Tuesday, May 22, 2018

🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏


🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏


🤲


జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ |


స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 |


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲


విష్ణు సహస్రనామాలలో మొదటి నామం విశ్వం -


వివరణ:

🤲

౧. విశ్వము - జగము - గోచరాగోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే.

మొదటి నామం విశ్వం.

ప్రతివ్యక్తికీ మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈవిశ్వమే విష్ణుని రూపమని గ్రహించాలని ఈ ప్రథమ నామం బోధిస్తోంది.

౨. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు - అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీలేదు. అందుకే విశ్వమే నారాయణుడు.

"బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం: (ముండకోపనిషత్తు).

"పురుష ఏవేదం విశ్వం" (ముండకోపనిషత్తు).

"అంతర్బహిశ్చ తత్సర్వంవ్యాప్యనారాయణ స్థితః" లోపలా బయటా అంతటా వ్యాపించి నారాయణుడున్నాడు - అని నారాయాణ సూక్తం.

౩. ’విశతి’ - అంటే ’ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ’విశ్వం’.

కనుక ’విశ్వ” అన్నమాటే”నారాయుడు ఇందులో ఉన్నాడు’అని ఎరుకపరుస్తోంది.

"తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్" దీనిని సృష్టించి తానే దీనియందు ప్రవేశించాడు" అని తైత్తిరీయ ఉపనిషద్వాక్యం.

"మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ" అని శ్రీకృష్ణ పరమాత్మ "నాకంటె భిన్నమైనది ఏ ఒక్కటీ లేదు" అన్నాడు. కనుక విశ్వమంతా భగవంతుడే.

ఈ ఒక్కనామాన్ని తెలిస్తే చాలు. భగవానుడు ఎక్కడోలేడు. కనిపించేదంతా ఆయనే. కనిపించని అనంతమూ ఆయనే - అనే స్పృహ కలుగుతుంది.

’ఈశావాస్య మిదం సర్వం’ - ఇదంతా ఆ ఈశ్వరునిచే నిండినది.

౪. "విశ్వం అనంత వాచకం" అని మహాభారత వచనం. అంతుపట్టనివాడు.

"విశ్వమశేషం కృత్స్నం సమస్తం నిఖిలాఖిలాని నిశ్శేషమ్!

సమగ్రం సకలం పూర్ణమ ఖండం స్యాదనూనకే!!" అని ’అమరం’.

'వాసుదేవస్సర్వమితి సమహాత్మా సుదుర్లభః’ - అంతా ’వాసుదేవుడే’ అనే జ్ఞానం కలిగినవాడు (బ్రహ్మజ్ఞాని) మహోన్నతుడు - సుదుర్లభుడు. ఆ గొప్పజ్ఞానమే పరమావధి. ఆ జ్ఞానాన్ని స్ఫురింపజేసే నామం ’విశ్వం’.

'అంతా’, ’పూర్ణత్వం’ ’అఖండం’ అయిన పరబ్రహ్మమే విశ్వం.

’హరినీ మయమే అంతాను

అరసి నిన్ను శరణనినాను’ అని అన్నమాచార్య పలుకు.

"హరి మయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయింపబని లేదు

హరి మయముగాని వస్తువు

పరమాణువులేదు...’అని పోతనగారి భాగవత వాక్యం.

౫. జగములో తాను ప్రవేశించడమే కాదు - చివరకు జగము కూడా తనలోనే ప్రవేశిస్తున్నది. "యత్ప్రయన్త్యభి సంవిశన్తి" అని వేదవచనం ఎవరిలో ఈ జగము ప్రవేశిస్తున్నదో అతడు ’విశ్వం’

విశ్నాద్విశ్వమిత్యాహుః లోకానాం కాశి సత్తమ!

లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప!!

సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఉండడం చేత భగవంతుని ’విశ్వం’ అని వ్యవహిరించుతున్నాం.

ఈ శబ్దం నపుంసకలింగ శబ్దం. అంటే ఇది నిర్గుణ పరబ్రహ్మ వాచకం. ఓంకారంతో మంత్రం ప్రారంభమైనట్లే, ఈ ’విశ్వం’ నామంతో విష్ణునామ మంత్రాలు ప్రారంభమయ్యాయి. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్రి - ఇలా వైదిక దేవతా మంత్రాలన్నీ ’ఓమ్’తో ప్రారంభమౌతాయి. మంత్రాలు మారుతున్నా ’ఓం’కారం మారదు. మారనిది ’ఓమ్’ మారినవి ’మంత్రాలు’. పైగా మంత్రంలో ఒక స్పష్టమైన అర్థం కనిపిస్తుంది. ఉదా!! నమశ్శివాయ - శివునకు నమస్కారం. నమో నారాయణాయ - నారాయణునకు నమస్కారం. కానీ ’ఓం’ కారానికి ఇలాంటి స్పష్టమైన అర్థం లేదు.

సర్వమూలమైన నిర్గుణతత్త్వం ’ఓం’కారం. ఆ ప్రణవంలోని శక్తియే పంచాక్షరిగా, అష్టాక్షరిగా, వివిధ మంత్రాలుగా వచ్చినదని గ్రహించడానికే - నిర్గుణతత్త్వమే వివిధ నామరూపాలతో సగుణమైందని తెలుసుకోడానికి ఈ విధంగా మంత్రాలను జపిస్తాం. ప్రణవమే అన్ని మంత్రాలకు సమన్వయం.

అలాగే ’విశ్వం’ సర్వమయమైన పరతత్త్వానికి సంకేతం. అదే తరుగాత నామాలలో విస్తరించింది. వృక్షానికి మూలం వలె వెయ్యి నామాలకు మూలనామమిది ్.

౬. ’విశ్వం’ అనే మాట - ’ర్వము’నూ బోధించే ’ఓం’కారమే. అందుకే ఈ నామానికి "ఓంకారం’ అని అర్థం.

’ఓమితి బ్రహ్మా. ఓమితీదం సర్వమ్’ - యజుర్వేద ఆరణ్యకం.

’ఓంకార ఏ వేదం సర్వమ్’ - ఛాన్ద్యోగ్యం.

’సర్వవ్యాపిన మోంకారం’

’ఓమిత్యేతదక్షర మిదగ్ సర్వం’ - ఈ శ్రుతి వాక్యాలు ’సర్వము’ ఓంకారమేనని చెబుతున్నాయి. ప్రణవమే ప్రథమాక్షరం. ’ఓమిత్యేకాక్షరం’ అని వేదం చెప్పినది. ఆ మాటనే "గిరామస్మ్యేకాక్షరమ్" "ప్రణవస్సర్వవేదేషౌ" అని గీతాచార్యుడు "పలుకులలో ఏకాక్షరమైన ప్రణవాన్ని నేను" అని ఉద్ఘాటించాడు.

"విశ్వశబ్దేన ఓంకారోభిధీయతే

వాచ్యాచక యోరత్యన్తభేదాభావాత్

విశ్వమిత్యోంకార ఏవ బ్రహ్మేత్యర్థం"

అని ఆదిశంకరుల వచనం. "విశ్వశబ్దం ద్వారా ఓంకారం చెప్పబడుతున్నది". 

ఈనామమే సుజ్ఞానం: విశ్వమును భగవద్రూపంగా దర్శించడమే జ్ఞానము. అది కలిగినవాడు భక్తుడు. ఈ జ్ఞానభక్తుడు ’ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు’ అనీ ’సర్వమున్నతని దివ్యకళామయమ’ని నిత్యం పరబ్రహ్మ యందే నిష్ఠుడై ఉంటాడు.

విశ్వమంతా నారాయణుడే కనుక ఆ నిష్ఠ కలిగిన వానికి భిన్నదృష్టి ఉండదు. -శత్రు మిత్ర భావాలుండవు. సర్వభూతముల ఎడ ప్రేమ ఉంటుంది.

"ద్రష్టవ్మాత్మవద్విష్ణుర్మతోయం విశ్వరూపధృక్" (విష్ణుపురాణం)

’నారాయణుడు విశ్వరూపుడు కనుక అందరినీ తనవలెనె చూడాలి’ అని పరమభాగవతుడైన ప్రహ్లాదుని వచనం ఇది భావత ధర్మం. భాగవత హృదయం. యోగముల సారం. ఈ జ్ఞానమంతా ఒక్క ’విశ్వం’ అనే నామంలో దాగిఉంది.

మొత్తంగా - నారాయణుడెవరు? అనే ప్రశ్నకు’విశ్వం’ అని సమాధానం. మన కంటికి కనిపించేదీ, కనిపించనిదీ అంతుపట్టని ఏ జగత్తు ఉందో అందులో ’ప్రవేశించి ఉన్న చైతన్యము’ దీనికి ’కారణము’ కూడా. మరి ఎలా ప్రవేశించాడు స్వామి?


విష్ణువై ప్రవేశించాడు.


 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, May 19, 2018

🌷🏵️🌷-మహానటి- 🌷🏵️🌷


🌷🏵️🌷-మహానటి- 🌷🏵️🌷


👉మహానటి చూసారా . అభిప్రాయం చేబూతారా అని స్నేహితులు చాలామంది అడిగారు . 

మహానటి సినీమా ఏందుకు చూడము!!


చందమామ ఏలా అందరి సోంతమో ; సావిత్రీ ప్రతీ వారికీ సోంతమే . మన అందరికీ ఆవిడ తో ఆ అనుబంధం విడదీయనిది .


ఆవకాయ ; గోంగూర ఏలా అయితే ప్రతీవారికీ ముఖ్యంగా మన తేలూగూవారికి సోంతమో--_ ఇష్టమో ;


సావిత్రి కూడా మనఅందరకీ ఇష్టం మన ఇంటి బిడ్డ.


మనకి ఇష్టమైన విషయము మీద ఏలాగ మనం బంధం-- అనుబంధం ఏర్పరుచుకుంటామో; ఏలా దానిని మనకే సంబంధించిన మన విషయం అని నిర్వచించుకుంటామో; అనువయించుకుంటామో అలాగే సావిత్రి తో మన అనుబంధం . అది విడదీయరానిది


అసలు ఓక సావిత్రీ తోనేనా?? 

జమున ; భానుమతి; అంజలి; కన్నాంబ ; రేలంగి; సూర్యకాంతం; షావుకారు జానకి ; కృష్ణకుమారి ;


నాగయ్య ; యేస్వీ రంగారావు; csr ఆంజనేయులు ; జగ్గయ్య ; కాంతారావు ; ఛాయాదేవి ; రామారావు; రాజనాల ; నాగేశ్వరరావు; రమణారేడ్డి ; గిరిజ ; చలం; నాగభూషణం ; అల్లూ రామలింగయ్య ; పద్మనాభం ; రాజబాబు ; శారద ; గీతాంజలి ; రమాప్రభ; 

హేమలత (ఈ కేరక్టర artiste ఇంకా hyderabad లో ఉన్నారు 92 years. అత్తలు కోడళ్ళు సినీమా లో సూర్యాకాంతానికి అత్తగారు ; 

లేదా కాంచన రాజశ్రీ నాగేశ్వరరావు ల ఆత్మగౌరవం సినీమా చూసినట్టు అయితే అందులో నాగేష్వరరావు అమ్మా కాంచన అమ్మమ్మ గా వేసిన ఆవిడ ) 

సత్యన్నారాయణ; రావుగోపాలరావు ; గుమ్మడి s.వరలక్ష్మి జీ. వరలక్ష్మి ; నిర్మలమ్మ ; ఋష్యేoద్రమణి ;

ఇలా ఏందరో మహానుభావులు ఆతరం లో అందరితో మనం మమేకమై పోయాము.


వీళ్లగురించి డేబ్భై దశకం ముందువరకూ పుట్టిన ప్రతీ తేలుగు చలన చిత్ర ప్రేమికులకు కాస్తో కూస్తో తేలుసు . 

వీళ్ళంతా నటకోవకు చేందిన వారే . అలాగే తేరవేనుక ఏందరో.


భోజనము చేయ్యడానికి ఏలా పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇష్ట పడుతామో అలా వీళ్ళoతా మనకి ఇష్టం . వీళ్ళల్లో ఏవ్వరూ ఏక్కువ తక్కువ కాదు .


గోంగూర -చింతకాయ- ఆవకాయ -కోబ్బరి పచ్చడి- టమేట ఊరగాయ- ఇలా అన్నీ మన ముందు కంచం లో ఉంటే అన్నీ తినేయాలి అనిపిస్తుంది . దేని విశిష్టత దానిదే కదా . ఏది లేదన్నా ఏదో కోరత .అలాగే వీరందరూ హేమాహేమీలు.


వీరందరికీ ఓక కథ ఉండుంటుంది. అందరి కధలలో ఓక బాధ సంతోషం ఉండే ఉంటుంది . ups and downs .


అయితే పూలు అమ్మిన చోట కట్టేలు అమ్మినట్టు గా 

సావిత్రి ; నాగయ్య గారు ఇద్దరూ విధి వంచితులు . 

దారుణం గా జనాన్ని(స్నేహితులు ; ఆప్తులు ; బంధువులు ) నమ్మి మోసపోయారు .


నలభై ఐదు పైబడిన ప్రతీ వారికీ ముఖ్యంగా సీనీప్రేమీకుల కు 

వీరి జీవితం అందులో అంశాలు కోట్టిన పిండి.


ముఖ్యంగా మన సావిత్రి విధి వంచిత. జేమీనీ గణేశనుని చేత మోసపోయిన వంచితురాలు.


అసలు ఆవిడ విషాదకధ; ఆవిడ పడ్డ బాధలు మనకు తేలుసు. వాటినన్నిటినీ ఆవిడ దిగమింగుకుని మనలని తన వైవిధ్య భరిత నటన తో మురిపించీ ఆ మహోన్నతమైన నటనను మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆనందపడుతూ ఉన్న సమయం లో మన తేలుగు వారికి ఆ మహనటి గురించీ ఆవిడ ఏదుగుదల తరుగుదల గురించి మళ్ళీ ఓక్కసారి మహానటి లో చూపిస్తారు కాబోలు చూసేద్దామూలే అనుకున్నా .


ఓక పక్క సావిత్రి మళ్ళీ వస్తుంది కధ రూపం లో అని సంతోషం మళ్ళీ ఓక పక్క అన్ని అవస్ఠలు పడిందీ అనే బాధ.


కానీ విడుదల తేదీ దగ్గిర పడుతున్న కోద్ది ఏదో తేలియని ఆందోళన ఆవిడ అభిమానిగా పడ్డాను . సినీమా విడుదల ముందు నాలుగైదు రోజులు నిద్దరపట్టలేదు.


ఏవో మరుగున పడిన జ్ఞాపకాలు ఆవిడ ఆర్ధికంగా చితికిపోయి చిన్న చిన్న వేషాలు వేయ్యడము బాగా గుర్తుకు వచ్చి హృదయాన్ని కలిచివేసింది.


అసలు ఆవిడ ఆఖరుఆఖరున నాగభూషణం తో రావి కోండలరావుతో గోకిన రామారావు తో pair గా చూడలేకపోయిన వాళ్లం. అసలు గోరింటాకు సినీమా లో రమణ మూర్తి ని తన్ని తగలేయ్యాలని బాధపడ్డాము . అటువంటి మనకు తేలిసిన మన సావిత్రి కధ తీయడం ఓక సాహసం .


సావిత్రి కధను సినీమా గా మహానటి పేరుతో తీయడం

ఓక సాహసమనే చేప్పాలి . 

ఆ సాహసం చేసిన director nag ashwin ని అభినందించాలి . అలాగే ఈ కధను నమ్మి నిర్మిద్దాము అనుకున్న అశ్వినీ దత్తు పుత్రికలను అభినందించాలి .


మనకు బాగా తేలిసిన మన సావిత్రి విషాదాంత కధను గుంభనం గా చూపించి చూపించకుండా చూపించారు .


ఇదంతా అభినందించదగ్గ విషయం బాగానే ఉంది .

అసలు main highlight సావిత్రి గా చేసిన keerthy suresh ది . ముఖ్యంగా keerthy suresh fantastic performance. అమ్మాయి బాగా కష్టపడింది . సోంతంగా perfect గా dubbing చేప్పుకుంది. అరువు గోంతుక కాదు . సావిత్రి లాగా perform చేసింది .


ఈమధ్యన అనేక చిత్రాలు వస్తున్నాయి .


SPLIT PERSONALITY మీద. పోయిన వారి ఆత్మ ఇంకోకరిలో ప్రవేశించడం లేదా పరకాయప్రవేశం చేయ్యడం మంచి లేదా చేడు ఆ సదరు ఆత్మ చేయ్యడం ; ఇదంతా చంద్రముఖి సినీమా పుణ్యమా అని అప్పటినుండి వస్తున్నవే.


అలా సావిత్రి ఆత్మ keerthy suresh లో ప్రవేశించిందా అన్నట్టు ఆ keerthy suresh నటించి శాశ్వత కీర్తి సంపాయించింది . పరవాలేదు కానీ ;


మన సావిత్రి కధ మనకు తేలుసు ఆవిడకి సంబంధించిన అనేక విషయాలు చదివాము ; ఇతరులు చేప్పగా తేలుసుకున్నాము విన్నాము .


ఏందుకో ఏమో మహానటి లో ఏదో తేలియని వేలితి.


ఇంకా సరిగ్గా చూపిస్తే బాగుండు అనిపించింది .

ఏదో నిరాశ కలిగింది . 

జేమీనీ గణేశనుని హీరో గా చూపించారా అనిపించింది .

(సినీమా ఓక వ్యాపారం కదా ).


మనకు తేలిసిన మన సావిత్రిని మనం కాపాడుకోలేక పోయాము అనిపిస్తుంది .


కానీ మనకు తేలిసిన మన సావిత్రి కధ ఏంతో .


కానీ వీళ్ళు ఏదో చూపించేసారే అనిపించింది.


నాకైతే ఆవిడతో పనిచేసిన వాళ్ళు ఏందరో.ఇప్పటికీ ఉన్నారు .


జమున వాణిశ్రీ ;లక్ష్మి ;శారద సత్యనారయణ ; 

రమాప్రభ; షావుకారు జానకి గీతాంజలి కాంచన


పీ సుశీల S జానకి. వీళ్ళ నీ కాస్త ముక్కలు మాట్లాడిస్తూ కధ నడపాల్సింది అనిపించింది .


సమంత దేవరకోండ ఆ సోది లేకుండా ఇంక కాస్త సావిత్రి


విషయాలు చూపిస్తే బాగుండేది

👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏


👉మహాభారతం --జీవిత సత్యాలు!🙏


👉తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి:


ఇది కొత్త సూక్తేమీ కాదు. ఎన్నో సార్లు ఈ సూక్తిని మనం చదివే ఉంటాం. అయినా, ఈ సూక్తిని దాని అర్థాన్ని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాం. మహాభారతం ఈ జీవిత సత్యం గురించి చక్కగా వివరిస్తోంది. అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలి వాన కురుస్తున్నా కంసుడి బారి నుండి కృష్ణుడిని రక్షించడానికి కృష్ణుడి తండ్రి కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్తాడు. పరిస్థితులకు ఎదురీది కృష్ణుడిని కాపాడతాడు. పాండవులకు తమ మీద తమకు అపార నమ్మకం కలిగి ఉండటం వలన కౌరవులపై పోరాడి విజయం సాధిస్తారు. ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు అంగీకరించడు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు. అయినా, మొక్కవోని దీక్షతో తనపై తనకున్న నమ్మకంతో విలువిద్యలో మంచి పట్టును సాధించాడు.

👉ఫలితం గురించి ఆలోచించకూడదు:


ఈ పవిత్ర గ్రంధంలో ఈ విషయం కూడా చక్కగా ప్రస్తావింపబడింది. తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి. ఎటువంటి అడ్డంకులూ ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తిచేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీరును ప్రదర్శించలేరు. ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు. ఫలితం గురించి మర్చిపోయి పనిపట్ల నిబద్ధతతో ఉంటే పనిలో చక్కటి నైపుణ్యాన్ని కనబరచగలుగుతారు. ఫలితం పట్ల దృష్టి పెట్టినప్పుడు ఆశించిన ఫలితం దక్కకపోతే నిరాశకు గురవడం జరుగుతుంది. ఒకవేళ, ఆశించిన ఫలితం దక్కినా గర్వం బారిన పడటం వలన ముందు ముందు అద్భుతమైన నైపుణ్యాన్నిప్రదర్శించే అవకాశం కోల్పోతారు. అందువలన, ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం చేసే పనిపై శ్రద్ధ కనబరచాలి.


👉మార్పు మాత్రమే స్థిరమైనది: 

ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నే కృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కున్నాడు. కన్నవారు ఒకరు పెంచినవారు ఒకరు. గోకులంలో అలాగే బృందావనంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. అయితే, తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ ప్రదేశాలను విడవవలసి వచ్చింది. అదే విధంగా, రాధతో ప్రేమలో పడినా రుక్మిణిని పెళ్లాడాడు. జీవితంలో ఎదురైనా అనేక మార్పులను, పరిస్థితులను చక్కగా ఎదుర్కొన్నాడు. పాండవుల జీవితంలో కూడా మార్పు అనేది అనేకరకాలుగా ఎదురైంది. ఒకానొక దశలో, వారు అరణ్యవాసం కూడా చేయవలసి వచ్చింది. అలాగే అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. కాబట్టి, మార్పును అంగీకరించి తీరాలి.


👉జరిగేదంతా మన మంచికే:


శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆ విధంగా కంసుడి బారి నుంచి రక్షింపబడ్డాడు. గోకులాన్ని అలాగే తన స్నేహితులను విడిచాడు. అందువలన రాక్షసుడు వధించబడ్డాడు. ద్రౌపదిపై కౌరవులు తమ ప్రతాపాన్ని ద్రౌపది వస్త్రాపహరణం ద్వారా చూపించబోతున్నప్ప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. కృష్ణుడిపై ఆమె నమ్మకం వమ్ము కాలేదు. ధర్మాన్ని నిలబెట్టాడు. తన గతజన్మలో పాపాల వలన తానీ విధమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నదా అని ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు ఈ విధంగా బదులిస్తాడు. బాధలకు గురయ్యే వారు గతజన్మలో పాపాలు చేసినవారు కాదు, పాపాలు చేసే వారే గతజన్మలో కూడా పాపి అవడం వలన అదే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని వివరిస్తాడు. అందువలన, ఏది జరిగినా మంచికే జరుగుతుందని మహాభారతం స్పష్టం చేస్తోంది. ఏది ఎందుకు జరిగిందో ఆ కారణాన్ని ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేకపోయిన కాలం ఆ విషయాన్ని మనకు కాలమే విడమరిచి వివరిస్తుందని మహాభారతం తెలియచేస్తోంది.


👉ధర్మాన్ని రక్షించాలి


మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కృష్ణుడిని శపిస్తుంది. కృష్ణుడి వంశం కూడా తన వంశం నాశనమైన విధంగా నాశనమవ్వాలని ఆమె శపిస్తుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని ఆమె నిరుత్సాహానికి గురవుతుంది. ఇది వాస్తవమే అయినా, మరొక వాస్తవం ఏంటంటే ధర్మాన్ని కాపాడటం కృష్ణుడు తన ధర్మంగా భావించాడు. భావితరాల మంచి కోసం గాంధారి పుత్రులు అలాగే మరికొంతమంది ఈ యుద్ధంలో బలవుతారన్న సంగతి కృష్ణుడికి తెలుసు. తన దగ్గరివారిని కూడా వధించమని అర్జునికి ఇచ్చిన ఉపదేశంలో ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు.


🙏భగవద్గిత 🙏

🙏భగవద్గిత 🙏


👉ప్రకృతి,పురుషుడు,క్షేత్రం,క్షేత్రజ్ఞుడు,జ్ఞానము,జ్ఞేయము అనగా ఏమిటి?


(క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము-13 వ అధ్యాయం)


👉దేహాన్ని క్షేత్రమని,దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు.


నేనే క్షేత్రజ్ఞున్ని.క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. 

ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు.బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి ,ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియవిషయాలైన శబ్ద,స్పర్శ,రూప,రుచి,వాసనలు,ఇష్టద్వేషాలు,తెలివి,ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.


అభిమానము,డంబము లేకపోవడం,అహింస,ఓర్పు,కపటం లేకపోవడం,గురుసేవ,శుచిత్వం,నిశ్చలత,ఆత్మనిగ్రహం,ఇంద్రియ విషయాలపై వైరాగ్యం,నిరహంకారం,ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం,భార్యాబిడ్డలందు,ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం,శుభాశుభాల యందు సమత్వం,అనన్య భక్తి నాయందు కల్గిఉండడం,ఏకాంతవాసం,నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది.దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.


సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస్తుంది.ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసిఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు.కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది.నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీనని తెలుసుకో.


అది సర్వభూతాలకూ లోపలా,బయట కూడా ఉంది.అది సూక్షం.తెలుసుకోవడం అసాధ్యం.గుర్తించిన వారికి సమీపంలోనూ,మిగతావారికి దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది.సృష్టిస్థితిలయకారకం అదే. అది సూర్యుడు,అగ్నులకు తేజస్సును ఇస్తుంది.చీకటికి దూరంగా ఉంటుంది.అదే జ్ఞానం,జ్ఞేయం,సర్వుల హృదయాలలో ఉండేది. జ్ఞానం,జ్ఞేయం,క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు. ప్రకృతిపురుషులు తెలియబడని మొదలు గలవి.దేహేంద్రియ వికారాలు,త్రిగుణాలు,సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి. దేహ,ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు.వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం. తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు,స్వతంత్రుడు,అనుకూలుడు,సాక్షి,పోషకుడు,భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్దితో హృదయంలోనూ,మరికొందరు యోగధ్యానం వలనా,జ్ఞానయోగం వలనా,కొందరు నిష్కామయోగం ద్వారా దర్శిస్తున్నారు.


ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు. ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు.పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మా చేయదనీ,ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక,గుణం,వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వంకానీ,కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు. శరీరగుణాలు ఆత్మకు అంటవు.ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని,మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకొన్నవాడే పరమగతినీ పొందుతాడు.

🙏🙏🙏🙏🙏

రేచీకటి అల్లుడు"!


రేచీకటి అల్లుడు"!

(చిలకమర్తి వారి 'వినోదములు' నుండి.)


సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక అల్లుడు అత్తవారింటికి వచ్చెను. అతనికి రేచీకటి. ఈ లోపమును వారికి తెలియజేెయట

కతనికిష్టము లేదు. ఒక రోజు రాత్రి బింకముగా వాకిలిలో అటు ఇటు

నడుచుచుండెను. ఇలా నడచుచూ వాకిటిలో ఉన్న పాతరగోతిలో పడి

పోయెను. ఆ చప్పుడు విని బావ

మరుదులు కంగారుగా వచ్చి "బావా!

గోతిలో పడితిరా ? అని అడుగ అత్తగారింట పరువు నిలుపుకొనుటకై--

"లేదు. నేను పడలేదు. పాతరగొయ్యి ఎంత లోతున్నదో తెల్సుకొనుటకు ఇందులో దూకితిని. దీని లోతు "ఇంత

తక్కువ వున్నదేమి? అని బావా

మరుదులు చేయూత పుచ్చుకుని మెల్లగా లేచి భోజనము నిమిత్తం లోనికి

పోయెను. భోజనము చాలావరకైన పిదప అత్తగారు పంక్తిలోనున్న అందరకు

మజ్జిగ వడ్డించి,అల్లుడు కదా అని ఈయనకు పెరుగు వడ్డించసాగెను. కంచంలోకి పెరుగు పోస్తుండగా "తొళుకు

తొళుకు అని శబ్దం వచ్చెను. పరధ్యానంలో వున్న అల్లుడు కుక్కవచ్చి

అన్నం ముట్టుచున్నదని భ్రమించి బెదిరించు ఉద్దేశ్యముతో చేయివిసరగా

అత్తగారికి చెంపదెబ్బ తగిలినది. అయ్యో!అని అత్తగారు వెనుకకు పారిపోయెను. బావమరుదులు కోప్పడి

"నీకిది ఏమి వినాశకాలము ? అనగా

అల్లుడు "తాను తెలివితక్కువవాడిని కాదని ,ఊరకే ఎందుకు కొట్టెదను? పంక్తిని కూర్చున్నవారందరకు మజ్జిగ వడ్డించి అత్తగారు తన ఒక్కరికి పెరుగు

వడ్డించినది. ఈవేళ నేనైనాను. రేపు మరియొకరగుదురు. భోజనం వెళ ఇట్టి పక్షపాతమునెప్పుడు చేయవద్దని బుద్ధి

చెప్పితిని. ఆడువాండ్రకు చేతితో చెప్పిన

గాని బుద్ధి రాదు." అనగా వారందరూ అల్లుడు తెలివైనవాడే!అనిసంతోషించిరి.


ఒక రోజు రెండు జాములైన పిదప నిద్రలేచిన అల్లుడు అవసరార్థము బయటకు పోయి తిరిగి తన గదికి దారి

సరిగా కనపడక తడుముకొనుచూ వచ్చి అత్తగారి మంచముపై కూర్చుండెను. అత్త

గారు అదిరిపడి లేచి "ఇది ఏమోయీ! అర్థరాత్రమున ఇటు వచ్చితివి? అని అడుగ అల్లుడు ఇట్లనెను. "నేను నిష్కారణముగా మిమ్ము చెంపకాయ కొట్టితిని. అది మీరు మనసులో వుంచు

కొనక నన్ను క్షమించవలసిందని బ్రతిమాలుటకు వచ్చితిని" అని జవాబు చెప్పెను.వెంటనే అత్తగారు " అయ్యో! నాయనా! కొడుకు వంటివాడవు. నీపై

మనసులో ఏమీ వుంచుకొనను. పోయి

పడుకొనుము" అనగా అల్లుడు ఒప్పుకొనక "మీరు నన్ను స్వయముగా

నా మంచముమీదకు తీసుకునివెళ్లి

కూర్చుండబెడితిరా-నాపై కోపము లేనట్లు. అట్లు చేయకపోతిరా,కోపం ఉన్నట్లే" అని పలుకగా ఆమె అందుకు

ఒప్పుకొనిఅల్లుడిని తీసుకుపోయి ఆయన మంచముపై కూర్చుండబెట్టి తిరిగి వెళ్ళెను.


ఒక రాత్రికే ఇన్ని పరాభవములు జరుగు

టచే ఇక వుండుట శ్రేయస్కరం కాదని భావించి అల్లుడు తన ఇంటికి వెళ్లిపోయెను.

-

మూడు మంచాల కథ!

మూడు మంచాల కథ!


"కళ్లు మండుతున్నాయమ్మా! ఇక నీళ్ళు పోసెయ్, త్వరగా!" అంటున్నాడు పిల్లాడు.


"మొహం బాగా కడుక్కోకపోతే గుల్లలు లేస్తాయిరా నాన్నా! కాస్త సహనం అలవరుచుకోవాలి, ఇక నుండి నువ్వు" అటోంది అమ్మ.


"సహనం అంటే ఏంటమ్మా?" అని అడిగాడు అబ్బాయి.


"సహనమంటే భూమాతరా నాన్నా!" అన్నది అమ్మ.


"భూమాతంటే ఎవరమ్మా?" అడిగాడు అబ్బాయి.


"భూమాతంటేనా!" అంటూ ఈ చక్కని కథను తన కొడుకుతో చెప్పింది తల్లి:


ఒక గదిలో ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. ఒకనాటి మధ్యాహ్నం, వాళ్లంతా పనులమీద బయటికి వెళ్లిన సమయంలో, వాళ్ల మంచాలు మూడూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.


ఒక మంచం అన్నది " అబ్బా! ఎంత బరువున్నాడో వీడు. మొయ్యలేక చస్తున్నా, రెండేళ్ల నుండీ!. ఇలా ఎంత కాలంరా నాయనా?" అని. 

ఇంతలో రెండవ మంచం అందుకొని "ఇంతకీ వాడి బరువెంత?" అని అడిగింది.


"యాభై ఆరు కేజీలట. ఒకనాడు చెప్పుకుంటూంటే విన్నాను." అన్నది మొదటి మంచం. తన గొంతును చిన్నదిగా చేస్తూ.


రెండవ మంచం అన్నది "యాభై ఆరు కేజీలేనా? నువ్వే అలా అంటే మరి నేనేమనాలి? మూడేళ్ల నుంచి వీడి బారిన పడ్డాను. బరువును మోస్తూనే ఉన్నాను." అని.


మరి "వాడి బరువెంత?" అని అడిగింది మొదటి మంచం. "అరవై రెండు కేజీలు" దీర్ఘంగా రాగం తీస్తూ అన్నది రెండవ మంచం. 

"మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడకుండా ఉన్నావేమిటి? నీకేమీ బరువులు లేవా?" అని అవి రెండూ మూడవ మంచాన్ని అడిగాయి. 

అందుకు మూడవ మంచం బదులిస్తూ, "బరువులేకుండా ఎలా ఉంటాడు? ఉన్నాడు. అయినా నాకేమీ ఇబ్బంది లేదు. మనమున్నది బరువును మోయడానికే కదా! చిన్న చిన్న బరువులను మోస్తున్న మనం ఈ పని చేయడానికి ఇలా బాధపడకూడదు. మనమే ఇలా అంటే మనందరినీ మోస్తున్న ఈ భూమాత ఏమనాలి మరి? ఏమీ అనకుండా ఎంతో సహనంగా మోస్తున్నది కదా! దేనికైనా ఓర్చుకుంటున్నది కదా! అలాంటి గొప్ప సహనమే మనం అలవరచుకోవాలి" అని మూడవ మంచం ఎంతో సహనంగా చెప్పింది.


"మూడవ మంచం చెప్పినట్టు, నిజంగానే గొప్ప సహనశీలిరా నాన్నా, భూమాత! ఆ సహనం మనందరికీ ఎంతో అవసరం. చిన్న చిన్న వాటన్నింటికీ పెద్దగా అరవకూడదు" అని చెప్తూ స్నానం అయిపోజేసిన ఆ అమ్మ, తన కొడుకును స్నానాలగది నుండి బయటికి ఎత్తుకొచ్చింది మురిపెంగా.

విగ్రహం -అద్దం ! 🌷

🏵️
విగ్రహం -అద్దం ! 🌷


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴


*ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....*


భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. 

హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?


*గురువు గారి జవాబు:*

ముఖం మన దగ్గరే ఉంది. 

కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,

అద్దంలో ప్రాణం లేదు, 

కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.


అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం. 

తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, *అదే విగ్రహం ....*


భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు. 

అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి. 

మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....

*అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....*

అందుకే గుడికి వెళ్ళాలి....


🙏🌺🙏🌺🙏🌺🙏🌺

దేవుడు ఏం చేస్తాడు?🌷

🥀దేవుడు ఏం చేస్తాడు?🌷

🙏🤣🙏చందమామ పిట్ట కధ 🙏

🙏🤝🙏🤝🙏


👉🏻ఓ దేశాన్ని పాలించే రాజు మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్తక్రారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకువచ్చి సరైన సమాధానం చెప్పినవారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు.


లేదంటే వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పారు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామంలోనుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.


రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘‘చెప్పేవాడు గురువు; వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’. కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు.


మొదటి ప్రశ్న


దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?


దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు. ‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే.


ఇక రెండవ ప్రశ్న


దేవుడు ఎక్కడ ఉంటాడు?


అన్నాడు రాజు. ‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. ‘‘మహారాజా! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు. ‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


చివరి ప్రశ్న


దేవుడు ఏం చేస్తాడు? అని


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనంపైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, May 18, 2018

కాలభైరవ స్వామి చరిత్ర

కాలభైరవ స్వామి చరిత్ర


ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు.


శంకరుడికి సద్యోజాత, అఘోర ,తత్పురుష ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. 

ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.


అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను ,నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు.


తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా,కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది.


మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.


ఋగ్వేదం:>>>>>>>>>>>>>

అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ,ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో ,అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.


యజుర్వేదము:>>>>>>>>>>

దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.


సామవేదము:>>>>>>>>>>

తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ,ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ,ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో ,అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.


అధర్వణవేదము:>>>>>>> 

పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో ,అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.


అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.


ప్రణవం:>>>>>>

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో ,అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది.


ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు


జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.


బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అన్నాడు


ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపం తొ ,బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.


ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.


అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు.


కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు.


బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.


కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు 

‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’.


కాశి లొ కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తి తొ పూజించి తరించాండు.విశ్వనాధుడు భక్తి కి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు.


కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.


కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.


ఇకనుంచి నీవు నా దేవాలయ ములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను.


నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.


అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని


ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.


ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.


అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.


ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.


ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.


కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.


ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

ఆస్తికులు-నాస్తికులు !

ఆస్తికులు-నాస్తికులు !

-

ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని.


ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది.


ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం.


ప్రపంచంలొ మహా భక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మంచి వారూ చాలామంది ఉన్నారు. అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి.


ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు. మనిషి మనిషి గా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న.


ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వం తో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధ పరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధ పరుడా, లెక నిస్వార్ధ పరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.


ఈ స్వార్ధం లెకుండా మనిషి ఉండగలడా? జీవించాలంటె ఎంతో కొంత స్వార్ధం అవసరం. కాని మితిమీరిన స్వార్ధం అవసరం లెదు. తన కడుపు నిండిన తరువాత కూడా ఎదుటి వాడి కడుపు కొట్టాలనుకోవటం తప్పు. కాని తన కడుపు ఎప్పుడు నిండుతుందో, ఎంత తింటే నిండుతుందో కూడా తెలియని స్థితిలో మనిషి బతుకుతున్నాడు. కనుకనే మితిమీరిన స్వార్ధం తొ అన్నీ తనకె చెందాలనే తపనతో భ్రమతో ఎక్కడికి పొతున్నాడో తెలియని స్థితిలో సాగిపొతున్నాడు.


ఇటువంటి మనిషి దెవుని నమ్మినా నమ్మక పొయినా పెద్ద తెడా లెదు. మన రాజకీయ నాయకులు అందరూ దైవ భక్తులే. కాని ఉపయోగం ఎముంది? సమాజంలొ మోసగాళ్ళు అందరూ దైవ భక్తులే. ప్రయోజనం ఎముంది. ఇటువంటి భక్తిని దేవుడు మెచ్చడు. భక్తి కన్నా, నమ్మకాల కన్నా మానవత్వం ముఖ్యం.


ఎవరి హృదయం మానవత్వం తొ తొణికిసలాడుతూ ఎదుటి మనిషి బాధను తన బాధగా స్పందించగలిగే స్థాయికి చెరుకుంటుందో అట్టి వాని వద్దకు భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. మానవత్వం లెని ఆస్తికత్వం వ్యర్ధం. విలువలు లెని భక్తీ వ్యర్ధమే.


దురదృష్ట వశాత్తూ ప్రస్తుత సమాజంలో మానవత్వం, ఆస్తికత్వం భిన్న ధ్రువాల లాగా ఉన్నాయి. దెవుని విగ్రహాలలొనే కాదు సాటి మనిషిలో, సాటి జీవులలో చూడలేని వాడు ఆస్తికుడూ కాలేడు, భక్తుడూ కాలేడు. ఇదే మాట నా మిత్రునితో చెప్పాను. మీరేమంటారు?


-


నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?


నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.


లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.

మీది ఏ తత్వం?


మీది ఏ తత్వం?

-


ఉన్నది అన్నది

………..ఆస్తికత్వం

ఉన్నది అన్నది లేదన్నది

………..నాస్తికత్వం 

ఉందో లేదో అన్నది

………..చపలత్వం

ఉంటే ఉంది లేకపోతే లేదన్నది

………..తెలివైన తత్వం

ఉన్నది లేనిది రెండూ నీవే అన్నది

………..వేదాంత తత్వం

ఉన్నదాన్ని వదిలేసి లేనిదాన్ని ఊహించడం

………..భావుకత్వం

లేనిదాన్ని వదిలేసి ఉన్నదాన్ని ప్రేమించడం

………..మానవత్వం

Thursday, May 17, 2018

ఆభరణాలు నిలువుదోపిడీ !

ఆభరణాలు నిలువుదోపిడీ !

-

ఆమె ఎవరో కాదు మన మహానటి సావిత్రినే!

ఇది ఆమెలోని దాతృత్వానికి అద్దం పట్టడమే కాదు


ఆమె లోని దేశభక్తికి నిదర్శనం కూడా.


ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన కథనం


మీకు తెలుసు .


అయితే ఇది యథాతథంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు...

ఎందుకంటే ఇందుకు సంబంధించిన చిత్రంలో జెమినీ గణేషన్ తో

పాటు శివాజీ గణేషన్ కూడా ఉండటం మన గమనించవచ్చు.


అయితే వారిద్తరూ తమిళ నటులు కాగా వారితో పాటు మన


మహానటి సావిత్రి మాత్రమే ఉండి ప్రధాని ఆభరణాలు నిలువుదోపిడీ దానంగా ఇవ్వడం ద్వారా ఆ ఘటన, 

అందుకు సంబంధించిన పూర్వాపరాలు మాత్రం వాస్తవమేనని అర్థం చేసుకోవచ్చు

Wednesday, May 16, 2018

"మన తెలుగునటి సావిత్రి"గారు.


👉1965 భారత్ పాక్ మధ్య 

రెండవసారి యుద్దం..........


యుద్ధంలో భారత్ దగ్గర 

మందుగుండు సామగ్రి అయిపోయింది...........


నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


👉1965 సెప్టంబర్ ప్రధాని చాంబర్ లోనికి గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది నటిగారు వేచిఉన్నారని చెప్పాడు............


శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు.............


👉ఐదు నిమిషాల తర్వాత 28 సంవత్సరాల వయస్సు వున్న యువతి వంటినిండా నగలతో దగదగలాడుతుండగా ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది............


శాస్త్రిగారితో తను ఎవరో పరిచయం చేసుకుంది..


👉శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు.,


తర్వాత తను వచ్చిన పని చెబుతూ .......


తను ధరించిన ఆభరణములన్నింటిని తీసి


శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ .........


ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది..........


👉తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండి పోయారు ప్రధానిగారు..


తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో......

👉"బేటీ నువ్వు మహనీయురాలమ్మా..........


నీ దేశభక్తికి అభినందనలు" అంటూ .........


ఆమెతో కరచాలనం చేసి ,గౌరవంగా గుమ్మం వరకు వచ్చి


సాగనంపారట..ఆమెను!!


ఇంతకూ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా?????


👉ఆమె "మన తెలుగునటి సావిత్రి"గారు. 

ఆమె చేసిన దానాలలో ఇదొకటి..

ఆమె దేశభక్తికి ఉదాహరణ ఈ సంఘటన!!!


🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️🇧🇴️

Monday, May 14, 2018

ఆరున్నొక్క రాగం ఆదితాళం !

ఆరున్నొక్క రాగం ఆదితాళం !

😪😪😪😪😪😪😪😪😪😪😪


👉అల్లసాని పెద్దన్న అల్లిబిల్లిగా ఏడ్చాడు..

ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడు...


భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’


అన్న ఛలోక్తి సాహిత్య లోకంలో సుప్రసిద్ధమైంది. 

.

వరూధిని వంటి గంధర్వాంగన కోరి వ(రి)స్తే ప్రవరాఖ్యుడు కాదు పొమ్మన్నాడు. ఆవిడకు కోపం రాదు మరీ! 

వచ్చింది. కానీ, ప్రవరుడు ఆ కోపాన్నీ పట్టించుకోలేదన్న ఉక్రోషంతో ‘నన్ను తోసినప్పుడు నీ చేతి గోళ్ళు ఎక్కడెక్కడ గాయపరిచాయో చూడు... అంటూ ఆ పాటలగంధి వేదన నెపంబిడి ఏడ్చింది’ అని చెప్పాడు అల్లసాని పెద్దన్న. కనుకనే ‘వరూధినిది తెచ్చిపెట్టుకున్న దుఃఖం!’ అన్నారు తాపీ ధర్మారావు. 

.

👉నంది తిమ్మన్న సత్యభామది మరోరకం దుఃఖం. తనను కాదని సవతికి మొగుడు పెద్దపీట వేశాడు. పారిజాతాన్ని రుక్మిణి జడలో తురిమాడు. దాంతో సత్య ‘ఈసునపుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలి ఏడ్చింది.’ 

.

👉వసురాజును వలచి విరహ తాపంతో సతమతమవుతున్న గిరికపై నిండు పున్నమి వెన్నెల దాడి చేసింది. అది అన్యాయం కాదు మరీ! ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌ (తాళ)లేక రాకా నిశారాజ శ్రీసఖమైన మోమున, పటాగ్రం(చీర కొంగులాంటి బట్ట) ఒత్తి, ఎల్గెత్తి ఆ రాజీవానన యేడ్చె...’ అని మనలాగే భట్టుమూర్తీ బాధపడ్డాడు. 

.

తేడా ఎక్కడొచ్చిందంటే-


వరూధిని ‘కలస్వనంబుతో’ (తీయని కంఠధ్వనితో) ఏడ్చింది.


సత్యభామ ‘బాలపల్లవగ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనితో’ ఏడ్చింది.


గిరిక కాంభోజిరాగాన్ని ఎంచుకొని మరీ ‘స్వరసం’గా ఏడ్చిందట.


‘కిన్నర వధూరాజత్‌ కరాంభోజ కాంభోజీమేళ 

విపంచికా రవ సుధాపురంబు తోరంబుగన్‌’ 

అన్నాడు- సంగీతజ్ఞుడు కూడా అయిన భట్టుమూర్తి అనే రామరాజభూషణుడు.


ఎంతకాదన్నా ఆడవారి నోట ఆరున్నొక్క రాగం పలికించడంలో మగవారికి అదోరకమైన ‘తుత్తి’ దక్కుతోందనిపిస్తోంది.

ఉత్పల వంటి సంప్రదాయ కవి సైతం

.

‘ఆమె ముక్కు ఎప్పుడును జిర్రున చీదినట్లు లేదు... 

హస్తమున సూదిమందు ఎక్కినట్లు లేదు’ 

.

అని ‘స్వప్నాల దుప్పటి’ చాటున బెంగపెట్టుకున్నారంటే


ఏమనుకోవాలి?

సున్నిత మనస్కులై ఎదుటివారిని ఏడిపించాలన్న బుద్ధి


ఏ కోశానా లేని కృష్ణశాస్త్రి వంటి కవులు


‘నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు


నితాంత దుఃఖంపు నిధులు కలవు’ 

.

అని తమ వెతల సంపదలు చూసుకుని సంతృప్తిపడతారు.


వారిని చూసి తిలక్‌ వంటి కవులు


‘మల్లెపూలపై పరుంటాడు... మంచి గంధం పూసుకుంటాడు... మరెందుకో ఏడుస్తాడు’ 

అంటూ ముక్కున వేలేసుకుంటారు. 

రాయప్రోలు వంటివారైతే

‘ఈ తృణకంకణంబు భరియింపుము... నీ ప్రణయ బాష్పజలాంజలి నింతయిచ్చి ఏ రీతిని వాడకుండ అలరింపుము’ అంటూ స్త్రీల కన్నీటిని అర్థిస్తారు.

ఇదంతా భావకవుల బేల ధోరణి.

ప్రబంధ కవులకు అలా బాహాటంగా ఏడ్చేందుకు మొహం చెల్లలేదు.

తమ నాయికలనే ఏదో వంకతో ‘వాటినీ ఏడుపులనే అంటారా?’ అని సందేహం వచ్చేలా ఏడిపించి తృప్తిపడ్డారు,

ఆ పెద్దమనిషి చేత అందుకే మాట పడ్డారు.

.

‘ఆ సంగతలా ఉంచండి, తనకోసం కన్నీరు పెట్టే స్త్రీ ఉండటం పురుషుడి భాగ్యమని గుర్తించండి’ అని శ్రీశ్రీ తేల్చి చెప్పారు. 

‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమె కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన... అంతకన్నా మహాభాగ్యం ఏముంది?’ అని సూటిగా ప్రశ్నించారు. 

కన్నీటిలో కరంటు లాంటిదేదో ఉందన్నది నిజం.

‘ఏడిచి ఎన్నాళ్ళయినదీ ఎద! అశ్రులు కనుమోసులందు ఓడిచి ఎన్నినాళ్ళు అయినదోయి’ అని కవులు కలవరపడటంలో అర్థం ఉందనిపిస్తుంది.

కాకపోతే హాయిగా స్వయంగా ఏడవాలే తప్ప ఎదుటివారిని ఏడిపించడం దోషమని మన పెద్దల తీర్మానం!

‘కలకంఠి కంట కన్నీరొలికితే సిరి యింట నిలవనంటుంది’ అనే భావనను స్థిరపరచడంలో అర్థం అదే. 

లేకుంటే ‘బాలానాం రోదనం బలం’ అన్న నోటితోనే ‘అతివలకూ ఏడుపు బలవర్థకం’ అనేవారేగా!


అయినవాళ్ళు దూరం అయినప్పుడు మనిషి భావోద్వేగాలకు లోనై, దుఃఖం కలగడం సర్వసహజం. 

అప్పుడు కన్నీరు రావడం మనిషి లక్షణం. కన్నతల్లి కన్నుమూత తీరని శోకాన్ని రగల్చగా

‘నీవు మడిగట్టుకుని పోయినావు పండ్లు పుష్పములు తీసుకొని- దేవపూజ కెటకొ!

నేను నీకొంగు పట్టుకు నీదువెంట పోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు’ 

అని విలపించారు నాయని సుబ్బారావు.

భార్యా వియోగ దుఃఖం నుంచి తేరుకునే క్రమంలో ‘వరలక్ష్మీ త్రిశతి’ని వెలువరించారు విశ్వనాథ.

‘తాజమహల్‌ అంటే ప్రియురాలు మరణింప ప్రియుడు కట్టించిన కన్నీటి తలపోత’గా వర్ణించారో వచన కవి. ‘భావోద్వేగాలు అలా ఏదోరకంగా బయటపడటమే ఆరోగ్యానికి మంచిది... ఏడవడం తప్పేం కాదు, 

మనసును తేలికపరచే మంచి మందు అది’ అంటున్నారు శాస్త్రజ్ఞులు. 

‘గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు అన్నమాట సత్యం...

భావోద్వేగాలను బలవంతంగా అణచిపెడితే ఆరోగ్యానికి చేటు’ అని హెచ్చరిస్తున్నారు.

‘రేయి కడుపున చీకటి చాయవోలె... నా విషాదమ్ములో దాగినాడ నేనె’ అనుకుంటూ 

తమలో తామే కుమిలిపోకుండా- కడుపారా బాహాటంగా ఏడ్చేయడమే సరైన పని’ అన్నది పరిశోధకుల సలహా. ‘ఏడిపిస్తే’ ఏడవమని కాదు, ‘ఏడుపొస్తే’ ఆపుకోవద్దన్నట్లుగా దీన్ని స్త్రీలు అర్థం చేసుకోవాలి.

దుఃఖం తన్నుకొస్తే భార్య ఒడిలో తలదాచి కాసిని కన్నీటి చుక్కలు రాలిస్తే మగతనానికి వచ్చిపడే లోటేమీ లేదని మగవారు గ్రహించాలి. అది అల్లిబిల్లిగానా ముద్దు ముద్దుగానా బావురుమనా... అనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ మోతాదు కాదు,

నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల

నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల


శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా

       పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా

       యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే

       సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్🌷


అనగనగా కాంపిల్యమనే పురం. అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు. అతని కొడుకు గుణనిధి. ఎంతో కాలానికి గొడ్డువీగి పుట్టిన బిడ్డడు. అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించడు. బాధ్యతంతా భార్యకే వదిలివేస్తాడు. దీనితో ఆ గుణనిధి కాస్తా చదువు సంధ్యలూ, ఆచారవ్యవహారాలూ పూర్తిగా మానేసి, జూదగాళ్ళతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె యేమీ అనదు. కనీసం భర్తకు చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా, అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒక రోజు అసలు సంగతి బయటపడనే పడుతుంది.


ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి, నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహూకరించిన ఉంగరం. ఎప్పుడో భార్యకి యిస్తాడు దాన్ని. అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి, వాణ్ణి ఆపి, ఆ ఉంగరం ఎక్కణ్ణుంచి వచ్చిందని నిలదీస్తాడు. అతను జంకూ గొంకూ లేకుండా విషయమంతా చెపుతాడు; గుణనిధి జూదంలో ఓడిపోయిన పణానికి గానూ ఆ ఉంగరం ఇచ్చాడని. పైగా, “యాగదీక్షితులలో నువ్వెంత ఘనుడివో, అక్షధూర్తులలో (అంటే జూదగాళ్ళలో) నీ అనుగు కుమారుడు అంత ఘనుడు!” అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లీ కొడుకూ ఏకమై అంత కాలం తనని మోసం చేసారని కుతకుతలాడిపోతాడు. ఇంటికి వచ్చి, తల్లీకొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడిగే పద్యమిది.


అయితే, అప్పుడు కూడా సోమిదేవమ్మగారు బొంకి, మాటమార్చే ప్రయత్నం చేస్తారు. దానితో ఆగ్రహోదగ్రుడైన యజ్ఞదత్తుడు, తల్లీ కొడుకులను ఇంటినుండి గెంటి, వేరే వివాహం చేసుకుంటాడు. పాపం, ఆ సోమిదేవమ్మగారి గతి ఏమయిందో తెలియదు కాని, మన కథానాయకుడైన గుణనిధి మాత్రం, చదువు రాక, ఏ పనీ తెలియక, తిండీతిప్పలు లేక, ఊళ్ళు పట్టిపోతాడు. ఒక శివరాత్రినాడు ఒక ఊళ్ళో ఉదయం నుంచీ తిండి లేక రాత్రి ఒక శివాలయానికి చేరతాడు. దేవుడి ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి, జాగారం ఉండి, తెల్లవారుతుందనగా, అందరూ నిద్రలోకి జోగుతున్న సమయంలో, ప్రసాదాలను దొంగిలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చీకటిగా ఉండడంతో, తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాలను తీసుకొని, తినడానికి బయటకి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవడంతో అతను లేచి, దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ అతడిని తరుముతారు. కాపలా ఉన్న రక్షకభటులు, పారిపోతున్న గుణనిధిపై బాణాలు వెయ్యడంతో, ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు.


అలా చనిపోయిన గుణనిధిని తీసుకువెళ్ళడానికి ఒకవైపు నుండి యమదూతలూ మరో వైపు నుండి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి, ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుడిని శివలోకం ఎలా తీసుకువెళతారని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడా శివగణాలు శివభక్తి తత్త్వంలోని సూక్ష్మాలను తెలియజెప్పి, గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలూ రాత్రీ ఉపవాసముండి, జాగరణ చేసి, శివుని ముందు దీపం వెలిగించి, శివాలయ ప్రాంగణంలో మరణించడం వల్ల అతనికి పుణ్యం లభించిందని చెపుతారు. గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కళింగదేశానికి రాజుగా పుడతాడు. అప్పుడతను పరమశివభక్తుడై, అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠ చేస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుని గూర్చి తపస్సు చేసి, కుబేరుడై, శివుని సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. ఇదీ క్లుప్తంగా గుణనిధి కథ!


మళ్ళీ మన ప్రస్తుత పద్యంలోకి వస్తే – ఈ పద్యంలోని సొగసూ శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి.  స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.


“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా

అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా

సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”


అని అంటాడు. “ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని. అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే! “దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.


ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!


కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల. ఇది శృంగారనైషధంలో కూడా కనిపిస్తుంది. శ్రీనాథుని పద్యాలలో, ఆ మాటకొస్తే మొత్తం పద్యసాహిత్యం అంతటిలోనూ, నాకు బాగా యిష్టమైన పద్యాలలో ఒకటైన పద్యం అది. పనిలో పని, ఆ పద్యాన్ని కూడా ఇప్పుడిక్కడ మీతో పంచుకోక పోతే నాకు మనసాగదు!


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏


🤲

శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా

       పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా

       యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే

       సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్🌷


అనగనగా కాంపిల్యమనే పురం. అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు. అతని కొడుకు గుణనిధి. ఎంతో కాలానికి గొడ్డువీగి పుట్టిన బిడ్డడు. అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించడు. బాధ్యతంతా భార్యకే వదిలివేస్తాడు. దీనితో ఆ గుణనిధి కాస్తా చదువు సంధ్యలూ, ఆచారవ్యవహారాలూ పూర్తిగా మానేసి, జూదగాళ్ళతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె యేమీ అనదు. కనీసం భర్తకు చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా, అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒక రోజు అసలు సంగతి బయటపడనే పడుతుంది.


ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి, నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహూకరించిన ఉంగరం. ఎప్పుడో భార్యకి యిస్తాడు దాన్ని. అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి, వాణ్ణి ఆపి, ఆ ఉంగరం ఎక్కణ్ణుంచి వచ్చిందని నిలదీస్తాడు. అతను జంకూ గొంకూ లేకుండా విషయమంతా చెపుతాడు; గుణనిధి జూదంలో ఓడిపోయిన పణానికి గానూ ఆ ఉంగరం ఇచ్చాడని. పైగా, “యాగదీక్షితులలో నువ్వెంత ఘనుడివో, అక్షధూర్తులలో (అంటే జూదగాళ్ళలో) నీ అనుగు కుమారుడు అంత ఘనుడు!” అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లీ కొడుకూ ఏకమై అంత కాలం తనని మోసం చేసారని కుతకుతలాడిపోతాడు. ఇంటికి వచ్చి, తల్లీకొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడిగే పద్యమిది.


అయితే, అప్పుడు కూడా సోమిదేవమ్మగారు బొంకి, మాటమార్చే ప్రయత్నం చేస్తారు. దానితో ఆగ్రహోదగ్రుడైన యజ్ఞదత్తుడు, తల్లీ కొడుకులను ఇంటినుండి గెంటి, వేరే వివాహం చేసుకుంటాడు. పాపం, ఆ సోమిదేవమ్మగారి గతి ఏమయిందో తెలియదు కాని, మన కథానాయకుడైన గుణనిధి మాత్రం, చదువు రాక, ఏ పనీ తెలియక, తిండీతిప్పలు లేక, ఊళ్ళు పట్టిపోతాడు. ఒక శివరాత్రినాడు ఒక ఊళ్ళో ఉదయం నుంచీ తిండి లేక రాత్రి ఒక శివాలయానికి చేరతాడు. దేవుడి ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి, జాగారం ఉండి, తెల్లవారుతుందనగా, అందరూ నిద్రలోకి జోగుతున్న సమయంలో, ప్రసాదాలను దొంగిలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చీకటిగా ఉండడంతో, తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాలను తీసుకొని, తినడానికి బయటకి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవడంతో అతను లేచి, దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ అతడిని తరుముతారు. కాపలా ఉన్న రక్షకభటులు, పారిపోతున్న గుణనిధిపై బాణాలు వెయ్యడంతో, ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు.


అలా చనిపోయిన గుణనిధిని తీసుకువెళ్ళడానికి ఒకవైపు నుండి యమదూతలూ మరో వైపు నుండి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి, ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుడిని శివలోకం ఎలా తీసుకువెళతారని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడా శివగణాలు శివభక్తి తత్త్వంలోని సూక్ష్మాలను తెలియజెప్పి, గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలూ రాత్రీ ఉపవాసముండి, జాగరణ చేసి, శివుని ముందు దీపం వెలిగించి, శివాలయ ప్రాంగణంలో మరణించడం వల్ల అతనికి పుణ్యం లభించిందని చెపుతారు. గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కళింగదేశానికి రాజుగా పుడతాడు. అప్పుడతను పరమశివభక్తుడై, అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠ చేస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుని గూర్చి తపస్సు చేసి, కుబేరుడై, శివుని సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. ఇదీ క్లుప్తంగా గుణనిధి కథ!


మళ్ళీ మన ప్రస్తుత పద్యంలోకి వస్తే – ఈ పద్యంలోని సొగసూ శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి.  స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.


“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా

అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా

సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”


అని అంటాడు. “ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని. అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే! “దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.


ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!


కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల. ఇది శృంగారనైషధంలో కూడా కనిపిస్తుంది. శ్రీనాథుని పద్యాలలో, ఆ మాటకొస్తే మొత్తం పద్యసాహిత్యం అంతటిలోనూ, నాకు బాగా యిష్టమైన పద్యాలలో ఒకటైన పద్యం అది. పనిలో పని, ఆ పద్యాన్ని కూడా ఇప్పుడిక్కడ మీతో పంచుకోక పోతే నాకు మనసాగదు!


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మోహిని అందం - భస్మాసుర అంతం!

మోహిని అందం - భస్మాసుర అంతం!

-


పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు.


విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృత్యం మొదలుపెడతాడు. అలా నృత్యం చేస్తూ మోహిని ఒక భంగిమలో తన చేయి తన తల పైన పెట్టుకుంటుంది. భస్మాసురుడు మోహిని యొక్క భంగిమను అనుకరించగా తన తలపైన తనే చేయి పెట్టుకుంటాడు. శివుని వరప్రభావము వలన భస్మాసురుడు భస్మమైపోతాడు. దేవతలు ఆనందిస్తారు!

.

చెట్టు వెనకనక్కిన సాంబశివుడు.

(రవి వర్మ మోహిని భస్మాసుర చిత్రం.)


Sunday, May 13, 2018

🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲

🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲


👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.

చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. 

రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. 

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. 

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......


బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. 

చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. 

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. 

భక్తుడు సరేనన్నాడు. 

ఆ ఘడియ రానే వచ్చింది. 

బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. .....

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. 

ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది. 

వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. 

అవన్నీ అతడి సొంతమయ్యాయి.....


మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. 

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. 

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.


నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.


దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! 

అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ......

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. 

అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. 

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. 

నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. 

అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. 

తప్పక అంతర్ముఖుడు కావాలి!

🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲

ఎందరో మహానుభావులు🌷 (చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు) 🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏

ఎందరో మహానుభావులు🌷


(చెప్పి గెలిచిన దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు)


🙏🙏🙏🙏- తనికెళ్ళ భరణి🙏🙏🙏విజయనగరం మహారాజు శ్రీ శ్రీ శ్రీ విజయరామ గజపతుల వారికి వీణంటే ప్రాణం.

యువరాజు గారు శ్రీ ఆనంద గజపతుల వారికి సితార్ పై మోజు

చూడ్డానికి ఒకేలా అనిపించినా.. దేనిదారి దానిదే..

వీణ పదహారణాల దక్షిణాది వాయిద్యం

సితార్..ఫక్తు హిందుస్తానీ..

వీణకీ...పక్కన మృదంగ విన్యాసం ఉంటే

సితార్ కి తబలా కావాలి.

అయితే రెండు అప్ప చెల్లెళ్ళు కావు.. తోడికోడళ్ళు.

రాజావారు కొడుక్కి వీణే నేర్పిద్దామనుకున్నాడు.

కొడుకు గారు ససేమిరా వద్దనాడని..

సరే వీణ-సితార్ కంటే గొప్పదీ అని ఋజువైతే..

కొడుకు ఎదురు ప్రశ్న?

ఇంతెందుకూ.. పోటీ పెడదాం

ఎవరక్కడ

చప్పట్లు..

సంగీత దర్బార్ తయారైంది.

రెండు వేడుకలు సిద్ధం.

ఒకటి హిందుస్తానీ

రెండోది ..కర్ణాటకం.

ఓ వైపు అత్తరు పరిమళాలు

మరోవైపు అగరు పొగలు

ఓ వేపు మల్లెల దండలు

మరోవేపు గులాబీల గుత్తులు

ఒక దిక్కు.. మఖ్ మల్ తక్త్ లు

మరో దిక్కు పట్టు బాలీసులు

బనారసీ పాన్ - జర్దా ఘుమాయింపు వొక చోట నుంచి

లేత తమల పాకుల విడియముల పరిమళములొక చోట నుండీ..

హిందుస్తానీ సంగీత విద్వాంసుడు మహబ్బత్ ఖాన్ ఒకవైపు

కర్ణాటక్ సంగీత నిధి దూర్వాసుల సోమయాజులు గారొకవైపు...


సితార్ ఆరంభమైంది.. ఉత్తరాది స్వర గంగ ఉప్పొంగి సుడులు తిరిగి పాయలు పాయలుగా విడిపోయి.. హొయలు పోయీ.. శ్రోతల నరాల మీద నాట్యం చేసి. సలామ్ చేసింది.


శబ్బాష్ లు... వహ్వాలు..

దద్దరిల్లిపోయింది సభ.

ఇక దూర్వాసుల సోమయాజుల వారు..వీణాపాణికి మనసులోనే

దణ్ణమెట్టుకుని మీటాడు వీణ.. 

గోదావరి నది పరవళ్ళు తొక్కడం మొదలెట్టింది.. 

బొట్టి పెట్టినట్టు..బొట్టు బొట్టుగానే మొదలై

చిన్నపిల్ల రెండు జెళ్ళై, కన్నెపిల్ల వాలుజడై

పుష్కరాల్ రేవుల మునకేస్తున్న ఫ్రౌఢ .. విడిపోయిన జడలా..

పాయలు పాయలై, చివరికి ధూర్జటి జటల్లె.. విస్తరించీ.. శ్రోతల్ని ఆనందాంభుధిలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసింది.

చప్పట్లు లేవు.. నిశ్శబ్దం తప్ప.

అవాక్కయిపోయింది సభ.

ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప. మరో శబ్దం లేదు..

వీణ మీద పలికించినవి..సితారు మీద పలికించడం 

నావల్ల కాలేదు.. అని ఓటమిని సవినయంగా ఒప్పుకున్నాడు మహబ్బత్ ఖాన్...

అప్పుడు అదిరింది సభ చప్పట్లతో..

ఆనందగజపతి ఆనందంగా వీణ పట్టాడు.

విజయరామ గజపతి పరమానందంగా..

దూర్వాసుల వారి పాదాలు పట్టాడు..

అప్పట్నుంచీ దూర్వాసులవారు గజపతులకు రాజగురువు..

అయితే సోమయాజులవారు కేవలం కర్ణాటక సంగీతానికే పరిమితం కాకుండా..

కాశి..కలకత్తా వంటి ప్రాంతాలకు వెళ్ళి...హిందుస్తానీ సంగీతాన్ని గూడా ఔపోశనపట్టారు.

అయితే సోమయాజులు గారికి సంగీతం నేర్పిన గురువు సాక్షాత్తూ ఆయన తాతగారే.

విజయనగర ప్రభువుల వీర చరిత్రను గేయరూపంలో రచించి 72వ మేళకర్త రాగాలలోనూ స్వరపరచిన ఘనులు సోమయాజులు గారు.


ముఖారి రాగంలో.. ‘ఇటు చూడరా’

కాంభోజి రాగంలో.. ‘ఎందుకే తొందర’

మోహన రాగంలో.. ‘నెరనమ్మినాను’ అనే శృంగార కీర్తనలను

ఆనంద గజపతులవారి మీద రాసి.. అంకితమిచ్చారు.


అన్నట్టు విశేషమైన విషయం ఏమిటంటే మనం సంగీత త్రయంగా పూజించే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచనలని ఆరంభంలో ఆంధ్రదేశం అంతా విస్తృతంగా ప్రచారం చేసిన ఘనత దూర్వాసుల వారిదే..


అలాగే 1831లో మద్రాసులో. మైసూరు.. పుదుక్కోట లాంటి ఏడు సంస్థానాల ... సంగీత విద్వాంసులకి పోటీ జరిగింది. మైసూరులాంటి పెద్ద సంస్థానాలు మొదట్లో పెట్టీ..

విజయనగరం వంటి చిన్న సంస్థానాలకి చివరికి అవకాశం ఉండేలా చేశారు.

ఈ సంగతి తెలిసి ఆనంద గజపతుల వారు చిన్నబుచ్చుకున్నారు.

అప్పుడు సోమయాజులు మందహాసం చేస్తూ 

ఎక్కడుంటే.. ఏవిటండీ.. జరిగేది పోటీ.. గెలవడం లెక్క అంటూ హామీ ఇచ్చాడు.

చివరగా దూర్వాసుల సోమయాజుల వంతొచ్చింది.

కళ్యాణి, వసంత రాగాలతో పాటలు ఇతర సంగీత సాంప్రదాయాలన్నీ మేళవించీ, వీణావాదన మొదలెట్టారు.

అందులో కర్ణాటక మాధుర్యముంది.

హిందుస్తానీ మజా ఉంది.

అంతేకాదు.. పశ్చాత్యుల కిక్కు కూడా ఉంది.

అందువల్లే..

పోటీలో పాల్గొనే సమయం ఇరవై నిముషాలే అయినా,

సుమారు గంటన్నరపైగా వాయించినా ఎవరూ కిక్కురుమనలేదు సరిగదా

పోటీ చూట్టానికొచ్చిన దొరలూ..దొరసానులూ.. సోమయాజులు వాయించిన పాశ్చాత్య సంప్రదాయ రీతికి డాన్స్ చేయడం మొదలెట్టారు.

పోటీ ముగిసింది.

దూర్వాసుల వెంకట సోమయాజులు గారిది ప్రథమ బహుమతి.

ఆనందగజపతి మహారాజుగారు గుండెల్నిండా ఊపిరి పీల్చి సొగసుగా మీసం మెలేసారు.

ఆ సందర్భంలో వైస్రాయ్ ఎల్జిన్ ప్రభువిచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికీ సోమయాజుల గారి మనుమరాలి ఇంట్లో భద్రంగా ఉంది.

అలా చాలాకాలం పాటు.. తన సంగీతంతో విజయనగర సంస్థానాన్ని చిరస్మరణీయం చేసిన సంగీత భాస్కరుడు అస్తమించే వేళ ఆసన్నమయింది.

తంత్రులు సడలిన వీణలా ఉన్న ఆయన వొంటి మీద చెయ్యేసి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు ఆనందగజపతి. 

దూర్వాసుల సోమయాజులు మాత్రం..

నిశ్చలంగా, నిర్మలంగా ఉన్నారు. పెదాలమీద చిరునవ్వు ఇంకా చెదరలేదు.

మెల్లి...మెల్లిగా...కళ్ళలోని కాంతి..పైకి ప్రయాణమయ్యింది.

ఆనంద గజపతుల అశ్రుబిందువులు ఆయన పాదాలపై పడ్డాయ్.

ఆయన నిర్యాణం గురించి దూర్వాసుల శ్రీరామ శాస్త్రిగారు ఒక పద్యం రాశారు.

🤲🤲🤲🤲🤲


వీణయు చేతబూని కడు విస్మయ ముప్పతిలంగ భైరవిన్

తానము మేళవించి యమృతంబును జిల్కెడు మిమ్ము జూచుచున్

గాణలు, హుణులొక్క గతిగ నుతి చేసిరి గాని యంతలో

వీనుల పుణ్యమీ కరణి వేడెను గానము విస్తరించగా...

🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

అష్టావక్ర మహర్షి! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అష్టావక్ర మహర్షి!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ఏకపాదుడనే బ్రాహ్మణుడు నిరంతర తపోనిధుడు.

ఆయన భార్య సుజాత ఉత్తమురాలు. ఏకపాదునికి ఎంతోమంది శిష్యులుండేవారు. బ్రహ్మచారులందరూ ఆయన వద్దనే ఉండి విద్య నేర్చుకొనేవారు. భార్యాభర్తలిద్దరూ శిష్యులతో హాయిగా కాలం గడుపుచున్నారు

. సుజాత కొన్నిరోజులకు గర్భవతి అయింది. 

పుట్టబోయే బిడ్డ తండ్రి వేదములు శిష్యులకు చెప్తూవుండగా తల్లిగర్భంలో వుండి వింటూ సర్వము తప్పు నిద్రాహారములు లేకుండా శిష్యులతో చెప్పించటం తప్పు అని తండ్రికి తెలిపాడు.


తనకు పుట్టబోయే కుమారుడు దివ్య మణితుల్యుడు

అని గ్రహించి సంతోషించాడు. కాని పుట్టకుండానే తనను తప్పుపట్టాడు వక్రముగా ఆలోచించాడని, ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.

సుజాత ఒక రోజున నెయ్యి, నూనె, ధాన్యం తెమ్మని చెప్పగా వాటికోసం జనకమహారాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పందెం జరుగుచున్నది.

అదేమంటే వరుణుని కుమారుడు వందితో వాదమున గెలిచినవారికి సర్వం యిస్తారని, ఓడితే జలములో మునిగి ఉండవలెనని చెప్పారు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయాడు. జలాశయంలో ఉండిపోయాడు. 

సుజాత నెలలు నిండాక ఒక కుమారుణ్ని కన్నది. ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నాడు. ఆ కారణంతో అష్టావక్రుడు అని పేరు పెట్టారు. 

అదే సమయంలో సుజాత తల్లికి శ్వేతకేతు అనే పుత్రుడు పుట్టాడు. అష్టావక్రుడు బాల్యం నుంచీ ఉద్దాలకమహర్షి వద్ద విద్య అధ్యయనం చేస్తున్నాడు. ఆయన ఉద్దాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావించేవారు.

కొన్నిరోజులకు అసలు విషయం తెలుసుకొని జలములో ఉన్న తండ్రిని తీసుకురావాలని తల్లి ఆశీర్వాదము పొంది జనకమహారాజు అస్థానమునకు వెళ్లగా ద్వారపాలకులు 

ఇతనిని వెళ్లనివ్వలేదు. అనేక శాస్త్ర విషయాలు చెప్పగా దారి ఇచ్చి పంపారు. ఆయన జనకమహారాజు సమక్షంలో వందితో వాదిస్తానన్నాడు. బాలుడవు నీవేమి వాదించలేవు అన్నా వినక పిలిపించమని పట్టుపట్టాడు.

వంది వచ్చాక వాదించి గెలిచి తన శక్తి సామర్ధ్యములు తెలిపాడు. జనకమహారాజు అ బాలకుడ్ని అభినందించి “మహాజ్ఞానీ ఏమి కావాలో సెలవివ్వండి” అని పలుకగా తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుడ్ని చేయమని కొరాడు. 

వంది తన తండ్రిని జలములో ఉంచలేదని తన తండ్రిని వరుణుడు చేయు యజ్ఞము వద్దకు పంపాడని తెలిసి వందిని కీర్తించాడు. అష్టావక్రుని కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనకమహారాజు సత్కరించాడు.

అద్వైత వేదాంత రహస్యములను అష్టావక్రుని ద్వారా తెలుసుకొని అతని పితృభక్తికి ఎంతో సంతోషించాడు. 

తండ్రి కూడా మెచ్చుకొని నదియందు స్నానం చేయించి కుమారుని వంకరలు పోయేటట్లు చేశాడు. అష్టావక్రుడు సుందరుడై ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి సేవచేస్తూ ఉండిపోయాడు.

వివాహ వయస్సు రాగానే వదాస్యమహర్షి కుమార్తె సుప్రభను ఇచ్చి పెళ్ళి చేశారు. భార్యతో కలసి ఆశ్రమం నిర్మించుకొని తపస్సుచేస్తూ గృహస్థాశ్రమంలో ఉండిపోయాడు.


ఒక రోజున అష్టావక్రుడు నదిలో స్నానం చేస్తుండగా అప్సరసలు వచ్చి నృత్యగీతములని వినిపించారు. ఆయన సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. వాళ్లు మాకు విష్ణుమూర్తితో స్నేహం కావాలని కోరారు.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని దగ్గర గోపికలై జన్మించి స్నేహం చేస్తారని వరం ఇచ్చాడు. తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.


ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. 

ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది


మాతృ దినోత్సవము.!

మాతృ దినోత్సవము.!


జనని తనువు నొసగు పునర్జన్మ మెత్తి

మహిని వెలసిన దేవియే మాతృ మూర్తి

అమ్మ కన్నను దైవమీ యవని లేదు

తల్లి ఋణమును దీర్ప సాధ్యంబు కాదు !!


చిన్ని నాడు చిలుక పల్కుల 

బుడి బుడి నడకల నేర్పిన యాదిగురువు

చిరుప్రాయంబునజనని యొడియనుభవం

యిల లోని జనులందరికో దివ్య వరం !!


విశాలజగాన విఫణినిదొరకనిదిజనని

' యొక్కటే 

సేదదీర్చి హాయి నందించే ప్రశాంతతే అమ్మ 

వయసెంత _ రెక్కలెంత_పెరిగినా

దరిజేర్చు కొనే వెచ్చని గూడే___అమ్మ


అమ్మ స్పర్శ లో వాత్సల్యం

అమ్మ చూపులో ఆప్యాయం

అమ్మ తలపులో నైర్మల్యం

అమ్మ హృదయం అనంత వైశాల్యం !!


అమ్మ బిడ్డకు మొదటి దిక్కు

అమ్మ బిడ్డకు మొదటి వాక్కు 

అమ్మ బిడ్డకు మొదటి ఋక్కు 

అమ్మ కే బిడ్డ పై మొదటి హక్కు !!


అమ్మ మనసు మంచి గంధం 

అమ్మ సూక్తులు మంచి గ్రంధం


ప్రాతః కాలాన జనని పాదంబు దాకు వారి

సర్వ కార్యంబులు సిద్దింప కుండునే ?


సర్వ తీర్థాంబువుల కంటే సమధి కంబు

పావనంబైన జనయిత్రి పాదజలము

(కాశీఖండము__శ్రీనాథ మహాకవి)


ఉపవసించి యుపాసించు యోగి జనుల 

కనుల బడునేమొ దేవుండు కాని, తానె ఉపవసించి యుపాసించి నెపుడు మనల 

కనుల నిండార గాంచును కన్న తల్లి !!


భూ ప్రదక్షిణ షట్కేన _ కాశీయాత్రా సహస్ర

యుతేనచ

సేతు స్నాన శతైర్యశ్చ _ తత్ఫలం 

మాతృ వందనే !!


(ఆరు మార్లు భూ ప్రదక్షిణ __వేయిసార్లు

కాశీయాత్ర వందమార్లు'రామేశ్వర'

సముద్ర స్నానం చేసిన ఫలం ఒక్క సారి 

తల్లి కి వందనము చేస్తే లభిస్తుంది )


అమ్మభాషే నాబాల్యపు గోరుముద్ద

అమ్మ భాషే నా యౌవన ప్రణయ రాశి

అమ్మభాషే నావార్థక్యపు వారణాసి

అమ్మభాషే నాజన్మకు ఆనంద వారాశి

అమ్మభాషే నాకు పుట్టుక తోవచ్చినసిరి

అమ్మభాషే నా ఊపిరి


మాతృదినోత్సవ శుభాకాంక్షలతో!


Monday, May 7, 2018

పుల్లాపంతుల సోదరులు-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి 😡

పుల్లాపంతుల సోదరులు-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి 

😡


👉ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది.

అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)

 రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు.

అప్పటికి ఉపశమనమే తప్ప మరీ కొన్నాళ్ళకు వచ్చేది.


ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను అని తన పరివారం తో

 సహా కాశీకి ప్రయాణం కట్టారు.అలా వెడుతూ వెడుతూ మధ్యలో 

శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో 

వున్న బోదనం పాడు అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు.

అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి 

పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము యిక్కడెవరో

బాధతో మూలుగుతున్నారు ,మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు.


మేము యిద్దరూ అన్నదమ్ములంఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం.

మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న,సూరన్న యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు,

మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి.

మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు.సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది.

ఈ మధ్య మరీ ఎక్కువగా వుంది.

ఒక్కోసారి తల గోడకేసి బద్దలు కొట్టుకోవాలని పిస్తుంది.

తలలో ఏదో తోలుస్తున్నట్టు బాధ ఆన్నారు తిమ్మన.

మీరు సెలవిస్తే మేము మిమ్మల్ని పరీక్షిస్తాం.మాకున్న పరిజ్ఞానంతో

 మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించ గలమని 


మా నమ్మకం. అన్నాడు పుల్లన్న.


ఆయన వేదన సోదరులకు అర్థమైంది.

ఆర్యా!ఆ బాధ నిజంగా వర్ణనాతీతం.గజరాజు కుంభస్థలం లోకి పాము ప్రవేశించి 

నప్పుడు ఆ గజం ఎంతగా విల విల లాడి పోతుందో అది ఎన్ని కొండల్ని ఢీకొంటుందో 

అందుకు వెయ్యి రెట్లు వుంటుందీ శిరోవేదన.భరించడం ఎవరికైనా కష్టమే.

ఒకసారి చెయ్యి యివ్వండి నాడి పరీక్షిస్తాం.అన్నాడు సూరన్న.

తిమ్మన చెయ్యి అందించారు.సూరన్న.

అతి జాగ్రత్తగా నాడి పరీక్ష చేశాడు.విషయం పుల్లన్నకు వైద్య పరి భాషలో వివరించాడు. 


ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజులు ఆ వైద్య సోదరులు తిమ్మన ముక్కులో 

చుక్కల పసరు పిండుతూ వచ్చారు.నాలుగో రోజు ఆ వైద్యానికి కావలిసిన 

పదార్థాలన్నీ ఒక జాబితా తయారు చేసి యిచ్చారు.అందులో విశేషంగా వైద్యానికిమ్కావలిసిన వస్తువులేమీ లేవు.పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

పుట్టెడు బియ్యమా?అంటూ వూరందరికీ సమారాధన చేస్తారా?

ఏమి అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.


కాదు అవసరం వుంది తెప్పించండి.

అలాగే 20 మంది వంటవాళ్లు కూడా కావాలి అన్నారు వైద్య సోదరులు 

ఉప్పు,పప్పు కూరగాయలు కూడా తెప్పించండి.వండి వూళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి సరిపోతుంది దెప్పి పొడిచాడు రాజవైద్యుడు.కాదు కాదు 

మా వైద్యానికి ఇది చాలా అవసరం అన్నాడు పుల్లన్న.


ఏమి అవసరమో యేమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల 

నీళ్ళు త్రాగిస్తున్నారు.

మరుదినం గాలి కూడా చొరరాని దట్టమైన బాగా ఎత్తైన గుడిసె నొక దానిని నిర్మించారు.బయట వంటవాళ్ళతో పుట్టెడు బియ్యం వండిస్తున్నారు.

అనదరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.తిమ్మనను గుడిసె లోకి పిలుచుకొని వెళ్ళారు.సోదరులు.మిమ్మల్ని ఈ గుడిసె లో తలక్రిందులుగా వేలాడ దియ్యాల్సి వుంటుంది అన్నారు.తిమ్మనకు దిక్కు తోచలేదు.భయపడకండి ఇది వైద్య ప్రక్రియలో భాగమే.అన్నారు వైద్య సోదరులు సరే వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా ఏదైతే అది అవుతుంది అని కానివ్వండి అన్నారు తిమ్మన వెంటనే ఆయనకు లావు కంబళ్ళు శరీరమంతా చుట్టి తలకు ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించి ఆ గుడిసెకు ఒక మూలగా ఆయన్ను తలక్రిందులుగా వేలాడ దీశారు.

ఒక్కో వంటవాడు అప్పుడే హండాలలో వండి వార్చిన అన్నాన్ని గుడిసె లో గుమ్మరించారు.వారి సహాయకులు.గుడిసె అంతా ఆవిరి సెగలతో నిండిపోయింది.


తిమ్మన శరీరం ముక్కు పుటాల ద్వారా వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు 

నషాళానికి అంటాయి.రెండు క్షణాల .లోనే ఆయన ముక్కు పుటాలనుంచి 

రెండు విష క్రిములు గిజ గిజ లాడుతూ ఆ అన్నపు రాశి పై పడ్డాయి.వెంటనే స్మృతి తప్పిన ఆయన్ను క్రిందికి దించి బయటకు తీసుకొని వచ్చి శీతలోపచారాలు చేశారు 


.క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు.రెండు వారాల్లో పూర్తిగా కోలుకునేలా మంచి 

మందు లిచ్చారు.

క్రమేపీ కవిగారి శిరోభారం తగ్గి రోగం నయమైంది.ఈ శుభ సమాచారాన్ని రాయలవారికి 

అండ జేశారు.రాయలు ఎంతో సంతోషించి రాజసభకు ఆహ్వానించి తీసుకొని రావలిసిందని తిమ్మనకు కి కబురు పంపారు.. 


పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి అప్పటికే విజయనగరం పరిసర ప్రాంతాలకు పాకిపోయింది.

ఆ వైద్యులను దర్శించు కోవడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు.కాసేపటికి కృష్ణదేవరాయల వారూ వచ్చారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు.


శ్రీ వేంకటగిరి వల్లభ

సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవి 

జీవితనాయక!కవితా 

ప్రావీణ్య ఫణీశ కృష్ణ రాయ మహీశా!


ప్రభూ మేము వైద్యులమేగానీ కవులము కాదు.అందుకే ముక్కు తిమ్మన గారి 


పద్యాన్నే ఒప్పజెప్పాం.అందుకు మమ్మల్ని మన్నించండి.వంశ పారంపర్యంగా వస్తున్న వైద్య వృత్తినేసెవాధర్మంగాభావించి మా బోదనంపాడు లోనే నిర్వహిస్తున్నాం.మా గ్రామం తమరి ఏలుబడిలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన దరిశి మండలం లో వుంది.

ఈ నాటికి ఆ గ్రామానికి ఖ్యాతి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తూంది.

తిమ్మన గారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం మా పూర్వీకుల వాళ్ళ మాకు లభించిన పుణ్య ఫలం.వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ మా వైద్య విద్య యిలాగే రాయలవారి అనుగ్రహం తో పదికాలాలపాటు శాశ్వత కీర్తి పొందాలని విన్నవించుకుంటున్నాము. .అన్నారు 

పుల్లాపంతుల సోదరులు.

ప్రభువుల ఆజ్ఞతో తిమ్మన లేచి ప్రభూ శతాధిక వందనాలు.

"కాశ్యాన్తు మరణానురక్తి" అని నిశ్చయించుకొన్న నేను ఈ ఘన వైద్యుల చలువతో పునర్జన్మ ఎత్తాను వీళ్ళు నా పాలిట అశ్వినీ దేవతలే

పర్వతము తేవలిసిన పని వుండేది కాదేమో.కుగ్రామం లో నిస్వార్థంగా 

వైద్యసేవల నందిస్తూ గ్రామములో వారినందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే వీరి ఋణం ఎలా తీర్చుకోగలం?రాయలవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించి నట్లుంటుంది అని నా అభిప్రాయం.ఆ తర్వాత రాయలవారి చిత్తం అన్నారు.

కవీశ్వరుల సూచన ఆమోదదాయకమే మరి వారి సమ్మతం మాకు సంతోషదాయకం అన్నారు రాయలవారు.సభలో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలం లోనే వైద్యం చెయ్యాలి 

మరో చోటుకు పోగూడదు.ధన సంపాదనకూ,స్వలాభాపేక్షకు లోనుకాకూడదు.మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తి ఆర్జించాలని మా పెద్దల ఆశయం.దీన్ని ప్రభువులు వేరుగా తలచరాదని ప్రార్థన.అన్నారా సోదరులు 

భేష్ ! మీ పూర్వీకుల ఆశయం మన్నింప దగిందే.వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం.అప్పుడే వైద్యానికి విలువ మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును ఓ అగ్రహారంగా మీకు దాన శాసనం తో వ్రాయించి ఇస్తున్నాం.సంతోషమే కదా! అన్నారు రాయలు.గంభీరంగా సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

తర్వాత వైద్య సోదరులను ఘనంగా సత్కరించారు.రాయలవారు.ఆశీర్వాద నవరత్న పద్యమాలికలతో ఆ సోదరులను మెప్పించి తన ఋణం తీర్చుకున్నారు తిమ్మన.ఆనాటి నుంచీ బోదనం పాడు అగ్రహారం లో పేరు నిల్పగల వైద్యులు 'మడుగుపట్టు చెలమ'అన్నట్టు ఖ్యాతి వహించారు.

అందుకే వేమన యిలా అన్నాడు.


మాటలాడ గల్గు మర్మము లెరిగిన 

పిన్న పెద్దతనము లెన్నవలదు 

పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదా

విశ్వదాభిరామ వినురవేమ 

🤲

తక్కువవాడని ఎవరినీ హేళన చెయ్యరాదు.చిన్నవాడి చేతిలోని దీపముకూడా వెలుగు నిస్తుంది కదా!వేమన నోటినుండి ఈ ఆటవెలది రాక పూర్వమే ఈ నీతికి పట్టం గట్టే ఈ చారిత్రిక గాథకు తెలుగునేల వేదికైంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, May 4, 2018

" సూర్య భగవానుని చరిత్ర "


" సూర్య భగవానుని చరిత్ర "


సూర్యుని భార్య ' సంజ్ఞా దేవి '. త్వష్ట ప్రజాపతి కుమార్తె.


సంజ్ఞాదేవి గర్భవాసాన సూర్యునికి ముగ్గురు బిడ్డలు.


వారు మనువు,యముడు,యమున.


మనువుల చే పరిపాలించబడటం వలన మనం ' మానవులు


'అయినాము.


సూర్యుని కుమారుడు అయిన మనువు మొదటి మనువు.


ధర్మ స్వరూపుడైన 'యముడు' అష్టదిక్పాలకులలో ఒకడైనాడు.


యముడే ధర్మదేవత.జీవుల పాపపుణ్యాలను గుణించి,శిక్షించి,


కర్మ పరిహారం చేసే ' నరకలోకాధిపతి '.


ఇలా ఉండగా సంజ్ఞాదేవికి అమిత తేజోవంతుడైన తన భర్త కాంతిని


భరించడం సాధ్యం కానిదయ్యింది.కొంతకాలం తన పుట్టింటికి వెళ్ళి


విశ్రాంతి తీసుకోవనుకుంది.చెపితే భర్త ఒప్పుకోడని,బాగా


ఆలోచించి,తన శక్తితో తన ప్రతిరూపాన్ని సృష్టించింది.ఆ స్త్రీ మూర్తికి


'ఛాయ ' అని పేరు పెట్టింది.


తన భర్తని,పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి,ఎట్టి పరిస్థిలోనూ


ఈ రహస్యం భర్తకు తెలియరాదని మాట తీసుకుంది.


తనకు శాప భయం రానంత వరకు ఎవరికీ తెలియనివ్వనని


షరతుతో కూడిన మాట ఇచ్చింది ఛాయాదేవి.


సంజ్ఞాదేవి పుట్టింటికి చేరింది.


కానీ అక్కడ తండ్రి తన కూతురు భర్తకు తెలియకుండా వచ్చినదని


తెలిసి,ఆమె అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు.


వివాహం అయిన స్త్రీ భర్త అనుమతి లేకుండా పుట్టింటికి రావడం


ధర్మం కాదని,కారణమేదయినా సరే అందువలన రెండు కుటుంబాలకు


చెడ్డ పేరు వస్తుందని,అందువలన తిరిగి భర్త వద్దకు వెళ్ళిపొమ్మన్నాడు.


తండ్రి మాటలకు విచారించిన సంజ్ఞాదేవి చేసేది లేక,దుఃఖంతో వెను


తిరిగింది.ఇంత జరిగాక భర్త దగ్గరకు వెళ్ళడానికి ముఖం చెల్లక, '


ఉత్తర కురు భూములు 'చేరింది.


అక్కడ ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికై ' ఆడగుర్రం ' గా


మారి సంచరించ సాగింది.


ఇక్కడ ఇదేమీ తెలియని ' భాస్కరుడు ' ఇంట్లో ఉన్నది సంజ్ఞాదేవి


గానే భావించి కాలం గడపసాగాడు.


వారి అన్యోన్య ఫలితంగా చాయాదేవికి ' వైవస్వత మనువు,శని,


తపతి ' ముగ్గురు పిల్లలు కలిగారు.


వైవస్వంతుడు మనువు అయినాడు,శని నవగ్రహాలలో స్థానం పొందాడు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, May 3, 2018

🙏🙏 నమ్మకం విలువ 🙏🙏


🙏🙏 నమ్మకం విలువ 🙏🙏


👉శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు


యుద్ధం ముగిసింది, ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర


తీరంలో విశ్రమించారు.


అర్థరాత్రి అయింది రాముడు లేచి సముద్రం


దగ్గరకు వెళ్ళాడు ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రం నీటిలో


వేస్తున్నాడు వేసిన ప్రతి రాయి మునిగిపోతుంది.


రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు


తాను రాముని వెంట వెళ్ళాడు. రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం


గమనించాడు రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి,


👉'మహాప్రభూ., ఎందుకిలా రాళ్ళను అంబుధిలో


వేస్తున్నారు? అని ప్రశ్నించాడు


' హనుమా.. నువ్వు నాకు అబద్ధం చెప్పావు'


అన్నాడు రాముడు


'అదేమిటి స్వామీ' నేను మీతో అబద్ధం చెప్పానా?


ఏమిటి స్వామీ అది?' ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు


"వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని


అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని


చెప్పావు నిజమేనా? అన్నాడు రాముడు


'అవును స్వామీ'


'నా పేరు జపించి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేసిన


రాళ్ళుఎందుకు తేలడం లేదు?


మునగడానికి కారణమేమిటి?


నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా!" అని అడిగాడు రాముడు.


హనుమంతుడు వినయంగా


చేతులు కట్టుకుని ఇలా అన్నాడు


👉"రామచంద్ర ప్రభూ!


మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము మీ మీద నమ్మకంతో రాళ్ళు


వేశాము మా నమ్మకం వలన అవి తేలాయి మీకు మీ శక్తి మీద నమ్మకం


లేదు అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు


అందుకే అవి మునిగిపోయాయి నమ్మకం విలువ అది.


🙏జై శ్రీ రామ్ 🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏జై శ్రీ రామ్ 🙏