Sunday, May 28, 2017

జానపద సాహిత్యంలో సీత !

జానపద సాహిత్యంలో సీత !

(రచన: ఆచార్య పి. జ్యోతి ఈ మాట .జనవరి 2007» వ్యాసాలు).

భూదేవి సీతమ్మను అత్తవారింటికి పంపుతూ బంగారు గిన్నెలో పాలు నెయ్యి పోసి సీతమ్మ చేయిముంచి వరుసగా రామునికి కౌసల్య, సుమిత్ర, కైకమ్మలకు శాంతమ్మకు అప్పగింతలు చేసింది. కౌసల్యతో

వదినరో నాపుత్రి ఇదివప్పగింత

పదిలంబుగా దీని బాగా చూడమ్మ

పాలు కాచగ లేదు బాల మా వదినరో

నెయ్యి కాచగ నేరదు నెలత సుమి మదినా

నేర్పుగా చెప్పు సీత మీదమ్మా

అని చెప్పింది. లోకంలో తమ కూతుళ్ళ స్వభావం ఎటువంటిదైనా తళ్ళులు వాళ్ళను వెనుకేసుకు రావడం కనిపిస్తుంది. కానీ భూదేవి అట్లాంటి తల్లికాదు. కనుకనే

బుద్ధులెరుగదు మంకు బుద్ధులే గాని

బుద్ధి వచ్చిన దాక దిద్దుకో వదినా

అని చెప్పి “దాని పంపి నేను తాళలేనని” బాధపడింది. ఇంకా సీతమ్మతో

పొద్దోయి పొరుగిళ్ళ బోకమ్మ

సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ

వీధిలో తలకురులు విప్పబోకమ్మ

పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ

మందిలో కన్నెత్తి చూడబోకమ్మ

అని ఎన్నో సాంఘిక కట్టుబాట్లను చెప్పింది. అటువంటి కట్టుబాట్లు ఏ రకంగానైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషునికి చెప్పినట్లు కనిపించదు.

ఇటువంటిదే అప్పగింతలకు సంబంధించిన పాట నాటు కలుపుల్లో పాడుకుంటారు.


Saturday, May 27, 2017

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

మృదుపదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి!

.

పాటల లోకంలో విరిసిన పారిజాతం దేవులపల్లి. 

ఆయన 1897లో రామచంద్రపాలెంలో జన్మించినప్పట్నించీ- 

.

-''ఆకులో ఆకునై, పూవులో పూవునై, 

కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై''- 

మాటల ముత్యాలతో తెలుగు వాగ్గేయకారుల్ని మించిన

అందాల్ని తెలుగు పాటలకు అందించారు. 

.

ఆయన బ్రహ్మ సమాజవాది. 

కనిపించే ప్రతి రాయికీ, ప్రతి రప్పకీ, 

బొమ్మకీ, శిలకీ మొక్కవద్దని చాలా స్పష్టంగానే అన్నారు. 

.

''ప్రతి కోవెలకూ పరుగిడకు 

ప్రతి బొమ్మకు కైమోడ్చకు...'' 

.

ఆయన ''ప్రభు! ప్రభు! ప్రభు! దీనబంధు, ప్రాణేశ్వర దయాసింధు...'' అంటూ ఈశ్వరుడిని ఎలా వేడుకొన్నారో హైదరాబాదులో ఉన్న తరుణంలో సాయంత్రం వేళ నమాజు విని అల్లాను అలాగే వేడుకొన్నారు. 

.

ఖుదా! నీదే అదే పిలుపు 

ఖుదా! నీదే సదా గెలుపు 

.

కృష్ణశాస్త్రి ఏ విషయంమీద పాట రాసినా ప్రతి మాట లయాత్మకంగా అందులో ఒదిగి పోతుంది. 

.

''ముందు తెలిసెనా, ప్రభు ఈ 

మందిర మిటులుంచేనా...'' 

.

ఆయనొస్తాడని ముందు తెలిస్తే భక్తుడు అన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తాడు కదా... అంతే కాదు-

''ప్రతి క్షణము నీ గుణ కీర్తనము 

పారవశ్యమున చేయుదును...''

.

ఆయన్ని అందుకే వడ్డెపల్లి కృష్ణ ''మృదు పదాల మేస్త్రీ'' అన్నారు... 

లేకుంటే ఇంత కమ్మగా ఎలా సాధ్యమైంది-అంటూ గుణ నామాల్ని కీర్తిస్తూ గడపడూ! 

.

దేవులపల్లి ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారుల సరసన నిలవదగిన గేయకారుడు.

అయితే ఆయన రచయితే కానీ పాటగాడు కాలేకపోయారు. 

"కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" - శ్రీ శ్రీ!

"కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" - శ్రీ శ్రీ!

.

తెలుగు భాష లో ప్రధమ శ్రేణిని నిలిచే పది పుస్తకాలలో 'కన్యాశుల్కా'నికి ప్రధమస్థానం ఇస్తాను. ప్రపంచపు నూరు గొప్ప పుస్తకాలలో 'కన్యాశుల్కం' ఒకటి. కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ

పోతనగారి రుక్మిణి!!

పోతనగారి రుక్మిణి!!

.

అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా

వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే

యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.

(Satyanarayana Piska గారి వివరణ.)

ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది.

పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.

(మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.)

విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది.

వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి!

దేవదాసు!

దేవదాసు!

.

ఎంత దూరం నాయనా?” 

ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు. 

తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట?

ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా? 

ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?

Friday, May 26, 2017

భార్యలను "ఒసే" అని పిలవడం .!

భార్యలను "ఒసే" అని పిలవడం .!

(శ్రీ తుర్లపాటి కుటుంబరావుఆత్మకథవిషయపేజీలు నుండి.)

.

నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని.

ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే

"ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా?

ఏమి! పెళ్లి కాగానే స్థాయి, విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా?

అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా?

అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే

భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా?

ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది!

Thursday, May 25, 2017

ఉత్తరకుమారుడు!

ఉత్తరకుమారుడు!

.

"భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన

గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్ర్తాస్త్ర జా 

లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా 

ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే .

.

ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్నిచూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది.

.

గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే ,

పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే ,

ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది.

ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం.

.

“శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి ,

.

ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే

మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది.

ఇది ఆ పద్యం/కవి గొప్పదనం . అంతేకాక యుద్ధభూమి పై వ్రాసిన పద్యం ”శార్దూలం”లో వ్రాయటం లో కూడా చక్కటి ఔచితి వుంది.

.

నా చిన్నప్పుడు మాకు తెలుగు ఎంతబాగా వచ్చో పరీక్ష చేయటానికి మా నాన్నగారు ఈ పద్యపాదాలు డిక్టేట్ చేసి తప్పులులేకుండా రాయగలమో లేదో చూసేవారు .

(చిత్రం- చందమామ-ఆచార్యాగారు .)

Tuesday, May 23, 2017

యాక్సిడెంట్ !

" మిస్టర్ మూర్తి! ఈ ఇంటర్వ్యూ లో మీకిది ఆఖరు ప్రశ్న, గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?"

" ఎస్ సార్! జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి బదులుగా పొరబాటున వాళ్ల నాన్నగారికిచ్చాను"

"ఏమిటిచ్చారు? "

"ప్రేమ లేఖ"

"తరువాత ఏమైందీ"

" అయిదు నిమిషాలు తరువాత చెంప చెళ్ళుమంది, శివలింగపురం ప్లాట్ ఫారమ్ పై పడ్డాను

మిమ్మల్నెక్కడో చూసినట్టుంది!

మిమ్మల్నెక్కడో చూసినట్టుంది!

.

సార్...! మిమ్మల్నెక్కడో చూసినట్టుంది అసలు మీది ఏ ఊరు...?

"పల్లంకుర్రు..."

"నిజమా! అరె మాదీ పల్లంకుర్రే.."

"మీది ఏ వీధి...?"

"బ్యాంకు వీధి"

"అలాగా...! మాదీ బ్యాంకు వీధే..."

"మీ ఇల్లెక్కడ...?"

"బ్యాంకుకి ప్రక్కన. మరి మీ ఇల్లు..."

"అరె...! మాదీ బ్యాంకు పక్కనే ఉన్న డాబాలో పై అంతస్తు..."

"అరె...మాదీ అంతే...! పై అంతస్తే"

ఈ సంభాషణ విన్న మూడోవ్యక్తి చిరాగ్గా "అదేమిటయ్యా! మీ ఇద్దరివీ ఒకే ఊరు, ఒకే వీధి, ఒకే ఇల్లు అంటున్నారు. ఎప్పుడూ ఒకర్నొకరు చూసుకోలేదా?" అన్నాడు.

"భలేవారే! ఎందుకు చూసుకోమూ...? మేమిద్దరం అన్నదమ్ములం. ఎంతసేపటికీ బస్సురావట్లేదని టైంపాస్ కోసం ఇలా మాట్లాడుకుంటున్నాం అంతే...!" అంటూ అసలు విషయం చెప్పారు ఆ ఇద్దరిలో ఒకరు.

పొలిపదం! (వడ్డాది వారి చిత్రం.)

పొలిపదం!

(వడ్డాది వారి చిత్రం.)

.

ఒలియో ఒలియా ఒలియా

వేలుగలవాడా రారా పొలిగాడా

.

ఊరికి ఉత్తరాన ఊడల మఱ్ఱి

ఊడలామఱ్ఱిక్రింద ఉత్తముడిచేతికె

ఉత్తముడి చెబికెలో రత్నాలపందిరి

రత్నాల పందిట్లో ముత్యాలకొలిమి

గిద్దెడు ముత్యాల గిలకలా కొలిమి

అరసోలముత్యాల అమరినా కొలిమి

సోలెడుముత్యాల చోద్యాల కొలిమి

తవ్వెడు ముత్యాల తరచినా కొలిమి

మానెడు ముత్యాల మలచినా కొలిమి

అడ్డెడు ముత్యాల అలచినా కొలిమి

తూముడు ముత్యాల తూగెనే కొలిమి

చద్ది అన్నముతినీ సాగించు కొలిమి

ఉడుకు అన్నముతిని ఊదెనే కొలిమి

పాల అన్నముతిని పట్టెనే కొలిమి

ఊదేటి తిత్తులు ఉరుములామోలు

వేసేటి సంపెట్లు పిడుగులామోలు

లేచేటి రవ్వలు మెరుపులామోలు

చుట్టున కాపులు చుక్కలామోలు

నడుమకమ్మరిబిడ్డ చంద్రుణ్ణి బోలు ...

అరుణాస్పదపుర వర్ణనము!

అరుణాస్పదపుర వర్ణనము!

(మను చరిత్రము ప్రథమాశ్వాసము. అల్లసాని పెద్దనామాత్యుడు)

మ. 

వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం

బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ

హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌

బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌. 49

సీ. 

అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు

నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు

నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు

లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు 

తే.

నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ

గాసెకొంగున వారించి కడపఁగలరు

నాట్యరేఖాకళాధురంధరనిరూఢి

నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ.

Monday, May 22, 2017

లావొక్కింతయు లేదు !

లావొక్కింతయు లేదు !

.

విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా?

.

ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ

.

ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి

.

ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని 

(పోతన గారి పద్యం ...వడ్డాది వారి చిత్రం.)

Saturday, May 20, 2017

పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!

పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!


.

"నంద తపఃఫలంబు ,సుగుణంబుల పుంజము , గోపకామినీ

బృందము నోముపంట ; సిరి విందు ; దయాంబుధి ; యోగి బృందముల్

డెందములందు గోరెదు కడింది నిధానము సేర వచ్చె నో

సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్"

.

రోహిణీ నక్షత్రం . గోపాలకృష్ణుని పుట్టిన దినం . కమ్మని కస్తూరి తావులు పుడమి అంతా అల్లుకున్నాయి . మనసు ఆనంద పరవశమయింది . తటాలున మా అమ్మ జ్ఞాపకం వచ్చింది . చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ నేర్పించిన పద్యం జ్ఞప్తికి వచ్చింది . శ్రీకృష్ణుడు మధురానగరానికి వస్తున్నాడు . సరస సంగీత శృగార చక్రవర్తి , సకల భువనైక చారుమూర్తి తమ నగరానికి వస్తున్నాడని తెలిసిన మధురానగర మనోహారిణుల మనసులు ఆనంద పరిప్లుతాలయినాయి .పరమాత్మ దర్శనమిస్తే హృదయం ఝల్లుమనదా !

శ్రీయుతమూర్తియై కరుణ చిందే చూపులతో శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో ప్రవేశించాడు . శ్యామలాంగుడు అల్లనల్లన అడుగులిడుతూ కనిపించాడు , ఆ పట్టణంలో నివసించే రమణులకు . స్వామిని చూచిన ఆ భామినులు ముగ్ధులైపోయారు . తమ స్నేహితులను స్వామిని చూడమని అహ్వానిస్తున్నారు :

.

“నందుడు చేసిన తపస్సుకు ఫలితంగా లభించిన మాధవుడితడు . సుగుణాలకు ఆలవాలం . గోపకామినులు నోచిన నోముల పంట . శ్రీ మహాలక్ష్మికి విందుభోజనం లాంటివాడు . ( ఈ స్వామిని చూడగానే ఆమె కడుపు నిండిపోతుంది . విందు అక్కర లేదు ) . కరుణా సముద్రుడు . యోగులు తమ హృదయాలలో నింపుకోవాలని కోరుకునే పెన్నిధి . రమణీలలామలారా ! పరుగు పరుగున రండి . కనులనిండుగా కృష్ణుని దర్శనం చేసుకుందాం . పునీతుల మవుదాం “.

తమకు కలిగిన భాగ్యాన్ని తమకు కావలసిన వారితో పంచుకోవాలనే మధురానగర మగువల తపన ఈ పద్యంలో కనిపిస్తుంది . మంచి అందరూ కలిసి అనుభవించాలి . అప్పుడది ద్విగుణీకృతమవుతుంది . ఆ భావన మనలో కలిగించితే ఈ పద్యం సార్థక మవుతుంది .

Thursday, May 18, 2017

సౌందర్య దర్శనమ్ ! .

సౌందర్య దర్శనమ్ !

.

కాళిదాస మహాకవి కావ్య త్రయాన్ని నాటక త్రయాన్ని రచియించి కవితాప్రియుల కానంద సంధాయకుఁ డైనాడు. ముఖ్యంగా నాటక త్రయంలో అతడు దర్శించిన, దర్శింపఁ జేసిన నాయికా సౌందర్యం నాన్యతో దర్శనీయమైనది.

మాళవికాగ్నిమిత్రమ్ విక్రమోర్వశీయమ్ , అభిజ్ఙాన శాకుంతలము లుగా 

చెప్పబడే ఆనాటక త్రయంలో ఒక్కొక నాటకంలో ఒక్కొక విధమైన నాయికలను యెంచుకున్నాడు. 

మాళవిక కేవలం అదివ్య. మానవకాంత. 

విక్రముడు పురూరవుడు వలచిన ఊర్వసి దివ్య . శకుంతల 

వీరి సౌందర్యములను వర్ణించు పట్టుల వినూత్నమైన వివిధ పధ్ధతుల ననుసరించినాడు.

ముందుగా దివ్యా దివ్య సౌందర్య విభ్రాజిత యగు శకుంతలా సౌందర్యాన్ని వర్ణించిన తీరుతెన్నులను బరిశీలింతము. దుష్యంతుడు వేటకై వచ్చి యలసి కణ్వాశ్రమమునకు అరుదెంచెను. అట బాలపాదపములకు నీరువోయుచున్న మువ్వురు కన్నియలను జూచెను.

ఆమువ్వురిలో నొకతె వినూత్న సౌందర్యవతి. మానవకాంత వలె యగుపడలేదు.కాకున్న బుష్యాశ్రమ నివాసమేల? వల్కల ధారణమేల? అపూర్వమీ సౌందర్యముగదా! యనిమనంబున నెంచుచు తనలో తానిట్లను కొనెను.

నీజమునకీమాటలు ఆపాత్రమాటున దాగిన కాళిదాస మహా కవివేగదా!

శ్లో: సరసిజ మనువిధ్ధం శైవలేనాపి రమ్యం /

మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి /

ఇయ మధికమనోజ్ఙా వల్కలేనాపి తన్వీ /

కిమివహి మధురాణామ్ మండనమ్ ఆకృతీనామ్/

అర్ధము:- 

సరసిజమ్- పద్మము; శైవలేన- నాచుతో; అనువిధ్ధమ్+ అపి- కలసిఉన్నాకూడా ;రమ్యమ్- మనోహరమే;

హిమాంశోః- చంద్రునియొక్క; లక్ష్మ- మచ్చ; మలినమపి -మాలిన్యమేయైననూ( నలుపైనను)లక్ష్మీం-శోభను; తనోతి-కలిగించుచున్నది. ఇయం తన్వీ- ఈకన్నె ;(నాజూకు పిల్ల) వల్కలేనాపి-నారవస్త్రమును దాల్చిననూ; అధికమనోజ్ఙా-చాల యందముగా నున్నది; మధురాణామ్ -తియ్యని (చక్కని) ఆకృతీనామ్- ఆకారము గలవారికి ( అవయవముల పొందిక గలవారికి) మండనమ్- అలంకారము- కిమివహి-ఎందుకు? ( అనవసరము)

తామర పూవు చుట్టూ పచ్చని నాచు ఆక్రమించి యుంటుంది. అయినా అదెంత అందంగా ఉంటుంది? చంద్రునిలోని మచ్చ నలుపే అయితేనేం చంద్రుడెంత అందంగా ఉంటాడు! నాజూకైన యీపిల్ల నారచీర కట్టినా అందమేమీ తగ్గలేదు. అసలు చక్కని ఆకారం ఉన్నవారికి అలంకారాలెందుకు?

అందమైన వారికి వేరే అలంకారాలు అవసరంలేదంటాడు కాళిదాసుగారు. లేనివారికి కావాలని వేరే చెప్పక్కర లేదుగదా! శకుంతల యంద మలాంటిది. తల్లి మేనక దేవవేశ్య. మొత్తానికి దేవకాంత. ఆమెనుండి దివ్యౌందర్యం,లావణ్యం యీమెకు సంక్రమించాయి. తండ్రి తపోధనుఁడైన విశ్వామిత్రుఁడాయె. అతనినుండి,గాభీర్యాది సుగుణాలు సంక్రమించాయి.

అందుచేత ఆమె ముని కన్నెలలో వైవిధ్యంగానే కనిపించింది. అందుచేతనే చివరకుతీర్పు. ఏమనీ? ఆకారముగలవారికి(అనగా సహజమైన సౌందర్యము గలవారికి ) అలంకారము లక్కరలేదని.

దీనిని సమర్ధిచుట కోసమే ముందు రెండు ఉపమానములను జెప్పినాడు. ఉపమాకాళిదాసస్య అన్నారుగదా!

‘’హస్త సాముద్రికం ‘’

-హస్తరేఖాల ను బట్టి జాతకం చెప్పటాన్ని 

‘’సముద్రుడు ‘’అనే అయన రాశాడు 

.అప్పటి నుంచి దానికి ‘’హస్త సాముద్రికం ‘’అనే పేరోచ్చిందిట .

ఐహికాముష్మికసాధన!

ఐహికాముష్మికసాధనసామర్థ్యం కలుగుతుంది. 

కనుక వీలయితే మూల శ్లోకాలతో , కనీసం ఈ తెలుగయినా రోజుకొకసారి చదివి మననం చేయాలి. 

ప్రశ్నలన్నీ శిష్యుడు అడిగినవీ జవాబులన్నీ గురువుగారు చెప్పినవీగా తెలుసుకోవాలి:

1. భగవన్, గ్రహించవలసినదేమిటి?

గురువాక్యం.

.

2. వదలవలసినదేమిటి?

చేయరాని పని.

.

3. గురువెవరు?

తత్త్వం తెలిసి ఎల్లపుడూ శిష్యునికి మేలు చేయటానికి సంసిద్ధుడయి ఉండేవాడు.

.

4. బుద్ధిమంతుడు త్వరపడి చేయవలసినదేమిటి?

సంసారం = జననమరణ చక్రం విరగగొట్టటం. 

.

5. ముక్తి తరువుకు విత్తనం ఏమిటి? 

కర్మాచరణం వల్ల (కలిగిన చిత్త శుద్ధి ద్వారా) లభించే తత్త్వజ్ఞానం.

.

6. అన్నింటికంటె పథ్యమైనదేది? 

ధర్మం.

.

7. ఈ లోకంలో శుచి అయినవాడెవ్వడు?

పరిశుద్ధమైన మనస్సుకలవాడు.

.

8. పండితుడెవరు?

ఆత్మానాత్మ వివేకం కలవాడు.

.

9. ఏది విషం?

గురువులను అవమానించటం.

.

10. సంసారంలో సారమైన దేమిటి?

అనేకులు అనేకవిధాలుగా ఆలోచించి నిర్ణయించినదే.

.

11. మానవులకు అన్నింటికంటె ఇష్టమైన దేమిటి?

తనకు మేలుచేసుకొనటానికీ ఇతరులకుపకారం చేయటానికీ నిరంతరం పూనుకొనే జన్మ.

.

12. మద్యంలా మత్తెక్కించేదేమిటి?

స్నేహం.

.

13. దొంగలెవరు?

ఇంద్రియవిషయాలు.

.

14. సంసారంలో కట్టిపడవేసే తీగె ఏమిటి?

తృష్ణ.

.

15. శత్రువెవరు?

ప్రయత్నించకపోవటం.

.

16. దేనికి భయపడాలి?

మృత్యువుకి.

.

17. గ్రుడ్డివానికంటె కబోది ఎవడు?

రాగం, విషయాసక్తి కలవాడు

..

18. శూరుడెవరు?

లలనల చూపుల తూపుల వ్యథచెందని వాడు.

.

19. కర్ణాం జలులతో పానం చేయదగిన అమృతం ఏది?

సదుపదేశం.

20. గౌరవానికి మూలం ఏమిటి?

యాచించకపోవటం.

.

21. గహనమైనదేమిటి?

కాంతనడత.

.

22. చతురుడెవరు?

కాంతనడతవల్ల ఖండితుడు కానివాడు.

.

23. ఏది దుఃఖం?

అసంతృప్తి.

.

24. తేలికచేసేది ఏది?

అధముని యాచించటం.

.

25. ఏది జీవితం?

దోషరహితం.

.

26. ఏదిజడత్వం?

చదివినా రాకపోవటం.

.

27. మేలుకొని ఉండేవాడెవడు?

వివేకి. 

.

28. ఏది నిద్ర?

ప్రాణి మూఢత్వం.

.

29. తామరాకు మీది నీరులా చంచలమైనదేది?

యౌవనమూ, ధనమూ, ఆయువూ.

.

30. చంద్రకిరణాల వంటి వారెవరు?

సజ్జనులు. 

.

31. ఏది నరకం?

ఒకరికి లొంగి ఉండటం.

.

32. ఏది సౌఖ్యం?

సర్వసంగపరిత్యాగం.

.

33. సాధించవలసినదేమిటి?

ప్రాణిహితం.

.

34. ప్రాణులకు ఏది ప్రియం?

ప్రాణం.

.

35. అనర్థకరమేది?

మానం.

.

36. ఏది సుఖప్రదం?

సాధుజనమైత్రి.

.

37. సకల కష్టాలూ పోగొట్టుకొనగలవాడెవడు?

సర్వవిధత్యాగి.

.

38. ఏది మరణం?

మూర్ఖత్వం .

.

39. ఏది అమూల్యం?

అవసరానికిచ్చిన దానం.

.

40.మరణం వరకూ బాధించేదేది?

చాటున చేసిన పాపం.

.

41. ఏ విషయమై ప్రయత్నించాలి?

విద్యాభ్యాసం, మంచిమందు, దానం.

.

42. తిరస్కరించవలసినదేది?

ఖలుడు, పరకాంత, పరధనం.

.

42. రేయింబవళ్లు ఆలోచించవలసినదేది?

సంసారం అసారమని, కాంత గురించి కాదు.

.

44. దేనిని ఇష్టం చేసుకోవాలి?

దీనులపై కరుణ, సజ్జనులతో మైత్రి.

.

45. ప్రాణాలు పోయేటపుడు కూడా ఎవరి మనస్సు కరగదు?

మూర్ఖుడు, శంకితుడు, విషాదగ్రస్తుడు, కృతఘ్నుడు -వీరిది

..

46. ఎవరు సాధువు?

మంచి నడవడి కలవాడు.

.

47. అధముడెవరు?

చెడునడవడి కలవాడు.

.

48. ఈ జగత్తును జయించిన వాడెవడు?

సత్యమూ, ద్వంద్వసహిష్ణుతా కలవాడు.

.

49. దేవతలెవనికి నమస్కరిస్తారు?

దయముఖ్యమనుకొనేవానికి.

.

50. ఏదంటే పండితునికి భయం?

సంసారారణ్యమంటే.

.

51. ప్రాణిగణం ఎవనికి వశమవుతుంది?

వినయవంతుడయి వినేవారినికి ప్రియమైన సత్యం పలికే వానికి. 

.

52. కనిపించే ప్రయోజనం సిద్ధించటానికి ఎక్కడ ఉండాలి?

న్యాయ్యమార్గంలో.

.

53. ఎవడు కబోది?

అయోగ్యకార్యాలు చేయటంలో ఆసక్తికలవాడు.

.

54. ఎవడు చెవిటివాడు?

హితవుమాటలు విననివాడు.

.

55. మూగవాడెవడు?

సమయానికి తగు ప్రియమైన మాటలాడడం తెలియనివాడు

..

56. ఏదిదానం?

ప్రతిఫలమాశించనిది

..

57. ఎవడు మిత్రుడు?

పాపం నుంచి మరలించే వాడు.

.

58. ఏది అలంకారం?

శీలం.

.

59. పలుకులకు ఏది భూషణం?

సత్యం.

.

60. మెరపుమెరపులా చంచలమైనదేది?

దుర్జనసాంగత్యమూ యువతులూ.

.

61. కలికాలంలో కూడా కులశీలాల నుంచి కదలింపరానివారెవరు?

సజ్జనులే.

.

62. ఇహంలో చింతాణిలా దుర్లభమైనదేది?

చతుర్భద్రం.

.

63. అంటే ఏమిటంటారు తమస్సు విదిలించుకొన్న జ్ఞానులు?

ప్రియవాక్యసహితమైన దానం, గర్వరహితమైన జ్ఞానం, క్షమాయుతమైన శౌర్యం, త్యాగసమేతమైన విత్తం - ఇది చతుర్భద్రం. ఇది దుర్లభం.

.

64. శోచనీయమేది?

కలిమిగల లోభిత్వం.

.

65. ప్రశస్తమేది?

ఔదార్యం.

.

66. విద్వాంసులు కూడ పూజించదగినవాడెవడు?

స్వభావసిద్ధమైన వినయం ఎల్లవేళలా కలవాడు.

.

67. ఈ జగత్తు ఎవనికి వశమవుతుంది?

ప్రియమైన హితమైన పలుకులు పలుకుతూ ధర్మాసక్తి కలవానికి.

.

68. విద్వాంసుల మనస్సును ఏది హరిస్తుంది?

జ్ఞానసహితమైన సత్కవిత్వం.

.

69. ఆపద లెవరినంటవు?

ఇంద్రియ నిగ్రహమూ ప్రకృష్టమైన జ్ఞానమూ కలవారి నను వర్తించేవానిని.

.

70. లక్ష్మి ఎవరిని కోరుకొంటుంది?

మనస్సులో సోమరితనం లేక నీతిమంతమైన నడవడి కలవానిని.

.

71. లక్ష్మిహఠాత్తుగా ఎవరిని వదలిపెడుతుంది?

ద్విజులను, గురువులను, సురలను, నిందించేవానినీ, సోమరినీ.

.

72. ఏమి ఉంటే నరుడు శోచనీయుడు కాకుండా ఉంటాడు?

చెప్పిన మాట వినే భార్యా, నిలుకడగల కలిమీ ఉంటే.

Wednesday, May 17, 2017

చిన్నప్పుడు!

చిన్నప్పుడు!

.

చిన్నప్పుడు మా మేనమామ ఇంటికి వెళ్తే వాళ్లకి ఆవులూ గేదెలూ ఉండేవి. 

గొడ్లను తోలుకుని పొలాలకు వెళ్లేవాళ్లం. చెరువుల్లో దిగడం, 

తామరాకుల్లో భోజనాలు, మా అత్తయ్యా వాళ్లు నట్టింట్లో చల్ల చిలుకుతుండేవాళ్లు. ఆవు పేడతో వాకిట్లో కళ్లాపి చల్లేవాళ్లు. 

ఆవు పేడ కచ్చిక చాలా మృదువుగా ఉండేది.

దాంతో పళ్లు తోముకుంటూ ఆ వాసన అనుభవిస్తూ.

కళ్లాపి వాసన, చల్ల చిలుకుతున్నప్పుడు వచ్చే తోడు పెరుగు వాసన..

ఈ మూడు వాసనలూ ఏకకాలంలో అనుభవించాం. 

ఇవాళ ఎవరికి తెలుసు ఇవన్నీ? 

అవన్నీ అనుభవిస్తే కల్పనా శక్తి పెరుగుతుంది. 

ఎంత భాషాజ్ఞానం ఉన్నా కల్పనాశక్తికి, అనుభూతి పొందడానికి 

ఈ తరానికి ఏముంది? 

హైలైట్ మా మేన మామ కూతురు.. 

.

అపార్టుమెంట్లలో ఉంటూ ఇప్పుడు ఎవరూ సూర్యోదయం

సూర్యాస్తమయం చూడట్లేదు!

"స్వామి అండ్ ఫ్రెండ్స్...పోలేరమ్మబండ కతలు’

"
స్వామి అండ్ ఫ్రెండ్స్...పోలేరమ్మబండ కతలు’


.

‘మాల్గుడి ఎండలో ఒక విశేషం ఉంది. దాని గురించి ఆలోచించినవారికే అది హాని చేస్తుంది’ అని మొదలవుతుంది in Father's Room presence అనే కథ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’లో.పదేళ్ల స్వామికిగాని, అతడి ఖరీదైన స్నేహితుడు రాజంకుగానీ, వీపున గూటం మోస్తూ దాంతో ఎవడి నెత్తయినా పగలగొడతాను అని బెదిరిస్తూ తిరిగే మణికిగానీ ఆ ఎండంటే లెక్కే లేదు. అది వారి పాలిటి తెల్లని డేరా. మల్లెల షామియానా. ఇంకా చెప్పాలంటే ‘చామీ’ అని ప్రేమగా పిలిచే నానమ్మ మెత్తటి ఒడి.మాల్గుడి పట్టణ దాపున, సరయూ నది వొడ్డున ఈ పిల్లలు, వాళ్ల అల్లరి దేశ సంపద మాత్రమే అయ్యిందా? ప్రపంచానికి మురిపెం కాలేదూ?

భారతదేశం అంటే బట్లర్లు, ఇంగ్లిష్ అక్షరమ్ముక్కరాని బంట్రోతులు అనుకునే వలసపాలన రోజుల్లో, ప్రపంచంలో సాహిత్యాన్ని ఇంగ్లిష్ అనే కొలబద్ద పక్కన నిలబెట్టి కొలుస్తున్నరోజుల్లో ఏకకాలంలో ముగ్గురు భారతీయ రచయితలు లండన్‌వారి అచ్చులను హల్లులను ఈ మట్టినీటిలో తడిపి, ఈ గోధూళి దారుల్లో దొర్లించి, ఈ సంస్కారాలతో స్నానం చేయించి, శుభ్రమైన ధోవతీలు చుట్టి లోకానికి చూపించారు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావ్, ఆర్.కె.నారాయణ్... నాలుగు ముక్కల లీవ్‌లెటర్ రాయడం రాని ఈ దేశంలో నలభై వేల వాక్యాలు రాయగల సత్తా ఉన్న కలాలు ఉన్నాయి కథలూ ఉన్నాయి చూస్తారా అని చూపించినవారు వాళ్లు.

వీరిలో ఎవరికివారు మేటి.ఆర్.కె.నారాయణ్? ఘనాపాటి. ఒక అయ్యర్ కుర్రాడు, తండ్రిలాగా టీచరో లేదంటే మరో బ్రిటిష్ నౌకరో కావలసినవాడు- ఆర్.కె.నారాయణ్- అచ్చు స్వామిలాగానే చదువులో అంతంత మాత్రం. యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తే ఫెయిల్ అయ్యాడు. మూడేళ్ల డిగ్రీలో చేర్పిస్తే నాలుగేళ్లు చదివాడు. శారీరక బలం లేదు. స్కూల్ టీచర్‌గా పొద్దు పుచ్చుతాడనుకుంటే హెడ్మాస్టర్ వేసిన డ్రిల్ క్లాసుకు నిరసన తెలిపి ఇంటికొచ్చి బొబ్బున్నాడు. ఇలాంటివాడు రచనను ఒక ఉపాధిగా తీసుకోవడం గొప్ప. అందుకు కుటుంబం అంగీకరించడం మరీ గొప్ప.

తొలి సంవత్సరం సంపాదన అంతా కలిపి తొమ్మిది రూపాయల పన్నెండు అణాలైనా, తొలి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ను మేనమామ ఎగతాళి చేసి పబ్లిషర్లు తిరగ్గొట్టినా ఆర్.కె.నారాయణ్‌కు తెలుసు. తన దగ్గర ఒక మంత్రనగరి ఉంది. మాల్గుడి! ముద్దులొలికే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. స్వామి! వాళ్లిద్దరూ సరిగ్గా తగలాల్సిన వాళ్లకు తగలాలి. అంతే. కాని ఎలా? ఆక్స్‌ఫర్డ్‌లో ఒక స్నేహితుడుంటే అతనికి ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ రాత ప్రతి పంపాడు. ఆ స్నేహితుడు దానిని ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత గ్రాహం గ్రీన్‌కు చూపించాడు.

రోజూ బ్రెడ్డూ జాము పనికిమాలిన ఇంగ్లిష్ మర్యాదలతో విసిగిపోయున్నవాడికి పచ్చని అరిటాకు.. నడుమ తెల్లని అన్నమూ... ఆ పక్కనే కళకళలాడే బ్రాహ్మణ కుటుంబమూ... బంగారు బాల్యమూ... లేచి నడుముకు టై చుట్టుకుని అది పబ్లిష్ అయ్యేదాకా ఊరుకోలేదతడు.

1935. స్వామి అండ్ ఫ్రెండ్స్ నామ సంవత్సరం. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నిలుచుని దుర్భుణీ వేసి చూసినా దూరంగా కనిపిస్తున్న ఒక నదురైన నౌక. రెపరెపలాడుతున్న భారతీయ పతాక. ఆర్.కె.నారాయణ్. భారతీయాంగ్ల సాహిత్యానికి ఏం తక్కువ? అవును ఏం తక్కువ అని నిరూపించినవాడు స్వామి.

ఇందుకు ఆర్.కె.నారాయణ్ ఏరింది కూడా చాలా సులువైన దినుసులు. మైసూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణం- నంజనగుడ్- దానిని మాల్గుడి చేసుకున్నాడు. అందులో పారే నది-కబిని- దానిని సరయు చేసుకున్నాడు. ముఖ్యపాత్ర స్వామి? దిగుల్లేదు. తనే. ఇక తండ్రి.. తల్లి... నానమ్మ... స్నేహితులు... చిన్నప్పటి జ్ఞాపకాలు... కాకుంటే రెండు యాడ్ చేయాలి. ఒకటి స్వచ్ఛత మరొకటి అమాయకత్వం. యాడ్ చేశాడు. రచన సిద్ధం. లొట్టలు వేయకుండా ఉండటం దుస్సాధ్యం.

పిల్లల ప్రపంచాన్ని పిల్లల ప్రపంచంలోకి వెళ్లి రాయడం అది. లోపలి రచన. వారి అమాయకత్వం, తెంపరితనం, భయం, కపటం, అసూయ, భేషజం, పరిణితి... పెళ్లయ్యి ఇల్లు పిల్లలు ఉంటేనే సంసారం కాదు... పిల్లలకు కూడా ఒక సంసారం ఉంటుంది... టీచర్లతో టెక్స్ట్‌బుక్కులతో పరీక్షలతో ఆటలతో స్నేహితులతో పోటీలతో... దానిని రాయడం అది. ఆర్.కె.నారాయణ్ దృష్టిలో పిల్లల పట్ల పెద్దల నుంచి హింస, భయాలకు తావులేదు. దానిని చెప్పడానికి కూడా ఈ నవల రాశాడు. తమిళుడే. కాని కన్నడ భూమికి, కన్నడ మనుషులకు, కన్నడ సంస్కృతికి అక్షరాలా కస్తూరి పరిమళం అబ్బాడు. మైసూర్ అంటే ఆర్.కె.నారా యణ్, ఆర్.కె.నారాయణ్ అంటే మైసూర్.

నేల మీద గట్టిగా కాలూనిన ఏ రచనైనా బతికింది. ఇదీ అందుకే బతికింది. దృశ్యమాధ్యమం అందుబాటులోకి వచ్చి, టెలివిజన్ సెట్ అనేది ఇంటింటికీ క్యాలెండర్‌తో సమానం అయ్యాక స్వామి అండ్ ఫ్రెండ్స్ రచన ‘మాల్గుడి డేస్’గా మారి ప్రతి ప్రేక్షకుణ్ణి తాకింది. 1986. అంటే దాదాపు 30 ఏళ్లు.కాని ఇంకా ఆ సీరిస్‌ను చూస్తున్నారు. హిందీలో చూశారు. ఇంగ్లిష్‌లో చూశారు. దేశీయ భాషల్లో డబ్ చేసుకొని చూశారు. చూస్తూనే ఉన్నారు.

ఎందుకు చూస్తున్నారు? అందులో ఉన్నది నువ్వూ. నేనూ. నిన్ను నువ్వు ఎంత సేపు చూసుకున్నా తనివి తీరుతుందా? ఈ సిరీస్ వల్ల దర్శకుడు శంకర్‌నాగ్, స్వామి పాత్ర పోషించిన మంజునాథ్ ప్రేక్షకుల్చిన ఫాల్కేలను పొందారు.స్వామి అండ్ ఫ్రెండ్స్ తెలుగులో ‘స్వామి- మిత్రులు’ పేరుతో అనువాదమయ్యి 1996లో పుస్తకంగా వెలువడింది. దీనిని వాసిరెడ్డి సీతాదేవి అనువాదం చేశారని చాలా కొద్దిమందికే తెలుసు. ఎన్.బి.టి దీనిని రహస్యంగా ఉంచిందని కూడా చాలా కొద్దిమందికే తెలుసు. అందుబాటులో ఉంచితే పాఠకులు చదివేస్తారని దాని భయం. నిజానికి అడల్ట్ చిల్డ్రన్‌కు ఈ వేసవిలో ఇంతకు మించిన తోడు ఉందా?

అయితే ఆర్.కె.నారాయణ్‌కూ, స్వామి అండ్ ఫ్రెండ్స్‌కూ తెలుగు ప్రాంతంతో బాదరాయణ బంధం ఉందా? అలాంటి గాలి ఈ తావున తిరుగాడిందా? అలాంటి పాత్రలు ఈవైపు తారసిల్లాయా?అవును అనే అంటున్నారు ఒకరిద్దరు పాఠకులు. యూనివర్సిటీలలో కంపారిటివ్ స్టడీ చేస్తున్న విద్యార్థులు.‘పోలేరమ్మబండ కతలు’కు దక్కిన గౌరవం అది.ఇది విశేషం కావచ్చు. అలాంటి పోలికకు తెలుగులో ఒక రచన ఉండటం,

Sunday, May 14, 2017

సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!!

సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!!

రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యం. అందులో సీతా పరిత్యాగ ఘట్టం అంత కరుణరసప్లావితమైన ఘట్టం మరొకటి ఉండదు. లోకాపవాదానికి భయపడి శ్రీరాముడు సీతను పరిత్యజించడానికి పూనుకుంటాడు.

రామో విగ్రహాన్ ధర్మః అంటారు. మూర్తీభవించిన ధర్మమే రాముడు.ప్రజలను పాలించే రాజు ధర్మంతప్పకూడదని రాముడు నమ్మాడు. ధర్మంకోసం ప్రాణప్రదమైన భార్యను వదులుకున్నాడు.

ఎంతో అన్యోన్యంగా ఉండే సీతారాములను ఈ విధంగా విడదీయడానికి కారణమైన ఒక గొప్ప సంఘటన-రాజ్యంలోని ఒక చాకలివాడు శ్రీరాముడి గురించి చేసిన ఒక వ్యాఖ్యానం. ధర్మాన్ని పాటించే రాజుగా రాముడు సీతా పరిత్యాగం చేసి తీరవలసిన సందర్భాన్ని కల్పించారు వాల్మీకి. ఈ సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, రామాయణంలోని మూలకథకు భంగం కలగకుండా చక్కగా చిత్రించారు లవకుశ సినిమాలో.

ఊరికే ఒక చాకలి ఒక మాట అన్నట్టు చూపించినా ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ చాకలి పాత్రను, అతని భార్య పాత్రను కథలో ప్రముఖంగా తీసుకువచ్చి హాస్యం పుష్కలంగా పండించి క్రమంగా కరుణరస ఘట్టంలోకి తీసుకువెళ్తారు. చిత్రదర్శకులు, సంగీత దర్శకుడు, అభినయం చేసిన నటులు అందరి ప్రతిభతో చక్కని హాస్యగీతంగా ఇది చిత్రించబడింది.

పాట ప్రారంభంలో చాకలివాడు తన భార్య ఇంట్లో లేదని ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.ఎండుమిరపకాయలు నములుతూ కోపం పెంచుకొని, తన భార్యరాగానే ఆమెను కొట్టాలని చూస్తూ ఉంటాడు. రాగానే ఎక్కడికెళ్లావు అని అడుగుతాడు. తన అప్పగారి ఇంటికి వెళ్లానని చెప్తుంది భార్య.ఆమెమాటలు నమ్మడు

. ఆమెని నరికేస్తానంటూ మీదపడతాడు. చుట్టుపక్కల అంతా చేరతారు. 

భార్యకి తల్లి,( తనఅక్కే) అత్తగారు, మామగారు వస్తారు 

అల్లుడికి సర్ది చెప్పడానికి.

"నాకు మీ పిల్ల ఇక వద్దు మీరే తీసుకుపొండి" 

అంటూ ప్రారంభిస్తాడు చాకలి.

చాకలి ఒల్లనోరి మామా నీ పిల్లని

నేనొల్లనోరి మామా నీ పిల్లని

అబ్బా నీ పిల్లా దీని మాటలెల్ల కల్లా

సంసారమంత గుల్లా

ఆ భార్యమీద అనుమానం కదూ - నేనింక నీ పిల్లని భరించలేను. అన్నీ అబద్ధాలే చెబుతుంది. నీ కూతురి మాటలు వింటే ఇక సంసారం గుల్ల అవుతుంది నాకీ భార్య వద్దు అంటాడు.

భార్య నన్నొల్లనంతవెందుకు మామయ్యా

నావల్ల నేరమేమిర అయ్యయ్యో

దయ్యమని కొడుదనా దేవతని కొడుదునా

నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా

అంటూ చాకలి భార్య భర్తను మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ' నావల్ల నేరమేమిటి' అంటూ అమాయకంగా తనకేం తెలియదని బుకాయిస్తుంది. 'నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు. నీ స్వభావం ఏమిటో, నువ్వు పెట్టే బాధలు, నీ మాటలు భరించలేకుండా ఉన్నాను. నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేనింక' అని బెదిరిస్తుంది.

చాకలి చవటకారి నాయాలా ఊరుకో

సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను

మారుమాటలాడతావ, మాయదారి గుంటా

నిను సూత్తె ఒళ్ళుమంట

కానీ అప్పటికే భార్య మీద అనుమానమే కాదు, తగిన సాక్ష్యం కూడా సంపాదించి ఉన్నాడు చాకలి.ఆమె మీద కోపం అంతా చవటకారి నాయాలా అంటూ ఒక్క తిట్టులో చూపించాడు. అంతకు ముందే ఆ ఊళ్ళో ఉన్న సూరిగాడి ఇంటిదగ్గర భార్యను చూసాడు. భార్యకి ఆ విషయం తెలియదు. అందుకే తన అక్కగారింటినుంచి వస్తున్నానని అబద్ధం చెప్పింది. తాను ఆమెను చూసానన్న విషయం చెప్పి 'మాయదారి మాటలతో ఇక నన్ను మభ్యపెట్టలేవు' అంటూ ఆమెను అసహ్యించుకొని తన కోపాన్ని చూపిస్తాడు.

మామగారు నామాటినురా బాబూ.....ఓ రల్లుడ మేనల్లుడ.... మా అప్పగోరి పిల్లడా

అయిందానికల్లరెందుకల్లుడా ఓరల్లుడ మేనల్లుడ

నీ అప్ప ముగం చూడర మా అమ్మిని కాపాడరా

ఇక మూడోమనిషి జోక్యంతో కానీ ఇది చక్కబడేలా లేని స్థితికి వచ్చిందని గ్రహిస్తాడు మామగారు. నామాటినురా బాబూ అంటూ బతిమాలుతూ ఓ అల్లుడా, మేనల్లుడా, మా అప్పగోరి పిల్లడా అంటూ తన అక్కకొడుకే అల్లుడు కనుక తమ పిల్ల తప్పు చేసినా క్షమించమని కాళ్లబేరానికి వస్తాడు. ఏదో అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఇంకా అల్లరి చేసుకుని చుట్టుపక్కలవారి మధ్య అవమానం పాలవడం ఎందుకు అని సర్దిచెప్పచూస్తాడు. అల్లుడు తనకేమో అక్క కొడుకు, మేనల్లుడు. ఆ అక్కగారి కూతుర్నే తను చేసుకున్నాడు. అంటే అల్లుడు అక్క కొడుకు, భార్యకి తమ్ముడు. ఇంత దగ్గరి బంధువు. పిల్ల తెలియకుండా తప్పుచేస్తే క్షమించడం కూడా తప్పదుమరి అని బతిమాలుతూ తమ బంధుత్వాన్ని గుర్తుచేస్తాడు.

"నేనొల్లనోరి మామా నీ పిల్లని" అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు అల్లుడు.వరుసకి బావ,మామగారు అయిన ఆ మనిషి ఎంత చెప్పినా తన పట్టుదల వదులుకోడు చాకలి. 

ఇక లాభం లేదని అక్కగారు రంగంలోకి దిగింది.

చూడూ.........తప్పేమి చేసింది తమ్ముడా

ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా

తప్పతాగి ఉన్నావు చెప్పుడు మాటిన్నావు

అప్పడగబోయింది అదీ ఒక తప్పా..ఏరా

అక్క కాబట్టి ఆప్యాయంగా ఏరా అంటూ సంబోధిస్తుంది. తన కూతురు ఇంటి దగ్గర లేకపోవడాన్ని సమర్థించుకుంటూ ఓ కారణాన్ని కల్పించింది. " అప్పు అడగడం కోసం వాడి ఇంటికి వెళ్ళింది కానీ అదీ ఓ పెద్ద తప్పులా చూపిస్తావేం" అని చనువుగా గదమాయించింది. పైగా తాగి ఉన్నావు అందుకే నీకు మంచి చెడు తెలియడం లేదు- అంటూ అల్లుడయిన తమ్ముణ్ని అక్కగా తన అధికారం చూపించింది.

అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా ఇక చాలును నీగొప్పా

నా ఆలిగుణం ఎరుగనటే........ ఏలు కోను తీసుకుపో

ఎక్కడైనా బావేకానీ వంగతోటకాడ మాత్రం కాదు -అన్నట్టు ఉన్నాడు తమ్ముడు. అప్పా ఓలప్పా అని అక్కను పిలిచి ఎన్ని చెప్పినా నా భార్య గుణం నాకు తెలుసు, నేనింక ఆమెను ఏలుకోబోయేది లేదు అని తెగేసి చెప్పాడు.

తల్లి తండ్రి చెప్పినమాటలతో భర్తలో మార్పు వస్తుందని చూసింది చాకలి భార్య. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. అంతవరకూ గట్టి స్వరంతో మాట్లాడినది కాస్తా ఇక స్వరం తగ్గించి బతిమాలడం మొదలు పెట్టింది. తాగుబోతువై నా మీద నిందలు వేస్తున్నావు. నేను సత్యమైన ఇల్లాలిని చూడు అంటూ ప్రమాణాలు చేయడం మొదలు పెట్టింది.

నీ తాగుపోతు మాటలింక మానరా

నే సత్తెమైన ఇల్లాలిని చూడరా

నేనగ్గి ముట్టుకుంటా తలమీద పెట్టుకుంటా

అంటుంది.రాముడు అనుమానించినప్పుడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అందువల్ల తానూ కూడా అలాగే చేస్తానంటుంది.

వెర్రి రాముడంటి ఓణ్ణి కానులే

గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినానులే

నువ్వగ్గిలోన పడ్డా బుగ్గిలోన పడ్డా

పరాయింట ఉన్నదాన్ని పంచచేరనిస్తానా

ఈ ఆఖరి చరణం రాముడి పాత్రపై ఒక చాకలి చేసే వ్యాఖ్యానం. ఎంత గొప్పగా రాసారో సదాశివ బ్రహ్మంగారు. తాను రాముడిలావెర్రివాడిని కాను అంటాడు. గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినాను అంటాడు. అంటే రాముడు పనికిరానివాడు, వీర్యగుణం లేనివాడు అనే కదా అర్థం. .రాముడు వఠ్ఠి తెలివితక్కువవాడని, బుద్ధిలేని పని చేసాడని, భార్య పరాయివాడిదగ్గర అన్నిరోజులు ఉన్నా తిరిగి తెచ్చుకున్నాడని ఛీత్కారంగా మాట్లాడతాడు. భార్యతో - నువ్వు సీతలాగా అగ్గిలో పడి అగ్ని ప్రవేశం చేసినా, బుగ్గిలోన పడి బూడిద అయిపోయినా సరే, పరాయి ఇంటినుంచి వచ్చినదానివి నిన్ను నా ఆశ్రయం లో ఉండనిస్తానా....ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నా ఇంట ఉంచుకోను. నిన్ను నా భార్యగా అంగీకరించను అని తెగేసి చెప్తాడు

సీతా పరిత్యాగానికి రంగం సిద్ధం అయింది. జరిగిన, జరగుతున్న విషయాలేవీ తెలియని సీతను లక్ష్మణుడు వనభూములలో వదలడం, చెప్పలేక చెప్పలేక అన్నగారి ఆజ్ఞను ఆమెకి వివరించడం, సీత హతాశురాలై మూర్ఛపోవడం, వాల్మీకి ఆశ్రమంలో చేరడం తరువాత వచ్చే కరుణరసాత్మకమైన సంఘటనలు. ముందు సీతారాముల అనురాగభరితమైన సన్నివేశాలతో శృంగార రసాన్ని ఆవెంటనే రాముడిపై చాకలివాడి వ్యాఖ్యలతో సీతా పరిత్యాగ ఘట్టానికి నాంది పలుకుతూ మధ్యలో సన్నివేశాన్ని హాస్యరసంతో చిత్రించారు. చాకలి, అతని భార్య, అక్క, బావ ఉండే ఈ ఘట్టానికి చక్కని పాత్రోచితమైన భాషతో ఈ గీతాన్ని రాసారు సదాశివబ్రహ్మంగారు.

రాముడు అంత కఠోరమైన నిర్ణయం తీసుకోవడానికి, చాకలి వాడి జీవితంలో జరిగిన సంఘటనను సామ్యంగా చూపించి, ఒక సాధారణ పౌరుడి సంభాషణ ద్వారా దానికి నాంది పలికించారు. అగ్గిలోనపడి తన ప్రవర్తనలో దోషం లేదని నిరూపించుకుంటానని భార్య అంటే, నువ్వు ఎక్కడ పడినా నాకు నువ్వు వద్దు అని చెప్పడమే కాకుండా నేను రాముడిలా వెర్రివాడిని కాదు అనిపించడం, నేను శౌర్యవంతుడిని అని చాకలివాడు చెప్పడం, తర్వాత కథలో రాముడు తీసుకునే నిర్ణయానికి మూల హేతువులు అయ్యాయి.

చక్కని పాత్రోచితమైన సంభాషణలతో హాస్యరసం పండిస్తూ,కథను ముందుకు నడిపే ప్రయోజనం కోసం సృష్టించబడి, చక్కగా నిర్వహించబడింది ఈ పాట. రచయిత మాటలతో సృష్టించిన హాస్యాన్ని తమ హావభావ విన్యాసాలతో ఎంతో చక్కగా అభినయించి పాటకి పూర్తి న్యాయం చేకూర్చారు నటీనటులందరూ. హాస్యభరితమయిన పాటల మణిహారంలో గొప్ప కాంతులీనే మణిపూస ఇది. తీసి అరవయ్యేళ్లయినా జనాదరణ తగ్గని పాట.

చిత్రం లవకుశ

పాత్రలు చాకలి తిప్పడుగా రేలంగి, అతని భార్యగా గిరిజ. మామగారుగా డా.శివరామకృష్ణయ్య .

గానం ఘంటసాల , జె.వి రాఘవులు, జిక్కి, రాణి.

Wednesday, May 10, 2017

Suvarna Sundari Songs - Hayi Hayiga - ANR,Anjali Devi

.

‘సువర్ణ సుందరి’ కి షష్టి పూర్తి.!

హాయిహాయిగా ఆమని సాగే.....
1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.”
నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది.

Tuesday, May 9, 2017

నువ్వు అచ్చం రంభలా ఉన్నావు!

ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?” కోపంగా అన్నడు భర్త

.

“నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు.

పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం 

కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు” 

అన్నిది కామేశ్వరి.

నా పరువు తియ్యకండి!

మధ్యాహ్నం భార్య భర్తలిద్దరూ 

భోజనం చేయగానే, 

భర్త తినడం అయిపోయాక 

వాష్ బేసిన్ దెగ్గరికి వెళ్లి 

ప్లేట్ కడుగుతుండగా....

.

#భార్య😡 :: నా పరువు తియ్యకండి.  🔥

మనమున్నది ఇంట్లో కాదు హోటల్ లో😡 

😂😂😂😂😂😂


Monday, May 8, 2017

జీవిత చక్రం !

ఫోటోలో మన జీవిత చక్రం సూక్ష్మం గా తెలిపారు

ఏనుగు మన పూర్వ జన్మ కర్మ

నీటి లోని సర్పాలు ముందు ముందు వచ్చే కర్మలు

చెట్టు కొమ్మ మన ప్రస్తుత జీవన కాలం

తెలువు ఎలుక ఉదయం

నలుపు ఎలుక రాత్రి

ఇలాంటి ప్రమాద కరమైన పరిస్థితులలో మనిషి పైనుంచి కింద పడుతున్న తేనె చుక్కలను రుచి చూస్తున్నాడు. అంటే కేవలం క్షణికానందం.. దేవుడు అతన్ని కాపాడడానికి చూస్తున్నాడు, కానీ దేవుడిని పట్టించుకోకుండా తేనె రుచిలను ఆస్వాదిస్తూ ఉన్నాడు

గోరింట పూచింది కొమ్మలేకుండా

గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది!

.

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు 

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 

.

సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా 

అందాల చందమామ అతనే దిగివస్తాడు


.

పడకూడదమ్మా పాపాయి మీద 

పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు 

.

పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు 

కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు 

.

గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

Saturday, May 6, 2017

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి జెంతెల్ మాన్ !

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి జెంతెల్ మాన్ !

(బాగు .. బాగు నుండి కొన్ని పంక్తులు )

.

"...నాగరికత అబ్బి, జెంటిల్ మెన్ అనగా పెద్దమనిషిఅవడానికి సర్వవిధములా పెరుగుతూన్న నన్ను ఈన ఇంతడౌన్‌రైటుగా

ఇన్సల్ట్ చేయుట చూచి ఎటులఊరుకొనుట?

దేర్‌ఫోర్ తమషా బికేమ్‌కసి. 

చదువుకోనివాడు ఏదేనాచేస్తే తప్పు.

అదే చదువుకున్నవాడు చేస్తే పామరులకి తప్పులా కనిపించినా దానిగర్భంలో గొప్పప్రిన్సిపల్ ఉందని సమర్థించి, తప్పుకాదని స్థాపించి, అదిఒకవేళ నలుగురికీ భర్జించకపోతే కాంట్ హెల్ప్ అనగా సహాయము చేయలేము అని చెప్పిపారేసినెగ్గొచ్చు...

ఐహికం..ఆముష్మికం.!

ఐహికం..ఆముష్మికం.!

(విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ' దేవతల యుద్ధం ' నుంచి) .

.

“నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు 

సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా?

ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం. 

ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? 

వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసారం పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు”

.

ఒకటి ఐహికం, రెండు ఆముష్మికం.

ఈ రెండు చెరి సగంగా మానవుడిలో .ఉంటాయి. 

పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయత్రకు కావలసిన వెల కట్టి ఆముష్మికానికి ఎక్కువ వెల కట్టింది.

ఇప్పటి సంఘం ఆముష్మికం లేనే లేదంటోంది. 

ఆముష్మికం అనేది ఎక్కడో ఉందనుకోటంలో ఉంది. 

.

ఉద్యోగస్తుల యొక్కయు పేదవాళ్ళ యొక్కయు తృప్తి లక్షణం విచారిస్తే ఆముష్మికం ఈ సృష్టిలోనే, ఈ మానవులలోనే ఉంది అని తెలుస్తుంది. ఆ అముష్మికానికి గంత బొంత తొడిగి పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలని, చేసారు. అట్లా చేయకపోతే నీవు దాని వంక చూడవని. ఈ ఐహికం కన్నా ఆ ఆముష్మికం ఎంతో బలమైనది. 

ఐహికం యొక్క బలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

నీవు ఉద్యోగస్తుడికి నిజంగా ఇచ్చేది లంచం. ఆ లంచానికి మర్యాద చొక్కా వేసి ఇస్తావు.

పేదవాడికి ఇచ్చేది దానం. దానికి మర్యాద చొక్కా లేదు. 

దయ అనేది నీ గుండెలో పుట్టాలి. పుడితే ఏది దైవం అని అంటున్నామో ఆ ఆముష్మికానికి సంబంధించిన బతుకు బతుకుతావు. 

ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు. 

ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. వాడికి నువ్విచ్చే లంచం, వాడు నీకు చేసే ఉపకారం, దాని వల్ల నీ ఆస్తిపాస్తులు సురక్షితంగా ఉండటం

ఇది ఒక లోకం. పేద వాడికి నీవిచ్చే దానం వాడు పొందే తృప్తి.

ఆ తృప్తి వల్ల వాడు నీకు మేలు కలుగవలెనని కోరటం,

దాని వల్ల ఈ దయాలోకాలలో కలిగే సంచలనం, 

ఆ సంచలనం నీకు ఈ దానానికి ప్రతి ఫలంగా 

ఏదో చెప్పరాని ఒక సుఖ హేతువుగా ప్రకాశించటం. ఇదంతా ఒక లోకం.

ఉద్యోగస్తుడికి డబ్బు ఇవ్వవు. వాడు నీకు అపకారం చేస్తాడు. పేదవాళ్ళయందు దయ చూపించవు. దానికి నీకపకారం జరుగుతుంది. నీకప్పుడూ పకారం జరుగుతుంది , ఇప్పు డూ అపకారం జరుగుతుంది. ఆ అపకారం ఎవడో చేసినట్టు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ అపకారం చేసినవాడు కనిపించడు. ఇది దాని ఫలితమని తెలియదు”

-ప్రేరణ...శ్రీమతి Mythili Abbaraju గారు

Friday, May 5, 2017

ఆ రోజులలో నిర్భయ ద్రౌపది !

-

ఆ రోజులలో నిర్భయ ద్రౌపది !

.

విరాటపర్వంలో కీచకవధ ఉపకీచకుల వధ జరిగి 

ఆవార్త దావానంలా చెలరేగింది.. 

ఊరిలోవారందరూ ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు.

.

గంధర్వులట. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఒక స్త్రీ కోసం

(సైరంద్రి అనుకుంటారు అందరు. - ద్రౌపది ఎవరికీ తెలియదు) 

ఆమె భర్తలైన గంధర్వులు కీచకుడిని ముద్దలా చేసి వింతగా చంపారట!

చేతులు, కాళ్ళు, తలా డొక్కలోకి చొప్పించి ఒక గుండ్రని అకారంలా మార్చారట! 

ఆహా ఆమె సౌందర్యం కోసం కీచకుడు ఆశించి ఇలా దిక్కుమాలిన ప్రేతంలా తయారయ్యాడు. 

పరస్త్రీ వ్యామోహం కూడదని వారించిన వినకుండా మృత్యువుని ఆహ్వానించాడు. పరస్త్రీ పొందు వలన లక్ష్మి పోతుంది,

పరస్త్రీ పొందు ఆపేక్షిస్తే ధర్మం పోతుంది, 

శక్తి పోతుంది, అష్ట సిద్దులు నశిస్తాయి, 

సర్వ శక్తులు కరిగిపోతాయి. జీవితమే అంధకారం అవుతుంది. 

కుటుంబం విచ్చిన్నమౌతున్ది. 

శత్రువులు పెరుగుతారు.

"ఎన్నాళ్లకొచ్చావె వానా......." ఆడవాళ్ళ అక్కసు !!

శుభోదయం .!

.

"ఎన్నాళ్లకొచ్చావె వానా......."

ఆడవాళ్ళ అక్కసు !!

ఓ వర్షమా!!...వాతావరణాన్ని మరీ ఇంత రొమాంటిక్ గా మార్చకు!!

మేము మునిపటిలా... హాయిగా వర్షం లో తడుసు కుంటూ...

పాటలు పాడు కుందుకు లేదు !!....

వర్షం వచ్చిందంటే చాలు మా భర్తలు మమ్మల్ని వంటింట్లో కి వెళ్లి ....

.చ్చక్కటి కాఫీ,వేడి వేడి పకోడీలు చేసి తీసుకుని రమ్మని పుర్మాయిస్తారు!!

...............................

మగవాడి మూగ భాష !!

ఓ వర్షమా!!...వాతావరణాన్ని మరీ ఇంత రొమాంటిక్ గా మార్చకు!!

మునుపటిలా ,

"చిటపట చినుకులు పడుతూ వుంటె.....చెలికాడే నా సరసన్ వుంటె..." 

పాటని వూహించుకున్దుకు కూడా మాకు పర్మిషన్ లేదు!!

...వర్షం వచ్చిందంటే చాలు మా భార్యలు మమ్మల్ని.....

మెడ మీదకి వెళ్లి , ............

..............................

....................

............................

ఆరేసిన బట్టలు ,వడియాలు అర్జెంట్ గా తెచ్చెయ్య మంటారు!!

మొట్ట మొదటి రైల్ రోడ్డు!

 మొట్ట మొదటి రైల్ రోడ్డు!

.

భారత దేశంలో మొట్ట మొదటి రైల్ రోడ్డును నిర్మించింది బ్రిటీష్ వాళ్ళు అని అంత అనుకుంటారు. కాని వాస్తవానికి, ఇండియన్ రైల్వే అసోసియేషన్ నిర్మించింది ఇద్దరు భారతీయులు. వారే జగన్నాథ్ శంకర్‌సేథ్ మరియు జంషేడ్‌జీ జీజీభోయ్. 1845లో మొదటి రైల్ ప్రయాణం ముంబై నుండి థాణే వరకు కొనసాగింది. గమ్య స్థలానికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.

నత్తలొస్తున్నాయి జాగ్రత్త! .

నత్తలొస్తున్నాయి జాగ్రత్త!

.

నత్తలొస్తున్నాయి జాగ్రత్త మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఒక సైన్సు ఫిక్షన్ నవల. 

తన ప్రదేశంలో లేని, దొరకని జంతువునో, జీవినో మనిషి తన సరదా కోసమో లేక అవసరార్థమో మరో ప్రదేశం నుంచి తెచ్చుకుంటే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికరంగా తెలిపుతుంది 

ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్త్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది.

.

కెన్యాలో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సింగ్ కి అక్కడ అందరూ బాగా ఇష్టంగా తినే రాక్షసనత్తమాంసం తినటం అలవాటవుతుంది. పదవీ కాలం ముగిశాక, ఆ దేశం నుంచి భారతదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకుంటాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 3౦౦ గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు. ఎందుకంటే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పిల్ల ఐన ఒక్కొక్క నత్తా తిరిగి వారం రోజులలోనే దేనికది స్వతంత్రంగా సంతాన ఉత్పాదక శక్తిని పొంది స్వంత ఫ్యాక్టరీని ప్ర్రారంభించేస్తాయి. కనుక ఉత్తమ్ రాక్షసనత్త జనాభా అధికం కాకుండా తన జాగ్రత్త తను పడుతూ ఉంటాడు. కానీ, ఒకసారి ఉత్తమ్ ఢిల్లీ నుంచి మదరాసుకి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఖాజిపేట దగ్గర ప్రమాదం జరిగి సింగ్ తోపాటు అతని సూటుకేసులో ప్రయాణిస్తున్న రాక్షసనత్తలు బంధవిముక్తులై వివిధ మార్గాల ద్వారా నెమ్మదిగా హైదరాబాదుకి చేరుకుంటాయి. అసలు వినాశనం ఇక మొదలవుతుంది.

పుట్టిన ప్రతి నత్తా వారం రోజులలో సంతాన సాఫల్యతా శక్తి సంపాదించుకుని తడవకి 300 గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఈ 300 గుడ్లు ఒక్క రోజులో నత్తలై వారం తిరిగేసరికల్లా (300X300) 90000 నత్తలకి ప్రాణమివ్వగలవు. అలా వాటి జనాభా అనతి కాలంలోనే చైనా జనాభాని సైతం అధిగమించి పోతుంది. ఈ నత్తలకీ ఆకలి అధికం. అది తీరనిది. వజ్రాలని కొరకలేవు తప్ప, పచ్చగడ్డి నుంచి పసిడి నగలదాకా అవి వేటినైనా స్వాహా చేసేయగలవు. పసిపిల్లలని సైతం వదిలి పెట్టకుండా కొబ్బరి ముక్కల్లా కొరికి చప్పరించేస్తాయి. ఈ జరుగుతున్న మారణహోమానికి దేశం దేశమే కంపించిపోతుంది. పరాయి దేశాలలోనూ ప్రకంపనలు మొదలవుతాయి. ఆ దేశాలు మన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటాయి. ఎయిర్ ఇండియా సంస్థ మూల పడుతుంది. ఈ నత్తలు విధ్వంసక సామ్రాట్టులవటంతో భీమా సంస్థలన్నీ దివాళా తీస్తాయి.

ఈ విలయతాండవానికి అంతం లేదా? పరిష్కరించటం ఎలా? అని తలలు బద్దలు కొట్టుకోటానికి పెద్దలు అందరూ ఓచోట చేరినపుడు, పరిశోధక పత్రికా రచయిత రఘుపతికి బల్బు వెలుగుతుంది. రాక్షసనత్తలకి జన్మస్థలమైన కెన్యా దేశంలో వీటివల్ల కించిత్తైనా బెడద లేదు. ఒకేఒక్క నత్త వల్ల దాని విధ్వంసకర సంతతి కేవలం నెల, నెలా పదిహేను రోజులలో ఒక బిలియన్ లేదా వంద కోట్ల స్థాయికి చేరుకుంటే, ఆ దేశం ప్రపంచ పటం నుండి ఎప్పుడో మాయమైపోయి ఉండేది. సృష్టిలో ఉన్న విచిత్రమైన విశిష్టత ఏమిటంటే ప్రతి అనర్థానికి ఒక సహజమైన విరుగుడు ఉంది. పాములు విపరీతంగా పెరగకుండా గద్దలు, ముంగీసలు ఉన్నాయి. అలాగే రాక్షసనత్తలకి విరుగుడు ఉండే ఉంటుంది. అది ఆ దేశానికి వెళితే కానీ తెలియదు. ఇలాంటి సహేతుకమైన ఆలోచనలతో కెన్యాదేశానికి బయలుదేరతారు రఘుపతి, జూవాలాజికల్ ప్రొఫెసర్ పాంచజన్య. పశ్చాత్తాపంతో, పాప ప్రక్షాళన కోసం వీరిని వెంబడిస్తాడు ఉత్తమ్ సింగ్. అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొన్నాక, వారికి రాక్షస నత్తలకి శత్రువైన గినాక్సిస్ నత్తలు లభిస్తాయి. వాటిని పదిలంగా భారతదేశానికి తీసుకువచ్చి రాక్షసనత్తలని సంహరించి జరుగుతున్న ఘోరాన్ని అదుపులోకి తేగలుగుతారు.

రహస్యం..... మల్లాది వెంకట కృష్ణమూర్తి చిన్నకధలు

రహస్యం.....

మల్లాది వెంకట కృష్ణమూర్తి చిన్నకధలు

ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలావాటిని సాధించాడు.

ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టుకింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరు గాలితో కూడిన వాన ఒకటి, మొదలైంది.

అలా మొదలైన వాన చాలా సేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఉన్న పొదలచాటుకు వెళ్ళాడు. తను కూర్చున్న చెట్టు మొదలుకు అంటిపెట్టుకుని, ముడుచుకు కూర్చున్నాడు. ఎంత చేసినా వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు. బాగా తడిసిపోయాడు.

వాన చాలాసేపు కురిసింది. ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటంలేదు కూడాను, అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది.

చాలాసేపు జోరుగా కురిసిన తరువాత వాన ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది. పారే వాననీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి.

ఆ సమయానికే, పశువులు కాసే పిల్లవాడొకడు, ఋషి కూర్చున్న చెట్టు ముందునుండి పోతున్నాడు. మేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను, వాడు ఊరి వైపుకు తోలుకుపోతున్నాడు. అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు. పొడిపొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకు పోతున్నాడు. పైగా అతను వానమీద ఒక మంచి జానపదాన్ని రాగయుక్తంగా పాడుతూ పోతున్నాడు, కులాసాగా.

ఋషికి ఆశ్చర్యం వేసింది.

ఆయన అనుకున్నాడు: "ఎన్ని విద్యలు నేర్చినాను, నేను? కానీ వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు. ఈ పిల్లవాడ్ని చూస్తే ఏ విద్యా నేర్చినట్లు లేడు, కానీ వానకు ఏమాత్రం తడవలేదుకదా! ఏమిటో ఆ విద్య?" అని.

ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చాడో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్లు లేదు. తెల్లవారిన క్షణంనుండీ ఆయన 'ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకు వస్తాడా' అని ఎదురుచూశాడు. అంతలోనే అబ్బాయి 'హెయ్! డ్రుర్, డ్రుర్ ర్ ర్' అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు.

ఉండబట్టలేని ఋషి అడిగాడు: "అబ్బాయీ! నిన్న జోరుగా వాన కురిసిన తరువాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా, పొడిపొడిగా ఉన్న బట్టలతో ఊరివైపుకి పోవడం నేను గమనించాను. ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వెలా ఉండగలిగావు?" అని.

పిల్లవాడు సిగ్గుపడుతూ నవ్వాడు: "ఓ అదా! ఏమీ లేదు స్వామీ! వాన వస్తుందని అనిపించగానే, గోచితప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న లొట్టి (చిన్నకుండ) లోకి దురికేశాను(అదిమి పెట్టాను). ఇక వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయిమీద బోర్లించి పెట్టేశాను. నేను వెళ్ళి చెట్టుకింద నెమర్లు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవుల నీడన కూర్చున్నాను- అంతే. నేనూ పెద్దగా తడవలేదు; నా బట్టలు అసలే తడవలేదు" అన్నాడు.

వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైన ఋషి చిరునవ్వు నవ్వాడు.

Thursday, May 4, 2017

బాపు చేతుల్లో ఝాలు వారిన బొమ్మల్లెన్నో. !

బాపు చేతుల్లో ఝాలు వారిన బొమ్మల్లెన్నో. !

.

.ఏ రూపం దిద్దుకున్న, ప్రతి బొమ్మకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

చాల మటుకు, బొమ్మలు నవ యవ్వనంలో చక్కటి శరీర పౌష్టవంతో ఉంటాయి.

అన్నిటికన్నా ముఖ్యమ్ బొమ్మ ఆరణాల తెలుగు ఆడపడుచులా ఉంటుంది.

ప్రతి బొమ్మ తనకు తానే సాటి అన్నట్టుగా ఉంటుంది. 

అన్ని బొమ్మలు కూడా ఒకే రేఖతో గీసినట్టుగా ఉంటాయి.

అందుకే బాపు, బాపునే . బాపు బొమ్మలకే జీవం వస్తే 

ఎంత బాగుంటాయో కదా అనిపిస్తాయి.

Wednesday, May 3, 2017

పోతనామాత్యుని ... శ్రీమహాలక్ష్మి !

పోతనామాత్యుని ... శ్రీమహాలక్ష్మి !

.

హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం

దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా

మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా

సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్

.

ప్రతిపదార్థం: హరికిన్, పట్టపురాణి, పున్నెముల, ప్రోవు, అర్థంబు, పెన్నిక్క, చందురు, తోబుట్టువు, భారతీ, గిరి, సుతలతోన్, ఆడు, పూబోడి, తామరలందు, ఉండెడి, ముద్దరాలు, జగముల్, మన్నించున్, ఇల్లాలు, భాసురతన్, లేములు, బాపు, తల్లి, సిరి, ఇచ్చున్ నిత్య కళ్యాణముల్

భావం: 

విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి, 

చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది, 

తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతో దారిద్య్రాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి... 

మాకు నిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక.

కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.! .

కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.!

.

నిజంగా కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా. జగన్నాటక సూత్రధారి ముందు ఎవరి నాటకాలు మాత్రం చెల్లుతాయి చెప్పండి. ఈ విషయాన్ని మన తిమ్మన్న

వారు బాగుగా గ్రహించారు. అందుకే.... పారిజాత పుష్పం విషయంలో... శ్రీకృష్ణున్ని తన్నే దాకా వచ్చింది మన సత్యభామ. ఆ వెంటనే శ్రీకృష్ణుడి చేత ఈ పద్యం చదివించారు...

..

నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా

చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!

.

"నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా, నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు? ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా! మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ బతిమాలుకుంటున్నాను. అలకమాను" అని ఈ పద్యం అర్థం.

.

అంత వరకూ బాగానే ఉంది. చివర్లో అరాళ కుంతలా... అంటూ సంభోదింపజేశారు. 

అసలు ఇక్కడ సన్నివేశం ఏంటి.... ఈ సమయంలో... దట్టమైన కురులు కలదానా....

అని సంబోధించాల్సిన అవసరమేంటి.... అక్కడే ఉంది కిటుకంతా. 

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని... కాళ్ళు అందబుచ్చుకున్న కన్నయ్య.... 

జుట్టు అందుకోవడానికి బయలు దేరాడు అన్నదే ఈ పద్యంలోని అంతరార్ధం. 

అన్నన్నా.... కన్నయ్య ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చెయ్యకపోతే.... 

పదియారు వేలమంది గోపికలతో... అష్టభార్యలతో వేగి ఉంటాడో కదా..

Monday, May 1, 2017

వచ్చెను నీ కోసమే .. వగలు తెచ్చెను నీ కోసమే

శుభరాత్రి !

.

వచ్చెను నీ కోసమే .. 

వగలు తెచ్చెను నీ కోసమే 

అందుకో అందుకో అందాల రాజా!

(ఒక పాత సినిమా పాట.)

సినిమా పేరు చెప్పండి ?