Skip to main content
"వచ్చినవాడు ఫల్గునుడు"
"వచ్చినవాడు ఫల్గునుడు"
మనసుకు నచ్చిన మహాభారత పద్యం.!
(తిక్కన్న గారి పద్యం.)
.
వచ్చినవాడు ఫల్గునుడు , అవశ్యము గెల్తుమనంగ రాదు , రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ?
హెచ్చేగుంగుందగున్ దొడరుతెల్ల విధంబుల కోర్చు టట్లుగా
కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్
.
మహాభారత విరాట పర్వం లోనిదీ పద్యం .
ఉత్తర గోగ్రహణాన్ని నిలువరించడానికి గాండీవాన్ని పూరిస్తూ , అర్జునుడు ,
కౌరవ సేనకు అడ్డంపడ్డాడు .
.
కురుపితామహుడైన భీష్ముడు ఆ సందర్భంలో దుర్యోధనునితో చెప్పిన పద్యమిది .
.
” వచ్చిన వాడు అర్జునుడు . యుధ్ధంచేస్తే మనమే గెలుస్తామని వక్కాణించి చెప్పలేము . యుధ్ధంలో రెండుపక్షాలూ గెలవలేవు కదా . జయాపజయాలకు మనం సిధ్ధంగా ఉండాలి . దేనికైనా ఓర్చుకోవాలి . ఈ సమయంలో సంధి చేసుకోవడం కూడా సరియైనదే” .
అనుభవంతో పండిపోయిన వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి . అర్జునుడితో యుధ్ధం అంత సులభం కాదనే భావన వ్యక్తం చేసాడు . యుధ్ధంలో జయాపజయాలు దైవధీనాలని జ్ఞాపకం చేసాడు . ఒకవేళ ఓడిపోతే కలిగే అవమానం భరించరానిది కనుక సంధి చేసుకోవడంలో తప్పులేదని సూచించాడు . ఇంత యుక్తి యుక్తంగా చెప్పినా సుయోధనుడు వినలేదు . కయ్యానికే కాలు దువ్వాడు .
.
అందుకే అవమానాల పాలయ్యాడు .
Comments
Post a Comment