తెలుగు సినిమా ‘‘కులం’’!





-

తెలుగు సినిమా ‘‘కులం’’!

-

తెలుగు సినిమా ‘‘కులం’’ కౌగిలించుకుని చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 1950లలో వచ్చిన ‘‘గుండమ్మ కథ’’లోనే ఎస్వీరంగారావు ‘‘మేము పెద కాపులం’’ అంటాడు. 

పదేళ్ళ క్రితం వచ్చిన ఒక సినిమాలో ‘‘మేము నాయుళ్లం, మీరేమిటి? అని చక్రవర్తి. హీరో శ్రీకాంత్‌ను అడుగుతాడు. 

చాలా సినిమాలలోహీరోలు ఇంటి పేర్లతోసహా తమ, తమ వంశ, కుల చరిత్రలు చెప్పుకుంటున్నారు. సూర్యదేవర వీర రాఘవయ్య, పర్వతనేని తులసీరామ్‌ ప్రసాద్‌… ఇలా…

ఈ కుల వాసన మనకు అభ్యంతరకరం కానప్పుడు బ్రాహ్మణ కుల వాసన మాత్రం ఎందుకు అభ్యంతరకరం అవుతున్నది? 

ఒక యువ నటుడు మీసం మెలేసి, తొడ చరిచి వంశం పేరు చెప్పి, అదంతా తెలుగు వారి ఆత్మగౌరవం అని… పెడ బొబ్బలు పెడితే మనం ఎందుకు మౌనంగా వుండిపోయాం…

మిథునం కథరాసిన శ్రీరమణ కానీ, దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణి కానీ ‘‘ఇదే తెలుగు సంస్కృతి’’ అని ఎక్కడా ‘‘క్లెయిమ్‌’’ చేసుకోలేదు. ఇదీ తెలుగు సంస్కృతి అని ఎవరయినా క్లెయిమ్‌ చేసుకున్నా యివాళ్ళ తెలుగు సమాజం ఆమోదించే స్థితిలో వున్నదా…?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!