Monday, February 29, 2016

గుప్పెడంత ప్రేమ…!

గుప్పెడంత ప్రేమ…!

(మెరుపుకల...నా కొత్త కలల లోకం)

.

అమ్మ ప్రేమ కావాలి అమ్మ ఒడిలో పడుకోవాలని నా బాధలు భయాలు చెప్పుకోవాలని

అమ్మ చెయ్యితో నాతలను ప్రేమగా నెమరాలి నా భయాలు అన్నీ మరిచి హాయిగా పడుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ ఆ అమ్మ ప్రేమ నాకు దొరకలేదు .. 

నా అదృష్టం ఏంటో నాకు ఊహరాకముందే నాన్న చనిపోయాడు నాన్న ప్రేమ ఎలావుంటుందో తెలీదు సినిమాలో చూడడం పుస్తకాల్లో చదవడం తప్ప … 

ఇక తోడబుట్టిన వాళ్ళ గురించి ఐతే ఏంచెప్పిను స్వార్ధానికి రూపం వుండి బట్టలు వేస్తే వాళ్ళు అని చెప్పొచ్చు … బ్రహ్మదేవుడు నాతల రాత రాసేటప్పుడు బాగా ఫస్ర్టేషన్ లో వున్నట్టుంన్నాడు

ఆ సరస్వతీ మాతమీద వున్న కోపం మొత్తం నామీద చూపించాడు 

పాపం ఆయనను నేను నిందించలేను ఎందుకంటే ఫస్ర్టేషన్ నమ్మా … ఫస్ర్టేషన్ … 

నేను అర్థం చేసుకోగలను మిస్టర్ బ్రహ్మ … అది సంగతి 

ఇంతకీ మనం ఎక్కడ వున్నాం హు… గుప్పడంత ప్రేమ కోసం నేను తపించిపోతుంన్నా

నా తలమీద చేయివేసి నేనుంన్నానంటూ ధైర్యం చెప్పాలి , 

నా రెండు చెంపలమీద తనరెండు చేతులతో నన్ను దగ్గరగా లాగుకుని ప్రేమగా నా నుదురుపైన ముద్దు పెట్టాలి నేనుంన్నానంటూ , నేను టెంషన్ లో వుండి నిద్రపట్టకుండా 

గాబరగా వున్నప్పుడు నన్ను దగ్గరగా తీసుకుని ప్రేమగా తన యదపై పడుకోబెట్టుకోవాలి .. ఎప్పుడు భార్యలే కాదు భర్తలు కూడా అంతే ప్రేమను పంచితే

ఏ ఆడవాళ్ళు అలాంటి భర్తను వదులుకోరు!

Aishwarya Srinivas - Ennaganu Rama Bajana

భద్రాచల రామదాసు !

(ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా )

పంతువరాళి - రూపక

పల్లవి:

ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ..

అను పల్లవి:

సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?

కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..

చరణము(లు):

రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి

రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా

ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు

కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..

శాపకారణము నహల్య చాపరాతి చందమాయె

పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే

రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు

తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..

తృణకంకణము! (శ్రీ రాయప్రోలు సుబ్బారావు.)

తృణకంకణము!

(శ్రీ రాయప్రోలు సుబ్బారావు.)

తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది.

రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది.

ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది.

.

తృణకంకణము

(ఆంధ్ర భారతి నుండి)

అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్‌

మడుగులుగట్ట, మండు కనుమాలపుటెండ పడంతి యోర్తు జా

ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా

ల్నడకన బోవుచుండె నెడలన్‌ కనుపించెడి పచ్చతోటకున్‌.

పసినిమ్మపండ్ల చాయలు

కొసరెడి యా కుసుమగంధి కోమలపు టొడల్‌,

కనుకందిన కవటా కన

వసివాడె నిదాఘతాప పరిపీడనలన్‌.

కన్నె గేదగి చెండునా కళుకు లొలయు

ఆ నెలంత యొడల్‌ నగ లేవి లేక,

జాఱు చెమ్మట ముత్యాలజంపు సరుల

సహజ సౌందర్యమును వెద జల్లుచుండె.

పదియు నారు వసంతముల్‌ వదలనట్టి

వయసు సొగసుందనం బామె మెయిని మెఱయ,

బాల్య మెడలిన మొలుచు జవ్వనపుమవ్వ

మొడలి యం దండముగ నుట్టిపడుచు నుండె.

నడచుదారి పురోపకంఠంబు నొఱసి

చనుచునుండె, ఆమెకు ముందువెనక నెవరు

వచ్చుచున్న జాడలును గన్పట్ట వయ్యె,

ఎచటి కేగునొ, కారణ మేమి యగునొ?

ఇసుక దిగబడు నడుగుల నీడ్చుకొనుచు,

ఉడుకు టెండకు మండునిట్టూర్పు లదర,

కాలిచల్లారు పెంపుడు కానబడిన

పడుచు జింకపడంతి నా నడుచు నామె.

ఎడ నెడ కుఱంగంటను మా

మిడి చెట్టులు కలవు, కాని మెలతుక తా నా

కడలను నిలువగ నేగదు,

నడచుచు తన నడక బడినె నలగి కలగియున్‌.

జిలుగుపూల కలంకారి చీర జాఱ

చిందు సందెడు కుచ్చెళ్ళు చెదరనీక,

మాటికిని కాలికడియాలు మలపుకొనుచు,

కూతవే టిటు చని చేరికొనియె వనము.

పడమట జాముప్రొద్దు కనుపట్టుచునుండె, నిదాఘశాంతి య

య్యెడు మలుసందెచిన్నెల నొకింత ప్రసన్నములయ్యె గాడుపుల్‌,

నడకల చొక్కిసోలిన నెలంతయలంతలు పంచుకో పఱుం

గిడె నన నామె డాయ జనియెన్‌ తన పెంచినలేడి యయ్యెడన్‌.

తన యందెల రవళిత గుఱు

తున డాసిన హరిణపుత్రి దోడ్తోగని, చ

ల్లని చెమట లూరు హస్తం

బున దువ్వుచు నిట్లు కొంత ముచ్చట నడిపెన్‌.

నయనమూలాంచలములు స్విన్నంబు లయిన

వేల? చెల్లెలా! యీ ప్రాలుమాలికలకు

కారణం బెయ్యది? కఠోరకంటకంపు

వనుల దిరుగవు గద చిన్నతనపుచేష్ట!

అని నగవుంబలుకుల కను

గొనలను వాత్సల్యరసము కురియగ, ఆ మో

హనహరిణంబును ముద్దిడు

కొనియెను తృణపరిమళము బుగుల్కొన మొగమున్‌.

నడచి బడలిన యాయాస మెడల లేదు,

చీరె చెఱగుల తడియైన నాఱ లేదు,

లేడి వరసినయపుడె ముద్దాడికొనియె,

అహహ! యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!

వాలుంగన్నుల సొగసుల

లాలింపుచు తన్ను జూచు లలితకురంగిన్‌

కే లిచ్చి పిలిచికొను చా

నీలాలక యొక్క పోకనీడకు చనియెన్‌.

క్రిక్కిఱియు కొమ్మ లాశల నెక్కి చలువ

లుట్టిపడు నీడపందిళ్ళు కట్టుచుండ,

కలదు చేరువ వృద్ధవృక్షం బొకండు,

సొన యొకటి పాఱు మొద లానుకొని సతంబు

ఆ తరుచ్ఛాయ లొలసిన యంతవరకు

స్నిగ్ధసికతాతలమ్ముల చెమ్మ తేఱు,

ఎండ కన్నెఱుగక, వాననీడిగిలక

పెరిగిన కలకాపురముల బిడ్డలట్లు.

స్కంధకూలంకషమ్ముగా జాలువాఱు

పొడుపు సొనపయి ప్రాగభిముఖపు సరణి,

పూలరెమ్మల నింపు సొంపులు వహించు

శాఖ యొకటి వంతెనగాగ సాగిపోవు

గెలలు దిగిన మవ్వపు నారికేళతరులు,

పూలగుత్తులు వ్రేలాడు పొన్నచెట్లు,

మృదురవమ్ముల పిలిచెడి వెదురుపొదలు,

కన్నెగందపుమాకులున్‌ కలవు మఱియు.

సందె ముసలినకొలది ప్రశాంత మగుచు

చలువయును మాంద్యమును తన్ను నలమికొనగ,

త్రోవసోలింపు లెడల ప్రదోషపవన

మల్ల నల్లన వీచె నా యబలమీద.

ముగ్ధ మధురమ్మయిన లేడి ముద్దులాట,

లోల పవనాకుల లతావలోకనంబు,

పొడుపుటేటి మెలపు, జారు ప్రొద్దు వలపు,

ఆయమ నొకానొక వికార మందుత్రోసె.

చేలచెఱంగునన్‌ మొగముచెమ్మట లొత్తు, చెయిం బెనంచు, నీ

లాలకముల్‌ మొగమ్ము కవియన్‌ పయికడ్డము దిద్దు, మోవిపై

వ్రేలిడి యాలకించు, మురిపెంపు కనుంగవనిండ వాలికల్‌

తేలగ జూచు, నెద్దియు మదిం దలపోయు ననేకరీతులన్‌.

చిటికెనవ్రేల మేలిమి పసిండిపసల్‌ మిసలాడ చూడ ము

చ్చటయగు ముద్దుటుంగరము, చారుకుమారమృణాలకోమల

స్ఫుటమగు పాణిబంధమున పూన్చిన పచ్చనిపట్టుతోరము\న్‌,

కటకట వెట్టి యామె కడకంటి కొసల్‌ బలవంత మీడ్చెడిన్‌.

వెలది చిన్నె లనుక్షణ భిన్నభిన్న

మృదువు లయి తోపగా సాగె, నింతలోన

సొమ్మిసిల్లిన శిశువట్లు సొగసి యామె

అడుగు లొరయుచు పవళించె హరిణపుత్రి.

తెలియరాని వికారమ్ము కలతబెట్ట,

ఊర్పు విడుచుచు తాలిమి నోప లేక,

బెళుకు కాటుకకంటి చూపులు నిగిడ్చి

ఎదియొ వినబడ్డయటు లైన నెద భ్రమించి.

చెంపకు చేరెడుకన్నులు

సొంపుల సుడియంగ నా కుసుమకోమలి కే

లింపుగ చెవిచెంగట నిడి

కంపితగతి వినియె నొక్కకంఠస్వరమున్‌.

రుచిర వేణునాళోదయ శ్రుతుల గలసి,

పాఱు చిఱుసొన బిలబిల ధ్వనుల నణగి

కడల విననయ్యె నపుడొక క్లాంతకంఠ

గద్గదస్వర మనుతాపకలన నిట్లు:

"కాలమా! ఆస నడియాస గాగ జేసి

వేసటల ద్రోసి యాయాసపెట్ట దలతె!

వృంత మెడ సేసి, తింక లతాంత మెంత

తడవు కృశియించి సొబగులు చెడకయుండు?

నా ప్రియసఖి! అనురూప గు

ణప్రతిమ! ప్రసన్నశీల! నవనీత శిరీ

ష ప్రణయ మృదులహృదయ! క

టా! ప్రాణము లుండ యెటు విడంబడి సయితున్‌?

హృదయమా! ఆసయే లేదు మొదల పూల

మీద, నభిలషించితి వొక్క మృదు సుమంబు

చిరతరోత్కంఠ నెటులో సైచితివి; కాని

కాలము నిరాశ తార్చెనే గతి భరింతు!

భావభాసురమగు హృదంబరమునందు

రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు,

అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె

గ్రహణగత మైన చంద్రుని కల విధాన.

క్రమ మని అక్రమం బని పరస్పరభిన్న మదోవికార సం

భ్రమముల కొన్నినాళ్ళు వలవంతల స్రుక్కుచు తాళుకొంటి, వా

కమలదళాక్షిపై మమత; కాలమె యాసల త్రుంచివైచె, ప్రా

యమునుగ్రసించు తాపవిషమక్కట! యెక్కడిచెల్మితీయముల్‌!

తేటవలపులు మొలక లెత్తినది మొదలు

నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల,

తుదకు భగ్నమనోరథ దోషి వగుచు

ఏటి కారాటపడ మరులెత్తి మనస!

వలపునిండిన యకలుషభావముందు

ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె!

కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె,

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట!

లలిత లావణ్య పుర్ణమౌ లలన చెలువ

మొదట కన్పట్టుచుండు నెల్లెడల నాకు,

కనులు మూసినన్‌ విప్పినన్‌ కలలె వచ్చు;

పగలు రే లను భేద మేర్పడక యుండ.

నిదుర లేనట్టి రేలను నెలత! నీదు

ప్రణయ జాగరరక్తి నేత్రముల గాంతు,

నిదురపట్టిన రేల గాంచుదు సుఖంబు

స్వప్నపు టవస్థలను నీదుపజ్జ నబల!

హృదయ మోహన మయి, ప్రేమమృదుల మైన

తావకీన రీలాదాన దళపుటంబు,

మామకీన ప్రణయభంగి మధుకణములు

విడిచెడు విరక్తి బాష్పముల్‌ విడుచుపోల్కి.

చెలియా! యెన్నడో చేరదీసి మనలం చిన్నారినేస్తంబు, ము

గ్ధులమై యుంట నెఱుంగమైతి మపు డేఘోషన్‌ రవంతైన, కం

దళితస్నిగ్ధరసోదయంబగుట చేతం బిప్పు డల్లాడి యా

కులుమేయున్‌, బలవద్వియోగము లనుంగుంబ్రేమలన్‌ త్రెంపగ\న్‌.

ఆశాభంగ కఠోరశస్త్రికలు కోయన్‌ గాయముల్‌ గాక బా

ధాశోకంబున నేటికో కటకటల్‌ తాళంగ, ప్రేమ భి

క్షా శూన్యంబయి గొడ్డువాఱిన జుగుప్సాలోకమం, దేమృషా

పాశంబుల్‌ బిగియించె నిన్ను త్యజియింపన్‌ లేవు నాప్రాణమా?

తొలకరి వానచిన్కులకు దూరపుటాసల వేచు చాతకం

బులు దగతీరకార్తి తలపోతలలో తెగ, పాలురాని ఆ

వుల పొదుగుల్‌ వలెన్‌ మొగులు పూసికొనెన్‌ దివి, స్నేహధారవ

ర్తిలకహసింప దింపయిన దీపిక, యేమిటి కంగలార్చగన్‌.

అకట! వంచించె విధి మోహమా! విఫల మ

నోరథుడు వీడు నీ వింక చేర నేల?

భావమా! వేపె దేల యీ ప్రణయ కృపణు?

శూన్యమగుచు నెందేని గాంచుము ప్రశాంతి.

ఎద కృశించెడి నీ యరుంతుదవియోగ

దహన దందహ్యమానమై దైవమా! వి

కాసపతన మగు ప్రపంచకమ్మునందు

హేయ మగు కాయ మేల మోయించె దింక?

తన గుణలతలు పూచిన శోభలో యన-చిఱునవ్వు వెన్నెల చెండ్లు విసర,

తన మనోలీల కాంచిన రాగ మధు వన-పలుకు కొమ్మలు పూలపాలు పిదుక,

తన భావబంధ మందిన విభ్రమం బస-చూపులు వలపుటుచ్చులను పన్న,

తన ప్రేమభావముల్‌ గను నూత్న కళలన-నడలు ప్రాయంపు సన్నలను సూప

కనుల నఱవాల్చి పాతితాక్షముల తోడ-కాంచియును కాంచలేని క్రీగంటికొసలు

పెడల వాలికల్‌ రాల నిల్చెడు త్వదీయ-మౌగ్ధ్య మెడబాయలేదు నా మది లతాంగి!"

అని స్వగత విలాపములన్‌

తనికెడి హృదయంబుతోడ తరుణతనూ మో

హను డొక్క యౌవనుడు కం

చెను దాటుట చూడనయ్యె సీమంతికిన్‌.

మిసమిసలాడు జవ్వనపు మేలిమి మేన మునుంగు వాఱు గా

ని సొగసు సళ్ళినట్టి నలినిం దలపించెడు; ఎద్దియో రహో

స్యసన నిపీడ కానబడు నాతని చూపులయందు, ఆర్తిలా

లసహృదయంబుమాత్ర మకలంకముగా కనుపట్టు మోమునన్‌.

అంత నా యిరువురును అన్యోన్యముఖ వి

లోకనంబులు నెయ్యముల్‌ కొసరికొనగ,

పదియడుగు లీవ లావలన్‌ కదియ నడచి,

చిటికలోపల కలసింరుత్కటభరాప్తి.

కయికయి జేర్చి యొండొరు లొకానొకరీతిని మోదఖేద సం

శయముల నోలలాడుచు; ప్రసన్నము లయ్యు నిమీలితమ్ములౌ

నయనము లెత్తలేక, వదనమ్ముల నేనియు చూచికోక, సై

చియు సయిపంగజాలని స్పృశింపులు తోపగనుండిరయ్యెడన్‌.

ఆజనన బద్ధబాంధన మయిన చనువు,

చిరసమేళన కాంక్షావిశేష రక్తి,

బలవ దాశావిభంగ తాపంబు; ఆ ప

డుచుజతను నేమి సేయు నట్టుల నొనర్చె.

ఆ పగిది పెదవి కదపక,

చూపులు తమకంపు శోష సుడిపడ, నిశ్చే

ష్టాపరవశులై కొండొక

సే పచ్చట నిలువంబడిరి చిత్తరువు లనన్‌.

తుద కా తరుణుడు హస్తము

వదలుచు, నా పుణ్యవతి సొబంగుల మొగము\న్‌

మృదులేక్షణముల విలసన

మొదవింపుచు నెట్టకేని నుదిత మధూక్తి\న్‌.

"కుశలమే నెచ్చెలీ! అనుకూలపవన

మోహనమ్ములే యీ దినమ్ములు? మనఃప్రి

యమె సమస్తం?" బటంచు నెయ్యదియొ పలికె

నంత కంతకు గద్గద మయిన రుతిని.

అశ్రుకణీకామలీమస మయిన యతని

కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు

తెఱచి యుండియు కనలేని తివుట లొదవె

కలికి నవఘర్మకలుషితగండములను.

గళితవిలసన మగు మోము, ఎలుగు రాలు

పడిన కంఠము, నిర్వేదభరముదోప,

కట్టెదుట నున్న మిత్రు నుత్కంఠ నరసి

తహతహంపడు చబల నేత్రముల నెత్తి.

తమి విదారించు నవచంద్ర ధవళరోచి

రుదయములు బోని చూపులు, మృదువు లయిన

ఱెప్ప జవనిక లొత్తికొం చప్పుడపుడు

ప్రియునిపై వెల్లివిరియ త్రిప్పెను మొగంబు.

చిదికి చిదుకని వలపులన్‌ చెనకువగలు,

విడిచి విడువని మౌగ్ధ్యంబు వడయు లజ్జ,

సమయభరమును, వినయ ప్రసన్న బుద్ధి,

ఒకటి నొకటి మచ్చరికించు చుండ నామె

సోగకన్నులు విప్పారజూచి ప్రియును

పలుకుల హృదంతరార్థ మేర్పడగ ననియె;

అస్ఖలిత మగు ప్రేమరహస్య సూత్ర

విశద బుద్ధిన్‌ హృదయవాద కుశల యగుచు.

"సఖుల మనః ప్రియబంధము

లఖండము లటంచు విందు మకటా! యెటులన్‌

లిఖియింపక తాళితివి, న

ను ఖిన్న పడజేయుట తగునో నీకు సఖా!

పాలును మీగడల్‌ మెదిపి వండినయన్నము లాఱనీక యే

వేళయు తప్పకుండి తినిపించిన మోహపు తల్లి కామితం

బేల నిరాకరించితివి; ఈ సఖి, నాజననానురక్త, నే

లీల కృశింప జేసితి, చెలీ! యిట్లు లౌనె ప్రియానువర్తనల్‌!

శైశవంబాది నిష్కలుషముగ పెరిగి

నా మనోలీన మైన ప్రాణంపు ప్రనయ

మింత తలపోయనైతి వాద్యంతములును,

ప్రేమతత్వము వెఱిగిన వృత్త మిదియె?

విడుపు లెఱుగని కోర్కులన్‌, ఎడలు గనని

భావపరిచయముల, నింతవరకు తనిసి

తనయని అభేదరాగబంధములు పెనచి,

ఏల త్రెంపగ నిపుడు సుహృద్వతంస!"

అని యిటు లనుగుంగతి పై

కొన వగపులు పలికె గువ్వకుత్తుకతో నా

గుణవతి ఆకర్ణవిలో

చనముల విశ్వాసబాష్పసలిలము నిండన్‌.

కలిపిన గాటపుంజెలిమి కాంక్షలు పెంచగ, రేల్పవల్‌ తలం

పులను 'మమేకమైన' వలపుల్‌ కడకు\న్‌ కడగండ్ల పాలుగా

కలసిన జంటయందు, సఖికంఠ మటుల్‌ పెకలె\న్‌; ప్రదోషదో

హల మయి తోడనే యార్తవచోగతితోచె నిట్టుల\న్‌.

"నాయనుంగుజెలీ! చెలిమినానిన చిత్తమె మెత్తగిల్లు, నా

శాయతరంజనం బయి ప్రియంబు లిగిర్చిన యా దశల్‌ కడుం

దీయము లేమి చెప్ప! విడదీసిన రేకులపూవు చంద మై

పోయిన మైత్రి కే గతులు పో వలవంతలుదక్క నీ భువిన్‌.

బాలా! యేటికి మాటలెత్తి నను నొవ్వంజేసె దింకన్‌, వృథా

లీలాభ్రాంతి యటం చెఱుంగక వ్యధాలీనుండ నైతిన్‌ తుదిన్‌,

చాలున్‌ నెయ్యపుతీరుతియ్యములు, బాష్ప జ్ఞానవిద్యార్థినై

కాలంబు న్వయసున్‌ వ్యయించెదను సౌఖ్యంబౌను నిశ్శాంతిమై.

సరసము లైన వావివరుసల్‌ కలుపంగ, అభేదరాగముల్‌

తిరముగ పాదుకో ప్రణయలీనులమై, తుద కిట్లు దైవపుం

బరుసముచే నెడాట లలమన్‌, తెగత్రెంపులకస్తి కోర్చి యే

కఱకు టెడందతో గడపగాగల మి విషకాలమున్‌ చెలీ!

వదలని కాంక్షమై మొలకనాఱిన నెయ్యము బెంచికొన్న, నీ

హృదయము కక్కసించునలయింపులు ప్రాప్తములయ్యె; ప్రేమముల్‌

చెదరిన శూన్యభావము లిసీ! రుచియింపవు రక్తిలేమి, నో

ముదిద! వియోగమం దమృతమున్‌ విషమున్‌ సమవృత్తులే సుమీ.

పొరు పెఱుంగక ఒక కంచమున భుజించి,

మనసు నాటిన మమతల ననగి పెనగి,

వలచుజతలను విడదీయ తలచు నేని

ప్రేమ నలయించు సృష్టి దైవికము కాదు!

ప్రియతమం బగు వస్తుసంప్రీణనమున

ప్రాణికిని హాయి కుదురు, నాపయి ప్రశాంతి

యొదవు, నుజ్జీవ శూన్యమౌ బ్రదుకునకును

లేదు తన్మయో న్మీలనామోదసుఖము.

మృదువు లైన యస్మదునార హృదయముల ప్ర

ణయ రసోదయ మనుచిత మయిన నగును!

శుక్తి ముత్యాలు పుట్టుట చోద్యమేని,

పద్మమున తేనె యూరుట పాపమేని!

కాయ మీడ్చెడునందాక, కాల మిచ్చు

భాగధేయము లనుభవింపకయ తీర

దబల! పంచుకొన్న విధినియామములను

ఖేదమో మోదమో యగు, లేదు వేఱు.

ఉదయలక్ష్మికి నఱుత నొప్పిదము నెఱపు

మంచి ముత్యాలదండ లౌ మంచుబొట్లు

సాంధ్య కాంతా వియోగ బాష్పములు గాగ

మాఱు టెఱుగవొ సృష్టిమర్మముల సరణి!

విగతకాలుష్య ముదిత మౌ జగతి విడిచి,

కాలగతి తమ శోభ లెక్కడనొ దాచి,

శారదశశాంకవిశదనిశాంతములను

మంచు కన్నీళ్ళు గార్చవే మబ్బు లబల!

మోహనవసంతునకు మోదమును ఘటించు

మసృణ ముగ్ధం బయిన మావి పసుపుటాకు,

హిమకుమారుడు రక్తి మాయింపజేయ

డే సఖీ! కాలచపలున కేది నియతి!

సరస సాంగత్య సుఖ వికాసములకన్న

దుస్సహ నియోగ భరమె మధురము సకియ!

బాధ లేక వ్యసనరుచి బోధపడదు

చీకటులు లేక దీపిక చెలగ నట్లు.

ననుపు జాఱ జతీభావమున మునింగి,

పూలతోటలలో నున్న, పూర్ణ చంద్ర

చంద్రికలు కాయుచున్న, కాంక్షావిముక్త

హృదయము ప్రసన్న లలిత మై ముదము గనదు.

కాంక్ష నశియింపని వియోగకాలమందు

సర్పమును గాంచి భ్రమియించు సఖుల పాలి

పూలదండ యటంచును; పూలదండ

గాంచి కాలపాశం బనున్‌ కాంక్ష తెగిన.

విశ్వంబం దుదయించు ప్రాణి యొకటం బ్రేమించి లీలావిలా

సైశ్వరంబుల నందు, అందక కటా! అర్థించు ప్రాణప్రబం

ధాశ్వాసాంతమునన్‌ తదశ్రుజలదేయాప్యాయమున్‌, జీవిక

ష్టైశ్వర్య స్థితినిచ్చు మైత్రియె సుమీ, ఆషాఢకా దంబినీ!

నష్టమైనట్టి ప్రేమఖండముల కొక్క

సుకవి యక్షరజీవగీతికయ చాలు

సకియ! విశ్వాస బాష్పముల్‌ చాలు నాకు,

లేదు వేఱాస ప్రణయ వల్లీమతల్లి!

మఱువంబోకుము నెచ్చెలీ! ప్రణయరమ్యం బైన యానాళ్ల, నే

మఱుబోకించుక జీవితాంతమున ప్రేమన్‌ ప్రేమబాష్పాంజలిన్‌

మఱువంబోకుము ముగ్ధరాగపరిణామప్రాప్యవిన్యాసముల్‌

మఱువంబోకుమి యీ కథన్‌ మఱచిపొమ్మాసర్వమున్‌ శాంతికై!

అని సాశ్రూక్తుల నిర్గత ప్రణయవిన్యాసంబు దోపంగ ప

ల్కినయానేస్తపుకానియాననమువాల్‌ క్రీగన్నులన్‌ చూచిచూ

డని చందంబున జూచి యిట్లనియె, గూఢప్రేమలీలావినూ

తన భంగీపరిపాటి తేటపడ, నా తన్వంగి శాంతశ్రుతిన్‌.

తగు నోయీ మిత్రుడ! నె

వ్వగలన్‌ దురసిల్ల, ప్రేమబంధము లకటా!

తెగ వోయీ తెగ ద్రెంపిన;

మిగులగ నిత్తురె మనంబు మిథ్యాభ్రమలన్‌!

దైవికం బగు సుకృతిని దక్క నవని

జతల ప్రేమోదయంబు సంగతము కాదు,

అందు నస్ఖలిత ప్రణయానురక్తి

చిరతపశ్శుద్ధిచే గాని దొరకబోదు.

బొంది నటించుప్రాణి వలపుల్‌ సుడియించినవేళ, ఇంద్రియా

ళిం దనియంప కౌతుకమలీముస మౌ, నట బడ్డ ధర్మపుం

బందము లీడ్చి యీడ్చి అనపత్యముఖాదికమైన భూతర

క్తిం దగు లూని ప్రేమరుచికిన్‌ వెలియౌట లెఱుంగవో చెలీ!

విషయసుఖేచ్ఛలన్‌ దనియ విహ్వల మైన హృదంతరమ్ము క

ల్మష మయిపోవనీక అకలంక మృదూకృతసాధనన్‌ మనో

విషమగతిన్‌ మరల్చుటె వివేకము, తన్మయమైన యార్ద్రమా

నుషదశలే కృతార్థము లనున్‌ కవివాణి యనంగు నెచ్చెలీ!

చైత్రుతో వచ్చు పల్లవసముదయంబు

హిమవదాగమమున నశియించునట్లె,

పడుచుదనముతో చిగురించు వలపు లెల్ల

కళు కెడలి కృశించును జరాక్రాంతదశల.

కడలితరగల నిలకడల్‌ గలవటోయి?

సంజకెంజాయపూతలు శాశ్వతములె?

భంగపరిణతియొకట, దుర్భరతమో వి

కారము మఱొకటను, తప్పగలదె సఖుడ!

వలపు మొగ్గలు దొడిగిన వయసుటనటి

అధిక మోహన మగుట సత్యంబె కాని;

అచిరశిథిలం బగుట విధాయకము; సుమ్మి

కలదె నైమిత్తికముల కస్థలనవృత్తి?

కలిసినయంతమాత్రమున కాదుసుమీ చెలికార! మంతరం

బుల నతుకంగ జాలిన అపూర్వపులంకెయె స్నేహమౌ, తద

స్ఖలిత సమస్తసాధనము జ్ఞానవిదగ్ధుల మార్గసూత్ర, మే

వలతినినైన ప్రేమపరిపాకము లిట్టులె యన్వయించెడిన్‌.

పరమ ధర్మార్థ మయిన దాంపత్యభక్తి,

స్తన్యమోహన మయిన వాత్సల్యరక్తి,

సాక్షి మాత్రసుందర మైన సఖ్యసక్తి,

పొందు నాదిమ మగు ప్రేమయందె ముక్తి,

వలపుల పూలసంకెలలు బందము లేయగ గువ్వజంట, ని

ర్మల మగు వత్సలత్వ మెద రాగిల నావుల తల్లిబిడ్డ, లే

కలుషము లేని సత్ప్రణయకాంక్షలు మేళన జేయ మిత్రముల్‌,

మెలగుదు రీ రహస్యమె సుమీ! కనిపించెడు సృష్టియందునన్‌.

మనసుచే, వాక్కుచేత, కర్మంబుచేత

కలుషితములు కాదగిన వీ వలపు లవని,

తపసుచే, తాల్మిచే, ధ్యానధారచేత

లీనమై యైక్య మీయ జాలినది ప్రేమ.

శాంతియు ప్రేమయున్‌ మధురరసంబులు పేశల రాగలాలిత

స్వాంతదళీపుటంబులను అయ్యవి యస్ఖలితంబు లై మనున్‌

అంతరముల్‌ పెనంచిన ప్రియప్రణయంబులు మాయబోవు, వి

భ్రాంతియె గాక ప్రేమ గలుపన్‌ విడదీయ నిమిత్తసాధ్యమే.

కామము లేని మేళన సుఖంబుగగ్రాలు లతానుమంబు లా

రామములందు నుండియు పరస్పరమున్‌ విడనాడ, వెట్టులీ

ప్రేమతపఃఫలంబును లవింప తెగించితి విప్పుడే చెలీ!

ఏమిటికీ చిరప్రణయవృంత నికృంతన పాపకర్మముల్‌!

నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళక్రింద,

పుస్తకపు పేటికలను, నా హస్తముదిత

చిత్రసూత్రమునందు వసించియున్న

దోయి! యిందాక మనప్రేమయును సఖుండ!

విసఱవోని కాంక్ష వలపించి మది\న్‌ మది జేర్చినట్టి సా

వాసపుపున్నెముల్‌ పడయవచ్చునె స్వప్నములందునేని? లీ

లాసదృశంబులైన భ్రమ లారట బెట్టనిటుల్‌ కుమారులే

కోసిన ప్రేమగర్భమునకు\న్‌ గతులెయ్యవిపో సుహృన్మణీ!

వలపులె రహస్యములు, తద్విఫలదశలు ని

గూఢములు, తదర్థములును గోప్యములు, వి

దగ్ధుల కనుభవైక వేద్యంబు లివియె;

ఏల ప్రేమ గర్భవిమర్శయిపుడు సఖుడ!

కనుల నొండొరులను చూచుకొనుటకన్న,

మనసు లవికారధారణన్‌ మనుటకన్న,

కొసరి 'యేమోయి' యని పిల్చుకొనుట కన్న,

చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ!

భావబంధంబుగా మణిబంధమందు

తొలుత గట్టితి నీ పట్టుతోర మీవు,

విప్పెదవె యిప్పు డనుచు చూపించి, కనుల

నశ్రువులు నిండ పలుకలే దయ్యె నామె!

కనులు వాలిచి, తేటమొగమును వంచి,

సమయ నిస్పృహయై యున్న సాధ్వి నతడు,

నెమ్మిగదుర స్పృశించి, పాణిం దెమల్చి

పలుక నుంకించె నెద్దియో పలుకలేక.

అంసముల జాఱు నుత్తరీయంబు నప్పు

డవల నొత్తి, గుత్తపు కడియాల కరము

సొగసు కన్నుంగవకు నడ్డముగ పెనంచి

కొమ్మ వెన్నూత గాగ ఆ కొమ్మ లినిచె.

హృదయము లగోచరములు తన్మృదుల కఠిన

భిన్న భిన్న సంచారముల్‌ విశదపడని,

వేమి చెప్పంగగలమొ వాచామగోచ

రం బయిన ప్రేమ బహిరంతర వ్యవస్థ.

నిలిచిరి కొండొకవడి ని

ట్టుల నా యిరువురును సుడివడుందమి, పిదపన్‌

చెలియ కరంబున తోరము

వెలివఱిచె నతండు మనము వెడలింప వెతన్‌.

చెంత లవంగవల్లికలచే కడ లల్లి, కిశోర శాద్వలా

క్రాంతములైన పాదులకు కట్టెడు చల్లని నీరు వాఱు కు

ల్యాంతములన్‌ పెరుంగు తరుణార్ద్ర తృణాంకురపాళి గిల్లి ఆ

కాంతుడు వింతయైన యొక కంకణమున్‌ రచియించె నింపుగన్‌.

నవక మెడవోని తృణకంకణమును కేల

నందుకొని యామెపయి నయనాంచలములు

మరలిచి, సకియ! మన ప్రేమ మధురలాంఛ

నం బిదియె సుమ్మి! యనుచు హస్తంబు దొడిగి

ఈ తృణకంకణంబు భరియింపుము నీ మణిబంధమందు, సం

ప్రీతిని అప్పుడప్డు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా

భాతికవేళ నీ ప్రణయ బాష్ప జలాంజలి నింత చల్లి, యే

రీతిని వాడకుండ నలరింపు, మిదే తుదివాంఛ సోదరీ!

అనుచు మొగ మావలకు ద్రిప్పె, నరుణకిరణు

డాశ మార్చినయట్టు, లా యమృత మతియు

వ్రేలి వలపుటుంగరమును వెడల దీసి

ప్రియసఖుని హస్తము నలంకరించు చనియె

వలపు నశియించియును ప్రేమ నిలువగలద

యేని, కలనైన కలుషము గాని స్నేహ

మృదు మధు రసానుభూతిని పొదలి, మనము

నీడ లట్టుల నైక్య మందెదముగాత!

అపు డదృష్ట దేవత కరమెల్ల సాచి

లలితముగ జల్లు నమృతాక్షతల విధాన

వకుళ సుకుమార తరుమతల్లికలనుండి

జలజలం బూలు రాలె నా జంటమీద.

ఆ మృదుశీలపాణి నకటా! విధిమై విడనోచి నట్టి యా

కోమలరాగసూత్రమునకున్‌ పరమావధి గానరామి, వీ

చీమయ మైన కాల్వ వయిచెన్‌ సఖుడా యమ సూచుచుండ, నే

మేమియొ పోకడల్‌ గనుచు నేగె న దెచ్చటికో యదృష్టమై.

పట్టుతోరంబుపై నిల్చి కట్టువడిన

చూపు లంతంతకును సాంధ్యశోభ లట్లు

వెనుదిరుగ, నొండొరుల జూచుకొనుచు వారు

నేగి రల్ల నల్లన దమ యిండ్లు సేర.

కడిగిన మృగమదపాత్రిక

విడవని పరిమళముపగిది, విధినియములన్‌

విడిబడియును వారల పెం

పుడు మైత్రీ సూత్ర బంధములు తెగ వవురా!

Sunday, February 28, 2016

రుక్మిణీదేవి అరండేల్!

రుక్మిణీదేవి అరండేల్!

తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు రుక్మిణీదేవి అరండేల్‌ . ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశారుు. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యం, గౌరవం ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసింది.

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్ర్తి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం థియాసాఫికల్‌ సొసైటీలో చేరింది. ఈమె తన అభిరుచులతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్‌ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్‌కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్‌ ఆఫీసులో జరిగింది.

.

వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా ననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్ర్తీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. 

.

క్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్‌ సొసైటీ వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలు అందుకుంది. రామస్వామి అయ్యర్‌, శివసామి అయ్యర్‌ మొదలైన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేమ్స్‌ కజిన్స్‌ అనే ఇర్లాండ్‌ కవిని ఆకర్షించింది.ఐర్లాండ్‌ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్టమని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్‌ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్‌‌స అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. 

,

తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది. నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో నాట్యమే కాక సంగీతమూ నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుం చుకునేలా చేసింది.

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌తోను, శాంతినికేతన్‌ దేశికోత్తమ బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు... గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్‌కు ప్రధాన పాత్ర ఉంది.కళాక్షేత్ర విద్యార్ధులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తు న్నారు.1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్టప్రతి అభ్యర్ధిత్వానికి పరిశీలించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరిం చడంతో అది ముందుకు సాగలేదు

కొండమీద కనకదుర్గ నవ్వింది .!

కొండమీద కనకదుర్గ నవ్వింది .!

By - Sree Virabhadra Sastri Kalanadhabhatta.. 

ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు. 

*** *** ***

రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయింది. రాజు లబో దిబో మన్నాడు. ఆసమయంలో బ్యారేజీమీద సంచారం తక్కువగా వుంది. ఇంతలో కృష్ణవేణమ్మ నదిలోంచి పైకి వచ్చి ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. నా భార్య నదిలో పడిపోయింది. నాకు ఈత రాదు. ఆమెను రక్షించడం ఎలాగ అని అఘోరిస్తున్నాను అన్నాడు రాజు.

ఓ అదా సంగతి. వుండు అని నదిలోకి మునిగి తిరిగి ఒక అందమైన యువతితో పైకి వచ్చి చూడు నాయనా ఈమేనా అని అడిగింది.

వెంటనే రాజు ఆ! ఈమే అన్నాడు.

ఛీ ద్రోహీ! నీచుడా ఈమె నీభార్యా! ఇదేనా నీభార్యమీద నీకున్న ప్రేమ? అని కోపంగా అంది అసహ్యంగా మొహం పెట్టి (ముందే అసహ్యంగా మొహం పెట్టిందనుకుంటాను)

అమ్మా! నీవు కృష్ణవేణితల్లి వని నాకు అర్ధమైంది. ఇప్పుడు ఈమెను కాదన్నాననుకో. ఇంకొక అమ్మాయిని చూపిస్తావ్ ఆమెకూడా కాదన్నాననుకో. చివరిసారిగా మా ఆవిడను తీసుకు వచ్చి నాకు అప్పగించి, నా నిజాయితీకి మెచ్చుకొని మొదటి ఇద్దర్నీ కూడా ఇచ్చేస్తావు. నాకు తెలియదాం ఏమిటి ఇప్పుడే శాస్త్రి గారు పైనే వ్రాసారు మూడు గొడ్డళ్ళ కథ. తల్లీ! ఒక భార్యతోనే వేగలేక చస్తున్నాను. నువ్వు ముగ్గుర్ని ఇస్తే వాళ్ళతో ఎలా వేగేది?? అన్నాడు రాజు బేలగా!

కొండమీద కనకదుర్గ నవ్వింది భర్త మల్లిఖార్జునుని, ఆయన నెత్తిమీదవున్న గంగమ్మను చూసి. 

ముగింపు మీ ఇష్టం

Saturday, February 27, 2016

నన్నెచోడుని పద్యశిల్పం.!..

నన్నెచోడుని పద్యశిల్పం.!..

(శ్రీ.కామేశ్వర రావు భైరవభట్ల )

నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం"ఈ కావ్యంలో 

నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం.

.

"పవడంపులతమీద ప్రాలేయపటలంబు

బర్వెనా మెయినిండ భస్మమలది

లాలితంబగు కల్పలత పల్లవించెనా

గమనీయ ధాతువస్త్రములు గట్టి

మాధవీలత కళిమాలికల్ ముసరెనా

రమణ రుద్రాక్షహారములు వెట్టి

వర హేమలతికపై బురినెమ్మి యూగెనా

సన్నుతమగు నెఱిజడలు బూని"

.

తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు?

ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత

(పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది

, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు.

జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక. ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి!

పైగా నాలుగుపోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది. ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం.

ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.

హనుమాన్ చాలీసా !

హనుమాన్ చాలీసా !

.

శ్రీ హనుమను గురుదేవు చరణములు

ఇహపర సాధక చరణములు 

బుద్ధిహీనతను కలిగిన తనువులు 

బుద్బుధములని తెలుపు సత్యములు |!

Wednesday, February 24, 2016

అన్నమయ్య కీర్తన.!

అన్నమయ్య కీర్తన.!

.

అతివ జన్మము సఫలమై పరమయోగి వలె

నితర మోహాపేక్షలన్నియు విడిచె

సతి కోరికలు మహా శాంతమై యిదె చూడ

సతత విజ్ఞాన వాసన వోలె నుండె..

.

శ్రీవేంకటేశ్వర స్వామి వారి వరప్రసాదమైన అన్నమాచార్యుల వారు రచించిన 

శృంగార సంకీర్తనల పరమార్ధాన్ని తెలిపే అద్భుతమైన

ఒక సంకీర్తనను గూర్చి స్థూలంగా తెలుసుకుందాం!

ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి

యిదిగాక వైభవం బిక వొకటి కలదా

||పల్లవి||

అతివ జన్మము సఫలమై పరమయోగి వలె

నితర మోహాపేక్షలన్నియు విడిచె

సతి కోరికలు మహా శాంతమై యిదె చూడ

సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||ఇది||

.

తరుణి హృదయము కృతార్ధత పొంది విభుమీది

పరవశానంద సంపదకు నిరవాయ

సరసి జానన మనోజయమంది యింతలో

సరిలేక మనసు నిశ్చల భావమాయి ||ఇది||

.

శ్రీవేంకటేశ్వరుని చింతించి పరతత్త్వ

భావంబు నిజముగా పట్టె చెలియాత్మ

దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు

లావణ్యవతికి నుల్లంబు దిరమాయ

.

అన్నమయ్య ఆధ్యాత్మ, శృంగార రీతులలో సంకీర్తనలు రచించాడు.

రాశి లో శృంగార సంకీర్తనలు అధ్యాత్మ సంకీర్తనలకు మూడు రెట్లు ఎక్కువ.

మధురభక్తి సంప్రదాయంలో ఆత్మార్ధంతో వ్రాసుకున్న ఈ శృంగార సంకీర్తనల పరమార్దం ఆధ్యాత్మ తత్త్వమే!

ఆధ్యాత్మ పద్ధతిలో ఒక యోగి లేక ముని లేక ఋషి నిరంతర భగవత్ చింతనలో ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుణ్ణి ఆరాధిస్తాడు!

చివరకు తపస్సు సిద్ధించి వరుసగా భగవత్ సాలోక్యము, సాయుజ్యము, సామీప్యము, సారూప్యాన్ని పొందుతాడు. (స్థూలంగా భగవంతునిలో ఐక్యమౌతాడు) 

అలాగే శృంగార సంకీర్తనలో పేర్కొనబడిన నాయిక నిరంతరం అంతరంగ తలపుల తరంగాలలో భగవంతుని నిలుపుకొని తన కోరికల కుసుమములను ఆ భగవంతునికి సమర్పించి,

ఆ విధంగా కోరికలు లేని స్థితికి చేరుకుని, నిశ్ఛల భావంతో పరతత్త్వాన్ని చింతించి చివరకు

ఆ భగవంతునిలో ఐక్యమౌతుంది. ఇదీ మధురభక్తి శృంగారం లోని అంతరార్ధం!

"రారండోయ్ బాలల్లారా రారండోయ్ "

"రారండోయ్ బాలల్లారా రారండోయ్ " 

.

Veera Narasimha Raju గారికికృతజ్ఞతలతో....

.

1940 ల నుండీ 1970 ల వరకు ఆనాటి పిల్లలందరికీ వాళ్ళు అన్నయ్య అక్కయ్యలే. 

ఎందఱో తెలుగు వారి పిల్లలు ప్రతి ఆదివారం బాలానందం లో హాయిగా ఆడుతూ పాడుతూ గెంతులు వేసారు. "రారండోయ్ బాలల్లారా రారండోయ్ " అంటూ పిలిచి అందరినీ మంచి పౌరులుగా తీర్చి దిద్దారు. 

అందుకే ఆనాటి వారిలో దేశ భక్తీ, కళాత్మక తృష్ణ ప్రతి ఒక్కదాని మీద సదభిప్రాయం కలిగి ఉండేవారు .

బాల అక్కయ్య బాల అన్నయ్య గా శ్రీ న్యాయపతి రాఘవ రావు గారు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గారు సుప్రసిద్దులు. వారిరువురు మంచి విద్యావంతులు. భావి భారత పౌరులను తీర్చి దిద్దడానికి వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు.. తమ ఆస్తులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారు తాము అనుకున్నది సాధించడానికి .. బాలన్నయ్య బాలక్కయ్య దివ్య స్మృతికి .. బాలన్నయ్య న్యాయపతి రాఘవరావు గారి వర్ధంతి సందర్భంగా .


బాక్సా? భార్యా? (స్కెచ్ ).

బాక్సా? భార్యా? (స్కెచ్ ).

.

(By - Sri.Virabhadra Sastri Kalanadhabhatta.)

.

అరోజు మహిళామండలి వార్షికోత్సవం. ఈ సారి సెలిబ్రేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, సభ్యురాండ్రతోబాటు వారి భర్తలు కూడా ఆహ్వానింపబడడం. భార్యలపోరు పడలేక చాలమంది భర్తలుకూడా హాజరవడంతో హాలు కిక్కిరిసి వుంది. 

సభాప్రారంభ సూచనంగా కార్యదర్శిని అధ్యక్షురాలిని, ఇతర వక్తలను వేదికమీదకు ఆహ్వానించారు. అధ్యక్షురాలు శ్రీమతి రాధాభాయమ్మగారు వేదికమీదకు వస్తూవుంటే చప్పట్లతో హాలు మారుమ్రోగింది. ఆమె వచ్చికూర్చోగానే ఒక చిన్నపాప వచ్చి ఆమె మెడలో గులాబీల దండవేసింది. 


రాధాభాయమ్మగారు లేచి సభకు నమస్కరించి మైకు దగ్గరకు వచ్చి సుతారంగా వ్రేలితో మైకును మీటి అది పనిచేస్తోందని నిర్ధారించుకొని, కళ్ళజోడు సవరించుకొని తమ వుపన్యాసం ప్రారంభించారు. 


సభకు నమస్కారం. ఈరోజు సుదినం పర్వదినం సభ నేత్రానందకరంగావుంది. కారణం వేరే చెప్పనక్కరలేదనుక్కుంటాను. మన మహిళా మండలి సభ్యురాళ్లతోబాటు వారి భర్తలు కూడా రావడం ఎంతోముదావహం మరియు శ్లాఘనీయం (చివరముక్క ఆమె తప్పకుండా తమ వుపన్యాసంలో వుపయోగిస్తారు) 


సరే విషయంలోకి డైరెక్ట్ గా వచ్చేస్తా. ఇక్కడకు వచ్చిన మగవారికి ఒక చిన్న ప్రశ్న. మీరూ మీభార్య లక్షరూపాయలున్న ఒక బ్రీఫ్ కేసు తో ఒకనదిలో చిన్న పడవమీద వ్యాహాళికి వెళ్తున్నారనుకోండి. అహ! ఉదాహరణకు. మీరే నావకు తెడ్డువేస్తున్నారు మాయాబజారు సినిమాలో ఎ ఎన్ ఆర్ లాగ. ఇంతలో విధిబలీయమైనది. (ఇది కూడా వారు వాడే పడికట్టు మాటే) మీనావ తిరగబడి మీరు మీభార్య బ్రీఫ్ కేసుతో సహా నదిలో పడ్డారనుకోండి పాపం శమించుగాక. ఇది కేవలం వూహ మాత్రమే. అలాంటప్పుడు మీరు మీభార్యను రక్షిస్తారా లేక లక్షరూపాయలున్న మీబ్రీఫ్ కేసుకోసం తాపత్రయపడతారా? భార్యను రక్షిస్తామనే వారు దయచేసి చేతులు ఎత్తండి.

.


హాలులో వున్న మగవారందరూ చేతులెత్తారు ఒక్క రామారావు తక్క. 


అంతా అతనికేసి పురుగును చూసినట్టు చూసారు . 


రాధాభాయమ్మగారు అతనికేసి చూసి తమపేరు అని అతివినయంగా వ్యంగ్యంగా అడిగారు. 


రామారావు 


ఆపేరా!! అందుకనేనా బాబూ భార్యను వదలి వెధవడబ్బుకోసం వెంపరలాడడం ? 


వెధవ డబ్బా? లక్షరూపాయలంటే సామాన్యమాండి?? 


అయితే ఆలక్షరూపాయలకోసం అలనాటి రాముడిలా భార్యను ఆమె మానాన్న ఆమెను వదిలేస్తారా? ఆమే మునిగిపోతూవుంటే చూస్తూ వూరుకుంటారా? అని క్రోధంగా అడిగారు రాధాబాయమ్మ గారు 


షేం షేం అని సభలో కేకలు 


నాభార్య ఎందుకు మునిగిపోతుంది?? ఆమెకు ఈత బాగావచ్చు. చక్కగా ఈదుకుంటూ వస్తుంది. 

సభలో పిన్ డ్రాప్ సైలెంట్ 


ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముందేల సందేహముల్??

భాగవత పద్యాలు!

భాగవత పద్యాలు!

"అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలసుధంబు దా,

పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో,

త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి,

హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై"

.

వైకుంఠపురం . అందులో సరస్సు , సరస్సు పక్కనే మందారవనం . మందారవనంలో ఒక చలువరాతి మంటపం .

అక్కడే కలువపూలు పరిచిన పర్యంకం . మందహాస వదనారవిందుడై పర్యంకం మీద పవళించి లక్ష్మీ మాతతో సరస సల్లాపాలలో మునిగి ఉన్నాడు మాధవుడు . అకస్మాత్తుగా వినిపించింది గజేంద్రుని ఆర్తనాదం . 

క్షణంపాటు తొట్రుపాటు పడ్డాడు . భక్తుడు కష్టాలలో చిక్కుకున్నాడన్న విషయం తెలిసింది . గజేంద్రుని కరుణించాలనే తపన తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు పరమాత్ముడు . ఇతరులకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినవాడు తానే ఇతర విషయాలన్నీ వదిలేసి ఉన్నపళంగా బయలు దేరాడు భక్తుని రక్షించడానికి . ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఇదే .

.

"సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే

పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధితశ్రీ కుచో

పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై"

.

సమయం లేదు . గజరాజును కాపాడలనే తపనలో లక్ష్మీ మాతకు కూడా ఎక్కడకు వెడుతున్నాడో చెప్పలేదు . శంఖచక్రాలూ , తనపరివారమూ , వాహనమైన గరుడుడూ జ్ఞాపకం రాలేదు . ఎంత తొందరంటే పట్టుకున్న లక్ష్మీ దేవి కొంగు విడవాలని కూడా అనిపించలేదు . మహావిష్ణువు మనః స్థితిని అందరికీ తెలిసిన పై పద్యం ద్వారా చెప్పాడు పోతనామాత్యుడు . బాగానే వుంది . తొందరపాటులో ఏం చేయలో నిర్ణయించుకోలేక పోతున్న విష్ణువును చూచి చలించి పోయింది క్షీరసముద్ర రాజ తనయ .విషయమేమో తెలియడం లేదు . తెలుసుకోవాలనే కోరిక . అడగాలంటే సంకోచం . మన గృహాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి . అప్పుడు భార్యలేం చేస్తారో తెలియదు కాని , మాత మాత్రం కింద చెప్పిన విధంగా ప్రవర్తించింది . మాత ఏం చేస్తోందో పద్యంలో మనకు తెలియ జేస్తున్నాడు మహానుభావుడు పోతన 

.

.

"అడిగెద నని కడు వడి జను 

అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్

వెడ వెడ జిడి ముడి తడబడ

నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్"

.

” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో 

ఒక అడుగు ముందుకు జరిపింది . 

అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది .

ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది .

వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు 

.

పోతన్న . పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది . శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . 

అందుకే అన్నాడో కవి 

” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .

Tuesday, February 23, 2016

మాహోదయం లో మంచి మూహుర్తం మాధవి లతకు పెండ్లి .!

మాహోదయం లో మంచి మూహుర్తం 

మాధవి లతకు పెండ్లి .. 

కొమ్మ కొమ్మకు ఒక సన్నాయి .. 

రెమ్మ రేమ్మకు ఒక తువాయి .. 

ఈ పాట మా పెద్దక్క పెండ్లి కి

శ్రీ దేవు పల్లి కృష్ణ శాస్త్రి గారు బహుమతి గా రాసి

సీతా అనసూయ చేత పాడిం చేరు.(1944)

ఇప్పుడు మా సోదరి శ్రీమతి బొడ్డు సుబ్బలక్ష్మి (సిరి ) పాడింది ,

ఈ పాట మా ఇళ్ళలో ప్రతి పెళ్ళికి పాడుకుంటాం 

https://www.youtube.com/watch?v=RnUp2Y0s_So

.

అమ్మాయిని చూస్తే !

అమ్మాయిని చూస్తే !

.

ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు,

పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు,

బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని 

ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి..

అమ్మాయిలకి నిజమైన అందం ఈ అలంకరణల వల్ల ఏదీ రాదనుకుంట....!!!

.

ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని? 

వాడేవడో ఈ అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు

అని అనిపించింది.

ఎందుకో అమ్మాయిని చూస్తే " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి 

మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా? అని అనుమానం కలిగింది.

.

సంతకెల్లి.. నా మావ.

సంతకెల్లి..

నా మావ.

అద్దమే తెచ్చాడు

అద్దమందు

నన్ను నే చూసుకొన

అందాలరాశి

కనిపించె......

అప్పుడర్ధమైనది నాకు

నా మావ...

పగలు,రాత్రి

నా సుట్టెందుకు

తిరుగుతున్నాడో!!!

రామరాజ్యం - 11000 సం. లేదా 30 సం?

రామరాజ్యం - 11000 సం. లేదా 30 సం? 

(Vvs Sarma గారి వ్యాసం ... మన ఒక రోజు వాల్మీకి తర్క పరిభాషలో ఒక వత్సరము .)

రామరాజ్యం - మన భారతదేశీయుల కల, ఆదర్శం - 

అయోధ్యలో ఆనాడు రామచంద్రుని పరిపాలన ఎన్నిరోజులు సాగింది? 

మనకు వాల్మీకి రామాయణమే ప్రమాణం. రామాయణంలో వాల్మీకి వాక్కు ఏమిటి? 

दश वर्ष सहस्राणि दश वर्ष शतानि च |

रामो राज्यम् उपासित्वा ब्रह्म लोकम् प्रयास्यति || १-१-९७

"On reverencing the kingdom for ten thousand years plus another one thousand years, i.e. for a total of eleven thousand years, Rama voyages to the abode of Brahma... [1-1-97]

రాముడు దశ సహస్ర వత్సరాలపై దశ శత వత్సరాలు రాజ్యాన్ని

ఉపాసించి తదుపరి బ్రహ్మాలోకానికి పయనమయాడు. 

తెలుగులో సాధ్యమయినంత సంస్కృత వాక్య నిర్మాణం ఉపయోగించాను. 

సంవత్సరము అనకుండా వత్సరము (వర్షము అనే పద ప్రయోగానికి దగ్గరగా) ఉపయోగించాను. 

11000 వేల ఏళ్ళు (years) పాలించి బ్రహ్మగారి నివాసానికి వెళ్ళాడు అన్నట్లున్నది ఆంగ్లానువాదం లోని (abode) అనే పదం. 

ఇది రామాయణంలో (రాముని ప్రయాణంలో) భాగమే . 

రాముడు ఇహలోక యాత్ర ముగించి పరలోక యాత్రలో నిమగ్నుడయాడు. 

వాల్మీకి మహర్షి తపస్వి. రామ మంత్రముతో సిద్ధుడైనవాడు.

రాముని ప్రయాణంతో అతని చిత్తం అనుసంధానమైనది. 

మానవులం మనం సరయూనది ఒడ్డునే అయోధ్యలో ఉన్నాము. 

వాల్మీకి రామాయణం తర్క పరిభాషలో శబ్ద ప్రమాణం. 

కాని మనం చెప్పుకున్న అర్థం వాల్మీకి ప్రయోగానికి అర్థం కాదు. 

ఒక తార్కికునిగా నాకు అర్థ మైనది రాముని అయోధ్యా పరిపాలన

కేవలం 30 సంవత్సరాలు. ఈలెక్కలో ఇంద్రజాలము ఏమీలేదు. 

11000/365 = 30 (సమీప పూర్ణాంకం).

ఆ పదప్రయోగంచేసేసరికి వాల్మీకి చిత్తం మనలోకంలో లేదు.

దేవలోకంలో యుగాల పరిమాణం ఇలా ఉంటుంది - 

సత్య 4800, త్రేతా 3600, ద్వాపర 2400, కలి 1200 మొత్తం 

12వేల సం (శబ్ద కల్పద్రుమం) 

देवानां द्वादश सहस्र वत्सरेण चतुर्युगं भवति । 

మిత్రులు జాజిశర్మగారి వాదన నా అలోచనా సరళికి ప్రోత్సాహం ఇచ్చింది. 

యుగం అనే పదం పురాణాలలో వేరుగాను శాస్త్రాలలో వేరుగాను నిర్వచింప బడినది. యుగాదిలో యుగం అంటే ఒక సంవత్సరం అనీ గమనించాము.

ఉగాది పంచాంగ శ్రవణం చేసే పండితులు 5 సంవత్సరాలు 

ఒక యుగం గా పరిగణిస్తారు. భాగవతం పఞ్చమ స్కంధములో ఈ సంవత్సరాల పేర్లు న్నాయి.

అహోరాత్రాలను కూడా యుగమనవచ్చు. వాల్మీకి అర్థం అహోరాత్రాలనే. యుగ మనే పదానికి రెండు అనే అర్థం ముఖ్యార్థం. యుగ్మం, యుగళం, రెండవ అర్థం సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగాల కాల విభజన. వాచస్పత్యం ఇలా ఇస్తుంది 1. युग्मे द्वित्वसंख्यान्विते 2 सत्यत्रेताद्वापरकलिरूपे - कालविशेषे

శబ్దం వాల్మీకిది. అర్థం మనది. కాళిదాసు రఘువంశ ఆరంభశ్లోకమే దీనికి తార్కాణం. 

వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే |

జగతః పితరౌ వన్దే, పార్వతీపరమేశ్వరౌ ||

ఇక్కడ రఘువంశమే మన ప్రమేయం. ప్రభవాది 60 సంవత్సరాలు నారదుని సంతానం అనే ఐతిహ్యం తెలిసే ఉంటుంది. ఇది నారదుడు వాల్మీకికి చెప్పిన సంక్షిప్తగాధలోనిదే. పురాణంలో చెప్పిన యుగధర్మం ప్రకారం త్రేతాయుగానికి పరమదైవం రవి. 

ब्रह्मा कृतयुगे देवस्त्रेतायां भगवान् रविः ।

द्वापरे दैवतं विष्णुः कलौ रुद्रो महेश्वरः ॥

రామాయణంలోనే చెప్పినట్లు "జ్యోతిషాం పతయేనమః" అని అదిత్యహృదయం చెబుతుంది. జ్యోతిషపరమైన యుగ నిర్వచనంవేరు. .

Monday, February 22, 2016

కవితా చమత్కారం !

వితా చమత్కారం !

-----------------------------

ఉన్నదున్నట్లు చెబితే కవిత్వం యెందుకవుతుంది? యేదో కొత్తదనం ఆమాటలలో జొప్పించాలి. అప్పుడది చమత్కార భాసురమై కవిత్వం అవుతుంది. :" చమత్కార మంజరి "- అనేగ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక చక్కని పద్యం ఉంది. ఒకా నొక చక్రవర్తి గారి చెలికత్తె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడై ఓకవి యిలా వర్ణించాడు.

.

మ: " బిగువుం జన్నులు గాంచి , మాను నల జంబీరంబు బీరంబు! క్రొం

జిగి మోముంగని , సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు ! విం

తగు భ్రూరేఖలు గాంచి , భీతినిడు కోదండంబు దండంబు ! త

జ్జగతీ నాధుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే ? "

జంబీరాది పదాలలో మొదటి యక్షరం లోపించటం ఈపద్యం లోని చమత్కారం! 

.

కథానాయిక బిగువగు వక్షోజములను జూచి, 

జంబీరములు ( గజ నిమ్మ పండ్లు -వానికి స్తనములతో పోలిక కవిసమయము ) బీరమును వదలుచున్నవి .బీరమనగా గర్వము. అందమైన ఆమెముఖాన్ని జూచి రాజీవము (పద్మము) ిగ్గుపడి జీవాన్ని వదలు తున్నది.

( నాయిక ముఖం సహజంగానే గులాబి రంగులోనున్నది. దానిని చూడగానే పద్మం వెలవెలృ బోతోన్నదని ఒక అర్ధం, ప్రాణాన్ని విడుస్తోందని మరోఅర్ధం ) సొగసైన కనుబొమల తీరు జూచి కోదండము (విల్లు ) 

దండం పెడుతున్నదట. కోదండమంటే విల్లు దండం అంటే నమస్కారం .( అందమైన ఆడపిల్లల కనుబొమలను ధనుస్సుతో పోల్చటం కవి సమయం) 

.

అబ్బో! ఇంతటి సుందరాంగు లామహారాజు చెలికత్తెలు. వారి యందాన్ని నే పొగడ గలనా? అని ఆశ్చర్యం ప్రకటిస్సున్నారు కవిగారు.

అజ్ఙాత కర్తృక మైన యీపద్యం ఆకవిగారి కల్పనా చమత్కారానికి నిదర్శన మనటంలో

సందేహం యెంతమాత్రం లేదు గదూ !!


Sadasiva Brahmendra Krithis || Dr. M. Balamuralikrishna || CarnaticClass...

సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి చింతా నాస్తికిల తేషాం
కాంభోజి - ఆది (నవరోజ్‌ - )
పల్లవి:
చింతా నాస్తికిల తేషాం
చింతా నాస్తికిల॥
చరణము(లు):
శమ దమ కరుణా సంపూర్ణానాం
సాధు సమాగమ సంకీర్ణానామ్‌॥
కాలత్రయ జిత కందర్పాణాం
ఖండిత సర్వేంద్రియ దర్పాణామ్‌॥
పరమహంస గురుపద చిత్తానాం
బ్రహ్మానందామృత మత్తానామ్‌॥సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త.
18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు.
ప్రధానంగా సంస్కృతంలో ఆయన రచనలు ఉన్నాయి.
ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని
కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు
.
బహుళ ప్రజాదరణ పొందిన ఆయన కీర్తనలు కర్ణాటక సంగీత సభల్లో తరుచూ వినబడుతూ ఉంటాయి. కొన్ని:

ఆనందపూర్ణ బోథోహం సచ్చిదానంద - శంకరాభరణ రాగం
ఆనందపూర్ణ బోధోహం సతతం - మధ్యమావతి రాగం
భజరేగోపాలం - హిందోళ రాగం
భజరే రఘువీరం - కళ్యాణి రాగం
భజరే యదునాథం - పీలు
బ్రహ్మైవహం - నాదనామక్రియ
బ్రూహి ముకుందేతి - గౌళ, నవరోజు, కురింజి, సెంచురిత్తి
చేత శ్రీరామం - ద్విజయంతి, సూరతి
చింత నాస్తి కిల - నవరోజు
గాయతి వనమాలి - గావతి, యమున కళ్యాణి
ఖేలతి బ్రహ్మాండే - సిందుభైరవి
ఖేలతి మమ హృదయే - ఆతన
క్రీడతి వనమాలి - సింధుభైరవి
కృష్ణాపాహి - మధ్యమావతి
మానస సంచరరే - సామ
నహిరే నహిరే - గావతి
పివరే రామ రసం - ఆహిర్ భైరవ్
పూర్ణబోధోహం - కళ్యాణి
ప్రతివరం నరం - హనుమతోడి
సర్వం బ్రహ్మ మయం - మిశ్ర శివరంజని
స్మరవరం - జోగ్
స్థిరత నహి నహీరే - అమృతవర్షిణి
తత్వత్ జీవితం - కీరవాణి
తుంగ తరంగే గంగే - హంసధ్వని

భారతీయ ఆలోచనా విధానం.!

భారతీయ ఆలోచనా విధానం.!

(Vvs Sarma గార్కి కృతజ్ఞతలతో.)

.

సద్గురు శివానందమూర్తిగారు ఇలా అన్నారు 

- The greatest creation of God is man

while the greatest discovery of man is God.-

ఈ వాక్యము గురించి న్యూటన్, ఐన్స్టీన్, స్టేఫెన్ హాకింగ్ వంటి విజ్ఞానవేత్తలు ఏమంటారు?

న్యూటన్ క్రైస్తవుడు. బహుశ “నేను దేవుని నమ్ముతాను.

దేవుని కుమారునికూడా నమ్ముతాను” అంటాడు.

.

యోగేనాంతే తను త్యజాం .!

.

ఐన్స్టీన్ యూదుడు. దేవుని నమ్ముతాడు. వారిద్దరికీ దేవుడు ఒక విశ్వాసం.

, Einstein refused surgery, saying: "I want to go when I want. It is tasteless to prolong life artificially. I have done my share, it is time to go. I will do it elegantly.” His science and philosophy certainly correspond to that of a Yogi..

.

యోగేనాంతే తను త్యజాం (కాళిదాసు)

.

"అహం కాలోస్మి"!

.

హాకింగ్ నాస్తికుడు. "కాలము సంక్షిప్త చరిత్ర" (A brief history of time) తో సైన్సు రచయితగా కూడా పేరుగొన్న శాస్త్రవేత్త. అతని మాటలలో

“We are each free to believe what we want and it is my view that the simplest explanation is there is no God. No one created the universe and no one directs our fate. This leads me to a profound realization. There is probably no heaven and no afterlife either. We have this one life to appreciate the grand design of the universe, and for that, 

I am extremely grateful." He once declared himself an atheist.

భారతీయ ఆలోచనా విధానంలో హాకింగ్ ఆలోచనా సరళి మనకు ఏమనిపిస్తుంది?

హాకింగ్ కు సృష్టినీ దేవుడిని గురించిన సంపూర్ణ అవగాహనలేదు. కాలము ఉన్నదని దానివిషయం తెల్సిన జ్ఞానికి, "కాలమే దేవుడు" అని తెలియదు.

అతడు "అహం కాలోస్మి" అనే గీతావాక్యం వినలేదు" అనిపిస్తుంది.

నిజానికి అతడి కొన్ని పలుకులను చూస్తే ఒక వైజ్ఞానికుని గా అతడు హిందూ/బౌద్ధ వేదాంతానికి దగ్గర గా వస్తున్నాడు. 

Hawking has stated that he is "not religious in the normal sense" and he believes that "the universe is governed by the laws of science. The laws may have been decreed by God, but God does not intervene to break the laws”. His normal sense is Christianity and in the next life probably he would be born a Hindu.

నేను చెప్ప దలచినది ఒకటే. నేను పైన చెప్పిన పదాలు వేరు వేరు.

లేకపోతే రామదాసు గారి బక్క దైవాలు, శ్రీనాథుడి చిల్లర దేవుళ్ళూ ఎవరు? 

అందరూ ఒకటే అయితే తిరుపతి, కాశీ, రామేశ్వరం, వెళ్ళడం ఎందుకు? 

.

తత్త్వమెరిగి పూజ చేయాలి. రుద్రాభిషేకం వేరు, సత్యనారాయణ వ్రతం వేరు, 

గణపతిపూజ వేరు, పితృదేవతల ఆరాధన వేరు. 

అభిషేకంలో మృత్యుంజయ మంత్రం రుద్రుణ్ణి ఉద్దేశించినది. 

నమోభగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనేది యజుర్వేద మంత్రం. 

కేశవుడు వేరు, నరసింహుడు వేరు, కృష్ణుడు వేరు - 24 విష్ణువులు. 

క్రైస్తవ మహమ్మదీయుల మతాలు స్వర్గ ప్రాప్తి వరకే, మోక్షాన్ని ఈయవు. 

ఎవరి దేవుడు వారికే. నాస్తికునికి ఈ జన్మలో దేవుడు కనిపించడు. 

ఆస్తికులకు ఎవరికి వారికి వారు ఆరాధించిన దేవ దర్శనం జరిగే అవకాశం ఉంటుంది.

శ్రీ వేమన పద్య సారామృతము .!

శ్రీ వేమన పద్య సారామృతము .!

.

శ్లో ||బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల 

బమ్మనెరుగలేని బాపడేల ?

తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-బ్రహ్మాండం అనే పట్టణంలో ఉన్న బ్రాహ్మణుడికి బ్రహ్మాన్ని గురించి తెలియకపోతే అతడు ఇంకా బ్రాహ్మణుడేమిటి ?తనను తాను తెలుసుకోవడమే బ్రహ్మ .

.....

శ్లో ||అగ్ని శిఖల యందు నమరంగ మమకార 

మభవు మీద ధ్యాస మలర నునిచి 

యాహుతి యగు వెనుక హరున కర్పిత మౌను 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-ఈశ్వరుని మీద మనస్సును నిలిపి నిలకడగా ఉంచి సుజ్ఞానం అనే అగ్నిలో మమకారాన్ని హోమం చేస్తే అది ఈశ్వరార్పణం అవుతుంది .

.....

శ్లో ||నిజము యేల నెరిగి నిత్యుండు గాడాయె ?

పలుకులోని బిందు పదిల పరచి 

వేడుకైన బిందు వెదబెట్ట కుందురా 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :- నిజాన్ని తెలుసుకుని నిత్యుడు కావడం మంచిది ,మాటలలోని మధురిమను భద్ర పరచు కుంటూ శాశ్వత పదార్ధ బోధ వాక్యాలను మనస్సులో నింపుకుని ఉండడం శ్రేష్టం కదా !

......

శ్లో ||ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు 

ముక్తుడైన గాని మునియు గాడు

మునికి గాని సర్వ మోహంబు లూడవు

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-ఆశలు విడిచినవాడే బంధాల నుంచి విడువబడు తున్నాడు ,అతడే ముక్తుడవుతున్నాడు ,అనంతరం మునిగా మారి అన్ని రకాల మొహాల నుంచీ బయట పడుతున్నాడు .

.....

శ్లో ||సద్గురుకృప జ్ఞానంబున 

సద్గతి దీపింపు చున్న చాలా చదువుల్ 

సద్గతి గలుగగ జేయును 

సద్గురువే దైవమనుచు జాటర వేమ !

తా:- వేదాంత తత్త్వాన్ని విపులంగా చెప్పడానికి లోకంలో ఎన్నో మంచి శాస్త్రాలున్నాయి ,అవన్నీ తెలియాలంటే మంచి గురు కటాక్షం వల్ల లభ్యమవుతోంది ,కనుక మంచి గురువు దైవం లాంటివాడు .

......

శ్లో ||ఎరుకుమాలు జీవి యెంత కాలంబుండి 

చచ్చి పుట్టు చండు సహజముగను 

యెరుక మార్చు చోటు నెరుగుట బ్రహ్మంబువి 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-కొందరు అజ్ఞానులై పుట్టు చావులను కాల ప్రవాహంలో ఛస్తూ పుడుతూంటారు ,అది వారికి సహజం ,వారా అజ్ఞానంలోంచి బయటపడిన నాడే బ్రహ్మాన్ని చూడగలుగుతారు .

......

శ్లో ||ఈషణ త్రయంబు నెడపండ నేరక 

మోహ రాసి లోన మునిగి యుండు 

జనుల కెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా ?

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :- ధనేషణ ,దారేషణ మరియు పుత్రేషణ అనే ఈ షణ త్రయాన్ని విడువక సర్వదా స్త్రీ లోలురై ఉండే మానవులకి మోక్షం సౌఖ్యం ఎలా తెలుస్తుంది ?

......

శ్లో ||విషయముల బొరలి రోయక 

విషమంటిన గతిని జూచు విధమున ధరలో 

విషసమ మాయా సుఖముల 

విషయములన్ గూడా కుండ్రు వేత్తలు వేమ !

తా :-ఈ లోకంలో విషయ సుఖాల కోసం ప్రాకులాడటం మంచిపని కాదు ,ఇంద్రియ సుఖాలను విషం అంటుకున్న వాటి వలే చూస్తూ వాటి జోలికి పోకుండా ఉంటారు బ్రహ్మ వేత్తలు .

వినాయకుని వలెను బ్రోవవే! .

త్యాగరాజ కీర్తన -
వినాయకుని వలెను బ్రోవవే!
.
1. వినాయకుని వలెను బ్రోవవే
మధ్యమావతి – ఆది
పల్లవి:
వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
॥వినాయకుని॥
అను పల్లవి:
అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని
॥వినాయకుని॥
చరణము(లు):
నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవతలు
రాయడిని జెందరాదు దయ జూడరాదా కాంచీపురాది నాయకి ..
॥వినాయకుని॥
పితామహుఁడు జనహితార్థమై నిన్ను తా తెలియ వేడ తాళిమిగల
యవతార మెత్తె యికను తామసము సేయ తాళజాలము నతార్తి హారిణి ..
.
॥వినాయకుని॥
పురాన దయచే గిరాలు మూకుకి రాజేసి బ్రోచిన రాజధరి
త్యాగరాజుని హృదయ సరోజ మేలిన మురారి సోదరి పరాశక్తి నను ..
.
॥వినాయకుని॥
భావార్థవివరణ.....
.
కాంచీపురమునందు వెలసియున్న శ్రీకామాక్షీదేవిని గూర్చి
ఈ కీర్తనయందు ప్రార్థించినారు.
.
నీ కుమారుడయిన వినాయకుని కాపాడిన రీతిని నన్ను రక్షించుము
(సుజనాఘ మోచని-)
సజ్జనుల పాపములను హరించుదానా! అనాథరక్షకి!
నీచమానవులకు నీవు వరములనివ్వగా, (రాములై-)
నీయందు అనురాగము కలవారయి ఉండగా భూసురాది దేవతలు అందరూ, నరాధములవలన(రాయిడిని-) రాపిడిని, ఒత్తిడిని పొందవలసినదేనా?
.
శంకరీ! కాంచీపురాధి నాయకీ! జననీ! దయచూడుము.
(పితామహుడు-) బ్రహ్మ ప్రార్థనపై పరదేవత కామాక్షీ రూపమున అవతరించినట్లు సూచితమగుచున్నది.
నతులయినవారి ఆర్తిని హరించునట్టి ఓ జననీ! నీ దయ (మూకునికి రాజేసి-)
మాకు ఉండునట్లుగా వరములిచ్చి కాపాడుము(రాజధరి-) చంద్రుని ధరించినదాన! (మురారిసోదరి-) మురారి సోదరివయి ఉన్నందున పరాశక్తీ!
త్యాగరాజుయొక్క హృదయపద్మమును రక్షించునట్టి (పురాణి-) అనాది స్వరూపిణీ! నీకన్నా గొప్ప దేవతలు లేరమ్మా ....
.
నన్ను నీకుమారుని(వినాయకుని) వలె కాపాడుము.

Sunday, February 21, 2016

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు .. 21-31

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకములు .. 21-31

"పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్

ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే "|| 21 ||

.

మరల పుట్టుక మరల మరణము 

మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని 

అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము.

.

"రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః

యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ "|| 22||

.

కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని, 

పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ, 

యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి 

బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును.

"కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః

ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ "|| 23 ||

.

నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు?

నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు 

ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము.

.

"త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః

సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ "॥24॥

.

నీలో, నాలో, వేరేచోట ఉన్న పరమాత్మ ఒక్కడే.

అసహనంతో నాపై వ్యర్థంగా కోపించుచున్నావు.

అంతటా పరమాత్మనే చూడుము.విభేదమును విడువుము.

.

"శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ

భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్ "॥25॥

.

శీఘ్రంగా పరమాత్మను పొందదలచినచో 

శత్రు - మిత్ర - పుత్ర - బంధువులపట్ల 

విరోధ - స్నేహములకై ప్రయత్నించక 

సర్వసమానభావనను పొందుము.

"కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాఽత్మానం పశ్యతి కోఽహమ్

ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః "|| 26 ||

.

కామ - క్రోధ - లోభ - మోహములను వదలి

నిన్ను నువ్వు తెలుసుకో. 

ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకంలో పడి పీడింపబడెదరు.

.

"గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్

నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్" || 27 ||

.

‪#‎భగవద్గీత‬ - విష్ణుసహస్రనామములను గానం చేయుము.#

ఎల్లప్పుడు విష్ణువుని ధ్యానించుము.మనస్సును సత్పురుష సాంగత్యమునందుంచుము.దీనజనులకు దానం చేయుము.

"సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధంత శరీరే రోగః

యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్ "||

.

స్త్రీతో సుఖించవచ్చును. 

కానీ తరువాత రోగం వచ్చును.లోకంలో మరణమే శరణమని 

తెలిసినా మానవుడు పాపం చేయుట మానడు.

.

"అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యమ్

పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః |"| 29 ||

.

అర్థమే(ధనము) అనర్థమని ఎల్లప్పుడూ భావించుము

.నిజంగా డబ్బు వలన సుఖం లేదు.

ఇది సత్యము.ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును.

ఇదే అంతటా ఉన్నరీతి.

.

"ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారమ్

జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్ "|| ౩౦ ||

.

ప్రాణాయామము - ప్రత్యాహారము - 

నిత్యానిత్యవస్తువివేకము జపంతో కలిసిన సమాధిస్థితి - 

ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించు.

.

"గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాదచిరాద్భవ ముక్తః

సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ "|| 31 ||

.

గురువుగారి పాదపద్మములపై భక్తినుంచి 

తొందరగా సంసారంనుండి బయటపడుము.

ఇంద్రియములను - మనస్సును నియమించినచో

నీ హృదయంలో ఉన్న దేవుని చూడగలవు.

॥ మోహముద్గరః సంపూర్ణః ॥

స్త్రీ ఉదయిస్తుంది!

స్త్రీ ఉదయిస్తుంది

స్త్రీ ఉప్పొంగుతుంది

స్త్రీ విచ్చుకుంటుంది

స్త్రీ పరిమళిస్తుంది

స్త్రీ వర్షిస్తుంది. 

చూపుల్లో ఒక అందం

మాటల్లో ఒక అందం

తాకిళ్లో ఒక అందం

నడుమోంపుల్లో ఒక అందం

నర్తించే పదముల్లో ఒక అందం

ఇలా ఎటు చూసిన ఏం చేసినా

ఉప్పొంగే రమణి అణువణువు అందమే 

ఆమె ప్రతి కదలిక మధురానందమే.

Saturday, February 20, 2016

రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన :

రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన :

రెంటాల జయదేవ గారు ఒక మంచి పాత్రికేయుడు. ఆయన ఎవరితో నైనా ఇంటర్వూ చే స్తే భలేగా ఉంటుంది.

శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో జరిపిన ముఖాముఖీ తాలూ కా కొన్ని పాత అంశాలు :

గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. 

కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. 

‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో…’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. 

ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. 

ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. 

కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా . 

నేను అక్కడే వున్నాను ... నాకు కనపడ లేదు విని పడింది .. 

కళ్ళు మూసుకుంటే .. మాకు కన పడింది .. కళ్యాణి ..(రాగం)

జీవితం లో మరచి పోలేని కచేరి . 

1980 లో కేరళ .. యూనివర్సిటీ సెనెట్ హాల్ లో .. 

అదే అనుకుంటా

Friday, February 19, 2016

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 11-20


మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకములు 11-20

"మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్

మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా "||11 ||

.

ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.

వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.

మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

.

"దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః "|| 12 ||

.

పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , 

శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.

కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది 

అయినా ఆశ విడవకున్నది.

.

"కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా

త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా "|| 13 ||

.

ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు? 

నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి? 

మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే

సంసారసముద్రము దాటించు నౌక.

.

"జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః

పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః" ||14 ||

.

జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - 

కాషాయవస్త్రములు ధరించినవాడై పొట్టనింపుకొనుటకు 

వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడ చూడనట్లుండును.

.

"అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్

వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ "|| 15 ||

.

శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, 

ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు.అయినా ఆశ వదులుటలేదు.

.

"అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః

కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః "|| 16 ||

.

ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలికాచుకొనుచూ,

రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , 

చెట్టుకింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

.

"కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్

జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన" || 17 ||

.

గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , 

వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా 

తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.

.

"సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః

సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః "|| 18 ||

.

గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట,

దేనినీ స్వీకరించకపోవుట, భోగముననుభవించకపోవుట అను వైరాగ్యము 

ఎవడికి సుఖమివ్వదు?

.

"యోగరతో వాభోగరతోవా సంగరతో వా సంగవీహినః

యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ "|| 19 ||

.

యోగమును ఆచరించువాడుకానీ - సుఖములననుభవించువాడుకానీ,

బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ,

ఎవడిమనస్సు పరబ్రహ్మయందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.

.

"భగవద్ గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా

సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా "|| 20 |

.

కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగాజలం త్రాగి,

ఒక్కసారైనా విష్ణువును పూజించినవానిని యముడేమి చేయగలడు? 

.

భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే

Thursday, February 18, 2016

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 1-!0

మోహముద్గరః (భజ గోవిందం)
రచన: ఆది శంకరాచార్య
శ్లోకములు 1-!0

.

భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥
గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు
(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము).
.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||
ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము.
నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 ||
యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము.
.
నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||
తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకొనుము.
.
యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||
ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు.శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.
.
యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే || 6 ||
శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.
.
బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || 7 ||
బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.
.
కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||
నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.
.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||
సత్పురుషసాంగత్యము వలన భవబంధములూ తొలగును.బంధములు తొలగినచో మోహము నశించును.మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును.స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.
.
వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||
వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?
.

మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 13

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 13

కా తే కాంతా ధనగతచింతా వాతుల కిం తవ నాస్తినియంతా।

క్షణమపి సజ్జన సంగతి రేకా భవతి భవార్ణవతరణే నౌకా।।

.

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

.

ఓయి వాతరోగి! 

నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడు ధనచింతయేగాని మరేమియు లేదా?

ఈ చెడ్డ మార్గము నుండి నిన్ను మరలించి సన్మార్గమున పెట్టువారు లేరా? 

ఒక క్షణమైనను సజ్జనుని చెలిమి నీకు లభించినచో 

అది ఈ సంసార సాగరమును దాటుటకు నౌకవలె నుండును కదా!

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Wednesday, February 17, 2016

చెడు గెలిచేటప్పుడు అది మంచి వేషం వేసుకొని వస్తుంది!

సీతాదేవిని రావణుడు అపహరించటానికి సాధువేషంలో వచ్చాడు!

.

చెడు గెలిచేటప్పుడు అది మంచి వేషం వేసుకొని వస్తుంది!

.

దాని నుండి తప్పించుకోవటానికి గాఢమైన ఆలోచన,వివేకం అవసరం!


రామాయణాలు ఎన్ని? ఏది ప్రమాణం?

రామాయణాలు ఎన్ని? ఏది ప్రమాణం? 

(శ్రీ Vvs Sarma గారి అద్బుత వివరణ .. మనమిత్రుల కోసం.)

.

ప్రమాణం అంటే ఏమిటి, దాని తత్త్వమేమిటి?

ఇది తెలియడానికి న్యాయ శాస్త్రం తెల్సుకోవాలి.

మన న్యాయ శాస్త్రంలో అత్యంత గొప్ప గ్రంథం - మిథిలా నివాసి గంగేశో పాధ్యాయుని

ప్రమాణ తత్త్వ చింతామణి. ఈశ్వరానుమానం - Inference and discovery of God-

దానిలో భాగం. రాముని తత్త్వం, రామాయణ దర్శనం కావాలంటే వాల్మీకి ని చదవాలి.

సహస్ర పరిమాణాలలో ఒకటిరెండు పరిమాణాలు మన బోంట్లకు అర్థమైన విధంగా,

వేర్వేరు రచయితల హృదయాల, దృష్టికోణాల, దృష్టిదోషాలతో తెలియాలంటే మిగతావన్ని చదువుకోవాలి.

బ్రహ్మజ్ఞానం..!

.

మన భారతీయ న్యాయానికి మూల గ్రంథం గౌతమ మహర్షి న్యాయ సూత్రములు.

అందులో మొదటిసూత్రమే 16 తత్త్వాలు.

(ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, అవయవములు, తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితండము, హేత్వాభాస, చలము, జాతి, నిగ్రహస్థానము.)

దీనివలన పదార్థాల యథార్థ జ్ఞానం లభిస్తుంది. అట్టి జ్ఞానం మోక్షదాయకం. అత్యుత్తమ పురుషార్థమే మోక్షం. వేదాలలో ఒక మహావాక్యం ఉన్నది. సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ. బ్రహ్మమనే పదార్థానికి సత్యము, జ్ఞానము , అనంతము అనే లక్షణాలు ఉన్నాయి. అది అనుభవంలోకి తెచ్చుకోవడమే బ్రహ్మజ్ఞానం. దానికి మార్గం జ్ఞానాన్వేషణ.

ఇది వ్యక్తిగతంగా సాధ్యం. తెలుసుకొవలిసినది ఎవరికివారే. న్యాయం లక్ష్యం ఒక పదార్థమును గురించిన యదార్థ జ్ఞాన సముపార్జన (true-knowledge acquisition).

.