ఆధ్యాత్మిక ధామం అరుణాచలం!

ఆధ్యాత్మిక ధామం అరుణాచలం!

.

అరుణాచలం అనగానే అరుణాచలేశ్వరుడు గుర్తుకువచ్చి మనసు భక్తిభావంతో పొంగిపోతుంది. గిరి ప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకాలలో ఓలలాడిస్తుంది. అక్కడి కార్తీకదీపోత్సవం అణువణువునూ శివతేజస్సుతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అరుణాచలం అనగానే రమణమహర్షి ఆశ్రమమూ గుర్తుకువస్తుంది. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం సమాధి మనసులో మెదులుతుంది. 

.

శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణ గిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.

అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!