Monday, November 30, 2015

శం కరోతి ఇతి శంకరః" .....ఈశ్వర కృప.!

శం కరోతి ఇతి శంకరః" .....ఈశ్వర కృప.!

.

.

ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు.

.

అందుకే శివునికున్న పేర్లలో ప్రధానమైన పేరు 'శంకర'. "శం కరోతి ఇతి శంకరః" 

.

.

.

కామకోటికి పర్యాయ పదం 'శ'. కోటి అంటే కోటి సంఖ్య అని కాదు,

.

కోటి అంటే హద్దు అని. కామ అంటే కోర్కె.

.

కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది. 

.

.

దేని అంచైనా ఆవిడే. ఆవిడ ఇవ్వగలదు. ప్రసరణం చేయగలదు. 

.

కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు. కదలికలన్నీ ఆగిపోతే శివుడు.

.

అదీ తత్త్వం.

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

.

‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు.

ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’,

ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు.

.

ఇక్కడ "అచ్చ తెలుగంటే" ఏమిటి అన్న సందేహం కలుగకపోదు. 

సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు.

ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు. 

మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే. 

ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం..

.

అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతున్నాయి.

కిటికీ, కుర్చీ, స్టూలు, ఫ్యాన్, దర్వాజా, వరండా, రేడియో, టెప్ రికార్డర్,

అంకుల్, ఆంటీ, ఫ్రెండ్, దోస్తు, కారు, క్యాబ్, జల్దీ ఇలా చెప్పుకుంటూ పోతే సగం భాష మనది 

కాని మన భాష. స్పీడ్ పెరుగుతున్నట్టే భాషలో మార్పు కూడా అతి వేగంగా పెరుగుతోంది. 

.

కొన్నిసార్లు రాయడానికి వీలుగా భాషని మార్చేస్తాం. కొన్నిసార్లు పలకడానికి అనువుగా భాషని కుదించేస్తాం. 

ఈ పదాలు చూడండి: ముఖము ఇది మొగము, మొగం నుంచి నేటి మొహంగా మారింది. అలాగే, తేనియు – తేనే,

చిలుక – చిల్క,

కొలది – కొద్ది, 

చలిది – చద్ది, 

తరుగు – తగ్గు,

వంగకాయ – వంకాయ,

రాతి చిప్ప – రాచిప్ప,

ఫలకము – పలక, 

పీఠము – పీట. 

ఈ సద్దుబాటు కేవలం ఒక్కభాషకి పరిమితం కాదు. ఇవి చూడండి: కాగజ్ – కాగితం, కరార్ – ఖరారు, జప్త్ – జప్తు, ఖబర్ – కబురు, ఖండియా – కండువా, పహ్ర హుషార్ – పారా హుషార్, దుకాన్ – దుకాణం, జమీన్ దార్ – జమీందారు, రైల్ – రైలు, టికెట్ – టికెట్టు, కాలేజ్ – కాలేజీ, స్విచ్ – స్విచ్చు, క్లబ్ – క్లబ్బు. అకార, ఉకార, ఇకారాలను అనువుగా కలుపుకొని, ప్రతి భాషను మనదిగా చేసుకోవడం మన తెలుగు భాషకు మాత్రమే చెల్లిందేమో!


భరత ఖండంబు చక్కని పాడియావు ! .

భరత ఖండంబు చక్కని పాడియావు !

.

భరత ఖండంబు చక్కని పాడియావు

హిందువులు లేగదూడలై యేడ్చు చుండ

తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి

.

భరత ఖండం ఒక చక్కని పాడి ఆవు. 

భారతీయులు లేగదూడలు.ఏడుస్తూ ఉన్న 

ఈ లేగ దూడల మూతులు బిగగట్టి 

తెల్లవారు అనే గడుసరి గొల్లవారు పాలు పితుక్కుంటున్నారు.

భర్తృహరి సుభాషితం.

భర్తృహరి సుభాషితం.

.

ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్

భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా

హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం

ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్

.

భావం: ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు,

సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, 

కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి 

మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

బుడుగు ప్రశ్నలు ,,,

బుడుగు ప్రశ్నలు ,,, కళ్ళు మూసుకొనివాడు చెప్పిన జవాబులు.

.

కాయ కాని కాయ

.అవాబులు 

1. దీపావళికి పేల్చేది ? --------------------------------->టపాకాయ

2. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది ?----------------------.>లెంప కాయ

3. మన ప్రాణానికి అధారమైనది ?-------------------------->గుండె కాయ

4. పిల్లలు ఆడుకొనేది ?------------------------------------>గోళీ కాయ

5. ఎండాకాలం వచ్చేది?------------------------------------>చెమట కాయ

6. బడి పంతులు ఇచ్చేది ?---------------------------------->మొట్టి కాయ

7. ఎక్కువ మాటలాడేవారిని ఇలా అంటారు ?----------------->వాగుడు కాయ

8. తప్పు చేస్తే ఇది లేదంటారు ?------------------------------>తల కాయ

9. చెరువు దగ్గర తిరిగేది ?------------------------------------>ఎండ్ర కాయ

10. తల కింద ఉండేది ? ------------------------------------->మెడ కాయ

Sunday, November 29, 2015

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే

శుభరాత్రి.!
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
.
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే
.
ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి
.
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి
.
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా

.

సొగసు చూడతరమా !

సొగసు చూడతరమా !

సొగసు చూడతరమా…

సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు

ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అందమే సుమా…

సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

.

అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళ

చేజారిన దువ్వెనకు బేజారుగ వంగినపుడు

చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి

పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు

ఆ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

.

పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించికొట్టి

గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ

చెంగు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే

తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు విడువిడువంటునప్పుడు

ఆ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

.

పసిపాపకు పాలిస్తు పరవశించి ఉన్నపుడు

పెదపాపడు పాకి వచ్చి మరి నాకు అన్నపుడు

మొట్టికాయ వేసి చీ పొండి అన్నప్పుడు

నా ఏడుపు నీ నవ్వు హరివిల్లై వెలసినపుడు

ఆ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

.

సిరిమల్లెలు హరి నీలపు జడలో తురిమి

క్షణమే యుగమై వేచి వేచి

చలి పొంగులు తెలికోకల ముడిలో అదిమి

అలసొ సొలసి కన్నులు వాచి

నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో

త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…

నీ సొగసు చూడతరమా…


పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?'

పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?'

.

అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది.

.

' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.'

.

పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.'

.

' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

.

పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?'

.

' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.'

( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం"

హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం".

.

ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు. 

గురజాడ చేపట్టక పూర్వం, 

ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ.

.

ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి.

.

మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసింది గురజాడ అప్పారావు గారనే అనుకుంటాను. సాంఘిక వాస్తవికతను దర్పణంలో వలె యధాతథంగా ప్రతిబింబించిన కళాఖండం మన భాషలోనే కాదు, మరే ఇతర భారతీయ భాషల్లోనైనా మొదటిదీ, ఆఖరిదీ కన్యాశుల్కమే అనుకుంటాను. కన్యాశుల్కం నాటకాన్ని ఆ తెగలో మించడం మాట అటుంచి, ఆ దరిదాపులకైనా రాగల నాటకం మన దేశంలో ఏదైనా ఉంటే దాని సంగతి ఇంతవరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే అని మాత్రం నేననక తప్పదు.

కన్యాశుల్కంలో ఎక్కడ, 'ఎప్పుడు' ఎవరి మాటలైనా తీసుకోండి. ఇక్కడ అప్పుడు సరిగా ఆ పాత్ర ఆ మాట తప్ప మరొకటి అనడానికి వీల్లేదు. ఇది నాటక రచనకి పరాకాష్ట. గురజాడ కవి మహత్తర విజయం.

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు

నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరు

మధ్యలో నలిగే ఈ కాలం గొడవేమిటి ????????????

గుండ్రని భూమికి ధిశలేందుకు మారుతున్నాయి ??????

ఎటు వెళ్ళినా నేను వెనక్కే ఎందుకు వెళుతున్నాను ??????

జీవితాన్ని ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ జీవిస్తున్నా కూడా, 

తేడా లేదెందుకు ???????????

Friday, November 27, 2015

చాణుక్యుడు చెప్పిన సూక్తి !

చాణుక్యుడు చెప్పిన సూక్తి !

ఎక్కడ మేధావులు.. బందిపోటు దొంగలుకలత చంది అలజడి చెంది ఉంటారో

అక్కడ మంచిరాజ పాలనఉంది .. అనిఅర్ధం.

సభలలో కవిత్వం సోంపు !

సభలలో కవిత్వం సోంపు !

.

( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)

.

చెప్పఁగ వలె కప్పురములు

కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై

గుప్పిన క్రియ, విరి పొట్లము

విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్.

.

కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద 

.

కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట ! 

.

ఎంత గొప్ప కోరికో కదూ ?

శివ ధ్యాన శ్లోకాలు !....(13).

శుభరాత్రి.!
శివ ధ్యాన శ్లోకాలు !....(13).
.
"గౌరీకరామ్బుజన్యస్తస్వర్ణశైలశరాసనమ్
ఇషుహస్తం రథారూఢం నరనారీతనుం స్మరేత్:
.
గౌరీహస్తమున మేరుధనస్సు పట్టినవాడును, స్వహస్తమున బాణము దాల్చిన వాడును, రథారూఢుండు అగు అర్థనారీశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడగు శంభువు
.
ఋషి: భగవంతుడగు శంభువుx
అబ్బో..ఇస్కులో.. బాగానే..సేపుతున్నారే...x

పిల్లగాలికి ఎంత గర్వమో !

పిల్లగాలికి ఎంత గర్వమో ! 

చెలి కురులను తాకుతోందని ll

(ఈ ఫోటోలో పిల్లగాలి తగిలిన గర్వం ఎవరికంటే 

రెండు కళ్ళూ నెమలికళ్ళను చేసుకు చూస్తున్న ఓయదు ఓయరు.)

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ !

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 

సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు

శేష సాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణునాకర్ణించు వీనులు వీనులు

దేవదేవుని చింతించు దినము దినము

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ”

నిత్య సత్యాలు-ఆణిముత్యాలు.!

నిత్య సత్యాలు-ఆణిముత్యాలు.!

.

అణకువ లేకుంటే అందం కూడా వికారంగా అనిపిస్తుంది.

.

కసురుతూ మాట్లాడకు-విసుగుతో పనిచేయకు.

.

కొన్ని సందర్భాలలో మాటలు వెండి-మౌనం బంగారం

..

మనస్సు నిర్మలంగా(నిర్ మలినంగా) ఉండటమే శాంతి.

.

సంతోషంతో ప్ర్రతిపని చేసేవారికి కష్టసాధ్యం ఏమీలేదు.

.

పరచింత పతనానికి మూలము-స్వచింతన ఉన్నతికి సోపానము.

.

కోట్లకు అధిపతులైనను-ఒక్క నిముషం ఆయుష్షు కొనలేరు.

.

ఆదాయానికి మించిన ఖర్చు అప్పు చేయిస్తుంది.

.

నిర్భయతకు ఆధారం-సత్యత.

.

అపకారికి ఉపకారం చేయటమే ఉత్తమ లక్షణం.

Thursday, November 26, 2015

కొబ్బరి!

కొబ్బరి!
.
కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం.
దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉన్నది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి.
కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.
కొబ్బరి - ఆరోగ్యం..
.
ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియంను శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.
బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు
కొబ్బరి నీరు :
ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటి లో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు ,చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటి లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది
.కొబ్బరి నూనె :
.
కొబ్బరి నూనెలో యాబై శరము లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికము గా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమము గా జరుగుతుంది . కొవ్వు శాతము పెరగదు , రక్తపోటు నియంత్రణలో ఉంటుంది . కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు మంచిది . . థైరాయిడ్ సమస్యలూ ఉండవు . అందానికి : పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది , కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు , మురికి తొలగిపోతాయి . మేని ప్రకాశవంతము గా మెరుస్తుంది ... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే .. . కేశాలు కాంతి వంతము గా తాయారు చేస్తుంది .


Wednesday, November 25, 2015

కళావిలాసినీ.!

కళావిలాసినీ.!
.
చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా
లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం
కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో
దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీx

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

.

రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్

ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో

ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో

దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!


దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

.

తెల వారకుండ మొగ్గలలోనజొరబడి

వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు

అలసి పోయితివేమొ దేవాదిదేవ

ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు

కూర్చుండ మా యింట కురిచీలు లేవు

నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి

తెలుగు నాటకాలలో హాస్యం !

తెలుగు నాటకాలలో హాస్యం !

.

1880కు పూర్వం మన ఆంధ్రదేశంలో రంగస్థల ప్రదర్శనలు లేవు. అప్పట్లో ధార్వాడ్ వారు వచ్చి, తాత్కాలిక నాటక శాలలు కట్టి, అందులో హిందీ, మరాఠీ నాటకాలు ఆడేవారు.

ఒకసారి రాజమహేంద్రవరలో వాళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోయాక వాళ్ళు వదిలిన పాకలలో "కందుకూరి వీరేశలింగంపంతులు" గారు వారు రచించిన" చమత్కార రత్నావళి "అనే నాటికను ప్రదర్శించారు. ఇదే తెలుగు నాట ఆడబడిన తొలి నాటిక. ఇది హాస్య నాటిక కావడం గమనార్హం. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ.

ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు.

బ్రహ్మవివాహ విషయంలో కామయ్య తన రెండేళ్ళ వయస్సు కుమార్తెను ముసలి వాడికి పన్నెండువందల రూపాయల కన్యాశుల్కం పుచ్చుకొని పెళ్ళి చేస్తాడు. అయితే పెళ్ళికి ముందుగా వూరి పెద్దలను తను ఇలా కన్యాశుల్కం పుచ్చుకోవడం తప్పా అని అడిగితే ఒక శాస్త్రులు గారు ఏవేవో శ్లొకాలు కల్పించి, ఉదాహరణగా చెప్పి కన్యా కన్నా రెండింతలెత్తు ధనం పుచ్చుకొని పెళ్ళి చేస్తే కోటి యోగాల ఫలితం దక్కుతుందని సమర్ధిస్తారు.

కోర్టులో జరిగే అన్యాయాలను బహిర్గతం చెయ్యడమే వ్యవహార బోధిని నాటకం లక్ష్యం ఒక దళారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యాజ్యం నడిపించడానికి తలో వకీలు దగ్గరకు తీసుక్కు వెళ్ళి కమీషను పుచ్చుకుంటాడు. ప్లీడర్లు కూడా తమకు వీలయినంత సొమ్ము రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ప్రజలలో కక్షలు కావేషాలు రెచ్చగొట్టి వాళ్ళని వ్యాజ్యాలకి పురిగొలిపి మధ్య దళారులు ప్లీడర్లు ఎలా బాగుపడతారో, ఈ అసాంఘిక కార్యక్రమాలను పంతులుగారు తాము వ్రాసిన ఇరవై హాస్య నాటకాలలో చూపించారు.

వీరి సమకాలీనులైన"వేదం వెంకట్రాయ శాస్త్రి" గారు "ప్రతాపరుద్రీయం" అనే హాస్య మిళితమైన నాటకం వ్రాసి ప్రదర్శించారు. ఇందులో పదగత, వాక్యగత, సన్నివేశగత హాస్యం చిందులేస్తూవుంటుంది. పేరిగాడి పాత్ర సహజసిద్ధమైన రూపం, అతని కట్టుబొట్టులో ఆటలో, పాటలో, మాటలో అన్నిటిలోను సిసలైన జాతీయత వుట్టిపడుతుంది.

"చిలకమర్తి లక్ష్మీనరసింహం' గారు కూడా "వీరేశలింగం 'గారి ఫక్కీనే ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ ఇరవైహాస్య నాటికలు రచించారు. వీరు వ్రాసిన బలవంతపు భ్రాహ్మణార్ధం నాటికలో ఒక కరణంకు తన తల్లి తద్దినం ఎప్పుడో తెలియదు. పురోహితుడు వచ్చి ఆరోజే అని చెప్పగానే అయ్యో ఉదయాన్నే మొహమైనా కడుక్కోకుండా చద్దివన్నం వుల్లి ఆవకాయ వేసుకొని తిన్నానే ఎలా? అంటే తమరు మొహం కడుక్కోకుండా తిన్నారు కనుక అది నిన్నటి లెఖ్ఖలోకి వస్తుంది అని సర్ది చెప్పి వెట్టి వాణ్ణి పంపించి వూరి చివర కాపుకాసి దారిని పోతున్న బ్రాహ్మణున్ని రెండవ భోక్తగా బలవంతాన రప్పిస్తారు. పురోహితుడు అంతకు క్రితం రాత్రి భార్యతో జగడమాడితే ఆమె అతని జందెం కాస్తా పుటుక్కున తెంపేస్తుంది. మళ్ళీ జందెం వేసుకోవడం మర్చిపోయి వచ్చేసాడు. అతని మెళ్ళో జందెం లేకపోవడం చూసి రెండో బ్రాహ్మణుడు ప్రశ్నించగా ఈ తద్దినం కరణం గారి తల్లి గారిది, ఆడవారికి జందెం వుండదు కనుక నువ్వు కూడా జందెం తీసెయ్యమంటాడు.

వీరు వ్రాసిన గణపతి నవల ఆధారంగా విజయవాడ ఆకాశవాణి వారు రూపకంగా మలిచి ఎన్నో సార్లు ప్రసారం చేసారు. ఇది ఆద్యంతం అద్భుతమైన హాస్య రచన. లక్ష్మీనరసింహం గారి ప్రహసనాలలో ఒక విశిష్టత వుంది. నేరస్థులను మృదువుగా మందలించి, క్షమించి, సంస్కరిస్తారు.

‘మనసా రా’

నేను మనసారా దుకాణాలకి వెళ్ళి
‘మనసా రా’ అని కవ్వించే సారా తెచ్చుకోను, మనీ కోల్పోను.
.
ఏదో ఇలా ఎదుటవాడు మన పర్సు కత్తిరించక పోస్తుంటే నోరెళ్ళబెట్టుకోవడమే.
:అది కూడా ఎందుకూ? మంచినీళ్ళో, ఆ రేంజ్ ని దాటి ఆరెంజ్ జూసో అందుకుంటే పోలా?
నాకు కొందరు సినీ హీరో హీరోయిన్ల మీద తెగ జాలి. కొందరు
ఏదో సరదాగా మిత్రుల బలవంతం వల్ల అలవాటు చేసుకునీ, మరికొందరు అణచుకున్న
అవమాన భారం నుంచి తేలిక కావాలనుకునీ ఆ ద్రవం ఉపద్రవం చేసేంతవరకూ
రోజుల తరబడి క్షార గరళం మింగుతూ నిక్షేపం లాంటి నట జీవితాన్ని
వృధా చేసుకున్నారు,కుంటారు. మామూలు మనుషుల్ని ఎవ్వరూ పట్టించుకోరు.
ఇదిగో ఇలా కాస్తో కూస్తో నటనలోనూ, ఇతర ప్రజా ర్రంగాల్లోనూ పేరు సంపాయించుకునేవారు అలా బలి కావడం న్యాయమా?

x

Tuesday, November 24, 2015

వసంత రాగమే హాయి హాయి.. .

.

వసంత రాగమే హాయి హాయి!

.

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ’

వసంత గానం హాయి..వసంత రాగమే హాయి హాయి...

.కొత్త రాగమున మత్తిలి కోయిల కూయగ,

.

‘పాతాళ భైరవి(1951)’ చిత్రంలో ‘ఘాటు’ ప్రేమ అనే 

కొత్త ప్రయోగం పింగళి వారిదే. పాట రికార్డింగ్ లో ఎవరో ‘ఘాటు’ బదులు వేరే పదం వేస్తే బావుంటుందేమో అని నసిగారట.

పింగళి వారు ఆయన్ని ఘాటుగా కసిరారట.

ఈ సినిమాలోనే రాకుమారి తన చెలికత్తెలతో ఉద్యాన విహారం చేస్తూ పాడుతుందే, ‘ తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ’ అన్నది, 

అందులో ఆయన తొలిసారిగా ‘మత్తు’ ని క్రియాత్మకంగా వాడారు, ఎలాగంటే- ‘క్రొత్త రాగమున కుహూకుహూ మని మత్తిలి కోయిల కూయగా’ అని. 

.

‘మత్తిలి’ అనేది గమనించారా ? 

’అత్తిలి’ లాంటి ఊరు పేరు కాబోలు అని అనుకునేరు .x

పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.) .


పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.)

.

మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు.

అందులో ఈ గేయం ఉంది. 

.

పాపాయి కన్నులు కలువ రేకుల్లు

పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు

పాపాయి దంతాలు మంచి ముత్యాలు

.

నాకు ఏమి అర్ధం కాలేదు.

మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు.

మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది.

నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను.

ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు..

కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది.

సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్నాను.

మొత్తానికి చాలాసార్లు ఈ మంత్రం నాకు పనిచేసింది.

ఉన్నదొక్కటే. .

ఉన్నదొక్కటే. .

(శ్రీ ములుకుట్ల సుబ్ర్హమన్య శర్మ గారు.)

ఉన్నది ఒక్కటే, లేనేలేదు రెండవది 

నీలోనా, నాలోనా మన అందరిలోనా ఉన్నదొక్కటే 

నీటిలో,నింగిలో,గాలిలో,అగ్గిలో,భూమిలో 

అంతటా వ్యాపించి ఉన్నదొక్కటే

"నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను 

అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం 

ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను" 

గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను"

ఆజ్యోతివెలుగులో వెలుగొందు నీజగము 

కనుమూసినంతనే కరగునీ జగము 

కట్టకడపటి వరకూరకుండెడివేల 

కదలిరా! తెలుసుకో! నీయాత్మ జ్ఞానంబిదే.

మాయలో కప్పబడినారు మానవులందరు 

ఆ మాయ యను చీకటిని పారద్రోలెడి ప్రజ్ఞ 

కలవాడీ ప్రాణికోటిలో నీమానవుడొక్కడే 

ఉదయింపచేయు మాజ్ఞానభాస్కరు నీజన్మలోనే

జనన మరణ చక్ర భ్రమణ మాగదీజగంబున 

ఆప శక్యంబు కాదీ యవనిలో నెవరికీ 

మరుజన్మమేమొచ్చొ మనచేతిలో లేదు 

సాధించు జన్మరాహిత్య మీజన్మలోనే.


పొట్ట , లావు తగ్గడానికి ఉపాయాలు !

పొట్ట , లావు తగ్గడానికి ఉపాయాలు !

నిద్రపోయే ముందు వెచ్చని నీటితో ఒక టీస్పూన్ మెంతులు పొడి తీసుకోండి.

మీ మధ్యాన భోజనం తర్వాత ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం వెచ్చని నీటితో తీసుకోండి.

మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు.

తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మకాయ పిండుకుని తాగాలి.

ప్రాణాయామ కనీసం 45 నిమిషాలు రోజు క్రమం తప్పకుండ చెయలి ,ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి.

వంటలో నూనె , దుంపలు , మసాలాలు మానేస్తే మంచిది . మానలేక పోతే కనీసం తగించడం మంచిది.

పైన తెలిపిన ప్రకారం గా ప్రతి రోజు చేయడం వలన ఆరోగ్యం బాగావుతుంది మరియు పొట్ట కూడా తగ్గుతుంది .

శివ ధ్యాన శ్లోకాలు !....(12)

శివ ధ్యాన శ్లోకాలు !....(12)
.
భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్
ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్"
.
విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును,
జటాసమూహముచే అలంకరింపబడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.x

Monday, November 23, 2015

శివ ధ్యాన శ్లోకాలు !....(11)

శివ ధ్యాన శ్లోకాలు !....(11)
.
.:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా
పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః ||
పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః
అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః ||
ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్
సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః ||
ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా
అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః ||
భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా
ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా ||
.
తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్
ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా ||
.
సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా
వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా ||
.
సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః
గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః ||
.
.
ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః
.
ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువదిఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకములేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవబడిన జటాజూటము కలవాడును, కోమలమగు వ్యాఘ్రచర్మము ధరించినవాడును, సవ్యముగా అపసవ్యముగా ఱేలపూదండలు దాల్చినవాడును, నాభిప్రదేశము మొదలు పిక్కలవరకు వేలాడునట్టి కడిమిపూలదండలచే శత్రువులకు ఆనందకరము అగు సౌందర్యము కలవాడును, తనవలే వన్యాలంకారములచే అలంకృతమయి నిర్మలయయి అడవియందలిశోభకు దర్పణమో అనదగి ఒప్పుచున్న సర్వాంగసుందరియగు దేవిహస్తమున ధనస్సును నిర్మలమగు ఒక బాణము ఒసగి ఆమె రెండవ మూపును తన వామబాహువుచే అవలంబించి రెండవచేత సుగంధియగు పూగుత్తిని పలుమాఱు మూఱ్కొనుచు క్రొంజిగురు రెమ్మచే వీవబడుచున్నవాడును, తనముందు గర్వించి నడుచుచున్న పిల్లవాండ్రచేత మనోహరమగు కుక్కలచేతను పరివేష్టితుడును, ఇట్టి ఆకారము దాల్చిన కిరాతవేషుడగు లోకగురువు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.
.
దేవత: మహాదేవుడు
.
ఋషి: మహాదేవుడుx

" పోతన భాగవతము " లోని సరస్వతీ స్తుతి పద్యాలు ! .

" పోతన భాగవతము " లోని సరస్వతీ స్తుతి పద్యాలు !
.
"కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ "
"క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర
శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్"
!
"శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ "
"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"x

Sunday, November 22, 2015

శివ ధ్యాన శ్లోకాలు !....(10) .

శివ ధ్యాన శ్లోకాలు !....(10)
.
"ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్,
ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా".
.
ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు,
చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము
క్రింద కూర్చుండినవాడును అగు హరుని ధ్యానించుచున్నాను.
.
దేవత: రుద్రుడు
.
ఋషి: మండూకుడుx

అదిగదిగో గగన సీమా

శుభరాత్రి!

.

అదిగదిగో గగన సీమా 

అందమైనా చందమామా ఆడెనోయి 

ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన 

పిల్ల గాలి పాడెనోయీ 

సా రి గ మ ప ద ని సా 

సా దా ప మ రి గ మ రి స

నదీసుందరి!

నదీసుందరి!...... అబ్బూరి రామకృష్ణరావు

.

పూవుపొడితో పసుపుబూసుక

కావియిగురుల కాంతు లద్దుక

త్రోవ లెఱిగిన చరణములతో

రావె! సంధ్యాకామినీ!

ఉదయకన్యలు కలశములతో

పిదికి పంపిన యాలమందల

పొదుగులను క్షీరముల నింపితి

గదవె! సంధ్యాకామినీ!

పచ్చిమాలతి యాకుమడుపులు

గ్రుచ్చి వేసిన పూలదండలు

తెచ్చియుంచితి మొక్కమా రిటు

వచ్చిపో! సంధ్యాంగనా!

నల్లనల్లని కలువదండల

నెల్లదిశలను నిదుర నెలతలు

అల్లిపోవక మునుపె యమృతము

చల్లిపో! సంధ్యాంగనా!

ఎవరిపై నీవలపు నిలిపితి?

వెవరికై యీపారవశ్యము?

భువనభువనము లెల్ల తిరిగెద

వవుర! సంధ్యాకామినీ!

ఉదయమున వెలిచీరచాటున

కొదమసంజల కావిముసుగున

పొదలునది నీవొకతెవేనా?

ఉదయ సంధ్యాకామినీ!

పోతన - శ్రీమద్భాగవతం.!

పోతన - శ్రీమద్భాగవతం.!

.

ఎవ్వడు సృజించు బ్రాణుల

నెవ్వడు రక్షించు ద్రుంచు నెవ్వడనంతుం

డెవ్వడు విభుడెవ్వడు వా

డివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై!

భావం:---

.

ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో, 

.

ఎవడు అంతం చేస్తాడో, ఎవడు అనంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో...

ఆ విభుడే ఈ విధ ంగా పోషించేవాడు, పెంచేవాడు (సర్వం చేసేవాడు) అని అర్థం.

.

చిత్రంబులు త్రైలోక్య ప

విత్రంబులు భవలతాలవిత్రంబులు స

న్మిత్రంబులు మునిజనవన

చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్!

.

భావం:----

.

శ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావు. ముల్లోకాలను పవిత్రం 

.

చేసేటువంటివి. జీవరాసులకు మంచిమిత్రుల వంటివి. అడవులకు వసంత ఋతువు ఆనందం 

.

కలిగిస్తుంది. అదేవిధంగా ఈ చరిత్రలు మునులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి సంసార బంధం

.

అనే లతలను అవలీలగా ఛేదించే లవిత్రాలు (కొడవలి వంటివి)...

.

బాలున్ హరిపదచింతా

శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా

జాలున్ సంతోషించక

యేలా శిక్షించె రాక్షసేంద్రుండనఘా!

.

భావం:----.

.

ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో, ఎవడు అంతం చేస్తాడో,

.

ఎవడు అనంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో... ఆ విభుడే ఈ విధ ంగా పోషించేవాడు,

.

పెంచేవాడు (సర్వం చేసేవాడు) అని అర్థం.

.

లేపాక్షిబసవన్న!

లేపాక్షిబసవన్న!

.

“లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాన నడచి రావయ్య''

.

స్వాతంత్ర్య పూర్వం బహుముఖ ప్రతిభావంతులైన అడవి బాపిరాజు .పరవసుడయే

పాడి ఆ నంది గొప్పదనం చాటారు

.

ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో

మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. 

ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. 

తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, 

బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.

.

సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, 

ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును 

చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, 

జటాయువు లేచి నిలుచుందని, 

అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

Friday, November 20, 2015

తొక్కుడు బిళ్ళఆట !

తొక్కుడు బిళ్ళఆట !

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు.

కావలసిన వస్తువులు : చిన్న రాతి పలక బిళ్ళ.

ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు నిలుచోవాలి. ముందుగా ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండవ గడి, తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను దాటించాలి. జాగ్రత్త! ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల గీతలను తాకరాదు. గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి.అలాగే కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి. తరువాత తలపై పెట్టుకొని దాటాలి. తరువాత అర చేతిలో, ఆపై మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి. తరువాత బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది. మధ్యలో గీత తొక్కితే ఒకటి రెండు గడులు బాలికవి అవుతాయి. మిగతా బాలికలకు అప్పుడు ఆడటం కష్టమవుతుంది.

చక్కగా శ్రద్ధగా చదువు కూనే పిల్లలు చూస్తే ముద్దువస్తుంది.
                                      చక్కగా శ్రద్ధగా చదువు కూనే పిల్లలు చూస్తే ముద్దువస్తుంది.

భక్త కన్నప్ప.! .

భక్త కన్నప్ప.!

.

శ్రీ ఆదిశంకరాచార్యా విరచిత

శివానందలహరి...శ్లోకం..63

.

"మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే

గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే|

కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే

భక్తిః కిం న కరోత్యహో వనచారో భక్తావతంసాయతే"||

.

త్రోవలవెంబడి తిరిగిన పాదుకములు సకల భూనభోంతరాళములయందున్న

.

.

.

ప్రాణిసమూహమునకు అధిపతియగు ఈశ్వరునికి పవిత్రధర్భాంబరములై ఒప్పుచున్నవి.

నోటపుక్కిట బట్టి తెచ్చిన నీరు మూడు లోకములనూ ఏక శరముతో దండించిన ప్రభువుకు దివ్యాభిషేకముగా భాసించుచున్నది. కొంచెము ఎంగిలి చేసి రుచి చూసి తెచ్చిఇచ్చిన మాంస ఖండము శ్రీకాళహస్తీశ్వరునికి అప్పుడే వండి తెచ్చిన నైవేద్యమై శోబిల్లుచున్నది. భక్తిచేత కాని కార్యము గలదే, ఒక బోయవాడు భక్తులలో పరమశ్రేష్టుడై పరమపదమునందినాడు.

(ఆచార్యుల వారు తిన్నడిగా పుట్టి శ్రీకాళహస్తీశ్వరున్ని శరణు కోరి చేరి భజించి భక్త కన్నప్పగా మారిన ఒక బోయవాడి ఉదంతమును తెలుపుచున్నారు.)

.....

.నయనార్లు (కన్నప్ప)

నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

నయనార్లలో 20వ .. కన్నప్ప తెలుగు వాడు.. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. నాగడికి తిన్నడు సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా – తిన్ననికి అన్ని జీవులయెడ – కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు.

ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి, చెట్టుముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు, దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖీనదీ తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కన్పించాయి.

తిన్నడికి ఆ పర్వతమెక్కి – గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు(పిలకవున్న దేవుడు) అని నాముడు చెప్పాడు. కాముడు పందిని వచనము చేయ మొదలుపెట్టాడు. ఆ కొండఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందెన్నడు తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వ జన్మసంస్కార ఫలితము. తన మీదనుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లనిపించసాగింది..దేహస్పృహకూడా మందగించసాగింది.. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు..ముద్దులుగుమ్మరించాడు..ఆనందభాష్పాలు రాలటంతో, శివునితో ‘ ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రీ ఆకలిగా ఉందేమోకదా నీకు..ఉండు ఆహారం తీసుకువస్త్తాను’ అంటూ లింగంను విడిచి వెళ్ళలేక,వెళ్ళలేకపోయాడు…చివరికి శివుని ఆకలిదీర్ఛుటకు వెంటనే కొండదిగాడు. కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. ‘నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నదినుండి నోటినిండా నీళను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తనతలమీద వుంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో వుంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తలమీద వున్న పూలతో శివుని అలంకరంచాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చినపందిమాంసమును దేవునిముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు… ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథున్ని కదిలించింది…. మరునాడు ప్రొద్దున మళ్లీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్లలేదు.

తిన్నడు దేవునికాహారము సేకరించటానికి వెళ్ళగా, ఆలయ అర్చకుడు సివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు, నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్ఛకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ్ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు. పూజారి వెళ్లగానే, తిన్నడు మళ్లీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈవిధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఈక ఉండబట్టలేకపూయాడు. రోదిస్తూ పరమశివుని ప్రార్థంచాడు. “ఈ ఘోరకలిని ఆపుస్వామి…” అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తిప్రపత్తులను చూపదలచాడు. అర్చకునకు కలలో కనిపించి “నీవు లింగము వెనుక దాగి యుండు. బయటకు రాక అక్కడ ఏమిజరుగబోతోందో గమనించు” అని ఆదేశించాడు.

ఆరవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరుగగలదా అని తనని గూర్చి మరచిపోయాడు. గుదికి పరుగెత్తి వెళ్ళాడు. వెళ్లిచూడగానే – శివుని కుడికన్ను నుండి రక్కము బయటకి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికావైద్యం చేశాడు. కాని రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది. ‘కన్నుకు కన్ను’ సిద్ధాంతముగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యము చేస్తుండగానే – ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి – తన ఎడమ కన్నును పెకళించబోయాడు.

పరమ శివుడు వెంటనే ప్రత్యక్షమయి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. ” నిలువుము కన్నాప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల ఆంతర్యము కన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా! ” అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్పా అని మూడుమారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట.

తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము. శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసొకొని ప్రక్కకు చేర్ఛుకున్నాడు. కన్నప్పకు చూపువచ్చింది. సాక్షాత్తూ శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తితత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది. ఇలా వేదం,నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలువ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నంచేసుకున్నాడు.

Vinjamuri Venkata Apparao's photo.

శివ ధ్యాన శ్లోకాలు !....(9)

శివ ధ్యాన శ్లోకాలు !....(9)

.

"ప్రణమదమరలోకమౌళి మాలాకుసుమ రజో2రుణపాదపద్మయుగ్మమ్,

అనవరతమనుస్మరేద్భవాన్యా సహజగతాం పితరం పినాకపాణిమ్."

.

నమస్కరించుచున్న దేవతలసమూహముయొక్క శిరస్సులందలి పూదండలపూవుల పరాగముచే గొంచెం ఎఱ్ఱనైన కమలములవంటి పాదములజంటకలవాడును, 

లోకములకు తండ్రియును, పినాకమను ధనస్సుచేత కలవాడును,

భవానితో కూడినవాడుఅగు రుద్రుని, నిరంతరము మనస్సులో స్మరించుచున్నాను.

.

దేవత: భగవంతుడు

ఋషి: భగవంతుడు

x

గీత దాటని సీత...

.

గీత దాటని సీత...బిచ్చం మనం గడప లోపలి పిల్చి వెయ్యాలి 

.

ఇది రాజా రవి వెర్మ పెయింటింగ్.

మామిడి !

మామిడి !

మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. 

ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి. 

.మామిడి ఉపయోగాలు

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.

మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు (ఊరగాయ లు) తయారు చేస్తారు.

ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై తో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.

మామిడి.. క్యాన్సర్‌ నివారిణి

మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు

‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

‘మూగమనసుల’ 

.

ఈ సినిమాలో కొసరాజు - ‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’ పాట రాశారు. 

.

‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే

పళ్ళు పదారు రాలునులే

పళ్ళు పదారు రాలునులే’

పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? పదారు (పదహారు) అని ఎందుకు రాశారు? ‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా?

కొసరాజు అలా అర్థమేమీ లేకుండా రాస్తారా?!

మరి దీనిలో అంతరార్థమేంటి?

పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా? నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి, అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!

దుర్వాసుడు కోపిష్టి ఎందుకు అయ్యాడు?

దుర్వాసుడు కోపిష్టి ఎందుకు అయ్యాడు?

.

దుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలోని ఒకానొక కథను అనుసరించి, ఒక సారి బ్రహ్మకు, శివుడికి మధ్య మాటామాటా పెరిగి పెద్ద రాద్థాంతం అయ్యింది. పరమేశ్వరుడు ప్రళయరుద్రుడు అయ్యాడు. ఆయన కోపాగ్ని జ్వాలాలకు దేవతలు తల్లడిల్లిపోయారు.

పార్వతి సైతం తన భర్త కోపాన్ని భరించలేక, శివుణ్ని చేరి 'దుర్వాసంభవతిమి' అంటే మీతో కాపురం చేయడం కష్టమైపోతోంది' అంటూ వాపోయింది. అప్పుడు రుద్రుడు తన కోపాన్నీ, ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టి పార్వతిని సుఖపెట్టాలనుకున్నాడు. తరువాత జరిగిన ఒకానొక సంఘటనలో త్రిమూర్తులు అనసూయా దేవికి ప్రత్యక్ష్యమై ఏదైనా వరం కోరుకొమ్మన్నారు.

అప్పుడు ఆ మహా సాధ్వి 'మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి'. అని కోరుకుంది. వారు సరేనన్నారు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహా విష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టగా, ఆ కోప స్వభావునిగా, ఆనసూయకు దుర్వాసుడు పుట్టాడు. అలా కోపానికి మారు పేరయ్యాడు.


Thursday, November 19, 2015

శివ ధ్యాన శ్లోకాలు !....(8)

శివ ధ్యాన శ్లోకాలు !....(8)

.

"ఉద్యద్భాస్కరకోటి ప్రకాశదీప్తదహనమూర్థనమ్,

బీషణభుజంగభూషం ధ్యాయేద్వివిధాయుధం రుద్రమ్."

.

ఉదయించుచున్న కోటిసూర్యులవలే ప్రకాశముకలవాడును,

మండుచున్న అగ్నివంటి శిరస్సు కలవాడును, 

భయంకరములైన సర్పములు ఆభరణములుగా గలవాడును, 

నానా విధములగు ఆయుధములుగలవాడు అగు రుద్రుని ధ్యానించుచున్నాను.

.

దేవత: రుద్రుడు

.

ఋషి: నారదడు

x

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

.

"మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్

నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.!

.

ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా.

.

అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! 

.

అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!

.


చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి...

చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి... 

చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి... 

అడగనా...నోరు తెరిచి అడగరానివి...

Wednesday, November 18, 2015

సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. .....

సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. .....

(రామాయణ కల్పవృక్షం.! శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.)

హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని

సీత తనలో దాచుకుంటుందిట! 

ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. 

అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు. 

సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని. 

అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది.

ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు. 

రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం. 

మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే అన్న పరిస్థిని సూచించడానికా? ఇన్ని ఆలోచనలని రేపే కల్పన ఇది!

ఇక అసలు ఘట్టానికి వద్దాం. సీత రాముడున్న ప్రదేశానికి ఇలా వచ్చింది:

"మత్త గజ మంథరగమనంబున భీతవోలె, విరాగిణివలె, దిరస్కారభావయుతవలె, భర్త్రనురక్తవలె నడచుచు బ్రవేశించి శ్రీరామచంద్రుని కెదురుగా నిలుచుండిన.

" అలా నిలుచున్న సీతని చూస్తే రామునికెలా అనిపించింది? 

ఏడాది యన్నమ్ము నెఱుగదు లలితాంగి నిద్దుర యెఱుగదు నీరజాక్షి ముడుచుకు కూర్చున్న యొడలుగా నంసభా గమున వంగినయట్లు కానిపించు మొగి నిరంతం బెడతెగని యేదో భయం బక్షుల వెనుభాగ మానరింప నఖిలలోకాతీత మైన సర్వాంగ వి న్యాస సౌభాగ్య సౌందర్య మొప్ప తన్ను హరిణంబు గొని తెమ్మటన్న కాంత సగము సగమైన మై రామచంద్రునకును తన సమస్త కామమున కాస్థాన భూమి కనుల యెదుటను వచ్చి సాక్షాత్కరించె.

అప్పుడు రాముని మనసులో ఏమనుకుంటున్నాడు? ఈ యమ హేతువై వనుల నెల్ల జరించెను దా బికారిగా నీ యమ హేతువై జలధి కెంతొ శ్రమంపడి కట్టగట్టె దా నీ యమ హేతువై గెలుచు టెంత శ్రమంబయిపోయె లంకలో నా యమ జూచినంత హృదయంబున బట్టగరాని కోపమై అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ చించె సుంత వినదు చెలువ తాను ననుభవించె దాను ననుభవించితి మేము నాడదింత సేయుననుచు గలదె? 

ఇదంతా వాల్మీకంలోని "హృదయాంతర్గత క్రోధమే". ఆ తర్వాత విశ్వనాథలోని కవి ప్రవేశిస్తాడు. 

అక్కడున్న వచనం ఇది: "ఇట్లూహించుచు" రాముండు మనసులో "నూరక" కోపంబు పెంచుకొంచుండగా" కవి భాషాశక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో చూసారా! ఊహించుకోవడం రెండర్థాలనిస్తుంది, అలానే "ఊరక" అన్న పదం కూడా. ఆ సీత చూసేవాళ్ళకి ఎలా ఉందిట? "తెలియన్ రాకయ చూచు నేత్రములకున్ స్త్రీమూర్తి తానింతలో పల నాగ్నేయ శిఖాకృతిం బొలుచు" అగ్నిశిఖలా ఉందిట ఆవిడ! 

అంతలో ఏమయింది? "అంత బడబాగ్ని చేత సళపెళ క్రాగి కళపెళలాడు సముద్రోపరి సముద్భూత బుద్బుదధ్వనులవోని కంఠరావ మొప్ప శ్రీరామచంద్రుడిట్లనియె" లోపల బడబాగ్ని చేత, పైన కళపెళలాడే అలలపై బుడగల చప్పుడులా ఉందిట రాముని కంఠం. ఏవిటా బడబాగ్ని అన్నది పాఠకులే ఊహించుకోవాలి. రాముడు వాల్మీకంలోలాగానే మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకా దారుణంగా అనిపించే మరోమాట కూడా అంటాడు: మఱియున్ నీకొక మాట చెప్పవలయున్ మారీచునిం జంపితిన్ హరిణం బయ్యది కాదు లక్ష్మణుడు యాథార్థ్యంబు వాచించె ని ష్ఠురు లాయిద్దఱు గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క బ్బుర మా బంగరులేడి గోరెదని నీవున్ వార లెట్లెంచిరో? "అప్పుడు నువ్వుకోరిన బంగారు లేడి లక్ష్మణుడు అనుమానించినట్టే రాక్షసుడు, మారీచుడు. ఆ రావణాసురుడూ మారీచుడూ ఇద్దరూ కలిపి కూడబలుక్కొని ఈ పన్నాగం పన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏవిటంటే, నువ్వు అలా బంగారులేడిని కోరుకుంటావని వాళ్ళెలా ఊహించారో కదా!" అని దీనర్థం. ఎంత మహా ఘోరమైన నింద ధ్వనిస్తోంది ఇందులో! అప్పుడు సీత ఏం చేసింది? "అంత బెద్దసేపు జానకీదేవి రామచంద్రుని వంక జూచుచు నట్లే నిలుచుండి చివరకు లక్ష్మణుని గాంచి యిట్లనియె" "నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నేనీ దరి ద్రాకారంబున జచ్చియుం బ్రదికి యౌరా! యొక్కరీతిం దగున్" లక్ష్మణుని కావాలంటే పెళ్ళిచేసుకో అన్న రాముడికి ఈ మాటలు కొరడాతో కొట్టినట్టు అనిపించక మానతాయా! సీత అగ్నిప్రవేశానికి ముందు రాముణ్ణి పూర్తిగా కుంకుడుకాయ రసంపోసి మరీ తలంటేస్తుంది! ఆవిడ పెట్టే చీవాట్లు వింటే, సీతేదో అమాయకురాలు, నోరులేనిదీ, భర్త దగ్గర నోరెత్తనిదీ, దీనురాలు అనుకొనే వాళ్ళ ఆలోచనల్లో తుప్పొదిలిపోతుంది. నే నొక్కించుకసేపు లోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా మీ! నీ యాజ్ఞన్ వచియింతు గొంచెము సమున్మీలద్యశోధామ! దై వానన్ వచ్చిన దోసమంతయును నా వంకన్ నిరూపింతు, నీ వైనన్ దైవమ వండ్రు, నీకు కృపలే దందున్ మఱట్లైనచో దైవం వల్ల వచ్చిన దోషాన్ని నాపై పెట్టడానికి ప్రయత్నించావు. నిన్నందరూ దేవుడిలా చూస్తారు కాని, నీకు ఏమాత్రం దయా గుణం లేదు. మచ్చిక జెట్ట యర్థముల మాటలనంటివి నన్ను నీవనన్ వచ్చును నేనునైన బడవచ్చును, బంగరులేడి జూడగా విచ్చిన కంటితో నెడద విచ్చెను విచ్చిన గుండెలోపలన్ జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వ ఋషీంద్ర వాంఛలున్! ఏ ఋషి భావనా మహిమ ఏర్పడ నాయెదలోన జొచ్చి నన్ గోరగ జేసె లేడి, నది కోమలనీలపయోదదేహ! నా కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా నేరను వచ్చు, నీ విదియు నేరవె? సర్వఋషీంద్ర హృత్స్థితా! ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం బు కలుగనటం జూతురు తమోహరణా! దయజూచితేని కో రికయును నాది నీకు సురరీకృత కీర్తిరమా ఫలప్రదం బకలుష గుప్తశౌర్య బహిరాగతి దివ్యఫలంబు రాఘవా! నువ్వు ఊరికే అనవసరమైన చెడ్డమాటలన్నీ అన్నావు. అయినా నువ్వు నన్ననవచ్చు నేను పడవచ్చునూ. కాని అసలు విషయం చెప్తాను. బంగారులేడిని జూడగానే నా కళ్ళు చెదిరాయి నిజమే. కాని దాంతోపాటు నా గుండెకూడా చెదిరిపోయింది. చెదిరిన ఆ మనసులో సమస్త ఋషుల కోరికలు కూడా దూరాయి. నన్ను బంగారులేడిని కోరినట్లుగా చేసినది ఆ ఋషిభావనా మహిమ (దానవ సంహారమే ఆ ఋషుల కోరిక కదా). దానికి నువ్వు రాక్షస భావం అంటగడుతున్నావు. నీకామాత్రం నిజానిజాలు తెలియవా? సరే, ఒక పనివల్ల కలిగే మంచిచెడ్డలని చూసి ఆ పని సరైనదా కాదా అని నిర్ణయిస్తారు కదా. అలా చూసినా నేను కోరిన ఆ కోరిక నీకు మేలే చేసింది. నీలో దాగిన శౌర్యాన్ని అందరికీ తెలిసేలా చేసి నీకు కీర్తిని సంపాదించి పెట్టింది కదా! ఆడది యింత సేతు ననుటన్నది యున్నదె యంచు నన్ను నూ టాడితి, కైక కోరక మహాప్రభు నీ వని రాకలేదు, నీ యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేద, యా యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్ ఆడది ఎంతకైనా చేస్తుందన్నావే, నిజమే నయ్యా! నిన్నొక ఆడది కైక కోరిక కోరికపోతే అడవికి వచ్చేవాడివా, నేను (బంగారులేడిని)కోరకపోతే ఈ రాక్షసులనందరినీ సంహరించేవాడివా! ఇలా రాముడన్న ప్రతిమాటకీ సమాధానమిస్తుంది సీత. ఇనవంశేందు! మనస్సు లోపల మనస్సే లేదు నీకందు! నీ కొనరన్ నిక్కముగా మనస్సున మనస్సున్నన్ ధరాజాత నే మనినా వెవ్వరినో వరింపుమనియా? యయ్యయ్యొ! యా వేరి పే ర్లనినా వెవ్వరుగాని నవ్వరటవే, రామా! జగన్మోహనా! మనసున నింత యుంచుకొని మారుతితోడన యుంగరంబు పం చినయది గుర్తు చిత్రము, రచించిన నీయెదలోని చా టెఱుం గనియది, యిర్వదేండ్లు నిను గాంతుని గాగను నమ్మి సంసృతిం బొనరిచి నిన్ను నే నెఱుగబోవని నా తెలివిన్ హసించెదన్ "నీకు మనసంటూ లేదు రామా! ఇన్నాళ్ళూ నిన్ను తెలుసుకోలేని నా తెలివికి నేనే నవ్వుకుంటున్నాను" అని ఎంత సూటిగా చెప్పింది! పైగా ఎంటంటోందో చూడండి (ఇక ప్రతిపద్యానికీ వివరణ ఇవ్వడం నా వల్ల కాదు!): నీ పొనరించుదాన నొక నీతియు నున్నది నేనెఱింగినన్ నీ పొనరింపబోవు పనినే మరణించియ యుందు దేనికై యా పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు చంపునౌ నీ పదిదిక్కులన్ యశమదెట్టుల దక్కును నీకు మత్పతీ! ఆమిక్షాకృతి విచ్చిపోదు రనసూయారుంధతుల్ గాని లో పాముద్రాసతిగాని నీ విటుల భూపాలా! మదిన్ నమ్మవే నీ, మోహాంధ వటంచు ధూర్జటి హిమానీశైలకన్యామణిం దా మాటాడునె? నీవు పల్కెదవుపో ధాత్రీ సతీకన్యకన్ అప్పుడరుంధతీ సతియు నంతిపురంబును నింక ద్రొక్కనం చొప్పమి లేచిపోయె విపినోర్వికి నేనును వచ్చు టెంచుచున్ జెప్పకు మింటి కేగి యిది, సీతయు నగ్నిని జొచ్చె నేను బో నప్పుడె యంచు జెప్పిన మహాప్రభు! దోసము మాసిపోయెడున్ ఆయా మౌనుల యిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్ ధ్యేయాకారలు వారి గేహినులు భక్తింబొల్చు న న్నీ గతిం జేయన్ నీవును గోప మూనెదరుసూ! సేమంబు కాదద్ది నీ వా యా మౌనులయిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్ ఆ వేళన్ వని జేరునప్పుడు ప్రసంగానీతమై చెప్పగా సావిత్రీకథ నేను నీ మరణవాంఛాబుద్ధి నైనట్లుగా నీ వాడన్ బ్రభు నేన చత్తునని యంటిన్ నిక్కమట్లయ్యె నీ నీవే కారణమౌట దానికిని బండెన్ మత్తపంబంతయున్ రాముడిని అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఋషుల ఇంటికి వెళ్ళడం క్షేమం కాదని హెచ్చరిస్తోంది! ఎందుకు? తననిలా తూలనాడినందుకు మునిపత్నులందరూ రామునిపై తీవ్రంగా కోపగించుకుంటారు కాబట్టి! నాపయి రామచంద్ర! రఘునాయక! మత్పతి! నీకు నెందుకో కోపము వచ్చె నద్ది యిదిగో పది యల్లితి వంశగౌరవ క్షేమముగాగ మచ్చ యని చెప్పితి వచ్చట నింత కంటె దీ వ్రాపద యున్నదయ్య రఘువంశము నందున గోప మేటికిన్ నీకు నామీద ఎందుకో కోపం వచ్చింది. అంచేత ఎవో పది రకాలుగా నన్నన్నావు. నువ్వేదో మీ వంశగౌరవం అంటున్నావే, దానికి నువ్వనుకుంటున్నదానికంటే పెద్ద నష్టం ఇప్పుడు వాటిల్లబోతోంది! ఏవిటది? నన్నున్ వీడి మఱీవు వేఱయిన కాంతం బొంద వప్డున్ గులో త్సన్నంబై చను గైకకంటెను భవత్సంపాదితంబైన సమా సన్నంబై చను పెద్దయెగ్గు రఘువంశంబందు లోకాగ్నికిన్ స్నాన్నాయంబగు నూహ లెత్తదు భవిష్యత్కాల సంసూచిగా భరతుడొసగిన ధర ధర్మపత్ని ప్రక్క లేక యేలెడు నర్హత లేదు నీకు నరపతివి కాక నన్ను గొనంగవచ్చు నుభయతోభ్రష్టతం బొందుచుంటి రామ! ఆహా! ఎంత తిరుగులేని మాట చెప్పింది సీత యిక్కడ! రాముడు తన్ను వీడి మరొక కాంతను ఎలానూ చేపట్టడు. దానివల్ల కైక రఘువంశానికి చేసిందనుకొంటున్న కీడు కన్నా కూడా మహాపద కలుగుతుంది. భరతుడు తనకి ఒప్పచెప్పిన రాజ్యాన్ని ధర్మపత్ని లేకుండా రాముడు ఏల లేడు. అప్పుడు మరి రఘువంశ భవిష్యత్తు ఏమి కావాలి? పైగా, రాముడు తన వంశాన్ని రాజ్యాన్ని వదులుకొని ఇప్పుడు సీతని గ్రహించవచ్చు. కాని సీతని పరిత్యజించి ఆ వంశగౌరవాన్నీ, రాజ్యాన్నీ ఎటూ పొందలేడు. అప్పుడతను రెంటికీ చెడ్డ రేవడే అవుతాడు! ఇది చెప్పిన తర్వాత, సీత మరో రహస్యం చెప్పి, అగ్నిప్రవేశానికి ఉపక్రమిస్తుంది. అగ్నిమండుచు నున్నది యారిపోక ముందు నే దానిలోనికి బోవవలయు జివరి కొకమాట నీకును జెప్పవలయు దెలియజాలరు దీనిని దేవతలును ఇరువురము నొక్క వెలుగున జెఱుసగమును దీని నెఱుగు శివుడొకరుండే పురుషుడ వీ వైతివి నే గరితనుగా నైతి బ్రాణకాంతా! మఱియున్ అచట చూచుచు నున్నట్టి యందఱకును జెలువ యేమని చెప్పెనో తెలియలేద చాది చూచిరి నట నుర్విజాత నచటి యుర్విజాత యన్నట్లుగా నున్నదాని మారుతి లక్ష్మణుండును క్షమాసుత బూర్వము చూచినట్టి వా రా రుచిరాంగి చెప్పినది యంతయు నర్థము చేసికొన్న వా రీ రచనంబు సర్వమును మహీయ మతీతమనస్కమై జనం బేరును రామునందున వహింపరు తొల్త దలంచు దోసమున్ "నిర్భీకవలె, స్వాధీనపతికవలె, బురస్కారభావయుతవలె, మత్తగజ మంథర సుందర గమనంబున నగ్నికడకు నడచి యగ్ని బ్రవేశించిన" ఈ చివరి సీత నడకని, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వర్ణించిన నడకతో (ఈ టపా మొదట్లో ఉంది) పోల్చి చూడండి. అందులో ఎంతటి వైవిధ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించారో, ఎందుకు ప్రదర్శించారో! ఈ అగ్నిప్రవేశ ఘట్టం మనల్నీ (రాముణ్ణీ) రామాయణం చివరికంటూ వెంటాడుతునే ఉంటుంది! ఆ తర్వాత సీతని ప్రసన్నురాలిని చేసుకోడానికి నా నా తిప్పలూ పడతాడు రాముడు. ఆఖరికి రాముడు జానకిని ప్రసన్నురాలిని జేసుకొనవలసిన స్థితినుండి, సీతచేత తాను అనుగ్రహింపబడవలసిన స్థితికి వస్తాడుట! 

తిరిగి అయోధ్యకి సీతారాములు ప్రయాణమైనప్పుడు ఋష్యమూక పర్వతం కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతతో, అక్కడ ఎంతగా విరహాగ్ని తనని కాల్చివేసిందో చెప్తాడు రాముడు. 

అప్పుడు సీత, "నిన్నేమో అగ్ని కానిది అగ్నిలా దహించింది, నన్నేమో అగ్నే అగ్నిలా దహించకుండా పోయింది" అని ఓ పోటు పొడుస్తుంది! 

ఆ తర్వాత వాళ్ళు అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, సీత అనసూయకి జరిగిన వృత్తాంతం చెప్తూ, తనని రాముడు చేసిన అవమానం కూడ చెప్పి, రాముడన్న మాటలకి "జుగుప్సావార్ధులాడెం జుమీ!" అంటుంది. 

దాంతో అనసూయ, రాముని వద్దకు వచ్చి చాలా కోపంగా చూసి, తర్వాత తనని తమాయించుకొని మళ్ళీ లోపలకి వెళ్ళిపోతుందిట! 

భరతుడికి తను తిరిగివస్తున్నానన్న వార్త చెప్పమని హనుమంతుని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు వెళ్ళేసరికి, రాముడు గడువు పూర్తయినా రాలేదని అప్పుడే అగ్నిప్రవేశానికి సిద్ధపడతాడు భరతుడు. అప్పుడు హనుమంతుని కంటికి భరతుడు ఇలా కనిపించాడట: 

ధరణిదేవికన్య దశరథసూనుండు రామమూర్తి యనలరాశి ద్రోచె దానికిన్ ఫలంబు తానే మహాగ్నిలో నుఱుకుచుండె నన్న యూహ తోచి భరతుడు రామునిలాగే ఉంటాడు కదా ఆకారంలో మరి! 

దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అగ్నిప్రవేశాన్ని మనకి గుర్తుచేసారు విశ్వనాథ. అయోధ్యకి తిరిగివచ్చిన తర్వాత, అరుంధతి తమని చూడటానికి వస్తున్నప్పుడు రాముడు తెగ భయపడిపోతాడు! 

అనసూయ అయితే కోపంగా చూసి ఊరుకుంది, అరుంధతికి కోపం వస్తే అలా ఊరుకుంటుందన్న నమ్మకం లేదు. అంచేత ఆమెకి ఏమీ చెప్పవద్దని సీతని ప్రాధేయపడతాడు రాముడు. సీత అతనికి అభయం ఇస్తుంది! 

ఇలా అగ్నిప్రవేశం గురించి కల్పవృక్షంలో చదివితే స్త్రీశక్తి, అందులోనూ సీతాదేవి మహోన్నత వ్యక్తిత్వం, మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రామాయణం "సీతాయాశ్చరితం" అన్నది మరింత బలపడుతుంది. 

వడలి మందేశ్వరరావుగారు "ఇది కల్పవృక్షం" అన్న పుస్తకంలో, అగ్నిప్రవేశాన్ని గురించి చెప్తూ, 

ఇది సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. దీనివల్ల ఇప్పటికీ రాముని వ్యక్తిత్వాన్ని సరిగా అంచనా వెయ్యడానికి కష్టంగానే ఉంది అన్నారు.

అది అక్షర సత్యం!

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

.

తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు: 

.

జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స

య్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్

ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భా

జనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్

.

భావం: 

మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

ప్రాస పదాలు!

ప్రాస పదాలు!

.

(ఈ పదాలు నేను తెలుగు దానం అనే వెబ్ సైటు నుంచి తీసుకున్నవి. 

వారికి కృతజ్ఞతలు.)

పాప గిలక తాత పిలక

సబ్బు మరకగడ్డి పరక

గుడి గంటవరి పంట

రంగు పలకకంటి నలక

పళ్ళ గంపముళ్ళ కంప

పిచ్చి కుక్కపూల మొక్క

చిట్టి తల్లిబుజ్జి చెల్లి

కాకి ఈకమేక తోక

తేలు కొండిరైలు బండి

బావి గట్టురావి చెట్టు

దోస పండుపూల చెండు

పట్టు కుచ్చుగొర్రె బొచ్చు

గండు పిల్లిబొడ్డు మల్లి

చీల మండుగోల కొండ

వెండి కొండనిండు కుండ

ఆల మందతీయ కంద

వరి అన్నంరాతి సున్నం

నీటి బుడుగపాము పడగ

ప్రాస వాక్యాలు

మంచి మాట ముద్దుకల్లలాడవద్దు

కీడు చేయ ముప్పువాదులాడ తప్పు

కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు

పెద్ద వారి మాటపెరుగన్నం మూట

కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు

పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు

మాట తప్పబోకుమంచి విడువబోకు

అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల?

చదువురాని మొద్దుకదలలేని ఎద్దు

కీడుచేయ ముప్పువాదులాడ తప్పు

మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు

గట్టిమాట నుడువుగర్వమంత విడువు

ప్రియములేని విందునయముకాని మందు

పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం.

ఇలాంటి పదాలు గమనించండి. ప్రాస ఆటోమాటిక్ గ పడాలంటే బాష మీద కొంచెం పట్టు సాధించండి.


Monday, November 16, 2015

శివ ధ్యాన శ్లోకాలు !....(6)

శివ ధ్యాన శ్లోకాలు !....(6)
.
"మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచస్మితమ్,
చండదీధితి మఖణ్డవిగ్రహం చిన్తయేన్మునిసహస్ర సేవితమ్."
.
మండలములోపలనున్నవాడును, స్వర్ణమయంబగు రూపముగలవాడును,
ప్రకాశించుచున్న దేహముగలవాడును, స్వచ్ఛమయిన చిఱునగవుకలవాడును, సర్వవ్యాపకమయిన ఆకారముకలవాడును,ఋషి సహస్రములచే సేవింపబడినవాడు
అగు సూర్యుని ధ్యానించుచున్నాను.
.
దేవత: ఆదిత్యమూర్తి అగు రుద్రుడు
ఋషి: కాలుడు / మరుత్వంతుడు

x