Posts

Showing posts from June, 2018

నీతి చంద్రిక/మిత్రలాభము🚩\

Image
నీతి చంద్రిక/మిత్రలాభము🚩\ నీతి చంద్రిక రచించినవారు పరవస్తు చిన్నయ సూరి "ధన సాధన సంపత్తి లేని వారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక, కూర్మ, మృగ, మూషికనుల వలె స్వకార్యములు సాధించుకొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక, కూర్మ, మృగ, మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగ వినిపింపు" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్ప దొడంగె. లఘు పతనకము హిరణ్యకుని యొద్దకేగుట గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘుపతనక మను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతుని జూచి, "వఱువాత లేచి వీని మొగము చూచితిని, నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువదగదు. జాగుసేయక యీచోటు విడచి పోవలె" నని యత్నము సేయుచుండగా వాడా వృక్షమునకు సమీప మందు నూకలు చల్లి, వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీది నూకలు చూచి, తన తోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలు రా నిమిత్తమేమి? మన మీ నూకల కాసపడర

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷

Image
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷 🏵️ 👉🏿గంగాతీరమందు సకలసంపదలు గలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు. ఆ పట్టణమును సుదర్శనుఁడను రాజు పాలించుచుండెను. అతఁడొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా  నొక బ్రాహ్మణుఁడు క. పరువంబు కలిమి దొరతన మరయమి యనునట్టి వీనియందొకఁడొకఁడే పొరయించు ననర్థము నాఁ బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా? క. పలు సందియములఁ దొలఁచును వెలయించు నగోచరార్థ విజ్ఞానము లో కుల కక్షి శాస్త్రమయ్యది యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతి\న్‌ అని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆ పద్యములు రాజు విని చదువు లేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకులఁ దలఁచుకొని యిట్లని చింతించె: 🏵️ "తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకుల చేత మంచివాఁడనిపించుకొన్నవాఁడు బిడ్డఁడు గాని తక్కిన వాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాఁడు. అట్టివాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడు గాని తల్లికడుపు చెఱుపఁ బుట్టినవాఁడు  పుత్రుఁడు గ

🚩ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

Image
🚩ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ( ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి.) కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. 👉🏿యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.🚩 👉🏿ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది.  ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి

🚩శ్రీ రాముని అంతరంగం- 👉🏿తనకు కవల పిల్లలా? 🙏

Image
🚩శ్రీ రాముని అంతరంగం-  👉🏿తనకు కవల పిల్లలా?  🙏 🏵️ 👉🏿ఒకవైపు మణిదీపాలు, మరోవైపు కానుగ నూనెతో వెలిగించిన గాజు దీపాలు తోటలో అక్కడక్కడా కాగడాలు-వాటిని మించి గగనంలో కోటి దీపాల కాంతి ప్రసరిస్తున్న కలువలరేడు - ఎటువంటి బాధనైనా మరిపించే అందాల రాత్రి అది 👉🏿రాముడొక్కడే అక్కడ కూర్చున్నాడు. అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి. నిద్రలో ఉలిక్కిపడి లేచిన కోయిల ఒక్కసారి ‘కుహూ’ అని అరచి మళ్లీ కళ్లు మూసుకుంది. గాలికి తోటలోని పరిమళాలు ముక్కుపుటాలకు చేరుతున్నాయి. హాయిగా ఉన్న వెనె్నల-జాబిల్లి-పూల సుగంధాలు-ఆత్మీయుల అనురాగ భాషణలు ఇవేవీ అతడిని తాకలేకపోతున్నాయి. లోకంలో నూతనంగా పుత్రుడు జన్మించినపుడు ఏ తండ్రి అయినా పొందే అనుభూతిని ఇప్పుడు తాను అనుభవిస్తున్నాడు. 👉🏿తనకు కవల పిల్లలా? ఎంత సంతోషం అన్పిస్తున్నది. వైదేహి గర్భమెంత శుభప్రదమైనది. ఇద్దరు బిడ్డలకు ఒకేసారి జన్మనిచ్చినఆ వుదరాన్ని తాకే అదృష్టం తనకు లేకుండా పోయింది. అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆ

🚩అధర్వణ వేదము.......

Image
🙏 బ్రాహ్మణే నమః "🙏 🚩అధర్వణ వేదము....... 👉🏿" అధర్వణుడు అంటే , పురోహితుడు ( ఆచార్యుడు ) అని అర్థం. అధర్వణుడు అనే ఆచార్యుడు( ఋషి ) వల్ల లోకానికి ఈ మంత్రాలు తెలిసిన వేదం గనుక దీనిని ' అధర్వణ ' వేదము అన్నారు. ఈ వేదాలలో కష్టాలను పారద్రోలడానికి , శతృవులను సంహరించడానికి ఉపయోగపడే మంత్రాలు , వచన రూపంలోనూ , పద్యరూపంలోను వున్నాయి. ఈ వేదమునందు జీవుల మనుగడకు సంబంధించిన విషయాలు ; శాస్త్ర సాంకేతిక విజ్ఞానము , మరియు అనేక విషయాలు ఇందులో చెప్పనడినవి . ఇందు ఇహ లోకమునకు సంబంధించిన విషయాలు అనేకమున్నాయి . 🙏' పృథ్వీ సూక్తం ' సృష్టి. ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం ఇందులోనిదే. ఈ వేదానికయజ్ఞాల నిర్వహణను పర్యవేక్షించే ' బ్రహ్మ' ప్రతినిధి . బ్రహ్మ యను ఋత్విక్కు అవశ్యమెరుగవలసిన మంత్రాలు ఇందు ఉండుటవలన , ఈ వేదమునకు ' బ్రహ్మ వేదము ' అని కూడా పేరు. ఇందులో గల ఉపనిషత్తులలో : 1. ప్రశ్నోపనిషత్తు, 2. మాండుక్యోపనిషత్తు , 3. ముండకోపనిషత్తు ముఖ్యమైనవి. ఇతర వేదములకంటే ఈ వేదంలో శాంతి , పౌష్టిక కర్మలు ఎక్కువగా కల

ఉత్తర రామాయణంలో సీత 🌷

Image
ఉత్తర రామాయణంలో సీత 🌷 🏵️ తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు. 🚩 పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది. 👉🏿రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు 🙏“ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు.  🏵️ అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత.  నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది. 🏵️🏵️🏵️ 👉🏿రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. 🚩 ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్

సామూహిక పాపకర్మ... దుఃఖకర ప్రాకృతిక వైపరీత్యాలు.!

Image
సామూహిక పాపకర్మ... దుఃఖకర ప్రాకృతిక వైపరీత్యాలు.! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మహాభారతంలో చాలాపాపం చేసిన పెద్దలు పదిమందే. చనిపోయిన వారు లక్షమంది. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు లక్షమంది. అహంకారం, రాగద్వేషం, వీటితో ఆచరించిన సత్కర్మలు అంటే-క్రతువులు, జపతపాలు, దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క మృత్యువులోనే నశిస్తున్నాయి. ప్రకృతిని మన భౌతిక మానసిక ప్రవర్తన ద్వారా పవిత్రంగాపెట్టుకోవడం మన కర్తవ్యం. ఇటువంటి దుఃఖకర ప్రాకృతిక దుస్సంఘటనలు వెనుక మనుష్యుల వంటి కారణాలు కనబడేవి కావు. ప్రకృతిలో మానవులు చేసిన పాపకర్మ, సామూహిక పాపకర్మ వ్యాపించి ఉండడం చేత ఇట్టి వైపరీత్యాలు, సంఘ మరణాలు సంభవించవచ్చు. అంతేకాని ఇందులో ఈశ్వరుడు ఆగ్రహించాడని కాని, దయచూపలేదని కాని వ్యాఖ్యానించకూడదు. అలాగే పోయిన వ్యక్తులు వారి పాపఫలం అనుభవించారని చెప్పకూడదు. వారందరికి అప్పుడే ఆయువు తీరిందని కూడా చెప్పకూడదు. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క కర్మ ముఖ్యం కాదు. ప్రకృతిలో భౌతిక కాలుష్యం దాని ఫలము మనకి కనబడతాయి. మానవ సంఘం చేసే అసురీ స్వభావం కలిగిన నైతిక పాప కాలుష్యం యొక్క ఫలం ఇట్లా ఉంటు

తెలుగు కావ్యాలలో శ్రీ లక్ష్మీ స్తుతి🌷

Image
తెలుగు కావ్యాలలో శ్రీ లక్ష్మీ స్తుతి🌷 శ్రీ మహాలక్ష్మి నిత్యానపాయిని. నారాయణుని శ్రీ మన్నారాయణు ని చేసిన లోకమాత.మంగళ స్వరూపిణి. . ఈ చరాచర సృష్టి అంతయు శ్రీ లక్ష్మీనారాయణుల సంకల్పాధీనమని పెద్దలంటారు.. తెలుగు కావ్యాలను పరిశీలిస్తే "కేయూరబాహుచరిత్ర " రచించిన మంచెన యే కావ్యాది లో శ్రీ లక్ష్మీదేవి ని స్తుతించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అనంతరం కవిసార్వభౌముడు శ్రీనాథుడు శివరాత్రి మాహాత్మ్యం లో--  🏵️  “ మదనుగన్నతల్లి మాధవుని ఇల్లాలు బ్రతుకులెల్లఁ దాచె పట్టి చూడ ముఖ్యమైన లక్ష్మి ముమ్మడి శాంతాత్ము మందిరంబు నందు మసలు చుండు” 🏵️  🏵️  తన తొలికావ్యాల్లో లేని నూత్న సంప్రదాయాన్ని ఈ కావ్యం లో ప్రదర్శించాడు ఈశ్వరార్ఛన కళాశీలుడు. కనకాభిషేకాలు పొందిననాడు తెలియని ధనలక్ష్మి విలువను జీవన సంధ్యాసమయం లో గుర్తించిన మహాకవి శ్రీనాథుడు. 🌷 బమ్మెర పోతన భాగవత శేఖరుడు. శ్రీకైవల్యాన్ని కోరి కావ్య నిర్మాణం చేసిన కర్మయోగి. ఆయన తన భాగవతం లో కలుముల జవరాలి కి పెద్దపీటే వేశాడు. 🏵️  “ హరికిన్ బట్టపుదేవి,పున్నెముల ప్రోవర్ధంపు పెన్నిక్క, చం దురు తోబుట్టువు భారతీగి

🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹

Image
🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹 ——————————//——————————— అనగనగా ఒక ఊరు.  ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు. అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు.  నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది.  చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న  ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు. 🌈  పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ, అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు. దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది. 👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి” (చింతలు పూశాయి )అన్నాడట. 👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “  (పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట. 👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “  (రెండూ రెండే) అని అన్నాడట. ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట..... అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది........ 🌹🌹🌹🌹🌹————🌹🌹🌹——-🌹

పెద్ద బేరం ....అణాలు !🏵️

Image
🏵️ పెద్ద బేరం ....అణాలు !🏵️ 👉ధారానగరం లో ప్రజలంతా అంతో యింతో కవిత్వం చెప్పగలిగే వారుట.  ఒకసారి కాళిదాసు,దండి కవీ యిద్దరూ సాహిత్య గోష్టి చేస్తూ వుండగా వాళ్లకు తాంబూల సేవనం చెయ్యాలని పించింది.  చూసుకుంటే దండి దగ్గర సున్నం అయిపొయింది,కాళిదాసు దగ్గర తమలపాకులు లేవు. యిద్దరూ నడుచుకుంటూ ఒక దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఒక పడుచు పిల్ల దుకాణాన్ని నడుపు తున్నది.  🏵️ దండి ఆమెతో ''తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే'' అన్నాడు (ఓ పూర్ణచంద్రుని వంటి ముఖం కలదానా కొంచెం త్వరగా  సున్నం యిప్పించవమ్మా. ) 🏵️🏵️ వెంటనే కాళిదాసు ''పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్త కీర్ణ లోచనే'' (చెవుల వరకూ వ్యాపించిన విశాల నేత్రాలు గల సుందరీ బంగారు  వన్నెగల తమలపాకులు కూడా ఆ చేత్తోనే యిప్పించు.) అన్నాడు. ఆ చిన్నది ముందు కాళిదాసుకు ఆకులిచ్చి తర్వాత దండి కి సున్నమిచ్చింది.  దండి చిన్నబుచ్చుకొని ముందు నేను కదా సున్నమడిగింది మరి ముందు కాళిదాసు కెందుకు ఆకులిచ్చావు? భోజరాజు లాగా నీవు కూడా కాళిదాసు పక్షపాతివా?అన్నాడు. నిజానికి ఆ నెరజాణ కూడా కాళిదాసు

కోతికిశఖ్యమా యసుర కోటిని గెల్వగ! (దాశరథీ శతకం -- రామదాసు .)

Image
- కోతికిశఖ్యమా యసుర కోటిని గెల్వగ! (దాశరథీ శతకం -- రామదాసు .) కోతికిశఖ్యమా యసుర కోటిని గెల్వగ గెల్చేబో నిజం బాతని మేన సీతకరు డౌట దవానలుడేట్టి వింత, మా సీతపతి వ్రతామహిమ , సేవక భాగ్యము మీకటాక్షమున్ ధాతకు శఖ్యమా పొగడ ! దాశరథీ కవితాపయోనిధీ ! 🏵️🏵️🏵️🏵️ దశరథ తనయా కరుణాసముద్రా రామా ! ఒక కోతి భయంకరమయిన రాక్షసులను సంహరించుట సాధ్యమా ? అది ఏ ప్రభావముచే గెలిచేనో ? తెలియునా ? యా కోతి తోకకు అంటించిన నిప్పు చల్లగా ఉండుట ఆచ్చర్యము  గదా ? మా సీతమ్మ తల్లి పాతివ్రత్య ప్రభావము, మరియు మిమ్ము సేవించిన వారికి కలిగిన భాగ్యము , మీ కడగంటి చూపుల మహిమలు పోగడుటకు ఆ బ్రహ్మ కయినా సాద్యమా ? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🏵️నండూరి వారు “ఎంకి”🏵️

Image
🏵️నండూరి వారు “ఎంకి”🏵️ 🌷నండూరి వారు “ఎంకి”ని సృష్టించి అరవై ఏండ్లు నిండాయి.  అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.  నిండు జవ్వని-నిండు యవ్వని🌷 🏵️ ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పువుల సేరు కళ్ళెత్తితే సాలు:  రసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటె కతలూ సెప్పిందంటె కలకాలముండాలి.  అంసల్లె, బొమ్మల్లే అందాల బరిణల్లే సుక్కల్లె నా యెంకి అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు .నండూరి వారు “ఎంకి”ని సృష్టించి అరవై ఏండ్లు నిండాయి.  అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.  నిండు జవ్వని-నిండు యవ్వని ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పువుల సేరు కళ్ళెత్తితే సాలు:  రసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటె కతలూ సెప్పిందంటె కలకాలముండాలి.  అంసల్లె, బొమ్మల్లే అందాల బరిణల్లే సుక్కల్లె నా యెంకి -నండూరి వారు “ఎంకి”ని సృష్టించిరి వారు.- 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

రుక్మిణీ కల్యాణము నుండి కొన్ని పోతన గారి ఆణిముత్యాలు 🌷

Image
రుక్మిణీ కల్యాణము నుండి కొన్ని పోతన గారి ఆణిముత్యాలు 🌷 (పోతనగారి భాగవతం -దశమ స్కంధం .) 🏵️🏵️🏵️🏵️🏵️ మ. ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్ జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. 🏵️ క. బాలేందురేఖ దోఁచిన లాలిత యగు నపరదిక్కులాగున ధరణీ పాలుని గేహము మెఱసెను బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్. 🏵️🏵️ క. భూషణములు చెవులకు బుధ తోషణము లనేక జన్మదురితౌఘ విని శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్." 🏵️🏵️🏵️ ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్ 🏵️🏵️🏵️🏵️ ఉ. అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!  పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే యుంకువ చేసి కృ

ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. 🌷 ( అన్నమాచార్యుఁడు )

Image
ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. 🌷 ( అన్నమాచార్యుఁడు ) 🏵️🏵️🏵️ 👉సంకీర్తన: ఇందఱికి నభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి 🏵️ వెల లేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి క్రిందఁ జేర్చు చేయి కలికియగు భూకాంతఁ గౌగిలించిన చేయి వలనైన కొనగోళ్లవాఁడి చేయి 🏵️🏵️ తనివోక బలిచేతఁ దాన మడిగిన చేయి వొనరంగఁ భూదాన మొసఁగు చేయి మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి యెనయ నాఁగేలు ధరియించు చేయి 🏵️🏵️🏵️ పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి 🌈🌈🌈🌈 అర్థాలు: కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి। 🌷🌷🌷🌷 తాత