Posts

Showing posts from July, 2016

జయ విజయులు!

Image
జయ విజయులు జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహా

అది శివ ధనుస్సు భంగం కాదు!

Image
అది శివ ధనుస్సు భంగం కాదు అది మదించిన రావణ మత్తేభ మద మణ చిన భంగిమ ! . మదించిన నల్లని ఏనుగు తన బలమైన తొండముతో పెద్ద మర్రి కొమ్మను పట్టి ఫళ ఫళ విరచినట్టు అరి వీర భయంకరుడు అయిన ఈ రాముడు తన బలమైన బాహువులతో శివ ధనుస్సు ఎత్తి పెళ పెళ విరచి పడేశాడు. ఎత్తిన ధనువు ఎత్తినట్లే పెటిల్లున రెండు ముక్కలు కాగ తటిల్లున విద్యుత్ కాంతి లతికలా తటాలున సీతా నా ముక్కాలా నడుమ దోచెను విధ్యుల్లతికలా . . ఆ శివ ధనుస్సు భంగం పరులకు ధరులకు ఉరుములు మెరుపులు కాగా , వధూవరులకు ఊర్పుల వలపుల మెరపులై తోచే . అది శివ ధనుస్సు భంగం కాదు అది మదించిన రావణ మత్తేభ మద మణ చిన భంగిమx

రఘుకులాన్వయ రత్న దీపం!

Image
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుమ్ అరవింద దళాయ తాక్షం రామం నిశాచర వినాశ కరం నమామి . దశరధ మహా రాజు కుమారుడు, రఘు వంశమునకు రత్న దీపము వంటి వాడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు,మోకాళ్ళ వరకు పొడవైన చేతులు కలిగిన వాడు, సీతా దేవికి భర్త యైన వాడు, రాక్షసులను సంహరించెడు వాడు,ఆనంద స్వరూపుడు అయిన శ్రీరామ చంద్రునకు నమస్కరించెదను.

శుభోదయం !

Image
శుభోదయం ! .  అందరి రాబడి పది రెట్లు పెరిగా యి ఖర్చులు అంతే  కాని ఈయన రాబడి పెరగలేదు ..ఏ క్కడికి అక్కడే . — 

నాగ మల్లి కొనలోన నక్కింది లేడికూన!

Image
నాగ మల్లి కొనలోన నక్కింది లేడికూన! ( http://www.krishnaprema.co.in/archive-audio/126 )

టమకుల బండి!

Image
టమకుల బండి! టకు టకు టకు టకు టమకుల బండి లంఖణాల బండీ, ఎద్దుల బండి, జోడెద్దుల బండి టకు టకు టకు టకు టమకుల బండి లంఖణాల బండీ, యెద్దుల బండి జోడెద్దుల బండి, చల్ చల్ చల్ నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా నాటు బండి గలగల ఒకటే మోత, కుదుపులు ఒకటే బాధగా  టకు టకు టకు టకు టమకుల బండి లంఖణాల బండీ, యెద్దుల బండి, జోడెద్దుల బండి

నీసిగ్గేసింగారమే..

Image
నీసిగ్గేసింగారమే.. ఓ చేలియా నీసొగసేబంగారమే కనులార కని మురేసినే మనసిచ్చి దిగి వచ్చెనే..

అష్ట లక్ష్ములు !

Image
అష్ట లక్ష్ములు ! లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం.  వారు ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, . ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, . విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మీ. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

మన ఆ ..రుద్రుడు బాపు గారి స్కెచ్.!

Image
మన ఆ ..రుద్రుడు బాపు గారి స్కెచ్.!

పురాణాల్లో సైన్స్!

Image
పురాణాల్లో సైన్స్!  1. విశ్వసృష్టి మీద పురాణాల అవగాహన "దృష్టిని బట్టి సృష్టి" అన్నారు పెద్దలు. ప్రపంచములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సృష్టిని అర్థం చేసుకున్నారు. ఐతే ' శాస్త్రీయపరమైన సృష్టి అవగాహన ' మాత్రం ఒక్క హైందవులకే వుంది. వారు ఆ అవగాహనను తమ పురాణాల్లో పొందుపరచుకున్నారు. ఆ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక అద్భుతమైన శక్తి (Super Power), ఈ బ్రహ్మాండ విశ్వసృష్టికి మూలమని ఋషీశ్వరులు కనుగొన్నారు. దానినే "ఆదిశక్తి" అని పిలిచారు. విశ్వం (Universe) నడవడి మొత్తం "సృష్టి, స్థితి, లయ" అనే మూడు దశలలో కొనసాగుతున్నట్లుగా గమనించారు. ఆ మూడు దశలను "త్రిమూర్తులు" గా గుర్తించారు. సృష్టికారకుడుగా బ్రహ్మనూ, స్థితికారకునిగా మహావిష్ణువునూ, లయకారకునిగా మహేశ్వరుణ్ణీ నిలుపుకున్నారు. బ్రహ్మదేవుడు : జీవరాశికి మూలమై నాలుగుదిశలా వ్యాపించివున్న ప్రకృతిని, నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవునిగా గుర్తించారు. విశ్వం మొత్తములో యెక్కడెక్కడ ప్రకృతి ఉన్నా, అది బ్రహ్మదేవుని స్వరూపమే! మహావిష్ణువు : విశ్వం యావత్తూ శ్రీమహావిష్ణువే! అన్నీ ఆయనలోనే ఇమిడివున్

ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ

Image
ఎంత బాగుందో , వెన్నెల కొమ్మని వంచినట్లూ

ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి.

Image
ఎవరు ఎవరకి లైన్ వేస్తున్నారు...బాపు గారే చెప్పాలి.

బాపుగారి అడవి సుందరి !

Image
బాపుగారి అడవి సుందరి !

బాపు గారి లైలా!

Image
బాపు గారి లైలా!

గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు.

Image
గుండెల మిద నడుస్తారు. వచ్చి కూర్చురు ..ఈ ఆడవాళ్లు ఇంతే. బాపు.

గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే ర్ర్ ఆడవాళ్ళు ఇంతే.

Image
గుండెలో సూదులతో గుచ్చుతారు. ఇంతే ర్ర్ ఆడవాళ్ళు ఇంతే.

అమయాకంగా తెల్ల పోతారు.

Image
అమయాకంగా తెల్ల పోతారు. x

విభక్తి ప్రత్యయాలు !

Image
విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి: డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి. నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి. కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి. వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి. అందున్, నన్--- సప్తమీ విభక్తి. ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్--- అంటే....

Image
చేతన్, చేన్, తోడన్, తోన్--- అంటే.... . చేతోలో చైను ఉంటె నేను నూతిలో నిరు తోడను అనే వాళ్ళం. “ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి..  . నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా..  . ఒక్క చేదకేమైనా నీ చేతులు ఆరగి పోతాయా ” అనేవాళ్ళు.

కొందరు గురు శిష్యుల గూర్చి-

Image
కొందరు గురు శిష్యుల గూర్చి- అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు  అని అందరికి తెలుసు  .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు  .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము. . రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు . ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది . . .శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు . కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి . . త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్ శిష్యుడు. ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా . . .సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ ,  . విద్యారన్యులకు హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు . .ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు  ముఖ్య శిష్యుడు  . .రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు.  . గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యు

మధుర భావనలు .!

Image
మధుర భావనలు .! నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి x

రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం

Image
రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం(7)

తిక్కన కవిత్వమంటే!

Image
తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .! . ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి  కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న  ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి. "భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!." . దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో మన కళ్ళ ఎదుట చూపిస్తాడు ఉత్తరుడు.. (భయసైన్యంయెంతభయంకరమైనదో దుష్కర ప్రాసతోను, సుదీర్ఘములైన కఠినాతి కఠినములయిన పదాలతో కూడిన సమాస రచన తోను, వీర రసోద్దీపనమైన ఆపభటీ వృత్తి తోను (వ్యంగ్యంగా) భయానకరస పోషకమగు శబ్ద విన్యాసముతోను చక్కగా వర్ణించాడు.అవి గమనించటానికి మనలోచనాలు చాలవు. ఆలోచనా లోచనాలు కావాలి. అదే మరి తిక్కన కవిత్వమంటే!)

నేను.

Image
నేను. (కవిత... శ్రీమతి Sailaja Mithra .) . దారి తప్పిన ప్రార్థనకు  పూజారిని కాలేను కష్టపడే పూజకు  భక్తుడిని కాలేను ఇష్టపడే భక్తుడికి  దైవాన్ని కాలేను కరుణించలేని దైవానికి  మనిషిగా కనబడలేను మనసులేని మనిషికి  జీవితాన్ని అందివ్వలేను

కోరిక సఫలం!

Image
కోరిక సఫలం! . చందూకి చాలా కోరికలు ఉన్నాయి. అవి తీరే మార్గం కనిపించటం లేదు. దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. కొన్ని రోజులకి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. చందూ: స్వామీ... నా బ్యాగునిండా ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూడు. దేవుడు: ఇంకా... చందూ: ఒక పెద్ద వాహనంలో ఎప్పుడూ తిరిగేలా చూడండి. దేవుడు: సరే... చందూ: చివరిగా చిన్న కోరిక ఆ వాహనంలో అమ్మాయిలు కూడా ఉండేలా చూడు స్వామీ. దేవుడు: తథాస్తు! నీవు ఇంటికెళ్ళు రెండు రోజుల్లో అవన్నీ సమకూరుతాయి. చందూ ఇంటికెళ్ళిన రెండోరోజు ఆర్టీసీ కండక్టర్ గా జాయిన్ అవ్వమని ఫోష్టు వచ్చింది.

మన ఆటలు... పులి-మేక లేక ....: పులిజూదం

Image
మన ఆటలు... పులి-మేక లేక ....: పులిజూదం ఆడే పద్దతిః ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

లటుకు ..చిటుకు!

Image
ఇద్దరు స్నేహితులు తమ పూర్వీకుల గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. లటుకు : ఒకసారి మా తాతయ్య గడియారం బావిలో పడిపోయింది. దానిని ముప్పయ్యేళ్ళ తర్వాత బయటకు తీశారు. అప్పటికీ అది సరిగ్గానే పనిచేస్తుంది. చిటుకు : ఓస్... అంతేనా! అందులో గొప్ప ఏముంది? ఒకసారి మా తాతయ్య బావిలో పడిపోయాడు. ముప్పయ్యేళ్ళ తర్వాత ఆయన్ని బయటకు తీశారు. అప్పటికీ ఆయన బతికే వున్నారు. లటుకు : నిజమా! మరి ముప్పయ్యేళ్ళుగా బావిలో ఏం చేస్తున్నారు? చిటుకు : ఏముంది! ముప్పయ్యేళ్ళ కిందట పడిపోయిన మీ తాతయ్య గడియారాన్ని వెదకుతూ ఉన్నాడు.

అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది!

Image
అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది! . అసలు అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది. దాని కల్పన, నిర్మాణం, ప్రదర్శన, అంతా కూడా ఒక కళ. ప్రకృతిలో ఎక్కడా కనుపించని సౌందర్యాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ కల్పనలో ఆ కూర్పులో అందం ఉంది. అసత్యానికి కూడా, కల్పనా, కూర్పూ కావాలె. దాని నిర్మాణంలో పనితనానికి ఎంతైనా అవసరం ఉంది. అందుకనే సత్యానికంటే అసత్యము ఎక్కువ సుందరమైనది. నేను ప్రభుత్వోద్యోగిని. నాకు సెలవు కావాలె. ఎందుకూ? జ్వరం వచ్చిందా? లేదు. కాని ఏదో బధ్ధకంగా ఉంది. ఇంట్లో పడుకోవాలె అనిపించింది. లేకపోతే భార్యతో కబుర్లు చెప్పుకొంటూ కూర్చోవాలెనని బుధ్ధి పుట్టింది. సెలవకు వ్రాయాలె. సత్యాన్ని ఆశ్రయిస్తే ఉద్యోగాన్ని ఊడకొడుతుంది. సాయింత్రం మా ఆవిడ, నేను ఎంతో కష్టపడి మిగిల్చిన డబ్బుతో కొన్న పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెడుతుంది. ఆవిడ చీరకట్టుకొన్న సౌందర్యాన్ని నేను ముందుగా చూడాలని ఉంది. మధ్యాహ్నం సెలవు కావాలె. నిజం చెపితే సెలవు దొరుకుతుందా? అసత్యాన్ని ఆశ్రయించాలె. ఆవిడ ఓ చక్కని ఉపాయం చెబుతుంది. జబ్బు, తలనొప్పి, కడుపులో పోట్లు అని వ్రాయమని చెప్పటమే కాకుండా ముఖం ఇల్లాగ పెట్టు, నడుం ఇల్లాగ వంచు, కళ్ళు కొద్దిగా చ

అర్ధాంగి!

Image
అర్ధాంగి! పట్టు పితంబరం మట్టి పడి మాసేను... పాలు కారే మోము గాలికే వాడెను.... గొల్ల పిల్లలు చాల అల్లరి వరురా... గోల చేసి నీ పెయన కోదేములు చెప్పేరు... ఆడు కోవలనని పాడు కోవేలననిన  అన్నింట నేను ఉన్నా.. ఒక అద్బుతమయినపాట.... జిక్కి గొంతు...మహానటి సావిత్రి నటన. (సావిత్రి చిత్రం ..పొన్నడ మూర్తి గారు.)

రాఘవరామా! (పోతనామాత్యుడు)

Image
శ్రీమద్భక్త చకోరక సోమ! వివేకాభిరామ! సురవినుత గుణ స్తోమ! నిరలంకృతాసుర రామా సీమంతసీమ! రాఘవరామా! (పోతనామాత్యుడు) టీకా: శ్రీమత్ = గొప్పవారైన; భక్త = భక్తులు అను; చకోరక = చకోరపక్షులకు; సోమ = చంద్రుడా; వివేక = వివేకమువలన; అభిరామ = సుందరమైనవాడా; సుర = దేవతలచే; వినుత = పొగడబడుచున్న; గుణ = గుణముల; స్తోమ = సమూహముగలవాడా; నిరలంకృత = నష్టమైన అలంకారములు గల; అసుర = రాక్షస; రామా = స్త్రీల; సీమంత = పాపిటలు; సీమ = ప్రాంతము కలగజేసినవాడా; రాఘవ = రఘువంశమున జన్మించిన; రామా = రాముడా. భావము: భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా!  (రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ!  అవధరింపుము. (ఈ పద్యం నాకు కొంచెం ఖేదం కలిగించింది...రాక్షస స్త్రీల మాంగల్యంహరించినరామా అని పోతానగారు సంభోదిస్తారు..) x

Hanging is the order of Bhrathamatha. . ఉరి ఏ సరి అంటోంది..మన భారత మాత.

Image
Hanging is the order of Bhrathamatha. . ఉరి ఏ సరి అంటోంది..మన భారత మాత.x

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కధలు]

Image
యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కధలు] . పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. “ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు. ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి. ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి. ఆ సమయంలో.

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

Image
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం (5)

Image
రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం (5)

రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు...... .రుక్మిణీ కల్యాణంబు.)

Image
రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు...... .రుక్మిణీ కల్యాణంబు.) .రాజీవలోచనుఁడు హరి రాజసమూహముల గెల్చి రాజస మొప్పన్ రాజిత యగు తన పురికిని రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్. భావము: పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకొచ్చేడు. బంధువు లంతా పొగిడారు. . అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలుతో తోరణాలు కట్టారు. జండాలు ఎగరేసారు. . ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్

కృతజ్ఞతాగేయం!

Image
కృతజ్ఞతాగేయం అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970 . నే చేయునదీ నే చేయనిదీ సాధించినదీ ఫలియించనిదీ నీ యిచ్ఛలేక జరుగదట నా స్వేచ్ఛ మొదలు తుది యెచట! ॥చేయునదీ॥ . నిను చూచుటకే రప్పించితివీ నీ దరిసెనమే యిప్పించితివీ యీనోట పాట పాడించితివీ యిది ఎవరి రచనయని యడిగితివీ ॥చేయునదీ॥ . నా భావనమే నా జీవనమై నీ ప్రణయమ్మే నా కవనమ్మై నా అహపుటంచు చెరిపించెదవో నా ఇహము పరము గావించెదవో ॥చేయునదీ॥ . నాదామృతమే పరసాధనగా నీ దివ్య వాక్కే ఉద్బోధనగా ఈ రజని కాంతు లొలయించెదవో విశ్వ జనహితము వెలయించెదవో ॥చేయునదీ॥

ఆలోచించదగ్గ విషయం.

Image
ఇది నిజంగా కొంచెం ఆలోచించదగ్గ విషయం. కులకండూతి లేకుండా జాతి సమైక్యత గురించి గొల్లపూడి వారు చక్కగా చెప్పినారు. తప్పక చదవండి... అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం? మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్‌ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చే

మిర్జాపూర్ జమిందారు... కాశి దేగ్గెర ఉంటారు!

Image
మిర్జాపూర్ జమిందారు... కాశి దేగ్గెర ఉంటారు వారు అప్పుచేసి పప్పుకూడు తింటారు. Any doubt. x

స్వప్న చిన్ని అద్బుతః

Image

స్మరవారం వారం !

Image
స్మరవారం వారం ! సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు. శ్రీ సోమసుందరం గారు, శ్రీమతి పార్వతి ఇతని తల్లితండ్రులు. శ్రీ తిరువశినల్లూర్ రామసుబ్బశాస్త్రి గారు ఇ!తని సంగీత గురువు.  కంచి పీఠం లో శ్రీ శివేంద్ర సరస్వతి గారు ఇతని యొక్క తాత్విక గురువు. పరమహంస ముద్ర తో 23 కీర్తనలు రచించి స్వరపరిచారు.  ఇవి తాత్విక పరిజ్ణానం తో, శ్రీ కృష్ణుని స్తుతిస్తూ, తత్వబోధనలను, లీలామృతాన్ని పంచిపెట్టే కీర్తనలు.  ఈ కీర్తనలే సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. భారతీయ సంగీత ప్రపంచంలో ఈ కీర్తనలు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఎంతో మంది సంగీత వేత్తలు వీటిని ఆలాపించారు. . నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కీర్తన నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. అది "స్మరవారం వారం" కీర్తన. శ్రీ బాలమురళీ కృష్ణ పాడిన ఈ కీర్తన  మీరు కూడా వినండి. శ్రీ జేసుదాస్ ఇదే కీర్తనని ఒక మళయాళం సినిమా కి పాడారు.  అది చాలా పాపులర్ అయ్యింది. . స్మరవారం వారం  రాగం: కాపి తాళం: ఆది స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు  భాష: సంస్కృతం పల్లవి  స్మర వారం చేత

అగ్ని .మిస్సాల్

Image
కలాం గారు ఏమి చేస్తున్నారు.. ఎవరికి తెలియదు.. అయన ..ASLV..తిన్నగా పైకి వెళ్ళలేదు 800 milesu వెళ్లి బంగాళాఖాతం లో పడింద.. అయన దాన్ని అగ్ని .మిస్సాల్ గా మలిచేరు. ఏమో దాన్నే ముందే ప్లాన్ చేసారేమో. నేను అప్పుడు తిరువనంతపురం లో ఉన్నాను,

మంథరగిరి ధారణంబు!

Image
మంథరగిరి ధారణంబు! . సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్. (పోతనామాత్యుడు.) భావము: శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజులు పాటు స్తంబాలలాంటి తన భుజాలపై అలవోకగా గోవర్థనగిరిని ఓ చక్కటి గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు. x

సత్యస్వరూపుడు! (పోతనామాత్యుడు.)

Image
సత్యస్వరూపుడు! (పోతనామాత్యుడు.) విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని;  వలన నేర్పడు ననువర్తనమున  వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై;  తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి వేదంబు లజునకు విదితముల్ గావించె;  నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ నికి నెండమావుల నీటఁ గాచాదుల;  నన్యోన్యబుద్ధి దా నడరునట్లు . ఉపకరణాలు: పద్యంటీకాభావము  త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద,  ననఘు సత్యుఁ బరుని ననుదినంబు. భావము: ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో;  ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో;  ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో,  నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో  ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని  ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను.

చిన్ని కృష్ణుడు !

Image
చిన్ని కృష్ణుడు ! .  చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టీ.. సందె తాయెత్తులు..సిరి మువ్వ గజ్జెలూ, చిన్నికృష్ణా..నిన్ను చేరికొలుతు

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే.. చిరునవ్వులో నేను సిరిమల్లిని..

Image
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే.. చిరునవ్వులో నేను సిరిమల్లిని..

రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు...... .రుక్మిణి సోదరుడు రుక్మి భంగపాటు.) .

Image
రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు...... .రుక్మిణి సోదరుడు రుక్మి భంగపాటు.) . జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె ! . రుక్మిణి సోదరుడు రుక్మి ,కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె. . "బల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్." భావము: “బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.” . ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించ

సైకిల్ రోజులు ఎంత బాగుండేవో ..

Image
. సైకిల్ రోజులు ఎంత బాగుండేవో .. మల్లి ఆ రోజులు వస్తే.. అవును పెట్రోల్ అయిపోవాలి .. సైకిల్ రావాలి .. x

రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం (4)

Image
........................రోజుకొకటి ..భర్తృహరి సుభాషితం (4)..............................

నేనం అనాధను కాదు నేనం అనాధను కాదు !

Image
నేనం అనాధను కాదు! అందరూ ఉన్న అభాగ్యుడిని  తోడేవ్వరూ లేని బికారిని నీడలేని నిరాశ్రయుడిని ఏది పడితే అది తినే సహజీవుణ్ణి జనంచేత నిర్లక్ష్యం కాబడిన నిరక్ష్యరాస్యుడిని  బలవంతుడిచేత నెట్టివేయబడ్డ బలహీనుణ్ణి  మొత్తంగా బాధింపబడే బాధితుణ్ణి ! మాకు మింగలేనంత ఆహారమొద్దు కాని ఆరోజు గడిచే ముద్ద చాలు !

గగన సదృశం !

Image
శుభరాత్రి.! . "శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం." x