Monday, August 31, 2015

ఆరుద్ర - కూనలమ్మ పదాలు

ఆరుద్ర - కూనలమ్మ పదాలు

.

‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన “కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. 

కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర.

ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! 

కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. 

.

కొన్ని కూనలమ్మ పదాలు

.

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ !

.

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంతృప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ !

.

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రథమ్ము

ఓ కూనలమ్మ !

.

సగము కమ్యూనిస్ట్

సగము కాపిటలిస్ట్

ఎందుకొచ్చిన రొస్టు

ఓ కూనలమ్మ !

.

అరుణబింబము రీతి

అమర నెహ్రు నీతి

ఆరిపోవని జ్యోతి

ఓ కూనలమ్మ !

.

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ !

.

తమిళం గురించి -

తమలములు నములు

దవళతో మాట్లాలు

తానెవచ్చును తమిళు

ఓ కూనలమ్మా!

.

శ్రీశ్రీ గురించి -

రెండు శ్రీల ధరించి

రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ !

.

కృష్ణశాస్త్రి గురించి -

కొంతమందిది నవత

కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ !

.

బాపు గురించి -

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

... 

మహాకవి శ్రీశ్రీ మాటల్లో కూనలమ్మ పదాల ఆరుద్ర గురించి.

.

కూనలమ్మ పదాలు

వేనవేలు పదాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

లోకానికి సవాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

కోరుకున్న వరాలు

ఆరుద్ర సరదాలు

.

Sunday, August 30, 2015

Saturday, August 29, 2015

పిఠాపురం.!


పిఠాపురం.!
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."

పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. ..... ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."

పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-
"ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. .....

భగవద్గీత సారాంశం 'నారాయణుడు'


భగవద్గీత సారాంశం 'నారాయణుడు'

అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు.

స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః

భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.

"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః", ఆ భగవంతుని పై ఏర్పడ్డ ప్రేమ వల్ల మనకి ఇతరత్రమైన వాటి యంది రుచి తగ్గుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఆ భగవంతుని గురించి ఎంతేంత ఎంతెంత వింటుంటే అంతంత అంతంత తెలుస్తూ ఉంటుంది దాన్ని జ్ఞానం అంటాం. ఎంత తెలిస్తే ఆ భగవంతుని కోసం ఏదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది దాన్ని ధర్మం అంటాం. ఆ చేసేప్పుడు భగవంతునికి నచ్చేట్టు చేయాలనిపిస్తుంది అందుకు ఆయన మనకి ఏది నియమించాడో దాన్ని స్వధర్మం అంటారు. ఇలా స్వధర్మంతో ఏర్పడ్డ జ్ఞానం వల్ల వైరాగ్యంతో ప్రేమకలిగితే ఆ ప్రేమకి లభించువాడు నారాయణుడు అంటే. ఇది భగవద్గీత చెప్పేది.

"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.

జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Friday, August 28, 2015

హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః !


”హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః !
.
ఇంద్ర ధనస్సు ఉషః కాలం లోనిఆకాశ ప్రకృతే అది
.
అదే కిరీటం .కృష్ణ చతుర్దశి ,అమావాస్య ల మధ్య సంధి కాలం లో వచ్చే ఉషః కాలం
ఇలానే ఉంటుందని విజ్ఞులు తెలియ జేస్తున్నారు .
కార్తీక బహుళ చతుర్దశి సాక్షాత్తు శ్రీ దేవి స్వరూపమే .దీనినే ”రూప చతుర్దశి ”అంటారు .
కిరీటం లోని చంద్ర రేఖ ఇంద్ర చాపం లా కనీ పిస్తోంది
.కిరీటాన్ని కీర్తిస్తే ,శ్రీ దేవి ని కీర్తించి నట్లే .”హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః !

శ్రావణ పౌర్ణమి విశిష్టత!

శ్రావణ పౌర్ణమి విశిష్టత!
.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.

.
అన్నా చెల్లి అనుబంధం.రాఖి!

భారతీయ పురాణాలని అనుసరించి మృత్యు కారకుడైన యమధర్మరాజు ముంజేతికి ఆయన సోదరి యమున రాఖీ కట్టి, ఆయనని అమరుడిగా భాసిల్లమని ఆశీర్వదించడంతో ‘రక్షాబంధన’ సంప్రదా యం ఆరంభమైందని ప్రతీతి.
.
శిశుపాలిడి మరణానంతరం, శ్రీకృష్ణుడిని గాయపడిన చేతి వేలితో చూసిన ద్రౌపది తట్టుకోలేక, తన చీరె కొంగును చించి ఆయన ముంజేతికి కట్టుగా కట్టిందట.
ఆమె ప్రేమతో కరిగిపోయిన శ్రీకృష్ణుడు రాబోయే 25 సంవత్సరాల కాలంలోనే, ఆమె చేసిన సేవకి ప్రత్యుపకారం చేసి తీరుతానని మాట ఇచ్చాడట.
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, అసహాయ శూరులైన ఐదుగురు భర్తల సమక్షంలో, అక్షయ వస్త్ర ప్రదానం చేసి, ఆమె మాన సంరక్షణకి పూనుకున్న వాడు, ఆమె అపూర్వ సహోదరుడు శ్రీకృష్ణుడే.

నానబోసిన సెనగలు !


నానబోసిన సెనగలు !

.

శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలు ను...
ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు.
మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి. ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

Thursday, August 27, 2015

మరుపురాని పాత్ర ....గిరీశం!


తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్ర ....గిరీశం
నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ బురిడి కొట్టించి, చివరకు డామిట్‌! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ పెద్దమనుష్యులకు నిలువుటద్దం గిరీశం. మన వాళ్లుత్త వెధవాయిలోయ్ అంటూ స్వప్రయాజనాల కోసం ఇతరులను మోసపుచ్చి పబ్బంగడుపుకునే ఘరానా మనుష్యులకు ప్రతీక గిరీశం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు, వేడకునో, బ్రతిమాలో, నవ్వించో, ఏడ్పించో సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించి ఇతరులను లొంగపర్చుకునే లౌక్యుడు గిరీశం. గురజాడ అప్పారావు ఏ ప్రయోజనాన్ని ఆశించి కన్యాశుల్కం నాటకంలో ఈ పాత్రకు రూపకల్పన చేశాడో కానీ, ఇలాంటి మనష్యులు నేటి సమాజంలో కన్పిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు.

గిరీశం గురజాడ సృష్టించిన హాస్య పాత్ర అంటే అందరూ ఒప్పుకోక పోవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం మాటల్లో చెప్పాలంటే, “గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, మనకు ఆహ్లాదం కలిగిస్తాయి.” పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్ని ఉబలాటపడే నాటి, నేటి యువకులకు అతను ప్రతీక. అతనికి ఆర్ధిక స్తోమత లేదు. ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు. జీవనాధారంలేని గిరీశం మాటలతో మనుష్యులను మోసం చేయటం బాగా నేర్చుకున్నాడు. ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది. అందుకే “నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్” అన్నాడు అంత ధైర్యంగా. అనుకూల, ప్రతికూల పరిస్థితులను తనకు అనువుగా మలుచుకోగల నేర్పరి గిరీశం.

ఇక గిరీశం పుట్టుపూర్వోత్తరాలకు వస్తే, ఈయన స్వగ్రామం కాకినాడ. ఈయన ఎక్కడ పుట్టినా, రామచంద్రాపురం అగ్రహారంలో పింతల్లిగారి వద్ద పెరిగాడు. గిరీశం ఆంగ్లభాషను ఔపోశన పట్టినట్టు బడాయిలు పలికినా, చిన్నతనంలో మాత్రం వేదాలు, ఉపనిషత్తులు పుక్కిటపట్టారు. ఇక ఈయన వేషభాషలంటారా, తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచెకట్టు. అంతే తెల్లదనంతో మెరిసిపోయే పొడుగుచేతల షర్టు. విలాసంగా నిలబడుతూ చుట్ట కాల్చడం అతగాడి మార్కు. ఇక భాష విషయాని కొస్తే, ఆయన వాడిన కొన్ని మాటలు నేటికి ఆంధ్రుల నోటిలో నానుతైనే ఉన్నాయి. ఉదాహరణకు, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈయనగారు ధూమపానము గురించి చెప్పిన పద్యమైతే, పొగరాయుళ్లందరికీ ఆదర్శం...

కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.

లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. క్లుప్తంగా చెప్పాలంటే .. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం.
గిరీశం
నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ బురిడి కొట్టించి, చివరకు డామిట్‌! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ పెద్దమనుష్యులకు నిలువుటద్దం గిరీశం. మన వాళ్లుత్త వెధవాయిలోయ్ అంటూ స్వప్రయాజనాల కోసం ఇతరులను మోసపుచ్చి పబ్బంగడుపుకునే ఘరానా మనుష్యులకు ప్రతీక గిరీశం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు, వేడకునో, బ్రతిమాలో, నవ్వించో, ఏడ్పించో సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించి ఇతరులను లొంగపర్చుకునే లౌక్యుడు గిరీశం. గురజాడ అప్పారావు ఏ ప్రయోజనాన్ని ఆశించి కన్యాశుల్కం నాటకంలో ఈ పాత్రకు రూపకల్పన చేశాడో కానీ, ఇలాంటి మనష్యులు నేటి సమాజంలో కన్పిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు.

గిరీశం గురజాడ సృష్టించిన హాస్య పాత్ర అంటే అందరూ ఒప్పుకోక పోవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం మాటల్లో చెప్పాలంటే, “గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, మనకు ఆహ్లాదం కలిగిస్తాయి.” పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్ని ఉబలాటపడే నాటి, నేటి యువకులకు అతను ప్రతీక. అతనికి ఆర్ధిక స్తోమత లేదు. ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు. జీవనాధారంలేని గిరీశం మాటలతో మనుష్యులను మోసం చేయటం బాగా నేర్చుకున్నాడు. ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది. అందుకే “నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్” అన్నాడు అంత ధైర్యంగా. అనుకూల, ప్రతికూల పరిస్థితులను తనకు అనువుగా మలుచుకోగల నేర్పరి గిరీశం.

ఇక గిరీశం పుట్టుపూర్వోత్తరాలకు వస్తే, ఈయన స్వగ్రామం కాకినాడ. ఈయన ఎక్కడ పుట్టినా, రామచంద్రాపురం అగ్రహారంలో పింతల్లిగారి వద్ద పెరిగాడు. గిరీశం ఆంగ్లభాషను ఔపోశన పట్టినట్టు బడాయిలు పలికినా, చిన్నతనంలో మాత్రం వేదాలు, ఉపనిషత్తులు పుక్కిటపట్టారు. ఇక ఈయన వేషభాషలంటారా, తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచెకట్టు. అంతే తెల్లదనంతో మెరిసిపోయే పొడుగుచేతల షర్టు. విలాసంగా నిలబడుతూ చుట్ట కాల్చడం అతగాడి మార్కు. ఇక భాష విషయాని కొస్తే, ఆయన వాడిన కొన్ని మాటలు నేటికి ఆంధ్రుల నోటిలో నానుతైనే ఉన్నాయి. ఉదాహరణకు, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈయనగారు ధూమపానము గురించి చెప్పిన పద్యమైతే, పొగరాయుళ్లందరికీ ఆదర్శం...

కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.

లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. క్లుప్తంగా చెప్పాలంటే .. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం.

వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.!


వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.!

.
"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం. శ్రీ రంగథామేశ్వరీం


దాసీభూత సమస్త దేవ వనితాం ..లోకైక దీపాంకురాం


శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః .. బ్రహ్మేంద్ర గంగాధం


త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం.. వందేముకుందప్రియామ్"
.
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..

- స్మైలింగు ఫేసు చిన్నది !మిత్రులారా!మణి ప్రవాళశైలిలోనే ఒక చిన్న టుమ్రీ!

కం:- స్మైలింగు ఫేసు చిన్నది

పైలా పచ్చీసు మేను ఫెళ ఫెళ లాడన్

స్టైలుగ నిలచెను బస్ కై

సైలెంటయిపోవ ఆడియన్సుల హార్టుల్;
(బాపు గారి బొమ్మ.)

Wednesday, August 26, 2015

స్థానబలిమి.....గజేంద్ర మోక్షం !


స్థానబలిమి.....గజేంద్ర మోక్షం !
.
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు

బైటకుక్క చేత భంగపడును

స్థానబలిమిగాని తన బలిమి కాదయా

విశ్వదాభిరామ వినురవేమ!

నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది.
అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు.
ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ.

త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు. ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివంతమైన తొండముతో చుట్టి విసిరివేసి చంపగలదు. కానీ నీటిలోని మొసలి గజేంద్రుని కంటే బలమైనది. అది గజరాజుని చీల్చి, తోకతో కొట్టి బాధించి మరణసదృశంగా చేయగలిగిందంటే అది స్థానబలంకాక మరియేమిటి?

తాను బలశాలినని గర్వపడే గజేంద్రుడు తన శక్తినంతా వినియోగించి మొసలి బారి నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. గజేంద్రుని పరివారం నిలబడి చోద్యం చూడటం తప్ప మరియేమి చేయలేకున్నాయి. మొసలి గజమును నీటిలోకి, గజేంద్రుడు మకరిని బయటకు లాగుతూ వేయి సంవత్సరములు నిర్విరామంగా పోరాడాయి. క్రమం, క్రమంగా గజేంద్రుని శక్తి క్షీణించ సాగెను.

లావొక్కింతయులేదు ధైర్వము విలోలంబయ్యె ప్రాణంబులన్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెతనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్పనితఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!

అంటూ తనను రక్షించవల్సిందిగా ఆ శ్రీహరిని శరణువేడుకున్నాడు. భక్తుని ఆర్తనాదం విన్న హరి హుటాహుటిని వచ్చి తన సుదర్శన చక్కంతో మకరిని వధించి గజేంద్రుని రక్షించాడు.

Saturday, August 22, 2015

‘లక్ష్మణదేవర నవ్వు’!

‘లక్ష్మణదేవర నవ్వు’!
_రచన: వెల్చేరు నారాయణరావు!

నవ్వు నాలుగందాల చేటన్నారు. అంటే నాలుగు విధాల అని అర్థం. ఈ నాలుగూ ఏమిటో నాకు తెలీవు. కాని పాత కుటుంబాలలో ఆడవాళ్ళు నవ్వడం తప్పుగా భావించేవారు. ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు నవ్వితే వాటికి వెంటనే తప్పు అర్థాలు వస్తాయని పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని వారించేవారు. ఆమాటకొస్తే నవ్వడం విషయంలో మొగవాళ్ళక్కూడా ఈ అదుపులు ఉన్నాయని సుమతీశతకం చదివితే తెలుస్తుంది.

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్‌
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

మొగవాళ్ళనుద్దేశించిన ఈ మాటకీ, ఆడవాళ్ళు నవ్వకూడదనే ఆ మాటకీ చిన్న తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళు నవ్వడం తప్పు. తప్పు అంటే ఆడవాళ్లుగా వాళ్ల శీలానికి కలిగే మచ్చ. మగవాళ్ళు నవ్వకపోవడం నీతి. నీతి అంటే లౌకిక వ్యవహారాల్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా తెలివితేటలుగా వ్యవహరించే పద్ధతి. అంటే లౌక్యం.

నవ్వు చాలా రకాలు: ఎవరితోనైనా కలిసి నవ్వడం, ఎవరినైనా చూసి స్నేహపూర్వకంగా నవ్వడం, వాళ్లపట్ల ఆకర్షితులై ఆ సంగతి సూచిస్తూ నవ్వడం, వాళ్ళని సంతోషపరచడానికి నవ్వడం, ఊరికే సరదాగా నవ్వడం, ఏదో చమత్కారమైన సందర్భం గుర్తువచ్చి నవ్వడం – ఇవన్నీ ఉత్సాహాన్నీ, మంచితనాన్నీ, ఆకర్షణనీ, అంతరంగాన్నీ తెలిపే నవ్వులు. ఇంకో రకం నవ్వు అవహేళన చేసే నవ్వు. ఈ రెంటికీ మధ్యనున్న తేడా చెరిగిపోయిన సందర్భాన్ని విస్తారంగా చెప్పే పాట స్త్రీల రామాయణపు పాటల్లో లక్ష్మణదేవర నవ్వు అనేది.

ఈ పాట ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు కనిపించదు. మా అమ్మో, బామ్మో ఈ పాట పాడేది అని చెప్పిన ఆడవాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఈ పాటకి నాకున్న ఆధారం అల్లా ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన స్త్రీల రామాయణపు పాటలు అనే పుస్తకంలో ఉన్న పాఠమే. ఎన్‌. వి. గోపాల్‌&కో వాళ్ళు వాళ్ళ ప్రచురణలో ఇది చేర్చలేదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి పాఠం చాలా తప్పులతో అన్వయించుకోవడం కష్టమయ్యే అపపాఠాలతో గందరగోళంగా ఉంది. దాని సవరించడానికి కానీ పరిష్కరించడానికి గానీ ఇంకా కొన్ని ఇతర పాఠాలు దొరికితే తప్ప సాధ్యం కాదు. ధైర్యం చేసి దిద్దబోతే స్వతంత్రించి పాటపాడిన కవయిత్రి భాషని ఇష్టం వచ్చినట్టు దిద్దినట్టౌతుంది. అంచేత ఉన్న పాఠం ఆధారంగానే ఈ వ్యాసం రాస్తున్నాను.

ఈ పాట పేరే చాలా కొత్తరకంగా ఉంది. దేవర అనే మాట తెలుగులో వాడుకలో లేని మాట కాదు. ఉదాహరణకి మనుచరిత్రలో ప్రవరుడి తల్లిదండ్రులను వర్ణిస్తూ, ‘దేవియుందేవరవోలె’ అన్నాడు పెద్దన, అంటే పార్వతీపరమేశ్వరులలాగా అని అర్థం. కాని, ఇక్కడ దేవర అంటే దేవుడు అనే అర్థం కాదు. దేవరన్యాయం అని మీకు తెలిసిందే ఇంకో మాట ఉంది. భర్త వల్ల సంతానం కలగకపోతే అతని తోబుట్టువు ద్వారా సంతానం కనే న్యాయం మహాభారతకథ తెలిసినవాళ్ళకి పరిచితమే. ఇక్కడ దేవర అనే మాటకి మహాభారతంలో లాగా భర్త తోబుట్టువు అని అర్థం. లక్ష్మణుడికి ఈ మాట వాడటం స్త్రీల పాటల్లోనే వుంది. మొత్తంమీద స్త్రీల పాటలు లక్ష్మణుడికి చాలా ఆప్యాయమైన ప్రాధాన్యం ఇచ్చాయని ఇంకోసారి మనకి జ్ఞాపకం వస్తుంది, ఈ పాటవల్ల.

ఇంతకీ ఈ పాట ఏమిటి? లక్ష్మణుడు తన అన్నతో, అన్న భార్యతో అడవికి వెళ్ళేటప్పుడు ఊర్మిళా తానూ ఒక ఒప్పందం చేసుకున్నారని మనకు తెలుసు. ఆ ఒప్పందానికి సంబంధించిన ఊర్మిళ కథ మనం ఊర్మిళాదేవి నిద్ర పాటలో విన్నాం. ఈ లక్ష్మణదేవర నవ్వు ఆ ఒప్పందానికి సంబంధించిన లక్ష్మణుడి కథ.

శ్రీరాముడు రావణవధ అనంతరం అయోధ్యకు చేరుకోవడంతో కథ మొదలౌతుంది. ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు, రాముడు కొలువు తీరతాడు. వేల సంఖ్యలో గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఆ గద్దెల మీద విభీషణుడు మొదలైన లంకావాసులు, సుగ్రీవుడు మొదలైన కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు అయోధ్యాపురప్రముఖులు అందరూ కూర్చున్నారు. సభ అంతా నిండుగా గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిల నవ్వుతాడు. లక్ష్మణుడు అలా నవ్వేసరికి అందరూ విస్తుపోతారు. ఎవరి మటుకి వారు ఆ నవ్వుకి వాళ్ళకి తోచిన అర్థం చెప్పుకుంటారు. జాలరివాళ్ళ అమ్మాయిని, గంగని పెళ్ళిచేసుకుని నెత్తిమీద పెట్టుకున్నానని లక్ష్మణుడు తనను చూసే నవ్వుతున్నాడనుకొని శివుడు తల వంచుకుంటాడు. ఈశ్వరుడి పెళ్ళికి అందరితో పాటు తనూ వెళ్ళగా కాలు మడత పడి క్రింద పడినప్పుడు నడుము విరిగి, ఆ వొంగిన నడుముతోటే ఈ సభకి చక్కా వచ్చినందుకు తన్నే చూసి నవ్వుతున్నాడు అని జాంబవంతుడనుకుంటాడు. అలా అనుకుని తల వంచుకుంటాడు. ఆ సభలో ఆదిశేషుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీమహావిష్ణువుకి సముద్రంలో శయ్యగా ఉండి సేవ చేసినవాడు. కాని ఇప్పుడు అతనికి పగవాడైన శివునికి సేవకుడిగా ఈ సభకి వచ్చాడు. తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడు అని అవమానభారంతో ఆదిశేషుడు తల వంచుకుంటాడు.

ఆ సభలో ఉన్న ఇంకొకడు నీలుడు. నీలుడంటే సముద్రం మీద వారధి కట్టడంలో శ్రీరాముడికి తోడ్పడిన ప్రధాన నిర్మాత. అయితే ఈ నీలుడి గురించి తెలుగుదేశంలో ఒక కథ ఉంది. అతడు చిన్నవాడుగా ఉండగా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులూ తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేసేవాడట. అవి మునిగిపోతే వెతికి తెచ్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు నానా తాపత్రయాలూ పడేవారట. ఒకరోజున ఈ అబ్బాయి తన తండ్రి పూజాసామగ్రిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేశాడట. దాంతో ఆ తండ్రి ఇకనుంచి నీవు నీళ్ళల్లో పారవేసిన ఏ వస్తువైనా మునగకుండా తేలుగాక అని వరం ఇచ్చాడట. శ్రీరాముడు వారధి కట్టించే సమయంలో కోతులు కొండలనన్నీ పట్టుకువచ్చి సముద్రంలో పడేస్తూంటే అవి మునిగిపొయేవి. ఏంచెయ్యాలో తోచక అందరూ అయోమయంలో ఉంటే నీలుడు వొచ్చి తండ్రి తనకిచ్చిన వరం ఈ అవసరానికి పనికొస్తుందనీ, తన చేతుల మీదుగా రాళ్లని సముద్రంలో వేస్తే అవి మునగవనీ, తేలతాయనీ ఆ రకంగా వారధి తేలికగా కట్టొచ్చనీ ఉపాయం చెప్తాడు. ఆ తరవాత వరసగా కోతులు కొండరాళ్ళు పట్టుకురావడం, నీలుడికివ్వడం, నీలుడు వాటిని సముద్రంలో వేసి వారధి కట్టడం జరుగుతుంది.

అయితే స్త్రీల పాటల్లో ఈ కథకి ఇంకో చిన్న మెలిక ఉంది. నీలుడు తండ్రి పూజాద్రవ్యాలని నీళ్ళలో పడేసి, అవి తేలకుండా నీళ్ళల్లో నొక్కి పట్టేవాడట. అందుకని తండ్రికి కోపం వచ్చి, నువ్వు నీళ్ళల్లో పడేసే ఏ వస్తువూ కూడా ఇక మునగకుండా ఉండుగాక అని శపిస్తాడు. ఆ మాట నీలుడు రాముడికి చెప్పలేదు. తండ్రి ఇచ్చిన శాపాన్ని వరంగా మార్చి అబద్ధం చెప్పాడు నీలుడు. ఆ సంగతి తెలిసి లక్ష్మణుడు నవ్వుతున్నాడని అవమానపడి నీలుడు తలవంచుకుంటాడు. ఆ సభలో ఉన్న అంగదుడు, లక్ష్మణుడు తనని చూసే నవ్వుతున్నాడనుకుంటాడు. తన తండ్రిని చంపిన రామునికి తాను ఈవేళ సేవకుడయ్యాడు అది ఎంత అవమానం. అలాగే సుగ్రీవుడు కూడా. తన అన్న వాలిని అన్యాయంగా రాముని చేత చంపించి, ఆ అన్న భార్యని తన భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడీ సుగ్రీవుడని తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు. విభీషణుడు దాచుకున్న రహస్యం కూడా ఒకటుంది. తన అన్న ఆయువుపట్లు రహస్యంగా రాముడికి చెబుతాడు విభీషణుడు. ఆ రకంగా తన అన్నని చంపించి లంకారాజ్యానికి తాను రాజైనానని లక్ష్మణుడికి తెలుసు. ఇక హనుమంతుడున్నాడు. అంత బలవంతుడు, గొప్పవాడు, ఒక చిన్నవాడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికిపోయాడు. ఆ అవమానపు కథ లక్ష్మణుడికి తెలుసు. అంచేత తన్ను చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు.

ఇకపోతే సీత, లక్ష్మణుడు తనని గురించే నవ్వుతున్నాడనుకునే సందర్భంలో ఈ కింది చరణాలు కొంచెం తికమకగా ఉన్నాయి.

కారడవిలో దశకంఠునిచేత | పట్టుబడ్డట్టి యో సతి తొడలమీద ||
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు | అతివ యారునెలలు బాసి యీ రాజు ||
ప్రాణములు యెట్లుండెయో కోమలాంగీ | ఆడరాని మాటలాడి తివనుచూ ||
ఆడవారీ మాట నమ్మరాదనుచు | తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు ||
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను |

ఈ చరణాలని –
‘కారడవిలో దశకంఠునిచేత పట్టుబడ్డట్టి ఒక సతి(ని) తొడలమీద
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు,
ఆరునెలలు యీ రాజు(ని) బాసి అతివ (నీ) ప్రాణములు యెట్లుండె(ను?)
ఓ కోమలాంగీ, ఆడరాని మాటలాడితివి అనుచూ
ఆడవారి మాట నమ్మరాదనుచు తలచి లక్ష్మణుడు నేడు తానవ్వెననుచు
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను’
అని సవరించుకుని చదివితే వొచ్చే తాత్పర్యార్థం ఇది:

కారడవిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ల మాటలు నమ్మకూడదు.

ఈ రకమైన వూహలు మనస్సులో పెట్టుకుని, తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడనుకుంది సీత.

సీత తలవంచుకోవడం చూసి రాముడు కూడా చిన్నబోతాడు. ఇంతకాలంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నాను, అయినా ఈవేళ ఈ విపరీతమేమిటి అని, లక్ష్మణుడు సభలో నవ్వినందుకు అతని తల తెగవేస్తానని రాముడు కత్తి ఎత్తుతాడు. సభలోని వాళ్ళంతా ఆయన్ని అడ్డుకుంటారు. మహారాజా, లక్ష్మణుడు చిన్నవాడు, అతని తల నరకడం న్యాయం కాదు అని రాముణ్ణి ఆపుతారు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, ‘ఓ వీరుడా, శూరుడా, తమ్ముడా, సభలో ఎందుకు నవ్వావు చెప్పు’ అని.

ఇక్కడ కొన్ని చరణాలు గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. అయినా సమన్వయించుకొని చదివితే, లక్ష్మణుడు ఇలా అంటాడు. “మనం అడవులకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో మీకు నేను సేవ చేస్తూండగా, రాత్రి రెండు ఝాముల వేళ నిద్రాదేవి ఏడుస్తూ వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆవిడని నేనడిగాను, ‘నీవెవ్వరవు, ఎందుకేడుస్తున్నావు?’ అని. అప్పుడు నిద్రాదేవి తాను నిద్రాదేవిననీ, తాను అష్టదిగ్గజాలలోనూ, ఆదిఋషులలోనూ, వైకుంఠనాథునిలోనూ ఉంటాననీ. మానవులెవ్వరూ తన్ను గెలవలేరు కానీ నేను తనని నాదగ్గిరికి రానివ్వడం లేదనీ అంది. ఆమె ఆజ్ఞను తప్పించుకోవడం సాధ్యం కాదని గమనించి, ఆమెకు ముమ్మారు ప్రక్షిణం చేసి ‘నేను మా అన్నకి, వదినకి ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నన్ను వదిలి నా భార్య ఒక్కత్తే ఉన్నది. ఆవిడ రాత్రీపగలూ లేవకుండా ఆవిడని ఆవహించు. మళ్ళా మేం తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు, రాముడూ, ఆయన సేనలూ మంత్రులూ కొలువై ఉంటారు. అప్పుడు నన్ను ఆవహించు’ అని ఆమెకు విన్నవించాను. ఆమాట ప్రకారం, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది” అని లక్ష్మణుడు సమాధానం చెబుతాడు. తాను చేసిన పాపానికి పరిహారమేమిటని రాముడు విచారిస్తూండగా, వశిష్టుడు ఆయనతో, “అయ్యా, మీరు చేసిన పని మంచి పని కాదు. దానికి పరిహారంగా లక్ష్మణుడికి మీరు కాళ్లు పట్టాలి,” అంటాడు. రాముడు ఆ మాటకి సంతోషించి, సేవకులని పిలిచి లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడు.

ఆ తరవాత దాదాపు పదహారు చరణాలు ఆ పక్క వర్ణన. ఆ పక్కమీద మల్లెలూ, చామంతులూ, పారిజాతాలూ, కనకరత్నాలు, కలవపువ్వులూ, జాజిపువ్వులూ అన్ని పరిచి, మొగలిపూరేకుల తలగడలు పెట్టి అందంగా ఏర్పాటు చేస్తారు. అంగదుడూ, హనుమంతుడూ, సుగ్రీవుడూ ఆ పక్క చూసి, ఆ సొంపు చూడడానికి రెండుకళ్ళు చాలవని ఆశ్చర్యపోతారు. తన పాదాల వద్ద అలిసిపోయి పడి ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు ఎత్తి పక్కమీద పడుకోబెడతాడు. ఊర్మిళాదేవి తలంటుపోసుకుని, పీతాంబరం కట్టి, నగలు పెట్టుకుని, పైట జారుతూండగా వారచూపులు చూస్తూ భర్త దగ్గిరికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించి, నువ్వు రావడానికి ఇది సమయం కాదు అంటాడు. తరవాత లక్ష్మణుడు నిద్రపోతాడు. అలా చాలాసేపు నిద్రపోతూంటే, ఏమిటి తమ్ముడు ఇంతసేపు నిద్రపోతున్నాడని, రాముడు హనుమంతుణ్ణి పంపుతాడు: ఊర్మిళతో సరసాలాడుతున్నాడా, జలక్రీడలాడుతున్నాడా చూసి చెప్పమని. హనుమంతుడు వెళ్ళి వచ్చి, లక్ష్మణుడు నిద్ర పోతున్నాడు, తన దగ్గిర ఎవ్వరూ లేరు అని చెబుతాడు. అప్పుడు రాముడు, శతృఘ్నునితో సహా లక్ష్మణుడి పడకగదిలోకి వచ్చి పక్క మీద కూర్చుని, తమ్ముడి పాదాలు తన తొడమీద పెట్టుకుని కాళ్ళు పట్టడం ప్రారంభిస్తాడు. నిద్రలో ఉన్న లక్ష్మణుడు కలగంటున్నా ననుకుంటాడు. తీరా కళ్ళు తెరిచి అది కల కాదు నిజమే, ఆ కాళ్ళు పట్టేవాడు శ్రీరాముడని చూసి, లేచి ఆయన పాదాలమీద పడతాడు. “నేను మీ పాదాలు వొత్తవలసిన వయసు వాణ్ణి. సమస్తదేవతలూ మీ పాదాలు పట్టుకుంటారు. అహల్యను పవిత్రురాలిని చేసిన పాదాలు మీవి. బలి శిరస్సు మీదనున్న పాదాలు మీవి. నా పాదాలు మీరు పట్టడం తగదు.” అంటాడు లక్ష్మణుడు. తన పాదాలమీది పడిన లక్ష్మణుణ్ణి రాముడు లేవనెత్తి కనక సింహాసనం మీద కూర్చోబెట్టి,

చంద్రుడు లేని రాత్రి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
దీపమ్ము లేనిల్లు యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
పతిలేని సతి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
ఉదకమ్ములేని కలశ మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||
చిలుకలేని పంజర మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు ||

అని లక్ష్మణుడిని సభకు తీసుకొనివచ్చి, ముత్యాలగద్దె మీద కూర్చుండబెట్టి తాను రత్నసింహాసనం మీద కూర్చుంటాడు.

ఇక్కడితో ఈ పాట అయిపోయింది. కానీ అచ్చుపుస్తకంలో ఈ పాట ఇంకో పాటతో కలిసిపోయి ఇంకా దీర్ఘంగా సాగుతుంది.

ఇంతకీ ఈ పాటవల్ల మనకి తెలిసేదేమిటి? ఇందులో భాష, మాటల వాడుక, చరణాలు కూర్చే తీరు ఇవన్నీ చూస్తూంటే, ఇది స్త్రీలు పాడుకునే పాటే కాకుండా, ఎవరో స్త్రీ రాసిన పాట కూడా అని తెలుస్తుంది దురదృష్టవశాత్తూ, రకరకాల అనాదరణలు కారణంగా అచ్చులో గజిబిజిగా వచ్చింది. అయినా, పాటలో అర్థం బోధపరచుకోడానికీ అది పెద్ద అడ్డంకి కాదు. అందుకని, ఈ పాట ఉద్దేశించిన సంగతుల్ని బోధపరచుకోవడానికి ప్రయత్నిద్దాం.

నవ్వు నాలుగందాల చేటు అనే మాట వల్ల ఎక్కువగా తమ సంతోషాలని అణగదొక్కుకుని లోపలుండే నవ్వుల్ని పెదవుల అంచుల దగ్గరే ఆపేసి ఉంచుకోవలసిన ఆడవాళ్ళు నవ్వు గురించి రకరకాలుగా ఊహించిన పాట ఇది. దాంతో పాటు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ప్రపంచంలో చాలామంది నవ్వుని ఎందుకు వెంటనే అపార్థం చేసుకుంటారో మనకి నవ్వొచ్చేలా చెప్పే పాట ఇది. ఇంకొంచెం ముందుకెళితే ప్రపంచంలో అందరూ, దేవుళ్ళ దగ్గరి నించీ మామూలు మనుషుల దాకా పైకి నిబ్బరంగా కనిపించే వాళ్ళే కానీ, లోపల ప్రతి వాళ్ళకీ ఏదో ఒక లొసుగు ఉంది. ఆ లొసుగు, ఎవరికీ తెలీదనుకుని బతికేస్తూంటారు కానీ, అది తెలిసిపోయిందనే అనుమానం వస్తే వాళ్ళు గాలి తీసిన బుడగల్లా ముడుచుకుపోతారు. ఈ ప్రపంచపు తరహా అది. ఈ సంగతి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు అని చెప్పే పాట కూడా ఇది. వాళ్ళని నవ్వకుండా చేసే ఈ ప్రపంచం ఎందుకు నవ్వకుండా చేసిందో వాళ్ళ కర్థమయిందని మరీమరీ చెప్పే పాట ఇది.

ఈ పాట మొత్తం మీద లక్ష్మణుడి నవ్వు వల్ల తలవంచుకోనివాడు రాముడొక్కడే. కానీ ఆ రాముడే అందరికన్నా ఎక్కువగా తలవంచుకోవాల్సిన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి చివరికి తమ్ముడి కాళ్ళు పట్టుకోవలసిన శిక్షకి గురి అవుతాడు.

నామాట విని నవ్వండి, నవ్వు వల్ల ఏ చేటూ రాదు, ఎవరి నవ్వూ ఎవరి లోపాన్నీ చూపించదు, మీరు రకరకాల అర్థాలు చెప్పుకోకుండా మీరూ నవ్వండి. నవ్వితే అందరూ సంతోషంగా అందంగా ఉంటారు, అని చెప్పే చక్కని పాట ఇది.

మరిది లక్ష్మణుడు ఆడవాళ్ళందరికీ దగ్గిరవాడు. అతను నవ్వితే లోకమంతా నవ్వుతుంది.


Friday, August 21, 2015

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం!శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం!

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్!

రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా!

.
మహా లక్ష్మి కరుణా - రాగం మాధవ మనోహరి - తాళం ఆది , ముత్తుస్వామి దీక్షితార్!

పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ

అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని

చరణమ్
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే


తిరుమల వైభవం – అన్నమయ్యపదాలలోతిరుమల వైభవం – అన్నమయ్యపదాలలో
శ్రీశైల గరుడాచల వేంకటాద్రి
నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది.
కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలమ్
ద్వాపరే శేషశైలతే
కలౌ శ్రీ వేంకటాచలమ్
నామాని యుగభేదేన
శైలస్యాస్య భవంతి హి.
కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు.
కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ ||
వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ
శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ ||
సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ
నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ
ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ ||
వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ ||
అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు.
అదివో అల్లదిగో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము ||
అదె వెంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు డదెమ్రొక్కు డానందమయము ||
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ||
కైవల్య పదము వేం కటనగమదివో
శ్రీవేంకటపతికి సిరలైనది
భావింప సకల సంపదరూపమదివో
పావనముల కెల్ల పావనమయము ||

విదూషకుడి విషాదం..ప్రపంచ ప్రక్యాత నటుడు .. దర్శకుడు ... శ్రీ రాజకపూర్ !


విదూషకుడి విషాదం..ప్రపంచ ప్రక్యాత నటుడు .. దర్శకుడు ...

 శ్రీ రాజకపూర్ !
.
జీవితం ఒక సర్కస్ అయితే, బాధలన్నీ గుండెమాటున దాచుకొని..
మోహంలో ఆ భావాలు కనపడకుండా రంగుపులుముకొని…
ప్రేక్షకులని నవ్వించటమే ఓ జోకర్ చేయాల్సింది.
.
అతని జీవితంతో…పేదరికంతో..బాధలలో.. దేనితోను ప్రేక్షకులని సంబంధం లేదు. ఒక్కసారి జోకర్ పాత్ర ధరించాక మనం నిజంగా ఏడ్చినా అందరూ నవ్వుతారు. ఆది లోకం తీరు
..
ప్రపంచం అనేది సర్కస్ నాటకరంగం అయితే..
ప్రతివాడు ఓ పాత్ర పోషించాల్సిందే. పుట్టేది ఇక్కడే చావాల్సింది
ఇక్కడే. ఇదే స్వర్గం ఇదే నరకం.
.

.
హాస్యం జీవిత వాస్తవాల మీద కళాకారుడు పరిచే పల్చటి తెర. అదిచిరిగిపోతే కళాకారుడి కళ్ళు వర్షిస్తాయి. అయినా ప్రేక్షకులు నవ్వుతూనే వుంటారు. అది “హాస్యం” కాదని కళాకారుడికి తెలుస్తూనే ఉంటుంది. కాని ప్రేక్శకులకి వినోదం ఒక అలవాటు. ఆ అలవాటుని కొనసాగిస్తారు.
ఇదే రాజకపూర్ కళాఖండం “మేరా నామ్ జోకర్”.

Thursday, August 20, 2015

తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు అత్తగారు !


తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు అత్తగారు !

ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది.
అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం. అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని, “దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది?
మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాలకూ, దోపిళ్లకూ వస్తూండేవాళ్లు...,” అని అమాయకత్వం వెలిబుచ్చే ‘అత్తగారు’ కేవలం భానుమతి రామకృష్ణగారి ఊహల్లోనే ఉదయిస్తారు.

కల్తీలేని భాష, భావాలు, భావనలతో తెలుగింటి అత్తగారు ఇలాగే ఉండాలని అందరూ ఆశించి, ఆకాంక్షించే అపురూప సృష్టి భానుమతి అత్తగారు. ఈ అత్తగారిలో కనబడే వ్యక్తిత్వమల్లా కాలదోషం పట్టని ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు వీటన్నింటిని పేనివుంచే చాదస్తము. ఇది వాస్తవికతకు ఎంతో దగ్గరైన ప్రాత. ప్రతి వీథిలోనూ రామాలయం ఉన్నట్లే, ప్రతీ ఇంట్లోనూ ఒక అత్తగారు తప్పనిసరి. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ఆవిడ మనస్తత్వం, కోడలిని, ఇంటిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగే నేర్పరితనం, నిమ్మకాయెంతో, ఆవకాయా అంతే, ఆవెంతో గేదంతే అనుకునే అజ్ఞానం, అమాయకత్వం వెరసి ‘అత్తగారు.’

బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం. వీటికి మారురూపే ‘అత్తగారు.’

అన్ని నాకే తెలుసనే ధీమా, తాను చేసే ప్రతి పని (నిర్వాకం) పై గట్టి నమ్మకం. అవి బెడిసి కొడితే తన తప్పును తాను ఒప్పుకోవటమేమిటి? విడ్డూరం. అసలు తాను తప్పు చేస్తే కాదా, తన చుట్టూ ఉన్న వాళ్లు చేతకాక తప్పులు చేస్తారు. తనదే తప్పని రుజువైతే, మొహం దాటేయడం తనకేం కొత్తకాదు. ఇహ ఆవిడ వంట చేస్తే వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం ఆ బ్రహ్మతరంకాదు. అయితే, ఆవిడకు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలు అంటే మహా ఇష్టం. అవి వండి, ప్రియమైన వారికి వడ్డించి వారిని దడిపించటం అంటే మరీ ఇష్టం. ఆవిడలో చాదస్తం, ఆచారలపట్ల మక్కువ కాస్త ఎక్కువైనా, ప్రేమకు ఆచారంలేదనే సహృదయం గల నిండు మనిషి.

ఇక ఆవిడ కాస్త మెల్లగా మాట్లాడితే, తంజావూరు తంబూరా మంద్రస్థాయి అనవచ్చు, అదే గొంతు పెంచారో కలకత్తా మెయిలే, కంఠం ఎత్తి మాట్లాడినపుడు మాత్రం కందిరీగలు ఘోష పెడుతున్నట్టుంది అంతే! అవడానికి పాతకాలం మనిషైనా, జాలీ మూడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఇంటిలో కాఫీ నిల్, రేపు మీకు నో కాఫీ అంటు పొడిమాటలు ఇంగ్లీషులో అలవోకగా దొర్లించేయగలరు.

అన్నట్టు మన అత్తగారు అవడానికి ఆంధ్రా గడుసుపిండమేగాని మధురాంతకంలో పుట్టి, చెంగల్పట్టులో పెరిగారు. అందుకే ఆవిడకు అరవ సాంప్రదాయం కూడా కరతళామలకం. అంతెందుకూ ఆలయాలు, ఆచారాలు అరవ దేశంలో ఉన్నట్టు ఆంధ్రాదేశంలో ఉండవంటారు ఆవిడ. అందుకే అరవ సంవత్సరాది కూడా ఆంధ్రా స్టైల్లో ఘనంగా జరుపుకుంటారు.

ఇంతెందుకు షడ్రసోపేతమైన భోజనం చేసి తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో, భానుమతి అత్తగారిని తలుచుకుంటే అటువంటి అనుభూతే కలుగుతుందని చెప్పొచ్చు. ఉగాది పచ్చడిలో రుచుల్లా అత్తగారిలో కూడా అన్ని భావోద్రేకాలు పరిపూర్ణంగా మనకు గోచరిస్తాయి. తెలుగు సాహిత్య రంగంలో అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే సజీవమూర్తి అత్తగారి పాత్ర.

Wednesday, August 19, 2015

నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” !


నేర్చుకుందాం ..(7)...“న భూతో న భవిష్యతి” !
.
ఏదైనా గొప్ప సంఘటన జరిగి నపుడు, పెద్ద కష్టం వచ్చినపుడు, గొప్ప వ్యక్తులవిషయంలోను పై వాక్యం ‘ గతంలో కాని, భావిలో కాని లేదు’ లేక చూడ లేదు అన్న సందర్భంలో వాడుతాము
. దీనిని కవి హాస్యంగా ఒక లోభి (పిసినారి) విషయంలో చెప్పిన ‘చాటువు యిది’
.

“ కృపణేన సమో దాతా ‘ నభూతో నభవిష్యతి’/
అస్ప్రుసన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి”//
.

“ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు.
ఎలా అంటే -వాడు బ్రతికినన్నిరోజులు ఖర్చుపెట్టకుండా, ధనాన్నితాక కుండా, దాచిఉంచి
మరణించాక ఇతరులకి ఒప్ప చేపుతాడు.” అందుకనే పిసినారితో సమానమైన దాత “ భూతకాలంలో కాని, భవిష్యత్తు లో కాని” ఉండడు. అని వ్యగ్యంగా కవిచేప్పిన వాక్కు.
అందరూ అలా ఉండకుండా బ్రతికి ఉన్నపుడే దానం చేయాలి అని సుభాషితకారుడి సూచన.

Tuesday, August 18, 2015

కన్నబిడ్డలు...

కన్నబిడ్డలు

.

(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి )

.

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?

కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?

కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,

కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

* * *

లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?

కొడుకులను గంటేను కోటి లాభమ్ము.

గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.

మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,

మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

* * *

సుమ గారి పద్యం!


సుమ గారి పద్యం!

.
ఈ పద్యము చదువుటకు హృద్యముగా ఉండును కానీ నోరు తిరుగక మొదట చాలా
అవస్థ పడవలిసి వచ్చును.
మన తెలుగు టి వి లో పనిచేయు సుమ గారు
ఆవిడ మలయాళీ అయిననూ సునాయాసముగా
ఈ పద్యము చెప్తూ వుంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది.

.
అల్లసాని పెద్దన వ్రాసిన 'మనుచరిత్ర'ప్రబంధములో యిదిచాలా ప్రసిద్ధమైన పద్యము.
.

అట జని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సర ఝరీ
పటల ముహుర్ముర్లుటద భంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
కటక చరత్క రేణు కరకంపిత సాలము శీత శైలమున్
.
.

తా:--భూమిసురుడు=బ్రాహ్మణుడైన ఆ ప్రవరుడు, చని=పోయి, అటన్=అక్కడ, అంబర చుంబి=ఆకాశమును
తాకుచున్న,శిరః= పర్వత కొనలనుండి ప్రవహించు చున్న, ఝరీ పటల=సెలయేళ్ల సమూహము నుండి
ముహుర్ముర్ =మాటిమాటికీ లుటత్=దోర్లుచున, అభంగా=అడ్డులేని, తరంగ=తరగ లనెడి, మృదంగ=మద్దెలల యొక్కనిస్స్వన=ధ్వని చే, స్ఫుట=వెలువడు చున్న, నటనానుకూల=నాట్యమునకు
తగినట్టుగా,పరిఫుల్ల=పురివిప్పిన కలాప=పించములు గల ,కలాపిజాలముల్=నెమల్ల సమూహములు
కలదానిని,కటక=పర్వత మధ్య ప్రదేశమున,చరత్=సంచరించుచున్న,కరేణు=ఆడు ఏనుగుల యొక్క
కర=తొండములచే, కంపిత=కదల్చ బడిన, సాలమున్=చెట్లు కలదానిని,శీత శైలమున్=హిమవత్ పర్వతము ను, కాంచెన్=చూచెను
అట్లు ప్రవరాఖ్యుడు, ఆకాశము నంటెడు శిఖరాగ్రము నుండి దుంకుచున్నసెలయేళ్ల నుండి వచ్చు ధ్వనులు
మద్దేళ్ల మ్రోతల వలె వినబడగా పురివిప్పి యా ధ్వనికి తగినట్లుగా ఆడుచున్న నెమళ్లను,పర్వతము నడుమ నుండి ఏనుగులు తమ తొండములతో చెట్లను పట్టి లాగు తుంటే వెలువడు విచిత్ర ధ్వనులను,
ఇవన్నియు వున్న హిమవత్పర్వతమును ఎంతో ఆశ్చర్యముతో,చూచి ఆనంద పరవశు డాయెను.

అజంతా గుహలు!

అజంతా గుహలు!
.మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.
.శిల్పకళ!
గుహలను బుద్ధిజానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని మహాయాన సంప్రదాయంలో శిల్పాలుగా గోడల్లో తీర్చిదిద్దిన మురల్స్‌ రూపంలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో బుద్ధుడు, ఇతర బోధిసత్వుల జీవితాలు, జాతక కథలు చిత్రించారు. రెండో గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. దీని పైకప్పుపై ఉన్న హంసలు బారులు తీరిన చిత్రం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆనాటి ప్రజలు వాడిన పర్సులు, మఫ్లర్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చు. క్రీ.పూ. 2-7 శతాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రించినట్టుగా ఆధారాలున్నాయి. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం చూపరులకు ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

కొలువు1 (కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .)

కొలువు1

(కొలువు గూర్చి మూడు సుమతి పద్యాలు .).అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్వడిగల ఎద్దులఁ గట్టుకమడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !.ఓ సుమతీ.! సమయానికి జీతమివ్వక పోగా అవసరమొచ్చిందని అడిగినా జీతం ఇవ్వని మిడిసిపాటు గల యజమానిని సేవించడం కంటే మంచి ఎడ్ల జతను కూర్చుకొని , వ్యవసాయం చేసుకొని బ్రతకడమే ఉత్తమమైన పని..అడియాస కొలువుఁ గొలువకుగుడిమణియము సేయబొకు కుజనుల తోడన్విడువక కూరిమి సేయకుమడవినిఁ దోడరయకొంటి నరుగకు సుమతీ !.ఓ మంచి బుద్ధిగలవాడా! ఒక మాట అనుకోకుండా ఎంతో కొంత ఇస్తారులే అనో , ఎప్పటికో అప్పటికి శాశ్వతమౌతుందనో ఆశ పడి ఉద్యోగం లో చేరడం , దేవాలయాధికారిగా పెత్తనం చేయడం , చెడ్డవారి తో స్నేహం చేయడం , అడవి లో తోడులేకుండా ఒంటరి గా ప్రయాణం చేయడం అనేవి మంచివి కావు . అనగా బుద్ధిమంతుడు ఆచరించ దగ్గవి కాదు..అధరము గదలియుఁ గదలకమధరములగు భాష లుడిగి మౌనవ్రతుడౌనధికార రోగపూరితబధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !.ఓ సుమతీ ! పెదవి కదిలీ కదలనట్లు అంటే మాట వినబడీ వినబడనట్లు మాట్లాడుతూ , మౌనాన్ని పాటిస్తూ , అధికారమనే రోగము చే నిండిన అధికారిని చూడటం చెవిటి ,గుడ్డి శవాన్ని చూసినంత పాపము.x

శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!

శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!

.

అవాకులన్నీ, చవాకులన్నీ

మహారచనలై మహిలో నిండగ, ఎగబడి చదివే పాఠకులుండగ

విరామ మెరుగక పరిశ్రమిస్తూ, అహోరాత్రులూ అవే రచిస్తూ

ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు, వారికి జరిపే సమ్ మానాలకు

బిరుదల మాలకు, దుశ్శాలువలకు, కరతాళలకు ఖరీదు లేదేయ్!

అలాగే-

నేను సైతం తెల్లజుట్టుకు

నల్లరంగును కొనుక్కొచ్చాను

నేను సైతం నల్లరంగును

తెల్లజుట్టుకు రాసిదువ్వాను

యింతచేసి, యింత క్రితమే

తిరుపతయ్యకు జుట్టునిచ్చాను.

Monday, August 17, 2015

కొన్ని సరదా పేరడీలు....


కొన్ని సరదా పేరడీలు....

అక్కరకురాని బస్సును
చక్కగ సినిమాకురాక సణెగెడు భార్యన్
ఉక్కగ నుండెడు ఇంటిని
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!
.

తినదగు నెవ్వరు పెట్టిన
తిని నంతనె వెళ్లిపోక తిని తిట్టదగున్
తిని తిట్టి వెళ్లిపోయెడు
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
.

అరవదాని చీర ఆరుబారులునుండు
పార్సిపడతి చీర పదికి మించు
చీరగొప్పదైన శీలంబు గొప్పదా
విశ్వదాభిరామ వినురవేమ!
.

ఇంజనీరు కోర్సు ఇంగిలీసుననేడ్చి

ఇంటి చుట్టు కొలత నీయలేడు

బట్టి చదవుకంటె వట్టి చాకలిమేలు

విశ్వదాభిరామ వినురవేమ!

ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా – ..


17 ఆగస్టు – ఎస్. నటరాజన్ (శారద) వర్ధంతి సందర్భంగా –
..
శ్రీ ఎస్. నటరాజన్ – కలం పేరు శారద.
1924లో తమిళునాడులో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పొట్ట కూటికై 12 వ ఏట తెనాలి వచ్చి, హొటల్‌లో సర్వర్‌గా జీవితం మొదలు పెట్టాడు. మొదట తెలుగు మాట్లాడడం నేర్చుకొని, 13వ ఏట తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకొని , 22వ ఏట తెలుగులో స్వంతంగా రచనలు చేసాడు.
మూర్చరోగంతో బాధ పడుతూ, రోజంతా గొడ్డు చకిరి చేస్తూ, రాత్రి గుడ్డి కిరసనాయిల్ దీపం వెలుతురులో తెలుగులో రచనలు చేసాడు. 100 దాకా సాంఘిక, డిటెక్టివ్ కధలు, మంచీ-చెడు, అపస్వరాలు వంటి ఒక డజన్ నవలలు, ఇంకా నాటికలు, వ్యంగ్య రచనలు చేసి, కొడవటిగంటి, చలం, గోపిచంద్, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టుల మన్ననలు పొందాడు.
అనారోగ్యంతో, ఆకలి దప్పులతో జీవితాంతం పోరాడుతూ 17-08-1955 న 31 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూసాడు.
..
తెలుగు సాహితీ వీధుల్లో ఎప్పటికీ చెరిగిపోని తన పాద ముద్రలు విడిచి వెళ్ళిపోయిన తెలుగు వాడు కాని తెలుగు రచయిత ఎస్. నటరాజన్ (శారద).

. శారద రాసిన మంచి చెడు అపస్వరాలు . ఆంధ్ర పత్రికలో సేరయాలుగా వచ్చేవి ..

అపస్వరాలు విశ్వనాథ వారిని దృష్టి లో పెట్టుకొని రాసేడు అనెవారు.

మంచి చెడు లో పద్మ భాస్కర ల పాత్రలు .. విశ్వనాథ వారి చెలియలకట్ట గుర్తు చేస్తాయి .. విరి డిటెక్టివ్ నవల పలకల వెండి గ్లాసు కూడా చదివెను.. అబ్బో ఏనాటి కాలం మాట ...

విరే రాసిన ఏకాకి అసంపూర్ణం అనుకుంటా ..

వింజమూరి

Saturday, August 15, 2015

పసుపులేటి కన్నాంబ !

పసుపులేటి కన్నాంబ !
.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.
ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964 లో మే 7 వ తేదీన తుదిశ్వాస వదిలింది
‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.
(కృతజ్ఞతలు ... ప్రియ లక్ష్మి గారు ... మధురగీతాలు .)

x

ఎల్. ఆర్. ఈశ్వరి !

ఎల్. ఆర్. ఈశ్వరి !

ఎల్. ఆర్. ఈశ్వరి నేపధ్య గాయని. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్ 

కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". 

ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు. 

తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా 

ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.


ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. 

ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.


ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.


ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.సినిమాలు-పాటలు!

దొంగలున్నారు జాగ్రత్త (1958) (తొలి తెలుగు సినిమా)

జగన్నాటకం (1960)

అగ్గిపిడుగు (1964)

నవగ్రహ పూజామహిమ (1964) : నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా

పాండవ వనవాసం (1965) : మొగలి రేకుల సిగదానా (హేమమాలిని అభినయించిన పాట)

ప్రేమించి చూడు (1965)

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)

అగ్గిబరాట (1966)

ఉమ్మడి కుటుంబం (1967)

కంచుకోట (1967)

గోపాలుడు భూపాలుడు (1967)

శ్రీకృష్ణావతారం (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు

అమాయకుడు (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ

ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)

పాలమనసులు (1968)

బంగారు గాజులు (1968) : జాజిరి జాజిరి జక్కల మావా

బందిపోటు దొంగలు (1968) : గండరగండా షోగ్గాడివంటా

బాగ్దాద్ గజదొంగ (1968)

గండికోట రహస్యం (1969)

నిండు హృదయాలు (1969)

బందిపోటు భీమన్న (1969)

కథానాయిక మొల్ల (1970) : నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట)

జన్మభూమి (1970)

లక్ష్మీ కటాక్షం (1970) : అందాల బొమ్మను నేను చెలికాడ

జగత్ జెంత్రీలు (1971)

జేమ్స్ బాండ్ 777 (1971)

బస్తీ బుల్ బుల్ (1971) : ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా

దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)

నమ్మకద్రోహులు (1971) : ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది

బంగారుతల్లి (1971)

ప్రేమనగర్ (1971) : లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా

రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకో కోలా వేస్కో రమ్ము సోడా

పిల్లా-పిడుగు (1972)

బాలభారతము (1972) : బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా

భార్యాబిడ్డలు (1972) : ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ

మంచి రోజులొచ్చాయి (1972)

రైతుకుటుంబం (1972)

ఎర్రకోట వీరుడు (1973)

జీవన తరంగాలు (1973) : నందామయా గరుడ నందామయా

తాతా మనవడు (1973) : రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు

దేవుడు చేసిన మనుషులు (1973) : మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో

దేశోద్ధారకులు (1973)

ధనమా దైవమా (1973)

పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా

అల్లూరి సీతారామరాజు (1974)

నిజరూపాలు (1974)

నిప్పులాంటి మనిషి (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం

చిన్ననాటి కలలు (1975)

అంతులేని కథ (1976) : అరె ఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం

పాడిపంటలు (1976)

మన్మధ లీల (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్

దొంగల దోపిడీ (1978)

దొంగల వేట (1978)

మరో చరిత్ర (1978) : భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్

సింహబలుడు (1978) : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్

అందమైన అనుభవం (1979) : ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు

చూసొద్దాం రండి (2000) (చివరిగా పాడిన సినిమా)

ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం !

మాచిరాజు దేవీప్రసాద్ గారు శ్రీశ్రీ కవితలకు కట్టిన పేరడీలు చూడండి...
.

ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం
రహదార్ల చరిత్ర సమస్తం, దూళిధూసర పరిన్యస్తం.
రహదారి చరిత్ర సమస్తం, యాతాయత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం, పథిక వాహన ప్రయాణ సిక్తం

అంటూ కొనసాగించి –

భూంకార గర్జిత దిగ్భాగం, చక్రాంగ జ్వలిత సమస్తాంగం
రహదారి చరిత్ర సమస్తం, పైజమ్మాలను పాడుచేయడం అని చెపుతారు.

ఛందమామ కధ.! బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది?

ఛందమామ కధ.!


బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది? [భట్టి విక్రమాదిత్యుల కథ ]
.
విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు. ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు. ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు. వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు. ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి… చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి. దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు. తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు. కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు. అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’. తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు. ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు. గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది. అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు. చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు. ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది. మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు. ఇదీ కథ! అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు. [త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి. భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.] విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు. గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు. అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు. విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.


జరుక్ శాస్త్రి పేరడీలు !

-

-
జరుక్ శాస్త్రి పేరడీలు !

జరుక్ శాస్త్రి అనే జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి గారు

పేరడీకి కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.

విశ్వనాథ సత్యనారాయరణ, దేవులపల్లి, శ్రీశ్రీ ఇలా ఒకరేంటి

ఆధునిక కవులందరి కవితలకుఅలవోకగా పేరడీలు చేసి,

పేరడీలను ప్రజల నాల్కులపైకి తెచ్చారు.

మచ్చుకు శ్రీశ్రీ ‘అద్వైతాన్ని’ జరూక్ శాస్త్రి

‘విశిష్టాద్వైతం’గా ఎలా మలిచారో చూడండి.
.

ఆనందం అర్ణవమైతే

అనురాగం అంబరమైతే

అనురాగపుటంచుల చూస్తాం

ఆనందపు లోతులు తీస్తాం (శ్రీశ్రీ మహాప్రస్థానం)

.
ఆనందం అంబరమైతే

అనురాగం బంభరమైతే

అనురాగం రెక్కలు చూస్తాం

ఆనందం ముక్కలు చేస్తాం. (జరుక్ శాస్త్రి పేరడీ)

.
ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు.

జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకు

చెప్పిన పేరడీలు గమనించండి –
.

నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను

నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను

ఇంకా,
.
ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం

ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం)

కవిత్వమొక వర్కర్ బూరా (కవిత్వమొక తీరని దాహం)

ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ

(తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు)
=

.

Friday, August 14, 2015

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు!

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు!
.
మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

పాట సాహిత్యo

పల్లవి:
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి
భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 1:
వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం||

చరణం 2:
ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 3:
అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 4:
స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు


కుతుబ్‌మినార్‌!

కుతుబ్‌మినార్‌!

ఇది మొగల్‌ దివాణమా?

ప్రళయ శివ మహా శ్మశానమా?

ఇది విజయ స్తంభమా?

చలవిద్యుచ్చంద్ర చూడ దంభమా?

ఇవి జీర్ణసమాధులా?

ప్రథమగణ నివాస వీథులా?

ఇది యవన వికాసమా?

నటేశ తాండవ విలాసమా?

(బసవరాజు అప్పారావు గారు . 11-11-1932 న ,స్వాతతంత్రం పూర్వం 

రాసిన గీతం )

ఈ గీతాభావము సముద్రగంభీరము. 11వ నవంబరు తేదీని ప్రపంచములో 

అన్నిదేశాలలోనూ యుద్ధములో చచ్చినవారినీ, జయించినవారినీ కూడా స్మరించడానికి 

సభలు చేస్తారు. ఈ రోజున (11-11-1932) ఢిల్లీ రాజధానిలో ఆంగ్లేయులు 

విజయకోలాహలం చేస్తున్నారు ఆబాలగోపాలం రోజంతా. నాగుండె పీక్కునిపోయింది.

వేదన తగ్గటానికై కుతుబ్‌మీనారుకు పోతిని. అచ్చటి చిత్రము చూచి వ్రాసిందీపాట.

ఢిల్లీసామ్రాజ్య మెవరిది? ఇప్పుడు విజయకోలాహలం చేస్తున్న ఆంగ్లేయులదా? 

కుతుబుమీనారు విజయస్తంభము గట్టించిన ముసల్మానులదా? పాండవులకు అశోక

పృథ్వీరాజాదులకు వారసులైన ఆర్యులదా? ఒకప్రక్క కుతుబుమీనారు, ప్రక్కన

అశోకస్తంభము, ఒకప్రక్క ముసల్మాను మసీదు, ఖిల్లా, ఇంకొకప్రక్కన ఆర్యదేవాలయము 

దుర్గమా! పాడై రూపుమాసిపోతూవున్న ఈ వుభయదృశ్యాలపైనా పరదేశవాసులైన 

ఆంగ్లేయుల పరిపాలనా!! భావకవి సామ్రాట్టునైన నాదికాదా యీ ఢిల్లీ?

.

న మస్తే'లోనే ఉంది సమస్తమంతా.... నమస్కారం లోనే ఉంది మస్కా అంతా !


న మస్తే'లోనే ఉంది సమస్తమంతా.... నమస్కారం లోనే ఉంది 

మస్కా అంతా !
తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవంత కార్యలాభం కలగ లేదు భారతంలో. అదే ఆలస్యంగా వచ్చీ నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహం లాభించింది.
నిండు సభామధ్యంలో ఇలా దండకం చదివీ చదవంగానే ఆయనగారి అర్థాంగికీ అదే లాభం. కృష్ణ పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా?
రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలి ఘటించి నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది.
ఉన్న ఒక్క తొండంతోనే చేతనైనంత వరకూ దాసోహ పడి ఆపదల నుంచి గట్టెక్కింది గడుసు గజేంద్రం.
ఆరోగ్యాన్నిచ్చి, బంధు కృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడనే గదా సూర్యుణ్ణి భగవంతుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో పొద్దునా సాయంత్రం పడీ పడీ నమస్కారాలు చేస్తున్నాం!
మరి అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పది మందిలో గుర్తింపు తెచ్చి పెట్టే ప్రణామ యోగానికి 'లోకబాంధవ' గౌరవం ఇస్తే తప్పేమిటి?
నోబెలు పురస్కారాలే ఎవరెవరికో వస్తున్నాయి గదా ఇవాళా రేపూ?
ఎక్కడో ఉన్న సూర్యనారాయణుడి శక్తికే నిత్యం నమస్కారాలు సమర్పిస్తున్న మనం అర్హతలతో నిమిత్తం లేకుండా వెధవాయలని సైతం అధికార పదవులకు సదా చేరువులో ఉంచే చేతుల ఇంద్రజాలాన్ని మరెంతగా మన్నించాలి?
అదృష్టం. ఏ అరబ్బుల దేశంలోనో పుట్టుంటే ఖర్మ కాలి ఏ ఒసామా బిన్ లాడెన్నో కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకోవాల్సి వచ్చేది.
'దేవుడానన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు శతకోటి నమస్కారాలు! రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా..
ఎన్నేసి రకాల నమస్కారాలు మన సంస్కృతిలో!

చందామామ ..జల భూతం కధ


చందామామ
..జల భూతం కధ
చాలా రోజుల నుండీ పెద్ద పెద్ద కధలు రాస్తున్నాను కదా! రాసీ రాసీ నాకైతే ఓపిక అయిపోయింది. అందుకని కొన్ని రోజులు కొన్ని చిన్న కధలు రాయాలనే ఉద్దేశంతో నాకు ఇష్టమైన ఈ చిన్న కధను రాస్తున్నాను. ఈ కధ ఏ పుస్తకంలోనిదో చెప్పలేను కానీ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కధ అని మాత్రం చెప్పగలను.

రామాపురం అనే ఊరిలో ఉండే రాజయ్యకి ఇద్దరు కొడుకులు. రాజయ్య చనిపోగానే రాజయ్య పెద్ద కొడుకు పొలం, ఇల్లూ, గొడ్డు గోదా అంతా ఆస్తీ తీసేసుకున్నాడు. రాజయ్య రెండో కొడుకు అయిన `చిన్నతమ్ముడు’,
"అన్నా! మరి నా వాటా ఆస్తి ఏది?" అని అడుగగా,
"ఇదుగో, ఈ నారతాడు నీ వంతు ఆస్తి. ఇంక పో” అని అటక మీద ఉన్న నారతాడుని చిన్నతమ్ముడికి ఇచ్చాడు అన్న.

చిన్నతమ్ముడు చాలా మంచి వాడు అవటం వల్ల ‘సర్లే పోనీ. అన్నకి ఆస్తి అంతా తీసుకోవాలని ఉన్నట్టుంది’ అని తనకి తను సర్ధి చెప్పుకుని ఊరుకున్నాడే కానీ పంచాయితీ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు.

చిన్నతమ్ముడికి చేతి పనులు చాలా బాగా చేయడం వచ్చు. వాడు ఊరు చివర ఉన్న అడవిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నారతాడుతో వలలూ, ఉచ్చులూ అల్లుకుని వాటితోటి ఒక కుందేలుని, ఒక ఉడతని పట్టుకున్నాడు.

మళ్ళీ అదే తాడుతో ఒక సంచీ లాంటి దానిని అల్లి వాటిని ఆ సంచీలో వేసుకుని బయలుదేరాడు.

అలా నడుచుకుంటూ వెళ్ళీ వెళ్ళీ, చివరికి చిన్నతమ్ముడు ఒక చిన్న జలాశయం పక్కన కూర్చున్నాడు. వాడు అక్కడ కూర్చుని ఉండగా ఒక ఎలుగుబంటి పక్కనే ఉన్న చెట్టుపొదలోకి వెళ్ళడం చూసాడు. మళ్ళీ వాడు మెదలకుండా కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తూ చిన్నతమ్ముడు ఆ జలాశయంలోని నీళ్ళ వైపే చూడసాగాడు.

అయితే ఆ నీటిలో రెండు జలభూతాలు ఉన్నాయి. ఒక తండ్రి జలభూతం, ఒక కొడుకు జలభూతం. అయితే వాళ్ళకి అస్సలు బుర్రమాత్రం లేదు.

కొడుకు జలభూతం చిన్నతమ్ముడిని చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి
" నాన్నా, నాన్నా! ఎవరో ఒకబ్బాయి మన జలాశయం దగ్గరికి వచ్చాడు. అతను మన నీటివైపే చూస్తున్నాడు. అతని దగ్గర తాడుతో అల్లిన వలలూ, సంచులూ ఉన్నాయి. బహుశా అతను ఆ వలలతో మన నీటినంతా పట్టుకుని సంచులలో వేసి తీసుకుని వెళదాం అనుకుంటున్నట్టున్నాడు” అని చెప్పాడు.

"అవునా? అయితే చాలా ప్రమాదమే. నువ్వొక పని చేయి. అతనితో ఏదో ఒక పందెం పెట్టుకుని అతన్ని ఓడించి ఇక్కడి నుండీ పంపించేయి” అని చెప్పాడు తండ్రి జలభూతం.

ఈ కొడుకు వెళ్ళి “ఏయ్ అబ్బాయ్! ఇక్కడి నుండీ వెళ్ళిపో” అన్నాడు.

చిన్నతమ్ముడు భయపడకుండా “నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను” అన్నాడు.

"అయితే, ఒక పని చేద్దాం. మనిద్దరం ఏదైనా పందెం పెట్టుకుందాం. నేను గెలిస్తే నువ్వు ఇక్కడి నుండీ వెళ్ళిపోవాలి” అన్నాడు కొడుకు జలభూతం.

"సరే!” అన్నాడు చిన్నతమ్ముడు.

"సరే! ఇదుగో ఇక్కడున్న ఈ చెట్టుని నువ్వు నాకంటే వేగంగా ఎక్కగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓస్! ఆపనికి నేనెందుకు? నా బుజ్జితమ్ముడు చేయగలడు” అని అంటూ ఉడుతని తీసి చెట్టుమీదికి వదిలాడు చిన్న తమ్ముడు. ఉడుత ‘బ్రతుకు జీవుడా’ అనుకుని చెట్టుమీదికి పరుగు తీసింది. ఉడుతతో సమాన వేగంతో చెట్టు ఎక్కలేక కొడుకు జలభూతం ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదుగో ఇంకో పందెం. ఈ సారి పందెం ఏంటంటే నువ్వు నాకంటే వేగంగా అడవిలోకి పరిగెత్తగలవా?" అని అన్నాడు.

"ఓసోస్! ఇంతేనా దీనికి నేను ఎందుకు? నా రెండో తమ్ముడు చాలు” అని చెప్పి కుందేలుని వదిలాడు చిన్నతమ్ముడు. అది ఒక్క పరుగున అడవిలోకి పరిగెత్తింది. దానితో సమానంగా పరిగెత్తలేక కొడుకు జలభూతం మళ్ళీ ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదిగో ఇంకొక పందెం. నా అంత గట్టిగా నువ్వు ఎవరినైనా సరే పట్టుకోగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓసోస్ ఓస్! దానికి నేను ఎందుకు? నా పెద్ద తమ్ముడు అదుగో ఇందాకే ఆ చెట్టు పొదలలోకి వెళ్ళాడు. నువ్వు తన దగ్గరికి వెళ్ళు, వదలకుండా పట్టుకుంటాడు” అని చెప్పి ఎలుగు బంటి వెళ్ళిన వైపుకి చూపించాడు చిన్నతమ్ముడు.

కొడుకు జలభూతం వెళ్ళి ఆ పొదలలో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వచ్చిన కొడుకు జలభూతంన్ని ఆ ఎలుగు బంటి గట్టిగా పట్టుకుంది. వాడు దాని దగ్గరనుండీ విడిపించుకునే టప్పటికి తల ప్రాణం తోకకి ఒచ్చింది.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “వీడు సామాన్యుడి లాగా లేడు. వీడితో గొడవ పెట్టుకోవడం కంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా పంపించేయడం మంచిది. కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఈ జలాశయం విడిచి పెట్టి వెళ్ళమని అతనిని అడుగు పో” అని అన్నాడు.

కొడుకు జలభూతం వచ్చి అదే చెప్పాడు.
"సరే! అయితే ఇదుగో నా టోపీ నిండుగా డబ్బు ఇస్తే చాలు” అని చెప్పాడు చిన్నతమ్ముడు.

సరే అని చెప్పి డబ్బు తీసుకురాడానికి కొడుకు జలభూతం వెళ్ళి వచ్చే లోపల చిన్నతమ్ముడు తన టోపీకి ఒక కన్నం పెట్టి, టోపీ పట్టేటంత గుంత తవ్వాడు. అందులో తాడుతో అల్లిన ఒక సంచీ పెట్టి, పైన టోపీ పెట్టాడు. కానీ చూడడానికి మామూలుగా టోపీని నేల మీద పెట్టినట్టుగా ఉంది అంతే.

కొడుకు జలభూతం వచ్చి కొంత డబ్బుని ఆ టోపీలో వేసాడు. అయితే డబ్బంతా క్రింద ఉన్న సంచీలోకి పోయింది. కొడుకు జలభూతం ఇంకొంత డబ్బుతీసుకు వచ్చేలోపల చిన్న తమ్ముడు గుంతలో పెట్టిన సంచీలోని డబ్బుని ఇంకొక సంచీలో నింపి దాన్ని మళ్ళీ ఇందాకటి లాగానే పెట్టాడు. కొడుకు జలభూతం మళ్ళీ డబ్బు తెచ్చి పోశాడు. మళ్ళీ నిండ లేదు. అలా చిన్న తమ్ముడు తను మోయ గలిగినన్ని సంచులు నిండాక ఇక టోపీ క్రింద గుంతలో నిండిన సంచీని పెట్టాడు. దాంతో ఆప్పుడు టోపీ నిండిపోయింది. కొడుకు జలభూతం ‘హమ్మయ్యా!’ అనుకున్నాడు.

చిన్నతమ్ముడు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లూ, పొలం పుట్రా, గొడ్డూ గొదా అన్నీ ఆ డబ్బుతో కొనుక్కుని, ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపాడు.