మీనాక్షి కళ్యాణం !

మీనాక్షి కళ్యాణం !

పూర్వం మధుర ప్రాంతాన్ని పాలించే మలయధ్వజ పాండ్య అనే పాలకుడు... శివపార్వతుల అనుగ్రహం పొందడానికి ఘోర తపస్సు చేయసాగాడు. అతను చేసిన తపస్సుకు మెచ్చుకుని పార్వతీదేవి ఒక చిన్న పాపరూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆ పాలకుని దగ్గరే ఆమె పెరిగి పెద్దదవుతుంది. పెద్దయిన తరువాత ఆమె ఆ నగరాన్ని పాలించసాగింది. హిందూ పురాణాల ప్రకారం... దేవుడు (శివుడు) భూమ్మీద మానవరూపంలో అవతారం ఎత్తి ఆమెను (స్త్రీ రూపంలో రాజ్యాన్ని పాలిస్తున్న పార్వతీదేవిని) పెళ్లాడుతానని వాగ్దానం చేశాడు. తను ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడం కోసం మానవుని రూపంలో వున్న దేవుడు ఆమెను పెళ్లాడుతాడు. ఈ పెళ్లిని చూడడానికి మధురై సమీపంలో, చుట్టుపక్కల వున్న గ్రామాల వారందరూ కూడా విచ్చేశారు. ఆ విధంగా జరిగిన వీరిద్దరి పెళ్లి భూమ్మీదనే అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది.

శివపార్వతుల వివాహం జరిపించడం కోసం మీనాక్షీ సోదరుడు అయిన విష్ణువు వైకుంఠం నుంచి తరలివచ్చాడు. అయితే స్వర్గలోకంలో దేవతల నాటకం కారణంగా ఇంద్ర దేవుడి వంచనకు గురయి విష్ణువు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. ఇతను రావడం ఆలస్యం కావడంతో ఆలోగా తురుప్పరాం కుండ్రంకికి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ఆధ్వర్యంలో వీరిద్దరి వివాహం జరిగిపోతుంది. ఈ విధంగా జరిగిన ఈ పెళ్లి సందర్భంగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని జరుపుకుంటారు. తరువాత నాయకరాజుల పాలనాకాలంలో తిరుమలై నాయకర్ అనే ఒక పాలకుడు ‘అళకర్ తిరువిళ’ను ‘మీనాక్షీ పెళ్లి’కి జత కుదిర్చాడు. దాంతో ఈ వేడకకు ‘చిత్తిరై తిరువిళ’గా అభివర్ణించడం జరుగుతోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!