ఉత్తరకుమారుడు!

ఉత్తరకుమారుడు!

.

"భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన

గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్ర్తాస్త్ర జా 

లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా 

ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే .

.

ఈ పద్యం విరాటపర్వం,చతుర్ధాశ్వాసంలో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్నిచూసి భయ భ్రాంతుడైన సందర్భంలోది.

.

గుక్కతిప్పకుండా చక్కటి ఉచ్చారణతో ఈ పద్యం చదివితే ,

పద్యం తాలూకు వాచ్యార్ధం పూర్తిగా తెలియకముందే ,

ఈ పద్యానికి మూలభావం మనకు స్ఫురిస్తుంది.

ఆ మూలభావం గొప్ప అబ్బురంతో , అడ్మిరేషన్ తో కూడిన భయం.

.

“శస్త్రాస్త జా లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు” అనేసరికి ,

.

ఆ మేఘగర్జనలాంటి సమాసపు ప్రౌఢ గంభీర శబ్ద సౌందర్యానికి అబ్బురపడతాం.అంటే వాచ్యార్ధం స్ఫురించే లోపే

మూలభావన-రూట్ ఫీలింగ్ మన అనుభూతిలోకి వస్తుంది.

ఇది ఆ పద్యం/కవి గొప్పదనం . అంతేకాక యుద్ధభూమి పై వ్రాసిన పద్యం ”శార్దూలం”లో వ్రాయటం లో కూడా చక్కటి ఔచితి వుంది.

.

నా చిన్నప్పుడు మాకు తెలుగు ఎంతబాగా వచ్చో పరీక్ష చేయటానికి మా నాన్నగారు ఈ పద్యపాదాలు డిక్టేట్ చేసి తప్పులులేకుండా రాయగలమో లేదో చూసేవారు .

(చిత్రం- చందమామ-ఆచార్యాగారు .)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!