మంథరగిరి ధారణంబు!

మంథరగిరి ధారణంబు!
.
సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై
సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.
(పోతనామాత్యుడు.)
భావము:
శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజులు పాటు స్తంబాలలాంటి
తన భుజాలపై అలవోకగా గోవర్థనగిరిని ఓ చక్కటి గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన
ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!