ఈ దేశం నాకేమిచ్చింది?


ఈ దేశం నాకేమిచ్చింది?

.

అటు కాశ్మీరు నుంచి
ఇటు కన్యాకుమారి వరకు,
ఆ మూల ధాతు అడవుల నుంచి
ఈ మూల సముద్ర తీరం వరకు,
మదమెక్కిన కులాల పిచ్చినుంచి
పట్టు తప్పిపోయిన ఐకమత్యం వరకు,
కొంతమందికి ఒకటే ఆవేదన
ఆకలికోసం ఆక్రందనలోపడి
స్వార్ధం తెచ్చిన ఆవేశంతో
ఈ దేశం నాకేమిచ్చింది
నేనెందుకు దేశానికి ఇవ్వాలనే
వ్యర్ధమైన మాటలంటూ
ధరణి తల్లి ఎదను గుచ్చుతున్నారు.
తన కన్నీటిలో తడుస్తూ తృప్తిపడుతున్నారు.
రోజులెందుకలా అయ్యాయని గళమెత్తాలా
రోజులలా మారాయని సర్దుకొవాలా
అందుకే నేనో సవాలు విసురుతున్నా –

భార్య నిందించిందని బాధపెట్టే నీవు
హాంగ్ కాంగ్ లో కాపురం పెట్టి చూపించాలా !
అత్యాచారం చేసి తప్పించుకు తిరిగే నీవు
దుబాయ్ వెళ్లి వేధింపులకు గురిచేసి తప్పించుకో చూద్దాం !
ఎవ్వరికీ తెలీకుండా దొంగపెళ్ళి చేసుకునే నీవు
గ్రీస్ లో ఉంటూ నీ బుద్ధి చూపించు చూద్దాం !
అర్ధరాత్రైనా నిరభ్యంతరంగా తిరిగే నీవు
చెస్టర్ దేశం వెళ్లి అక్కడలా తిరిగి చూపించు చూద్దాం !
తోటివాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ అవహేళన చేసే నీవు
అమెరికాలోని ఒక్లాహమాలోని జంతువులను అలా చెయ్ చూద్దాం !
మైకుపెట్టి గోల సృష్టించే నీవు
సింగపూర్ వెళ్లి అర్దరాత్రి బాత్రూంలో నీళ్ళు పోయ్ చూద్దాం !
మూడో కంటికి తెలీకుండా సరుకును రవాణా చేసే నీవు
యుకె వెళ్లి అక్కడ నీ పనితనం చూపించు చూద్దాం !
దొంగచాటుగా కాలవనీల్లను మళ్ళించే నీవు
కొలరాడో వెళ్లి అక్కడ వర్షం నీటిని పట్టుకో చూద్దాం !
రానిదైనా చేయడానికొచ్చే అర్హతలేని నీవు
విక్టరియాలో నీ గొప్పతనాన్ని చూపించు చూద్దాం !
చనిపోయిన జంతువులను రోడ్డుపక్కన వదిలేసే నీవు
అంటార్క్టిక వెళ్లి అలా చెయ్ చూద్దాం !
నీకిష్టమొచ్చినట్లు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్ళే నీవు
ఇటలీ వెళ్లి నవ్వుతూ కాకుండా నడువు చూద్దాం !
మిడిమిడి జ్ఞానమున్న నాస్థికుడివైన నీవు
అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు చూద్దాం !
ఫోనులో ఇంటర్నెట్ వాడుతూ కనిపించే నీవు
బర్మా వెళ్లి వాడుతూ తిరుగు చూద్దాం !

నెలకో దేశం చొప్పునైనా
కనీసం రెండు సంవత్సరాల కాలంలోనైనా
ప్రపంచ పర్యాటన చేస్తూ
ఇవన్నీ ఒకసారి చేసి
దర్జాగా భారతదేశం వచ్చి
అప్పుడు చెప్పండిరా ….
ఈ దేశం నాకేమిచ్చిందని
నేనెందుకు దేశానికివ్వాలని !
అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి
నీ దాసున్నై జీవితాన్ననుభావిస్తాను.
నేను విసిరిన ఈ నా సవాలుకు
దేశమేమి ఇవ్వలేదనే వాళ్ళు సిద్ధమేనా ..?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!