రేచీకటి అల్లుడు"!


రేచీకటి అల్లుడు"!

(చిలకమర్తి వారి 'వినోదములు' నుండి.)


సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక అల్లుడు అత్తవారింటికి వచ్చెను. అతనికి రేచీకటి. ఈ లోపమును వారికి తెలియజేెయట

కతనికిష్టము లేదు. ఒక రోజు రాత్రి బింకముగా వాకిలిలో అటు ఇటు

నడుచుచుండెను. ఇలా నడచుచూ వాకిటిలో ఉన్న పాతరగోతిలో పడి

పోయెను. ఆ చప్పుడు విని బావ

మరుదులు కంగారుగా వచ్చి "బావా!

గోతిలో పడితిరా ? అని అడుగ అత్తగారింట పరువు నిలుపుకొనుటకై--

"లేదు. నేను పడలేదు. పాతరగొయ్యి ఎంత లోతున్నదో తెల్సుకొనుటకు ఇందులో దూకితిని. దీని లోతు "ఇంత

తక్కువ వున్నదేమి? అని బావా

మరుదులు చేయూత పుచ్చుకుని మెల్లగా లేచి భోజనము నిమిత్తం లోనికి

పోయెను. భోజనము చాలావరకైన పిదప అత్తగారు పంక్తిలోనున్న అందరకు

మజ్జిగ వడ్డించి,అల్లుడు కదా అని ఈయనకు పెరుగు వడ్డించసాగెను. కంచంలోకి పెరుగు పోస్తుండగా "తొళుకు

తొళుకు అని శబ్దం వచ్చెను. పరధ్యానంలో వున్న అల్లుడు కుక్కవచ్చి

అన్నం ముట్టుచున్నదని భ్రమించి బెదిరించు ఉద్దేశ్యముతో చేయివిసరగా

అత్తగారికి చెంపదెబ్బ తగిలినది. అయ్యో!అని అత్తగారు వెనుకకు పారిపోయెను. బావమరుదులు కోప్పడి

"నీకిది ఏమి వినాశకాలము ? అనగా

అల్లుడు "తాను తెలివితక్కువవాడిని కాదని ,ఊరకే ఎందుకు కొట్టెదను? పంక్తిని కూర్చున్నవారందరకు మజ్జిగ వడ్డించి అత్తగారు తన ఒక్కరికి పెరుగు

వడ్డించినది. ఈవేళ నేనైనాను. రేపు మరియొకరగుదురు. భోజనం వెళ ఇట్టి పక్షపాతమునెప్పుడు చేయవద్దని బుద్ధి

చెప్పితిని. ఆడువాండ్రకు చేతితో చెప్పిన

గాని బుద్ధి రాదు." అనగా వారందరూ అల్లుడు తెలివైనవాడే!అనిసంతోషించిరి.


ఒక రోజు రెండు జాములైన పిదప నిద్రలేచిన అల్లుడు అవసరార్థము బయటకు పోయి తిరిగి తన గదికి దారి

సరిగా కనపడక తడుముకొనుచూ వచ్చి అత్తగారి మంచముపై కూర్చుండెను. అత్త

గారు అదిరిపడి లేచి "ఇది ఏమోయీ! అర్థరాత్రమున ఇటు వచ్చితివి? అని అడుగ అల్లుడు ఇట్లనెను. "నేను నిష్కారణముగా మిమ్ము చెంపకాయ కొట్టితిని. అది మీరు మనసులో వుంచు

కొనక నన్ను క్షమించవలసిందని బ్రతిమాలుటకు వచ్చితిని" అని జవాబు చెప్పెను.వెంటనే అత్తగారు " అయ్యో! నాయనా! కొడుకు వంటివాడవు. నీపై

మనసులో ఏమీ వుంచుకొనను. పోయి

పడుకొనుము" అనగా అల్లుడు ఒప్పుకొనక "మీరు నన్ను స్వయముగా

నా మంచముమీదకు తీసుకునివెళ్లి

కూర్చుండబెడితిరా-నాపై కోపము లేనట్లు. అట్లు చేయకపోతిరా,కోపం ఉన్నట్లే" అని పలుకగా ఆమె అందుకు

ఒప్పుకొనిఅల్లుడిని తీసుకుపోయి ఆయన మంచముపై కూర్చుండబెట్టి తిరిగి వెళ్ళెను.


ఒక రాత్రికే ఇన్ని పరాభవములు జరుగు

టచే ఇక వుండుట శ్రేయస్కరం కాదని భావించి అల్లుడు తన ఇంటికి వెళ్లిపోయెను.

-

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!