Thursday, November 30, 2017

స్వర్ణరేఖ!

                                            స్వర్ణరేఖ!

స్వర్ణరేఖ!-

ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం 

అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మేరుపందం

చెమ్పల మీద కెంపు రంగొచ్చి ముద్ద మందారం 

సిరోజాలలోఉన్న మల్లెపూల సౌరభానికి ఆహ్లాదం !

ఈశ్వర కృప.!

ఈశ్వర కృప.!

.

ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు.

.

అందుకే శివునికున్న పేర్లలో ప్రధానమైన పేరు 'శంకర'. "శం కరోతి ఇతి శంకరః" 

.

.

కామకోటికి పర్యాయ పదం 'శ'. కోటి అంటే కోటి సంఖ్య అని కాదు,

.

కోటి అంటే హద్దు అని. కామ అంటే కోర్కె.

.

కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది. 

.

దేని అంచైనా ఆవిడే. ఆవిడ ఇవ్వగలదు. ప్రసరణం చేయగలదు. 

.

కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు. కదలికలన్నీ ఆగిపోతే శివుడు.

.

అదీ తత్త్వం.

గుడి ..గూటిలో.వినాయకుడు.

గుడి ..గూటిలో.వినాయకుడు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||


గోపయ్య నల్లనా.. ఎందువలనా? (మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

(మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

.

"అమ్మా.." 

"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని. 

"నాకు కోపమొచ్చింది"

"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"

"ఏమో! వచ్చింది. అంతే!" 

"సరే, వచ్చింది లే!"

"ఉహూ, ఎందుకూ? అని అడుగు"

"హ్మ్"

"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"

"అడిగాను లే , చెప్పు"

"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."

"పోన్లే, అన్నేగా!"

"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."

"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."

"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"

"అయితే!"

"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు." 

"నీ అంతవాడివి నువ్వే కన్నా!"

"అంటే?"

"గొప్పవాడివనీ.."

"గొప్ప కాదు నల్లవాడినట."

"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!" 

"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.

"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"

"అంటే!"

"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు." 

"ఏమో! అర్ధం కాలేదు."

"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"

"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."

"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"

"నేనే! నేనే!"

"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."

"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."

"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "

"అవునా!"

"హ్మ్.. "

"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."

"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."

"చీకటి అంటే ఏమిటీ?"

"చీకటి అంటే, ఏమీ కనిపించదు."

"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"

"అవును."

"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.

ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ. 

తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.

-

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 13.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 13.

-

కాతే కాంతా ధనగతచిన్తా

వాతుల కిం తవ నాస్తి నియంతా|

త్రిజగతి సజ్జనసంగతిరేకా

భవతి భవార్ణవతరణే నౌకా||

-

శ్లోకం అర్ధం : 

ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? 

నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

.

తాత్పర్యము :

ఓయీ ! పరాత్పరుడైన భగవంతుడు లేడా? అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా? పుట్టించినవాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్నా నా భార్యా-బిడ్డల గతి ఏమిటని చింతించకుము. 

దయా స్వరూపుడైన ఆ దేవుడు అందరికీ తిండి, గుడ్డ, నీడ తప్పక ఇచ్చును. కావున ఈ విషయముల మీద చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము చేయుము. సమయమును వృధా చేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము.

-

శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (35)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (35)

-

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి

త్వమాపస్త్వంభూమిస్త్వయిపరిణతాయాంనహిపరం,

త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా

చిదానన్దాకారం శివ యువతి భావేన బిభృ షే !!

-

ఓ భగవతీ ! మనస్సు నువ్వు , ఆకాశం నువ్వు ,

మరుత్తు నువ్వు , అగ్ని నువ్వు , జలం నువ్వు ,

భూమి నువ్వు . నువ్వు పరిణమించి న దానవవు

తూంటే నీకంటే యితరం ఏదీ లేదు. . నువ్వే నీ

స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింప చేయ

టానికి చిదానందాకారాన్ని ( చిచ్ఛక్తి ఆనందభైరవుల

ఆకారం) ధరిస్తున్నావు.

-

ఓం హిమగిరితనయాయైనమః 

ఓం అన్నపూర్ణాయైనమః

ఓం గణేశజనన్యైనమః

అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

అందుకో జాలని ఆనందమే నీవు...

ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

రాగమయి రావే.. ' 

ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

.

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. '

రాగమయి రావే! అనురాగమయి రావే!'. 

ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది.

ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. 

దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!

చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే!

కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం 

ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.

మరొక్కసారి విని ఆనందిచండి

.https://www.youtube.com/watch?v=V34qpC67oMY&list=PLuPm_Z49ejre342yuhZYUWu4-ST4xOfR0&index=6

Wednesday, November 29, 2017

సజ్జ మీద ధ్యాస ! -

సజ్జ మీద ధ్యాస !

-

ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది... దర్శనం బాగా జరిగిందా తల్లీ, అని ఆమె తండ్రి ప్రశ్నించారు.....

కూతురు: ఇక మీదట నన్ను ఎపుడూ గుడికి వెళ్ళమనకండి నాన్నాగారు... కోపంగా చెప్పింది..

తండ్రి: ఏం జరిగింది తల్లీ

కూతురు: గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడడం, ఫోటోలు తీయడం, భక్తికి సంభందించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనలు వద్ద కూడా సరైన పద్దతులలో ఉండడం లేదు . ఎవరిలోను నాకు భక్తి కనిపించ లేదు. 

తండ్రి: ( కాసేపు మౌనం పాటించి) సరే.. నువ్వు తుది నిర్ణయం తీసుకొనే ముందు నాదోక్క చిన్న కోరిక.. చేస్తావా... 

కూతురు: తప్పకుండా నాన్నాగారు.. మీమాట ఎపుడూ కాదనలేదు. చెప్పండి ఏమి చేయాలో....

తండ్రి: ఒక సజ్జ నిండా పూలు తీసుకొని వెళ్ళు గుడికి.. 

మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి.. అయితే చిన్న గమనిక.. 

నీ సజ్జ నుంచి ఒక్క కూడా పువ్వు కూడా క్రింద పడరాదు సుమీ... ఈ పని చేయగలవా....

.

కూతురు: అలాగే నాన్నాగారు. తప్పకుండా చేస్ మీకోసం ,అని సజ్జలో పూలు తీసుకొని బయలు దేరింది.. ఒక మూడు గంట తరువాత ఇంటికి సజ్జ తో తిరిగి వచ్చింది.. 

.

కూతురు: ఇదిగో నాన్నాగారు.. నే గుడికి వెళ్ళి మీరు చెప్పిన విధంగా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను. చూడండి సజ్జలో పూలు అలాగేఉన్నాయి అంది 

.

తండ్రి మూడు ప్రశ్నలు వేసారు. 

1. నువ్వు ప్రదక్షిణ చేస్తున్నపుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు.? 

2. ఎంత మంది అనవసర విషయాలు గుడిలో చర్చిస్తున్నారు ?

3. ఎంత మంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు?

కు: నేనేలా చెప్పగలను నాన్నాగారు.. నాదృష్టి అంతా సజ్జ మీద వుంది కదా కూడా పడకుండా చూసుకోంటున్నాను.. 

.

తండ్రి: ఇదే నమ్మా నే చెప్పదలచుకోన్నది. నువ్వు గుడికి వెళ్ళినపుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి. అపుడు నువ్వు అంతఃముఖివై భగవంతుని పొందగలవు. జీవితం వృద్ది చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి. 

కూతురు: ధన్యురాలిని నాన్నాగారు... ఈ రోజు నాకు భగవంతుని గుడి అన్నది ఎందుకు ఏర్పచుకొన్నామో, అంతఃర్ముఖులు అవడం అంటే అనే విషయాలపై అవగాహన కలిగించారు .

నచ్చితే షేర్ చేయండి మంచి విషయాలు అందరికీ తెలియపరచండి.

-

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 12.

-

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 12.

-

దినయామిన్యౌ సాయం ప్రాతః 

శిశిరవసంతౌ పునరాయాతః|

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః

తదపి న ముంచత్యాశావాయుః||

-

శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, 

శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. 

ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

-

తాత్పర్యము :

మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు.

అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. 

ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించు చున్నాము. ఈ విధంగా మన జీవితకాల మంతయు గడిచి పోవుచున్నది. 

స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో 

కాలయాపన చేయుచున్నాము. ఈ విధంగా గంటలు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడిచి పోవుచున్నవే

కాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడిచినవి, గడచును కూడా! 

మానవ జన్మము బహు దుర్లభమైనది. అది చేజారిన మరల దొరుకుట కష్టము. కావున, ఉన్న సమయమునైనా భగవత్ చింతనలో గడిపి, జీవితము సఫలము చేసుకొనుము.


సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (34)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (34)

-

శరీరం త్వం శమ్భోశ్శశిమిహిర వక్షోరుహ యుగం

తవాత్మానాం మన్యే భగవతి నవాత్మాన మనఘం,

అతశ్శేష శ్శేషీత్యయ ముభయ సాధారణతయా

స్థితస్సమ్బన్ధో వాం సమరస పరానన్ద పరయోః !!

-

ఓభగవతీ! నువ్వు శంభుడికి రవిచంద్రులు స్తనయుగం

గాగల శరీరమవుతున్నావు. అమ్మా ! నీశరీరాన్ని

దోషరహితమైన నవ వ్యూహాత్మకమైన ఆనంద భైరవుడి గా తలంచుచున్నాను. 

ఇందువల్ల యీశేష శేషీ భావ సంబంధం సామరస్యంతో

కూడిఆనంద భైరవి రూప చిచ్ఛక్తులైన 

మీ ఇరువురకుశివశక్తులకు) ఉభయ 

సాధారణంగా వుంది.

-

ఓం హ్రీంకార్యైనమః

ఓం నాదరూపాయైనమః

ఓం సుందర్యైనమః

-

తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి!

తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి!

-

అవధాన నిర్వహణంలో ఆశుకవితా ప్రసారంలో అనుపమాన చాతుర్యం వారిసొత్తు. సమయానుకూలంగా చమత్కార భాజనంగా ఆశువును నడిపించటంలో ఆరితేరిన వారు తిరుపతి వేంకట కవులు. వారు అవధాన జైత్ర యాత్రలు చేస్తూ వివిధరాజాస్థానలను దర్శించేవారు.సమయాను కూలంగా ఆప్రభువులను రంజింపచేస్తూ వారిచే సన్మానింప బడుచుండెడివారు. ఆపరంపరలో భాగంగా వారు విజయనగర( తూర్పుకోస్తా) సంస్థానానికి విచ్చేశారు. పండితాభిమానియు,కవిజన పోషకుడును అగు ఆనంద గజపతి సన్నిధిలో వారు చెప్పిన పద్యాన్ని యిప్పుడు విందాం!

ఉ: ఎందరిఁ జూపెనేని వరియింపదు మాకవితాకుమారి, క 

న్నందుకు దేశముల్ దిరుగుటబ్బెను, సౌఖ్యము లేకపోయె, నా 

నంద నృపాల! నీదు సుగుణంబుల నే వివరించునంత వెం 

టం దలయూచె;ఁ గావున, తటాలున దీని బరిగ్రహింపుమా!!

తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!

దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

తిరుపతి వేంకటకవులు- నానారాజ సందర్శనం;

తమ కవిత నొక యీడేరిన యాడపిల్లగా ఆమెకు వరాన్వేషణ చేయుచున్న కన్యాదాతగా తమనువర్ణించు కొనుచు,రాజా! మాకవితా కుమారికి వరునకై బయలుదేరితిమి. యెమదరిజూపినా వరింపదాయె? యేమిచేతుము? కన్నందుకు దేశదేశములు తిరుగు చుంటిమి సుఖమాశూన్యమాయెను. నేడు మాభాగ్యము పండినది. నీసుగుణములను విని నిను వరించుటకు తలయూపినది. యీమె మనసు మారకుండ వెంటనే యీమెను వరింపు మని చమత్కార రంజితముగా పద్యము లల్లి ఆనంద గజపతిని మెప్పించి ఘనసన్మానముల నందిరి.

" సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్"

హాస్యభరిత నాటకం" కన్యాశుల్కం"

" కన్యాశుల్కం".!

,

హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం".

.

ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు. 

గురజాడ చేపట్టక పూర్వం, 

ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ.

.

ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి.

.

మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసింది గురజాడ అప్పారావు గారనే అనుకుంటాను. సాంఘిక వాస్తవికతను దర్పణంలో వలె యధాతథంగా ప్రతిబింబించిన కళాఖండం మన భాషలోనే కాదు, మరే ఇతర భారతీయ భాషల్లోనైనా మొదటిదీ, ఆఖరిదీ కన్యాశుల్కమే అనుకుంటాను. కన్యాశుల్కం నాటకాన్ని ఆ తెగలో మించడం మాట అటుంచి, ఆ దరిదాపులకైనా రాగల నాటకం మన దేశంలో ఏదైనా ఉంటే దాని సంగతి ఇంతవరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే అని మాత్రం నేననక తప్పదు.

కన్యాశుల్కంలో ఎక్కడ, 'ఎప్పుడు' ఎవరి మాటలైనా తీసుకోండి. ఇక్కడ అప్పుడు సరిగా ఆ పాత్ర ఆ మాట తప్ప మరొకటి అనడానికి వీల్లేదు. ఇది నాటక రచనకి పరాకాష్ట. గురజాడ కవి మహత్తర విజయం.

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'!

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'!

.

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'!

..

అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది.

' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.'

పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.'

' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?'

' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.'

( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

భారతీయులమండీ మేం భారతీయులం:

-

భారతీయులమండీ మేం భారతీయులం !

రచన: అనంత శ్రీరామ్ ( గీత రచయిత)

భారీ డైలాగులు కొట్టడానికీ,బార్ల షాపులలో కూర్చోడానికీ బాగా అలవాటు పడ్డాం

భారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకొంటాం

వీలయితే దించేసుకొంటాం

లేదా వదిలించేసుకొంటాం

ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం,

ఒక వేళ ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఎగతాళి చేస్తాం.

భారతీయులమండీ మేం భారతీయులం.

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం, కానీ మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదు.

ఒక్కొక్క లంచపు కొడుకుని ఏరిపారేయాలంటాం, ఓట్లప్పుడు మేం అడిగే లంచాల జోలికి మాత్రం రావద్దు.

దోచుకొన్న దొరల పళ్ళు రాలగొట్టేయాలంటాం, మేం ఎగ్గొట్టిన పన్నుల గురించి మాత్రం అడగకూడదు.

దేశమంటే మట్టి కాదు మనీ అనేది మా నినాదం, అందుకే మనీ మొత్తం మట్టిలో (రియల్ ఎస్టేట్) దాచుకొంటాం

పైవాడు వచ్చి ఆ మట్టిని తవ్వితే తప్ప మా ఇంటి ముందున్న మట్టి రోడ్డు గుర్తుకు రాదు.

నువ్వు పనులు చేస్తే కానీ పన్నులు కట్టమని జనం, నువ్వు పన్నులు కట్టితే కానీ పనులు చేయమని ప్రభుత్వం

ఇదీ మా కోడి,గుడ్డు సూత్రం.

అంతేకానీ మేం కోడిగుడ్డు వేసుకోవడం ఆపం

అరే బాబూ దేశంరా అంటే ఆ! గాడిదగుడ్డు లే !అనడం ఆపం

ఆ అడిగేదేదో ప్రభుత్వంలో పడుకొనున్నొడు ఉన్నంతకాలం అడగం

పరిగెత్తించే వాడు ఉండేవాడు అడిగితేనే మాకు ఆవేశం, ఆయాసం 

ఏమండీ ఎక్కువ మాట్లాడకండి

భారతీయులమండీ మేం భారతీయులం

మా పెద్దలు ప్రతిదానికీ కథలిచ్చేశారు కదండీ

ఎదవ కథలకు మా దగ్గర లోటు లేదు.

మొసళ్ళను వెల్లగొట్టేశామని, చేపలను ఎండబెట్టేశామని,

ఇలా ఎన్నైనా చెప్పేస్తాం.

నీటిలో ఉన్న మొసలి ఏనుగునైనా తినగలదని, బయట ఉన్న మొసలిని కుక్క కూడా తరమగలదని మాకు తెలియదేంటండి.

అయ్యబాబోయ్ మా ముసలాళ్ళు అని మొసలి కన్నీరు కారుస్తాం కానీ వాళ్లకు కొంచెం మంచినీరు అందించడానికి మనసు రాదు ఎందుకంటే 

మేం భారతీయులమండీ

సిపాయిల శవాల మీద పడి చిరునవ్వులు ఏరుకొన్నప్పుడు సిగ్గులేదు కానీ

చలామణిలో లేని నోట్లకు చిల్లర తీసుకొమ్మంటే ఎక్కడ లేని కష్టం అండీ

జన్మలో లైన్లే చూడనట్టు

అమ్మాయిలకు లైన్లే వేయనట్టు

ఎదవ పత్తిత్తు కబుర్లు చెప్పేస్తాం

ఇదంతా చదివేక ఒకటే మాట చెబుతామండి, ఈ రాసేవాడిది ఏం పోయింది a.c.లో కూచోవటం రాయటం

మేం ఎండలో నిలబడటం నేరం

నవంబరు..నడి వేసవి ఎండలో???

భారతీయులమండీ మేం భారతీయులం

# Anantha Sriram

Tuesday, November 28, 2017

మనకు శ్రీక్రిష్ణ భగవానులు వారు భగవద్గీతలో ఏమి చెప్పారు

-

మనకు శ్రీక్రిష్ణ భగవానులు వారు భగవద్గీతలో ఏమి చెప్పారు?

-

"శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ , స్వనుష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" -ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే అని చెప్పారు. ఇక్కడ స్వధర్మమనగా మనకు పూర్వీకులనుండి వచ్చిన జీవనశైలి, వృత్తి, అలవాట్లు, సంప్రదాయాలు మొదలగునవి . ఈ అసమాన వైశిష్ట్యం కలిగిన స్వధర్మాన్ని వదలి కడుపు నింపుకోటానికి చెప్పలేని పరధర్మాలను ఆశ్రయిస్తూ, అందులో భాగంగా స్వధర్మాన్ని అపహాస్యం, అవహేళన చేస్తూ, కించ పరుస్తూ నా అంత తెలివికలవాడు లేడని చొక్కా కాలరు ఎగరేసుకుంటున్నాము. ఇది ఒక మతం మారి ఇంకో మతాన్ని అనుసరిస్తూ.. తన పూర్వ మతాన్ని కించపరస్తూ మాటాడే వారికి కూడా అన్వయింపబడుతుంది. . చాలా మంది ఈ పరధర్మ మార్గంలో వెళ్లడం ద్వారా ఏమి కోల్పోతున్నారో మీకు తెలుసా? కాలానికి నిలిచిన ఒక బలీయమైన సంస్కృతి అనే హారంలో ఒక ముత్యంలా ఉండే అవకాశం, తద్వారా వచ్చే అనన్యమైన దైవసంపదను పొందే అవకాశం. పరధర్మమంటే విదేశాలకు వెళ్ళడమో లేదా మతం మారి , ఇంకో మతాన్న్ని అనుసరించడమో అని మాత్రమే కాదు . మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, మామ్మలు పాటించిన ధర్మాలు, నిర్వర్తించిన బాధ్యతలు విస్మరించి కేవలం నేను, నా కుటుంబం అనుకునే అవకాశవాదం పరధర్మం యొక్క ముఖ్య లక్షణం. పది వస్తే ఒకటిని ఇతరులతో పంచుకోవటం, లేనివానికి చేయి అందించి పైకి లేవదీయటం, తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలకు నెట్టకుండా వారిని ఆదరించి గౌరవించటం, మానవుని శక్తిని మించినది , అపారమైన కరుణ కలది ఒక దైవిక శక్తి ఉన్నది అని నమ్మి దానికి శరణనటం, ఐదు వేళ్లు కలిస్తేనే చేయి, అలాగే, అందరూ కలిస్తేనే పటిష్టమైన సమాజం ఇవి స్వధర్మం లక్షణాలు. వీటిని పాటించటం కష్టమేమీ కాదు. మీ అత్యాశలను తగ్గించుకొని చూడండి, మీ అవసరాలకు పరిమితిని పెట్టి చూడండి. అప్పుడు తప్పకుండా పక్కవారి గురించి ఆలోచించే వివేచనము, అవకాశము కలుగుతాయి.

హనుమంతుని గంధ, సింధూర విశేషం!

-

హనుమంతుని గంధ, సింధూర విశేషం!-

శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .

-

శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .

ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.

-

సొగసు చూడతరమా !

సొగసు చూడతరమా !

-

అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళ

చేజారిన దువ్వెనకు బేజారుగ వంగినపుడు

చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి

పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు

ఆ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

.

పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించికొట్టి

గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ

చెంగు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే

తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు విడువిడువంటునప్పుడు

ఆ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

సీతమ్మ మా-అమ్మ శ్రీ రాముడు మా తండ్రి!

బాలమురళి గాత్రం.!

https://www.youtube.com(/watch?v=hUnZz4vd-ro.)

సీతమ్మ మా-అమ్మ శ్రీ రాముడు మా తండ్రి

.


వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన

ధత-భరతాదులు సోదరులు మాకు ఓ మనసా (సీత)

వాత-ఆత్మజ సౌమిత్రి వైనతేయ రిపు-మర్దన ధత భరత-ఆదులు సోదరులు మాకు ఓ మనసా (సీత)


పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక

సురపతి గౌతమ లంబోదర గుహ 1సనకాదులు

ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు2

వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా (సీత)


అసలు వేదమనగానేమి ?

అసలు వేదమనగానేమి ?

-

వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము.

వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము.

-

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||

-

అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము.

-

వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది.

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||

-

కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 11.

-

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 11.

-

మా కురు ధన జన యౌవన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం|

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||

-

శ్లోకం అర్ధం : ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును

. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని 

గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

.

తాత్పర్యము : 

ఈ ప్రపంచములో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. 

గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో, అందగాడిననో, పదవిలోనో- పలుకుబడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోచ్ఛారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, 

స్త్రీ, జ్ఞాన, వృద్ధులు అన్న తారతమ్యములు మరిచి, అందరినీ అవమానిస్తాడు. 

ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. కావున గర్వమును సంపూర్ణముగా నశింప చేసి, పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమ పదము సాధించుము.

సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (33)

-

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (33)

-

స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాదౌ తవమనో

ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః,

భజన్తి త్వాం చింతామణి గుణనిబద్ధాక్ష వలయాః

శివాగ్నౌ జుహ్వన్తః సురభిఘృత ధారాహుతిశతైః !!

-

ఓ నిత్య స్వరూపిణీ ! నీ మంత్రానికి ముందు కామ

రాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీ బీజం (మూటినీ

ఐం హ్రీం శ్రీం ) కలిపి నిరవధిక మహాభోగ రసికులు

చింతా మణులనే రత్నాల తో కూర్పబడిన అక్ష

మాలలను చేతుల్లో ధరించిన వారై శి వాగ్నిలో కామ

ధేనువు యొక్క నేతి ధారలతో అనేక ఆహుతుల చేత

హోమం చేస్తూ నిన్నుసేవిస్తూన్నారు.

-

ఓం శివాభినామధేయాయైనమః

ఓం శ్రీవిద్యాయైనమః 

ఓం ప్రణవార్థస్వరూపిణ్యైనమః

పూలమ్మి పాట :-

శుభోదయం !

                                         -:పూలమ్మి పాట :-

పూలమ్మి పాట.)

బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో

నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో

నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో

నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో

ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో

ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో

సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో

దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో...

అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ప్రమీలార్జునీయము.!

.

మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. 

ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. 

ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. 

అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు.

చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

ప్రమీలార్జునీయము.!

ప్రమీలార్జునీయము.!

.

మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. 

ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. 

ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. 

అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు.

చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

తెలుగు భాష మేటి భాష!


-తెలుగు భాష మేటి భాష!

-

అల్లరి చెయ్యమంటే తెలుగు వాళ్ళ తర్వాతే అండి. 

జొన్నవిత్తుల గారి పద్యాల బాణీలో వ్రాసిన ఈ పారడి పద్యాలు .

-

పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!

.

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!

.

పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల 

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు 

సాటి తెలుగు భాష మేటి భాష

.

స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన 

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు 

ఆవ కాయ కొఱకు నంగలార్చి.

.

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ 

కారమింగువలను తగిలించి తిను వాడు 

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

.

ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము

.

Monday, November 27, 2017

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 10.

_

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

శ్లోకం - 10.

-

వయసి గతే కః కామవికారః 

శుష్కే నీరే కః కాసారః|

క్షీణే విత్తే కః పరివారో

జ్ఞాతే తత్త్వే కః సంసారః||

-

శ్లోకం అర్ధం : వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? 

నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? 

అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? 

తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?

.

తాత్పర్యము : తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి? 

దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడలపై ఆసక్తి నశించుట సహజము. 

నీరన్నియు ఎండిపోయిన పిమ్మట యిక చెరువనేది ఎక్కడ? 

అనగా, అశక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి? 

వయసులో ఉన్నప్పుడు, మనో వికారములను అదుపు చేసి పరమాత్మునిపై లగ్నము చేసినవాడు గొప్పవాడు. 

అనగా, ఎప్పుడో వృద్ధాప్యములో అన్ని అంగములు ఊడినపుడు, వాటిపై అయిష్టత గలిగినను, మనసు మాత్రము ఇంకా వాటి వెనుకే పరుగులిడుచుండును. 

వయసులో ఉన్నప్పుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో ఉండి, ఏకాగ్రత చేకూరును. కావున భగవత్ చింతన పిన్న వయసు నుండే ప్రారంభించవలెను.

'ఝణక్ ఝణక్ పాయలబాజే '!

-

                       'ఝణక్ ఝణక్ పాయలబాజే '!

-

''ఝణక్ ఝణక్ పాయలబాజే 'అంటే ఒక అద్భుత దృశ్య కావ్యం.

శాంతారాం తీసిన ఆణిముత్యాలలో ఒకటి . గోపి కృష్ణ కథక్ నృత్యం ఒక కల్కి తురాయి .అందులో వసంత దేశాయ్ సంగీతంలో అన్ని పాటలు బాగుంటాయి ... ఈ పాటలో రతి మన్మధుల నృత్యం చాలా బాగుంటుంది.నేను 1955 విజయవాడ లీలామహల్ లో చూసాను.నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇంగ్లీష్ సినిమాల ఆడు హాల్ అదే మొదటి హిందీ సినిమా .

-

https://www.youtube.com/watch?v=Zy73MGPEBTc

ఇంకా చావని మానవత్వం.!

-

ఇంకా చావని మానవత్వం.!

.

ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ 

.

దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . 

.

"దయచేసి చదవండి " అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను . 

.

.

" ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది .

.

.

నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది

.

అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను .

.

అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది 

.

.

"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను 

.

.

.

ఆమె ఏడుస్తోంది . 

.

"బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు . నాకు చదవడం రాయడం రాదు .నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !" 

.

.

" పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! " 

.

.

బాబూ ! అది నేను రాయలేదు . నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు . వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది 

.

.

ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది . ఒక్కరూ చించెయ్యలేదు . ఆమె రాయలేదు . ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు . 

.

.

ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు . అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు . అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు . నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను ............ ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు ..... అది చింపెయ్యనా ? ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు . అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు ........ మరి నేను ఎందుకు అది చింపెయ్యడం ....... ఇలా అనుకుంటూ వస్తున్నాను .

.

.

ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు 

.

.

.

సర్ ! ఈ ఎడ్రెస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది . వాళ్లకి ఇచ్ఛేద్దామని ఎడ్రెస్ అడుగుతున్నాను .

.

.

.

ఆమె ఎడ్రెస్ 

.

.

.

నాకు అనిపించింది "మానవత్వం చచ్చిపోలేదు" .

.

అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు . ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను . . ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు . 

.

.

అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .

.

.

.

నేను అది చింపేయాలా ? అలా వదిలేయాలా ? 

.

.

వదిలేశాను 

.

.

.

.

.

వదిలేసి నేను మంచి పని చేశానా ? లేదా ? 

.

.

మీరే చెప్పండి ...... ఇది కధ అయి ఉండొచ్చు ... కానీ ఈ పరిస్థితి ఎదురయితే .....

చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన!


-

చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన!

-

చందమామని చిన్న పిల్లలకి చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాడి లాలించడం అనాదిగా మన సంప్రదాయంలో ఉంది.

ఈ చందమామ పాట ఏనాడో అన్నమయ్య మనకోసం రచించి పెట్టాడు. కాలక్రమేణా ఈ చందమామ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు వచ్చాయి కానీ మాత్రుక మాత్రం అన్నమయ్య పాటే.

.

చందమామ రావో జాబిల్లి రావో

మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో

.

నగుమోము చక్కని యయ్యకు

నలువ బుట్టించిన తండ్రికి

నిగమము లందుండే యప్పకు

మా నీల వర్ణునికి

జగమెల్ల నేలిన స్వామికి

ఇందిర మగనికి

ముగురికి మొదలైన ఘనునికి

మా ముద్దుల మురారి బాలునికి

.

తెలిదమ్మి కన్నుల మేటికి

మంచి తియ్యని మాటల గుమ్మకు

కలికి చేతల కోడెకు

మా కతల కారి ఈ బిడ్డకు

కుల ముద్ధించిన పట్టెకు

మంచి గుణములు కలిగిన కోడెకు

నిలువెల్ల నిండు వొయ్యారికి

నవ నిధుల చూపుల జూసే సుగుణునకు

.

సురల గాచిన దేవరకు

చుంచు గరుడుని నెక్కిన గబ్బికి

నెరవాది బుద్ధుల పెద్దకు

మా నీటు చేతల పట్టికి

విరుల వింటి వాని యయ్యకు

వేవేలు రూపుల స్వామికి

సిరిమించు నెరవాది జాణకు

మా శ్రీ వేంకటేశ్వరునికి

.

భావం :

చందమామ రావే జాబిల్లి రావే మంచి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవే.

నగుమోముతో ఉన్న మా చక్కనయ్యకు, బ్రహ్మని పుట్టించిన తండ్రికి, వేదమలనందుండే అప్పకు, మా నీలవర్ణునికి, జగమెల్ల ఏలే స్వామికి, చక్కని లక్ష్మీ దేవీ మగనికి, మువుర దేవుళ్ళకు ఆఎఇమోలమైన మా ముద్దుల కృష్ణునికి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవో!

తెల్లతామెరవంటి కన్నులు గలవానికి, తియ్యగా మాట్లాడే వానికి, మంచిపనులు చేసేవానికి, మంచిమాటకారియై సమయానికి తగినట్లుగా కతలల్లి చెప్పే ఈ బిడ్డకు, గోకులాన్ని ఉద్ధరించిన పట్టికి, మంచి గుణములు కలిగిన వానికి, నిలువెల్లా ఒయ్యారాలతో ఉండి నవనిధులను చూపులలో నింపి చూసే మా సుగుణాల రాశికి,

దేవతలను కాపాడిన దేవునకు, బలమైన గరుత్మంతుని ఎక్కిన ఘనునకు, మంచి నేర్పరితనమున్న బుద్ధులు కల మా పెద్దకు,గొప్ప చేతల పట్టికి, మన్మదుని తండ్రికి, వేయిరూపులు గల స్వామికి, సిరిని కట్టుకొన్న నేర్పరి జాణకు శ్రీ వేంకటేశ్వరునికి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో! చందమామ రావో!

Sunday, November 26, 2017

హాస్యమేవ జయతే!

-

హాస్యమేవ జయతే!

-

అనగనగా ఒక అడవి. దానిలో ఒక చిరుత, ఒక గాడిద చాలాకాలం వాదించుకున్నాయి చిరుత అంటుంది - ఆకాశం నీలంగా ఉంటుందీ దానికి గాడిద - కాదు ఆకాశం నల్లగా ఉంటుందని - వితండ వాదం చేస్తుంది.

ఇద్దరూ విషయంతేలక మృగరాజు సింహంగారి దర్బారుకు వెడతారు ఇద్దరి వాదనలు విన్నతరువాత సింహం తీర్పు ఇస్తుంది.. - చిరుతను కారాగారంలో వేయండి. గాడిదను సగౌరవంగా పంపండి. చిరుత లబలబ లాడుతూ చెబుతుంది - మృగరాజా నేను సత్యమే చెబుతున్నానని నాకు తెలుసు.సింహం= నిన్ను శిక్షిస్తున్న

అందుకు కాదు. గాడిద సంగతి తెలియదానీకు. బుద్ధిలేక దానితో వాదించి నందుకు నీకు ఈ శిక్ష. 

ఉదాహరణకు మోదీ ఎప్పుడైనా కేజ్రివాల్ తొ వాదనకు దిగారా?

గిరీశం గడుసు భాష!


-


-

గిరీశం గడుసు భాష!

-


గిరీశం రాకతో మొదలై.. గిరీశం పోకతో ముగిసే నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలోని దాదాపు అన్ని ముఖ్యపాత్రలతోనూ గిరీశం 'ఇంటర్ యాక్ట్' అయాడు. ఆయా సందర్భాల్లో గిరీశం వాడిన భాష.. అందులోని వైవిధ్యం గురించి కొంత చర్చిస్తే గురజాడవారికి 'పాత్రోచితమైన భాష' మీదున్న సాధికారికతను గూర్చి ప్రాథమిక స్థాయి అవగాహన ఏర్పడొచ్చు.

-

గిరీశం పుట్టుకతో వైదీకి బ్రాహ్మణుడు. పట్నవాసం అతగాడి బాడీ లాంగ్వేజీ.. భాషల్లో మార్పు తెచ్చింది. భాషావిషయికంగా చూస్తే గిరీశం నోట ఇంగ్లీషు పలుకుబళ్లు ధారాళంగా దొర్లుతుంటాయి. అంత్యప్రాసాదులతో ఆంగ్లపద్యాలను ఆశువుగా దంచేస్తుంటాడు.

ఏకాంతంలో ఉన్నప్పుడు స్వగతంలో చెప్పుకొనే భాష పాత్ర నిజ నైజాన్ని పట్టిస్తుందని మనస్తత్వవేత్తల భావన. నాటకం ప్రథమాంకం ప్రథమ సన్నివేశంలోనే గిరీశం తత్వాన్ని పరిచయం చేస్తారు గురజాడ. 'పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. యీలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు(పూటకూళ్లమ్మ). వెంకుపంతులుగారి కోడలుకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి మనకు దేహశుద్ధి చేస్తారు. మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా ఉంది..' గిరీశం గడుసుదనం.. వంచన గుణం.. స్త్రీలౌల్యం.. మాటకారితనం పటం కట్టేది ఇలాంటి మాటలవల్లే. వెంకుపంతులుగారి కోడలు.. 

మధురవాణి స్మృతిపథంలోకి రాగానే గిరీశం పెదాలమీదకు 'ఇంగ్లీషు పద్యాలు' తన్నుకొస్తాయి. మధురవాణి స్మరణ చేస్తూ 'It is women that seduces all mankind' అనీ అంటాడు. నిందను ఎదుటి పక్షంమీదకు తోసే అతగాడి నీచ నైజం ఈలాంటి ఉక్తులు వల్లే బైటపడేది. 

ఇక విజయనగరం చెక్కెయ్యాలన్న ఆలోచన రావడం తరువాయి.. శిష్యుడు వెంకటేశంతో అతగాడు పలికే వ్యాక్యాల్లో గుప్పించేవన్నీ డాంబిక ఆంగ్లపదాలే! ఈనాటి టీ వీ యాంకర్లను తలదన్నే భాషా భేషయం! 'డా'మిట్! .. ఇది బేస్ ఇన్గ్రా'టిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. విడో మారియేజ్ విషయమై, నాశ్చికొచ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఎలెవన్ కాజెస్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు. చుట్ట నేర్పించినందుకు 'థేంక్స్' చెప్పకపోగా.. తప్పు పడుతున్నావ్.' అంటూ గిరీశం ప్రదర్సించే ప్రాగల్భ్యభాషకు అంతూ పొంతూ ఉండదు. 'ఫాల్స్' వైదుష్య ప్రదర్శనలతో ఎదుటి పాత్రల బుర్రలో గడబిడలు సృష్టించడంలో గిరీశానిది అందె వేసిన చెయ్యి. 'మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!' అని శిష్యుడు వెంకటేశం నిందలకు పూనుకున్నప్పుడు

'ఖగపతి యమృతము తేగా/భుగ భుగమని పొంగి చుక్క భూమిన్ వ్రాలెన్/ పొగచెట్టై జన్మించెను/ పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అంటూ బృహన్నారదీయం నాలుగో అధ్యాయం ధూమపానాన్ని సమర్థించిందని దబాయిస్తాడు. ఇటువంటి మాటల గారడీవిద్య అగ్నిహోత్రావధానుల్నుంచి.. సౌజన్యారావు పంతులుగారి వరకు అందరి ముందు ప్రదర్శిస్తాడు నాటకం ఆసాంతం. ఎదుటి మనిషికి ఆలోచించుకొనే అవకాశం ఇవ్వకుండా స్వకార్యం సాధించుకొనే నిమిత్తం బుకాయింపు భాష ఎంత ఉపయుక్తంగా ఉంటుందో గిరీశానికి తెలిసినంతగా తెలుగు సాహిత్యంలో మరే పాత్రకీ తెలీదు.

అచ్చంగా ఆంగ్లపాండిత్యమేనా? సందర్భాన్ని బట్టి భాష మార్చే ఊసరవెల్లి గుణంలోనూ గిరీశం ఘనాపాఠి. నైజాంవారి కొలువులో ఉద్యోగం అయిందని మధురవాణిని నమ్మించే సందర్భంలో ఉర్దూ పాండిత్య ప్రదర్శనకి తెగబడే సన్నివేశం గిరీశంగారి ఈ రంగులు మార్చే లక్షణానికి సలక్షణమైన తార్కాణం. 'ఇదిగో జేబులో నైజాంవారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా! మా నేస్తం సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్సహన్ జింగ్ బహద్దర్ వారు సిఫార్సు చేసి వెయ్యి సిక్కా రూపాయిలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేశా బాధ్షావారి హుజూర్న ఉండటం..' అంటాడా మహాశయుడు. కోతలు ఈ స్థాయిలో సాగించినప్పుడే విషయంలోని సారం కొంతైనా నమ్మదగినట్లుండేదని.. మధురవాణి వంటి గడసరి ఎదుట ఆటలు సజావుగా సాగేదని గిరీశానికి తెలుసు. గురజాడవారు ఇదంతా ఊహామాత్రంగా సృష్టించిన సంభాషణా చాతుర్యమే అయినా.. వాస్తవ సమాజంలోని 'అరచేతి వైకుంఠ రాయుళ్ళ' జీవనశైలిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. గాఢంగా పరిశీలించకపోతే సంభాషణల్లో ఇంత పాత్రోచితమైన శైలిని పండించడం కుదరదు.

మకాం అగ్రహారానికి మార్చుకునే సన్నివేశంలో గిరీశం తన భాషాసరళిని పరిసరాలకు.. ఎదుటి పాత్రలకు అనుగుణంగా మలుచుకునే క్రమం గమనిస్తే.. గురుజాడవారి సునిశితమైన సమాజిక పరిశీలనాశక్తి అవగతమవుతుంది. అగ్నిహోత్రావధాన్లు ప్రథమ దర్శనంలోనే 'ఈ తురకెవడోయ్' అంటూ గిరీశాన్ని అనుమానిస్తాడు. పల్లెల్లో కొత్తవారిని అనుమానించడం సర్వసాధారణం. గిరీశానికి ఆ తరహా అనుభవం అప్పటికి కొత్త. కాబట్టే వెంటనే కోపం ముంచుకొస్తుంది. నిజ నైజానికి విరుద్ధంగా 'టర్క్.. డామిట్.. టెల్ మాన్' అంటూ చిందులేస్తాడు. 'మానా? మానులా ఉన్నానంఛావూ? గూబ్బగలగొడతాను' అంటూ అగ్నిహోత్రులు మళ్లీ అగ్గిరాముడు అయినప్పటిగ్గానీ.. స్థలాన్ని బట్టి భాషలో మార్పు తెచ్చుకోవలన్న స్పృహలోకి రాడు గిరీశం. కరటక శాస్త్రుల జోక్యంతో అప్పటికున్న యుద్ధవాతావరణం సద్దుమణుగడంతో.. ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఇట్టే పసిగట్టేస్తాడు. వెంటనే అతగాడినీ తనకు అలవాటైనా మాటకారితనంతో పడగొట్టే ప్రయత్నం చేస్తాడు! 'మీ లాంటి(కరటక శాస్త్రులు) ఛప్పన భాషలూ వచ్చిన మనిషి ఎక్కడా లేడనీ.. సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ.. తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూళ్ళేదనీ.. డిప్టీ కలెక్టరుగారు శలవిస్తుండేవారు. కవితారసం ఆయన్లా గ్రహించేవారేరీ? నా కవిత్వమంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనంకూడా నాకు చేయించారండి' అంటూ గప్పాలు మొదలు పెడతాడు. కరటకశాస్త్రి విదూషక లక్షణాలకు సరిగ్గా అతికే భాష అది! కొత్త చోట ఆశ్రయం సంపాదించేందుకు గిరీశానికి అలా తన భాషాచాతుర్యం అక్కరకొస్తుంది.

ఇంగ్లీషు తెలియని పల్లెటూరు బుచ్చెమ్మతో మాటల కలిపే సందర్భంలో గిరీశం వాడే మాటల్లో ఒక్క ఇంగ్లీషు ముక్కా వినిపించదు. గమనించారా! '.. నా గొప్ప నే చెప్పుకోకూడదు కదా! అదొహటి. అంతకన్నా ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వదినా!(ఆ పిలుపులోని నర్మగర్భతను గిరీశం గడుసుదనానికి మచ్చుతునక)-మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు. ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం చెయ్యాలయ్యా అన్నాడు.' ఇలా సాగుతుంది గిరీశం సంభాషణా ధోరణి. ఎంత సహజమైన.. సరళమైన తెలుగు పలుకుబడి!

'ఏ రోటి దగ్గర ఆ పాట' పాడించాలని తెలిసుండటం వేరు. ఆ పాట శృతి తప్పకుండా పాడించడం వేరు. ఆ కళలో 'గురజాడ వారు నిష్ణాతులు' అని రుజువు చూపించడానికి వెయ్యి ఉదాహరణలు ఇవ్వచ్చు కన్యాశుల్కం నుంచే.. గిరీశం పాత్రనుంచే!

బుచ్చెమ్మంటే మేదకురాలు. మరి సౌజన్యారావు పంతులుగారు ఎంత లోకం చదివిన మేధావులు? వారితో మాట్లాడే సమయంలో కూడా గిరీశం మరో విధమైన భాషాచాతుర్యం ప్రదర్శిస్తాడు. మరీ డాంబికపు ఇంగ్లీషు పదాల జోలికి పోతే ఆ మేధావికి పట్టుబడిపోవచ్చన్న తెలివిడి ఉంది. అందుకే చదువుకున్నవాళ్ళ శిష్ట వ్యవహారికం వచ్చి పడుతుంది గిరీశం భాషలో. చివరికి పంతులుగారి చేతే 'మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి యంగ్ మెన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడును.' అని పంతులుగారినుంచి ప్రశంసలు పొందాడంటే గిరీశానికి భాషమీదున్న పట్టుకు వేరే సర్టిఫికేట్లు ఎందుకు? పంతులుగారి ప్రశంసకు దీటుగా గిరీశం బదులిచ్చిన తీరే భాషాప్రయోగంలో సందర్భం సైతం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో తెలియ చేస్తుంది. పంతులుగారి సంభాషణా శైలినే అనుకరిస్తూ 'అట్టి విచారం తాము పడనక్కర లేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీ ముందు.. ప్లెషర్ తరువాతానండీ. అందులోనూ నేను చిన్ననాటనుంచే కొంచెం కాన్ సన్ ట్రేషనూ ఇంద్రియ నిగ్రహమూ అభ్యాసం చేయడం చాతనూ వొళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండటం చేతనూ స్త్రీ సుఖముల యడల నాకు విముఖత లావండి.. బుచ్చెమ్మయొక్క హృదయ నైర్మల్యమూ.. ఆమె దురవస్థా చూచిన్నీ.. నా శిష్యుడియందు నాకుండు ప్రేమాతిశయం చేతనున్నూ.. అమె యందుకూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహము కావడమునకు ఒప్పుకున్నాను గానండి ఇంద్రియ సుఖముల నపేక్షించి కాదు. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడమునకు అంగీకరించారండి! కనుక మా మారియేజీ అనేది ట్రూ మారియేజిగాని సాధారణపు విడోమారిఏజి కాదండీ' అంటూ నయగారాలు ప్రదర్శిస్తాడు! సౌజన్యారావు పంతులుగారనేంటి ఆయన్ను పుట్టించిన బ్రహ్మదేవుడుకూడా గడుసుగిరీశం జేబులో పడిపోయే మాటకారితనం కాదా ఇదంతా? రామప్ప పంతులు సంపర్కం జరిగినప్పుడూ గిరీశం ఆ గుంటనక్క స్థాయికి తగ్గట్లే మాటలు విసరడంలో ఇహ వింతా.. విడ్డూరమూ ఏముంటుంది?

భాషను బట్టే భావాన్ని అంచనా వేసుకుంటాడు ప్రదర్శనల్లో ప్రేక్షకుడు.. పుస్తకాల్లో పాఠకుడు. సందర్భోచితమైన శైలీవిన్యాసాల ప్రదర్శన అభాసుపాలు కాకుండా నడిపించాలంటే రచయితకు భాషమీదే కాదు.. పాత్రోచితమైన పలుకుమీద,.. సామాజిక ధోరణులమీద సరైన అవగాహన ఉండి తీరాలి. పాత్రల యాస ఎంపికలో చూపించే శ్రద్ధ.. తదనుగుణమైన పదాల ఎంపికలోనూ రచయితకు తప్పని సరి. పాత్ర అదే కావచ్చు. వివిధ సందర్భాలకు తగ్గట్లు భాషలో ఛాయాబేధాలుకూడా ఉంటాయి. సరైన అవగాజనతో వాటినన్నింటినీ విజయవంతంగా నిర్వహించినప్పుడే.. 'పాత్రోచితం' అనే లక్షణానికి న్యాయం జరిగినట్లు. ఈ అవగాహన తనకున్నట్లు రుజువు చేసుకున్నారు కాబట్టే 'కన్యాశుల్కం' అనే గొప్ప నాటకం సృష్టించిన ఉత్తమ సాహిత్యవేత్తగా గురజాడ అప్పారావుగారు లోకం దృష్టిలో స్థిరబడిపోయారు.

'పాత్రోచితం' అంటే సమాంతరంగా సాగే సమాజంలోని వ్యక్తుల స్వరూప స్వభావాలను.. ధోరణులను వాస్తవానికి వీలయినంత దగ్గరగా నాటకంలోని పాత్రల్లో ప్రతిబింబించడం. సజీవమైన రచన సాధించేందుకు రచయితకు ఈ 'పాత్రోచితం'మీద నిర్దిష్టమైన అవగాహన అవసరం. ఆ అవగాహన సాధించకుండా రచయిత పాత్రల సృష్టికి పూనుకుంటే.. వాటి నోట పలికే మాటలు.. కేవలం నిర్జీవ శభ్దాలు మాత్రమే!

-

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 9


మోహముద్గరః -భజ గోవిందం.!-( ఆది శంకరాచార్య)

-


శ్లోకం - 9


-

సత్సంగత్వే నిః సఙ్గత్వం 

నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|

నిర్మోహత్వే నిశ్చలతత్త్వం

నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||

-

శ్లోకం అర్ధం :

జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. 

బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.

తాత్పర్యము :

సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. 

దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలుచును. దాని ఫలితముగ నీకు ముక్తి చేకూరును. 

కావున సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను 

కలయుట చాలా ముఖ్యము.

సువాసన గల వనములో నడచిన, ఆ సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. 

గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్యములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.

సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (31)

శుభం 

-

సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

.

శ్లోకము (31)

-

చతుష్షష్ట్యా తన్త్రైస్సకల మతిసన్ధాయ భువనం

స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతన్త్రైః పసుపతిః, 

పునస్త్వన్నిర్బన్ధా దఖిలపురుషార్థైకఘటనా

స్వతన్త్రం తే తన్త్రం క్షితితల మవాతీతరదిదమ్ !!

-

అమ్మా ! భగవతీ ! పశుపతి అరవైనాలుగు విధాలైన

మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలం లో

ప్రవేశ పెట్టాడు. సకల సిద్ధి ప్రదాయకము, ఐహిక 

ఫల ప్రదాయికాలు ఐన యీతంత్రాల

ద్వారా సకల ప్రపంచాన్నిమోహింపజేసి మిన్న

కున్నాడు. 

మళ్ళా నీ నిర్బంధంతో ధర్మార్థ కామ

మోక్షా లనే పురుషార్థాలను ప్రసాదించేదైన నీ

తంత్రాన్ని , శ్రీ విద్యా తంత్రాన్ని ఈ లోకాని కొసగాడు.

-

ఓం స్వధాయైనమః

ఓం ప్రత్యంగిరాంబికాయైనమః

ఓం ఆర్యాయైనమః

-

ఇది...ఓ...కొడుకు...కథ*..!


-ఇది...ఓ...కొడుకు...కథ*..!

మనం అందరం బాగా ఎదిగిపోయాం...!

మన ఫ్రెండ్ మనకి కాల్ చేసి బయటకు రమ్మంటే మనం అనే మాట....

"రేయ్..మామ..మా..బాబు

(నాన్న) ఉన్నాడ్రా ఇంట్లో..

బయటకు వచ్చానో మా బాబు సావగోట్టేస్తాడు...రా..

నాన్న ని నాన్న అని పిలవలేకపోతున్నాం..

ఒక్కొకరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి.

“నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.

నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...

ఒక చోట నాన్న బాడీ ని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో నాన్న..నాన్న..నాన్న అని మూడు సార్లు పిలవమంటారు.

కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు..

మూడోసారి మాట రాదు. గుండెలో బాధ,గొంతులో తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్ళు.

ఎందుకంటే...ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి.

ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు..

ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టిింది...కానీ...

ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది..మాత్రం...

“మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది.

మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలిన కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి.

ఆదివారం ఒక్కరోజు మాత్రమే వండుకునే Chicken తో భోజనం చేసేటప్పుడు నాన్న తన ప్లేట్ లో ముక్కలు తీసి మన ప్లేట్ లో వేసింది కనిపిస్తుంది.

చివరగా ఎవరైనా నువ్వు ఏం సంపాధించావురా అని నాన్న ని అడిగేతే...నా ఆస్తి నా కొడుకురా అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది “

ఇవ్వన్ని కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న ” అని పిలవాలని అనిపిస్తుంది.

కాని...అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా...అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.

So...ఫ్రెండ్స్...నాన్న ఉన్నప్పుడే తనని “నాన్న” అని ప్రేమగా పిలుద్దాం.

నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు....నాన్న ఉన్నపుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం.

ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు...నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం.

అంత గొప్ప “నాన్న”అనే పదాన్ని బాబు,గిబు అంటూ హించపరచకండి.

Please

“తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడ్ర నాన్న” 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

రాసిన వాళ్ళెవరో తెలియదు గానీ బాగుంది. షేర్ చేయాలనిపించింది.దయచెసి ఇవ్వరు పర్సనల్ గా తీసుకోవద్దు.

వాస్కో డి గామా. డి గామాచెయ్యడము !

వాస్కో డి గామా. డి గామాచెయ్యడము !

-

మేము చినప్పుడు... వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో వాస్కో డి గామా. డి గామా. .. వాస్కో ....

అంటూ గట్టిగాచదివేవాళ్ళం... దాంతోఅందరుఎంతబాగాచదువు కుంటున్నారు అనిపొగిడేవారు... 

కాని మేము ఏమి చేస్తున్నామో కిటిలొంచి ఏమి చూస్తున్నామో 

ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళుకారు.

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం ఆత్మ బోధ!

-

-శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం  ఆత్మ బోధ!

-

స్థిరతా నహి నహి రే, మానస

స్థిరతా నహి నహి రే॥

చరణము(లు):

తాపత్రయ సాగర మగ్నానాం

దర్పాహంకార విలగ్నానామ్‌॥

విషయపాశ వేష్టిత చిత్తానాం

విపరీతజ్ఞాన విమత్తానామ్‌॥

పరమహంసయోగ విరుద్ధానాం

బహు చంచలతర సుఖబద్ధానామ్‌॥.

-

భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు 

అని రూడ్డీ గా తెలియ జేశారు .-ఎవరికి లేదు ?

అని విచారించారు .

-


”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,

అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,

విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,

చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి 

ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని 

నిర్ద్వందంగా చెప్పారు .

-

https://www.youtube.com/watch?v=LSc3uoZfNp8&feature=share

Saturday, November 25, 2017

కళావిలాసినీ ! (కరుణశ్రీ కవిత )

కళావిలాసినీ !

(కరుణశ్రీ కవిత )

.

చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా

.

లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం

.

కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో

.

దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ!

.

--

.

మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్

.

గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ

.

వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం

.

దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్

--

.

భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్

.

తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో

.

నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ

.

ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్

--

(చిత్రం -వడ్డాది పాపయ్య గారు .)

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - -శ్లోకం - 8

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

-శ్లోకం - 8

కా తే కాంతా కస్తే పుత్రః 

సంసారో యమతీవ విచిత్రః|

కస్య త్వం కః కుత ఆయాతః

తత్త్వం చింతయ తదిహ భ్రాతః||

-

శ్లోకం అర్ధం : ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.

-

తాత్పర్యము : ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. 

ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. 

నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? 

ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. 

కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. 

అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.

-

శుభం -సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) . శ్లోకము (30)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

.

శ్లోకము (30)

-

స్వదేహోద్భూతాభిర్ఘృణి భిరణిమాద్యాభి రభితో

నిషేవే నిత్యే త్వా మహమితి సదాభావయతి యః,

కిమాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో

మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధిమ్ !!

-

ఓ ఆద్యంతాలు లేని మాతా ! భక్తుల చే సేవించబడే

దానవైన తల్లీ ! నీ దేహం నుంచి జనించిన కాంతుల

చేనైనా అణిమాది అష్టసిద్దులతో అంతటా ఆవరించ

బడిన నిన్ను నేనని (నువ్వేనేనని) ఏసాధకుడు

ధ్యానిస్తూ న్నాడో త్రినయనుడని పేరుగల సదాశివుడి

నిండు ఐశ్వర్యాన్ని తృణీకరించే ఆ సాధకుడికి మహా

ప్రళయ కాలంలో జ్వలించిన అగ్ని నీరాజనం గావించు

తోంది.

( శ్రీ దేవితో తాదాత్మ్యం పొందిన సాధకుడు శ్రీ దేవియే.

ఆమెకు ప్రళయాగ్ని నీరాజనం.)

-

ఓం సరస్వత్యైనమః

ఓం విరజాయైనమః

ఓం స్వాహాయైనమః

-

పలుకే బంగారమాయెనా కోదండపాణి

కీర్తి శేషులు మంగళపల్లి వారి మధుర స్వరం .!

.

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి

పలుకే బంగారమాయెనా

కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు

పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి

పలుకే బంగారమాయెనా

పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద

కరుణించు భద్రాచల వర రామదాస పోష

పలుకే బంగారమాయెనా

కరుణించు భద్రాచల వర రామదాస పోష

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి

పలుకే బంగారమాయెనా

కలలో నీ నామస్మరణ మరవ చక్కనిసామి

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా!

https://www.youtube.com/watch?v=QlrikrgOA0E

యోగి సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి !


-

యోగి సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి !

-

సదా శివ బ్రహ్మేంద్ర సరస్వతి అంటే 

మనకు గుర్తు వచ్చేది ఈ కీర్తన.

మానస సంచర రే బ్రహ్మణి-మానస సంచర రే॥

జీవిత విశేషాలు

మోక్ష సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు దంపతులకు సదాశివ జన్మించారు. ఆయన తొలి పేరు శివరామకృష్ణ. 17 ఏటనే వివాహమైంది.

17 - 18 శతాబ్దాల మధ్య తమిళనాడులోని కుంభకోణంలో జీవించారు.

మరో ఇద్దరు ప్రముఖ హిందు ఆధ్యాత్మిక వేత్తలు శ్రీధర వేంకటేశ అయ్యాళ్, శ్రీ బోధేంద్ర సరస్వతి వేదపాఠశాలలో సదాశివకు సహచరులు.

సత్యాన్వేషణకై ఇంటిని వదిలి వేశారు. సన్యాసం స్వీకరించిన తరువాత దిగంబరంగా, అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో తిరిగేవాడు. విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవాడుపరమహంస యోగనంద "ఒక యోగి ఆత్మకథ" లో ఆయన జీవ సమాధి ఉదంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆత్మ విద్యా విలాసం వేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు.ఆయన జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేసాడని ప్రతీతి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఈ కింద ఉదహరించడం జరింగింది.

ఒకసారి కావేరి నది ఒడ్డున ఉన్న మహధనపురంలో కొంత మంది పిల్లలు అక్కడికి వంద మైళ్ల దూరంలో ఉన్న మదురైలో జరిగే ఉత్సవానికి తీసుకుని వెళ్లాని కోరారు. ఆయన వారిని కళ్లు మూసుకోవాలని చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత వారు తెరిచేసరికి మదురైలో ఉన్నారు.

ఈ కథకు కాస్త పొడిగింపు కూడా ఉంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఒక యువకుడు నమ్మకం కలగక తనను కూడా ఉత్సవానికి తీసుకుని పోవాలని కోరాడు. మరుక్షణమే అతని కోరిక తీరింది. కానీ వచ్చేప్పుడు సదాశివను కనుగొనలేక కాలినడకన రావాల్సి వచ్చింది

మరోసారి ఒక ధాన్యపు కుప్పల వద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయనను దొంగగా భావించి ఒక రైతు కొట్టేందుకు కర్రను ఎత్తగా శిలలా నిల్చిపోయాడు. మర్నాటి ఉదయం తన ధ్యానం ముగిశాక సదాశివ రైతును చూసి చిరునవ్వు నవ్వగా మళ్లీ మామూలు మనిషి అయ్యి క్షమాపణ కోరాడు.

మరోసారి, కావేరి నది ఒడ్డున ధ్యానంలో మునిగి ఉండగా అకస్మాత్తుగా వరదలు వచ్చి కొట్టుకుని పోయారు. కొన్ని వారాల తర్వాత కొంత మంది మట్టిని తవ్వుతుండగా సదాశివ దేహం తగిలింది. బయటకు తీయగా ఆయన లేచి నడచి వెళ్లి పోయారు

ఇవి జరిగిన చాలాకాలం తర్వాత ఆయనను ప్రజలు మరిచిపోయే దశలో ఆయన మళ్లీ కనిపించారు. బ్రహ్మము తప్ప మరేమీ పట్టని పరధ్యాన స్థితిలో దిగంబంరంగా శరీరస్పృహలేకుండా తనకు ఎవరు ఎదురు వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఒక నవాబు గారి అంతఃపురంలో అటుఇటూ తిరుగుతుండగా అంతఃపుర వాసులు గమనించి నవాబుకు తెలిపారు. ఆయనను పట్టుకోమని నవాబు పురమాయించగా సైనికులు ఆయన రెండు చేతులను నరికి వేశారు. చేతులు రాలాయి. సదాశివలో మార్పు లేదు. అలా పరధ్యానంగా నడుస్తూనే ఉన్నారు. ఇది నవాబుకు తెలిపారు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపచిత్తుడై నవాబు రెండు చేతులను తీసుకుని సదాశివకు ఎదురు వెళ్ళి ఆ చేతులను అర్పించారు. అంతే రెండు చేతులూ తిరిగి అతుక్కున్నాయి. సదాశివ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

.

ఆలయ సేవ

పుదుకొట్టాయ్ రాజు తొండైమన్ ను కలిసి ఆయనకు దక్షిణామూర్తి మంత్రం ఉపదేశించారని కథనం. సదాశివ ఇసుకలో దక్షిణామూర్తి మంత్రాన్ని రచించగా ఆ ఇసుకను రాజు తీసుకున్నాడు. ఇప్పటి వరకు పుదుకొట్టాయ్ రాజభవనంలోని దక్షిణాముర్తి ఆలయం ఆ రాజుల అధీనంలోనే ఉంది.

తంజావూరు సమీపంలోని పున్నైనల్లూర్ మరియమ్మన్ దేవతను ఈయనే ప్రతిష్ఠించారు. కామాక్షి దేవాలయంలోని దేవదనపట్టి విగ్రహ స్థాపనకు మార్గనిర్దేశనం చేశారు. తంజావూరులోని నాలుకాల్ మంటపం వద్ద ఉన్న ప్రసన్న వెంకటేశ్వరం ఆలయంలో ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కుంభకోణం వద్ద తిరునాగేశ్వరం రాహుస్థలం లో గణపతి విగ్రహాన్ని, శక్తిమంతమైన గణపతి యంత్రాన్ని స్థాపించారు. ఈ విషయం ఆలయశాసనంలో లిఖితమై ఉంది.

సంస్కృతంలో అనేక గ్రంథాలకు ఆయన రచయిత. ప్రచురితమైన ఆయన రచనలు :

-

బ్రహ్మసూత్రవృత్తి లేదా బ్రహ్మతత్వప్రకాశిక

యోగసుధాకర - పతంజలి యోగ సూత్రలమీద వ్యాఖ్యానం

సిద్ధాంత కల్పవల్లి

అద్వైతరసమంజరి

ఆత్మానుసంధానం

ఆత్మవిద్యావిలాసం

శివమానసపూజ

దక్షిణామూర్తి ధ్యానం

స్వప్నోదితం

నవమణిమాల

నవవర్ణరత్నమాల

స్వప్నానుభూతిప్రకాశిక

మనోనియమం

పరమహంసాచార్య

శివయోగ దీపిక.

(చిత్రం సదాశివ బ్ర్హహ్మ అధిష్టానం .)

Friday, November 24, 2017

"అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" ! (భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.)

-
-

"అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" !

(భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.)

.

సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వేటూరి వ్రాసారు.

ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది .

"కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి -- ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది. 

అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన .

ఇది వేటూరి శైలే.

వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు. 

.

శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని, 

సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని.

పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన?

సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య, స్వరస సంగీత స్తనయుగళే అన్నారు. అంటే సంగీతం సాహిత్యం రెండు వక్షోజాలుగా కలిగింది అని చెప్తున్నారు. 

బిడ్డలకు కలిగే కళాపిపాసను తీర్చగలిగిన తల్లి ఆవిడే కదా, మరి. 

నాకు ఇంకా నచ్చినది శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని గణ పూజిత 

శుభచరణే అనడం.

అదొక్కటే కదా సంస్కృతంలో వ్రాసిన పాట అనుకుంటున్నారా? 

ఆలాపన చిత్రంలో ఆరు ఋతువులు అనే పాటలో రెండో చరణాన్ని 

గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అని నేను ఇక్కడ వ్రాయట్లేదు అంతే. 

అది ఒక సారి విని చూడండి. మీకు పూర్తిగా అర్థమైతే నాకు చెప్పండి. 

.

మరొక చక్కని పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో

జై చిరంజీవా జగదేక వీర. చిన్న చిన్న పదాలతో చక్కగా సాగే భక్తీగీతం

.

వేటూరిలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే -- మనం ఆయన్ని గురించి ఒక మాట

చెప్పగానే, దానికి వ్యతిరేకమైన మాట కూడా నిజమేనని గుర్తు చేస్తారు. 

ఇప్పుడే భక్తీ పాటలు అన్నానా? వెంటనే "నాయనా, భక్తికి సంస్కృతానికి సంబంధం ఏమిటి?" అన్నట్టు మరొక పాట గుర్తొచ్చింది. వినేవాళ్ళకు ఆశ్చర్యంగానో, వెటకారం గానో, అసభ్యంగానో అనిపించినా వేటూరి వ్రాసిన ఒక mass పాటలో మరొక అందమైన ప్రయోగం ఉంది.

ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, సొగసులలన, గగనజఘునవే

చంద్రుడిలాంటి ముఖం కలదానా, 

మల్లెపూల వంటి పలువరుస కలిగిన దాన, 

నెమ్మదిగా నడిచేదానా 

(నెమ్మదిగా నడవడంలో అందం కూడా ఉంటుంది అని కవులు ఇలాగ అంటారు), 

చక్కగా మాట్లాడేదాన, అందమైన దాన అంటూ నాయికను పొగిడి

మళ్ళీ "ఆకాశం వాలే విశాలమైన వంటి కటిప్రదేశం కలిగినది" అంటూ

తమదైన శైలిలో కొంచెం సంస్కృతం సమాసాల-మసాలా కూడా దట్టించారు.

కవిత్వం అంటే అదే కాదా -- చక్కని భావాన్ని తీయని పదాలతో పండితులకు, పామరులకు నచ్చేలాగా చెప్పడం. వేటూరికి వచ్చింది, ఆయన మనకు ఇచ్చింది, మనకు నచ్చింది అదే కదా!


అధ్యాత్మవిద్య!


-

-

అధ్యాత్మవిద్య!

-

అధ్యాత్మవిద్య అధ్యయనం చేయడం చాలా కష్టం, 

దాన్ని ఆచరించడం మరింత కష్టం.

అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు:

.

మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే

యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః

;

దీని భావం,

"వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

వివేకచూడామణి!

వివేకచూడామణి!

.

"భక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే " 

అంటారు శంకరాచార్యులు తన వివేకచూడామణిలో..

.

కానీ ప్రస్తుతకాలంలో" పక్కవాడు ఏది చెస్తే దానిని మరో ఆలోచన లేకుండా అనుకరించడమ" భక్తిలా తయారయ్యింది దురదృష్టవశాత్తూ మన వ్యవస్థలో...

.

శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు 

అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు. 

కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య)- శ్లోకం - 7

-

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

శ్లోకం - 7

బాలస్తావత్క్రీడాసక్తః 

తరుణస్తావత్తరుణీసక్తః|

వృద్ధస్తావచ్చింతాసక్తః

పరే బ్రహ్మణి కోపిన సక్తః||

-

శ్లోకం అర్ధం : బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు. 

-

తాత్పర్యము : బాల్యములో, తెలిసీ తెలియని వయసులో సమయమునంతా ఆట పాటలకు వ్యర్థము చేసుకోనుచున్నాము. పిమ్మట యుక్త వయస్సు రాగానే, స్త్రీ వ్యామోహములో పడి కామ-క్రీడలకు సమయము వృధా చేయుచున్నాము. 

ఆ పిమ్మట వృద్ధాప్యములో ధన, కాంత, కనకాల మీద ఆశ తీరక జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము. 

ఇంక భగవంతునిపై తలపు ఎప్పుడు? జీ

వితకాలమంతా యిటుల వృధా అయిన సాధించినది ఏమి?

కావున కర్తవ్యము నెరిగి, పరమాత్మునిపై మనస్సు నిలిపి, 

గోవింద స్మరణతో జీవితము పునీతము చేసుకొనుము. 

ఆత్మ నిగ్రహముతో, పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము.

నేడు, రేపు అని రోజులు గడుపకుము. 

మానవ జన్మము మహాదుర్లభము, 

భగవంతుని చేరుటకు సదవకాశము. ఇది చేజార్చుకొనకుము.

-

శుభం -సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (29)


-

శుభం -సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (29)

కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభ భిదః

కఠోరే కోటీరేస్ఖలసి జహి జంభాది మకుటమ్,

ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం

భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే !!

-

మాతా ! ఈ బ్రహ్మ విష్ణువు ఇంద్రులు మొక్కుతూంటే

నీ భవనాన్ని ప్రవేశించిన సదాశివుడిని ఎదురుకొన

డానికి అతి శీఘ్రముగాలేచి వెళ్ళే టప్పుడు నీ పరిజనులైన స్త్రీ లు , అమ్మా! నీముందు బ్రహ్మ దేవుడి

కిరీటము ఉంది . దానికి దూరంగా నడువు, ఓ తల్లీ !

ఇది కైటభాసురుణ్ణి సంహరించిన విష్ణువు కిరీటము

తొట్రు పడబోకు, అమ్మా! ఇది ఇంద్రుడి కిరీటము , 

దీని అగ్రభాగం తాకి జారుతావేమో జాగ్రత్తగా రమ్ము,

అనే మాటలు సర్వోత్కర్షతో రాజిల్లుతూన్నవి.

-

ఓం సత్యధర్మరతాయైనమః

ఓం సర్వరక్షిణ్యైనమః

ఓం శశాంకరూపిణ్యైనమః

వికటకవి..

=

వికటకవి..

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు.

.

ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,

ఎమి తిని సెపితివి కపితము

బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో

ఉమెతకయలు తిని సెపితో

అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా ||

ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.

కావలి తిమ్మడు

మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి

వాకిటి కావలి తిమ్మా !

ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా !

నీకిదె పద్యము కొమ్మా !

నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి

తిరుమలరాయల గురించి

రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.

అన్నాతి గూడ హరుడవె

అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!

అన్నా తిరుమలరాయా

కన్నొక్కటి లేదు కాని కౌరవపతివే!||

(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఇంకో కన్ను లేనిచో కురుపతి దృతరాష్టుడివి)