సత్యస్వరూపుడు! (పోతనామాత్యుడు.)

సత్యస్వరూపుడు!

(పోతనామాత్యుడు.)

విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని; 

వలన నేర్పడు ననువర్తనమున 

వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై; 

తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి

వేదంబు లజునకు విదితముల్ గావించె; 

నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ

నికి నెండమావుల నీటఁ గాచాదుల; 

నన్యోన్యబుద్ధి దా నడరునట్లు

.

ఉపకరణాలు: పద్యంటీకాభావము 

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము

భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త

కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద, 

ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.

భావము:

ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; 

ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో;

ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో;

ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో; 

ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో;

ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, 

నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో 

ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని 

ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!