#రియాలిటీ!-#శ్రీఅచ్యుత్ గారికవిత.

#రియాలిటీ!-#శ్రీఅచ్యుత్ గారికవిత.

-

ఋతువులన్ని మూటకట్టి

డ్రైనేజ్ లో పారేసాను

ఎందుకంటే 

ఓకేరోజులో అన్ని దొరికేేస్తున్నాయ్

తారు రోడ్డు మీద

ప్రపంచం పలక మీద బలపం లా

నడుచుకుంటూ ఊహల

పిచ్చిగీతలు గీసుకుంటు పోతున్నా

అబ్బా రాసుకోనీరు కదా సరిగా

రాసుకుందంతా చెరిగి పోయింది

అప్పుడే కురిసిన వర్షంతో

~~~

తలదువ్వుకొని చేత్తో మరోసారి సర్ది

చొక్కా వెనక కుట్టించుకొన్న ఆత్మ సాక్షిగా

మళ్లీ బయలుదేరాను

నగరాలన్ని కుంచించుకు పోతున్నాయి

నేను సూపర్మాన్ లాగా పెరిగిపోయాను

నా అంతటి వాడు లేడు కదా మరి

అంతలోనే ఏదో గుచ్చుకుంది

బెలూన్ లోనుండి గాలిపోతున్నట్టు శబ్దం

ఏంటి నేను కుప్పకూలిపోయాను 

బాల్యం గుండుసూదిలా గుచ్చేసింది

నన్ను తిరిగి నాకు ఇచ్చేసింది

బాల్యం నిజం

మిగితావన్ని అబద్ధం

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!