🚩అధర్వణ వేదము.......


🙏 బ్రాహ్మణే నమః "🙏


🚩అధర్వణ వేదము.......


👉🏿" అధర్వణుడు అంటే , పురోహితుడు ( ఆచార్యుడు ) అని అర్థం.


అధర్వణుడు అనే ఆచార్యుడు( ఋషి ) వల్ల లోకానికి


ఈ మంత్రాలు తెలిసిన వేదం గనుక దీనిని ' అధర్వణ ' వేదము


అన్నారు.


ఈ వేదాలలో కష్టాలను పారద్రోలడానికి , శతృవులను


సంహరించడానికి ఉపయోగపడే మంత్రాలు , వచన రూపంలోనూ ,


పద్యరూపంలోను వున్నాయి. ఈ వేదమునందు జీవుల మనుగడకు


సంబంధించిన విషయాలు ; శాస్త్ర సాంకేతిక విజ్ఞానము , మరియు అనేక


విషయాలు ఇందులో చెప్పనడినవి . ఇందు ఇహ లోకమునకు


సంబంధించిన విషయాలు అనేకమున్నాయి .


🙏' పృథ్వీ సూక్తం ' సృష్టి. ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం ఇందులోనిదే.


ఈ వేదానికయజ్ఞాల నిర్వహణను పర్యవేక్షించే ' బ్రహ్మ' ప్రతినిధి .

బ్రహ్మ యను ఋత్విక్కు అవశ్యమెరుగవలసిన మంత్రాలు ఇందు ఉండుటవలన , ఈ వేదమునకు ' బ్రహ్మ వేదము ' అని కూడా పేరు.


ఇందులో గల ఉపనిషత్తులలో :


1. ప్రశ్నోపనిషత్తు, 2. మాండుక్యోపనిషత్తు , 3. ముండకోపనిషత్తు ముఖ్యమైనవి.


ఇతర వేదములకంటే ఈ వేదంలో శాంతి , పౌష్టిక కర్మలు ఎక్కువగా కలవు.

ఈ వేదంలోని బ్రాహ్మణమునకు ' గోవధ బ్రహ్మణము ' అని పేరు.


ఈ వేదం లోని 9 శాఖలలో ప్రస్తుతము ఒక్క శాఖ మాత్రమే వున్నది.


ఒకప్పుడు ఈ అధర్వణవేదం ఉత్తర భారతంలో బాగా ప్రాచూర్యం లో


వుండేది. ప్రస్తుతంఅక్కడ ( గుజరాత్ , సౌరాష్ట్ర , నేపాల్ లలో )


బహు కొద్దిమంది మాత్రమే పారాయణం చేస్తున్నారు.


ఈ అధర్వణ. వేదమునకు ' కౌశిక ' సూత్రం వ్యవహారంలో వున్నది.


ఈ వేదమునకు ఉప వేదము -- అర్థ శాస్త్రము .


అధర్వణ వేద సూక్తులు 🙏


1. ఓ ప్రభూ! నీకు మేము భక్తుల మగుదుము గాక !

2. ఈశ్వరుడొక్కడే మరియు నిజమునకు ఒకడే కలడు.

3. పరమేశ్వరుడొక్కడే పూజకు యోగ్యుడు. మరియు స్తుతి తుల్యుడు .

4. ఆ ఈశ్వరుడు మనలను పాపములనుండి విముక్తులను చేయును 

గాక !

5. ఆత్మను తెలిసికొనినచో మనుష్యుడు మృత్యువునకు భయపడడు.

6. ఎవడు ఆ బ్రహ్మమును తెలిసికొనునో వాడు మోక్షము పొందును.

7. మేము వేదోపశయుక్తులమగుదుము గాక !

8. పుణ్యసంచయము నా గృహము యొక్క శోభను పెంచుగాక ! పాపరాశిని నేను నాశనము చేసితిని .


9. ఓ పరమాత్మా ! నన్ను బ్రహ్మ జ్ఞానులైన విద్వాంసులలో నీకు ప్రియునిగా జేయుము .

10. ప్రాణులవైపు నుండి లక్ష్యమును వీడకుము .

11. యజ్ఞ ( సత్కర్మ ) హీనుని తేజము నష్టమగును .

12. సర్వ దిశలును మాకొరకు హిత మొనర్చు గాక !

13. మేము సత్పురుషుల అభిమతానుసారముగా ప్రవర్తింతుము గాక !

14. మేము సమస్త జీవులలో యశ స్వ్యుల మగుదుము గాక

15. అవిద్యనుండి తొలగి జ్ఞానమును చేపట్టుడు.

16. యజ్ఞమే సమస్త బ్రహ్మాండమునకు సంబంధించి నట్టి నాభి స్థానము .

17. మానవుడా ! నీవు పైకి లెమ్ము. క్రిందపడకుము .

18. మనలో ఎవ్వడును ద్వేషించువాడు వుండకూడదు .

19. సమ్య క్ గతి , సమ్యక్ కర్మ , సమ్యక్ జ్ఞానము , మరియు సమ్యక్ నియమవర్తులై పరస్పర

ప్రేమతో మాటాడుకోనవలెను.

20. నన్ను పాపము , మరియు మృత్యువు బాధించ కుండు గాక !

21. మానవుడు దుఘ్దాది పదార్థములచేతను రాజ్యము చేతను వృద్ధిపొందవలెను .

22. మేము నిరోగులమై ఉత్తమ వీరుల మగుదుముగాక !

23. వున్నతి నొందుట ముందుకు నడచుట ప్రతిజీవుని లక్ష్యము.

24. బ్రహ్మచర్యమును తపోబలముచేతనే విద్వాంసులు మృత్యువును జయించిరి..

25. నా ఎడమ చేతిలో కర్మ ( పురుషార్థము ) కలదు .

26. నేను ప్రియముగా మాటలాడుదును గాక !

27. భూమి నాతల్లి నేను ఆ మాతృభూమికి పుత్రుడను .

28. మనము ( మేము ) ఋణరహితులై పరలోక మార్గముల నడతుము గాక !

29. నేను వాణితో మాధుర్యముగా మాటలాడుదును .

30. మేము బహుకాలము వరకు సూర్యుని దర్శించు చుందుము గాక !

31. ఓ మనుష్యుడా ! నీవు వృద్ధాప్యము రాకముందే చావకుము.

32. నూర్ల చేతులతో పోగు చేసి , వేల చేతులతో పంచిపెట్టుము .

33. మృత్యువు మాకు దూరమై అమృతపదము ప్రాప్తమగు గాక !

34. మా కొరకు అన్నియు కళ్యాణమయ మగుగాక !

35. బ్రహ్మ చర్యవ్రతమును తపస్సుచేత రాజు రాజ్యమును సంరక్షించును .

36. నాకు మేలు చేకూరు గాక ! మరియు ఎలాటి భయము లేకుండు గాక !

37. నాకొరకు అన్నము మేలుచేకూర్చు నట్టిదియును , రుచిగలదియు అగు గాక !

38. మానవులారా ! మీరు అందరిమధ్యలో విద్వేష మును తొలగించి సమత్వమున ప్రవర్తింపుడు .

గోవు తన బిడ్డను ప్రేమించినట్లు మీరందరూ ఒకరి నొకరు ప్రేమించుకొనుడు .

39. పుత్రుడు తండ్రి వ్రతమును , తల్లి ఆజ్ఞను పాలించువాడు కావలయును. భార్య తన పతితో

శాంతియుక్తమగు మధురవాణితో మాటలాడునది కావలయును . అన్నదమ్ములకు పరస్పర

ద్వేషముండ రాదు. అక్కచెల్లెండ్ర మధ్య ఈర్ష్య యుండరాదు. మీరందరు కలసి సమ వ్రతులై

మృదుమధురముగా మాటలాడు కొనుడు . పరస్పరము మేలగునట్లు ప్రవర్తింపుడు .

40. శ్రేష్ఠత్వము పొందుచు మీరందరూ సహ్రుదయులై కలిసి యుండుడు. ఎప్పుడును వేరు గాకుడు .

ఒకరినొకరు ప్రసన్నల జేయుచు అందరు కలిసి మీకు కలుగు గొప్పఆపదను తొలగించుకొనుడు

41. పరస్పరముగా మృదుభాషణలనే అలవరించు కొనుచు వ్యవహరించుడు . మరియు తమ అను.

రక్తులతో నిత్యమూ ఐక్యత కలిగి యుండుడు . "

॥ ఓం శాంతి శాంతి శాంతి శాంతి : ॥

॥ హరి ఓం తత్సత్ ॥


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

<<<<<>>>>>

పైన పేర్కొన్న నాలుగు వేదముల సారాంశాన్ని సంగ్రహంగా , సంక్షిప్తంగా ఈ క్రింద పేర్కొన్న

వేద పండితుల రచనలనుండి సేకరించ బడినవి .

1. కొత్తపల్లి హనుమంత రావు

2. కూచిభోట్ల వెంకట సత్యనారాయణ రావు గారు .

మరియు మూడు వేదాల సూక్తులను , " సర్వేలు " ఆశ్రమం వారు ప్రచురించిన అమృతవాహిని

అను గ్రంథమునుండి సేకరించ బడినది .


 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!