మాతృ దినోత్సవము.!

మాతృ దినోత్సవము.!


జనని తనువు నొసగు పునర్జన్మ మెత్తి

మహిని వెలసిన దేవియే మాతృ మూర్తి

అమ్మ కన్నను దైవమీ యవని లేదు

తల్లి ఋణమును దీర్ప సాధ్యంబు కాదు !!


చిన్ని నాడు చిలుక పల్కుల 

బుడి బుడి నడకల నేర్పిన యాదిగురువు

చిరుప్రాయంబునజనని యొడియనుభవం

యిల లోని జనులందరికో దివ్య వరం !!


విశాలజగాన విఫణినిదొరకనిదిజనని

' యొక్కటే 

సేదదీర్చి హాయి నందించే ప్రశాంతతే అమ్మ 

వయసెంత _ రెక్కలెంత_పెరిగినా

దరిజేర్చు కొనే వెచ్చని గూడే___అమ్మ


అమ్మ స్పర్శ లో వాత్సల్యం

అమ్మ చూపులో ఆప్యాయం

అమ్మ తలపులో నైర్మల్యం

అమ్మ హృదయం అనంత వైశాల్యం !!


అమ్మ బిడ్డకు మొదటి దిక్కు

అమ్మ బిడ్డకు మొదటి వాక్కు 

అమ్మ బిడ్డకు మొదటి ఋక్కు 

అమ్మ కే బిడ్డ పై మొదటి హక్కు !!


అమ్మ మనసు మంచి గంధం 

అమ్మ సూక్తులు మంచి గ్రంధం


ప్రాతః కాలాన జనని పాదంబు దాకు వారి

సర్వ కార్యంబులు సిద్దింప కుండునే ?


సర్వ తీర్థాంబువుల కంటే సమధి కంబు

పావనంబైన జనయిత్రి పాదజలము

(కాశీఖండము__శ్రీనాథ మహాకవి)


ఉపవసించి యుపాసించు యోగి జనుల 

కనుల బడునేమొ దేవుండు కాని, తానె ఉపవసించి యుపాసించి నెపుడు మనల 

కనుల నిండార గాంచును కన్న తల్లి !!


భూ ప్రదక్షిణ షట్కేన _ కాశీయాత్రా సహస్ర

యుతేనచ

సేతు స్నాన శతైర్యశ్చ _ తత్ఫలం 

మాతృ వందనే !!


(ఆరు మార్లు భూ ప్రదక్షిణ __వేయిసార్లు

కాశీయాత్ర వందమార్లు'రామేశ్వర'

సముద్ర స్నానం చేసిన ఫలం ఒక్క సారి 

తల్లి కి వందనము చేస్తే లభిస్తుంది )


అమ్మభాషే నాబాల్యపు గోరుముద్ద

అమ్మ భాషే నా యౌవన ప్రణయ రాశి

అమ్మభాషే నావార్థక్యపు వారణాసి

అమ్మభాషే నాజన్మకు ఆనంద వారాశి

అమ్మభాషే నాకు పుట్టుక తోవచ్చినసిరి

అమ్మభాషే నా ఊపిరి


మాతృదినోత్సవ శుభాకాంక్షలతో!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!