సుబ్బన్నపేట !


-

సుబ్బన్నపేట !.

వేయిపడగలు చదవని తెలుగువారు వుండరు .

సుబ్బన్నపేట నిజముగా వున్నదా అని అనుభూతి పొందుతాము !

ఎన్నో ఎన్నో వర్ణనలు ! 

కవిసమ్రాట్ మానసిక మధుర స్వప్నం చదువుతుంటే మానమనసులుకూడా సుబ్బన్నపేటలో పాత్రధారులవుతాయి. 

హేమంతఋతువర్ణన చదువుతుంటే ప్రక్రుతి మనకళ్లముందు వన్నెచిన్నెల వయ్యారం తో నర్తిస్తుంది ! 

.

""శరత్కాలము పోయి హేమంతర్తువు వచ్చెను .సన్నని మంచు పగలుకూడా ప్రొదెక్కువరకుసాయంకాలము ప్రొద్దువాటరుచున్నదనగా మొదలు పెట్టియును అవ్యవహితముగా కురియుచున్నది.

పడమటింటి వెనుక నిర్వాయు గగనభాగమున పొగచెట్టుకట్టినట్టు సన్నని మంచు నల్దిక్కుల నావరించెను. .ఆకాశమున యేదో పండి కోసిన యమృతపు కుప్పనూర్చి తూర్పార బత్తినట్టు సన్నని 

నూగువలె తుషారము కురియాజొచ్చెను.దిక్సతులు నలుగురును సన్నని మేలిముసుంగులు వైచికొని ,అదృశ్య ముఖమండల లైన రాజస్త్రీలవలెప్రకాశించితి .కాలువలు క్రమముగా కృశించిపోయెను. పచ్చికమీద రెండుజాములప్పుడు నడచినను పాదములు తడియుచుండెను."" 

వర్ణనలోనే మనం అనుభూతిని పొందుతాం ! 

.

తెలుగువారి జన్మజన్మల పుణ్యమా విశ్వనాధ్ మీకు 

గౌరవ వందనాలు !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!