సామూహిక పాపకర్మ... దుఃఖకర ప్రాకృతిక వైపరీత్యాలు.!

సామూహిక పాపకర్మ... దుఃఖకర ప్రాకృతిక వైపరీత్యాలు.!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మహాభారతంలో చాలాపాపం చేసిన పెద్దలు పదిమందే.


చనిపోయిన వారు లక్షమంది.


దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు లక్షమంది.

అహంకారం, రాగద్వేషం, వీటితో ఆచరించిన సత్కర్మలు అంటే-క్రతువులు, జపతపాలు, దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క మృత్యువులోనే నశిస్తున్నాయి.

ప్రకృతిని మన భౌతిక మానసిక ప్రవర్తన ద్వారా పవిత్రంగాపెట్టుకోవడం మన కర్తవ్యం.


ఇటువంటి దుఃఖకర ప్రాకృతిక దుస్సంఘటనలు వెనుక మనుష్యుల వంటి కారణాలు కనబడేవి కావు.

ప్రకృతిలో మానవులు చేసిన పాపకర్మ,

సామూహిక పాపకర్మ వ్యాపించి ఉండడం చేత ఇట్టి వైపరీత్యాలు,

సంఘ మరణాలు సంభవించవచ్చు. అంతేకాని ఇందులో ఈశ్వరుడు ఆగ్రహించాడని కాని, దయచూపలేదని కాని వ్యాఖ్యానించకూడదు.

అలాగే పోయిన వ్యక్తులు వారి పాపఫలం అనుభవించారని చెప్పకూడదు.


వారందరికి అప్పుడే ఆయువు తీరిందని కూడా చెప్పకూడదు.

ఇక్కడ ఏ వ్యక్తి యొక్క కర్మ ముఖ్యం కాదు. ప్రకృతిలో భౌతిక కాలుష్యం దాని ఫలము మనకి కనబడతాయి.

మానవ సంఘం చేసే అసురీ స్వభావం కలిగిన నైతిక పాప కాలుష్యం యొక్క ఫలం ఇట్లా ఉంటుందని గ్రహించుకోవాలి.

కష్ట నష్టాలకి గురైన వారందరికి మన సానుభూతి చూపవలసిందే.


👉🏿

సర్వే జనాః సుఖినోభవంతు


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!