ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేల‌మీద ప‌డ‌తాయో అన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ అనావృష్టి క‌లుగుతుంది.!


 

.

ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేల‌మీద ప‌డ‌తాయో అన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ అనావృష్టి క‌లుగుతుంది.!

.
యుద్ధంలో జ‌యం పొందిన విరాట‌రాజు, అంత‌కుముందే త‌న ప‌ట్ట‌ణానికి తిరిగి వచ్చాడు. విప్రులు, వ‌నితామ‌ణులు సేన‌లు జ‌ల్లుతూండ‌గా తాను, పాండువులు, బంధువులు రాజ‌మందిరం ప్ర‌వేశించారు. విరాటుడు సింహాస‌న మ‌ధిష్టించాడు. త‌న విజ‌యాన్ని మెచ్చుకోవ‌డానికి వ‌స్తున్న వాళ్లంద‌ర్నీ అభినందిస్తున్నాడు.ఉత్త‌రుడు క‌న‌బ‌డ‌క‌పోయే స‌రికి ఎక్క‌డున్నాడు ?  అని అడిగాడు. దుర్యోధ‌నుడు, భీష్ముడు, ద్రోణుడు, క‌ర్ణుడు, కృపుడు, అశ్వ‌త్థామ మున్న‌గు కురువీరులు. సైన్యంతో వ‌చ్చి ఉత్త‌రిదిక్కున గోగ్ర‌హ‌ణం చేసార‌నీ అందుచేత ఉత్త‌రుడు, బృహ‌న్న‌ల ర‌ధసార‌ధిగా చేసుకొని ఒక్క‌డే యుద్ధానికి వెళ్లాడ‌నీ, విరాట‌రాజు తెలుసుకుని దుఃఖంతో కుంగిపోయాడు. మంత్రులు మొగాలు చూసాడు.

కుర్ర‌త‌నం చేత క్రిందూమీదూ కాన‌కుండా రోషావేశంతో ప‌శువుల‌ను కాపాడ్డానికి వెళ్లాడుట !  ప‌సివాడు !  కౌర‌వ సైన్యం ఎక్క‌డ ?  వీడు ఒంటిర‌గా వెళ్ల‌డం ఎక్క‌డ ?  నాకిది మ‌హాదుఃఖం క‌లిగిస్తోంది. అతివ‌డిగా సైన్యాన్ని అత‌నికి తోడు పంపాలి. చాలినన్ని  వేగంగా పంపండి అన్నాడు ఆదుర్దాతో.

అక్క‌డ‌కు వ‌చ్చి సుశ‌ర్మ ఓడిపోయాడు. క‌నుక ఇక్క‌డ వీరికి జ‌య‌మ‌వుతుంది. భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. యుద్ధానికి ఉత్త‌రుడు ఒక్క‌డే వెళ్లాడ‌నుకోవ‌ద్దు. అత‌నికి బృహ‌న్న‌ల సార‌ధి క‌నుక దేవ‌త‌ల్నైనా జ‌యించుకొస్తారు అన్నాడు కంకుడు. విరాటుని ఆరాటం కొంచెం త‌గ్గింది.
మ‌హారాజా ! కౌర‌సైన్యాన్ని జ‌యించి, మ‌న‌గోవుల్ని మ‌ళ్లించి ఉత్త‌రుడూ, సార‌ధీ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ర‌ధానికైనా ఈష‌ణ్మాత్రంకూడా ప్ర‌మాదం లేకుండా సుర‌క్షింత‌గా ఉన్నారు. మ‌మ్మ‌ల్ని పిలిచి మీరువ‌డిగా పోయి పురంలో ప్ర‌క‌టించండి అంటే వచ్చాం అన్నారు, వారు.

విరాట‌రాజు హృద‌యాంత‌రాళాల నుండి పొంగిపొర్లిన ఆనందం ఆశ్రువుల‌రూపంలో అత‌ని నేత్రాల‌నుండి ధారాపాతంగా ప్ర‌వ‌హించిన‌ది. అత‌ని ఒడ‌లు పుల‌కాంకిత‌మైంది. ఏమిటేమిటి ?  అంటూ గొల్ల‌వాళ్ల‌చేత ప‌దేప‌దే చెప్పించుకొన్నాఆ శుభ‌వార్త‌. మంత్రుల మొగ‌ములు స‌గ‌ర్వంగా చూచాడు.

అత్యాచ్చ‌ర‌క‌మైన ఈ అమోఘ విజ‌యం, నాకొడుకు జ‌యం, గంట‌లు మ్రోగిస్తూ ఏనుగుల‌మీద వీధివీధికి వెళ్లి చాటించమ‌నండి. మేళ‌తాళాల‌తో, మంగ‌తూర్యాల‌తో, బ్రాహ్మ‌ణ‌శ్రేష్ఠుల‌తో, పుణ్య‌స్త్రీల‌తో వారికి ఎదురువెళ్లి తీసుకు రావాలి...మా అమ్మాయి ఉత్త‌ర మున్నగు ఉత్త‌మ క‌న్య‌లంతా సుగంధ ద్ర‌వ్యాల‌తో నా కొడుకుకు ఎదురు వెళ్లి తీసుకు వ‌చ్చే యేర్పాట్లు చేయించండి, అని ఆజ్ఞ‌లిచ్చాడు.
గొల్ల‌వాళ్ల‌కు నూతన వ‌స్త్రాలు ఇప్పించాడు. కంకుభ‌ట్టును చూచాడు. నేస్తం ! ఒక ఆట వేద్దామా ?  అన్నాడు, ప‌ట్ట‌లేని సంతోషంతో .

నువ్వు సంతోష‌ప‌రావ‌శ్యంతో ఉన్న‌వు. ఈ వేళ‌నీతో ఆడిగెల‌వ‌డం క‌ష్టం. అందుచేత భ‌య‌ప‌డుతున్నాను. అన్నాడు, కంకుడు.



విరాటుడు న‌వ్వినాడు. ఈ ప‌రిస‌రంలో ఉన్న సైరంధ్రిని పాచిక‌లు తెమ్మ‌న్నాడు. ముందుకు దిగినాడు, ఇక్క‌డకురా అని కంకుణ్ణి పిలిచినాడు.

జూదం ఏమంత మంచిది ?  ధ‌ర్మ‌రాజు జూద‌మాడి రాజ్యాన్ని, త‌మ్ముళ్ల‌ను, భార్య‌ను, పందెంవొడ్డి నానా క‌ష్టాలుప‌డ్డాడు క‌దా ?  దీనివ‌ల్ల‌వ‌చ్చేకీడు అటువంటిది, అంటూనే జూదం ఆడ‌నారంభించాడు కంకుడు.

 విరాట‌రాజు ఆనందోత్సాహం ప‌ట్ట‌లేక‌పోతున్నాడు. చూశావా నా కొడుకు ఉత్త‌రుడి బాహుబ‌లం శౌర్యం ఎంతుఉదాత్త‌మైన‌వో ! కౌర‌వ సైన్యాన్ని ముట్టడించి, గెల్చి, గోవుల్ని తెచ్చాడు ! ఇంత ఘ‌న‌కార్యం ఎప్పుడైనా, ఎవ‌రైనా, ఎక్క‌డైనా చేశారా ! అన్నాడు పాచికలు వేస్తూ.

గెల‌వ‌డం బ్ర‌హ్మ‌వ‌శంకూడా కాదు గ‌దా ! అంటూ అత‌డు తొంద‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఉత్త‌రుడు పంపించిన గొల్ల‌వాళ్ళు అక్క‌డికి వ‌చ్చారు.

భీష్మ‌, క‌ర్ణ‌, దుర్యోద‌న‌, ద్రోణ‌, కృపామున్న‌గు యోధుల్ని ఉత్త‌రుడు ఒక్క‌డే జ‌యించ‌గ‌లిగి నట్ల‌యితే, ఇంత‌క‌న్న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం లోకంలో ఉంటుందా ?  ప్ర‌పంచంలో ప్ర‌సిద్ధి కెక్కుతాడు అన్నాడు , కంకుడు.

కంకుడి మాట‌లు విరాటుని బాధించాయి. అత‌డు క‌ట‌క‌ట ప‌డినాడు.

నువ్వు ఇలాగ‌మాట్లాడ‌డంలో అంత‌రార్థం నా కొడుకు విజ‌యం సందేహ‌మ‌నేనా ?  నువ్వు క‌నుక ఇంత‌మ‌ట్టుకు ఓపిక ప‌ట్టాను. ఇంకఇటువంటి మాట‌లు అన‌కు, అన్నాడు, కోసంగా. అత‌ని చెక్కిళ్లు అదిరిన‌వి. క‌ళ్ళు కెంపెక్కిన‌వి. మూతిముడుచుకొని ఆడుతున్నాడు. కాని కంకుడా త‌ణ్ణి లెక్క‌చేయ‌లేదు.

కౌర‌వ‌సైన్యాన్నే అన్న‌మాటేమిటి ?  దేవ‌తలూ, రాక్ష‌సులూ క‌లిసి వ‌చ్చినా గెలుస్తాడు, ఉత్త‌రుడు, శ‌త్రుసైన్యాల‌కు జ‌డుపుపుట్టే ఆ బృహ‌న్న‌ల‌ర‌ధం మీద ఉండాలిగాని అన్నాడు.

 విరాటుడి కోపం రెట్టించింది. మొహం వికృత‌మైంది.

నీవ‌ల్ల చాలాచాలా వింత‌లు వింటున్నాం ! ఇంత‌కు ముందు ఎప్పుడూ సార‌ధుల్ని చూడ‌లుద‌నుకుంటున్నావు కాబోలు. అబ్బో ! లోకంలో మ‌హామ‌హా వీరుల్నే చూశాం అత‌ని క‌న్నులు నిప్పులు కురుస్తున్న‌వి. నాకొడుకుని గురించి పోటు మాట‌లు నీకెందుకు ?  సంతోషంగా ఆడ‌లేవా ?  పిచ్చిపిచ్చిమాట‌లు క‌ట్టిపెట్టు. అటువంటివి మేం స‌హించ‌లేం, బ్రాహ్మ‌డా, అన్నాడు, విరాట‌రాజు.

ధ‌ర్మ‌రాజు ప‌ట్టువ‌ద‌ల్లేదు. చిరునవ్వు న‌వ్వి.

యుద్ధం చేయాల‌ని వేడుక‌ప‌డి, అతి సాహ‌సుడై, బృహ‌న్న‌ల ఉత్త‌రుణ్ణి సార‌ధిగా చేసుకొని కౌర‌వ‌సేన‌ల‌ను జ‌యించి, ఒక్క ప‌శువైనా పోకుండా అన్నిటినీ తెచ్చి ఉంటాడు. నా మాట నిజం అవుతుందోకాదో చూస్తూండు, అన్నాడు కంకుడు. అంత‌టితో ఆగ‌క బృహ‌న్న‌ల విజ‌యం పురంలో చాటించు అన్నాడారాజు మొగం చూస్తూ.

విరాటుడు రౌద్రుడుయాడు. బుస‌కొట్టాడు. పేడిని పొగ‌డ‌డం మాన‌మంటే మాన‌వేం ?  అంటూ పాచిక‌ను కంకుడి మొహానికేసి కొట్టాడు.

ఈ విధంగా దెబ్బ‌తినినా, ధ‌ర్మారాజుకు కోపంరాలేదు. ద్రౌప‌ది వైపు చూచి ఊరుకున్నాడు. ద్రౌప‌ది గ‌బ‌గ‌బ పరుగెత్తి అత‌ని నొస‌టి దెబ్బ‌నుండి కారుతున్న రక్తాన్ని త‌న ప‌మిట చెంగుతో అద్ది, ఆ చేరువ‌లోనున్న బంగారు క‌ల‌శ‌లోని నీళ్ల‌తో చేతులు త‌డుపుకొని గాయాన్ని నెమ్మ‌దిగా తుడుస్తున్న‌ది.

రక్తాన్ని చీర చెంగుతో అద్దుతున్నావేం ? అని విరాటుడు సైరంధ్రిని అడిగినాడు.
నిర్మ‌ల‌మైన‌వంశంలో పుట్టిన ఈ పుణ్యాత్ముని నెత్తురు ఎన్ని బొట్లు నేల‌మీద ప‌డ‌తాయో అన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ అనావృష్టి క‌లుగుతుంది. ఉత్త‌మ బ్రాహ్మ‌ణుడికి హాని చేయడంవ‌ల్ల క‌లిగే పాపం ఎట్లాగూ కీడు క‌లిగిస్తుంది. క‌నుక నీకు హాని రాకుండా ఉండాలని ఇలాగ చేశాను. అంటూ ఆమె అత‌ని గాయాన్నుండి కారుతున్న నెత్తురు తుడుస్తున్న‌ది.
ఉత్త‌రుడొక్క‌డూ లోప‌లికి వ‌చ్చినాడు. తండ్రిపాదాల‌కు మోక‌రిల్లాడు. విరాటుడు ఆనంద‌బాష్పాలు కార్చి, కొడుకును గ‌ట్టిగా గుండెల‌క‌దుముకొన్నాడు. ఉత్త‌రుడు తండ్రికి పునః ప్ర‌ణామాలు చేశాడు. పిమ్మ‌ట కంకుడికి స‌గౌర‌వంగా న‌మ‌స్క‌రించాడు. ఆత‌ని నుదుట‌ను ఉన్న‌గాయం చూచి ఇదేమి ? అన్నాడారుద్దాగా.

నాయానా ! నేను నీ విజ‌యాన్ని పొగ‌డుతూంటే అత‌డు పేడివాణ్ణి పొగ‌డాడు. దాంతో, నేను కోపం ఆపుకోలేక‌పోయాను. అప్పుడు నాచేతిలో ఉన్న పాచిక‌పుచ్చుకొని కొట్టాడు, అన్నాడు విరాటుడు.

ఉత్త‌రుడు భ‌య‌మూ, సంభ్ర‌మ‌మూప‌డినాడు.

అయ్య‌య్యో ! నాన్నా ! గొప్ప‌త‌ప్పుచేశావు. నీవు ఇలాగ చేయ‌వ‌చ్చా ?  వారు ఏం చెపుతే అద‌ల్లా మ‌నం అంగీక‌రించాలిగాని, ఇలాగ‌, కాదు, కూడ‌దు అంటూ నిషేదించ‌వచ్చా ?  వారిని స‌విన‌యంగా బ్ర‌తిమాలుకోండి. ప‌విత్ర‌చ‌రిత్రులైన ప‌ర‌మ‌ద్విజుల్నికోపించి అవ‌మానించిన పరిపాల‌కుల‌కు ఆయువు, సిరి క‌లుగుతాయా ? అన్నాడు, ఉత్త‌రుడు, అత్యాద‌రంతో.

ఉత్త‌రుని మాట‌లు పాటిగా బట్టి, విరాటుడు ధ‌ర్మ‌రాజును భ‌య‌భ‌క్తుల‌తో వేడుకొన్నాడు క్ష‌మించ‌మ‌ని. ధ‌ర్మ‌రాజు నాకేం కోపంలేదు. నీ తండ్రి చెడుమార్గ‌న న‌డిచేవాడు కాదు. ఈ దిన‌ము అటువంటిది హాని క‌లిగింది అని నవ్వుతూ ఉత్త‌రుడితో అన్నాడు. అప్పుడు తండ్రి, కొడుకులు సంతోషించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!