నవ్వులలో రకాలు..

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు. 

.

నవ్వులలో రకాలు..

చిరునవ్వు,... సకిలింపు, ...ఇకిలింపు, 

ముసి,ముసి నవ్వు, ..మూగనవ్వు, ..గుడ్డినవ్వు, ....

పక,పకలు,... అట్టహాసం ఇలా నవ్వనేక రకాలు. 

దేనికదే సాటి. భరతముని నాట్యశాస్త్రంలో ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వుని వర్గీకరించాడు. 

ఆధునికి సాహిత్యంలో హాస్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన 

పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు ...మొలక నవ్వు, .....మొద్దు నవ్వు,.. ...కిచకిచ నవ్వు, ........కిలకిల నవ్వు, ..ఇగిలింపు నవ్వు, ...సకిలింపు నవ్వు...., కుండమూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, .....వెర్రి నవ్వు, .....తిట్టు నవ్వు అంటూ నవ్వుకి అనేక రూపాలిచ్చారు.

అయెతే ..లక్ష్మణుడి నవ్వు రాముని కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. 

గుమ్మడి పండ్ల దొంగ భుజాలు తడుముకున్నట్టు ప్రతి ఒక్కరూ తమలోని లోపాన్ని తలుచుకుని సిగ్గుతో కుంచించుకోపోయిన వైనం జానపదుల నోటి నుండి ఎంతో రమణీయంగా జాలువారింది. 

ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికే హేతువైంది. 

ఇక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికే ఊపిరైంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!