బలవంతపు సహాయచర్యలు !


బలవంతపు సహాయచర్యలు !
.
నిర్బంధ వినోద కార్యక్రమాలు ఎన్నో చూసాం కానీ బలవంతపు సహాయచర్యలు ఇదే మొదటి సారి.!
.
‘‘మేం ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు టైర్ పంక్చర్ అయి చిన్న జర్క్ ఇచ్చింది.
ఎటు నుంచి వచ్చారో కానీ మీ అందరినీ మీ ఇళ్లకు చేర్చే బాధ్యత మాదంటే మాది అంటూ
ఎల్లో గ్యాంగ్, వైట్ గ్యాంగ్ హోరా హోరీగా కొట్టుకుంది.
బలవంతంగా కార్లలో బంధించారు. మా ఇల్లు పక్కనే ఉందని చెప్పినా వినకుండా
అవసరం అయితే ప్రత్యేక విమానంలో పంపిస్తామని పోటీ పడుతున్నారు’’
.
విశ్వంలో తెలుగు వారికి ఎక్కడేం జరిగినా సహాయం చేసే హక్కు మాదే అని నేత ఒకరు సవాల్ చేశారు. దీన్ని ఖండిస్తున్నానని మరొకాయన కత్తిపట్టుకుని వచ్చాడు.
మెడపై కత్తి పెట్టి బెదిరించి రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి.
కానీ మెడపై కత్తిపెట్టి సహాయం చేసే వాళ్లుంటారా?

మే ఐ హెల్ప్ యూ స్కీమ్ బాగా వర్కవుట్ అవుతోందని,
మన అభిమాన నాయకుడు అధికారంలోకి రావడం ఖాయం అని చానల్స్ తేల్చేశాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!