చంద్రోదయ వర్ణన.. (శ్రీనాధుని భీమఖండ ము .)

చంద్రోదయ వర్ణన.. (శ్రీనాధుని భీమఖండ ము .)

‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్

శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే –విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట .శ్రీనాధుడు మహా శివ భక్తుడు కనుక చంద్రబింబం సాక్షాత్తు శివ స్వరూపం గా దర్శనమిచ్చ్చింది –ఆ శోభను ఎలా వర్ణించాడో చూద్దాం –

‘’కాదు కాడుదయాద్రి కనక కూటంబిది –డంబైన పాన వట్టంబు గాని

కాదు కాదిది సుధాకర పూర్ణ బింబంబు –కాశ్మీర శంభు లింగంబు గాని

కాదు కాదుదయ రాగ ప్రకాశం బిది –నవ కుంకుమా లేపనంబు గాని

కాదు కాదిది కలంక చ్చటా రించోళి-పూజ చేసిన కల్వ పువ్వు గాని

యనగ సప్తార్నవములు మిన్నంది కొనగా –జంద్ర కాంతో పలంబులు జాలువార

నసమశర సార్వ భౌము ముత్యాల గొడుగు –విధుడు విశ్వంబు వెన్నెల వెల్లి దేల్చే ‘’’

భావం –కనిపించేది శివుని పాన వాట్టం కాని తూర్పుకొండ బంగారు శిఖరం కాదు .కాశ్మీర శివలింగం కాని, చంద్రుని తెల్ల బింబం కాదు .కొత్త కుంకుమ పూత కాని ఎరుపు పూత కాదు .శివుడికి పూజ చేసిన కలువ పూలే కాని చంద్రుని మచ్చ కాదు .సప్త సముద్రాలు ఆకాశాన్ని అందుకోగా చంద్ర కాంత శిలలు కరిగి మన్మధుని ముత్యాల గొడుగు అయిన చంద్రుడు లోకాలను వెన్నెలలో తేలేట్లు చేశాడు .పూర్ణ చంద్రుడు ఉదయ రాగాన్ని కొంచెం వదిలేసి శుభ్రం చేసుకొని మెరసె దాక్షిణాత్య స్త్రీ వజ్రాలవంటి దంతాలచేత కన్నులకు పండుగ చేస్తున్నాడు .కాశీలో చంద్రుడు ఏం చేశాడో ఇప్పుడు వర్ణిస్తున్నాడు శ్రీనాధుడు .

‘’అభిషేక మొనరించు నమృత ధారా వృష్టి –మదనాంతకుని ముక్తి మంటపికకు

నలవోకగా విశాలాక్షీ మహాదేవి –నిద్దంపు జెక్కుల నీడ జూచు

నేరియిం చు మిన్నేటి ఇసుక తిన్నెల మీద –జక్రవాకాం గనా సముదయంబు

డుంఠి విఘ్నేషు నిష్టుర కంఠ వేదిపై-గోదమ చుక్కల రాజు గుస్తరించు

గాయు వెన్నెల యానంద కాననమున –గాల భైరావు దంష్ట్ర లకు డాలుకొలుపు

విధుడు వారాణసీ సోమ వీధి చక్కి –నాభ్ర ఘంటా పదంబు నరుగు నపుడు ‘’

భావం –చంద్రుడు కాశీ నగరం లోని సోమ వీధి ప్రాంతముపై ఆకాశ వీధిలో సంచ రించే టప్పుడు –విశ్వేశ్వరుని ముక్తి మంటపాన్ని వెన్నెల వర్షం తో అభిషేకిస్తాడు .విశాలాక్షీ దేవి స్వచ్చమైన చెక్కిళ్ళపై ప్రతి బిం బిస్తాడు .గంగానది ఇసుక తిన్నెలపై ఆడ చక్ర వాక లను బాధ పెడతాడు .డుంఠి వినాయకుని కంఠము దగ్గరున్న చంద్రుడిని లాలిస్తాడు కాశీ మీద వెన్నెల కురిపిస్తాడు క్షేత్ర రక్షకుడైన కాల భైరవుని కోరకు కాంతి నిస్తాడు .చంద్ర బింబం లోని మచ్చ ఎందుకు ఏర్పడింది అంటే రోహిణీ దేవి చంద్రుడిని కౌగిలిమ్చుకోవటం వలన ఏర్పడిన కస్తూరి పూతవలన ,రాహువు కోరతో కొత్తగా ఏర్పడ్డ చిల్లి లో కనబడే ఆశం ముక్క వలన ,స్వచ్చం గా ఉండటం చేత కొరికి మింగిన చీకటి వలన ,,పుట్టినప్పుడు మందర పర్వతం రాసుకోవటం వల్లఏర్పడిన కాయ వలన ,విరహం తో తాపం చెందే ఆడ చక్ర వాకాల కడగంటి చూపు అనే నిప్పు వల్ల కలిగిన ఇంట్లోని ధూమం వలన అని శ్రీనాధుడు ఉత్ప్రేక్షించాడు ..రాత్రి అంతా వెన్నెల స్నానం తో జనం పులకరించిపోయారు .మళ్ళీ సూర్యోదయం అవ్వాలి .నిత్య కర్మానుస్టాలు ప్రారంభ మవ్వాలి .ఇప్పుడు సూర్యోదయ వర్ణన చేస్తున్నాడు శ్రీనాధుడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!