Thursday, July 30, 2015

భర్తృహరి సుభాషితం ! .ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు


భర్తృహరి సుభాషితం !
.
"ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్"

భావం:
ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు,
సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట,
కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక
అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

మధుర భావనలు .!మధుర భావనలు .!
.
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి


కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు
.ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు
.భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము.
రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు .ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది
.శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు .కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి .
త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్ శిష్యుడు. ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా .
.సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ ,
విద్యారన్యులకు హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు
.ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు ముఖ్య శిష్యుడు
.రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు.
గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యుడు
.రఘు పతి వెంకట రత్నం గారికి కృష్ణ శాస్త్రి లాంటి శిష్యపరమాణువు లెందరో .చెళ్ళ పిళ్ళ వారికి విశ్వనాధ ,పింగళి ,కాటూరి వంటి కవి శిష్యులకు లెక్కే లేదు
విశ్వనాధకు ధూళిపాళ శ్రీరామ మూర్తి ,పేరాల భరత శర్మ జమదగ్ని జువ్వాడి గౌతమ రావు, పొట్ల పల్లి సీతారామ రావు మొదలైన వారు ప్రసిద్ధి చెందిన శిష్యులు .
ఇప్పుడు గురు పదం ఆశ్రమ వాసులకే చెల్లుతోంది .దైనిక జీవితం లో మేష్టారు ,మేస్టరు ,టీచరు ,ఉపాధ్యాయుడు ,అధ్యాపకులయ్యారు . సెప్టెంబర్ అయిదు శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినోత్సవం .అంటే ఉపాధ్యా దినోత్సవం అదే గురు పూజోత్సవం

గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే ఈ ఆడవాళ్ళు ఇంతే...బాపు బొమ్మలు !

అమయాకంగా తెల్ల పోతారు.

,
గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే  ఈ  ఆడవాళ్ళు ఇంతే.
..
గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు.
..
బాపు గారి లైలా!
..

బాపుగారి అడవి సుందరి !
...
.....
ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి.
....
అమయాకంగా తెల్ల పోతారు.
...

....
గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు.
,,,,,

బాపు గారి లైలా!
,,,,,,,
బాపుగారి అడవి సుందరి !

,,,,,

ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి.
,,,,,
ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ
ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ

అర్ధాంగి!

అర్ధాంగి!

పట్టు పితంబరం మట్టి పడి మాసేను...

పాలు కారే మోము గాలికే వాడెను....

గొల్ల పిల్లలు చాల అల్లరి వరురా...

గోల చేసి నీ పెయన కోదేములు చెప్పేరు...

ఆడు కోవలనని పాడు కోవేలననిన

అన్నింట నేను ఉన్నా..

ఒక అద్బుతమయినపాట....

జిక్కి గొంతు...మహానటి సావిత్రి నటన.

(సావిత్రి చిత్రం ..పొన్నడ మూర్తి గారు.)

https://www.youtube.com/watch?v=mP4y9ZQbToU

మన ఆటలు... పులి-మేక లేక .... పులిజూదం


మన ఆటలు...
పులి-మేక లేక .... పులిజూదం

భాష భారతి's photo.

ఆడే పద్దతిః

ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు

పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది!


అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది!
.
అసలు అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది. దాని కల్పన, నిర్మాణం, ప్రదర్శన, అంతా కూడా ఒక కళ. ప్రకృతిలో ఎక్కడా కనుపించని సౌందర్యాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ కల్పనలో ఆ కూర్పులో అందం ఉంది. అసత్యానికి కూడా, కల్పనా, కూర్పూ కావాలె. దాని నిర్మాణంలో పనితనానికి ఎంతైనా అవసరం ఉంది. అందుకనే సత్యానికంటే అసత్యము ఎక్కువ సుందరమైనది.

నేను ప్రభుత్వోద్యోగిని. నాకు సెలవు కావాలె. ఎందుకూ? జ్వరం వచ్చిందా? లేదు. కాని ఏదో బధ్ధకంగా ఉంది. ఇంట్లో పడుకోవాలె అనిపించింది. లేకపోతే భార్యతో కబుర్లు చెప్పుకొంటూ కూర్చోవాలెనని బుధ్ధి పుట్టింది. సెలవకు వ్రాయాలె. సత్యాన్ని ఆశ్రయిస్తే ఉద్యోగాన్ని ఊడకొడుతుంది.

సాయింత్రం మా ఆవిడ, నేను ఎంతో కష్టపడి మిగిల్చిన డబ్బుతో కొన్న పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెడుతుంది. ఆవిడ చీరకట్టుకొన్న సౌందర్యాన్ని నేను ముందుగా చూడాలని ఉంది. మధ్యాహ్నం సెలవు కావాలె. నిజం చెపితే సెలవు దొరుకుతుందా?

అసత్యాన్ని ఆశ్రయించాలె. ఆవిడ ఓ చక్కని ఉపాయం చెబుతుంది. జబ్బు, తలనొప్పి, కడుపులో పోట్లు అని వ్రాయమని చెప్పటమే కాకుండా ముఖం ఇల్లాగ పెట్టు, నడుం ఇల్లాగ వంచు, కళ్ళు కొద్దిగా చిట్లించు, ఇట్లా నడు, ఇల్లాగ బాధతో మాట్లాడు అని చెబుతుంది గదా! మనచేత చక్కని నాటకం ఆడిస్తుంది. సత్యం అయితే ఒకమాటతో సరి. అసత్యమైతే ఒక కావ్యం అల్లాలె.

Wednesday, July 29, 2015

నేను. (కవిత... శ్రీమతి శైలజ మిత్రా .)


నేను.
(కవిత... శ్రీమతి శైలజ మిత్రా .)
.
దారి తప్పిన ప్రార్థనకు
పూజారిని కాలేను

కష్టపడే పూజకు
భక్తుడిని కాలేను

ఇష్టపడే భక్తుడికి
దైవాన్ని కాలేను

కరుణించలేని దైవానికి
మనిషిగా కనబడలేను

మనసులేని మనిషికి
జీవితాన్ని అందివ్వలేను

ఓ కూనలమ్మ.!


ఓ కూనలమ్మ.!
.
అంత్యప్రాసల జల్లు
భాషలో పరవళ్ళు
“ఆరుద్ర” కే చెల్లు
ఓ కూనలమ్మ

“బాపు” బొమ్మల ఒంపు
బుడుగు మాటల ఇంపు
తెలుగు బాసకే సొంపు
ఓ కూనలమ్మ

కృతజ్ఞతాగేయం - రచన: బాలాంత్రపు రజనీకాంతరావు

కృతజ్ఞతాగేయం - రచన: బాలాంత్రపు రజనీకాంతరావు


కృతజ్ఞతాగేయం
అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970)


నే చేయునదీ నే చేయనిదీ
సాధించినదీ ఫలియించనిదీ
నీ యిచ్ఛలేక జరుగదట
నా స్వేచ్ఛ మొదలు తుది యెచట!    ॥చేయునదీ॥

నిను చూచుటకే రప్పించితివీ
నీ దరిసెనమే యిప్పించితివీ
యీనోట పాట పాడించితివీ
యిది ఎవరి రచనయని యడిగితివీ    ॥చేయునదీ॥

నా భావనమే నా జీవనమై
నీ ప్రణయమ్మే నా కవనమ్మై
నా అహపుటంచు చెరిపించెదవో
నా ఇహము పరము గావించెదవో    ॥చేయునదీ॥

నాదామృతమే పరసాధనగా
నీ దివ్య వాక్కే ఉద్బోధనగా
ఈ రజని కాంతు లొలయించెదవో
విశ్వ జనహితము వెలయించెదవో    ॥చేయునదీ॥

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథలు ]

Vinjamuri Venkata Apparao's photo.

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథలు  ]
.
పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. “ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు. ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి. ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి. ఆ సమయంలో.... రాజవీధిలో ఓ బ్రాహ్మణ యువకుడు పోతున్నాడు. అతడి పేరు ధనస్వామి. అతడెంతో అందంగా ఉన్నాడు. గిరజాల జుట్టు, కోరమీసం, తెల్లని దేహచ్ఛాయ... మూర్తీభవించిన మన్మధుడిలా ఉన్నాడు. యధాలాపంగా అతడు భగవతిని చూసాడు. సౌందర్యాధిదేవతలా ఉన్న యువరాణిని చూసి అతడు అబ్బురపడ్డాడు. సరిగ్గా ఆ క్షణమే.... భగవతీ అతణ్ణి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఒకరొకరిపై చూపుల తూపులు విసురు కున్నారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉదయించిందని ఇద్దరికీ అర్ధమైంది. కానీ ఎలా కలుసుకోగలరు? భగవతి రాచకన్య. ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు. అలాంటి చోట, ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో, దీనంగా చూస్తూ ఊర్కున్నారు. అయితే ధనస్వామి ఇంటికి వెళ్ళినా క్షణం కుదురుగా ఉండలేకపోయాడు. నిద్రాహారాలు పట్టలేదు. ప్రతీక్షణం, పగలూ రాత్రి, అదే థ్యాసగా యువరాణి భగవతిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు. చివరికి అతడో నిర్ణయానికి వచ్చాడు. ఆ ప్రకారం ధనస్వామి, తన మిత్రుడైన లోకదేవుణ్ణి కలుసుకున్నాడు. లోకదేవుడు చాలా తెలివైన వాడు. యుక్తి పరుడు. నేర్పరి. ధనస్వామి లోకదేవుడికి విషయమంతా చెప్పి ‘యువరాణిని కలుసుకునేందుకు ఉపాయమేదైనా చెప్పి పుణ్యం కట్టుకో’మన్నాడు. లోకదేవుడు మిత్రుడి కోరిక విని మ్రాన్పడి పోయాడు. తేరుకున్నాక “మిత్రమా, ధనస్వామి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడ నీవు? ఎక్కడ యువరాణి? తేడా వస్తే కుత్తుకలు తెగిపోగలవు సుమా!” అని హెచ్చరించాడు. దాంతో ఖిన్నుడైన ధనస్వామి ముఖం చూసి లోకదేవుడికి జాలి కలిగింది. మిత్రుడి యందు ప్రేమాతిశయంతో.... సాహసానికి పూనుకున్నవాడై “ప్రియమిత్రుడా! నీ కోరిక తీర్చుట కష్టసాధ్యం. ప్రమాదభరితం కూడా! అయినా నీవు నా ప్రాణసఖుడవు. నీ కోసం నేను పూనుకుంటున్నాను. నీకో ఉపాయం చెబుతాను. నువ్వు చింతించకు” అన్నాడు. దాంతో ధనస్వామికి ఎంతో ఊరట కలిగింది. బాగా ఆలోచించి లోకదేవుడు ఓ ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం, లోకదేవుడు ఓ మునిలా వేషం ధరించాడు. ధనస్వామికి అందమైన యువతి వేషం వేసాడు. ఇద్దరూ రాజు కార్తికేయుడి సభకు వెళ్ళారు. లోకదేవుడు రాజుకు నమస్కరించి “మహారాజా! నీకు సర్వసుఖాలూ కలుగుగాక! భగవంతుడు నీకు ఆయురారోగ్య భోగభాగ్యాలూ ఇచ్చుగాక!” అని దీవించాడు. రాజతణ్ణి గౌరవించి, అతిధి సత్కారాలు ఆచరించాడు. లోకదేవుడు “రాజోత్తమా! నేను కాశీ యాత్రకు పోవుచున్నాను. ఇదిగో ఈ పిల్ల నా కుమార్తె సుకేశిని. (అందమైన మంచి శిరోజాలు కలది అని ఆ పేరుకు అర్ధం.) తల్లి లేని ఈ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు ఈ అందమైన యవ్వనవతిని వెంటబెట్టుకుని, కాశీ యాత్ర వంటి దూరప్రయాణం చెయ్యలేను. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి నిన్ను సాయమర్ధించ వచ్చాను. నేను తిరిగి వచ్చు వరకూ, నాబిడ్డను నీకు అప్పగిస్తాను. ఆమె రక్షణ భారం వహించవలసిందిగా నా ప్రార్ధన” అన్నారు. రాజందుకు సంతోషంగా సమ్మతించాడు. సుకేశిని రూపంలో ఉన్నది స్త్రీ కాదనీ, పురుషుడనీ తెలియని రాజు, ఆమెని తన కుమార్తె భగవతి మందిరానికి పంపించాడు. సమ వయస్కులవ్వటం చేత, ఇద్దరూ స్నేహంగా మెలగ గలరని అతడనుకున్నాడు. భగవతి మందిరం చేరిన సుకేశిని వేషధారణలో ఉన్న ధన స్వామి, యువరాణితో ఏకాంత సమయం కోసం వేచి ఉన్నాడు. ఓ రోజు ఎవరూ లేకుండా చూసుకుని, ధనస్వామి ‘తాను స్త్రీ కాదనీ, సుకేశినిగా ఉన్న తాను పురుషుడననీ, తన పేరు ధనస్వామి అనీ’ వివరించాడు. అది విని భగవతి ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది. ఆమెకతడి మీద ప్రేమ ఉప్పొంగింది. కానీ అది పైకి కనబడనివ్వకుండా, కోపం నటిస్తూ “ఏమిటీ? ఎంత ధైర్యం నీకు, ఈ విధంగా రాజమందిరంలోకి రావటానికి? నేనంత చులకనగా తోచానా నీకు? ఇదంతా మా తండ్రికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చూడు, నేను నిన్ను ఏం చేస్తానో?” అంది. అయితే బ్రాహ్మణ యువకుడు ధనస్వామి అందుకు బెదరలేదు. చెదరని చిరునవ్వుతో “ప్రేయసీ! నీ మీది ప్రేమకొద్దీ నేనిలా ప్రాణాలకు తెగించాను, అంతే తప్ప మరిక దేని కోసమూ కాదు. తొలి చూపులోనే నీవూ నాపై వలపు కలిగి ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నన్ను బెదిరించ ప్రయత్నించకు. అది వృధా. ప్రేమతో నన్ను అంగీకరించు. ఎందుకిదంతా మీ తండ్రికి చెప్పేందుకు ఆతృత చూపిస్తావు? నీవు నన్ను రక్షించగలవు. నన్ను కాపాడేందుకు నీవే సమర్ధరాలవు. నేను ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నిన్ను చేరేందుకు ఇంత ప్రమాదానికైనా పాలుపడ్డాను. ఇక ఇప్పుడు నన్ను రక్షిస్తావో లేక శిక్షిస్తావో నీదే నిర్ణయం. నీవేది చేసినా నాకు ఇష్టమే! నీ ప్రేమ పొందలేనప్పుడు రాజు చేతిలో మరణం పొందడమైనా నాకు ఆనందమే!” అన్నాడు. ధనస్వామి తన కొరకు అంత సాహసానికి పూనుకోవటం, ప్రాణాలకు తెగించటం.... భగవతికి ఎంతో ఆనందం కలిగించింది. ఆపైన అతడి తీయని మాటలకీ తెగింపుకీ మరింత ముగ్దురాలైంది. కిలకిలా నవ్వుతూ “ప్రియా! నేను చేయగలిగింది ఇదే!” అంటూ అతడి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది. ధనస్వామి పరవశించి పోయాడు. అది మొదలు ఏకాంతంగా ఇద్దరూ ఒండొకరి సాన్నిహిత్యాన్ని ఆనందించ సాగారు. ఇది ఇతరులెవరు కనిపెట్ట లేక పోయారు.
.
కళ్ళెదుట దొంగల నాయకుడి మరణాన్ని చూసిన రత్నావళి విహ్వలచిత్త అయ్యింది. అప్పటి కప్పుడు ఆ శశ్మాన వాటికలో చితి పేర్చుకుంది. దొంగల నాయకుడి తలను చేతబట్టి, చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. మండుతున్న అగ్నికీలలకి నమస్కరించి నిప్పుల్లోకి దూకింది. ఆకాశం నుండి, జరుగుతున్నదంతా గమనిస్తున్నారు జగదాంబ, పరమేశ్వరులు. మాత పార్వతికి రత్నావళిని చూసి జాలి కలిగింది. పతి వంక సాభిప్రాయంగా చూసిందామె. అనుమతిస్తున్నట్లుగా నవ్వాడు జంగమ దేవర. మరుక్షణం పార్వతీ పరమేశ్వరులు, రత్నావళి ముందు ప్రత్యక్షమయ్యారు. అంతే! నిప్పుల గుండం పూల రాశిలా మారి పోయింది. పార్వతీదేవి “అమ్మాయీ! అంత సాహసం చేయకు. ఏం కావాలో కోరుకో!” అంది ప్రేమగా! ఆది దంపతులని చూసి రత్నావళి పరవశించి పోయింది. సంతోషాంతరంగంతో చేతులెత్తి నమస్కరిస్తూ, వారిని స్తుతించింది. “తండ్రీ గిరిశా! తల్లీ గిరిజా దేవి! మీరు జగత్తుకే తల్లిదండ్రులు. నామీద మీకు కరుణ ఉంటే నా మనోనాయకుడయిన ఈ దొంగల నాయకుడిని సజీవుణ్ణి చెయ్యండి. అతణ్ణి నేను పతిగా వరించాను. నామీద దయ యుంచి, నాకు పతి భిక్ష పెట్టండి. ఇది తప్ప నాకు మరో కోరిక లేదు” అని ప్రార్ధించింది. శివపార్వతులు రత్నావళి పట్టుదలనీ, నిజాయితీ గల ప్రేమనీ చూసి ముచ్చట పడ్డారు. ‘తధాస్తు’ అన్నారు. వారిచ్చిన వర ప్రభావంతో, చచ్చిపడి ఉన్న దొంగల నాయకుడు పునర్జీవితుడైనాడు. నిద్ర నుండి లేచినట్లుగా కసిగంద కుండా ఉన్నాడు. వారిద్దరినీ ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు. వీరకేశుడు, అతడి భార్యా, ఇదంతా చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తల నరకబడిన దొంగ పునర్జీవితుడు కావటం చూసి, ప్రజలు ఆశ్చర్యం పట్టలేక పోయారు. అందరూ రత్నావళినీ, ఆమె ప్రేమ బలాన్నీ ఎంతగానో ప్రశంసించారు. వీరకేశుడు, కూతురూ అల్లుడిని ఇంటికి తీసికెళ్ళి, బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, రత్నావళిని దొంగల నాయకుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ సమాచారమంతా వేగుల ద్వారా విన్న రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. రత్నావళి పట్టుదలనీ, నిజమైన ప్రేమనీ చూసి వెరగు పడ్డాడు. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, భక్తి తలచి, పార్వతీ పరమేశ్వరులనే మెప్పించిన ఆమె పట్టుదలని చూసీ, వారిని గౌరవించటం తన విధి అనుకున్నాడు. వీరకేశుణ్ణి దొంగల నాయకుణ్ణి సభకు పిలిపించి ఆదరించాడు. దొంగల నాయకుణ్ణి తన సైన్యానికి అధిపతిగా నియమించి సత్కరించాడు. దొంగల నాయకుడు కూడా, జరిగిందంతా చూసి చాలా మధనపడ్డాడు. ప్రేమ, పట్టుదల, భక్తి, మంచి చెడు... వంటి మానవీయ విలువలు అర్ధం చేసుకుని, అంకిత భావంతో పని చేయాలని నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళకే ఎంతో సమర్ధుడైన, ధైర్యశాలి అయిన సైన్యాధిపతిగా ప్రజలందరి మన్ననా పొందాడు. ఇదీ కథ! భేతాళుడు ఈ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య మహీపాలా! విన్నావు కదా కథ!? ఇప్పుడు చెప్పు. భటులతడి మరణ శిక్ష అమలు చేయబోయే ముందు, దొంగల నాయకుడు ముందు క్షణం నవ్వాడు. ఆ తర్వాత ఏడ్చాడు? ఎందుకలా చేసాడో చెప్పు” అన్నాడు. విక్రమాదిత్యుడు మృదుగంభీర స్వరంతో “భేతాళా! దొంగల నాయకుడు రత్నావళిని చూసి నవ్వాడు. తన గురించి ఏమీ తెలియకుండా, దొంగనని తెలిసీ, ఇంతటి సౌందర్యవతి తనని ప్రేమించి ఏడ్చుట చూసి అతనికి నవ్వు వచ్చింది. ఆమె తల్లిదండ్రుల దుఃఖం చూసి మనస్సు కరిగింది. అందుకోసమే మొదట నవ్వి పిదప ఏడ్చాడు” అన్నాడు. భేతాళుడు గలగల నవ్వుతూ “మౌనభంగమైంది మహారాజా! అందుకో నా పరుగు” అంటూ మాయమై మోదుగ చెట్టెక్కాడు.


Tuesday, July 28, 2015

శ్రీ కృష్ణ నిర్యాణం!


శ్రీ కృష్ణ నిర్యాణం!
.
శ్రీకృష్ణుడు ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని పూశాడు
కాని, అరికాలిలో మాత్రం పూయటం మరచిపోయాడు. ఫలితంగా ఆ ఋషి ఆ అరికాలిలోనే నీకు ప్రాణాపాయం జరుగుతుందని చెప్పిన విషయం గుర్తుకు రాగా, శరీరత్యాగం కోసం మనసును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను అణచిపెట్టి సమాధిని పొందాడు.

ఆ సమయంలో 'జర' నేలను కాలితో రాస్తూ అడవిలో ప్రవేశించింది. 'జర' ముసలితనానికి అధిషా్ఠనదేవత. కాలం (మరణం) ఆసన్నమైనదని సూచించేది జర.
ఆమెను కాలకన్య అని అంటారు.
ఆమె వేటగాడిని భ్రాంతి ఆవహించేటట్లు చేసింది. ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి దృఢమైన రీతిలో నారిని సంధించి జింక అని భ్రమించి బాణం వదిలాడు. బాణం పాదంలో దూరి బయటకు వచ్చింది.
శ్రీకృష్ణుడు మానవీయమైన దేహాన్ని విడిచి, పెంపొందిన తేజస్సు గలవాడై స్వర్గలోకానికి వెళ్లాడు.

ఈ దేశం నాకేమిచ్చింది?


ఈ దేశం నాకేమిచ్చింది?

.

అటు కాశ్మీరు నుంచి
ఇటు కన్యాకుమారి వరకు,
ఆ మూల ధాతు అడవుల నుంచి
ఈ మూల సముద్ర తీరం వరకు,
మదమెక్కిన కులాల పిచ్చినుంచి
పట్టు తప్పిపోయిన ఐకమత్యం వరకు,
కొంతమందికి ఒకటే ఆవేదన
ఆకలికోసం ఆక్రందనలోపడి
స్వార్ధం తెచ్చిన ఆవేశంతో
ఈ దేశం నాకేమిచ్చింది
నేనెందుకు దేశానికి ఇవ్వాలనే
వ్యర్ధమైన మాటలంటూ
ధరణి తల్లి ఎదను గుచ్చుతున్నారు.
తన కన్నీటిలో తడుస్తూ తృప్తిపడుతున్నారు.
రోజులెందుకలా అయ్యాయని గళమెత్తాలా
రోజులలా మారాయని సర్దుకొవాలా
అందుకే నేనో సవాలు విసురుతున్నా –

భార్య నిందించిందని బాధపెట్టే నీవు
హాంగ్ కాంగ్ లో కాపురం పెట్టి చూపించాలా !
అత్యాచారం చేసి తప్పించుకు తిరిగే నీవు
దుబాయ్ వెళ్లి వేధింపులకు గురిచేసి తప్పించుకో చూద్దాం !
ఎవ్వరికీ తెలీకుండా దొంగపెళ్ళి చేసుకునే నీవు
గ్రీస్ లో ఉంటూ నీ బుద్ధి చూపించు చూద్దాం !
అర్ధరాత్రైనా నిరభ్యంతరంగా తిరిగే నీవు
చెస్టర్ దేశం వెళ్లి అక్కడలా తిరిగి చూపించు చూద్దాం !
తోటివాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ అవహేళన చేసే నీవు
అమెరికాలోని ఒక్లాహమాలోని జంతువులను అలా చెయ్ చూద్దాం !
మైకుపెట్టి గోల సృష్టించే నీవు
సింగపూర్ వెళ్లి అర్దరాత్రి బాత్రూంలో నీళ్ళు పోయ్ చూద్దాం !
మూడో కంటికి తెలీకుండా సరుకును రవాణా చేసే నీవు
యుకె వెళ్లి అక్కడ నీ పనితనం చూపించు చూద్దాం !
దొంగచాటుగా కాలవనీల్లను మళ్ళించే నీవు
కొలరాడో వెళ్లి అక్కడ వర్షం నీటిని పట్టుకో చూద్దాం !
రానిదైనా చేయడానికొచ్చే అర్హతలేని నీవు
విక్టరియాలో నీ గొప్పతనాన్ని చూపించు చూద్దాం !
చనిపోయిన జంతువులను రోడ్డుపక్కన వదిలేసే నీవు
అంటార్క్టిక వెళ్లి అలా చెయ్ చూద్దాం !
నీకిష్టమొచ్చినట్లు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్ళే నీవు
ఇటలీ వెళ్లి నవ్వుతూ కాకుండా నడువు చూద్దాం !
మిడిమిడి జ్ఞానమున్న నాస్థికుడివైన నీవు
అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు చూద్దాం !
ఫోనులో ఇంటర్నెట్ వాడుతూ కనిపించే నీవు
బర్మా వెళ్లి వాడుతూ తిరుగు చూద్దాం !

నెలకో దేశం చొప్పునైనా
కనీసం రెండు సంవత్సరాల కాలంలోనైనా
ప్రపంచ పర్యాటన చేస్తూ
ఇవన్నీ ఒకసారి చేసి
దర్జాగా భారతదేశం వచ్చి
అప్పుడు చెప్పండిరా ….
ఈ దేశం నాకేమిచ్చిందని
నేనెందుకు దేశానికివ్వాలని !
అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి
నీ దాసున్నై జీవితాన్ననుభావిస్తాను.
నేను విసిరిన ఈ నా సవాలుకు
దేశమేమి ఇవ్వలేదనే వాళ్ళు సిద్ధమేనా ..?

Monday, July 27, 2015

ఐకమత్యం.

ఐకమత్యం..........(పైడిమర్రి రామకృష్ణ.)

అనగనగా ఒక అడవిలో కోతుల గుట్ట ఉండేది. అక్కడ చాలా కోతులు, కొండముచ్చులు నివసించేవి. ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్దపెద్ద ఊడలతో అందంగా ఉండేది. ఆ మర్రిచెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకొంటూ ఉండేవారు.

కోతులు, కొండముచ్చులు ఎప్పుడు పోట్లాడుకునేవి. చెట్లకు కాసిన పళ్లు, కాయలు కోసుకుని తిని, చెరువులో నీటిని తాగి మర్రిచెట్టు మీద ఎగిరేవి. కొండముచ్చులు రాగానే కోతులు మర్రిచెట్టును వదిలి గుట్టల్లోకి పారిపోయేవి.

ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు. అవి అప్పుడప్పుడు ముని తపస్సును భంగపరిచేవి. ముని పట్టించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు.

ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి. దాంతో చెరువు ఎండిపోయింది. చెరువుని చూసి కోతులు, కొండముచ్చులు బాధపడ్డాయి. దాహం తీర్చుకోటానికి ఏం చేయాలో వాటకి తోచలేదు. అప్పుడే బుజ్జి కోతులు నీటి కోసం 'కిచకిచ'మని అరిచేవి. ముసలి కోతులకు కూడా కష్టమైంది. అవి నీటికోసం చాలా దూరం ప్రయాణించి మరో చెరువులో ఉన్న కొద్దినీటిని తాగి వచ్చేవి.

మునికి కూడా స్నానాకి, ఇతర కార్యాలకు నీటి కొరత ఏర్పడింది. అతడు కూడా దూరంలో ఉన్న మరో చెరువులో స్నానం చేసి, తన కమండలంలో కొంత నీటిని తీసుకుని మర్రిచెట్టు కింద తపస్సు చేసుకుంటుండేవాడు.

ఒకరోజు అతను తపస్సు చేసుకుంటుండగా ఒక కోతికి బాగా దాహంవేసి, దూరంగా ఉన్న మరో చెరువు దగ్గరకు పోలేక ముని కమండలంలోని నీటిలో మూతి పెట్టింది. ముని కండ్లు తెరచి చూశాడు. కోతికి భయం వేసింది. మునిని చూసి 'గుర్ర్‌' మని

భయపెట్టింది. ముని మాట్లాడలేదు. తిరిగి కండ్లు మూసుకొని తపస్సు చేసుకోసాగాడు. కోతి, నీళ్లు తాగి కమండలం కిందపడవేసి వెళ్లిపోయింది.

ఆ క్షణం అతడికి ఆ ప్రదేశం వదిలి మరోచోటికి వెళ్లి తపస్సు చేసుకోవాలనిపించింది. కానీ అడవిలో ఏ చోటైనా జంతువులు, పక్షులుంటాయని గ్రహించాడు. ఎండలకి అన్ని చెరువుల్లో దాదాపు ఎండిపోయిందని కనిపెట్టాడు. ఏం చేయటమా ....అని దీర్ఘంగా ఆలోచించాడు. అతడికి ఒక ఆలోచన తట్టింది.

వెంటనే మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ పూజ చేశాడు. కొబ్బరికాయ కొట్టి కండ్లు మూసుకుని నమస్కరించాడు. కొబ్బరి చిప్పలకై కోతులు, కొండముచ్చులు అక్కడ చేరుకున్నాయి. అతని ముందే కోతులు, కొండముచ్చులు పోట్లాడుకోసాగాయి.

ముని మొదటసారిగా గొంతువిప్పాడు. ''ఆపండి! మీ పోట్లాట! అంటూ అరిచాడు. ముని మాట్లాడటంచూసిన కోతులు అవి ఆశ్చర్యపోయాయి. అతని కళ్లలో ప్రకాశిస్తున్న దివ్యజ్యోతిని చూసి భయంతో తలవంచుకొని నిలబడ్డాయి. ముని- కోతుల నాయముడు, కొండముచ్చుల నాయకుడిని దగ్గరకు పిలిచాడు.

''వానరుల్లారా! మీ శక్తి అమోఘమైది. ఇలా కోతిచేష్టలతో మీ శక్తిని వృధా పరుచుకోకండి. మీ ఇద్దరూ ఎకమై నిలబడితే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించగలరు అన్నాడు ముని.

ఐక్యంగా ఉంటే ఏ పనైనా తేలికగా సాధించడం సాధ్యమేనా? అని కోతుల నాయముడు ప్రశ్నించాడు.

నిస్సందేహంగా- ''ఐకమత్యమే మహాబలం అని మరువకండి''. పట్టుదలతో ఉన్నవారికి ఏది అసాధ్యము కాదు.

మునీంథ్రా! మేము అనుక్షణం నీటి కోరత వల్ల మాలో కొన్ని కోతులు మరణించడం వల్ల. మా రెండూ జాతుల మధ్య వైరం ఏర్పడినది. మా దాహార్తిని తీర్చే మార్గం చూపించి పుణ్యం కట్టుకొండి.

మీ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తాను.

మీ కోతుల దండు అంతా ఏకమైతే మీ దాహాం తీరిపోతుంది.

''వానరులారా! నేను పూజచేసిన ఈ ప్రదేశంలో ఒక మంచి నీటిని బావిని తవ్వండి!

అందులో జలసీరి ఎగసిపడుతుంది. మీ కష్టాలు సమసిపోతామని అభయమిచ్చాడు మునీంధ్రుడు.

అంతే.....జాతివైరం మరచి, కోతులు, కొండముచ్చులు ఏకమయ్యాయి. బావి తవ్వకాని కావలసిన పలుగుపార, తట్టబుట్ట తీసుకోని బావి తవ్వడం ప్రారంభించాయి. రెండూ రోజులు కష్టపడి ఒక పెద్దబావిని త్వాయి. అందులో నుండి పాతాళ గంగ ఎగసిపడి కోతుల శ్రమను, అలసటను మరచిపోయేలా చేసింది. కోతులు, కొండముచ్చులు ఒకదానికోకటి తమ అభినందనలు తెలుపుకొని సంబరపడ్డాయి.

ఆ వానరనాయకులు తమ అనుచరులతో మునీంధ్రునికి ప్రణమిల్లి. మీ పట్ల అపచారంగా ప్రవర్తించినందుకు క్షేమించమని ప్రార్థించాయి.

అసలే కోతులు మీ బుద్ధి నిలకడగా ఉండదు కానీ, మీ సంకల్పం మాత్రం బహు గోప్పది.

మీవల్ల నలుగురికి మంచి జరగాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుందని ఆశీర్వదించాడు.

వనదేవత! మునీంధ్రుని ముందు ప్రత్యక్షమై....! వత్సా! నీ ప్రయత్నము అద్భుతము. నాడు శ్రీరాముడు లంకకు వారధికట్టి రావణ సంహారం కావించి, సీతకు రావణనుని చెరనుండి విముక్తి కలిగించాడు. నేడు ఈ వానరసేనతో పాతళగంగను భూమిపై గలగలపారించి అపరభగీరధుడవై నిలిచావు. నీకు సకల శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి, వనదేవత అదృశ్యమైంది.

మునీంధ్రుడు రెండూ కనులు మూసుకొని తన ధ్యానంలో నిమగ్నమయ్యాడు.


......

మహా ప్రస్థానం.


మహా ప్రస్థానం.....పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా, వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది.....చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....మహాభారతం...మహా ప్రస్థాన పర్వము .
(మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.

కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!)

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--

ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--

భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట నుండునో విజయ మచటనుండునని పలుకుట అక్షరసత్యం! "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే!

సకల సంస్కృత వాంగ్మయమునకును తలమానికమై విరాజిల్లెడు ఈ మహాభారతము ఇంతయై, అంతయై పెరిగి పెరిగి లక్షశ్లోకాత్మకమైన ఒక మహాగ్రంథముగా ప్రపంచ విఖ్యాతి వడసినది. నిఖిల భారతీయ జ్ఞాన విజ్ఞాన సర్వస్వమైనది.

"ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్"

భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు.

భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును.

ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది.

ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు. కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివాడు.

అల్పజలాలు చేపను ఎట్లా చెరుస్తాయో కామం అట్లే అతడికి హానిని కలిగిస్తుంది. మరి అర్థధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్రజలాలు ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తాయి. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పరపోషకాలు. ఈ విధంగా త్రివర్గ విజ్ఞానం సాధించినవాడు సర్వశ్రేష్ఠుడు.

ప్రపంచమానవాళికి శ్రీకృష్ణుడు కౌరవసభలో రాయబార సందర్భంలో పలికిన వాక్కులు చూద్దాం.

"సారపు ధర్మమున్ విమలసత్యము బాపము చేత బొంకు చే
బారము బొంద లేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మని
స్తారకమయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్"

ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం, పాపం చేతను, అబద్ధం చేతను దరిచేరలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి కలిగియూ ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు - అని తిక్కనగారు చెప్పారు.

సంస్కృతమూలంలో వ్యాసమహర్షి ధర్మం అధర్మం చేతా, సత్యం అసత్యం చేతా నశిస్తున్నప్పుడు చూస్తూ ఊరకుంటే, సభాసదులకే చెడు మూడుతుంది. అటువంటివారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్లుగా ధర్మం వారిని ఉన్మూలించేస్తుంది. కాబట్టి ధర్మాన్ని సదా పరిశీలిస్తూ పరిరక్షిస్తూ దానినే ధ్యానిస్తూ కాలం గడిపేవారు, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్నీ మాత్రమే పలుకుతారు.

భీష్ముడు ధర్మజునకు శాంతిపర్వంలో ఈ విధంగా బోధించాడు.

వేదాలపై భక్తి, సృ్మతులపై గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ, ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం ధర్మానికి నాలుగవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి అసత్యం పలికి ధనాన్ని సంపాదించటం పాపాలన్నింటిలోనికి ఎక్కువ పాపం. అసత్యం పలుకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండటం, అన్ని ధర్మాలలోను మేలైన ధర్మాలు. శాస్త్రవిరుద్ధమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తిన విత్తనంవలె
నిష్ర్పయోజనం అవుతుంది. ఇది గ్రహించి ప్రవర్తిస్తే ఇహలోకపరలోకాలలో సుఖం లభిస్తుంది.

అన్ని ధర్మాలకు సారభూతమైన ధర్మనిజస్వరూపజ్ఞానాన్ని మహాభారతంలో వ్యాసుడు నిక్షేపించాడు.

"ఒరు లేయవి యొనర్చిన నరవర! యప్రియము తన మనంబున కగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథముల కెల్లన్"

రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా ఉన్నది.

ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, తమ దినపత్రికలో యావద్భారతావనిలోని మానవులకు సందేశంగా ఒక శతాబ్ది కాలం తమ పత్రికలో ప్రతిదినం ఈ పద్యాన్ని ప్రచురించి ఆంధ్రులకు మహోపకార సందేశాన్ని గుర్తు చేశారు. త్రికరణశుద్ధిగా ఆచరించి, తరించమన్నారు.
(Courtesy...Padyala Vaidyudu (Kavithraya Mahabharathamlo Dharmasookshmaalu)


కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు.

కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు. తరాలు మారాయి.. ఇల్లు చేతులు మారింది..
అమ్మ గారు కృష్ణమ్మా గారు జనించిన పుణ్య స్థలం. గోపాల స్వామీ గుడి పక్కన..నాకు పుణ్య స్థలమే..
పుష్కర స్నానం కంటే నాకు పవిత్రం.
ఏ త్తు అరుగులు..చిన్న ధాన్యం కొట్టు..వెనక పెద్ద పెరడు ఉండేవి.. రోడ్లు పెరిగి అరుగులు పోయాయి.. పక్క నున్న జాజలు వారు..నేతి వారు.. బొడ్డు వారు.. వేల్లలవారు.. అంతా ఎక్కడ ఉన్నారో కదా వాళ్ళు ఇల్లు ఉన్నాయి.. .గుడి రాముడుకి అన్ని తెలుసు ఆ వేణు గోపాల స్వామి సాక్షి..


Sunday, July 26, 2015

బామ్మా గారి పుష్కర యాత్ర ..

బామ్మా గారి పుష్కర యాత్ర ..

చూసుకున్నవాడు ముందు చేసుకున్నవాడు లొకువ.

చూసుకున్నవాడు ముందు చేసుకున్నవాడు లొకువ.

మన పుష్కర పురుషులు.
గౌతమీ మహా ఋషి,రాజ రాజ నరేంద్రుడు, గోదావరి తల్లి, మన కాటను దొర.


గోదావరి ..శ్రీ నాధుడు !

గోదావరి ..శ్రీ నాధుడు !
.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి విస్తృతమైనట్లు శ్రీనాధుని కాలానికి వచ్చేటప్పటికి గోదావరి విస్తృత రచనావస్తువయింది. “త్ర్యంలుకాచల శిఖరాగ్రంబునందుండి” సముద్ర పర్యంతమూ ప్రవహించిన గోదావరిని శ్రీనాథుడు రసవత్తర పద్యాలలో ప్రతిబింబింపజేస్తూ “గౌతమీగంగ లవణాబ్దిగౌగలించే“ అంటూ ఆద్యంతం మనోహరంగా వర్ణిస్తాడు.

“కాశింజచ్చిన యంత వయంగారాని కైవల్యమ

క్లేశంబై నమవేద్యనాయకుని చే లీలాగతింజేరు రా

రో శీఘ్రంబున మర్తుయలారా! యను నారూపంబు

నమ్మోయునా కాశాస్పాలన గౌతమీజలధికీల్లోల స్థానముల్“

అంటూ శ్రీనాధమహాకవి తనన్పుకంఠంతొ మనుష్యులందర్నీ పాత్రోచితంగా ఆహ్వానించాడు. ఇందులో గోదారి పిలుపు తనకంఠంలో ప్రతిధ్వనించాడు.

“గోదావరి గోదావరి

గోదావరియంచు పల్కు గుణవంతులమేన్

గోదావరి తల్లి న

పాదింతు గదమ్మ భవ్య శుభంబుల్“

అంటూ నదీ మహాత్మ్యాన్ని తెలుపుతూ గోదావరి నామోచ్చారణతో పొంగి పులకించి పోయినవాడు శ్రీనాధుడు. తన కవితా మాధుర్యంతో “సప్తగోదావరీ జలముతేనె” అని రూఢిపరిచాడు. వార్ధులేడింటికిన్ వలపువనిత” అని గోదావరి మరో కోణంలోనూ చూపాడు. ఆ నకతశ్రేష్టుడైన శృంగారకవి “నేటివ్ స్పిరిట్” తో ” సన్నాఫ్ ది సాయిల్“గా తన వివిధ గ్రంధాలలో శ్రీనాధుడు గౌతముని ఆబగా వర్ణించాడు.

Bombay..1950.

Bombay..1950.

ai dil hai mushakil jeena yahaan
zara hat ke, zara bach ke
ye hai bambai meri jaan
.
kahin "building", kahin traame, kahin "motor", kahin "mill"
milata hai yahaan sab kuchh, ik milata nahin dil
insaaf ka nahin, kahin naam-o-nishaan
.
kahin satta, kahin patta, kahin chori, kahin res,
kahin daaka, kahin phaanka, kahin thokar, kahin thes
bekaaro ke hain, kai kaam yahaan
.
beghar ko aavaara yahaan kehate hans hans
khud kaate gale sab ke, kahe is ko "business"
ik cheez ke hain kai naam yahaan

సినీమా(ట)ల తూటాలు !


సినీమా(ట)ల తూటాలు !

 

ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.  ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్.  “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్.  వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్.

“ఓ ఫైవ్ ఉంటే ఇస్తావా”?, (ఫైవ్ అంటే ఇక్కడ అయిదు వందలు, అయిదు రూపాయలు కాదు), అడిగాడు అప్పారావు ఈ లోపల (అతని అసలు పేరు ఏదైనా, అందరూ అలాగే పిలుస్తారు).   అతని బారి నుంచి తప్పించుకోడానికి టాపిక్ మారుస్తూ, అవునూ “తీ తా” (తీసేసిన తాసిల్దారు) సంగతి ఎంతవరకు వచ్చింది? అని ఆ మధ్య సస్పెండ్ అయిన కొలీగ్ గురించి అడిగాడు రమేష్.  “అమ్యామ్యా” కేసులు అంత తొందరగా తేలుతాయా?  గడ్డి తినే ముందే బుద్ధి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని జవాబు.

“హింస రాజు” (బాస్) అర్జెంటు గా నిన్ను టూర్ వెళ్ళమన్నాడుట?, నువ్వు నీ గోవా ట్రిప్ మానుకుని వెళుతున్న్నావుట?, నిజమేనా?  ఇంకో కొలీగ్ ప్రశ్న.  “అతిగా హింసించే బాస్, ఇతరుల విషయాలలో అతిగా తల దూర్చే కొలీగ్ బాగు పడినట్టు చరిత్రలో లేదు”, కోపంగా సమాధానం.

రోజూ బుద్ధిగా డబ్బా తెచ్చుకునే మహేష్, ఆ రోజు ఉప్మా తెస్తే – “ఫామిలీ, ఫామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తోంది” అని కోరస్.  రోజూ తినలేక చస్తున్నా, ఈ బాక్స్ తీసుకుని ఆ చపాతీలు ఇటు ఇవ్వండి అంటూ తన జవాబు.

 

“ముందు నువ్వు ప్రేమించావా, లేక తను నిన్ను ప్రేమించిందా”, అడిగారు జస్ట్ మారీడ్ నరేష్ ని.  ముందు తను ప్రేమించింది, తరువాత నేను “ప్రేమించాల్సి వచ్చింది”, నవ్వు ఆపుకుంటూ గంభీరంగా చెప్పాడు నరేష్.  ఘోల్లున నవ్వులు అక్కడ.

ఆదివారం దినపత్రిక లో వచ్చిన “అల్ కూర చంచం” వెరైటీ డిష్ చేసి తెచ్చాను, అందరూ తినండి అంటూ వచ్చింది సుజాత.  అందరూ బిక్క మొహం వేసినట్టు నటించి, “ఇంట్లో చెప్పి రాలేదు” అని ఒకరు, “ఇన్సూరెన్స్ తీసుకోలేదు” అని ఒకరు, ఉండండి “నా బ్యాంకు బాలన్స్ వివరాలు అన్నీ మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పి” తింటాను అని ఒకరు అంటూ, మొత్తానికి ఆ డిష్ మొత్తం లాగించేశారు.

““బెస్ట్ ఎంప్లాయి” అవార్డు గెలుచుకున్న కవిత గారికి వేయండి ఒక “వీరతాడు”,  అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.  పార్టీ ఇవ్వాలి అంటే తప్పకుండా అన్న కవితతో, ఒట్టు? అడిగింది సుజాత.  నేను “ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పను” అని తెలుసుగా సుజాత? గంభీరంగా ఆవిడ  జవాబు.  మళ్ళీ నవ్వులు.

పార్టీ అనగానే “ఇంగ్లీష్లో మాట్టాడుకుని” చాలా రోజులయ్యింది అంటూ ఇద్దరు ముగ్గురు ఈ లోపల వేరే ప్రణాళికలు వేసుకోవడం మొదలెట్టారు.

ఒక్క అరగంట లోనే ఇన్ని కబుర్లు, వాటిలో పేలిన జోక్స్.

ఈ కబుర్లు  అలా సాగడానికి, ఆ జోక్స్ అలా పేలడానికి కారణం ఏంటో మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. అవును, అందుకు కారణం ఈ కబుర్లలో తెలుగు సినిమా డయాలాగ్స్, అదేనండి డవిలాగులు, వాడడం వల్ల.

మన తెలుగువారికి వినోదానికి ప్రధాన మాధ్యమం సినిమాలే కదా?  ఆ సినిమాలలో కొన్ని సంభాషణలు, చతురతతో కూడిన పదాలు/వాక్యాలు చాలా పాపులర్ అవుతాయి.  ఎంతగా అంటే, అవి నలుగురి నోళ్ళలోనూ నానుతాయి.  ఉదా. “సుత్తి” అనేది ఒక డయాలాగ్ గా వచ్చి, ఎంతో ప్రాచుర్యం పొంది, ఆ తరువాత అందరు వాడే సర్వసాధారణ పదం అయిపొయింది.  పైగా, పలు విధాలుగా రూపాంతరం చెందింది కూడానూ.  సుత్తి కొట్టకు అని మామూలు అర్ధమే కాకుండా, అందరు కలిసి వచ్చేయండి సుత్తేసుకుందాం అని, చెప్పేదేదో సూటిగా చెప్పు సుత్తి లేకుండా – ఇలా ఇంప్రూవ్ కూడా చేసారు.   ఇలాంటి పదాలు, వాక్యాలు ఎన్నో మనకి తెలిసి, ఒక్కోసారి తెలియకుండానే, మన దైనిందిన సంభాషణలలో భాగం అయిపోయి.

 

వాడికి తోచిందే తప్ప ఎవ్వరి చెప్పినా మాటా వినని వాడి గురించి చెప్పాలంటే సింపుల్ గా ”వాడో సీతయ్య రా బాబు” అంటాం.  అదే మన గురించి చెప్పుకోవాలంటే గొప్పగా “ఒక్క సారి కమిట్ అయితే నా మాటే నేనే వినను” అని బిల్డ్ అప్ ఇస్తాం.

 

ఏంటి ఈ మధ్య బాగా మారిపోయావు, అస్సలు ఆరు అవగానే ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే “కొత్తగా ఉందని ట్రై చేస్తున్నా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది” అని ఓ జోకు వేస్తాం.   మీటింగ్ కి ఒక్కడివే వెళ్ళవా? అని అడిగితే, పెద్ద లెవెల్ లో “సింహం సింగిల్ గానే వెళుతుంది” అంటూ సమాధానం రెడీ.

 

“నీ ఆఫీస్ కి వస్తా, నీ కాబిన్ కి వస్తా”, కాఫీ తెప్పించి రెడీ గా పెట్టు అంటూ మిత్రుడిని కలవడానికి వెళ్తూ ఫోన్ చేసి చెప్తాం.

సరే, ఈ మధ్య అయితే “నాకు కొంచెం తిక్కుంది” – దానికో లెక్కుంది అని , అసలు లెక్కే లేదు అని, దాంట్లో కిక్కుంది అని – ఇలా పరి పరి విధాలుగా వాడుతున్నారు.  ఈ “పరి పరి విధాలు” కూడా ఒక సినిమాలో వాడిన పదమే.  భూలోకం కి వచ్చాకా యముడికి ఆకలి అనిపించి, అదేంటో తెలీక “నాకు ఉదరము నందు ఒక విధముగానున్నది, ఏమిటో తెలియకున్నది” అంటాడు.  అందుకు చిత్రగుప్తుడు “నాకు పరి పరి విధములుగా నున్నది ప్రభూ, దీనినే ఆకలి అందురు” అంటాడు.   తరువాత వాళ్ళు హిమక్రీములు తింటారు.  అప్పటి నుంచి మనమూ, వనిల్లా, బటర్ స్కాచ్, చొకలెట్ – యే ఫ్లేవర్ తెచ్చుకున్నా వాటిని హిమక్రీములు అనుకుంటూ తింటున్నాము కదా. ఉత్తినే ఇస్క్రీం అనేకంటే ఈ పదం వాడితే, అదొక ఆనందం.

 

“చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందొ” అంటూ లెవెల్ వేయడం, “ఏది, ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో” అంటూ సెటయిర్ వేయడం, “మీతో సెటయిర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను” అంటూ మరొక డవిలాగ్ చెప్పడం మనకి పరిపాటి.

 

“నువ్వు చేసే పని ఎంత సైలెంట్ గా ఉంటె రిసల్ట్ అంత పెర్ఫెక్ట్ గా ఉంటుంది” అంటూ సలహా ఒకటి పారేస్తాం.  చెప్పిన పని ఎప్పుడు చేస్తావ్? అంటే, “అదే నా తక్షణ కర్తవ్యం” అని టకీమని జవాబు.  అది చేస్తామో లేదో తరువాతి సంగతి అనుకోండి.

 

ఎప్పుడూ ఫైల్స్, మీటింగులేనా, “మడిసన్నాకా కూసింత కళాపోసన ఉండాలి” అనేది ఈ రోజుకీ చాలా పాపులర్ కదా.   ఇంకొక పాపులర్ దవిలాగ్ “నా మానాన  నేను” – మాడి పోయిన మషాళా దోశ తింటుంటే అనేది ఒరిజినల్ వెర్షన్ అయితే – వేరే ఇంకెన్నో సందర్భాలలో వాడుతాం.  నా మానాన నేను – పని చేసుకుంటుంటే,  చదువుకుంటుంటే, రాసుకుంటుంటే  - వచ్చి డిస్టర్బ్ చేసాడు అంటూ.

అలాగే, ఫ్రెండ్స్ ని కలవడానికి ఆలస్యం గా వెళ్తే, వెళ్ళగానే “లేట్ గా వచ్చినా లేటెష్ట్ గా వచ్చా” అని డయాలాగ్ విసురుతాం.  పైగా “ఏం జరుగుతోంది ఇక్కడ, నాకు తెలియాలి, తెలిసి తీరాలి” అంటూ ఆవేశ పడిపోతాం.  ఆడే పేకాటలో ఎలాగో ఒకసారి షో అయితే “ఎప్పుడోచ్చామని కాదు అన్నయ్య, ముక్క పడిందా లేదా” అంటూ తెగ హడావుడి.

 

మనం చెప్పేది అవతలి వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే “అర్ధం చేసుకోరూ” అంటూ సున్నితంగా మందలిస్తాం.

 

ఇందాక చెప్పిన అప్పారావు, ఇవ్వాల్సిన దాంట్లో సగం బాకీ తీర్చేసాడు రా, అంటే, నమ్మం సరి కదా – వీడికి “సెకండ్ స్టేజి హాలూసినేషన్” వచ్చింది అని జాలి నటిస్తాం.

 

బండి సర్వీసింగ్ కి ఇచ్చి సాయంత్రం వెళ్ళి తీసుకోవాలి అన్నప్పుడు ఫ్రెండ్ ని లిఫ్ట్ అడిగితే, తను స్టైల్ గా కూర్చొని, ఒక చేత్తో ఇంకో అర చేతిలో కొట్టుకుంటూ “నా కేంటి?” అని అడిగినప్పుడు, సర్లే నీకో స్పెషల్ సింగిల్ చాయి తాగిస్తాలే –– తొందరగా పద వాడు వర్క్ షాప్ క్లోస్ చేస్తాడు అంటాం.

 

“తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా?” అని కాదమ్మా, ఏదైనా పని చెయ్యి, అని దొరికినవాడికి లెక్చర్ పీకుతాం.  ”దేశం చాలా క్లిష్ట పరీస్తితులలో ఉంది” అంటూ తెగ బాధ పడిపోవడం ఎప్పటినుంచో ఉన్నదే కదా.

 

“గట్ల డిసైడ్ చేసినావా అన్నా …. వాకే”, అని ఆ పనిలో పడిపోతాం.   “గోడ మీద బల్లుందా, ఇంట్లో పిల్లుందా” అని బుర్ర తినేస్తాడు రా బాబూ అంటూ కొందరిని తప్పించుకు తిరుగుతాం.  “నా దారి రహదారి” అని ఒకసారి, “నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు” అంటూ ఒకసారి, ఇలా సమయానుసారంగా సమాధానం చెప్తూ ఉంటాం.

 

“కష్టపడి కాదు ఇష్టపడి పని చేయి” అని, “ట్రెండ్ ఫాలో అవ్వకు సెట్ చేయి”, “తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత” అని పెర్సనాలిటి డేవలెప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం ఈ మధ్య వీటి సాయంతో.   ఫ్రెండ్ ఓ పని చేయాల్సి ఉండి, తటపటాయిస్తుంటే, “సాహసము సేయరా సోదరా” అని ప్రోత్సహిస్తాం.

 

ఇహ మనం ఈదుతున్న “భవసాగరాలు”, రొజూ ఇరుకుంటున్న ట్రాఫిక్ జామ్లు, ఎక్కడి కెళ్ళినా ఎదురయ్యే చాంతాడు క్యూలు – అయినా సరే అక్కడికి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, తప్పదు అన్నప్పుడు  – మనం చెప్పుకునే పాజిటివ్ మంత్రం – “లైట్ తీసుకో”, పని చూసుకో.

 

ఇలా, ఎన్నో ఎన్నెన్నో, పదాలు, వాక్యాలు అలవోకగా వాడుతూ, ఆ విధంగా ముందుకెళుతూ ఉంటాం.  అవునూ, ఇదంతా చదివితే మీకూ ఇంకెన్నో డవిలాగులు గుర్తొచ్చాయి కదూ?  అవేమిటో వెంటనే చెప్పేయండి.  అయితే, అవి కేవలం డవిలాగులు లా కాకుండా, మీరు మీ ఫ్రెండ్స్ తోనో, కొలీగ్స్ తోనో ఏదో సందర్భం లో చెప్పినట్టు ఉండాలి.  ఎందుకంటారా? – అలా ఉంటే “ప్చ్, అదో తుత్తి” మరి.

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? (బేతాళ కధ.)

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి?
(బేతాళ కధ.)
.
కొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి. ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు కార్తికేయుణ్ణి భగవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. పైకి అది అర్ధింపులా కనబడినా, అందులో ఉన్నది ఆజ్ఞే!
అయితే ఇతడు కౄరుడు. అందుచేత కార్తికేయుడికి, తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అది పైకి చెబితే..... ఇతడు వియ్యం వదిలి కయ్యానికి కాలు దువ్వగలడు. ఎలా ఈ విపత్తు దాటటం? రాజుకేమీ పాలుపోలేదు. దిగులుగా కార్తికేయుడు, భగవతి మందిరానికి వచ్చాడు. అతడికి కుమార్తె ప్రక్కనే సుకేశిని (మారు వేషంలో ఉన్న ధనస్వామి) కనబడింది. ఒక్కసారిగా రాజు బుర్రలో ఉపాయం మెరిసింది. తన కూతురికి బదులుగా, సుకేశిని నిచ్చి, పొరుగు దేశపు యువరాజుకిచ్చి వివాహం జరిపించాడు. తన కూతురు అందమైనదని తెలుసు గానీ ఎలా ఉంటుందో తెలియదు గనుక అందులో ఏ ప్రమాదమూ లేదనుకున్నాడు రాజు. అదీగాక, సుకేశిని తండ్రి అయినా, ఇందుకు కోపగించుకోడనుకున్నాడు. పెళ్ళి అయ్యాక..... చీరె సారెలిచ్చి వీడ్కొలిచ్చేసాడు
. సుకేశిని రూపంలో ఉన్న ధనస్వామికీ, భగవతికీ ముంచుకొచ్చిన ఈ సంఘటనతో, ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంతలోనే సుకేశిని(ధనస్వామి) భర్తతో అత్తవారింటికి పోవలసి వచ్చింది. దాంతో దారిలో, పెళ్ళి బృందంలో నుండి తప్పించుకున్నాడు. ఆడవేషం తీసేసి పరుగందుకున్నాడు. ఎలాగోలాగ, ఎవరూ చూడకుండానే గండం గడిచి బయట పడ్డాడు. అటుప్రక్క, ఏమయ్యిందో ఏమోననే గుండె గుబిల్లుతో ఉంది భగవతి.
ఇంతలో లోకదేవుడు, తమ పూర్వపు ప్రణాళిక ప్రకారం, రాజు కార్తికేయుణ్ణి కలుసుకున్నాడు. వెంట చూడచక్కని ఓ యువకుణ్ణి తీసుకు పోయాడు. రాజుతో “రాజోత్తమా! ఆ కాశీ విశ్వేశ్వరుడి కరుణతో, నీ సహకారంతో, సుఖంగా కాశీయాత్ర ముగించుకు వచ్చాను. ఇదిగో ఈతడు నా మిత్రుడి శిష్యుడు. నా కుమార్తె సుకేశిని ని ఇతడికిచ్చి వివాహం చేయ తలచి వచ్చాను. ఇన్నాళ్ళూ నా బిడ్డను సంరక్షించినందుకు ఎంతగానో కృతజ్ఞణ్ణి. దయతో నా కుమార్తెను నాతో పంపగలరు” అన్నాడు. ఆ విధంగా ధనస్వామిని రాజమందిరం నుండి గుట్టుగా బయటకు తీసుకు వెళ్ళాలన్నది, వాళ్ళు పూర్వం రచించుకున్న ప్రణాళిక. రాజిది ఊహించలేదు. ముందు పొరుగు రాజుతో యుద్దం తప్పించుకోవటమే ధ్యాసగా సుకేశిని తో వివాహం జరిపించేసాడు. మెల్లిగా సమస్య పరిష్కరించు కోవచ్చనుకున్నాడు. ఇప్పుడీ మునితో అసత్యమాడ సాహసించలేక పోయాడు.
ముని శపించగలడని రాజు భయం. దానితో ముని పాదాల మీద పడి “స్వామీ! దయ చేసి నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా, మీ కుమార్తె వివాహం పొరుగు దేశపు యువరాజుతో జరిపించేసాను. అతడితో నా కుమార్తె వివాహం తప్పించేందుకు మీ కుమార్తె నిచ్చి పెళ్ళి చేసాను. క్షమించండి” అని ప్రాధేయపడ్డాడు. ఇది ఏమాత్రం ఊహించని లోకదేవుడు, నివ్వెరపడి, నోటమాట రాక నిలబడి పోయాడు. మునికి కోపం వచ్చిందను కొని, రాజు వణికి పోయాడు. మరుక్షణం “మీ కుమార్తెకు బదులుగా, ఇదిగీ నా కుమార్తెను ధారబోస్తాను. భగవతికి ఈ యువకుడితో పెళ్ళి జరిపిస్తాను. నన్ను మన్నించండి” అంటూ... మారుమాటకు తావివ్వకుండా, లోకదేవుడు వెంట దెచ్చిన యువకుడికి భగవతినిచ్చి వివాహం జరిపించాడు. దాంతో ఇక ఏ విషయమూ మాట్లాడేందుకు లోకదేవుడు అమితంగా భయపడి పోయాడు. ఏమాత్రం ఊహించని సంఘటనలు, వరుసగా, వేగంగా జరిగి పోతున్నాయయ్యె! రాజు కన్నీటితో తన కుమార్తెకు వీడ్కొలిచ్చి ‘విధి వ్రాతకు తల వొగ్గక ఎవరికైనా తప్పదు గదా!’ అని సరిపెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకున్నాడు
కిమ్మనకుండా లోకదేవుడు, తన మిత్రుడి శిష్యుడిగా చెప్పుకున్న యువకుణ్ణీ, భగవతినీ వెంట బెట్టుకుని, తన ఇంటికి బయలు దేరాడు. దారిలో ధనస్వామి వచ్చి వాళ్ళని కలిసాడు. ధనస్వామి ఆ యువకుడితో “భగవతీ నేనూ.... పరస్పరం ప్రేమించుకున్నాం. ఆమె నన్ను వరించింది. నేనామెని వరించాను. ఆమె నా భార్య. కాబట్టి ఆమెను నాకు అప్పగించు” అన్నాడు. దానికా యువకుడు “ఈమె తండ్రి ఈమెను నాకిచ్చి పెళ్ళి చేసాడు. వేదమంత్రాల సాక్షిగా, రాజమందిరంలో, ఈమె తండ్రి ఈమెను నాకు ధారపోసాడు. కాబట్టి ఈమె నా భార్య. నేను విడిచి పెట్టను” అన్నాడు. భేతాళుడింత వరకూ కథ చెప్పి “విక్రమార్క ధరణీ పాలా! యువరాణి భగవతి ఎవరికి చెందుతుందో చెప్పు” అన్నాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ అమవాస్య నిశిలో, నిండు చంద్రుడిలా అతడి మోము వెలిగి పోయింది. మంద్ర గంభీర స్వరంతో “నా అభిప్రాయంలో వివాహం అంటే.... ‘ఇదిగో ఇక నుండీ ఈ యువతీ ఈ యువకుడూ ఒకరికొకరు చెందుతారు’ అని ప్రకటన! వారిద్దరూ కలిసి జీవయాత్ర సాగిస్తారనే ప్రకటన! అటువంటి వివాహం, అందరి చేతా అంగీకరింపబడుతుంది, అధికృతమైనది. ఆ విధంగా, రాజు కార్తికేయుడు, తన కుమార్తె భగవతిని, ఆ యువకుడి కిచ్చి పెళ్ళి చేసాడు. పదుగురి ఎదుటా ‘వారి జీవితాలు కలిసి సాగనున్నాయని’ ఆ విధంగా ప్రకటించాడు. భగవతీ, ధనస్వామీ ఒకరినొకరు ప్రేమించి ఉండవచ్చు. ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆనందించి ఉండొచ్చు. అయితే వారి అనుబంధం ప్రకటితమైనది కాదు. అది రహస్యమై కొనసాగింది. అది పాపంతో కలగలిసి పోయింది. కనీసం తన వివాహ సందర్భంలోనైనా, భగవతి తమ అనుబంధాన్ని ప్రకటించి ఉన్నా, ధనస్వామి సుకేశినిగా తన వివాహం పొరుగు దేశపు యువరాజుతో నిర్వహింపబడుతున్నప్పుడు ప్రకటించి ఉన్నా, అది కొంత సరియైన బాట తొక్కి ఉండేది. కాబట్టి ఇప్పుడు భగవతీ ధనస్వాముల అనుబంధం అక్రమమైనది గానే తలంచాలి. కనుక, తండ్రి పెళ్ళి చేసి యిచ్చిన యువకుడికే ఆమె దక్కాలి. అదే న్యాయం!” అన్నాడు.
విక్రమార్క మహారాజు ఈ విధంగా సమాధానం చెప్పగానే భేతాళుడు మోదంతో తల ఊపి చెట్టెక్కేసాడు.

Saturday, July 25, 2015

ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే..

ఆంధ్రమహా భారతం పుట్టింది ఇక్కడే..
.
ఆంధ్రజ్యోతి....(29-Jun-2015)

తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి.. అందరికీ తెలిసిన నానుడి.. ఈ రెండింటికి లింకేమిటో తెలియదుగానీ, గోదావరికి, భారతానికి కచ్చితమైన బంధం ఉంది. ఆదికవి నన్నయ్య మహా భారతాన్ని తెనుగీకరించింది ఇక్కడే. అంతే కాదు, భారతానికి సృష్టికర్తలైన పాండవులు నడయాడిన జాడలూ ఇక్కడున్నాయి. అటు రామాయణం
ఇటు భారతం. గోదావరి స్మృతి పథాలు!

వేంగీ రాజ్యాన్ని పెదవేగి కేంద్రంగా విమలాదిత్యుడు పాలన సాగించేవాడు. 1019లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు 1021లో పట్టాభిషక్తుడయ్యాడు. తమ కులదైవం ఆది వరాహస్వామి ఆశీస్సులతో, ప్రధానమంత్రి వజ్జియ సోమయాజి దీక్షాదక్షతలతో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నదీవాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సుసంపన్నం చేశాడు. చంద్రాదిత్య దండనాథుడి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పరిరక్షించాడు.

ఆంధ్ర మహాభారతం. ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది పవిత్ర గోదావరి తీరం.. రాజమహేంద్రవరం.. దాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు..అతడి ఆస్థానకవి నన్నయ భట్టారకుడు. ఆదికవి నన్నయ్య అవతరించిన చోటే ఆంధ్ర మహాభారత రచనకు బీజం పడింది. వ్యాస విరచితమైన 18 పర్వాల మహాభారత గ్రంథాన్ని తేట తెలుగులో అనువదించే మహద్భాగ్యాన్ని నన్నయ్యకు కలిగించింది రాజరాజ నరేంద్రుడే. క్రీ.శ. 1021-1061 మధ్య నాలుగు దశాబ్దాలపాటు రాజరాజ నరేంద్రుని పాలన ఎంత జనరంజకంగా సాగిందో.. ఆయన కాలంలో ఆంధ్ర మహాభారత రచన అంత ప్రాశస్య్తాంగానూ సాగింది.

రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం..
రాజమండ్రి లీగల్‌: మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ పేరిట రాజమండ్రి నగరంలో విశ్వవిద్యాలయమే వెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలన్న సంకల్పంతో 2006లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. వీసీ, రిజిసా్ట్రరు, కొందరు సిబ్బందితో ప్రభుత్వ అటానమస్‌ కళాశాల ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజానగరం మండలం వెలుగుబందలో సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో సొంత భవనాల్లోకి మారింది. 2014 నుంచితరగతులు నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని డిగ్రీ కళాశాలలను ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు.

నన్నయ్యభట్టారకుని సంక్షిప్త చరిత్ర
భారత ఆంధ్రానువాదంలో నారాయణభట్టు సహకారం
పాలనాదక్షుడిగా ఎంతో పేరు పొందిన రాజరాజ నరేంద్రునిలో సాహితీ ప్రకర్ష కూడా ఎక్కువే. కవి, పండితులతో గోష్ఠులు జరుపుతూ, వారిని సన్మానిస్తూ ఉండేవాడు. అతడి ఆస్థాన కవి నన్నయ భట్టు. సంస్కృతాంధ్ర పండితుడు. ఉభయ కవి మిత్ర బిరుదాంకితుడు. మంత్రి వజ్జియ కుమారుడికి సహాధ్యాయి. నిత్యం ఇంటి వద్ద భారత, భాగవత కథలను అందరికీ వినిపించేవాడు.వ్యాసుడు రచించిన మహా భారతాన్ని ఆంధ్రీకరించాలన్న సంకల్పం రాజరాజుకు కలిగింది. ఇందుకు సమర్ధుడు నన్నయేనని ఈ బృహత్తర బాధ్యతను ఆయన భుజస్కంధాల మీద ఉంచాడు. అతడి మరో సహాధ్యాయి నన్ని నారాయణభట్టు. తూర్పు చాళుక్య రాజు మొదటి ఆహవమల్ల సోమేశ్వరుడి మంత్రే ఈ నారాయణభట్టు. సంస్కృత, ఆంధ్ర, కన్నడభాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. అటువంటి నారాయణభట్టు ప్రోత్సాహంతో ఓ శుభ ముహూర్తంలో భారత రచన ప్రారంభించాడు నన్నయ. ఆది, సభ పర్వాలతోపాటు అరణ్య పర్వంలో సగం మాత్రమే పూర్తి చేయగలిగాడు. శత్రురాజుల కుట్రలను తిప్పికొట్టడంలో కుమార రాజేంద్రదేవుడికి అన్ని విధాలా సహకరించిన నారాయణభట్టుకు రాజరాజ నరేంద్రుడు మూడేరుల నందమపూడి అగ్రహారాన్ని ఈనాంగా రాసిచ్చి అగ్రహారీకుడిని చేశాడు. మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో తనను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతగా నన్నయ తన కుమారుడికి నారాయణభట్టు కుమార్తెతో వివాహం చేసి వియ్యమందాడని కూడా ఒక కథనం. మహామంత్రులు, దండనాథులు, కవిత్వంలోనే కాక మంత్రాంగంలోనూ నిష్ణాతులైన నారాయణభట్టు వంటి వారి సమర్థత, సహకారాలతో రాజరాజ నరేంద్రుడు నాలుగు దశాబ్దాలపాటు అంటే 1061 వరకూ రాజ్యపాలన సాగించాడు. ఈయన కాలంలో ఆది వరాహమూర్తి ముద్రతో ‘వరహా’ అనే నాణం చలామణిలో ఉండేది. వరహా అంటే ఇప్పటి లెక్కల్లో నాలుగు రూపాయలని అర్థం. ఆది వరాహమూర్తినే తన ధ్వజంలో ఆవిష్కరింజేసుకున్న దైవభక్తిపరుడు రాజరాజ నరేంద్రుడు. ఆయన మరణానంతరం ఆంధ్ర మహాభారత రచన ఆగిపోయిందని చెబుతారు. కానీ అరణ్యపర్వం తెనిగిస్తుండగా నన్నయ్య మరణించాడని, దాంతో రచన ఆగిపోయిందన్నది కూడా ఒక కథనం. గంభీర మధురమైన నన్నయ్య రచన తెలుగు సాహిత్యంలో నిరుపమానమైనది.


.......చిరునవ్వుల చిన్నారులు.........

.......చిరునవ్వుల చిన్నారులు.........

చందమామ కధ.!


చందమామ కధ.!

ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి. ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలుగాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి.
ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు. చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చుకుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి.
అలా కాలం గడిచిపోతున్నది; రెండు చిలుకలకూ వయస్సు మీద పడుతున్నది. వాటి స్నేహం మరింత బలపడి కొనసాగింది. వాటిలో ఒక చిలుకకు తానూ చదువుకోవాలనే కోరిక మరింత బలంగా కలిగింది. కాలం గడచిపోయింది; రెండు చిలుకలూ చనిపోయాయి.

మరణానంతరం వాటి మంచి హృదయాలకు అనుగుణంగా వాటికి స్వర్గ ప్రాప్తి కలిగింది. అలా స్వర్గంలోకూడా వాటి మైత్రి కొనసాగింది. ఆ చిలుకల మైత్రికి సంతోషపడిన భగవంతుడు కొంతకాలం తరువాత వాటిని పిలిచి, "చిలుకల్లారా, మీ స్నేహం కారణంగా మీరు నాకెంతో ప్రియమైనవారైనారు. మీరు స్వర్గలోకాన్ని విడచి వెళ్తున్న సందర్భంగా కోరిన జన్మనొందేలా మీకు వరం ఇవ్వదలచాను. ఏజన్మ కావాలో కోరుకోండి" అన్నాడు.

ఒక చిలుక "మహానుభావా! నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు ఇదివరకటిలాగానే చిలుక జన్మను ప్రసాదించు. అదే అరణ్యంలో నేను మళ్ళీ జన్మించేలా వరమివ్వు" అని అడిగింది. రెండవ చిలుక తనకు మనుష్యజన్మ ప్రసాదించమని వేడుకున్నది. భగవంతుడు "తథాస్తు" అని దీవించాడు. మరుక్షణం ఒకటి చిలుకలాగాను, ఒకటి మనిషిలాగాను భూమిమీద జన్మించాయి.
మొదటి చిలుక అరణ్యంలో జన్మించే సరికి అరణ్యం తగలబడుతున్నది. అక్కడ ఉండవలసిన ముని కుటీరాలు ఏనాడో శిధిలమైనాయి. అరణ్యంలోని చెట్లన్నీ ఏనాడో మనిషివాతనబడి గతించాయి. ఆ అరణ్యంలోంచి బయటపడి ఎంతో శ్రమతో తప్పించుకున్నాయి కొన్ని చిలుకలు. అలా ప్రాణాలతో మిగిలిన చిలుకలకు ఇక ఆహారం కరువైంది. తినేందుకు మధుర ఫలాలు లేవు; గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు కానరావటం లేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. ’సుసంపన్నమై, తనను ఊరించి ’రా, రమ్మ’ని పిలిచిన గత జీవితం ఎక్కడున్నది? ’గతం గత:’ గతించిన కాలం మళ్ళీ రాదు. సర్వ సంపదలతో తులతూగే అలాంటి జీవితాన్ని తిరిగి సృజించుకోగలిగే సామర్ధ్యం ఈ చిలుక జన్మకు లేదు. ఇలాంటి జన్మనా, తను కోరుకున్నది?’ అని వగస్తూ చిలుక తన జీవితాన్ని అతి భారంగా నెట్టుకొచ్చింది.

రెండవ చిలుక మానవజన్మనెత్తింది కదా, దాని తల్లిదండ్రులు పల్లెలో జీవితాలు గడపలేక, పట్టణానికి వలస పోయారు. అక్కడ అది అనేకమంది పిల్లలలాగే మురికిగుంటల్లో, రోడ్ల మాటున, అర్ధాకలితో పెరగవలసి వచ్చింది. తనను ఊరించిన అద్భుత విద్యావిధానం కొందరికి మాత్రమే అందుతుందని దానికి ఆలస్యంగానైనా, అర్ధమైంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన చింతనా శక్తితో అది ’ఎందుకిలా?’ అని ప్రశ్నించుకున్నది. ’భగవంతుని సృష్టిలో అందరూ ఒకటికాదూ? మానవులు సృష్టించుకున్న ఈ తారతమ్యాల్ని మనిషిగా తను రూపుమాపలేకపోతే తన జన్మ ఎందుకు?’ ఆ చిలుక స్వశక్తితో ఇక గొప్ప నాయకునిగా ఎదిగింది. మానవలోకంలో సత్యానికి, ప్రేమకు ఇంకా స్థానం ఉన్నదని, వాటిని మిగుల్చుకోకపోతే మనందరి జీవితాలూ శిలా సదృశాలే అవుతాయని ప్రవచించింది. దాని మాటలు మెల్లమెల్లగా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 'అసమానతలు అమానుషాలు' అన్న భావన పెరిగింది. మానవసమాజం మెల్లగా వెలుగువైపు పయనించింది. తన జీవితం సార్ధకమైందన్న సంతృప్తి దానికి కలిగింది.

గోరింటా పూచింది కొమ్మా లేకుండా!

గోరింటా పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఎంచక్కా పండీన ఎర్రన్ని చుక్క
చిట్టీ చేమంతానికి శ్రీ రామ రక్ష
కన్నె పేరంటానికి కలకాలం రక్ష""
ఆకులు కూడా పూస్తాయన్న భావంలో ఎన్ని రంగులు చూపించారు శ్రీ కృష్ణ శాస్త్రి గారు.

గోదారి గట్టుంది…గోదారి గట్టుంది…

  పండు ముసలిగా ఉన్న గౌరి (జమున)నిక్లోజప్ లో చూపిస్తూ, కథని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళతారు మూగమనసులు చిత్రంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు. సరిగా అప్పుడే ఓ అద్భుతమైన పాట మొదలవుతుంది. అదే `గోదారి గట్టుంది…’

   ఇదొక అరుదైన ప్రేమకథా చిత్రం. ఇందులో పూర్వజన్మల అనుబంధం ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం జరిగింది. చావుపుట్టక అనేది శరీరానికే గానీ ఆత్మకు కావన్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని అల్లిన కథకు దృశ్యరూపమే మూగమనసులు.

   గోదావరిమీద ఓ పడవపై ఓ పడుచుపిల్ల హుషారుగా పాడుతుంటుంది.  బ్లాక్ అండ్ వైట్ లో కూడా గోదావరి అందాలను కెమేరాలో చక్కగా బంధించారు పి.ఎల్ రాయ్. లాంగ్ షాట్ లో   రాగాలాపన పూర్తికాగానే జమున పాదాలపై కెమెరా ఫోకస్ చేస్తూ  పాటచిత్రీకరణ కొనసాగిస్తారు. ఘళ్లు ఘళ్లున మ్రోగే పాతతరం గజ్జలను వేసుకున్న గౌరి తన పాదాలను చెట్టుమానుకు మోటిస్తూ, వాటిని సుతారంగా ఆడిస్తూ ఉండగా షాట్ ఓకే అనేశారు దర్శకుడు.

  ఇక అక్కడి నుంచి జమున ఈ పాటలో ఎంతో చలాకీగా నటించింది.  అమాయకత్వం ఒకవైపు, చలాకీ తనం మరోవైపు, తన వ్యక్తిత్వం తెలిపే గడుసుతనం మరోవైపు….వెరసి గోదావరి పరవళ్లులా సాగుతుంది జమున నటన.  దాశరధి రచనకు కెవీ మహాదేవన్ గారు చిరకాలం గుర్తుండిపోయే ట్యూన్ కట్టారు. సుశీల చాలా చలాకీగా పాడి పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా చూశారు.

పాట ఇది…

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది

ఓ ఓ ఓ ఓ హోయ్

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది

ఓ ఓ ఓ ఓ హోయ్

వగరు వగరుగ పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది

వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది

తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది

తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది ఈ ఈ

గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది

ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది

ఏది ఎవ్వరికి ఇవ్వాలో ,ఇడమరిసే ఆ ఇది వుంది

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది

పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది

అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది

అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ

గోదారి గట్టుంది ,గట్టుమీద  సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది 

   గోదావరి గురించి చెప్పుకున్నప్పుడల్లా చటక్కున మదిలో మెదిలే పాట ఇది. ఈ సినిమాకూ గోదావరికీ ఎనలేని అనుబంధంఉంది. చిత్ర నిర్మాణంలో ఎక్కువ భాగం గోదావరి నది ఒడ్డునే చిత్రీకరణ చేశారు.  జమున గురించి మనమిక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ సంఘటన చెప్పుకోవాలి. ముక్కుమీద కోపం , నీ ముఖానికే అందం – అన్న పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు జమున కాలికి గాయం అయింది. దర్శకులు విశ్రాంతి తీసుకోమన్నా , వద్దని కాలి కట్టుతోనే బాధను లెక్కచేయకుండా ఆ పాటను పూర్తి చేశారు