ఉన్నవాడికీ- లేనివాడికీ ,తేడా!

ఉన్నవాడికీ- లేనివాడికీ ,తేడా! 

(ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు. .)

.

" ఉన్నవాడికే అన్నిసుఖాలూ, రయ్యో రయ్యో!

లేనివాడిగతి యీలోంలో నుయ్యో గొయ్యో! విన్నారుగా?

.

సుమతీ,(బద్దెన) వేమన, కుమార, కుమారీ, యిలా ప్రాచీన అర్వాచీన శతకాలు. 

వాటిపరధిలో అవి సామాజిక మైన దురవస్థలను యెత్తిచూపి అన్యాపదేశంగా పరిష్కారాలు సూచించాయి. అయినా మనపరిస్థితి," ఎక్కడ వేసిన గొంగడి అక్కడే! " గానేమిగిలిపోయింది. మాచిన్నప్పటి ఒకపాట నాకిప్పటికీ స్మృతి పథంలో మెదులుతూ ఉంటుంది

.

" ఉన్నవాడికే అన్నిసుఖాలూ, రయ్యో రయ్యో!

లేనివాడిగతి యీలోంలో నుయ్యో గొయ్యో! విన్నారుగా?

.

సరిగ్గా యిదే భావంతో ఆరుదశాబ్దాలక్రితం ' భైరవ కవి' తన శతకంలో ఒకపద్యవ్రాశాడు. వింటారామరి! యిదిగో మీకోసం!

.

చ: కలిగిన వాని యింట శుభకార్యము గల్గిన, కీడు గల్గినన్, 

పిలువక మున్నె, బాంధవులు పెల్లుగఁబోయి, తతంగ మంతయున్ 

తెలుపుచు నుందురాతనికి ,దీనుని యింట శుభంబె గల్గినన్, 

పలుమరుఁ బిల్చినప్పటికి, పల్కరుగా! యెవరైన భైరవా!

.

ఇదండీ ఆపద్యం! ఉన్నవాడి యింట్లో శుభాశుభాలు యేంజరిగినా , ఊరిజనం పిలువక పోయినా పరుగున బోయి వాని కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించి వస్తారు. అదేం చిత్రమో!, పేదవాడియింట్టో శుభంజరుతున్నా, తమను పేరుపేరున పిలిచినా ఒక్కరూ రారుకదా! అంటాడుకవి. యిది నగ్న సత్యంకదా! మరి సమాజం యీతీరున నుంటే, యింక లోకం బాగుపడేదెలా?

దీనికి పరిష్కారం యువతే కనుగొనాలి. మానవత నేల్కొనాలి. నవత నలుదిశల పరిమళించాలి. యిదేమనం చేయవలసిన కర్తవ్యం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!