లటుకు ..చిటుకు!

ఇద్దరు స్నేహితులు తమ పూర్వీకుల గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకుంటున్నారు.

లటుకు : ఒకసారి మా తాతయ్య గడియారం బావిలో పడిపోయింది. దానిని ముప్పయ్యేళ్ళ తర్వాత బయటకు తీశారు. అప్పటికీ అది సరిగ్గానే పనిచేస్తుంది.

చిటుకు : ఓస్... అంతేనా! అందులో గొప్ప ఏముంది? ఒకసారి మా తాతయ్య బావిలో పడిపోయాడు. ముప్పయ్యేళ్ళ తర్వాత ఆయన్ని బయటకు తీశారు. అప్పటికీ ఆయన బతికే వున్నారు.

లటుకు : నిజమా! మరి ముప్పయ్యేళ్ళుగా బావిలో ఏం చేస్తున్నారు?

చిటుకు : ఏముంది! ముప్పయ్యేళ్ళ కిందట పడిపోయిన మీ తాతయ్య గడియారాన్ని వెదకుతూ ఉన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!