కొందరు గురు శిష్యుల గూర్చి-

కొందరు గురు శిష్యుల గూర్చి-

అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు 

అని అందరికి తెలుసు 

.ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు 

.భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోలేము.

.

రామాయణం లో శ్రీరాముడు వసిష్ట మహర్షికి శిష్యుడు .

ఆయన ద్వారా వేదాంత రహస్యాలెన్నో గ్రహించాడు .అదే’’ యోగ వాసిస్టం’’ అయింది .

.

.శ్రీ కృష్ణ బల రాములు సాందీప మహర్షి శిష్యులు .

కుచేలుడు వీరికి గురుకులం లో సహవాసి .

.

త్యాగ రాజ స్వామికి వాలాజి పేట వెంకట రమణ భాగవతార్ శిష్యుడు.

ఆ పరంపరను కొన సాగించిన వాడు కూడా .

.

.సమర్ధ రామదాస స్వామికి ఛత్రపతి శివాజీ , 

.

విద్యారన్యులకు హరి హర బుక్కరాయలు శిష్యులై రాజ్యాలను స్తాపించారు

.

.ఆధునికకాలం లో శ్రీ రామ కృష్ణ పరమ హంసకు వివేకానందుడు 

ముఖ్య శిష్యుడు 

.

.రవీంద్రునికి లెక్కలేనంత మంది శిష్యులున్నారు. 

.

గాంధీజీ కి ప్రముఖ నాయకులందరూ శిష్యులే .ఆయన రవీంద్రుని శిష్యుడు

.రఘు పతి వెంకట రత్నం గారికి కృష్ణ శాస్త్రి లాంటి శిష్యపరమాణువు లెందరో .

.చెళ్ళ పిళ్ళ వారికి విశ్వనాధ ,పింగళి ,కాటూరి వంటి కవి శిష్యులకు లెక్కే లేదు

విశ్వనాధకు ధూళిపాళ శ్రీరామ మూర్తి ,పేరాల భరత శర్మ జమదగ్ని జువ్వాడి గౌతమ రావు, పొట్ల పల్లి సీతారామ రావు మొదలైన వారు ప్రసిద్ధి చెందిన శిష్యులు .

ఇప్పుడు గురు పదం ఆశ్రమ వాసులకే చెల్లుతోంది .

దైనిక జీవితం లో మేష్టారు ,మేస్టరు ,టీచరు ,ఉపాధ్యాయుడు ,అధ్యాపకులయ్యారు . 

.

సెప్టెంబర్ అయిదు శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినోత్సవం .

అంటే ఉపాధ్యా దినోత్సవం అదే గురు పూజోత్సవం

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!