Wednesday, August 31, 2016

ఆడపిల్ల !

ఆడపిల్ల !

రోడ్డు మీద ఒకమ్మాయి కనిపిస్తే చాలు మనసులో సునామీ లా వంద ఆలోచనలు క్షణం లో ఒచేస్తాయి... వెంటపడి వేధించి, కుదరకపోతే చంపెసేతంతటి దరిద్రంగా తయారవుతోంది నేటి సమాజం.... ఇంతటి క్రూరం గా తాను మనిషిని అన్న నిజాన్ని కుడా మరిచిపోయి అడవి జంతువులా ప్రవర్తిస్తున్నారు.....

వీళ్ళందరూ ఒక ఎత్తైతే ప్రతి రోజు అమ్మాయిలని మానసికంగా వేదిన్చేవాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు... ఆ వేదనలకు తట్టుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతూ ఎంత మంది ఆడపిల్లలు ప్రతీ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారో...

ఏ స్త్రీనైతే నవ్వు భాధపెడుతున్నవో అదే స్త్రీ జన్మనివ్వకపోతే నవ్వు అసలు ఈ భూమి మీద లేవు అనే నిజాన్ని గుర్తెరిగి ప్రతీ ఒక్కరు ప్రవర్తించాలని ఆశిస్తున్నాను..!

శివారెడ్డి కవి(తా) పరిచయం !

శివారెడ్డి కవి(తా) పరిచయం !


(కన్నెగంటి చంద్రశేఖర్, )

"ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు 

జనమున్నారు జనకంటకులున్నారు 

ప్రజలున్నారు ప్రజల్ని హింసించే ప్రభుత్వమూ వుంది గడ్డం

పెంచుకుని బొట్టు పెట్టుకుని ప్రభుత్వ జపమాల తిప్పుతావా 

జనంలో కలిసిపోయి జనయుధ్ధాన్ని ఎక్కుపెడతావా 

నిర్ద్వంద్వంగా నిర్ణయించుకో నిశ్చయించుకో 

నిజం పలకటం నీకూ మాకూ క్షేమదాయకం" 

(ఎటు నిలబడతావో, మోహనా! ఓ మోహనా!, 1987)


అంటూ తన మార్గాన్ని ఎన్నుకొని తన కవిత్వాన్ని ఎక్కుపెట్టటమే

కాక ప్రతి పాఠకుణ్ణీ నిలదీసి ప్రశ్నిస్తున్న కవి కె. శివారెడ్డి.

విప్లవ సాహిత్య సంఘాలకు బయట ఉంటూనే విప్లవ సాహిత్యాన్ని

సృష్టిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నా, తనదంటూ ఒక ప్రత్యేకమైన

శైలీ, పదజాలం ఏర్పరచుకున్న కవిగా శివారెడ్డి ప్రముఖ స్థానంలో 

నిలబడతారు. ఇవాళ తెలుగు కవిత్వాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న 

వాళ్ళలో స్పష్టంగా వినిపించే గొంతు శివారెడ్డిది. 1980ల తర్వాత కలం 

పట్టిన ఆధునిక కవులంతా శివారెడ్డి వ్యక్తిత్వ కవిత్వాలతో ప్రభావితం

కాబడ్డవారేనన్నది విమర్శకులంతా అంగీకరిస్తున్న సత్యం.


ఇతని కవిత్వాన్ని గురించి పాపినేని శివశంకర్ "విప్లవకవి దృక్పథం 

జీవితంలోని ఎన్నో సంక్లిష్ట కోణాలను స్పృశించగలదని శివారెడ్డి 

నిరూపించారు. మట్టి మీదా మనిషి మీదా మమకారం, ఒక స్వఛ్ఛంద 

లక్షణం, సాధారణ వాక్యాల్లో అసాధారణ కవితాస్థాయి అతనిలో

కనిపిస్తాయి. వచన కవితా రూపానికి గొప్ప స్వేఛ్ఛ నిచ్చారు" అన్నారు."తల్లీ! నీకు నమస్కారాలు

నన్ను కన్నందుకు 

కని, నా ఈ జనం మధ్య పారేసినందుకు." 

(తల్లీ! నీకు నమస్కారం, భారమితి, 1983) 


అన్న పంక్తుల్లో జనం మీద ఎంత ప్రేమ కనబడుతుందో 


"మట్టి కన్న బలమైందీ ప్రియమైందీ ప్రాణప్రదమైందీ

సువాసనభరితమైందీ మరేదీ లేదు 

అందుకే మట్టి నా జీవితం నా అనుభవం నా స్వప్నం -

నగ్నంగా నీళ్ళలోకి దూకినట్టు మట్టిలోకి దూకుతాను" 

(నగ్న భూమ్మీద, మోహనా! ఓ మోహనా!, 1984) 


అంటున్నప్పుడు అంత ప్రేమా మట్టి మీద ఉన్నట్టు తెలుస్తుంది.


"ధ్వంసం చేయదగిందేదీ లేకపోతే నీకీ లోకంలో 

నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి" 

(ధ్వంసం, నేత్రధనుస్సు, 1978) 


అంటూ నిక్కచ్చిగా, నిర్దాక్షిణ్యంగా తీర్పునిచ్చిన కవే 


"ఆమె ఎవరయితే మాత్రమేం ఎలా కదుపుతాం? 

ఒక సంక్షుభిత పగటి తర్వాత 

ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత 

ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని 

భయంకర పశువు పగటి తర్వాత 

విశ్రమిస్తున్న ఆమెను కదపడం ఎలా?" 

(ఆమె ఎవరైతే మాత్రం, కవితా ఓ కవితా, 1989) 


అంటూ ఇంటా బయటా పగలల్లా శ్రమించి, మరో పగటికోసం సిధ్ధమవుతూ 

నిద్రిస్తున్న ఆమెను లేపొద్దని చెపుతూ ఆమె శ్రమను గుర్తించి ద్రవించడం 

చూస్తాం.


శ్రీ శివారెడ్డి తొలి కవితా సంకలనం "రక్తం సూర్యుడు" 1974లో 'ఫ్రీవెర్స్ ఫ్రంట్' 

బహుమతి అందుకుంది. తర్వాత "చర్య", "ఆసుపత్రి గీతం","నేత్ర ధనుస్సు", 

"భారమితి" సంకలనాలు వెలువడ్డాయి. "మోహనా! ఓ మోహనా!" సంకలనానికి 

1990లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 


1991లో "శివారెడ్డి కవిత" పేరిట ఒక సమగ్ర సంపుటం ప్రచురింపబడింది. 

"...దశలవారీగా సంపుటి నుంచి సంపుటికి పరిణామం చెందుతూ, వైవిధ్యం 

సంతరించుకుంటూ తీవ్రతరమవుతూ అనుభవ సంపన్నతతో" ముందుకుపోతూ, తన

కవిత్వానికి "లోతునూ, విశాలతనూ, గాఢతనూ, ఒక ప్రత్Yఏకతనూ" ఆపాదించిన 

శివారెడ్డి కవిత్వంలోని వివిధ గతులనీ, ఆ వైవిధ్యపు అంతస్సూత్రాన్నీ 

పరిచయం చేసే రెండు కవితలను చూడండి.


తరమ్మారినా...

----------------ఆ గేటు పక్క

బెరుకు బెరుగ్గా - బెదురుగా 

నిలబడ్డాడు - మూడేళ్లవాడు, 

లోన వాళ్ళమ్మ బాసాన్లు తోముతుంది 

బయట వాళ్ళయ్య ఏడ రాళ్ళు గొడుతున్నాడో - 

వాళ్ళయ్య కూడా 

అదే వయసులో అలానే 

ఈ గేటుపక్క కాకపోతే 

మరో గేటూపక్క 

నిలబడే వున్నాడు


("చర్య" కవితాసంపుటి, 1975 నుండి)


మోహనా! ఓ మోహనా!

--------------------నాకింద పక్కలానో నావకింద నీళ్ళలానో

కళ్ళకింద నీడలానో ఆకాశం కింద పక్షిలానో

పక్షి రెక్కల కింద గాలిలానో,  ఆకు సందుల్లో నర్తించే

కిరణపుంజంలానో

ఎండాకాలం గాలి మండి పైకి లేచినప్పుడు నువ్వు కనపడతావు

వీధిలో "ఎర్రటి సూర్యుడు రాయి" నెత్తి మీద పడ్డప్పుడు నువ్వు

వినపడతావు

దూర దూర ప్రాంతాలనుంచి తరుముకొచ్చే -

తోటల మీదుగానో   నదీ జలాల మీదుగానో

పంట పొలాల మీదుగానో -

గాలి ఉప్పెనలా ముంచెత్తుతావు

ఎప్పుడు చూచినా నీ వేళ్ళు రక్తమయాలయ్యే వుంటాయి

ఎప్పుడు చూచినా నీ కళ్ళు సూర్యాస్తమయాలయ్యే వుంటాయి

పొద్దుటి పూట తలుపులు ఓరగా తీసే వుంటాయి

రాత్రి వేడి గాలంతా అయిష్టంగానే బయటికి నడుస్తుంది

కోడి కూతల్లేని ఉదయ సంధ్యలు

నీ నగ్న పాదాల్లా వస్తూనే వుంటాయి

చేతులెత్తి ఎవ్వరికీ నమస్కరించలేక

దేహాన్నిచ్చి జీవితాన్ని కొనుక్కున్నావు

కళ్యాణ మందిరం పక్కన తెంచుకోలేని 

నాగపాశాలు  కంఠానికి బిగుసుకుంటాయి

మనసుకు పడ్డ ఈ బేడీలు ఎవ్వడూ విప్పలేడు


చేదైన వేపచెట్టు చిగురించిన వసంతకాలంలా నువ్వు -

అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు

నిన్నా ఉన్నతాసనంలో చూచినప్పుడు

మంజులత్వం పొందిన కాఠిన్యాన్ని చూచినట్టు

నిన్ను నువ్వు హత్య చేసుకున్న సంఘటన  కళ్ళముందు మెదిలినట్టు -

ఇన్నాళ్ళ అజ్ఞాతవాసం తర్వాత

ఇదుగో ఈ ఆఫీసు తోటలో కూస్తున్న కోయిలా

నువ్వేం తిన్నావో తెలియదు గానీ

ఇన్నాళ్ళ తర్వాత నీ కంఠంలో కొత్తగా జాలి ధ్వనిస్తుంది

జాలిలో పుట్టిన క్రోధం దర్శనమిస్తుంది

ఎంత క్రూరత్వం!

అందాన్ని అనాకారిగా తయారుచేసే క్రూరత్వం

ప్రతీదాన్నీ తాసులో తూచే క్రూరత్వం

ప్రతీదాన్నీ వస్తువుకింద మార్చి అమ్ముకునే క్రూరత్వం

నీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని   కుదించి 

కుదించి, ఖండించి పార్శిల్ చేసి  విదేశాల కెగుమతి చేసే

క్రూరత్వం

నీ నుంచి నిన్ను విడదీసి   నిన్ను హరించి సంహరించే క్రూరత్వం

నా జ్ఞాపకాల్లో బతుకుతున్న మోహనా!

హేమంతగాన చిరులేత ఎండల కళ్ళ మోహనా!

నా స్మృతిపేటికలో పదిలంగా వున్న వరిమొవ్వులోని మంచు బిందువా!

తొలగించేకొలది మిగిలిపోయే తెరల్లో మరిగిపోతున్న మోహనా!

లేవాలి గదా, లేచి పక్కల్ దీసి మంచాలెత్తి  

ముఖాల్ కడిగి   ప్రవాహంలో పడిపోవాలి గదా -

దయలేని విధి నిర్వహణలో

రోజుకో అంగం తర్పణ గావించాలి గదా -

బతుకు మోహనా! బతుకు

బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన

బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన

బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన

ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!

నా అక్షరాల్లో ఒక అక్షరం నా ముందు ఎదిగి

జాలిగా నా మీద వంగి నా చుబుకాన్ని తాకితే నువ్వు గుర్తొస్తావు

ఎప్పుడన్నా రాస్తున్నప్పుడు పాళీ చిట్లి  కలం కళ్ళు కనబడకపోతే

నువ్వు గుర్తొస్తావు

గొంతెత్తి శ్రీ శ్రీని స్మరిస్తుంటే

ఏ సంప్రదాయవాదో విసిరిన రాయి నుదుటికి తాకి రక్తం చిమ్మితే నువ్వు

గుర్తొస్తావు

ఏకాంతంగా కూచున్నప్పుడు - కాంతిని చూచి గదిలోకొచ్చి

అద్దం మీద బల్లికి ఎరవ్వబోతున్న సీతాకోక చిలుకని చూచినప్పుడు

నువ్వు గుర్తొస్తావు

ఏ ఆడపిల్లని చూచినా

రాత్రికీ పగటికీ మధ్య కొట్టుకుంటున్న నల్లని తెరలా

నాలో ఎల్లప్పుడూ కదుల్తూనే వుంటావు


(ఏప్రిల్ 3, 1984)

కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.


కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.

.

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది:


కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా

గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్

లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే

గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.  


దీనికి రాముని చిన్నతనం నుండే చక్కని ప్రాతిపదిక వేసారు విశ్వనాథ. కైక, రాముల మధ్యన ఒక అపురూపమైన అనుబంధాన్ని సృష్టించారు కల్పవృక్షంలో.


కాళ్ళువచ్చినదాదిగా గైక కొఱకు

పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి

నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొఱకు

నంగలార్చుచు జను గేకయాత్మజాత


రాముని పసితనం నుండే ఏర్పడిన అనుబంధమది. రాముడేదైనా అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, అది కైకమ్మకి చూపిస్తే కాని అతనికి తృప్తి ఉండదు. అది చూసి కైకేయి ఆనందబాష్పాలతో అతనికి దిష్టి తీస్తుంది. రామునికి ఉపనయనమైనప్పుడు, కైక యిచ్చిన భిక్షేమిటో తెలుసా? ఒక చుఱకత్తి, వజ్రంతో చేసిన వాడి బాణము, అని విశ్వనాథవారి కల్పన. అది చూసి రాముడెంత మురిసిపోయాడని! అంతేనా. రాముని ధనుర్విద్యాభ్యాసంలో కైకేయి ఎంతటి శ్రద్ధ తీసుకొనేదో!


పటుబాహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే

యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు, “నోహో తండ్రి, యా బాణమి

ట్టటు నట్టి”ట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప జె

ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్


విల్లు ఎలా పట్టుకోవాలో, బాణాన్ని ఎలా సంధించాలో, కైకేయి చెప్పినట్టే చేస్తాడు రాముడు. అలా కైక చెప్పినట్టు లక్ష్యాన్ని ఛేదించి రాముడు నవ్వితే, అతడిని చూసి కైక మురిసిపోతుంది. రామభద్రుడు పెరిగి పెద్దవాడై, రాక్షస సంహారం చేస్తున్నప్పుడల్లా కైకమ్మనీ, ఆమె నేర్పిన విద్యని తలచుకుంటూనే ఉంటాడు! ఖరునితో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఖరుడు చూపిస్తున్న ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి రాముడిలా అంటాడు, “ఓయీ! వానికిన్ వానికిన్ నీవుం గార్ముక దక్షుడౌదు, నగిషీల్నేర్తీవు చేయన్, ధర్నుర్జ్యావల్లీకృత చిత్ర కర్షణ నినీషన్ గైకయీదేవి విద్యావిష్కారము నీ వెఱుంగవు సుమీ!”. అంటే “ఎవెరెవరికో నువ్వు నీ ధనుర్విద్యని చూపించి మెప్పించ వచ్చు కాని, వింటి నారిని చిత్రవిచిత్రంగా లాగడంలో ఎంతో నేర్పు గలిగిన కైక, నాకు నేర్పిన విద్య నీకు తెలియదు సుమా! నా ముందు నీ కుప్పిగెంతులు పనికిరావు” అని అర్థం. అలాగే రావణుడు సౌరాస్త్రం ప్రయోగిస్తే, అందులోంచి వేలకొలదీ చిన్న చిన్న చక్రాలు పుట్టుకు వస్తాయి. వాటిని కైకేయి నేర్పిన విలువిద్య చేతనే వమ్ము చేస్తాడు రామచంద్రుడు. తనకు రథం తెచ్చిన మాతలితో, కైకేయి నేర్పిన గతులలో రథాన్ని తోలమని చెపుతాడు.


ఈ విధంగా, రాముణ్ణి చిన్నతనం నుండీ విలువిద్యా ప్రవీణునిగా తీర్చిదిద్దడంలో కైక పాత్ర విశేషంగా కనిపిస్తుంది కల్పవృక్షంలో. కైక రామునికి తల్లి, గురువు, ఆప్తురాలు.


రామునిపై ఇంతటి వాత్సల్యమున్న కైక మరి అతణ్ణి అడవికి ఎలా పంపింది? నిజానికి, రామునిపై కైకకున్న వాత్సల్యం వాల్మీకి రామాయణంలో కూడా, ఇంత విస్తృతంగా కాకపోయినా, కొంత మనకి కనిపిస్తుంది. రాముని పట్టాభిషేక వార్త మంథర తెచ్చినప్పుడు, కైక ఎంతగానో సంతోషిస్తుంది. అంతటి శుభవార్తని తెచ్చినందుకు ఆమెని ఎంతగానో మెచ్చుకొని, ఆమెకి మంచి హారాన్ని కూడా బహూకరిస్తుంది. తనకి భరతుడిపైన ఎంత ప్రేమో, రాముడిపైన కూడా అంతే ప్రేమ అని, రాముడు కౌశల్య కన్నా తననే ఎక్కువగా ఆదరిస్తాడని కూడా అంటుంది. ఇంతటి అభిమానం మనసులో పెట్టుకొని, ఒక్కసారిగా అలా ఎలా మారిపోయింది కైక? ఆ ప్రశ్నకి వాల్మీకి మనకి సమాధానం చెప్పడు. మంధర మాటల ప్రభావమొక్కటే చూపించి ఊరుకుంటాడు. కాని మనకది అంత నమ్మశక్యంగా కనిపించదు. అందుకే తర్వాతి కవులు రకరకాల ఊహలు చేసారు. కొందరు ఆమెని పూర్తిగా దుష్టురాలిగా మార్చి వేసారు. దైవప్రేరణచేత సరస్వతీదేవి ఆమెని ఆవేశించి అలా వరాలని కోరినట్టుగా కొందరు చిత్రించారు. విశ్వనాథ మరొక వినూత్నమయిన, ఆశ్చర్యకరమైన కల్పన చేసారు! ఒకవైపు తల్లిగా పెంచిన మమకారం, మరొకవైపు గురువుగా నేర్పిన యుద్ధవిద్యకి సార్ధక్యం. ఒకవైపు లోకనింద, మరోవైపు రాముని కోరిక. వీటి మధ్య నలిగిపోతూ, అయినా తన కర్తవ్యాన్ని ఎంతో గుండె నిబ్బరంతో నిర్వహించిన ఒక శక్తివంతమైన పాత్రగా  కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.


మరునాడు పట్టాభిషేకమనగా ముందు రోజు రాముడు యజ్ఞ దీక్షితుడవుతాడు. ఆ రాత్రి ధ్యానంలో ఉండగా అతనికి దేవతలు కనిపిస్తారు. అతణ్ణి నారాయణుడని పిలుస్తారు. నువ్వు నీ అవతారకారణం మరిచిపోయి యిలా రాజ్యాభిషిక్తుడవైతే ఎలా అని మొరపెట్టుకుంటారు. నీకు రాజ్యమేలే కోరికే ఉంటే ముందు నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా రాజ్యం చేసుకో అని ప్రాధేయపడతారు. దానితో రామునికి సమాధి భగ్నమవుతుంది. ఏమి చెయ్యాలో పాలుపోదు. తనకి కూడా అంతరంగంలో ఏదో మూలన యీ పట్టాభిషేకం యిష్టముండదు. దేవతలకి కూడా యిష్టం లేదని తెలుస్తుంది. కాని తండ్రి మాటని త్రోసిపుచ్చి ఎలా తానీ పట్టాభిషేకాన్ని కాదనడం? అలాంటి పరిస్థితిలో తనకి సహాయం చెయ్యగలిగే వారెవరు? మెల్లగా కైక మందిరానికి వెళతాడు రాముడు. వారి మధ్య జరిగే సన్నివేశం, వారి సంభాషణ, గొప్ప నేర్పుతో చిత్రించారు విశ్వనాథ.


అంత రాత్రి రాముడక్కడకి రావడం చూసిన కైక ఆశ్చర్యపోతుంది. కంగారు పడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం పెట్టుకొని యిలా అర్థరాత్రి ఎందుకొచ్చావని అడుగుతుంది. దీక్షా భంగం జరగకుండా వెనక్కి వెళ్ళిపొమ్మంటుంది. అప్పుడు రాముడిలా అంటాడు:


అనిన రాముడు, తల్లి! సమాధి నిలువ

దాయె నే నేమి చేయుదు నమ్మ యనుచు

ఱేపు మొదలుగ బద్ధవారీగజేంద్ర

మట్లు కదలగ వీలులే దనుకొనెదను


“అమ్మా! నన్నేం చెయ్యమంటావు, సమాధి నిలువడం లేదు! ఇక రేపటినుండీ  గొలుసుకి కట్టేయబడిన ఏనుగులాగా కదలక మెదలక ఉండాలన్న చింతే మనసంతా నిండిపోయింది” అని అర్థం. దేవతలు సమాధిలో కనిపించి తనను రాజ్యం చెయ్యవద్దన్నారనీ, తనకీ రాజ్యమ్మీద కోరిక లేదనీ, ఎటూ పాలుపోక యిలా వచ్చాననీ చెపుతాడు. అప్పుడు,


అనినన్ గైకయి, “యిప్పుడిట్లెయగు ఱేపంకస్థయౌ జానకిం

గని, సింహాసనసీమ వేఱొకగతిన్ గన్పించు బొ”మ్మన్న, రా

ముని నేత్రంబుల నొక్క తీవ్రకళయై “మున్నీవు నువ్వెత్తు నే

ర్పిన కోదండకళావిచిత్ర గమనశ్రీ యేమగుం జెప్పవే!”


“ఇప్పుడిలాగే అంటావు. రేపు నీ భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు సింహాసనమ్మీద కూర్చున్నప్పుడు వేరే రకంగా అనిపిస్తుందిలే” అని పరిహాసంగా అంటుంది కైక. ఆ మాటలకి రాముడు ఆమెవైపు తీక్ష్ణంగా చూచి, “నువ్వు నాకు ఎంతో గొప్పగా నేర్పిన నా విలువిద్యకింక సార్థక్యమేమిటి చెప్పమ్మా” అంటాడు. అంతే కాదు, “నా వద్దనున్న వాడిబాణాలతో నా కిరీటమ్మీద బొమ్మలు చెక్కుకోనా? నన్ను రోజూ స్తోత్రం చెయ్యడానికి వచ్చే ప్రజలమీద యుద్ధవ్యూహాలు పన్ననా?” అని నిలదీస్తాడు. అప్పుడు కైక “అయితే ఏమిటంటావు? నీ విలువిద్యకీ యుద్ధనైపుణ్యానికీ సార్థక్యం ఎలా కలుగుతుంది?” అని అడుగుతుంది. రాముడు దానికి సూటిగా జవాబు చెప్పడు. దానికి సమాధానం కైకకి తెలుసుకదా! తీక్ష్ణమైన చూపులతో ఒకటే మాట అంటాడు రాముడు, “నేనిప్పుడు రాజ్యం చెయ్యడమనేది వట్టి మాట”. అంతే! కైకేయి తన భవనంలోకి విసవిసా వెళిపోతుంది.


అదీ వారిద్దరి మధ్యన జరిగే సన్నివేశం! రాముడు కైక దగ్గరకే ఎందుకు వచ్చాడు? రాముని తీక్ష్ణమైన చూపుల్లో కైకకి అర్థమైనది ఏమిటి? రాముని కోరిక కైక ఎలా తీరుస్తుంది? ఇవన్నీ పాఠకుల ఊహకి వదిలిపెట్టేసారు విశ్వనాథ.


ఆ తర్వాత రోజు, మంధర పట్టాభిషేక వార్త విని కోపంతో కైక దగ్గరకి వచ్చి దాని గురించి చెపుతుంది. కైక అప్పుడే నిద్రనుండి లేస్తూ, “ఏమిటి రాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడా! రాముడు పట్టాభిషేకం వద్దన్నట్టుగా పీడ కల వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు”, అంటూ తన ముత్యాలహారాన్ని మంధరకి బహుమతిగా ఇస్తుంది. అప్పుడు వాల్మీకంలో లాగానే, మంధర దాన్ని విసిరి కొట్టి, రాముడు రాజైతే కైక పడవలసిన కష్టాలని ఏకరువు పెడుతుంది. వాటిని కైక తేలికగా కొట్టి పారేసి, రాముడి గొప్పతనం వర్ణిస్తుంది. అతను పరాక్రమవంతుడని, యోగి అనీ, రాక్షసాంతకుడనీ వివరిస్తుంది. ఇక్కడ, రామావతార రహస్యం తెలిసిన ఒక జ్ఞానిగా కైక పాత్ర మనకి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ముందురోజు రాత్రి రాముని కన్నుల్లో కైక చూసిన రహస్యమిదేనా అని అనిపిస్తుంది! మంధరకి యిదేమీ పట్టదు. పైగా, యోగి అయితే అడవుల్లో తిరగాలి కాని సింహాసనమెక్కి రాజ్యం చెయ్యాలన్న కోరిక ఎందుకనీ, రాక్షసులు అయోధ్యా పురవీధుల్లో తిరగటం లేదనీ, అంటుంది. ఆ మాటలు కైక మనసులో నాటుకుంటాయి! “It all fell in place!” అన్నట్టుగా, రాముడు తన దగ్గరకి ఎందుకు వచ్చాడో, తాను చెయ్యవలసినది ఏమిటో మొత్తమంతా అవగాహనకి వస్తుంది కైకకి. అప్పుడు కైక మనస్స్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు రాముడు తనమీద మోపిన బాధ్యత. మరొకవైపు తానే స్వయంగా రాముణ్ణి అడవులకి పంపించాలన్న బాధ. ఇంకొకవైపు, దీనివల్ల తన మీద పడబోయే లోకనింద. తనకే ఎందుకిలా అయిందన్న కోపం. ఈ అవస్థని చాలా నేర్పుగా, హృద్యంగా, స్పష్టాస్పష్టంగా చిత్రిస్తారు విశ్వనాథ.


ఆ తర్వాత కథ మామూలే. దశరథుని వరాలు అడగడం, దానికి దశరథుడు కైకని తిట్టిపోయడం, రాముడు అడవులకి వెళ్ళడం, దశరథుడు మరణించడం, కౌసల్య మొదలు లోకమంతా కైకని తూలనాడడం, చివరికి భరతుని చేతకూడా కఠినమైన మాటలు అనిపించుకోవడం. అయితే, యీ ప్రతి సన్నివేశంలోనూ మనకి కైక మీద అపారమైన జాలి కలగకమానదు. ఎన్ని మాటలు పడ్డా, నోరు మెదపలేని ఆమె నిస్సహాయత, ఎంత బాధని అనుభవించినా రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకున్న ఆమె స్థిరత్వం మనలని అబ్బురపరుస్తాయి. కల్పవృక్షంలో కైక పాత్రని అంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు విశ్వనాథ. దీని వలన సాధించిన ప్రయోజనం ఏమిటంటే – రసావిష్కరణ. కైక పాత్రలోని సంఘర్షణ, సహృదయుని మనసుని కుదిపివెయ్యక మానదు. మరొక ప్రయోజనం – కథకి, ఆ పాత్రకి ఒక రకమైన సౌష్ఠవాన్ని చేకూర్చడం. కైక పాత్రనీలా మలచడంలో పాశ్చాత్య విషాదాంత నాటకాలలోని నాయక/ప్రతినాయక పాత్రల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది! అయితే, యిక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయమొకటి ఉంది. ఈ పాత్ర చిత్రణ వాల్మీకి రామాయణంలో లేనిదే అయినా, వాల్మీకి రామాయణానికి ఏమాత్రమూ విరుద్ధం కానిది. అందుకే యిది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం అయింది.

అవును కదా .. బియ్యం డబ్లు ఇచ్చాడు

                          అవును కదా .. బియ్యం డబ్లు ఇచ్చాడు

Tuesday, August 30, 2016

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి !

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి !

(మనజమున కి శుభాకంక్షలుతో పెళ్లినాటి ప్రమాణాలు లోపాట.)

కావనగానే సరియా

ఈ పూవులు నీవేగా.. దేవీ..

పల్లవి: చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ..

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

చరణం: మలయానిలముల లాలన వలెనే

వలపులు హాయిగ కురిసీ.. | మలయానిలముల |

కలికి చూపులను చెలిమిని విరిసి

చిలిపిగ దాగుట న్యాయమా? ..

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

చరణం: తెలి మబ్బులలో జాబిలి వలెనే

కళకళ లాడుచు నిలిచీ.. | తెలి మబ్బులలో |

జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి

పలుకక పోవుట న్యాయమా?..

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..

చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి

పిఠాపురం.!

పిఠాపురం.!

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.

"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్

ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం

గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం

గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."


పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-

"ఏలేటి విరినీట నిరుగారునుంబండు

ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."

అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. ..... ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.

"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్

ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం

గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం

గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."


పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-

"ఏలేటి విరినీట నిరుగారునుంబండు

ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."

అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. .....

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి!

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి!

.

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!

.

అయ్య రారా! చక్కనయ్య రార!

అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!

.

అప్ప రారా! కూర్మికుప్ప రార!

రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ

.

తోట రారా! ముద్దుమూట రార!

ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!

.

పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!

కన్నకాచి రార! గారాలకూచి రా!

.

నాన్నరార! చిన్నియన్నరార!

ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు

లాడ రార! కుల్కులాడ రార!

Monday, August 29, 2016

కోన సీమ అందాలు !

కోన సీమ అందాలు !

అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.)


.

అల్లూరి సీతారామరాజు వేషం లో అన్నగారు. (1955 లో అనుకొన్నారు.)

x

వైర్ లెస్ టెక్నాలజీ !

మన సర్దార్జీ అమెరికా వెళ్లి బిల్ గేట్స్ తో మీటింగ్ లో

పాల్గొన్నాడు

.

మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు

చూపిస్తా రా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు

.

"ఇక్కడ గొయ్యి తవ్వు", సర్దార్జీ అలాగే తవ్వాడు...

"ఇంకా లోతుకి తవ్వు" అంటూ వంద

అడుగులు గొయ్యి తీయించాడు. "ఇప్పుడు

.

వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు

సర్దార్జీ వెతికితే ఒక వైరు దొరికింది

"చూసావా వంద ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్

వాడాము అన్నదానికి ఇది రుజువు"

.

సర్దార్జీ కి వళ్ళు మండింది,

తమాయించుకున్నాడు

.

ఆ తరువాత బిల్ గేట్స్ మన ఇండియా కి వచ్చాడు,

అప్పుడు మన సర్దార్జీ గేట్స్ ని కలిసి మా దేశం

గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి

తీసుకెళ్ళాడు

.

"అక్కడ గొయ్యి తీయమన్నాడు.. గేట్స్ అలాగే గొయ్యి

తీసాడు, "ఇంకా లోతు ఇంకా లోతు" అంటూ

అయిదు వందల అడుగులు లోతు తీయించాడు.

.

"ఇప్పుడు వెతుకు ఏదైనా దొరుకుతుందేమో"

అన్నాడు

.

పాపం ఎంత వెతికినా గేట్స్ కి ఏమీ దొరకలేదు..

.

.

.

.

.

వెంటనే మన సర్దార్జీ "చూసావా అయిదు వందల

ఏళ్ల క్రితమే మా వాళ్లు వైర్ లెస్ టెక్నాలజీ వాడారు"

అన్నాడు గర్వంగా

బిల్ గేట్స్ షాక్ తిని ఇప్పటికి సరిగ్గా అన్నం తినటం

లేదట.

శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.)

శ్రీకృష్ణ శతకం.!............... (శ్రీ నరసింహ కవి.)

.

కుక్షిని నిఖిల జగంబులు

నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్

రక్షక వటపత్రముపై

దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!

.

ప్రతిపదార్థం:

రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి.

.

భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం!

.

ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "!

కొందరు మేథావులు అంటున్నట్టు.... కావలసింది 

"మత రహిత", "కుల రహిత", లేదా.... "మత సహిత ", "కులసహిత" కాదు! అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కావలసింది..... "మత ప్రసక్తి లేని..... "! 

అది కాంగీ ల వల్లా, కమ్మీల వల్లా అవదు అని తేలిపోయింది. 

ఇంకా మిగిలింది.... "ఫలానా వాళ్ళ" వల్లే.....! చూద్దాం .....!

.

మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది. కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా?

నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్తి నుండి విడదీసి అది ఒక శాశ్వత సామాజిక హోదా గా మార్చాం కాబట్టి!కాబట్టి ఇప్పుడు కులం ను బట్టి వ్రుత్తి చెప్పలేక పోయినా వారి వారి సామాజిక హోదాను అంచనా వెయ్యొచ్చు.అలా అందరి అంటే, అన్ని కులాల సామజిక హోదాను సమానం చెయ్యడమే నిజమయిన సోషలిజం. దీనినే "క్యాస్ట్ సోషలిజం" లేదా "సర్వ వర్ణ సమానత్వం" అని కూడ అనవచ్చు.దీనికి చెయ్యాల్సిందల్లా " కుల నిర్మూలన" కాదు " కుల ఆధిక్యత నిర్మూలన" ముందు చెయ్యాలి. ప్రతి వెనకబడిన కులం వారి సామాజిక స్తితి గతులు, అభివ్రుద్ది చెందిన కులాల వారితో సమం చెయ్యాలి. అప్పుడు "కులo" అనేది దానంతట అదే మాయమవుతుంది.

"కుల వ్యవస్త అనేది ఒక్క రోజుదో, ఒక శతాబ్థం నాటిదో కాదు. అలాగే ఒక నిర్ణీత గడువులో ఇది మాయమైపోదు. పరిణామ క్రమం అనేది దీనికి వర్తిస్తుంది.అప్పటీ వరకు "కులం" అనే ప్రాతి పదికనే అభిరుద్ది పథం నిర్దేశించాలి. కేవలం ఒక పరిణామ క్రమంలో కుల బావనను అంతం అంతం చెయ్యడమెలాగో పాలకులు ఆలోచించాలి. అంతే కాని, వోటు బాంకులు గా వాటిని పరిగణిస్తూ, వాటి మద్య విద్వేషాలు రాజేస్తూ , పైకి కుల రహితులమని చెపుతూ, లోపల కులాలను రెచ్చగొట్టి , పబ్బం గడుపుకోవడానికి చూడటం ఏ మాత్రం క్షమార్హం కాదు.

ప్రపంచం అంతట వర్గ బేదం ఉండ వచ్చు. కాని అది ఈదేశంలో చెల్లుబాటు కాదు. ఇక్కడ కుల సంబందమే ముఖ్యం. కాబట్టి ముందు "కుల సమానత్వం" తెచ్చుకుందాం. దీనికి ఏకైక మార్గం ఒకటుంది. దానిని తర్వాతి టపాలో వివరిస్తాను.

అమ్మ భాష ! . తెలుగు బాష ప్రాముఖ్యత!

అమ్మ భాష !

.

తెలుగు బాష ప్రాముఖ్యత

సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. ముందుగా….

భాష అంటే ఏంటి?

మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయ్యింది.విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.

భాష ఎలా పుట్టింది?

భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.

తెలుగు భాష ఎలా పుట్టింది?

సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని "తెలుగు" శబ్దం ఏర్పడి ఉండవచ్చని సొమయాజి గారు తెలిపారు. "తెలుగు" దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.

"తలైంగు" జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. "తలైంగు" అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.

"తెలుంగు" అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. "తెన్ను" అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.

"తెన్" నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. "తెన్" అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి "తెనుగు" అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.

ఐతే "త్రినగ" నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా "త్రినగ" శబ్దం ఏర్పడిందంటారు.

మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.

విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా "త్రిలింగ" పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గరు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.

ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.

పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ "వడుగ", "వడగ", "తెలింగ", తెలుంగు" అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.

మన తెలుగు భాష వయసెంత?

క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని "గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.

క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని "నాగబు" పదంలోని "బు" ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.

తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.

సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.

"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.

చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.

తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.

అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.

అచ్చ తెలుగు :

అచ్చిక తెలుగు అచ్చ తెలుగు అయ్యింది. తెలుగు మాటల్లో తత్సమాలు, తద్భవాలు ఉంటాయి. తత్సమాలలో సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు ఉంటాయి. సంస్కృత సమాలుకాని ఇతర పదాలను అచ్చ తెలుగు పదాలు అంటారు. అంటే ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు కలిసి అచ్చ తెలుగు అవుతుంది.

జాను తెనుగు :

ఈ పద బంధాన్ని మొట్టమొదటగా తన కుమార సంభవంలో ప్రయోగించినవాడు నన్నెచోడుడు. జానుతెనుగనగా తేట తెలుగు, స్పష్టంగా తెలిసెడి తెలుగు అని నిఘంటుకారుల అభిప్రాయం. మధురమైన తెలుగు అని జాను తెలుగు గురించి బ్రౌన్ నిఘంటువు వివరించింది. జాను అను పదాన్ని స్పష్టము అనే అర్ధంలో తిక్కన ప్రయోగించాడు. డా.సి. నారాయణ రెడ్డి "ఏది ఒకానొక దుర్బోధక విషయముని కూడా సామాన్య జనులకు సైతం సుబోధకంగా, సుప్రసన్నంగా అందించునో అది జాను తెనుగు" అని వివరించారు.

లిపి :భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. భాష నాగరికతతోపాటు వృద్ధి చెందుతుంది. ఐతే భాష పుట్టిన చాలా కాలం వరకు ఆ భాషకు లిపి ఉండదు.లిపి ముందుగా రాజ్య వ్యవహారాలకోసం పుడుతుందిగానీ వాజ్ఞ్మయం కోసం కాదు. మాట్లాడే భాషని లిఖితపూర్వకంగా గుర్తించడాన్ని "లిపి" అంటారు. ఒక్కొ భాషకు ఒక్కో లిపి ఉంటుంది. లిపి లేని భాషలూ ఉన్నాయి. మన దేశంలోని భాషా లిపులన్నీ కూడా క్రీ.పూ.250 నాటి "బ్రాహ్మీ" లిపి నుంచి పుట్టినవే. 15వ శతాబ్దందాకా తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేదని తెలుస్తోంది.

ప్రకృతి నుంచి వచ్చిన పదాలు :

మనిషికీ, ప్రకృతికీ సంబంధం ఉంది. అలాగే ప్రకృతికీ మనిషి మాట్లాడే భాషకీ సంబంధం ఉంది. మనిషి తన భావ ప్రకటన కోసం ప్రకృతిని సహజంగా వాడుకుంటాడు. భాషని శక్తివంతంగా మలుచుకోవడానికి ప్రకృతిలోని చెట్లనూ, చేమల్నీ, జంతువులనీ, పక్షుల్నీ ఇలా అన్నింటినీ వాడుకుంటాడు.

ఉదా:

నత్త నడక, వేపకాయంత వెర్రి, చిలక పలుకులు, సొరకాయలు కోయడం మొదలైనవి.

భారతదేశంలో హింది తరువాత ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ద్వితీయ స్థానంలో ఈ అద్వితీయ భాష ఉందంటే కారణం భాషలోని తీయదనం తప్ప మరోటి లేదు.

ఏదో తీరని బాధ !

ఏదో తీరని బాధ !

.

కరగునులే తారకలు ..మోముదాచె రేరాజు

రగులునె నా మదిలో ఏదో తీరని బాధ ప్రియతమా

Sunday, August 28, 2016

|| మానస వీణ||

|| మానస వీణ||

ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాల హృదయ సరాగం…

ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడేకోయిల గీతం…

శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమంచు నీ అందమే…

మెరిస ంది అరవందమెైకురిస ంది మకరందమే!

జాబిలి కనాా.. నా చెలి మనా పులక ంతలకేపూచిన పొ నా…

కానుకలేమ నేనివవగలను కనుాల కాుకక నేనవవగలను…

పాల కడలిలా వెనెాల పొంగింది పూల పడవలా నా తనువూగింది…

ఏ మలలె ల తీరాల నిను చేరగలను మనసున మమతెై కడ చేరగలను…

.

కురిసేదాక అనుకోలేదు శాా వణ మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని…

కలిసేదాక అనుకోలేదు తీయని సేాహమని పెదవ నేనుగా పదము నీవుగా ఎదలు పాడని…

.

మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం…

సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ సవర పారిజాతం…

మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సంసారం.. సంగీతం

( మిత్రులు Sailaja Mithra గారికి చాలఇష్టం అయిన సాహిత్యం.)

.

-చిత్రం...రాజరవివర్మ


భగవద్గీత సారాంశం 'నారాయణుడు'!

భగవద్గీత సారాంశం 'నారాయణుడు'!

.


"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః

నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః"

.

భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు

 గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" 

భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. 

భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ.

  మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. 

ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ.

 అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. 

అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.

.


"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.

జై శ్రీమన్నారాయణ

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

శ్రీ కైవల్య పదంబుఁ,,

శుభోదయం.!
"
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.!
భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం.
ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు.
ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు.
(అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్
(ఆ) లోకరక్షైకారంభకున్
(ఇ) భక్తపాలన కళా సంరంభకున్
(ఈ) దానవోద్రేక స్తంభకున్
(ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్
(ఊ) మహానందాంగనా డింభకున్
అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి.
భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి.
(అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది.
(ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.
(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది.
(ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది.
(ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.
(ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.

x

_కేరళలో పురావస్తు తవ్వకాలో బయటపడ్డ అపురూలపమైన హనుమంతుడి విగ్రహం!

శుభోదయం.!

_కేరళలో పురావస్తు తవ్వకాలో బయటపడ్డ అపురూలపమైన హనుమంతుడి విగ్రహం!


శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాస్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే

దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై

స్వామి కార్యార్దమై యేగి

శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి

సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి

యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి

కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్

లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి

సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై

యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు

సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని

వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్

దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరమ శ్రీరమయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,

కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి,

రారనాముద్దునరసింహాయంచున్,

దయాదృష్టివీక్షించి,

నన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే !

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

అత్త లక్ష్మి వ్రతం.!

                                           అత్త లక్ష్మి వ్రతం.!

జలపాతపు జల్లు !

జలపాతపు జల్లు !
జలపాతపు జల్లు లో ప్రేమికులు
మాట రాని వూసులు ఎన్నో చెప్పుకుంటే ,
భగ్న ప్రేమికులును అదే జలపాతం దూకమని కవ్విస్తుంది .
పయ్యెద సద్దుకుంటున్న ప్రకృతి కాంత
కవ్వింతను చూసి
మురిసి పోయే వన పురుషుడిలా .

x

రాజమాత! (భోగిని దండకం .. పోతనామాత్యుడు.)

రాజమాత!

(భోగిని దండకం .. పోతనామాత్యుడు.)

.

"అమ్మా! విన న్నొల్లఁ బొమ్మా, విచారించు కొమ్మా,

భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని 

దుర్మానసశ్రేణి నీవేల యీవేల భూషించెదే?

యేమి భాషించెదే? యేల నన్నుం బ్రమోషిచెదే? 

(చిత్రం...రాజారవివర్మ.)

నా గూడు !

                                                                         నా గూడు !

దేవి ...శ్రీ దేవి !

                                 దేవి................ ...శ్రీ దేవి !

గురుకుల విద్యాభ్యాసం !

                                                  గురుకుల విద్యాభ్యాసం !

మోకాళ్ళపై కూర్చుని, పువ్వందించే .... సీను

ప్రేమించడం ఇష్టం

కష్టం మాత్రం,

మోకాళ్ళపై కూర్చుని,

పువ్వందించే .... సీను

Chandra Shekhar Vemulapally..గారి కవిత.

Saturday, August 27, 2016

నానబోసిన సెనగలను..

శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలను...

ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు. 

మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.

వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి. 

ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

మాకు చెన్నా బాటూర ప్రసాదిస్తుంది.

తరువాత 

శ్రావణ మాసాం సెనగలు కు 

ధామ్ ధామ్ బాంబులు కు 

కడుపు నొప్పి బాధలకు 

డాక్టర్ గారి బిల్లులకు 

జై జై జై జై జై జై జై జై !

ఓణం!

ఓణం!

ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.

చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళ కు కు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలి కి తన సుగుణములన్నింటితోపాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.

మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు]. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు మరియు తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు.

కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో మరియు ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య(ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది మరియు ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.

ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం వల్లంకలి అనబడే సర్పాకారపు పడవల పందెము, ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.

ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది, ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు మరియు కయ్యంకలి మరియు అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి మరియు తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి మరియు పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి.

మహాబలి యొక్క పరిపాలన కేరళలో స్వర్ణ యుగంగా భావించబడుతుంది. ఈ క్రింది పాట ఓణం రోజు ఎక్కువగా పాడబడుతుంది: (అనువాదం)

“ When Maveli, our King, ruled the land,

All the people had equality.

And people were joyful and merry;

They were all free from harm.

There was neither anxiety nor sickness,

Death of the children was never even heard of,

There were no lies,

There was neither theft nor deceit,

And no one was false in speech either.

Measures and weights were right;

No one cheated or wronged his neighbor.

When Maveli, our King, ruled the land,

All the people formed one casteless race.

.

ఓనక్కోడి గా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు, మరియు ఓణం సద్య , అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు మరియు అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు మరియు చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది మరియు దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి.

ఓణం సమయంలో, ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు, దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో, ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక మరియు సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి.

వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల బోటు రేసు మరియు నెహ్రూ ట్రోఫీ బోటు రేసు ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి మరియు అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు మరియు ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి మరియు దూర ప్రాంతముల నుండి స్త్రీలు మరియు పురుషులు వస్తారు.

వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్టించినట్లుగా ఓణం సమయంలో, కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్టిస్తారు.

కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఈనాడు ఈ పండుగను హిందువులు, ముస్లిములు మరియు క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు.

ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి.[11] దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు.[11] త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.[11]

Onam greetings.

జగన్మోహిని అమృతము పంచుట !

జగన్మోహిని అమృతము పంచుట !

.

 ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులూ, చల్లని పలుకులూ, బుజ్జగింపులూ కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్ళను కట్టేశాయి.

 రాక్షసులు అందించిన, అమృతకలశాన్ని, మాయా సుందరి మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు. 

చిరునవ్వులు చిందే పలుకులతో “నేను పంచిపెట్టిన విధంగా ‘ఔను’ ‘కాదు’ అనకుండా ఒప్పుకోవాలి” అన్నాడు.

 ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులూ, దేవతలూ “సరే” అన్నారు.

 వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలూ, హిరణ్యదానాలూ మున్నగు దానాలు ఇచ్చి, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు.

 తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలూ, పూలమాలలూ, ధూపాలూ, దీపాలూ అలంకరించిన బంగారు మండపంలో చేరారు.

 తూర్పుకు కొసలు ఉండేలా పరచిన దర్భాసనాల మీద తూర్పుముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు.

అప్పుడు, కటిభారంతోనూ, స్తనాలభారంతోనూ, శిరోజాలభారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని, తన పద్మం వంటి చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్ళు చేస్తున్నాయి.

 ఆ మోహినీ అవతారం, ధరించిన కర్ణాభరణాల తళతళ మెరుపులు, ఆమె ముక్కుకూ, ముఖానికీ, చెవులకూ, చెక్కిళ్ళకూ, కనుగొనలకూ మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకూ, రాక్షసులకూ అందరికీ మనసు చెదిరిపోయింది.

.

“రాక్షసులకు అమృతం పోయడం అంటే, పాములకు పాలుపోసినట్లే, ఆపదలు కలిగిస్తుంది” అంటూ మోహినీ దేవి అసురులను అందరిని ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది.

.

“రాక్షసులులారా! తొందర పడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి.” అంటూ పలకరిస్తూ, కన్నులు కదలించింది. రెండు పాలిండ్ల పైనున్న పైటకొంగు జార్చింది. ‘వదిన, మరది’ వరసలు కలిపింది. మర్మస్థానాల మరుగు తొలగించినట్లే తొలగించి మరల కప్పేసింది. చిరునవ్వులతో మైమరపించింది. అద్భుతమైన నెరజాణ మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది. దేవతలను “ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి” అంటూ అమృతాన్ని దేవతలకు పంచేసింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించి, ఆమెను అభినందించారు.

.

ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు “ఈ మగువ మనకూ, దేవతలకూ తేడాలేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా. అలా చేయకుండా మాట తప్పుతుందా. లేదు అలా తప్పదు. కానీ, మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో! తిరిగి చూడదేమో! స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో! మరోమాట కలిపితే కంగారుపడి వెనకడుగు వేస్తుందేమో! మన యందు అలుగుతుందేమో! మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో!” అనుకుంటూ, జంకుతూ గొంకుతూ, ఊరకే ఉండిపోయారు తప్పించి “సుందరీ! తొందరగా తీసుకురా!” అని పిలవలేకపోయారు.

.

రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.

.

అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.

.

విష్ణు మూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.

.

దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే. కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాలపాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా!


జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....

మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా 

.

జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు!

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు!

.

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం

ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం

సోయగాల విందులకై వేయి కనులు కావాలీ .....

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో

నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు

పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

.

ఈ పాట డెభ్భై ఎనభై దశకాల్లో వచ్చిన అపురూపమైన పాటల్లో మొదటిదని నా నమ్మకం. సాహిత్యం ఎంత నిండుగా ఉంటుందో ఈ పాటలో. ప్రేమ,ఇష్టం,సున్నితమైన శృంగారం వీటన్నింటితో చక్కటి మేళవింపు ఈ పాట. "ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం". ముడుచుకోవటం, మిడిసిపడటం రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి. ఆ రెంటినీ కలిపి ఒకచోట కూర్చి అపురూపం అనిపించిన ఆ రచయిత శైలి కి జోహార్లనద్దూ. :) సినిమాలో హీరో డబ్బున్నవాడైనా పీటల మీద పెళ్ళి చెడిపోయిన ఒక పేదింటి పిల్లని చేసుకుని కూడా "నింగిలోని దేవతలు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు" అని అంటాడు. తనకి ఉన్న కలిమికన్నా ఈ కలిమే ఎక్కువ అని ఆ అమ్మాయి పట్ల ఇష్టాన్ని ఎంత చక్కగా చిన్న మాటల్లో చెప్పాడో. సాహిత్యం,మహాదేవన్ గారి సంగీతం చక్కగా కుదిరిన పాట ఇది. రామకృష్ణ గారు పాడిన పాటల్లో అత్యుత్తమం అని నా నమ్మకం.

Friday, August 26, 2016

ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా?

ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా?

( ఓ సరదా గల్పిక)

గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని కనుక్కొన్నాడు.

కథలు చెప్పేవాళ్లందరూ తాగుబాతులని చెప్పలేంకానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటిఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు.

మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందికూడా కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి లంకలో ముందుగా కనిపించింది ద్రాక్షారసాలు సేవించే రాక్షసులే! భారతంలోని కీచకుడుకి మగువలమీదకన్నా మధ్యపానంమీద మక్కువ జాస్తి. ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి!

మదిరలో ఎంత మహత్తు లేకపోతే గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలడు! అజంతా హరప్పా శిథిలాలు తవ్వితీసినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తాగిపారేసిన చట్లూ పిడతలేనంటారు. నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకు ఎలా తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ బాగా మద్యం పట్టించి శత్రుసైన్యంమీదకు తోలేవారని 'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసిపారేసినప్పుడు 'రా' పనికిరాదంటే కుదురే పనేనా!

కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునులు మధుపానానికి శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు. మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారంట! ఎందుకు? లోటాలో మందుకొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికీ? ‘చంద్రయాన్’ మిషన్ ఇంజనులో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడేబదులు ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.

దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టుకోవద్దాన్నాడుగాని.. మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఇలా ఆడిపోసుకొంటారో అర్థం కావడంలేదు! ఒత్తిడినుంచి ఉపశమనం పొందే ఉపాయంకదా ఇది! శతాబ్దాలకిందట మనవాళ్లు శోధించి సాధించింది. అష్టాంగమార్గాల్లో ఆఖరిదైన 'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొన్నది మాత్రం నిశ్చయంగా మన దేశమే!

‘సారే జహాఁసే అచ్చా!.. సారా భారత్ మహాన్!’

***

మనోడికి మరీ మందెక్కువైనట్లుంది. ఇంకో డోసు పడితే కన్యాశుల్కం బైరాగికే క్లాసు పీకేటట్లున్నాడు! చీపులిక్కరుకు అలవాటుపడ్డ నాలిక్కదా! ఇలాగే అక్కరకురాని ‘మద్యా’క్కరలు ఏకరువు పెడుతుంది. ముందు ముందు దగ్గుక్కూడా పెగ్గే మందని ఎంత సిస్సిగ్గుగా వాదించబోతున్నాడో వినండి!

‘నూటికి ఇరవై పమాదాలు తాగుబోతులవల్లే’ అని లెక్కలు చెబుతుంటే 'మిగతా ఎనభై తాక్కపోవడం వల్లే కదా! అనడ్డంగా వాదించే తాగుబోతుని ఏమనాలి! భూమ్మీదపడ్డ బిడ్డ గుక్కపెట్టేది ఆ గుక్కెడు ‘చుక్క’కోసమే అని కూసే ఇలాంటి తాగుబోతులందర్నీ తక్షణమే డి-అడిక్షన్ క్యాంపుల్లో వేసేసేయాలి. 

దేశాన్నిలాగే మందుకు వదిలేస్తే పదమూడేళ్ల పిల్లాడుకూడా 'పద! మూడు బాగా లేదు! ఏదైనా బారుకెళదాం!' అనే రోజు రేపే రావచ్చు. బారుకి ఏజ్ బారు ఎత్తేసే రోజూ ఎంతో దూరంలో లేదనే అనిపిస్తోంది. గాంధీనగరాలన్నీ బ్రాందీనగరాలైనా అబ్బురం లేదు! మందుల షాపులకన్నా మందుషాపులు పెరగడం ఎంత ప్రమాదకరం! ఇండియానాలో చాటుగా పొగతాగినా కఠినదండన తప్పదు. ఇండియాలో బాహాటంగా మందుకొట్టినా నిలదేసే నాథుడ లేడు!

ఏడాదికి ఈ తాగుడుమీదయ్యే దుబారాఖర్చుతో నలభైలక్షలమందికి సలక్షణమైన డబుల్ బెడ్ రూములు కట్టించియ్యచ్చని ఒక అంచనా!

సర్కార్లే రాష్ట్రాలను 'రా' కొట్టేవాళ్లకు రాసిచ్చేస్తామంటుండె! మందువ్యాపారానికి మాత్రం మాద్యం ఎప్పుడూ ఉండదు.. అదేందో! గుడా.. బడా అని తేడా కూడా లేదు. ఎడ పెడా ఊరుకో దుకాణం! పేటకో బెల్టుషాపు! నోరున్న ప్రతీజీవీ మన సర్కార్ల లెక్కల్లో లిక్కరు బాటిల్లా కనిపిస్తోంది కాబోలు!

ఆంధ్రా.. నైడెడ్.. నిజాం.. రాజకీయాలకే! 'రా' రాజకీయాలకి ప్రాంతం.. కులం.. మతం.. అడ్డంకావు కాబోలు! రెండు తెలుగురాష్ట్రాలను మందుపాతర్లగా మార్చేందుకు పోటీ ఎంత రసవత్తరంగా సాగుతోందా చూస్తున్నారా?

'చీర్' లీడర్లకి 'చీర్' కొడదామా? 'ఛీ!' కొడదామా?

-కర్లపాలెం హనుమంతరావు

( 21-06-2010 నాటి 'ఈనాడు' సంపాదకీయ పుటలో ప్రచురితం)

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

రామనామ వరానన ఓం నమ ఇతి

కల్మషమైన చిత్తము, పాపిష్టి సంపాదనతో జీవించడం, ఆచరించవలసిన కర్మలను నిర్వర్తించకపోవడంతో పాటు నిషిద్ధ కర్మలకు పాల్పడడం మనుష్యులకు దుఃఖాన్నిస్తాయి.

అయితే తరుణోపాయం ఉంది. భక్తిరేవ గరీయసీ! భక్తి ఒక్కటే మార్గం. అందుకే శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు "పిబరే రామరసం ... - ఓ జిహ్వా, రామరస పానం చేయవే" అని ఉపదేశించారు.

భగవన్నామ సంకీర్తన అన్నప్పుడు శ్రీ రామనామమే ఎందుకు జ్ఞాపకం వస్తుంది?

శ్రీరామ శబ్దం జగత్తులొనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని కాళిదాసు మహాకవి అన్నాడు. ఔషధం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమృతం అమరజీవనం ఇస్తుంది. శ్రీరామనామామృత పానంతో అమరత్వం సిద్ధిస్తుంది. అసలు శ్రీరామతత్త్వం మన మనసులోనే ఉంది.

అష్టాక్షరి (ఓం నమోనారాయణాయ) లో "రా" శబ్దము, పంచాక్షరి (ఓం నమశ్శివాయ) లో "మ" శబ్దం తీసుకోగా రామశబ్దం ఏర్పడింది. రేడు మంత్రాలలొని శక్తిని కలుపుకున్న శక్తి రామనామానికి ఉంది. అంతేకాదు, శ్రీరామనామం త్రిమూర్త్యాత్మకమైనది. రామశబ్దం అద్వైతపరంగా కూడా పరబ్రహ్మతత్త్వాన్నే సూచిస్తుంది.

శ్రీరాముని రామాయణానికి పరిమితం చేసి దశరథుని కుమారునిగా, సీతాపతిగా చూసినా ఆ పురుషోత్తముడు శాంతిస్వరూపుడు. శ్రీరాముని వైరాగ్య దృష్టి అసమానము. ఆయన ప్రేమస్వరూపుడు. రామాయణ కావ్యంలోని తాత్త్విక రహస్యాలకు అంతులేదు. ఆ కావ్యంలో చెప్పినదంతా ప్రతి జీవి కథ. ప్రతి పాత్ర ద్వారా, ప్రతి కాండ ద్వారా మానవజాతికి మహత్తర సందేశం అందుతున్నది.

కల్మష నాశనం చేసే రామనామం జననమరణాల వాళ్ళ జనించే వివిధ భయాలను, శోకాలను హరించి వేస్తుంది. సకల వేదాలు, ఆగమాలు, శాస్త్రాలకు సారభూతమైనది శ్రీరామనామము. రామాయణంలో ఏ సన్నివేశం చూసినా సకల శాస్త్ర నిగమ సారమే కనిపిస్తుంది.

జగత్పాలకమైనది రామనామం. రామనామంతో పునీతమైతే అపవిత్రమైనదన్తో ఏదీ ఉండదు. అటువంటి రామనామామృతాన్ని పాణం చేయడానికి కుల, జాతి, మత వ్యవస్థలు ఏవీ అవరోధాలు కావు.

కావలసినది భక్తి. రావలసినది ఆర్తి.

మనం తరించాలి. ఇతరులను తరింపజేయాలి.

ఆలోచనలో అమ్మయి...... ప్రేమ లేఖ అంత సులభం కాదు!

ఆలోచనలో అమ్మయి...... ప్రేమ లేఖ అంత సులభం కాదు!

రవి వర్మకి అందలేదు... బాపుగారి అందిన అందం.!

                రవి వర్మకి అందలేదు... బాపుగారి అందిన అందం.!

వర్ణనాతీతం :)

వర్ణనాతీతం :)

.

“గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు”


నీరీక్షణ !

నీరీక్షణ !

.

ఓదిగి ఓదిగులి కూర్చుంది

బిడియపడే వయ్యారం!

ముడుచు కొనే కొలది అది

మిడిసిపడే.. సింగరం!

శొయగల విందకై

వెయి కనులు కావలి....

శుభోదయం......తులసి మాత !

శుభోదయం......తులసి మాత !

.

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .

సతతము నిను సేవింతుము సత్కృపకనవే

సత్కృపకనవే ....

.

లక్ష్మీ పార్వతి వాణీ అంశలవెలసీ

భక్తజనుల పాలించే మహిమనలరుచూ

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .

.

.

వొల్లగ శాఖలు వేసీ.... వెల్లుగ దళముల విరిసీ

శుభకర పరిమళములతో మా పెరటివేల్పువై వెలసీ...|

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .

.

దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే...శ్రీకృష్ణ తులసివే...

జయహారతిగైకొనవే మంగళ శోభావతివై

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .

ఈనాటికి ఈ గజల్ చాలు.. ఇకవుంటా.

                      ఈనాటికి ఈ గజల్ చాలు.. ఇకవుంటా.

శుభరాత్రి ! . పడుకోనిస్తే కదా..

శుభరాత్రి !

.

పడుకోనిస్తే కదా..

మూడు గొడ్డళ్ళ కథ!

మూడు గొడ్డళ్ళ కథ!

(By - Virabhadra Sastri Kalanadhabhatta)

.

ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు. 

*** *** ***

రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయింది. రాజు లబో దిబో మన్నాడు. ఆసమయంలో బ్యారేజీమీద సంచారం తక్కువగా వుంది. ఇంతలో కృష్ణవేణమ్మ నదిలోంచి పైకి వచ్చి ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. నా భార్య నదిలో పడిపోయింది. నాకు ఈత రాదు. ఆమెను రక్షించడం ఎలాగ అని అఘోరిస్తున్నాను అన్నాడు రాజు.

ఓ అదా సంగతి. వుండు అని నదిలోకి మునిగి తిరిగి ఒక అందమైన యువతితో పైకి వచ్చి చూడు నాయనా ఈమేనా అని అడిగింది.

వెంటనే రాజు ఆ! ఈమే అన్నాడు.

ఛీ ద్రోహీ! నీచుడా ఈమె నీభార్యా! ఇదేనా నీభార్యమీద నీకున్న ప్రేమ? అని కోపంగా అంది అసహ్యంగా మొహం పెట్టి (ముందే అసహ్యంగా మొహం పెట్టిందనుకుంటాను)

అమ్మా! నీవు కృష్ణవేణితల్లి వని నాకు అర్ధమైంది. ఇప్పుడు ఈమెను కాదన్నాననుకో. ఇంకొక అమ్మాయిని చూపిస్తావ్ ఆమెకూడా కాదన్నాననుకో. చివరిసారిగా మా ఆవిడను తీసుకు వచ్చి నాకు అప్పగించి, నా నిజాయితీకి మెచ్చుకొని మొదటి ఇద్దర్నీ కూడా ఇచ్చేస్తావు. నాకు తెలియదాం ఏమిటి ఇప్పుడే శాస్త్రి గారు పైనే వ్రాసారు మూడు గొడ్డళ్ళ కథ. తల్లీ! ఒక భార్యతోనే వేగలేక చస్తున్నాను. నువ్వు ముగ్గుర్ని ఇస్తే వాళ్ళతో ఎలా వేగేది?? అన్నాడు రాజు బేలగా!

కొండమీద కనకదుర్గ నవ్వింది భర్త మల్లిఖార్జునుని, ఆయన నెత్తిమీదవున్న గంగమ్మను చూసి.

ముగింపు మీ ఇష్టం

అసూయ అను నీతికధ !

అసూయ అను నీతికధ !

.

పూర్వ కాలం ఇద్దరు బద్ధ శత్రువులు ఒక అడవిలో రెండు వేర్వేరు చెట్ల కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు తపస్సు మొదలుపెట్టిన గంటకో రోజుకో, వారానికో నెలకో మొత్తంమీద కొంత కాలానికి ప్రకృతిలో భరింపరాని వేడి పుట్టింది. (ప్రస్తుతం విజయవాడలో ఎండ 45-46 డిగ్రీల మధ్య మండిపోతోంది)

ఈవేడి అలా అలా పైకి ప్రాకుతూ ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలను కూడా దాటి బ్రహ్మలోకాన్ని తాకింది. బ్రహ్మగారికి వళ్ళు మండింది. వెంటనే తపస్సుచేసుకునే ఒకడిముందు ప్రత్యక్షమై బాబూ నీకు పుణ్యం వుంటుంది కళ్ళు తెరిచి ఏంవరం కావాలో కోరుకో అన్నారు. వాడు కళ్ళు తెరిచి స్వామీ వచ్చారా! నేను మీటైం వేస్టు చెయ్యను. మీకు టూకీగా ఒక నమస్కారం. ఇక వరం మాట అంటారా అదిగో ఆచెట్టుకింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడే వాడి దగ్గరకు మీరు ఎలాగూ వెళ్తారుగనుక, వాడేం కోరితే దానికి రెట్టింపు నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు ఇక్కడ ఫేడౌటై అక్కడ రెండోవాడిదగ్గర ప్రత్యక్ష మయ్యారు. వత్సా నీతపస్సుకి మండిపోతున్నాం. కనుక దయవుంచి కళ్ళు తెరిచి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు.

అతగాడు కళ్ళు తెరిచి బ్రహ్మగారికేసి చూసి హలో అని నమస్కారం పెట్టి, స్వామీ నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాను. నాకు వరం ఇచ్చేముందు అక్కడవున్నాడే ఆనస్మరంతిగాడు, వాడికే వరం ఇచ్చారో చెప్తే అప్పుడు నాకోరిక చెప్తాను అన్నాడు.

నాయనా మీరిద్దరూ పెద్ద పొలిటీషియన్లుగా వున్నారు. అతగాడు నీవేంకోరితే దానికి రెట్టీంపు ఇమ్మన్నాడు అన్నారు.

అలాగా! అయితే స్వామీ నాకు ఒక కన్ను పోగొట్టండి అని వరం కోరుకున్నాడు

ఇప్పుడు తమకు విషయం అర్ధం అయిందనుకుంటా.

*** *** ***

పేస్ బుక్ రైల్ బండి పోతున్నది... అడిగిన వాళ్ళకి అందులో చోటు వున్నది.!

పేస్ బుక్ రైల్ బండి పోతున్నది...

అడిగిన వాళ్ళకి అందులో చోటు వున్నది.!

(Vijay Lenka గారి స్కెచ్.)

ఒకానొక కాలం, రైలు బండిలో ప్రయాణం; చెక్క బల్లలు పోయి కుషన్‌ సీటులు వచ్చేసాయనుకోండి. ఆంధ్ర భూమీ ఆంధ్ర జ్యొతీ అనే అరుపుల మధ్య అనిపిస్తే ఒకటి కొనుక్కోవడము చదవడము అయిన తర్వాత పక్కోళ్ళు మొహమాటముగా ఆ పత్రిక అడగడము మీరు చిరు నవ్వుతో ఇవ్వడము. తెచ్చుకున్న ఉప్మానో పులిహారో పక్కోల్లతో పంచుకోవడము.

ఎదుటి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలే కాకుండా వారి పూర్వీకుల సమగ్ర విషయ సేకరణ చిరునామాలు ఇచ్చి పుచ్చుకోవడం ఫోన్‌ నెంబర్లు వుంటే అవి కూడ ఇచ్చి పుచ్చుకోవడం రైలు దిగిన రెండు నిమిషాల్లో అన్నీ మరచి పోవడం; ఇదీ రైలు కధ

ఇప్పుడు ఫేస్బుక్కు అనే కొత్త రైలు వచ్చింది. ఊసు పోక కబుర్లు అన్నయ్యా అక్కయ్యా చెల్లీ బుల్లీ వరుసలు అవతలి వారి మొహాలు తెలియకపోయినా. మధ్యలో అలుకలు ఒకరి మీద ఒకరి మాటల విరుపులు, పగలు పంతాలు. రైలులో ఎదురుబొదురుగా కూసుంటాము కాబట్టి తిట్టుకోడానికి కష్టం ఇక్కడయితే ఫ్రీ ఫీల్డ్ మొహాల్లకి ముసుగులేసుకునీ మరీ యుధ్ధాలు.

పదిమందికీ పనికొచ్చేదుంటే చెప్పండి స్వోత్కర్షలు మొదలయినవి దయ చేసి వదిలేయండి.

ఫేస్బుక్కు ఫ్రెండ్స్ అంటే నవ్వు వస్తుంది, కొందరి మనసు బాధించొచ్చు కాని ఇవి కేవలము పరిచయాలే (టైమ్ పాస్ మూంఫలీ); కాని కొందరు అద్భుతమయిన వ్యక్తులు పరిచయమవుతారు ఆ విషయం వేరే.

ఎలానూ ఈ ఫేస్బుక్కు రైలు బండి దిగినంక విషయం మర్చిపోతాము కాబట్టి అందరూ మనసుల్లో ఏం పెట్టుకోకుండా హేపీసుగా వుండండి.

విధి నిర్వాహకులు ......(స్కెచ్ --.శ్రీ వీరభద్ర శాస్త్రి..కాలనాధభట్ట.)

విధి నిర్వాహకులు ......(స్కెచ్ --.శ్రీ వీరభద్ర శాస్త్రి..కాలనాధభట్ట.)

.

1. మంత్రిగారి అబ్బాయి కారు ఇస్కూలు గేటుదగ్గరకు రాగానే గబగబా వాచ్ మ్యాన్ గేటు బార్లాతీసి అటెన్షన్ లో నిలబడి సాల్యూట్ కొట్టాడు. కారులోపలకి వచ్చి భవనం ముందు ఆగగానే ముందు డొర్ తెరిచి విధేయుడైన చప్రాసీ స్కూలు బ్యాగుతో కిందకు దిగాడు.

డ్రైవరు దిగి వచ్చి వెనక సీటు డోరు తెరిచి నిల్చున్నాడు. కొంచెంసేపు ఆగి తిరిగి తలుపు వేసి తనడ్రైవింగు సీటులో కూర్చున్నాడు. చప్రాసీ స్కూలు బ్యాగుతో ముందుసీట్లో ఎక్కి కూర్చున్నాడు. కారు వెనక్కి తిరిగి రయ్యిమని వెళ్ళిపోయింది.

చదువరులారా! మీకు వింతగా అనిపించవచ్చు ఏమిటీ ప్రహసనం అని.

అంతకు ముందు రోజే విమానంలో మంత్రిగారు కుటుంబసమేతంగా అమెరికా పర్యటనకు ఆదేశ ప్రభుత్వ ఆహ్వానంపై వెళ్ళడం జరిగింది.

మరి ఈ కారు రావడం ఇదంతా ఏమిటని అచ్చరువందుతున్నారా?

రోజూ మంత్రిగారి అబ్బాయిని స్కూలు కు తీసుకు వెళ్ళడం స్కూలుబ్యాగు మొయ్యడం ఆడ్రైవరుకు, చప్రాసీకి నిత్యవిధి. మంత్రి గారి అబ్బాయి వున్నా లేకపోయినా.

2. బోరున వర్షం పడుతొంది. మంత్రిగారి భవనం చుట్టూ వున్న పూల మొక్కలకు గొడుగు వేసుకొని రబ్బరు పైపుతో నీళ్ళు పోస్తున్నాడు తోట మాలి. అది అతని నిత్య విధి.వర్షం పడితే పడుగాక

3. రాత్రి తెల్లవార్లూ హోరున గాలి, దానికి సాయం బ్రహ్మాండమైన వర్షం 

ఉదయం విధ్యుఛ్చక్తి కార్యాలయం ముందు వాననీరుతో కల్సిపోయి ప్రవహిస్తున్న మురికి కాలవను అతిలాఘవంగా దాటుతూ...

కార్యాలయం లోపలకి వచ్చి ఒకసారి గోడ గడియారం కేసి చూసి, సరిగ్గా ఏడుగంటలవగానే కరెంటు ఆపేసి తనవిధిని సక్రమంగా సకాలంలో కరెంటు కోతను అమలు పరిచినందుకు సంతృప్తిగా వెనక్కి వెళ్ళిపోయాడు దారిలో ముందు వెళ్తున్న గొఱ్ఱెలమందను దాటుకుంటూ...

(వార్త: ఉదయం 7 నుంచి 9 వరకూ కరెంటుకోత అమలు)

x

Thursday, August 25, 2016

శ్రీ కృష్ణకర్ణామృతం---లీలాశుకమహర్షి విరచితం.


శ్రీ కృష్ణకర్ణామృతం---లీలాశుకమహర్షి విరచితం.

అద్భుతమైన శ్లోకం :

:కైలాసో నవనీతతతి క్షితిరయం ప్రాక్దగ్ధ్యమృల్లోష్టతి,

క్షీరోదోపి నిపీత దుగ్దతి లసత్ స్మేరే ప్రఫుల్లే ముఖే,

మాతా జీర్ణధియా ధృఢం చకితయా నష్టాస్మి దృష్ఠః కయాః,,

థూ థూ వత్సక జీవ, జీవ చిరమిత్యుక్తో వతాన్నో హరీః.

.

బలరాముడు తల్లి యశోద దగ్గరకు వెళ్ళి తమ్ముడు మన్ను తిన్నాడని చెపాడు. యశొదమ్మ కృష్ణుడిని నోరు తెరవమంది. కృష్ణుడు నోరు తెరిచాడు.

ఇంకేముంది? తల్లికి కైలాస పర్వతం కనపడ్డది.. అది చూసి "అమ్మో, పొద్దున తిన్న వెన్న ముద్ద అరగకుండా అట్లాగే వుంది" అని అనుకున్నది. 

పరిభ్రమిస్తున్న భూగోళం చూసి, నిజమే మన్ను తిన్నాడనుకున్నది.

క్షీరసముద్రం చూసి, అయ్యో పాలు కూడా అరగలేదనుకున్నది. 

ఆ చిరునవ్వులు చిందిస్తున్న ఆ కొంటె కృష్ణుడిని చూసి, 

తల్లి కంగారు పడి పోయి "ఇంకేముంది, ఎవరి దృష్టో తగిలింది" అని 

"థూ, థూ, చిరంజీవ, చిరంజీవ, బిడ్డా" అనుకుంటూ దిష్టి తీయించుకుంటున్న

శ్రీ కృష్ణుడు మనలను కాపాడుకాక.

రాధనురా నీ రాధనురా!

రాధనురా నీ రాధనురా!
.
రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
.
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
.
రాధనురా నీ రాధనురా!
.
ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
.
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
.
రాధనురా నీ రాధనురా!