రాజమహేంద్రవరం అంటే ‘పాతపట్నం’ మాత్రమే.

ఆ రోజుల్లో (1884) రాజమహేంద్రవరం ఖ్యాతి చాల గొప్పగా ఉండేది. అది విద్యావంతులకి నిలయమనీ, మహాపండితులకి ఆస్థానమనీ, గోదావరి బ్రహ్మాండమైనదనీ , ఆదేశం వెళ్ళిన వాళ్ళంతా పండితులవుతారనీ చెప్పుగుంటూ ఉండేవారు.

అప్పట్లో రాజమహేంద్రవరం అంటే ‘పాతపట్నం’ మాత్రమే. ముఖ్యమైనభావనాలల్లా చిత్రాంగీ రత్నాంగుల మేడలే. అప్పటికి గోదావరి గట్టు లేదు. బ్రిడ్జి అసలే లేదు. నేటి ఆర్యాపురాని కంతటికీ రెండో మూడో ఇళ్ళు ఉండేవి. మిగతావన్నీ కలప అడితీలే .

ఇన్నీసుపేట కొంచమే ఉండేది. కాని అది అప్పట్లో ఉళ్ళో కల్లా శుభ్రంగా ఉండేది. గచ్చు కాలవలు లేకపోయినా డ్రైనేజి వగైరాలు చక్కగా ఉండేవి.

---- * నా జీవితయాత్ర , ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు,

మొదటి ముద్రణ, ఎమెస్కో పాకెట్ బుక్స్, జూలై 1972

(కృతజ్ఞతలు .. Srinivasa Rao Karri గారు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!