కులంతోకలు కత్తిరిద్దాం అనే ప్రతిపాదన అర్థంలేని మూర్ఖత్వం.

కులంతోకలు కత్తిరిద్దాం అనే ప్రతిపాదన అర్థంలేని మూర్ఖత్వం. 

మతాన్ని ఏంచేస్తాము?

భగవద్గిత చెప్పిన చతుర్వర్ణాలు,వృత్తులపై ఆధారపడిన వందల కులాలు,

అనేక హిందూమతాలు, అన్యమతాలు ఉన్న మనదేశంలో కులమతాలు

ఒక సామాజిక సత్యం, ఒక చారిత్రక పరిణామం. 

తెలుగువారిలో ఇంటి పేర్లు ఒక గత సంస్కృతికి ఉదాహరణ.

ఊరుపేరే ఇంటిపేరు అయినప్పుడు ఆఊరిపేరు అనేక కులాలలో ఉంటుంది. శృంగారకవి,నిమిషకవి, దిట్టకవి వంటిపేర్లు వారి వంశంలో కవులైన పూర్వీకులను గుర్తిస్తాయి. 

ప్రగడ, రాజు, కవి తరచుగా నియోగి బ్రాహ్మణులలోనూ, 

భట్ల మొదలైనవి వైదికులలోనూ కనుపిస్తాయి. 

కులాంతర,మతాంతర, దేశాంతర, స్వలింగ వివాహాలుకూడా జరుగుతున్న

ఈరోజులలో ఇవి కేవలం సామాజిక గుర్తింపును కలిగించేవి.

గోత్రం, ప్రవర ఇంకా ప్రాచినమైనవి. ఇవి తెలుగు సంస్కృతిలో భాగం. 

వీటికి ప్రాధాన్యము ఈయనవసరంలేదు, 

అలా అని విస్మరించవలసిన అవసరమూ లేదు. 

నిషేధాలు అనవసరం. 

సామాన్యంగా పేరు ఇంటిపేరు ఆ గుర్తింపు ఎలాగా ఇస్తాయి. 

కులంతోకలు కత్తిరిద్దాం అనే టీవీ9 ప్రతిపాదన అర్థంలేని మూర్ఖత్వం. 

మతాన్ని ఏంచేస్తాము? తెలుగు, సంస్కృతాలు హిందూ మతాన్ని, 

ఊర్దూ మహమ్మదీయ మతాన్ని, ఇంగ్లీషు క్రైస్తవ మత ప్రాబల్యాన్ని చూపిస్తాయనేది 

పరమ సత్యం. 

అందుకే కాన్వెంటు బడులు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!