దీపనిర్వాణగంధం చ!

శ్లో!!

దీపనిర్వాణగంధం చ!

సుహృద్వాక్య మరుంధతీం!

న జిఘ్రంతి న శృణ్వంతి!

న పశ్యంతి గతాయుషః!

నారాయణపండితరచితః హితోపదేశం (ప్రథమ భాగం)49-77

చావు మూడినవారు దీపనిర్వాణగంధమును పసికట్టరు,మిత్రవాక్యమును చెవిపెట్టరు,

అరుంధతీ నక్షత్రమును కనజాలరు అని పెద్దలు చెప్పుదురు.

తస్మాత్ జాగ్రత!

బాధలు చెప్పుకోవడం ఈ రోజుల్లో పెద్ద తప్పైపోయింది. 

మీ పిల్లలు తప్పు చేస్తున్నారు చూసుకోండి అని మంచి చెప్తే మరీ తప్పు. మీవాళ్ళు మరీ ఆకతాయిలైపోయారు, వాళ్ళకి జనం భయపడుతున్నారు అంటే ఘోరం చేసినట్టు చూస్తున్నారు. మీకే నష్టం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నేరం అంటున్నారు.

తప్పు చేస్తున్న వాళ్ళని మందలించడం, హింసకి దిగినవాళ్ళని శిక్షించడం మానేసి వెనకేసుకొస్తున్నారు. బాధలు చెప్పుకున్న వాళ్ళమీద ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ పిల్లల చేతిలో రాళ్ళు తీసుకొని పెద్దలూ మనమీదే విసురుతున్నారు. మాకు నొప్పిగా ఉందయ్యా మందివ్వండి అంటే మీదంతా నాటకం, మీ భుజకీర్తులు బూటకం, మీ మూతులు వంకర, మీకు ఇదివరకు వైద్యం చెసిన డాక్టర్ చెత్త అని ఏవేవో తిడుతున్నారు.

మీ చిన్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చెయ్యలేదా, వాళ్ళనెందుకు అడగలేదు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. "తరతరాలుగా మా దాయాదులే తప్పులు చేస్తున్నారు, ఇప్పుడే కదా మాకు అవకాశం దొరికింది" అంటున్నారు. మేమే కాదయ్యా, రాష్ట్రపతి, జడ్జీలు, సైంటిస్టులు, మేధావులు, కళాకారులు ఎందరో ఫిర్యాదు చేస్తున్నారు వినండి అంటే "వాళ్ళమొహం" అనేసి, వాళ్ళనీ నాలుగు తిట్టి, చెవిలో సెల్ ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అయినా నా మొహం. అడ్వాణీ లాంటి మహా మహా "మార్గదర్శకుల"కే దిక్కులేదు. మనమెంత?

పొయ్యిలో పిల్లి లేవడంలేదు, పప్పూ కూరలూ ధరలు మండిపోతున్నయి అని గోలపెడితే ఆ ధరల సంగతి ఏమీ చెయ్యలేక, ఆ చేతకానితనంతో మనతో మాట్లాడకుండా ఇంకెవరితోనో "గొడ్డుమాంసం తినకండి, అసలే మాంసం తినకండి, తింటే తంతాం, చంపేస్తాం" అని చెప్తునారు. అంటే మనలాంటి పప్పుసుద్దలకీ "మాట్లాడితే ఒళ్ళు చీరేస్తాం" అని సందేశం ఇస్తున్నారా?

అదేదో పద్యం గుర్తొస్తోంది... 

...అరుంధతిని కనడు, హితులమాట వినడు, దీపనిర్వాణ గంధమును మూర్కొనడు...

అని. అంతేనంటారా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!