Monday, October 15, 2018

ఈవిడ ఎవరు!

ఈవిడ ఎవరు!

.

పడమట దిక్కున వరద గుడేసె 

ఉరుముల మెరుపుల వానలు గురిసె 

వాగులు వంకలు ఉరవడి జేసె 

ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె


ఏరువాక సాగారో రన్నో చిన్నన్న 

నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న ..


అని పాడిన ఆ నాటి అమ్మయే కదు !

మురళి ధర హరే మోహన కృష్ణ.🌹 🏵️

మురళి ధర హరే మోహన కృష్ణ.🌹

🏵️


నంద లాలా యదు నంద లాలా


బృందావన గోవిందా లాలా


రాదే లోలా నంద లాలా


రాదే మాధవ నంద లాలా!

🏵️🏵️🏵️


నాచో నంద లాలా నందలాలా


స్మిత స్మిత సుందర ముఖారవిందా


నాచో నంద లాలా నందలాలా


మీరా కే ప్రభు లాలా నంద


నాచో నందలాలా నందలాలా


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

గోదావరిపిలిచింది!

గోదావరిపిలిచింది

🌅〰〰〰〰〰〰🌅

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం. 


కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.


ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.

తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.


అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు ‘‘మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ’’ అని.

‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.


1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళొనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.


కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. 

ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా? 

మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? 

వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?


‘‘కడియంలో కాసేపు ఆపాలయ్యా’’ డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు... ఎరుపూ, నలుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ... అదొక పూల సామ్రాజ్యం.


కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. ‘‘నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం’’ దక్షిణామూర్తి కూతురు అంది.

‘‘సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా’’ అంది దక్షిణామూర్తి భార్య హైమ.

‘‘అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని’’ కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.


బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- ‘‘అది ఎవరి విగ్రహం మామయ్యగారూ’’ అని.

హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పన్జేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా! 

చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.

దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.

అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.


మ్యూజియం ముందుభాగంలో 1840 లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు. 

కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.

ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.


‘‘ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం... ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.

అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.

ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572 లతో పని పూర్తిచేసి చూపించాడు’’... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.


‘‘మన వూళ్ళొ పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ’’ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.


ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.

మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.

‘‘వెళ్ళొస్తాం మామయ్యగారూ’’ అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.

‘‘సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి’’ కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.

ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.


దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, వూరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.

సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు ‘‘ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...’’

దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.

‘‘నాన్నా, బావున్నారా?’’ 

‘‘బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?’’ 

‘‘ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...’’ 

ఫోన్‌ అల్లుడికిచ్చింది. 


‘‘మామయ్యగారూ బావున్నారా?’’

‘‘బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?’’

‘‘అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా’’ మాటల్లో ఏదో తటపటాయింపు.

‘‘చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు’’

‘‘నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...’’ కిరణ్‌ చెబుతున్నాడు.

దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది.

‘‘అలాగే అల్లుడూ. 

మన వూరు వచ్చి, మన వూళ్ళొ బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను’’ సంతోషంగా అన్నాడు.

‘‘థాంక్స్‌ మామయ్యా’’


‘‘సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే’’ దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.

‘‘మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా!. 

మీరు మీ వూరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"


దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ.

‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...

నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా!

కాటన్‌ దొరా... నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.


దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా.


🌷🙏🌷🙏🌷🙏🌷🙏

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !

.

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.

ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక.

తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక స్వరోచిని, ఒక మనోరమను సృష్టించి పాఠకుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.

‘అట చని కాంచి’నదేమిటి?

పెద్దన హిమాలయాలను చూడనేలేదు. అల్లసాని పెద్దన కోకటం లేదా పెద్దనపాడు గ్రామాలకు చెందినవాడు. అందువల్ల సమీపంలోని ఇడుపులపాయ, గండి ప్రాంతాల్లోని కొండల్ని, లోయల్ని చూసి హిమాలయాలు ఇంతకన్నా పెద్దగా ఎత్తుగా ఉంటాయని ఊహించి వ్రాశాడు. పద్యంలో వర్ణించిన సెలయేర్లు, నెమళ్ళు వంటివన్నీ వర్షాకాలంలో ఇక్కడ అత్యంత సహజమైన విషయాలు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నెమళ్ళు, ఏనుగులు చాలా ఎక్కువ. ఆ తర్వాతి పద్యాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తాయి.

వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఒకే కవి వ్రాసిన నాలుగు వరుస పద్యాలు చెప్పమంటే చాలా తటపటాయించాల్సిందే! తిక్కన, శ్రీనాథుడు వంటి మహాకవుల గొప్ప పద్యాలు కూడా అలా వరుసగా లేవు. ఒక్క నన్నయ్యకు మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది. నన్నయ్య వ్రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలోని నాలుగు నాగస్తుతి పద్యాలు శబ్దార్థ సంధానంలో అపురూపమైనవి. ఉదంకుడు నాగరాజులైన అనంతుడు, వాసుకి, ఐరావతులు, తక్షకుడులను నలుగురిని నాలుగు పద్యాల్లో స్తుతించే సందర్భం! నిజాయితీగా చెప్పాలంటే నాగజాతి ప్రముఖులను స్తుతించే ఈ విధానం ‘నాగప్ప నాగన్న నాగరాజా... మా కష్టమంత బాపు తండ్రి నాగరాజా...!’ అనే జానపదుని హృదయ స్పందనే! అయితే నన్నయ్య నడిపిన చంపకోత్పల వృత్తాలు సాహిత్యంలో ఒక ఒరవడిని సృష్టించాయి.

ఏ సహృదయుణ్ణి అయినా రసప్లావితుణ్ణి చేస్తాయి. ‘సర సర’ మనే సర్పాల చలనాన్ని, ‘బుస్సు బుస్సు’మనే శబ్దాల్ని అవే శబ్దాలతో అర్థాన్ని కూడా సాధించి పాముల పద్యాల్ని వ్రాయడం నన్నయ్య పద్యశిల్పంలోని ప్రత్యేకత. ఊష్మాక్షరాలైన శ, ష, స, హలతో ఖ్ఛిఝజీ గౌఠ్ఛీజూట ఖ్ఛిఝజీ ఇౌట్ఛౌ్టట అయిన అంతస్థాలతో (య ర ల వ) నాలుగు పద్యాలూ బుస్సు బుస్సుమని నాలుగు పాములై కొన తోక మీద నిలబెడతాయి. శబ్దార్థాలు ఆది దంపతులవంటివన్న కాళిదాసు మాటను సార్థకం చేశాయి (వాగర్థావివ... రఘువంశం మొదటి శ్లోకం). అసాధారణమైన ఈ ధారణ ఎంతో ప్రయత్నించినప్పటికీ తమకు సాధ్యం కాలేదని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి చెప్పారు. నన్నయ్యలోని నిసర్గ ప్రతిభకు నమస్కరించారు. ఎందుకంటే శబ్దాలంకార రచన అక్షర రమ్యత కాదు కదా!

నన్నయ్య తరువాత దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పోతన ఈ శబ్దార్థ సమన్వయాన్ని అందుకున్నాడు. ‘మందార మకరంద మాధుర్యా’న్ని తెలుగుజాతికి అందించారు. పోతన తర్వాత 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన్న ఈ శబ్దార్థ సమన్వయాన్ని సాధించాడు. ఈగొప్ప శైలీ సృజనే అతన్ని ఆంధ్రకవితా పితామహుణ్ణి చేసింది.

మను చరిత్ర కావ్య ప్రపంచంలో అడుగు పెట్టిన వారందరికీ- సిద్ధుని రాక, ప్రవరునికి పాద లేపం ఇవ్వడం, ఆ లేపన ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళడం, మధ్యాహ్నం కావడం, పాద లేపనం కరిగిపోవడం, అతిలోక లావణ్యవతి వరూధినిని చూడడం, వరూధినీ ప్రవరుల సంవాదం, వరూధిని మనసు విప్పి తన కోర్కెను వెల్లడించడం, ప్రవరుడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం, అగ్ని దేవుని ప్రార్ధించి అతడు తన నగరానికి వెళ్ళిపోవడం, మాయా ప్రవరుడు మాయ మాటలతో మరూధినిని నమ్మించి ఆమెతో సంగమించడం, స్వరోచి జననం- ఈ ఘట్టాలన్నీ పాఠక హృదయాలపై గాడమైన ముద్ర వేస్తాయి. మానవుల్లోని ప్రవృత్తి మార్గానికీ, నివృత్తి మార్గానికీ మధ్య పోరాటమే మను చరిత్ర కథా వస్తువు. భోగలాలసతకు, ఇంద్రియ నిగ్రహానికీ జరిగిన సంగ్రామమే ఈ ఇతివృత్తం.

సమర్ధుడైన రాయల పాలనలో సకాలంలో కురిసే వర్షాలతో, కరవు కాటకాలు లేక, చీకు చింత లేక సుఖమయ జీవితాన్ని గడిపారు ఆ నాటి ప్రజలు. ఆనాడు వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మారంటే ప్రజలెంత సంపన్నులో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు భోగ లాలసులై తృతీయ పురుషార్ధ సాధననే జీవన పరమార్ధమని భావించారు. అలాటి ప్రజలకు ధర్మకార్య నిర్వహణలోని గొప్పతనాన్ని, నియమబద్ధ జీవితంలోని ప్రశాంతతను, ఇంద్రియ నిగ్రహంలోని ధార్మికతను, మానవ జీవన తాత్త్వికతను వివరించి చెప్పడమే పెద్దన కవితా రహస్యం.

పెద్దన పండితుడు, కవితా మర్మజ్ఞుడు, ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు. వీటన్నిం టినీ మించిన రసికుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు పెద్దనను ఒక కావ్యం రాయమని అడిగినపుడు- కావ్యం రాయాలంటే రమణీయ స్థలం, తన మనసులో ఊహ తెలుసుకోగలిగే లేఖక పాఠకులు, ఉయ్యాల మంచం, నచ్చిన భోజనం- వీటితో బాటు పరిమళించే కర్పూర తాంబూలమం దించే అందమైన అమ్మాయి కావాలని చెప్పిన రసిక హృదయుడు పెద్దన.

మామూలుగా ప్రబంధాలలో అష్ఠాదశ వర్ణనలుంటాయి. నాయికా నాయకుల వర్ణన, నగర వర్ణన, ఋతు వర్ణన, వేట వర్ణన, చంద్ర వర్ణణ- ఇలా ఎన్నో వర్ణనలుంటాయి. ఈ వర్ణనల మధ్య చక్కని కథా కథన చాతుర్యంతో ప్రాణం తొణికిసలాడే పాత్రల హృదయాంతర్గత అనుభూతులను పనస తొనలు ఒలిచి పెట్టినట్టు పాఠకుల అరచేతుల్లో అందంగా అమర్చి పెట్టాడు పెద్దన.ప్రబంధాల్లో గానీ, పురాణేతిహాసాల్లో గానీ, వాస్తవ ప్రపంచంలో గానీ ఇష్టానై్ననా, ప్రేమనైనా, స్నేహానై్ననా, మోహానై్ననా, ఏ భావానై్ననా ముందుగా ప్రకటించేది పురుషులే. పురుషాధిక్య ప్రపంచంలో స్ర్తీల కెప్పుడు స్వీయాభిరుచులు, అభిప్రాయాలు ఉండవు. ప్రేమలోనైనా, పెళ్ళిలోనైనా మగవారి భావాలకే ప్రాధాన్యం, ఎక్కడో రాజుల్లో, స్వయంవరాల్లో తప్ప.

అక్కడైనా పరాక్రమమో, సాహసమో ఏదో ఒకటి శుల్కంగా నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడో రుక్మిణి వంటి వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు- తాము వరించిన వారిని చేపట్టిన భాగ్యశాలురను.

అందుకే ఏ ప్రబంధంలోనైనా నాయికలకు కాళ్ళు, చేతులు ఉంటాయి గానీ తన ఇష్టాలను చెప్పే నోరుండదు. కను విందు చేసే అవయవాలుంటాయి గానీ కనిపించని మనసుండదు. అందుకే ప్రబంధ పాత్రలన్నీ చలనం లేని కొయ్య బొమ్మలు, ప్రాణం లేని మట్టి ముద్దలు. కానీ మూస పోసిన ప్రబంధాలకు విరుద్ధంగా పెద్దన మను చరిత్రలో పాత్రలకు రంగు, రూపం, జీవం, జవం, భావం, రాగం అద్ది తన కలం కుంచెతో ఎప్పటికీ వెలిసి పోని చిత్రాలుగా ప్రాణం పోశాడు.

మను చరిత్ర ప్రబంధ నాయకుడు ధర్మకర్మ దీక్షా పరతంత్రుడైతే, నాయిక పల్లవించే ప్రణయ రాగ రాగిణి. ఆధునిక కాలంలో తొలి చూపులోనే ప్రేమ పరిమళించినట్టు అలేఖ్య తనూ విలాసుడు, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ప్రవరుని సమ్మోహన రూపాన్ని చూసిన వెంటనే వరూధిని మనసు పారేసుకుంటుంది.

తీర్థయాత్రా ప్రేమికుడైన ప్రవరుడు పాదలేపనం మహిమతో హిమాలయాలకు వెళ్ళడం మను చరిత్రలో కీలక ఘట్టం. అతడెంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ వెండి కొండల సౌందర్య వైభవానికి పరవశించి జగము మరచి తనువు మరచి పోవడమే కావ్యంలో రసవద్ఘట్టం.

పాదలేపనం కరగి పోవడంతో అతడు తన ఊరికి వెళ్ళలేక పోతాడు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా కనబడతారేమోనని, తన ఊరికి దారి చెబుతారేమోనని అటు, ఇటు తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న ప్రవరుణ్ణి చూడగానే అతని అందానికి వరూధిని కళ్ళు పెద్దవవుతాయి ఆశ్చర్యంతో. ఆమెను చూసిన ప్రవరుడు- ఓ భీత హరితేక్షణ! నీవెవరివి? ఈ వన భూముల్లో ఒక్క దానివే విహరిస్తున్నావు. నన్ను ప్రవరుడంటారు. ఈ పర్వతానికి వచ్చి దారి తప్పాను. మా ఊరికి దారి చెప్పు- నీకు పుణ్యం ఉంటుందని అడుగుతాడు. అప్పుడు వరూధిని- ఇంతింత పెద్ద పెద్ద కళ్ళున్నాయి గదా నీకు ‘మా ఊరికి దారేది?’ అని అడుగుతున్నావు. ఏకాంతంగా ఉన్న నాలాటి యువతులతో ఏదో విధంగా మాటలాడాలని కోరికే గానీ నీవొచ్చిన దారి నీకు తెలియదా? కొంచెం కూడా భయం లేకుండా అడగడానికి మేమింత చులకనయ్యామా?- అని డబాయిస్తుంది.

ఆ తర్వాత వరూధిని తన వంశ ప్రఖ్యాతిని గురించి చెబుతుంది. రంభ మొదలైనవాళ్ళంతా తన చెలికత్తెలని, వాళ్ళంతా ఎప్పుడూ హిమాలయ పరిసర ప్రాంతాల్లోనే విహరిస్తారని చెప్తూ, మిట్టమధ్యాహ్నం ఎండకు బంగారం లాంటి నీ శరీరం కందిపోయింది. మా ఇంటికి వచ్చి బడలిక తీరేంతవరకు విశ్రాంతి తీసుకొనమని బతిమాలుతుంది. అప్పుడు ప్రవరుడు ‘ఇక్కడ నేనుండడానికి వీలు పడదు. మధ్యాహ్నిక కార్యక్రమాలు తీర్చడానికి ఇంటికి వెళ్ళి తీరాలి. దయ చేసి మాయింటికి వెళ్ళే దారి చెప్పి ఉపకారం చేయమని అడుగుతాడు. ఎక్కడి మనిషివయ్యా నీవు? మాటి మాటికి ఇల్లో, ఇల్లో అని కలవరిస్తున్నావు. ఇక్కడున్న ఈ రత్నాల భవనాలు, చందన వనాలు, గంగానది ఇసుక తిన్నెలు, పొదరిళ్ళు అన్నీ మీ కుటీరాలకు సాటి రావా? అని అంటూ- ఆ మాటల్లో అంతరార్ధము గ్రహించలేని అమాయకుడని వ్యాచ్యంగా తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతుంది.

‘నిక్కము దాపనేల ధరణీ సర నందన యింక నీపయిన్‌/ జిక్కె మనంబు నాకు నను జిత్తజు బారికి నప్పగించెదో/ చొక్కి మరంద మద్యముల చూఱల బాటల పాడు తేంట్ల సొం/ పెక్కిన యట్టి పూవు బొదరిండ్లను గౌగిట గారవించెదో’ అంటుంది. తెలుగు సాహిత్యంలో వందల కొద్దీ ప్రబంధాలున్నాయి. ఎందరో కవులు కసిదీరా తమ కావ్యనాయకల శరీరాలను వర్ణించారు. కానీ ఏ కవీ కూడా అమెకొక మనసుందని చెప్పలేదు. తన నాయిక నోట ‘మనసు’ అనే మూడక్షరాల పద ప్రయోగం చేసినవాడు పెద్దన ఒక్కడే. అలా తన కావ్యనాయిక చేత ‘మనసు’ అనే ముత్యమంత మాటను తొలిగా ప్రయోగించిన పెద్దన కవీంద్రులకు శతకోటి వందనాలు!

వరూధిని ఇలా తన అభిప్రాయాన్ని ఏ డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పినా, నిశ్చల మనస్కుడైన ప్రవరుడు - తల్లీ! వ్రతులై రోజుల్ని గడిపే విప్రులను కామించవచ్చునా? నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలికి ఆగలేరు. నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. దేవ కాంతలు మీకు అసాధ్యాలు లేవు గదా! నేనిల్లు చేరే ఉపాయం చెప్పమంటాడు.‘ఓ ప్రవరుడా! ఓ మానవుడు తన జీవితంలో అనుభవించ దగిన సకల సామగ్రి ఇక్కడే ఉన్నాయి. భోగివై నన్ననుభవించు.

వెన్నలాగా కరగిపోయే స్ర్తీల పరిష్వంగం లో సుఖ పడే అదృష్టం ఎప్పుడు వస్తుంది’ అని ప్రలోభపెడుతుంది. అయినా ప్రవరుడు నిశ్చల మనస్కుడై ‘బ్రాహ్మణుడు ఇంద్రియ వశుడవకూడదు. అలా ఐతే బ్రహ్మానందాది రాజ్యంనుంచి భ్రష్ఠుడౌతాడు’ అని తన మాటమీదే నిలబడతాడు. అప్పుడు వరూధిని ‘చిమ్మీలో ఉన్న దీపంలా ఇంద్రియాలన్నీ ఏ విషయంలో సుఖ పారవశ్య స్థితి పొందుతాయో అదే బ్రహ్మానందమని విజ్ఞులు చెప్పలేదా’? అని ఆనందానికి తన నిర్వచనం చెప్తే, ప్రవరుడు ‘వ్రతులైన భూసురులను కామించవచ్చా! తక్షణం నేనింటికి వెళ్ళాలి’ అని అదే మాట మీద పట్టుదలగా నున్నప్పుడు- ‘నీ యవ్వనమంతా కర్మలు చేసినట్లైతే భోగాలనుభవించేదెప్పుడు? ఎన్ని క్రతువులు చేసినా మా పరిష్వంగ సుఖం అందుకోవడానికే గదా! గంధర్వాంగనల పొందు అందరికీ లభించదు. స శరీర స్వర్గ సుఖాలు కోరి వరిస్తుంటే వ్రతాలు చేసి ఇంద్రియాలను బాధ పెట్టడం న్యాయమా’? అని వాదిస్తుది.

‘నీవు చెప్పిన విషయం కాముకునికి వర్తిస్తుంది. బ్రహ్మ జ్ఞానికి కాదు. మాకు అరణులు, దర్భలు, అగ్ని- ఇవే ఇష్టం. ఈ తుచ్ఛ సుఖాలన్నీ మీసాల మీద తేనెలే’ అని తన నిరాసక్తతను వెల్లడిస్తాడు.

ఎన్ని రకాల మాటల ఆయుధాలను ప్రయోగించినా తాను ఓడిపోయే సరికి ఉక్రోషంతో వరూధిని ప్రవరుని పరిష్వంగించి ముద్దు పెట్టుకోబోగా ప్రవరుడామె భుజాలను పట్టి తోసేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రోషంతో ‘చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయా విహీనతన్‌/ జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్నియేనియున్‌/ జేసిన వాని పద్ధతియె చేకుఱు భూత దయార్ద్ర బుద్ధికో/ భూసుర వర్య యింత తల పొయవు నీ చదువేల చెప్పుమా’? అని బాధపడుతూ ఎన్నో మాటలంటుంది.

ఆ తర్వాత ప్రవరుడు అగ్ని దేవుణ్ణి ఆరాధించి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఎన్ని విధాలుగా వాదించినా తన కోరిక నెరవేరలేదని ఆమె దుఃఖగీతిక అవుతుంది. అంతకు ముందు వరూధిని తిరస్కారానికి గురైన గంధర్వుడు ప్రవరుని వేషం ధరించి అక్కడే తిరుగుతుంటాడు. ఎప్పటినుంచో కోరుకున్న వరం దక్కినట్టు వరూధిని సంతోషంతో అతని చెంతకు చేరుతుంది. ఒక షరతు పెట్టి గంధర్వుడు ఆమె కోరికకు ఒప్పుకుంటాడు. ప్రవరుడు అంగీకరించాలే గానీ దేనికైనా సిద్ధమే గదా ఆమె. కానీ ఆ సందర్భంలో మాయా ప్రవరుడు వరూధినితో- ‘నీ పరిష్వంగంలో పొందే పారవశ్యాన్ని తిరస్కరించడానికి నేనేమైనా సన్యాసినా? కానీ ఎందుకో ఆ విషయంలో నాకు కోరిక లేదు. ఒక అనాశ్వాసితమైన దుఃఖం ఆ సుఖాన్ని దుర్భరం చేస్తుంది’ అని అంటాడు. తాను వలచిన స్ర్తీని మరొకరి రూపం ధరించి మోసం చేసినవాడు ఇలా అనడమే గొప్ప ఆశ్చర్యం. మాయా ప్రవరునితో కొన్ని ప్రవర లక్షణాలు, ప్రవరునిలో కొన్ని మాయా ప్రవర లక్షణాలు సృష్టించాడు కవి.

మొదట హిమాలయానికి వచ్చిన ప్రవరుడు ఆ వైపు వచ్చిన తాంబూల పరిమళ సమ్మిళిత వాయువును బట్టి ఇక్కడెవరో జనమున్నారని అనుకుంటాడు. అది మామూలు తాంబూలం కాదు. కస్తూరి ఒక వంతు, కర్పూరం రెండింతలు ఉన్న తాంబూలం. అలాంటి తాంబూలాన్ని స్ర్తీలు మాత్రమే వేసుకుంటారు. ప్రవరుడు కేవలం నైష్టికుడైతే ఈ విషయం తెలియదు. నిత్యం తాంబూల సేవానురక్తులకే ఈ విషయం తెలుస్తుంది. ప్రవరుడు కేవలం నైష్టికుడే కాదని, అతని అంతరంగం లోలోపలి పొరల్లో ఒకింత రసికత ఉందని ఈ పద్యం వలన తెలుస్తుంది.

ఈ వరూధిని కేవలం మను చరిత్రకే, ఒక పుస్తకానికే పరిమితం కాదు. ఈ వంచిత కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. వాస్తవ ప్రపంచంలో ప్రవరుల కన్నా మాయా ప్రవరులు కూడా ఎక్కువే. పెళ్ళి చూపుల్లో వరుడు సకల సద్గుణవంతుడు అని చెప్తారు. కానీ, పెళ్ళయిన మర్నాడే అతని విశ్వ రూపం ప్రదర్శితమవుతుంది. పాపం! వరూధిని, సుర గరుడ గంధర్వులే మోహించిన సౌందర్యవతి ఐనా కోరుకున్నవాణ్ణి వరునిగా పొందలేకపోగా అతనిచే ఘోర తిరస్కారానికి, అవమానానికి గురైన ఒక పరాభవ గీతిక. మాయా గంధర్వుని చేతిలో మోసపోయిన ఒక అమాయక ప్రాణి. పెద్దన కేవలం కవే గాదు. చేయి తిరిగిన చిత్రకారుడు కూడా. కను రెప్పలు కూడా ఆర్పలేని ఎన్నో రంగుల చిత్రాలను చిత్రించాడు తన ప్రబంధంలో. దానిలో వరూధిని చిత్రాలే ఎక్కువ.

అల్లసాని పెద్దన ఊరేగుతోంటే విద్యానగర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయలు...పల్లకీ మోసాడు లాంఛనంగా... అల్లసాని వారి పాదాలు కడిగీ - స్వయంగా గండ పెండేరం తొడిగాడు!

ఈ పద్యం తెలియని తెలుగు వాడు ఉండడనడంలో అతిశయోక్తి లేదేమో...

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర్ఝజరీ

పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్.........

Sunday, October 14, 2018

ఉపమా విశ్వనాథస్య!

ఉపమా విశ్వనాథస్య!

-


విశ్వనాథ ఉపమానాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఇంతకుముందు ఎక్కడా మనకు కనిపించవు. తర్వాత కనిపించడం లేదు. కారణమేమంటే విశ్వనాథ చూపు వేరు.


- ఆమె మంచముపై పరున్న గోధుమవన్నె త్రాచువలెనున్నది.


- ఒంటినిండ మసి పూసికొనిన దొంగవలె సంజ చీకటి తొంగి చూచినది.


- జొన్న చేనిలో మంచెయే గాని సౌధము.


- ఆమె వదనము పావురాయి పొట్టవలె మృదువుగా తళతళలాడుచున్నది.


- ఆమె కంకె విడిచి మురువు వొలుకు పంటచేను.


- ఆ సువాసనల చేత దీపం ఆరిపోవునేమోనని భయపడితిని.


- ఇంద్ర ధనుసు ముక్క పులి తోకలా ఆకాశంలో కనిపిస్తోంది.


- శరదృతువులో కొంగలబారు ఎగురుతుంటే, ఆకాశమనే పాముల చిన్నదాని మెడలోని నత్తగుల్లల పేరులా వుంది.


- గుమ్మడి పువ్వులో కులికే మంచు బిందువు, తట్టలో కూర్చుండబెట్టిన నవవధువులా తోచింది.


- గుండెలపై బోర్లించి పెట్టిన పుస్తకము వలె పసివాడు పడుకున్నాడు.

🙏🙏🙏దేవీ స్తుతి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవీ స్తుతి.🙏🙏🙏🙏🙏🙏🙏


👉ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. 

సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"


సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.


పోతనగారి తెలుగు భాగవతం ప్రధమ స్కందం లో 8 వ పద్యం ఇది.


"శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 

హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మం

దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ "


బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించారు. సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు. ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృ మూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు. అందరూ అనుకునే మాట సరస్వతి తెలుపు రంగులో ఉంటుందని. పోతన గారు తన ఊహలకు పదును పెడుతున్నారు.


శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ ; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.


భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


వావివరుస !

వావివరుస !

వావి- ప్రాసకోసం ఏర్పడిన అర్థరహిత పదం కాదు.

వావి అంటే చుట్టరికం. వావివరుస అంటే చుట్టరికపు వరుస. కన్నడలో కూడా

వావి- అన్న పదం బంధుత్వము అన్న అర్థంలో వాడుతారు. మహాభారతంలో ఊర్వశి అర్జునినితో నేను నీకు తల్లి వరుస ఎలా అవుతాను అని అడుగుతూ ఇలా అంటుంది:

-

నీకు నేనాటి తల్లిని నిజము సేపుము

యమరలోకంబు వేశ్యలమైన మాకు

నిట్టి తగవులు నడవ వహీనబాహు

ఇచ్చట వావులు వెదకజనదు (నన్నయ అరణ్యపర్వం 1. 362) 

🌷 దసరా పాట🌷

🚩🚩🚩🚩🚩🚩🚩🚩


🌷 దసరా పాట🌷


దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే

ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...


ఇదే ఆ దసరా పాట


పల్లవి-


1⃣

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!


దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక ఇవ్వలేమనక !


ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!


శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2⃣


పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


3⃣

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


*

దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.


పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.


లోగుట్టు


ఒక వ్యక్తి అభివృద్ధి గాని

కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.


ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.

వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి

ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.


పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.

ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు

విద్యార్ధులకు 

ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.

దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.

ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.


అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.

ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...

💐💐💐💐💐💐


వేములవాడ భీమకవిశాపం !

వేములవాడ భీమకవిశాపం !

.

సన్మానికి పిలిచి తనెక్కి వెళ్ళిన గుర్రాన్ని కూడా లాగేసుకున్న


పోతరాజును కసి తీరా తిట్టి శపించిన వేములవాడ భీమకవి.


బహుశః మనకున్న తొలి చిత్రకవి శాపానుగ్రహ సమర్థుడై


కవిరాక్షసుడిగాపేరు తెచ్చుకున్న వేములవాడ భీమకవి.


ఇతను నన్నయ కాలానికి కొంచెం ముందు వాడై ఉండొచ్చు.


ఇతని ఒక పద్యం

హయమది సీత; పోతవసుధాధిపు డారయ రావణుండు; ని


శ్చయముగ నేను రాఘవుడ; సహ్యజ వారిధి; మారు డంజనా


ప్రియతనయుండు; లచ్చన విభీషణు; డా గుడిమెట్ట లంక; నా


జయమును పోతరక్కసుని చావును ఏడవ నాడు చూడుడీ!


తనకు సన్మానం చెయ్యకపోగా మనకు తెలీదు గాని అంతటి కోపం


లోనూ చాలా చక్కటి పద్యం చెప్పి మరీ తిట్టేడు కవిరాక్షసుడు. 

.

ఈ పద్యం “హ” తో మొదలు పెట్టి తిట్టటం వల్ల అతను


“హతు”డయ్యాడని కొందరు ఛందోవిశేషజ్ఞులు వివరిస్తారు.

Friday, October 12, 2018

🍀విధిరాతను తప్పించలేరు🍀

🍀విధిరాతను తప్పించలేరు🍀

దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు- అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. "అక్కడ ప్రతి ప్రాణీ తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు" అని ప్రకటించాడు.


దాంతో చాలా మంది ఎక్కడెక్కడినుండో చేరుకున్నారక్కడికి. వరసగా అందరూ సభ లోకి వెళ్తున్నారు. 

ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరినీ మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి పోతున్నారు. 

ఇంద్రుడి పిలుపును అందుకొని యమ- ధర్మరాజు కూడా వచ్చాడు, ఆ సభకు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక.


యముడు మృత్యువుకు అధిపతి: ఏ ప్రాణి ఎప్పుడు, ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ-పోతూ, వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి, చిలుక వైపుకు తిరిగి చూసి- నవ్వాడు కూడా!


అప్పటివరకూ సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది- "ఎందుకు, ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు?" అని బెంగ మొదలైంది.


క్షణ క్షణానికీ దాని బెంగ ఎక్కువైంది. కొద్ది సేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలు పెట్టాయి. వాంతి వచ్చినట్లయింది- అంతలో పక్షిరాజు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు- ఏం చిలకమ్మా, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు; నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను" అన్నాడు.


చిలుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. "నీకు గాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామీ! మా పక్షులందరికీ పెద్ద వాడివి నువ్వే కదా! అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను- ఇందాక యముడు సభ లోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ మళ్ళీ‌ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నావైపు చూసి నవ్వాడు కూడా! నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తుకొచ్చినకొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడినే వేరుచేసి ఎందుకు చూస్తాడు యముడు? నాకిప్పుడు మనసు మనసులో లేదు. ఇక ఎవ్వరినీ స్వాగతించలేను.


ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తున్నది. నా వెంటపడి తరిమే మృత్యువుకి అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది" గరుడుడికి చెప్పుకొని ఏడ్చింది చిలుక.


"ఓసి! ఇంతేనా! నువ్వు దిగులు పడకు! నిన్ను నేను కాపాడతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాలకోసం‌ వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షి జాతి దానివి నువ్వు- ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను- పద; నీకెందుకు భయం!" అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకు-న్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి- "బాగుందా, ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు- అది నీ సొంతం అవుతుంది. ఇక భయపడవుగా?! నేను సభకు వెళ్ళొస్తా మరి- ఉండు!" అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు.


సభంతా ముగిసిన తరువాత అందరూ బయలుదేరి బయటికి వస్తున్నారు. యమ-ధర్మరాజు కూడా బయటికి వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. చిలుక అక్కడ లేదు! యముడి నొసలు ముడి పడ్డాయి. ఆయన అటు వైపు వెళ్ళి, చిలుక కోసం వెతకటం మొదలు పెట్టాడు.


అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి, యముడిని చూసి నవ్వాడు- "ఏమి యమధర్మరాజా! ఏదో వెతుకుతున్నావు?" అని అడిగాడు.


"ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది ఇందాక- 'అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా' అని వెతుకుతున్నాను" అన్నాడు యముడు. 

గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు- "ఏమి, దాని ప్రాణాలను తీసుకు పోదామనుకున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు.


నువ్వు ఇందాకదాన్ని చూసి నవ్వావట గదా- అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి, నీకు అందని చోట- దేవలోకంలో- దాచి వచ్చాను" అన్నాడు.


"అయ్యో!‌ ఎంత పని చేశావు!" అన్నాడు యముడు, తల పట్టుకొని.


"ఏమైంది?" అడిగాడు గరుడుడు.


"ఇందాక నేను దాన్ని చూసి, దాని మరణం ఏవిధంగా ఉండనున్నదో చదివాను- 'కొద్ది సేపటిలో ఈ చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోతుంది' అని రాసి ఉంది దాని నుదుటన! 'భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎట్లా పోతుంది? -అదీ కొద్ది సేపట్లో ఎట్లా పోతుంది?- పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? -అంతా అబద్ధం; జరిగే పని కాదు!' అనుకొని నవ్వాను నేను! చూడగా నువ్వు విధివ్రాతను నిజం చేసినట్లున్నావు- ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో!" అన్నాడు యముడు బాధగా.


ఆ సరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోయి ఉన్నది!


"చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే!" అని బాధపడుతున్న గరుడుడిని ఓదారుస్తూ యముడు అన్నాడు-"విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడరాజా, నేను కూడా‌ విధివ్రాతకు లోబడి వర్తించాల్సిందే!" అని.

అభిమన్యుని అస్తమయంపై అర్జునుని ఆక్రోశం ! 👇

అభిమన్యుని అస్తమయంపై అర్జునుని ఆక్రోశం !


👇

.

"చతురంభోధిపరీతమైన ధరణి న్శాసింతు వీ వంచు న

మ్మితి; నీ రీతిగ దిక్కుమాలి రణభూమిం గూలితే! కేశవ

ప్రతిరూపంబగు నీ పరాక్రమము వ్యర్థంబాయెనే! పోర నా

కుతుకం బంతయు నీటఁ బుచ్చినవిగా! కుఱ్ఱా! జగన్మోహనా!"


(పాండవ విజయం నాటకం - తిరుపతివేంకటకవులు)


👉అర్థములు: 

చతురంభోధిపరీతమైన = నాలుగు సముద్రములచే చుట్టబడిన; ధరణిన్ = భూమిని; శాసింతువు = పరిపాలించెదవు; అంచు = అని; రణభూమిన్ = యుద్ధరంగములో; కేశవుడు = శ్రీకృష్ణుడు; పోర = పోరాడుటకు, యుద్ధం చేయుటకు; కుతుకంబు = ఉత్సాహము, కుతూహలము; నీటఁ బుచ్చినవిగా = నీటిపాలైనవి కదా!; జగన్మోహనా = జగత్తును మోహింపజేసేటంత అందమైనవాడా!

👉భావము: 

తన పుత్రుడైన అభిమన్యుడు నిహతుడైనాడని తెలిసిన అర్జునుని విలాపము. 

"హా కుమారా! ముక్కుపచ్చలారని కుఱ్ఱవాడివే!

సర్వులనూ మోహింపజేసేటంతటి సుందరాంగునివే! 

నీకు ఈ గతి పట్టినదా తండ్రీ! చతుస్సముద్రములచే చుట్టబడిన ఈ వసుధను నీవు ప్రజానురంజకముగా పాలించగలవని ఎంతో విశ్వసించాను. ఈవిధంగా దిక్కుమాలినరీతిలో ఈ రణరంగములో కూలిపోయావా! 

నీ మేనమామయగు అచ్యుతుని రూపం, నీలో అచ్చుగుద్దినట్లుగా ఉంటుందే! నీ శౌర్యపరాక్రమమంతా వ్యర్థమైపోయినదా నాన్నా! 

నీ నిష్క్రమణముతో, శత్రువులతో పోరాడుటకు నాకు గల ఉత్సాహమంతా గంగలో కలిసిపోయినదిరా!" అని పలవిస్తున్నాడు పార్థుడు.


👉"పాండవ విజయం" లో వీరం ఎంత పొంగులువారుతుందో.

శోకం అంత శ్రోతస్వినిలా సాగుతుంది. 

అందులోనూ అభిమన్యువధా ఘట్టం పరమ హృదయవిదారకం. ఎవ్వరినైనా కంటతడి పెట్టించగల కరుణరసాన్విత సన్నివేశం. అర్జునపుత్రుడు అభినవ కేశవుడు, అపరకిరీటి. తండ్రుల పరువును కాపాడుటకై తమ్మిపూవువ్యూహము (పద్మవ్యూహం) లో తలదూర్చాడు. పెదతండ్రులు కోరడమే తన బ్రతుకునకు పెద్దపండుగ అనుకున్నాడు. అతని అదృష్టానికి సైంధవుడు అడ్డుపడ్డాడు. కురువీరులందరూ కలిసి అధర్మయుద్ధానికి తలపడ్డారు. అభిమన్యుడు సింహములా వీరవిహారం చేసి, వీరస్వర్గమును అలంకరించాడు.

తెలుగువారు తమ పౌరుషాన్ని అభిమన్యునిలో చూసుకుంటారు... పుత్రశోకం ధర్మజునిలో నిబ్బరంగా నిండుకుంటుంది; పార్థునిలో కట్టలు త్రెంచుకుని ప్రవహిస్తుంది.... కరుణరస కాసారం అభిమన్యుని సంహార సన్నివేశం!


👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉

Thursday, October 11, 2018

🙏అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి🙏

🙏అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి🙏


🤲🤲🤲


అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. 

రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. 

వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు


గణపతి శాస్త్రి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం విజయనగరం జిల్లా) లోని కలవరాయి అగ్రహారం లో నవాబు అయ్యల సోమయాజుల అనే ఇంటి పేరుగల బ్రాహ్మణుల కుటుంబంలో అయ్యన సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా జన్మించాడు.వీరి అసలుపేరు అసలు పేరు సూర్య గణపతిశాస్త్రి.వారు ఋగ్వేదులు, మరియు కౌండిన్యస గోత్రులు.


1900లో విజిగీషతో నవద్వీప విద్వత్పరీక్షలకు వెళ్ళగా, అక్కడ సభలోని పరీక్షక వర్గం వారు ఇతని కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి 'కావ్యకంఠ' బిరుదుతో అభినందించారు. 1903లో మద్రాసులో నారాయణ సుదర్శనునితో పోటీలో ఆరు నిమిషాలలో కావ్యకంఠుడు ఇరవై శ్లోకాలను రచించి బంగారు కడియాన్ని బహుమానంగా పొందారు. 1902లో అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వీరు శివుని సహస్ర శ్లోకాలతో స్తుతించి అక్కడ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. తరువాత వేలూరులో తెలుగు పండితునిగా దాదాపు నాలుగు సంవత్సరాలు నిర్వర్తించారు.


కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించారు. భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు. నవద్వీపంలో పండితుల సమక్షంలో వారి అభిమతం మేరకు 18 శ్లోకాలలో భారతగాథను ఆశువుగా చెప్పి ‘కావ్యకంఠ’ బిరుదు పొందారు. అరుణాచలంలో ఉన్న బ్రాహ్మణస్వామిని రమణమహర్షిగా మార్చారు.


చివరకు 1907లో దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళారు. అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షిని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించారు. తరువాత ఈశ్వరిని స్తుతిస్తూ 'ఉమా సహస్ర' అనే గ్రంథాన్ని రచించారు. ఋగ్వేదం నుండి విదితమైన భారత చరిత్రాంశాలను నిరూపించు 'భారత విమర్శ' అనే గ్రంథం ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు మించిన సత్యదర్శిని వంటిది. డెబ్బైఐదు వరకు ఉన్న వీరి గ్రంథాలలో కొన్ని మాత్రమే ముద్రించబడ్డాయి. వీరు 1924లో కాంగ్రెసులో చేరి, తమిళనాడు కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులయ్యారు. సంఘ సంక్షేమం కోసం అస్పృశ్యతా నివారణను సమర్ధించి, దానిని శాస్త్రీయ దృష్టితో పోషించడానికి 'పంచ జన చర్చ' అనే వ్యాసాన్ని రచించారు.


923 డిసెంబరులో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. 1924లో ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెల్గాంసభలో … అస్పృశ్యత నివారణ శాస్త్రసమ్మతమని ప్రసంగించారు. హైదరాబాదులో ఆది హిందూసంఘం (హరిజనులు) వారు పల్లకిలో ఊరేగించి, సత్కరించి… ‘ముని’ బిరుదునిచ్చారు. ఒకపక్క తపస్సు ద్వారా అమ్మవారి దర్శనం, వివిధ రచనలు చేస్తూనే, మరోపక్క దేశోధ్ధరణకు పూనుకున్నారు.భారతీయుల పట్ల బ్రిటిష్‌వారి అమానుష ప్రవర్తనకు ఎంతో బాధపడిన నరసింహశాస్త్రి ప్రజలు ధర్మాలను ఆచరించకపోవడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని విచారించారు. సనాతన ధర్మాన్ని నెలకొల్పగల శక్తి సామర్థ్యాలుగల కుమారుడిని అనుగ్రహించమని తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:


"'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.

జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను. అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి. తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).


'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని జూలై 27, 1936లో మరణించారు. ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంథములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.


గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. ఈ జీవిత చరిత్ర మొదట 1958 లో ప్రచురింపబడింది.

Tuesday, October 9, 2018

శివుడు మిమ్ము రక్షించుగాక!

శివుడు మిమ్ము రక్షించుగాక!

-

కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం


మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్


పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలం


క్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః!

---

రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా,


ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా,


కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున చొరగా,


వాసుకి కోపముతో చూచుచుండగా,


శివుడు (కోపముతో) కాలితో అదుముటచేత రావణుడు


పాతాళమునకు పోవుచుండగా,


(రావణునిపై) కోపించినవాడయ్యునూ పార్వతిచేత


భయమువలన గట్టిగా ఆలింగనము చేసికోబడ్డవాడై


ఆనందించిన శివుడు మిమ్ము రక్షించుగాక.


Friday, October 5, 2018

గాంధారి శాపం !

గాంధారి శాపం !

-

దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” !

నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి

గుండె మంట మనల్ని కాల్చేస్తుంది.

-

గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని

ఆపగలిగే 

సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, 

దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.

దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. 

నాకు చాలా ఇష్టైమైన పద్యం.

.

శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే 

సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:

.

“సారపు ధర్మమున్ విమల సత్యమున్‌ పాపముచేతన్‌ బొంకుచేన్‌

పారమున్‌ పొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె

వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని

స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.

.

సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే

శక్తి కలిగి ఉండీ, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికీ, సర్వ

అనర్థాలకూ కారణమవుతుంది.”

.

గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.

“దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” - 

అది అనేక సందర్భాలలో గుర్తుంచుకోవాల్సిన మాట.


Thursday, October 4, 2018

కల భాషిణి!


కల భాషిణి!

-


ప్రబంధాలు అపురూప కవితాకళాఖండాలు.చదవండి .అడుగడుగునా రసధునులే!


కల భాషిణి యంద చందాలు!


ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు.

.

కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి! 

విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య! 

ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు.


ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్

పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్ 

వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ 

ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్;

బాల్యం గడచి యవ్వనంలో అడుగు మోపక మున్నే విటజనాన్ని 

ఆకలభాషిణీ సౌందర్యం కలవర పరుస్తోన్నదట! వెలయాలుగదా యెవరికి వారు ముందుగా నామెపొందుకోసం తపన పడుతున్నారట. యింతకీ ఆమెపరిస్థితి యేమిటీ? అనేప్రశ్నకు కవి చెప్పే సమాధానమే యీపద్యం!

ఆమెశిరోజములు సిగను చుట్టుకొనుటకు తగినరీతిగాలేవట. చూచుకములా(చనుమొనలు) పోకలయమతైనాలేవట! 

స్తనములేపుగా పెరుగ లేదని చెప్పుట. 

పిరుదులు విశాలముగా నెదుగలేదట! 

సామాన్యముగా వయస్సువస్తోన్న ఆడపిల్లకు కచ, కుచ,, జఘన, విజృంభణం సహజం. కానీ యీమెవిషయంలో అవేనీలేకపోయినా, మన్మధుడు విటజనహృదయాన్ని కొల్లగొడుతున్నాడంటే, మరి యామె యెంత అందంగా ఉన్నదో మీరేఊహించుకోండి!!! అంటాడు.

.

ప్రబంధాలు అపురూప కవితాకళాఖండాలు.చదవండి .అడుగడుగునా రసధునులే!


ప్రాభాతి!

ప్రాభాతి!

(కరుణ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు...చిత్రం.. శ్రీవడ్డాది పాపయ్యగారు.)

.

రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్

ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో

ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో

దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

.

ఈ గిజిగాని గూడు వలెనే మలయానిల రాగడోలలో

నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీ భరమ్ములో

మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పై పయిన్

మూగి స్పృజించి నా హృదయమున్ కదిలించుచునుండె ప్రేయసీ

.

రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచి మాలికిన్

స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖియై మన దొడ్డిలోని పు

న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్

మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మన మాతృపూజకున్

.

(చిత్రం.. వడ్డాది పాపయ్యగారు.)


ముగురమ్మల మూలపుటమ్మ! (పోతనామాత్యుడు..భాగవతం)

ముగురమ్మల మూలపుటమ్మ!


(పోతనామాత్యుడు..భాగవతం)

.

"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె


ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా


యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"


.

As requested by some friends ..The Meaning in english.


The mother of all mothers,


the mother who is the source of the three goddesses


(Sarasvati, Lakshmi and Parvati), very noble mother,


the mother who caused heartburn to the mother of gods


' foes 

(she's a slayer of demons),


the mother who resides in the heart of all divine women


that believe in her, Durga, our mother, in her sea of


compassion, may grant us the wealth of great poetic


prowess!


Notes: This too is an utpala maala.


However, in contrast to the first poem,


this is almost entirelyin pure Telugu, with some wonderful


Telugu usages.


The expressions "ammala ganna yamma" and "maa yamma"


bring a ring of "familiarity" while referring to this powerful


Goddess, as if the Goddess is very close to the poet.


Also notice the anupraasa on the 'mma' syllable.

Wednesday, October 3, 2018

నాడు –నేడు !

నాడు –నేడు !

-


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)

చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు .🤣


"మా ఇంగ్లీష్ టీచరు పబ్బరాజు సుబ్బారావు గారు 

ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. 

చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.


"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. 

మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు.కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. 

అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.

"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి

ఎం.ఏ. వారికన్నా బాగుండేది. 

ముఖ్యంగా నరసింహన్ అయ్యంగార్, రామచంద్రారెడ్డి, 

అబ్దుల్ అజీజ్, ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. 

రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు. 

లెక్కల టీచరు అబీద్ ఆలీ గారు. ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు" కొత్తిమీర్ కట్ట "అని కొంటే పేరు పెట్టారు పిల్లలు. ఫిజిక్స్ మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.

ఆయనకు దుబ్బుగా పొడవాటి గడ్డం. అందుకని "ఝాడుకట్ట "అని పేరు. హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు.

టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా 

ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు మా క్లాసు టీచరు. 

ఆయనకు కళ్ళు పుసులు కారే జబ్బు.

ఆయన్ని "చిమ్మెట్ట గార"ని ఆట పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు. "బీకరు "అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి. మనిషి లావు. ఆయన్ని "మెట్ట వంకాయ్" అని పిలిచేవాళ్ళు. 

హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'.

పెద్ద పెద్ద మీసాలు వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని 

"బొద్దింక మాస్టారు "అనే వాళ్ళు. ఆయన తండ్రి చనిపోయిన

కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు. 

మీసాలు లేని ఆయన్ని చూసి "బోడి బొద్దింక "వచ్చిందిరా 

అనడంతో ఆయన చిన్నబుచ్చుకునేవారు. 

అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"


ముల్కీ ముచ్చట్లు !


"పరీక్షలు అయిన తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. 

రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది.

హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చాను. 

టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గా వేసారు.

టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా మంచి మార్కులు వచ్చాయి కనుక 'ముల్కీ సర్టిఫికేట్' తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. 

ముల్కీ సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. 

లేదా పన్నెండేండ్లు నివాసం అయినా వుండాలి. 

మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి.

నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి.

ఆరోజుల్లో నైజాంలో పుట్టుకల గిట్టుకల రిజిష్టర్ వుండేది కాదు. 

అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు.

మా బావ స్నేహితుడి తండ్రి ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా 

పనిచేసి రిటైర్ అయినాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 

'ఇతను మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె,

ఆబ్కారీ డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ వూరు వెళ్ళేవాడిని, 

అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ అట్లాగే చెప్పు' అని 

నాతొ అన్నాడాయన. ఫారం లోపలి పోయింది. 

మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం 

చెప్పాడని మజరద్ గార్ నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. 

అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని కలిసాను. చిన్నవాడు. మంచి మనిషిలా కనిపించాడు. 

'నీకు నిజాం కాలేజీలో సీటు వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు.

నాకు సాక్ష్యం ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ రాలేదు. 

అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత బందరులో


హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను.”


నిత్యం చదువుకోదగిన కొన్ని శ్లోకాలు:🌹


నిత్యం చదువుకోదగిన కొన్ని శ్లోకాలు:🌹

🏵️

-

👉నిద్రలేచి కరదర్శనం:


కరాగ్రే వసతే లక్ష్మీ: I కర మధ్యే సరస్వతీ I

కర మూలే స్థితా గౌరీ I ప్రభాతే కర దర్శనం II


👉నిద్రలేచి భూ ప్రార్ధన: 

సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే I 

విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే II


👉ప్రాతః స్మరణం


గోవిందం మాధవం కృష్ణం హరిం దామోదరం తధా I

నారాయణం జగన్నాధం వాసుదేవ మజం విభుం I 

సరస్వతీం మహాలక్ష్మీం సావిత్రీం వేద మాతరం I

బ్రాహ్మణం భాస్కరం చంద్రం దిక్పాలాంశ్చ గృహం స్తథా II


శంకరంచ శివం శంభుం ఈశ్వరంచ మహేశ్వరం I

గణేశంచ తథా స్కందం గౌరీ భాగీరధీం శివాం I 

పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో జనార్దనః I

పుణ్యశ్లోకా చ వైదేహీ పుణ్యశ్లోకో యుధిష్టరః


అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః I 

కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః I


(ఫలశ్రుతి: బ్రహ్మ హత్యాది పాపాలు పోతాయి. సమస్త యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. లక్ష గోవుల్ని దానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది)


👉నవగ్రహ స్తోత్రం: 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ I

గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః II


👉సూర్య స్తుతి:


ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I

హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II


నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I 

నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II


భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I

ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే II


👉శ్రీరామ ప్రాతఃస్మరణం:


ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం I

మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్ I 

కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం I 

కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్ II


👉ఆంజనేయ ప్రార్థన:


మనోజవం మారుతతుల్య వేగం I

జితేంద్రియం బుద్ధి మతాంవరిష్ఠం I

వాతాత్మజం వానరయూధ ముఖ్యం I

శ్రీ రామదూతం శిరసా నమామి II


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత I

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్ II


నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన I 

విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్త వత్సల II


అమలకనక వర్ణం పృజ్వలత్పావకాక్షం I

సరసిజనిభవక్త్రుం సర్వదాసుప్రసన్నం I

పటుతరఘన గాత్రం కుండలాలంకృతాంగం I 

రణజయకరవాలం రామదూతం నమామి II


నాదబిందుకళాతీతం ఉత్పత్తి స్థితివర్జితం I

సాక్షాదీశ్వరరూపంచ హనుమంతం నమామ్యహం II


సువర్చలాకళత్రాయ I చతుర్భుజ ధరాయచ I 

ఉష్ట్రారూడ్హాయ వీరాయ I మంగళం శ్రీహనుమతే II


👉దధివామన స్తోత్రం:

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం I

హరిం నరహరిం రామం గోవిందం దధివామానం II 

(బ్రహ్మవైవర్త పురాణం)


👉కృష్ణ స్తుతి:


కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం I 

నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం I

సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం I 

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి: II


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం I 

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం II


కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే I

నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే II


కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే I

ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః II


ఇమం మంత్రం జపం దేవి ! భక్త్యా ప్రతిదినం నరః I

సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్II


👉శ్రీ వేంకటేశ్వర స్తుతి:

ఓం నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే I

ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నం నమః II


👉విష్ణు స్తుతి:

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం I

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం II


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం I

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం I

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం I

వందే విష్ణుం భవ భయ హారం సర్వలోకైక నాథం II


👉లక్ష్మీ స్తుతి :


లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం I 

దాసీభూతసమాస్త దేవ వనితాం లోకైక దీపంకురాం I

శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం I 

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం II


పద్మప్రియే పద్మిని పద్మహాస్తే !

పద్మాలయే పద్మదలాయతాక్షి !

విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే !

త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ II


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే I 

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే II


👉శివ స్తుతి :

శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I

శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I

నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I

నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II


వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం 

వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం I

వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం I

వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం II


👉భోజనము చేసే ముందు పఠింపదగిన శ్లోకములు :


శ్లోకం: " త్వదీయం వస్తు గోవింద

తుభ్యమేవ సమర్పయే

గృహాణ సుముఖోభూత్వ

ప్రసీద పరమేశ్వర"


తాత్పర్యం: 'ఓ గోవిందా! నీ వస్తువును నీకీ సమర్పిస్తువున్నాను. నీవు నా యందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు'


శ్లోకం: " బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌబ్రహ్మణాహుతం I 

బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా II


(ఒక అన్నం ముద్ద భగవంతునికి సమర్పించి అన్నం తినవలెను)


శ్లోకం: అహం వైశ్వనరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రితః I 

ప్రాణాపాన సమాయుకః పచామ్యన్నం చతుర్విధం II


👉సంధ్యాదీప స్తుతి

(సాయంకాల దీపారాధన చేస్తూ పఠింపవలసిన శ్లోకం) :


దీపం జ్యోతి: పరం బ్రహ్మ దీప స్సర్వ తమోపహః I

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే II


👉సుఖ నిద్రకు మరియు దుస్స్వప్న నాశనానికి :


శ్లోకం: అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః I 

కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయనః II


శ్లోకం: రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం I 

శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి II


👉మంగళము :

ఓం సర్వేత్ర సుఖినస్సంతు 

సర్వేసంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యంతు 

మా కశ్చిద్దు:ఖ మాప్నుయాత్ II

(అంతా సుఖంగా ఉండాలి. ఏ రోగం లేకుండా క్షేమంగా ఉండాలి. ఏ ఒక్కరును దుఃఖంతో ఉండకూడదు. ఇది వేద ప్రార్థన. ఇది హిందూమత ఆదర్శం)


సర్వేజనాస్సుఖినోభవంతు.

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 

ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

Tuesday, October 2, 2018

రామునివ్యక్తిత్వం.!

రామునివ్యక్తిత్వం.!

-

రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుని మరణ వార్తను విన్న

మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. 

ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన వాడు. 

అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. 

సత్యమైనా జీర్ణయించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది.


మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున వస్తుంది. 

మనసులో రాముని మీద కోపం... రాముని నిందించాలనే ఆత్రుత.

రాముడిని ఇదివరకు తాను చూడలేదు. 

అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. 

అతనిపై ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. 

ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. 

రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు.


రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి


యుధ్ధ భూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా


ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల


తన నీడ దూరంగా పడుతున్నది.


దూరం నుండి వస్తున్న మండోదరి యొక్క నీడ కూడా దూరం


నుండి కనిపించిందతనికి.


ఎవరో తెలియదు కాని నీడను చూస్తే ఆ ఆకారం స్త్రీ మూర్తిదని


అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీ మూర్తి నీడ తన నీడను


తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు.


ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో


కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు


ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీ పయి


పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని


అర్థం చేసుకుంది. కాబట్టే రాముని పై తనకున్న క్రోధం ఆమెలో


మాయ మయింది.


యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న.


జయం అపజయం శాశ్వతం కావు.


విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే.


మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం


అంటుంది రామాయణం.


అలాంటి నాయక పాత్రకు ప్రతీక రాముడు.


(భక్తి ప్రవచనాలు నుండి సేకరణ .)

Monday, October 1, 2018

సౌందర్యలహరి లోని శ్లోకం🌹

సౌందర్యలహరి లోని శ్లోకం🌹

🏵️


"నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ


తవేత్యాహు స్సంతో ధరణిధర రాజన్యతనయే


త్వదున్మేషాజ్ణాతం జగదిద మశేషం ప్రళయతః


పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవదృశ"


👉ఓ జననీ నీవు కనురెప్ప వేయుటవలన


ఈ సృష్టి సమస్తం లయమౌతున్నది.


తిరిగి నీవు కనులు తెరిచినంతనే


సర్వలోకాలు సృజింపబడుతున్నాయి.


(బాపు బొమ్మ)


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

మనిషంటే మానవతకి చిరునామా నేస్తం!

మనిషంటే మానవతకి చిరునామా నేస్తం!

-

నాటేది ఒక్క మొక్క! వేసేది నూరు కొమ్మ!

కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా.. 

ఇక కాయాలి బంగారు కాయాలు!

భోంచేయాలి మీ పిల్లకాయలు!

.

ఈ పాట? విన్నారా?? 

ఎంత బాగుంది కదా పాట! గొప్ప ఆశయం!

నిలువెల్లా పరోపకార చింతన! ప్రేమ!

చేసేపని ఏదైనా నాడే ఫలితం ఆశించరాదు! 

రేపటి ప్రయోజనాలకు అది పునాది!

నువ్వందుకోలేని ఫలసాయం ఎవరికి దక్కినా మేలే! 

అన్న విలువగల సత్యం చాటి చెప్పింది!

విత్తు ను నాటిన వృద్ధుడు మరణించినా.. 

బీజం మహా వృక్షమై తరాలకుపయోగపడుతుంది! 

ఈ గుణమే, ఇతరులగురించి ఆలోచించే..

మంచితనమే భగవంతుడు మెచ్చే లక్షణం!

వేదం కరుణే బ్రహ్మజ్ఞానమంటుంది!

గీత నిష్కామకర్మ జీవన సాఫల్యం అంటుంది!

రాముడు, కృష్ణుడు, వివేకానందుడు ఎవరుచెప్పినా..

అదే మాట! అదే సూత్రం! మనిషంటే మానవతకి చిరునామా నేస్తం!

ఊహలలో రాజకుమారి !

ఊహలలో రాజకుమారి !

-

అనగనగా కధలు ఎన్నో చదివాను.అన్నిట్లో రాకుమారి


ఎవరిమీదో ఒకరి మీద ఆధారపడేది.


కానీ ఈ రాకుమారి ప్రత్యేకం. తన కష్టం తానే ఎదుర్కొంది.


తన రక్షణ తానే చూసుకుంది.తన శపథం తానే నెరవేర్చుకొంది.


తన యుద్ధం తానే చేసి గెలిచింది. ఆ గెలుపు ఎంతో మందికి


స్ఫూర్తినిచ్చింది.


తన చదువు, అందం,తెలివితేటలు, వాటిని తగినవిధంగా


ఉపయోగించ గలిగే చాకచక్యం.ఓహ్ ఎంతైనా నేర్చుకోవచ్చు,


తన నుండి.

.

ఒక స్త్రీ ని ఫలానా వ్యక్తి కూతురిగానో, భార్యగానో,అమ్మగానో


అనే హోదాలు లేకుండా, కేవలం తానే తన ఉనికిగా తన పేరే


ఒక పరిచయంగా మార్చుకున్న స్త్రీలు ఎందరో !


అలాటి రాజకుమారి పేరు ఊహించుకొండి !


(నా రాజకుమారి -- ప్రియ దర్శిని .) 

Saturday, September 29, 2018

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.)

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు.


(పోతనామాత్యుడు.)


🏵️


👉చదువని వాడజ్ఞుండగు


చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !


చదువగ వలయును జనులకు


చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

-

భావము


హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి


పంపిస్తూ అంటున్నాడు-


“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు.


మరి చదివితే ఏమవుతుంది?


మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది.


అందువల్ల అందరూ చదువుకోవాలి.


నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి


చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.


🏵️🏵️🏵️🏵️


👉చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే


చదివినవి గలవు పెక్కులు


చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !!


-

భావము:


“నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం,


అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి,


అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.


మరల చదువు చెప్పటానికి చండామార్కులు ప్రహ్లాదుని తీసుకెళ్ళారు.


ఇప్పుడు మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అని


చూపటానికి ఆ రాక్షసరాజు వద్దకు పర్రహ్లాదుని తీసుకొచ్చారు.


నువ్వుచదువుకున్నది ఏమిటో చెప్పమని అడిగిన తండ్రి


హిరణ్యకశిపునకు, పుత్రరత్నం ప్రహ్లాదుడు చెప్తున్న


సమాధానందలోనిది ఈ పద్యం


🏵️🏵️🏵️🏵️


👉మందార మకరంద మాధుర్యమున దేలు


మధుపంబు బోవునే మదనములకు !


నిర్మల మందాకినీ వీచికల దూగు


రాయంచ సనునె తరంగిణులకు !


లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు


కోయిల సేరునే కుటజములకు !


పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక


మ్మరుగునే సాంద్ర నీహారములకు !


-

అంబుజోదర దివ్య పాదారవింద


చింతనామృత పాన విశేష మత్త


చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు


వినుత గుణ శీల మాటలు వేయు నేల !!


-

భావము:

సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా!


మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే


తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా?


రాజహంస స్వచ్చమైన ఆకాశగంగా నదీ తరంగాలపై


విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా?


తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన


కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా?


చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది


కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా?


చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన


పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో


మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది.


వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన


నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”


🏵️🏵️🏵️🏵️


👉కమలాక్షు నర్చించు కరములు కరములు


శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ


సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు


శేషశాయికి మ్రొక్కు శిరము శిరము


విష్ణు నాకర్ణించు వీనులు వీనులు


మధువైరి దవిలిన మనము మనము


భగవంతు వలగొను పదములు పదములు


పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

-

దేవదేవుని చింతించు దినము దినము;


చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;


కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;


తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి


భావము:

నాన్న గారు!


కమలా వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే


అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు;


శ్రీపతి అయిన విష్ణుదేవుని స్త్రోత్రము చేస్తేనే నాలుక అనుటకు


అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు;


దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు;


ఇతరమైన చూపులకు విలువ లేదు;


ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది


మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు;


విష్ణు కథలు వినే చెవులే చెవులు;


మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే


చిత్త మనవలెను;


పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి


మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు.


పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి;


లేకపోతే అది సద్భుద్ధి కాదు;


ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము;


చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు


చదువు మాత్రమే సరైన చదువు;


భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు;


విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని


ఇతరులు తండ్రులా? కాదు;


నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు,


చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి?


సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే.


లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే.


ప్రతి రోజూ,ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే.


ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే.


అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి


సార్థకత లేదు.


🏵️🏵️🏵️🏵️


👉ఇందు గలడందు లేడని


సందేహము వలదు చక్రి సర్వోపగతుం


డెందెందు వెదకి జూచిన


అందందే గలడు దానవాగ్రణి వింటే !!

-


భావము:


ఓ హిరణ్యకశిప మహారాజా!


శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు;


ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు


. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల


అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం


అన్నది లేదు;


అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా.


రాక్షసరాజా!


🏵️🏵️🏵️🏵️

Friday, September 28, 2018

వహీదా రెహమాన్‌!

వహీదా రెహమాన్‌!

-

వహీదా రెహమాన్‌ తెలుగమ్మాయి అంటారు కానీ

ఒరిజినల్‌గా తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా

ఆంధ్రలో చాలాకాలం గడిపారు. ''రోజులు మారాయి'', ''జయసింహ'' సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు.

తెలుగు ప్రాంతాల్లో పెరగడం వలన వహీదాకు తెలుగు బాగా వచ్చు. ''రోజులు మారాయి'' సినిమాలో 'ఏరువాక సాగారోయ్‌' పాటలో నర్తించింది. ఎన్టీయార్‌ ఆమెకు ''జయసింహ''లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర యిచ్చి నటింపజేశారు. ''మిస్సమ్మ'' సినిమాను హిందీలో తీయడానికి వీలుపడుతుందేమో చూద్దామని హైదరాబాద్‌ వచ్చిన గురుదత్‌ వహీదాను మెచ్చారు. ప్రత్యక్షంగా కలిసి తన

సినిమా ''సి ఐ డి''లో హీరోయిన్‌గా వేయడానికి హిందీ రంగానికి ఆహ్వానించారు. ఇది 1955లో జరిగింది.


''బాజ్‌'' తర్వాత గురుదత్‌ స్వంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ''ఆర్‌ పార్‌'' (1954), ''మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55''(1955) సినిమాలు హిట్‌ కావడంతో ''సి.ఐ.డి'' (1956) దేవ్‌ ఆనంద్‌, షకీలాలతో ప్లాను చేసి దాని దర్శకత్వాన్ని తన శిష్యుడు రాజ్‌ ఖోస్లాకు అప్పగించి తను పర్యవేక్షించాడు.

ఈ సినిమాలోనే గురుదత్‌ వహీదా రెహమాన్‌ను హిందీ తెరకు పరిచయం చేశాడు. 

అంతకుముందు ఆమె నటించిన ''జయసింహ'', ''రోజులు మారాయి'' తెలుగులో వచ్చాయి కాబట్టి దేశంలో ఎవరికీ ఆమె గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమా నిర్మాణంలోనే అప్పటికే వివాహితుడైన గురుదత్‌ వహీదాతో ప్రేమలో పడ్డాడు. ఇస్తానన్న పారితోషికంతో బాటు ఆమెకు ఒక కారు బహుమతిగా యిచ్చాడు.


ఆమె హిందీ సినిమాలో ప్రసిద్ధ నటి అయ్యాక ఓ సారి మద్రాసు ఎయిర్‌పోర్టులో అన్నపూర్ణా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఎదురైంది. 1951లో తెనాలిలో డాన్సు ప్రోగ్రాం యిచ్చిన రోజులనుండి యీయనకు తెలుసు. 'పెళ్లి చేసుకోబోతున్నానండి'' అందామె. 'శుభం, పెళ్లి చేసుకోబోయేముందు ఓ తెలుగు సినిమాలో నటించ కూడదా?'' అన్నారీయన. ''మీరు తీస్తానంటే నేను వేయనంటానా?'' అందామె సమాధానంగా.


యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ సీరియల్‌ ఆధారంగా ''బంగారు కలలు'' సినిమా తీస్తూ మధుసూదనరావుగారు నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌ వేషం ఆఫర్‌ చేశారు వహీదాకు. ఆమె సరేనంది. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రను లక్ష్మికి యిచ్చారు. కానీ అదే సమయంలో చలం నిర్మించిన మరో సినిమాలో కూడా లక్ష్మిది యిలాటి పాత్రే! పోలిక వస్తుందని భయపడి, హీరోయిన్‌గా లక్ష్మిని పెట్టుకుని చెల్లెలు పాత్ర వహీదాను వేయమంటే... అనుకున్నారు అన్నపూర్ణావారు.


అంత పెద్ద స్టార్‌ దిగివచ్చి వేషం వేస్తానంటే యిలా చెల్లెలు పాత్ర వేయమంటే ఏం బాగుంటుంది? అని జంకారు. ఏమైతే అది అయిందని ఆమెను కలిసి విషయం చెప్పారు. ఆమె కొద్దిసేపు ఆలోచించి ''నేను ఆర్టిస్ట్‌ను. చేసేది మంచి పాత్రా? కాదా? అని తప్ప హీరోయిన్‌గానే వేయాలన్న పట్టుదల నాకేమీ లేదు. నేను రెడీ'' అందామె.


ఆమె ఔదార్యం అంతటితో ఆగలేదు. తనతో బాటు మందీమార్బలం ఎవరూ లేకుండా ఓ టచప్‌ వుమన్‌ను తెచ్చుకున్నారామె. పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్‌, మేకప్‌ మెటీరియల్‌ బొంబాయినుండి తానే తెచ్చుకున్నారు. రిట్జ్‌ హోటల్‌లో రూము బుక్‌ చేస్తే ''ఎందుకండీ దండగ! నేను కూడా సారథీ స్టూడియోలో వుంటాను'' అంది. చివరకు ఆమెను ఒప్పించి 'బ్లూ మూన్‌' హోటల్లో బస ఏర్పాటు చేశారు. తెలుగు నటీనటులతో కూడా ఏపాటి భేషజం లేకుండా నటించారామె.

క్షీర సాగర మధన మర్మం.--కూర్మావతారం.🌹

క్షీర సాగర మధన మర్మం.--కూర్మావతారం.🌹


🙏 🙏సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు🙏.🙏


🏵️


"చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే...

పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే....

బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక....

ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది...


క్షీర సాగర మధన మర్మం.!

-

కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన

విధానం నిజంగా అమొఘం..


మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు


ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి


ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది..


దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం


బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను


ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ


నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని


సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం


ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం


అంటూఅయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, September 27, 2018

ఒక చిన్న కథ!

ఒక చిన్న కథ!


ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు.


వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.


ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు


'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళారా!' అని అడిగాడు.


ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: 

*'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు.

సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'*


అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో


మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?'


అంధుడైన సాధువు ఇలా చెప్పాడు:


“మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను.


అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో,


"ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు.


కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, 

’సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?’ అని అడిగాడు.


చివరకు మీ మంత్రి వచ్చి

'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?' అని అడిగారు.


మీరు వచ్చి

'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళారా!' అని అడిగారు.


"మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ, ఏమిటో గుర్తించవచ్చు"


🌸మన విలువ, మన నోరు చెపుతుంది.🌸


ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం. !

ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం. !

-

తాతగారి గోడ గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది.

ఎంత వెతికినా దొరకలేదు.

మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే 

వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు.

పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు. 

గడియారం దొరకలేదు.


అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు.

"నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు.

గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు. 

ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు.


"ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత.


"తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది."


"నిజమే... ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం."


ప్రశాంతంగా ఆలోచిస్తే, నిశ్శబ్దంగా ఉంటే బతుకు గడియారం శబ్దం దానికదే వినిపించి తీరుతుంది. సమాధానం కనిపించి తీరుతుంది.

🌹🌹🌹🌹

ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..! -

ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..!

-


మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా

రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు

న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో

ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్.!


(వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం )

-

కవి రామరాజభూషణుడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు

కూడా ఉంది.

-

.

ఆ అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా, 

రంభాస్తంభాలకన్నా అందమైనవి. 

తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని

కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి.

.

రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ —

,

ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది

-

(వడ్డాది వారి చిత్రం.)

Wednesday, September 26, 2018

ఆహా ఓహో.. అటుకుల ఉప్మా..

ఆహా ఓహో.. అటుకుల ఉప్మా.. 

దీని సాటి రాదు ఏ రవ్వ ఉప్మా.. 

చింత చారు వేస్తే కాదా పులిహోర.. 

చింత లేకుండా మరి తినరా నోరారా.. 

కన్నడిగుల ఇంట ఇది కవ్వించునంటా..


కలిమిలేములు మరిచి అందరూ భుజించునంటా.. 

మా అమ్మ చేస్తే మైమరిచిపోతుంటా.. 

మళ్ళీ మళ్ళీ కొసరి వడ్డించమని తింటా..

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


అటుకుల ఉప్మా- చేయు విధానం .


కావలిసిన పదార్థాలు

1. అటుకులు పావుకేజీ

2. పచ్చిమిర్చి 3

3. అల్లం చిన్న ముక్క

4. టొమాటోలు 2

5. ఉల్లిపాయలు 2

6. కరివేపాకు

7. కొత్తిమీర

8. కేరట్ 1

9. జీడిపప్పు


పోపుదినుసులు

పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ ,

మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,

జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు ,

ఆయిల్ 4 స్పూన్స్ , పసుపు , ఉప్పు రుచికి సరిపడా


తయారీ విధానం

ముందుగా పచ్చిమిర్చిని చీలికలుగా ను ,

అల్లము ఉల్లిపాయలను టొమాటోలను సన్నని ముక్కలుగాను

తరుగుకోవాలి .కొత్తిమీరను , కేరట్ లను సన్నగా తురుముకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక

ఆయిల్ వేసి పల్లీలను వేసి అవి దోరగా వేగాక,

జీడిపప్పు కూడా వేసి , వేగాక ,

పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేగాక

కరివేపాకు , కేరట్ తురుము , ఉల్లిపాయముక్కలు ,

పచ్చిమిర్చి చీలికలు , అల్లం టొమాటోముక్కలను వేసి

అవి దోరగా వేగాక 

అటుకులను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కడిగి

బాణలి లో వున్నపోపు వేసి

పసుపు ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలిపి

కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి

మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి

అటుకుల మిశ్రమం అంతా బాగా మగ్గిన తరువాత

కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటె

వేడి వేడి అటుకులఉప్మా రెడీ 

ఈ ఉప్మా ను కొత్తిమీర చట్నీ తో తింటే

చాలా రుచిగా ఉంటుంది.

😜😜😜😜😜😜😜😜