🌹🌺శ్రీమంతం -పురిటికొచ్చిన పిల్ల!🌺🌹

🌹🌺శ్రీమంతం -పురిటికొచ్చిన పిల్ల!🌺🌹


(కృష్ణ శాస్త్రి గారి కవిత -దామెర్ల రామారావు గారి చిత్రం)


-

"ఎవరాడబడుచమ్మ - ఎవరాడబడుచు?

యేరు దాటొచ్చింది ఎవరాడబడుచు?

-

కుచ్చులా పల్లకిని కూర్చున్నదీ - లోన

అచ్చంగ రాణిలా అమరున్నదీ!

పరుపు బాలీసుపై ఒరిగున్నదీ!

అన్నలైతే పసిడి అందెలిస్తారు

తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు

పెట్టి పోసేవారు పుట్టింటివారు

పుట్టింటికే తానూ పురిటి కొచ్చింది!

-

లక్ష్మి[పురిటికొచ్చిన పిల్ల]: 

అందుకు కాదమ్మోయ్ నేను వస్తా!

సుబ్బమ్మ: అదెంత సేపమ్మోయి పిల్లా!

మరదళ్ళు అడుగులకు మడుగు లొత్తేరు

వదినల్లు కనుసన్న నొదిగి మెదిలేరు

గౌరవానికి గాని ఘనతకు గాని

తన పుట్టింటిలో తాను దొరసాని!

-

అబ్బాయి తాతయ్య అంక మెక్కెను

అమ్మాయి అమ్మమ్మ చంక నెక్కెను

తన పుట్టింటిలో తాను దొరసాని

మగనింటిలో ఉంటె మగువ యువరాణి!


[దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి రూపకము లోని కొంతభాగం]


-వింజమూరి.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!