స్మరవారం వారం !

స్మరవారం వారం !

సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు.

శ్రీ సోమసుందరం గారు, శ్రీమతి పార్వతి ఇతని తల్లితండ్రులు.

శ్రీ తిరువశినల్లూర్ రామసుబ్బశాస్త్రి గారు ఇ!తని సంగీత గురువు. 

కంచి పీఠం లో శ్రీ శివేంద్ర సరస్వతి గారు ఇతని యొక్క తాత్విక గురువు. పరమహంస ముద్ర తో 23 కీర్తనలు రచించి స్వరపరిచారు. 

ఇవి తాత్విక పరిజ్ణానం తో, శ్రీ కృష్ణుని స్తుతిస్తూ, తత్వబోధనలను,

లీలామృతాన్ని పంచిపెట్టే కీర్తనలు. 

ఈ కీర్తనలే సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.

భారతీయ సంగీత ప్రపంచంలో ఈ కీర్తనలు కూడా

ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

ఎంతో మంది సంగీత వేత్తలు వీటిని ఆలాపించారు.

.

నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కీర్తన నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.

అది "స్మరవారం వారం" కీర్తన. శ్రీ బాలమురళీ కృష్ణ పాడిన ఈ కీర్తన 

మీరు కూడా వినండి.

శ్రీ జేసుదాస్ ఇదే కీర్తనని ఒక మళయాళం సినిమా కి పాడారు. 

అది చాలా పాపులర్ అయ్యింది.

.

స్మరవారం వారం 

రాగం: కాపి తాళం: ఆది

స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు 

భాష: సంస్కృతం

పల్లవి 

స్మర వారం చేతహ స్మర నందకుమారం (స్మర) 

చరణం 1

గోప కుటీర పయో ఘృత చోరం

గోకుల బ్రందావన స౦చార౦ (స్మర)

చరణం 2

వేణురవామృత పానకిశోరం 

విశ్వ స్థితిలయ హేతువిచారం (స్మర) 

చరణం 3 పరమ హంస హృత్పంజర కీరం

పటుతర ధేను బక సమ్హారం (స్మర)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!