ఐకమత్యం..!


ఐకమత్యం..!
.
అనగనగా ఒక అడవిలో కోతుల గుట్ట ఉండేది. అక్కడ చాలా కోతులు, కొండముచ్చులు నివసించేవి. ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్దపెద్ద ఊడలతో అందంగా ఉండేది. ఆ మర్రిచెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకొంటూ ఉండేవారు.
కోతులు, కొండముచ్చులు ఎప్పుడు పోట్లాడుకునేవి. చెట్లకు కాసిన పళ్లు, కాయలు కోసుకుని తిని, చెరువులో నీటిని తాగి మర్రిచెట్టు మీద ఎగిరేవి. కొండముచ్చులు రాగానే కోతులు మర్రిచెట్టును వదిలి గుట్టల్లోకి పారిపోయేవి.
ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు. అవి అప్పుడప్పుడు ముని తపస్సును భంగపరిచేవి. ముని పట్టించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు.
ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి. దాంతో చెరువు ఎండిపోయింది. చెరువుని చూసి కోతులు, కొండముచ్చులు బాధపడ్డాయి. దాహం తీర్చుకోటానికి ఏం చేయాలో వాటకి తోచలేదు. అప్పుడే బుజ్జి కోతులు నీటి కోసం 'కిచకిచ'మని అరిచేవి. ముసలి కోతులకు కూడా కష్టమైంది. అవి నీటికోసం చాలా దూరం ప్రయాణించి మరో చెరువులో ఉన్న కొద్దినీటిని తాగి వచ్చేవి.
మునికి కూడా స్నానాకి, ఇతర కార్యాలకు నీటి కొరత ఏర్పడింది. అతడు కూడా దూరంలో ఉన్న మరో చెరువులో స్నానం చేసి, తన కమండలంలో కొంత నీటిని తీసుకుని మర్రిచెట్టు కింద తపస్సు చేసుకుంటుండేవాడు.
ఒకరోజు అతను తపస్సు చేసుకుంటుండగా ఒక కోతికి బాగా దాహంవేసి, దూరంగా ఉన్న మరో చెరువు దగ్గరకు పోలేక ముని కమండలంలోని నీటిలో మూతి పెట్టింది. ముని కండ్లు తెరచి చూశాడు. కోతికి భయం వేసింది. మునిని చూసి 'గుర్ర్‌' మని
భయపెట్టింది. ముని మాట్లాడలేదు. తిరిగి కండ్లు మూసుకొని తపస్సు చేసుకోసాగాడు. కోతి, నీళ్లు తాగి కమండలం కిందపడవేసి వెళ్లిపోయింది.
ఆ క్షణం అతడికి ఆ ప్రదేశం వదిలి మరోచోటికి వెళ్లి తపస్సు చేసుకోవాలనిపించింది. కానీ అడవిలో ఏ చోటైనా జంతువులు, పక్షులుంటాయని గ్రహించాడు. ఎండలకి అన్ని చెరువుల్లో దాదాపు ఎండిపోయిందని కనిపెట్టాడు. ఏం చేయటమా ....అని దీర్ఘంగా ఆలోచించాడు. అతడికి ఒక ఆలోచన తట్టింది.
వెంటనే మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ పూజ చేశాడు. కొబ్బరికాయ కొట్టి కండ్లు మూసుకుని నమస్కరించాడు. కొబ్బరి చిప్పలకై కోతులు, కొండముచ్చులు అక్కడ చేరుకున్నాయి. అతని ముందే కోతులు, కొండముచ్చులు పోట్లాడుకోసాగాయి.
ముని మొదటసారిగా గొంతువిప్పాడు. ''ఆపండి! మీ పోట్లాట! అంటూ అరిచాడు. ముని మాట్లాడటంచూసిన కోతులు అవి ఆశ్చర్యపోయాయి. అతని కళ్లలో ప్రకాశిస్తున్న దివ్యజ్యోతిని చూసి భయంతో తలవంచుకొని నిలబడ్డాయి. ముని- కోతుల నాయముడు, కొండముచ్చుల నాయకుడిని దగ్గరకు పిలిచాడు.
''వానరుల్లారా! మీ శక్తి అమోఘమైది. ఇలా కోతిచేష్టలతో మీ శక్తిని వృధా పరుచుకోకండి. మీ ఇద్దరూ ఎకమై నిలబడితే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించగలరు అన్నాడు ముని.
ఐక్యంగా ఉంటే ఏ పనైనా తేలికగా సాధించడం సాధ్యమేనా? అని కోతుల నాయముడు ప్రశ్నించాడు.
నిస్సందేహంగా- ''ఐకమత్యమే మహాబలం అని మరువకండి''. పట్టుదలతో ఉన్నవారికి ఏది అసాధ్యము కాదు.
మునీంథ్రా! మేము అనుక్షణం నీటి కోరత వల్ల మాలో కొన్ని కోతులు మరణించడం వల్ల. మా రెండూ జాతుల మధ్య వైరం ఏర్పడినది. మా దాహార్తిని తీర్చే మార్గం చూపించి పుణ్యం కట్టుకొండి.
మీ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తాను.
మీ కోతుల దండు అంతా ఏకమైతే మీ దాహాం తీరిపోతుంది.
''వానరులారా! నేను పూజచేసిన ఈ ప్రదేశంలో ఒక మంచి నీటిని బావిని తవ్వండి!
అందులో జలసీరి ఎగసిపడుతుంది. మీ కష్టాలు సమసిపోతామని అభయమిచ్చాడు మునీంధ్రుడు.
అంతే.....జాతివైరం మరచి, కోతులు, కొండముచ్చులు ఏకమయ్యాయి. బావి తవ్వకాని కావలసిన పలుగుపార, తట్టబుట్ట తీసుకోని బావి తవ్వడం ప్రారంభించాయి. రెండూ రోజులు కష్టపడి ఒక పెద్దబావిని త్వాయి. అందులో నుండి పాతాళ గంగ ఎగసిపడి కోతుల శ్రమను, అలసటను మరచిపోయేలా చేసింది. కోతులు, కొండముచ్చులు ఒకదానికోకటి తమ అభినందనలు తెలుపుకొని సంబరపడ్డాయి.
ఆ వానరనాయకులు తమ అనుచరులతో మునీంధ్రునికి ప్రణమిల్లి. మీ పట్ల అపచారంగా ప్రవర్తించినందుకు క్షేమించమని ప్రార్థించాయి.
అసలే కోతులు మీ బుద్ధి నిలకడగా ఉండదు కానీ, మీ సంకల్పం మాత్రం బహు గోప్పది.
మీవల్ల నలుగురికి మంచి జరగాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుందని ఆశీర్వదించాడు.
వనదేవత! మునీంధ్రుని ముందు ప్రత్యక్షమై....! వత్సా! నీ ప్రయత్నము అద్భుతము. నాడు శ్రీరాముడు లంకకు వారధికట్టి రావణ సంహారం కావించి, సీతకు రావణనుని చెరనుండి విముక్తి కలిగించాడు. నేడు ఈ వానరసేనతో పాతళగంగను భూమిపై గలగలపారించి అపరభగీరధుడవై నిలిచావు. నీకు సకల శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి, వనదేవత అదృశ్యమైంది.
మునీంధ్రుడు రెండూ కనులు మూసుకొని తన ధ్యానంలో నిమగ్నమయ్యాడు.x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!