చెరువున్ భయంబు హృదయంబునయం దసమప్రచారవా

యూచ్చలదుగ్రతాడన రయోద్ధతి నొప్పగ మేథ, దృష్టి, మ

త్యుచ్చమనీషలున్ స్మృతిక్రతుల్ వశజాతులు లేక ఱాయియై

.

ప్రతిక్రియలు:

1 అశనిపాతంతో కుప్ప కూలుట. పచ్చని జీవితము దగ్ధమగుట.

2 ఆశ్చర్యము భయము-"నయము భయము విస్మయము గదుర"

అన్నట్టు. దాని వలన గుండెలొ రక్తప్రసారము అతలాకుతలమగుట.

౩.శ్వాస క్రమము, తాపములలో మార్పులు

4.మేధ, దృష్టి, మతి, ఉచ్చ(రణ),మనీష,స్మృతి, క్రతుల్, వశము తప్పి 

ఈ 8 లక్షణాలు దశరథుని మతి పోవుట సూచించును.

5. శిల గా స్పందన లేకుండుట

విశ్వనాథ వారు బుద్ధి గురించి 8 విశేషణాలు ఎందుకు వాడేరా

అని ఆలోచించ వలసినది. 

యుద్ధాకాండలో హనుమంతుడు విజయ వార్త చెప్పినప్పుడు 

సీతాదేవి హనుమంతుని ప్రశంసిస్తూ;

"బుద్ధ్యా హ్యష్టాజ్గ్ యా యుక్తం త్వమేవార్హసి భాషణమ్ 116-27

కం: అతి లక్షణసంపన్నం బతిమాధుర్య గుణభూషణాంచితమును స/

మ్మత మష్టాంగయుతం బగు మతి యొప్పగ నీవనేర్తు మాటాడంగన్

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము -యుద్ధ కాండ- 2618 

శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు అష్టాంగ లక్షణములను వివరించారు:

" గ్రహణం ధారణంచైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహార్థ విజ్ఞానం 

తత్త్వజ్ఞానంచ ధీగుణాః" 

గ్రహించుట, ధరించుట,స్మరించుట,బోధించుట,ఊహించుట, 

అపూర్వము నూహించుట,అర్థముతెలియుట, తత్త్వము తెలియుట

ననునవి యష్టాంగములు

విశ్వనాథులకు నమస్సులు

బారిష్టర్ పార్వతీశం' అమ్మడానికి రచయిత పడిన కష్టాలు!

బారిష్టర్ పార్వతీశం' అమ్మడానికి రచయిత పడిన కష్టాలు!


ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్థిగారి ) మాటలలో......."ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు.

.

"వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను బారిస్టర్ పార్వతీశం. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.... ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొన వచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయా పావలా... రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? "...... నాకు చాల బాధ కలిగింది.

బారిస్టర్ పర్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?

"ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అనడిగాను.

"వంద. అంటే నూట పాతిక రూపాయిలవి"

"మీరెక్కడికి వెళ్లకండి. అవి అమ్ముడయే మార్గం నేను చూస్తాను" అన్నాను.

ఆ మర్నాడు ఒక తెల్ల కాగితం మీది ఒక ఆహ్వాన పత్రికను రాశాను ఇలా. "మొక్క పాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకం తో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయింత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి దడాబామీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది" అంటూ ఒక విద్యార్థికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులలు చూపించి, వారు చూసి నట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించాను.

.

కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సంర్పించినవి. మొక్క పాటి వారు ఎంత సంతోషించారో.... నా చేతులు పట్టుకొని " నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి.... నీ వల్లనే" అన్నారు. క్షమించండి ఇది నావల్ల గాదు,

బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల ... ఒక మంచి గ్రంథాన్ని ... రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్లా....... ఇది వీరందరి రసజ్ఞత.. సంస్కారమూను.." అన్నాను. 

అదే ఈ రోజుల్లో అయితే సాద్యమేనా? ........


పురాణాలలో మన్మథుడు!

పురాణాలలో మన్మథుడు!

ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. 

అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. 

ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.

మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు: అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడినది.

Thursday, March 2, 2017

అగ్రహారము!

అగ్రహారము!

.

అగ్రహారము బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం.

అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.

సర్వాగ్రహారము అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.

శ్రోత్రియాగ్రహారము అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం.

జోడి అగ్రహారము, లేదా బిల్మకా అగ్రగారము లేదా, కట్టుబడి అగ్రహారము రాబడిని బట్టి హెచ్చుతగ్గులతో ఉండే అద్దెకు ఇచ్చిన గ్రామం.

అగ్రహారికుడు అంటే అగ్రహారానికి చెందిన బ్రాహ్మణుడు.

పన్ను రాయితీతో గానీ, పన్ను లేకుండా గానీ ఉన్న గ్రామభూములు కలవాడిని అగ్రహారమనుభవించేవాడు అంటారు.

తంబు చెట్టియార్!. .

తంబు చెట్టియార్!.

తంబు చెట్టు వీధి చాల ముఖ్యం మయిన విధి చెన్నై లో ,

ఆంధ్ర పత్రికకు ముద్రణ స్థలం... 

ఉమ్మడి బంగారు చీట్టి కూడా విరి వంశ స్తులే .. 

ఉమ్మిడియర్స్ .. అంటారు ..

వీరు తెలుగు వారే ..1977 లో మేము విరి ఇంటిలో భోజనం చేసాం.

విశ్వనాధ సత్యనారాయణ గారు ఇక్కడే బస..

అతిధి ఆదరణ మారు పేరు ఉమ్మడియార్స్ ..

ఉమ్మడి పార్ధ సారధి గారు నా స్నేహితులు.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! ( శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. గారి భావగీతం. )

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!

( శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. గారి భావగీతం. )

.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు

కల విహంగమ పక్షముల తేలియాడి

తారకామణులలో తారనై మెరసి

మాయమయ్యెదను నా మధుర గానమున

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

మొయిలు దోనెలలోన పయనంబొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పాడుతు చిన్కునై పడిపోదు నిలకు

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ములాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహస్యాలు పల్కుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేడె పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనంబాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పూవునకును పోవుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను

మధుపమయ్యెద చందమామనయ్యెదను

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను

అలరునయ్యెద చిగురాకునయ్యెదను

పాటనయ్యెద కొండవాగునయ్యెదను

పవనమయ్యెద వార్ధిభంగమయ్యెదను

ఏలకో యెప్పుడో యెటులనో గాని

మాయమయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?

ఆకాశవీణపై ఉదయరాగం! (ఈ గీతాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రచించారు.)

ఆకాశవీణపై ఉదయరాగం!

(ఈ గీతాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రచించారు.)

.

ఆకాశవీణపై ఉదయరాగం

హృదయాకాశ వీణపై ప్రణయ రాగం

కనగలిగే కనులుంటే

వినగలిగే మనసుంటే ॥

.

ఉదయానికి హృదయానికి రాగం ప్రాణం

అది లేకుంటే జగతికేది జీవాధారం ॥

.

తరులు గిరులు ఝరులు

కసుమ వల్లరులు ఏవీ

కలల వెన్నెలలు మన

వలపుల వాకిళ్ళు ఏవీ ॥

.

ప్రకృతి పురుషులోకటైతే

రాగం భావం

రాగానికి భావానికి

రంగభూమి మధుమాసం ॥

.

Wednesday, March 1, 2017

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన 

సరోజని నాయుడు గారు రాసిన ఈ కవిత గుర్తుచేసుకుందామా?

(ఈ రోజు ఆమె వర్ధంతి ..)

Bangle sellers are we who bear

Our shining loads to the temple fair…

Who will buy these delicate, bright

Rainbow-tinted circles of light?

Lustrous tokens of radiant lives,

For happy daughters and happy wives.

Some are meet for a maiden’s wrist,

Silver and blue as the mountain mist,

Some are flushed like the buds that dream

On the tranquil brow of a woodland stream,

Some are aglow with the bloom that cleaves

To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,

Meet for a bride on her bridal morn,

Some, like the flame of her marriage fire,

Or, rich with the hue of her heart’s desire,

Tinkling, luminous, tender, and clear,

Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey

For she who has journeyed through life midway,

Whose hands have cherished, whose love has blest,

And cradled fair sons on her faithful breast,

And serves her household in fruitful pride,

And worships the gods at her husband’s side

.

కాలమెంత మారినా ,నాగరికత ఎంత పెరిగినా ..వనితల మనసులు దోచే గాజులు మాత్రం.. రూపలెన్నో మారుతున్నాయి ,కానీ.. సింగారం లో వాటి స్థానం మాత్రం.. చెక్కుచెదరకుండా.చిరస్థాయి గా అలాగే ఉంది

క్రీ.పూ. 2300 – 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు,నెమళ్లవంటి ముఖాకృతిలో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు , నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి.

హిందూ సంస్కృతి

అతి పూరాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఇకటి. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి మట్టిగాజులు. చేతికి గాజులులేని స్త్రీలను వుహించలేము. స్త్రీలచేతులకు గాజులు వుండటం గౌరవ సూచకము.స్త్రీలు ఆభరణాలపై,పట్టుచేరెల పై ఎంత మక్కువ చూపెదరో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయములో ఒకభాగము. ముతైదువకు వుండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటి. గాజుల తయారి,అమ్మకం పై ఆధారపడి నేటికి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.ఎక్కడ తిరునాల, లేదా జాతర జరిగిన మనకు తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మేదుఖాణాలు. గ్రామ ప్రాంతాలలోని వారపు సంతలలో కాడా గాజులమ్మేవారు కన్పిస్తారు. పూర్వకాలములో ప్రత్యేకముగా ఒక కులము (గాజుల బలిజ) వారు ఈ గాజులమ్మే వృత్తిలో వుండేవారు. గాజుల వుత్పత్తిదారులనుండి గాజులను టోకులో కొనుగోలున తెచ్చుకుని వూరూర తిరుగుచు, ఇంటింటికి తిరిగి గాజులమ్మేవారు. పూర్వకాలములో ఇంటిలో పెళ్ళి జరిగిన, శ్రీమంతము జరిగిన, లేదా ఏ శుభకార్యము జరిగిన గాజులోళ్ళను ఇంటికి పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడవాళ్ళు గాజులు వేయించుకుని, వారికి నమస్కరించి, తగిన విధముగా సంభావన యిచ్చి పంపేవారు.ఏదైన కార్యము మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వచ్చిన శుభకరమని, వెళ్ళె కార్యాము జయప్రథముగా జరుగుతుందని భావిస్తారు. ఆధునీక కాలములో వచ్చిన పెను మార్పుల కారణముగా వూరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరిగైపోయారు. కాని గాజుల వాడకం మారలేదు, తగ్గలేదు. అధునాతనంగా, పారిశ్రామికంగా దేశము మారినను, ఇప్పటికి గాజుల పరిశ్రమ హస్తకళ/చేతి వృత్తుల పరిశ్రమగా కొనసాగుతు, కొన్ని లక్షల మధ్య తరగతి కుటుంబ ఆడవారికి జీవనోపాది కల్పిస్తున్నది. వేదకాలం నాటి కన్న ముందే స్ర్తీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారలను బట్టి తెలుస్తున్నది. మహోంజొదార త్రవ్వకాలలో లభించిన చిత్రాలలో చేతికి కంకణంధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. యక్షిణి చిత్రాలలోని కూడా యక్షిణి చేతికి కంకణం ధరించినది. బాణబట్టు తన కావ్యములో సరస్వతిదేవి చేతికి గాజులు (కంగణ్‌) ధరించినట్లుగా పెర్కొన్నాడు.పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద, మౌర్య సామ్రాజ్యకాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాలలోని స్త్రీలు గాజులు (కంగణ్‌) ధరించడం కన్పిస్తున్నది. B.C.230-100 నాటికే సిందులోయలో గాజులు ధరించెవారని తెలుస్తున్నది. జానపదపాటలలో,కావ్యాలలో,సాహిత్యములో గాజుల ప్రస్తవన విస్రుతముగా కన్పిస్తున్నది.సిక్కులు తమ మతాచారం లో లోహంతో చేసిన గాజును ధరించెదరు.దానిని ‘కడ’ (kada) అంటారు.చేతికి ధరించే ఈ కంకణములను ఎక్కువగా గాజు (Glass) తో చెయ్యడం వలన “గాజులు” అనే పేరు తెలుగులో రూడి అయ్యింది. గాజులనే కరకంకణములని కూడా అంటారు. గాజులను సంస్కృరములో ‘కంకణ్‌’ అనియు, హిందిలో ‘చిడియ’, ‘చుడ’ అని అంటారు. పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతము (ivory) తో చేసిన గాజులని ధరించదం సంప్రదాయం. ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఏర్రచీర, ఏర్రగాజులు ధరించడం శుభదాయకంగా తలంచెదరు. మహరాస్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితి. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.

అలాగే పూర్వకాలంలో రాజస్తాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలము మణికట్తు నుంచి,ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు.అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, మరియు సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా వున్నది. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురు తో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చును.స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా,మూడుపులుగా సమర్పించెదరు. కలకత్తలో కాళి దేవతకు ఎర్రగాజులను భక్తులు సమర్పించుకుంటారు. మిగాతా ప్రాంతాలలో నల్లటి గాజులను సమర్పించుకుంటారు. దక్షిణ భారతదేశములో స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు, పుట్టింటి వారు ‘శ్రీమంతము’లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు.గాజుతో చేసె గాజుల పరిశ్రమను మొగలుల కాలములో బాగా ప్రోత్యాయించారు. ముఖ్యముగా ఫెరొజాబాద్‌లో గాజుల పరిశ్రమ అబివృద్ది చెందుటకు కారణము మొగలు సుల్తాను లు యిచ్చిన ప్రోత్యాహమే కారణము.