Sunday, May 31, 2015

అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.(శృంగార సంకీర్తన)


..

అన్నమాచార్య.!........ఉయ్యాలా బాలునూఁచెదరు కడు.(శృంగార సంకీర్తన)

.

శంకరాభరణం.

పల్లవి:

ఉయ్యాలా బాలునూఁచెదరు కడు

నొయ్య నొయ్య నొయ్యనుచు

చరణములు:

బాలయవ్వనలు పసిఁడివుయ్యాల

బాలుని వద్దఁ బాడేరు

లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల

లాలి లాలి లాలనుచు

తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల

పమ్ముఁ జూపులఁ బాడేరు

కొమ్మలు మట్టెల గునుకుల నడపుల

ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లుఁ జూపుల జవరాండ్లు రే

పల్లె బాలునిఁ బాడేరు

బల్లిదు వేంకటపతిఁ జేరి యందెలు

ఘల్లు ఘల్లు ఘల్లనుచు

శ్రీకృష్ణ శతకం.!........( 1 /6/15)... (శ్రీ నరసింహ కవి.)


                శ్రీకృష్ణ శతకం.!........( 1 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

.

వడుగుడవై మూడడుగుల

నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్

తొడిగితివి నీదు మేనునన్

గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!

.

కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా!

.

ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ.

.

వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.

x

Saturday, May 30, 2015

కృష్ణ శతకం .!.....(31/5/15.)


కృష్ణ శతకం .!.....(31/5/15.)

.

(కృష్ణ శతకం లోనిదీ పద్యం . కృష్ణ శతకం తిక్కన రాసిన దని

కొందరి అభిప్రాయం . ఈ శతకం ఇప్పుడు లభించడం లేదు .)

.

అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్జపై

నరుపై ద్రౌపదిపై గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై

బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంత రానిమ్ము నీ

చరణాబ్జమ్ములె నమ్మినాడ జగదీశా ! కృష్ణ భక్తప్రియా !.

.

భక్తులు ఎంతమందో ! గాంగేయుడు , విదురుడు , అకౄరుడు , కుబ్జ , ద్రౌపది , కుచేలుడు , నందుని పరివారమంతా ,చెప్పుకుంటూ పోతే ఎంతమందో . జగన్నాటక సూత్రధారి దయకు పాత్రులైనవారు లెక్కకు మించి ఉన్నారు

. .

భక్తుడు భగవంతునికి కొందరు భక్తుల పేర్లను జ్ఞాపకం చేసి , పరమాత్మా నేనుకూడా నీ శ్రీచరణాలను ఆశ్రయించిన వాడినే . ఇతర భక్తులమీద చూపిన కృప నా మీద కూడా కొంతైనా ప్రసరింపజేయవా ! అని దీనంగా అర్థిస్తున్నాడు .

నేను నీ భక్తుణ్ణేనని చెబుతూ , కృష్ణా భక్త ప్రియా అని సంబోధించి ఆ స్వామి దయకు డవుతున్నాడు . ” శరణం నీ దివ్య చరణం ” అని భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు కరిగిపోడా

శ్రీకృష్ణ శతకం.!........( 30 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

        శ్రీకృష్ణ శతకం.!........( 30 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.

కెరలి యఱచేత కంబము

నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్

ఉదరము జీరి వధించితివి

నరహరి రూపావతార నగధర కృష్ణా!

.

నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు. 

.

భావం: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు.

.

హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.

x

Friday, May 29, 2015

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(30/5/15.)
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(30/5/15.)

.

ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేఁడెల్లియో

కడ నేడాది కొ యెన్నడో యెరుగమీ కాయంబు లీ భూమిపై

బడగా నున్నవి , ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్

చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో ? శ్రీ కాళహస్తీశ్వరా !

.

ఈశ్వరా ! ఘడియకో ,రెండు ఘడియలకో ,మూడు ఘడియలకో కాకపోతే రేపో , ఎల్లుండో మరి ఏడాదికో ఈ శరీరాలు భూమిపైన పడబోతున్నాయన్న విషయం తెలిసి కూడ ఈ మానవులు ధర్మమార్గాన్ని అనుసరించడం లేదు. మూర్ఖులైన వీరు నీ పాదాలను సేవించడం వలన కలిగే ప్రయోజనం కూడ తెలుసుకోలేకపోతున్నారు . అయ్యో..

.

బాలకృష్ణుని ...సంభాషణా చాతుర్యం.!

బాలకృష్ణుని ...సంభాషణా చాతుర్యం.!

.

(పోతనామాత్యు ని భాగవతం.)

.


గోప కాంతలు యశోదతో మొరపెట్టుకొన్న విధం. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నామమ్మా అని.

.
ఓ యమ్మ: నీ కుమారుడు


మాయిండ్లను బాలుబెరుగు మననీడమ్మా:


పోయెద మెక్కడి కైనను


మాయన్నల సురభులాన మంజులవాణీ!

.


కిట్టయ్యను యశోద ఇలా నిలదీసింది. మన్నెందుకు తిన్నావురా కన్నా అని.

.

మన్నేటికి భక్షించెదు?


మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ


యన్నయు సఖులును జెప్పెద


రన్నా! మ న్నేల మఱి పదార్ధము లేదే?

.


ఎబ్బే నేనెందుకు మన్ను తింటాను? వాళ్ళూరికే చాడీలు చెబుతున్నారు. అన్నాడు బాలకృష్ణుడు

.

ప్రేయసీ నువ్వో చిన్న కురంగం.!

ముళ్ళపూడి వెంకట రమణ సాహితీ సర్వస్వం..కధారమణీయం..లోనుంచి.


"ప్రేయసీ నువ్వో చిన్న కురంగం

పాపం నీది నిర్మలాంతరంమంచి వాడుగం

నేనుతప్పమిగతావాళ్ళు నీకు చేస్తారుశృoగభంగం

అందుకే నాకు తప్పఅందరికీ తిప్పు తారంగం"

వీడున్నాడే--వీడు

(అంటే '' నేను ''అనే వాడు )

వీడుబహు మంచి వాడు

అందరి లాంటి వాడూకాడు

వీడిలాటివాడు.వీడే

ప్రేయసీ

తారరంపం...తారరంపo తరరంపం

నీ కోసం నాపాలిటి రంపం

జింపం.జిగిజింపం..జిగిజింపం

వస్తోందదుగో భూకంపం

కానీనాకు ఎంత మాత్రం రాదు కంపం

నిత్యం చేస్తాను నీ నామజపం

పాడకు పాడకు తారంగం

నా పాలిటి ముద్దుల కురంగం

భరిస్తాను నీ పరాకు

కానీ వొద్దుబాబోయ్ చిరాకు

ఇది కేవలం నిన్నటిఎంగిలాకు.''

x

Thursday, May 28, 2015

సత్యభామ .!


.

సత్యభామ .!

.

"వేణిన్ జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ 

శ్రేణిన్ దాల్చి ముఖేందు మండల మరీచీజాలముల్ పర్వగా 

పాణిం బయ్యెద చక్కగా దురిమి శుంభద్వీరసంరంభయై 

యేణీలోచన లేచి నిల్చె తన ప్రాణేశాగ్రభాగంబునన్."

.

అందమైన పద్యాలకు ఆలవాలం పోతన భాగవతం .

.

సత్యభామ యుధ్ధం చేసే ఘట్టం . యుధ్ధం చేసే సత్యభామ ” తన బారెడు జడను ముడి వేసుకున్నదట . చీర ముడి కూడా బెగించింది . నగలూ గట్ర్రా అడ్డం రాకుండా వాటిని సరి చేసుకున్నది . పైట బిగించింది . చంద్రబింబాన్ని మించిన అందమైన మోము కాంతులు వెదజల్లుతూ పోతన్నకు కనిపించింది . ఈ పనులన్నీ నిమేష మాత్రంలో ముగించుకొని తన ప్రాణేశుని అగ్ర భాగంలో నిలుచున్నది లేడికన్నుల సత్యభామ .

.

ఎంత అందమైన వర్ణన . ఈ పద్యం రాయాలంటే తలపులో సత్యా కృష్ణులను ఊహించుకోవాలి . యుధ్ధం చేయడానికి ఏనుగుల గుంపుల సహాయం తో పైన పడుతున్న నరకాసురుడూ కనిపించాలి . శృగారానికి ప్రతిరూపంగా నిలిచే సత్యభామ జడా , పయ్యెదా , కడుతున్న చీర ముడీ , కదిలే ఆభరణాలూ , నేను యుధ్ధం చేస్తానంటూ ముందుకు రావడం లాంటి దృశ్యాలు కనుల ముందర కదలాలి . వీటన్నిటినీ నిశితంగా పరిశీలించి అందమైన పద్యంలో అమర్చాలి .

.

సుకుమారి అయిన సత్యాదేవి , దుష్టులకు బుధ్ధి చెప్పడానికి పయ్యెద బిగించి యుద్ధానికి తలపడిన దృశ్యం మనలను కూడా చెడ్డవారితో పోట్లాడడానికి ఉద్యుక్తులను చేస్తుంది . చేయమని ప్రబోధిస్తుంది

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి-శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి.. గీతం.!


.

శ్రీ దేవులపల్లి  కృష్ణ శాస్త్రి గారి.. గీతం.!

.

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి

ప్రాంగణమ్మున గంట పలుకదోయి

.

దివ్యశంఖము గొంతు తెరువ లేదోయి- 

పూజారి గుడి నుండి పోవలేడోయి

.

చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు-

ఊరూర నిటింట ఊరకే పూచాయి

.

శిథిలాలయమ్ము లోశిలకెదురుగా పూలు- 

పూజారి కొకటేని పూవు లేదోయి

.

వాడవాడల వాడె జాడలన్నిట వాడె-

ఇంటి ముంగిట వాడె ఇంటింటి లో వాడె

.

శిథిలాలయమ్ము లో శిలను సందిట బట్టి- 

పూజారి వాని కై పొంచి ఉన్నాడోయి

Wednesday, May 27, 2015

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(28/5/15.)


.

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(28/5/15.)

.

జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే

వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా

నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ

చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! 

ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా !

వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది .

ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన.

తనకు మోక్షాన్ని పొందే అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన.

దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..!

దాసు శ్రీరాములు...(కీర్తన)..........కట్టివైతునా పడకింటిలో ..!

.

కాంభోజి - త్రిపుట 

.

పల్లవి: 

కట్టివైతునా పడకింటిలో వాని

బట్టి పైట కొంగున ॥కట్టి॥ 

అనుపల్లవి: 

ఇట్టివాడు వంట - ఇంటి కుందేలాయె

ఎక్కడ బోయే ననుకో రాదమ్మ ॥కట్టి॥ 

చరణ: 

విడచితినా సామి - వీధివీధి తిరిగి

- వేగత్తెల గుడునే

తడబాటులేక చే - తను జిక్కినప్పుడే

చెడనీక పదిలము - చేసుకోవలెనమ్మ ॥కట్టి॥ 

ఏమరి నేనూరకుంటినా - ఈ రాత్రి

- ఏవేళ కేబుద్ధియో

కోమలమున నింత - గోవగొన్నవాడు

వామాక్షి మనవాడ నమ్మరాదమ్మా ॥కట్టి॥ 

మోస పోతిని వేణు - గోపాల దేవుని

- బాస నిజము గాదే

దాసు శ్రీరామదాసుని - హృదయము

బాసి గడియయైన - నిలువ నొల్లడమ్మా ॥కట్టి॥

Tuesday, May 26, 2015

నీ పాద కమల సేవ .!

నీ పాద కమల సేవ .!

నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే

.

సుదాముడు మధురానగరంలో మాలాకారుడు అంటే పూలు అమ్ముకునే వాడు .

మధురా నగరిలో ప్రవేశించిన బలరామ కృష్ణులు సుదాముని ఇంటికి వెళ్ళారు .

వారిని చూచిన వెంటనే తత్తరపాటుతో తన ఆసనాన్నుండి లేచి నమస్కారం చేసాడు సుదాముడు . అర్ఘ్య పాద్యాలను , తాంబూలాలను , పూలు , గంధము మొదలైన వస్తువులను ఆనందభరితుడై వారికి ఇచ్చాడు . పరిమళాలు వెదజల్లే పూలమాలలతో వారి గళసీమను అలంకరించాడు .

.

మీ రాకతో నా ఇల్లు పావనమయ్యింది , తపస్సు పండింది , నా ఇల్లు సిరి సంపదలతో నిండింది , నా కోరికలన్నీ తీరినాయి . నేను ఏ పనులు చేయాలి ? అని వారితో పలికాడు . సంతోషించిన బలరామకృష్ణులు ఏం కావాలో కోరుకొమ్మన్నారు .

.

ఆ సందర్భంలో సుదాముని నోటినుండి వచ్చిన మాటలు పద్య రూపంలో మన కందించాడు పోతన్న . పద్యానికి అర్థం చెప్పదం అవసరం లేదనుకుంటాను . సులభంగా లేదూ ?

భగవంతుడు కనబడి నీకేమి కావాలని అడుగుతే , అడగడానికి ఏమీ ఉండదు . ఆ ముగ్ధమోహన మూర్తి దర్శనంతో కోరికలన్నీ నశిస్తాయి . ఆ మహాత్ముని పాదాలకు సేవ చెయ్యాలనే కోరిక తప్ప మరేమీ మిగలదని ఈ పద్యం చెబుతుంది .

పుష్పక విమానం (Pushpaka Vimana).!


.

పుష్పక విమానం (Pushpaka Vimana).!

.

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.పుష్పక విమానం

రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సితాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించ బడింది.

.

(సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారివర్ణన.)

.

యమకుబేర వరుణ దేవే0ద్రాదుల / సర్వస0పదల మి0చినది

విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది / బ్రహ్మవరమున కుబేరుడ0దినది 

రావణు0డు కుబేరుని రణమ0దు / ఓడి0చి ల0కకు గొని తెచ్చినది

పుష్పకమను మహావిమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

.

నేలను తాకక నిలచియు0డునది /రావణ భవన మద్య0బుననున్నది

వాయు పథమున ప్రతిష్టితమైనది / మనమున తలచిన రీతి పోగలది

దివిను0డి భువికి దిగిన స్వర్గమది / సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది

పుష్పకమను మహా విమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది. 

.దేవశిల్పి అయిన విశ్వకర్మ, బ్రహ్మదేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్దనుండి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి "మండోదరి" దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకొన్నాడు. రావణ వధానంతంరం శ్రీరాముడు దానిని ఎక్కి లంక నుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునికిచ్చాడు.మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.

x

నిర్మలమ్మ.!


x
.
నిర్మలమ్మ.!
.
షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది.
అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ)
అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు
.
కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సంధర్భాల్లో గుర్తు చేసుకునేది.
.
ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
.
నిర్మలమ్మ ఆడపెత్తనం లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు.
తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం.
ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్.
నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.
.

శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.


శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.

అందఱు సురలును దనుజులు


పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా


నందముగ కూర్మరూపున


మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!

.


ప్రతిపదార్థం: మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగ అంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటే కవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం!

.


భావం: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. 

.


విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.

.

Monday, May 25, 2015

అప్పటి మాటలకు.! . కీర్తన........ దాసు శ్రీరాములు.

.

అప్పటి మాటలకు.! 

.

కీర్తన........ దాసు శ్రీరాములు

.

తోడి - త్రిపుట

పల్లవి:

అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని

అప్పటి గప్ప నిచ్చెనటే చెలి ॥అప్పటి॥

అనుపల్లవి:

తప్ప నే నితరుల - దరి జేరనని యెన్నో

చెప్పిన తలచు కొంటినే ఓ చెలి ॥అప్పటి॥

చరణ:

తొలినాటి వగలే యా - మరునాటి పగలు మా

చెలిమి కాకియు కో - వెల చందమాయెనే ॥అప్పటి॥

పడతి మగవారి బారు - పడకింట మితిమీరు

గడప దాటిన వెనుక - కారు మన వారు

బడిబడి నాడు వారు - బ్రతిమాలి పాదముల

బడి వేడు కొన్నగాని - పలుకే మేల్మి బంగారు ॥అప్పటి॥

కాసు వీసము లిచ్చి - గోస గూసల మసి

బూసి నేరేడు గాయ - జేసెనే చెలి

వేసాలమారి మా - వేణుగోపాల మూర్తి

దాసు శ్రీరామకవి - డాసి యేలుచుండెనే ఓ చెలి ॥అప్పటి॥

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25/5/15.)


.

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25/5/15.)

.

జాతుల్సెప్పుట , సేవజేయుట ,మృషల్ సంధించుట న్యాయాప

ఖ్యాతిం బొందుట , కొండెగాడవుట , హింసారంభకుండౌట , మి

థ్యాతాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి , యా

శ్రీ తానెన్ని యుగంబు లుండగలదో ? శ్రీ కాళహస్తీశ్వరా !

.

ఈశ్వరా ! ఈ జనం డబ్బు సంపాదించడంకోసం జాతకాలు చెప్పడం , రాజుల అడుగులకు మడుగులొత్తడం , అబద్ధాలు చెప్పడం , ధర్మము తప్పి ప్రవర్తించడం , పితూరీలు చెప్పడం , హింసకు పాల్పడటం , పుస్తకాల్లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వంటి అకృత్యాలకు పాల్బడుతున్నారు. మరి ఈ సంపాద ఎన్ని యుగాలుంటుందో ఏమో ?

.

అస్థిరం ,అశాశ్వతం , క్షణభంగురం , చంచలం అయిన ధనం కోసం మానవులు ఎన్నో అక్రమాలను చేస్తున్నారు . ఈ ధనమేమైనా వీరితో కలిసి యుగ యుగాలు ఉంటుందా ఏమిటి ?ఉండదు కదా ! ఈ విషయాన్ని మరచిపోయి వీరు మూర్ఖులై ప్రవర్తిస్తున్నారు. శాశ్వతుడవైన నిన్ను చేరడానికి మాత్రం వీరు ప్రయత్నించడం లేదనేది కవి వేదన . 

.

శ్రీకృష్ణ శతకం.!........( 25 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.


.
శ్రీకృష్ణ శతకం.!........( 25 /5/15)... (శ్రీ నరసింహ కవి.)
.
ఆదివరాహుడవయి నీ
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
...
మోదమున సురలు పొగడఁగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!
.
భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు.
.
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగి ఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు.
.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.

Sunday, May 24, 2015

పులి-కంకణము-బాటసారి .!

.

 

పులి-కంకణము-బాటసారి .!
.
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము
.
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓ...రీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు."


పాట పాడుమా కృష్ణా.!

 
లలిత గీతం
సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు

పాట పాడుమా..ఆఅ..
పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆఅ...

శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె..ఏ..
శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె
సదమల హృదయా నిన్ను
సన్నుతింతు వరనామము

పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా

సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా..ఆఅ..
సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా
దానికంతమగు గానము
పాటకూర్చి పాడుమా

పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆ..ఆ..
 

Saturday, May 23, 2015

మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.!

 .

మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.!
.
మహాకవి ధూర్జటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానకవి గా మన్నన లందినా తన కావ్యాలను మాత్రం శ్రీకాళహస్తీశ్వరునకే అంకితం చేశాడు. వైష్ణవ మతాన్ని స్వీకరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంతాన్ని కావ్యంగా వ్రాసిన శ్రీ కృష్ణ దేవరాయలు వీరశైవుడైన ధూర్జటిని తన ఆస్థానం లో పోషించడం శ్రీ రాయల వారి పరమత సహనాననికి ప్రతీక యని కొందరు వ్రాశారు.
. ...

విమర్శకులు భావిస్తున్నట్లుగా శ్రీ రాయల వారి మరణానంతరం కూడ ధూర్జటి జీవించి యుండవచ్చు. జీవనాన్ని కొనసాగించడానికి రాజులను ఆశ్రయించి , వారి అభిరుచుల కనుగుణం గా తానుండలేక ఇడుముల పాలయినట్లు గాను మనం భావించవచ్చు. కవి వ్రాసిన కవిత్వాన్ని తనకు అంకితం చేయకుండా ఉన్నా అతన్ని పోషించడానికి రాజులు అందరూ శ్రీ రాయలవారి అంత ఉదారులు ఉండరు కదా . అదే మహాకవి కి ఇబ్బందిని కల్గించి ఉంటుంది. మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ మహాదేవునికి కాక తన కవిత్వం మరొకరిపై చెప్పననే మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ రాజులకు కంటకమై , కవికి జీవనవ్యయానికి ఇబ్బంది కల్గించి ఉండవచ్చు. నీకుంగాని కవిత్వమెవ్వరికి ........ (113 ) పద్యమే అందుకు ఉదాహరణ.
.
అందుకే మనకు ఈ శతకం లో ఆత్మనివేదన తో పాటు రాజాశ్రయ తిరస్కారము లేక రాజనింద అనేది ప్రధానాంశం గా కన్పిస్తోంది.
.
మనకు లభించని కొందరు మహాకవుల చరిత్రల్లో ధూర్జటి జీవితం కూడ ఒకటి. ఈయన అష్టదిగ్గజాలలో ఒకరు గా ఉన్నట్లు ( ? ) చెప్పబడుతోంది కాని తల్లిదండ్రులను గురించి కాని , నివాసప్రాంతాన్ని గురించి కాని స్పష్టంగా తెలియడం లేదు. కాళహస్తి లో నివసించేవాడని . ఈయన కోరిక మేరకే ఒకటి రెండు సార్లు వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తిని దర్శించి ఉంటారని కొందరు వ్రాశారు.
.
భక్తి శతకాలలో సహజం గా కన్పించే ఆత్మ నివేదన , ప్రస్తుతి తో పాటు ఈ శతకం లో సంసార నిరసనము , రాజతిరస్కారము కూడ సమాన ప్రాతినిధ్యాన్ని పొందాయి. సూక్ష్ణంగా యోచిస్తే కవిసార్వభౌముడు శ్రీనాథుని జీవితానికి, మహాకవి ధూర్జటి జీవితానికి పోలికలున్నాయేమో ననిపిస్తోంది. వయసు లో భోగలాలసత తో విలాస జీవితాన్ని గడిపిన ధూర్జటిని చివరి రోజుల్లో కుటుంబ ఖర్చులు , ఒత్తిళ్లు ఇబ్బందికి గురిచేశాయి. కూతుళ్లు , పెళ్ళిళ్లు ,ఇచ్చిపుచ్చుకోవడాలు వీటికి అవసరమైన ధనాన్ని కూర్చుకోలేక పడిన ఇబ్బందులు , ఇవన్నీ కవిపై ప్రభావాన్ని చూపాయి. ” ఆలంచు న్మెడగట్టి ........ ఇచ్చిపుచ్చుకొను సంబంధంబు గావించి ...” (36 ) వంటి పద్యాలు ఇందుకు ఉదాహరణలు . నమ్ముకున్న ఈశ్వరుడు అవసరానికి తనను ఆదుకోవడం లేదనే ఉక్రోషం కూడ అప్పుడప్పుడూ కవిలో కన్పిస్తుంది.
.
మంచి బంగారానికి ఒరిపిడి ,పరమ భక్తునికి పరీక్ష లు తప్పవు కదా.

శ్రీకృష్ణ శతకం.!........( 24 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీకృష్ణ శతకం.!........( 24 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.

కుక్షిని నిఖిల జగంబులు

నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్

రక్షక వటపత్రముపై

దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!

.

ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క; నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి.

.

భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం!

.

ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

.

యమునితో ముఖాముఖీ.!

.

యమునితో ముఖాముఖీ.!


.

సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు

 ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు.

 చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం. 

.


మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే. 

అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు.

 సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు. 

కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు.  కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట్టకట్టాడు.

 ఇది ఎలా సాధ్యం? దేవుళ్ళు కాబట్టి అనే సమాధానం, కల్పిత కథ కాబట్టి అనేసమాధానం పొసగవు.


శ్రీ కృష్ణుడు తనగురువు కొరకై ఏ యోగి, ఏ తపస్వి చేయని యోగ ప్రక్రియ చేసినాడు. గురుదక్షిణగా తన మృత పుత్రుని తీసుకు రావలేనని సాందీపని ఆయనను కోరెను. 

కృష్ణుడు వెంటనే ధ్యాన ముద్రలో స్వాధిష్ఠానమునకు వెళ్ళినాడు.

 వెంటనే అతని దివ్య శరీరము యమలోకములో ప్రత్యక్ష మైనది

. యముడు ఏమికావాలని అడుగగా కొన్ని సంవత్సరముల క్రితం చనిపోయిన గురుపుత్రుని జీవాత్మ కావలెనని అడిగి తీసుకొని భూలోకమునకు వచ్చినాడు.

 అప్పటి వయసు ఎంత ఉండునో, అట్టి శరీరమును యోగశక్తిచే సృష్టించి, జీవుని అందు ప్రవేశింపజేసినాడు. ఇది అనితర సాధ్యము అనిపిస్తుంది.

Friday, May 22, 2015

శ్రీ కృష్ణావతారం.!

.
శ్రీ కృష్ణావతారం.!
.
పంకజముఖి నీళ్ళాడగ ,
సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్
...
సంకటము దోచె , మెల్లన ,
సంకటములు లేమి దోచె సత్పురుషులకున్
.
దివినుండి భువికి దిగి వస్తున్నాడు శ్రీకృష్ణుడు –దేవకీ మాత గర్భాన్నుండి
. పురిటి నొప్పులతో సంకటపడుతోంది దేవకీ దేవి .
చెడ్డవారి మనసుల్లో , సంకటాలు మొదలవుతాయనే భావం కలిగింది .
మంచివారికి సంకటాలు తీరిపోతాయనే నిజం తెలిసింది .
డీన్నే మనం ముద్దుగా సిక్స్త్ సెన్స్ అని అంటామేమో .
.
భాగవతంలో శ్రీకృష్ణావతార ఘట్టంలోని ప్రథమ పద్యం ఇది . దశమ స్కంధం పూర్వభాగం

శ్రీకృష్ణ శతకం.!........( 23 /5/15)... (శ్రీ నరసింహ కవి.).

మగ మీనమువై జలధినిశ్రీకృష్ణ శతకం.!........( 23 /5/15)... (శ్రీ నరసింహ కవి.). 

.

పగతుని సోమకుని జంపి పద్మ భవునకు


న్నిగమముల దెచ్చి యిచ్చితి


సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!

.


భావం: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం.

.


ప్రతిపదార్థం: సుగుణాకరా అంటే మంచి గుణములకు నెలవైనవాడా; దివ్యసుందర అంటే దైవసంబంధమైన సౌందర్యం కలవాడా; ఓ కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీవు అంటే నువ్వు; జలధిని అంటే నీటికి నిధి అయిన సముద్రంలో; మగమీనమువై అంటే మగచేపవై (మీనావతారం); పగతుని అంటే శత్రువు అయిన; సోమకుని అంటే వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని; చంపి అంటే వధించి; పద్మభవునకున్ అంటే పద్మమునుండి పుట్టిన బ్రహ్మకు; నిగమములన్ అంటే వేదాలను; తెచ్చి యిచ్చితి అంటే తెచ్చిఇచ్చావు; మేలు అంటే ఎంత ఆశ్చర్యం!

.


చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు.

.

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(23/5/15.)


.
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(23/5/15.)
.
తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియు బెద్దల్చావగా జూడరో
భీతిన్ బొందగనేల చావునకుఁగాఁబెండ్లాము బిడ్డల్హిత
వ్రాతంబు ల్తిలకింప , జంతువులకు న్వాలాయమై యుండగా
చేతోవీధి నరుండు నిన్గొలవడో శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తీశ్వరా ! తమ తాతలు , తండ్రులు ,వృద్ధులు తమ కళ్ళముందే చావగా ఈ మానవులు చూస్తున్నారు కదా ! మరి చావంటే భయపడతారెందుకు ?భార్య ,పిల్లలు ,హితులు అందరూ చూస్తుండగానే జీవులకు చావన్నది దాపురించుచుండగా దానిక్కూడా భయపడుతున్నాడు ఈ మానవుడు. కాని నిన్ను మాత్రం మనస్సులో కూడ స్మరించలేక పోతున్నాడు. ఎంత దురదృష్టవంతుడో కదా !
.

x

Thursday, May 21, 2015

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22/5/15.)


.
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22/5/15.)
.
పదివేలైనను లోక కంటకులచే ప్రాప్తించు సౌఖ్యంబు నా
మదికిన్ పథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుడై సత్య దా
...
న దయాదుల్గల రాజు నాకొసగు మే న్నన్వాని నీయట్ల చూ
చి దినంబు న్ముద మొందుదుం గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా !
.

శంకరా ! ప్రజారంజకులు కాని వారి వలన ప్రాప్తించు వేలకువేలైనను నా మనస్సునకు ఆనందమును కల్గించలేవు.
అన్ని విధాల సమదర్శి గా ఉంటూ ,దయ , దాన , సత్య గుణములు గల్గిన రాజుని ఒక్కని నాకు ప్రసాదింపుము .
చివరి వరకు ఆయన యందు నిన్ను దర్శించుకొనుచు , ప్రతిదినమును ఆనందించెదను స్వామీ !

ఆట కదరా శివా... ఆట కద కేశవా.
ఆట కదరా శివా... ఆట కద కేశవా...
ఆట కదరా శివ, ఆట కద కేశవ.. ఆట కదరా నీకు అమ్మ తోడూ...
ఆట కద జననాలు... ఆట కద మరణాలు...మద్యలో ప్రణయాలు ఆట నీకు...
ఆట కద సొంతాలు... ఆట కద పంతాలు... ఆట కద అంతాలు ఆట నీకు...
ఆట కదరా నలుపు... ఆట కదరా తెలుపు... నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు...
ఆట కదరా మన్ను... ఆట కదరా మిన్ను.. మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను...
ఆట కదరా శివా.... ఆట కద కేశవా....
..........(తనికెళ్ళ భరణి)

కాలం భగవంతుడే.!

 

 

.

కాలం భగవంతుడే.
కాలంలోనే సృష్టి జరుగుతుంది. కాలోస్మి అన్నాడు పరమాత్మ.
కాలుడు అంటే యముడు, కాల ధర్మం అంటే మృత్యువు.
వ్యక్తికి నూరేళ్ళూ, సృష్తికి అనంత కాల చక్రము.

శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). ..
శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). .
.
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ
...
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!
ప్రతిపదార్థం: నక్రగ్రహ అంటే మొసలిని చంపినట్టి; సర్వలోక అంటే అన్నిలోకాలకు; నాయక అంటే అధిపతివైనట్టి; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; శక్రసుతున్ అంటే ఇంద్రుని కుమారుడైన అర్జునుని; కాచుకొరకై అంటే రక్షించడానికిగాను; చక్రము అంటే సుదర్శన చక్రాన్ని; చేపట్టి అంటే చేతియందు ధరించి; భీష్ము అంటే భీష్మపితామహుడిని; చంపఁగ అంటే సంహరించడానికి; చను అంటే బయలుదేరిన; నీ అంటే నీయొక్క; విక్రమము + ఏమని అంటే పరాక్రమాన్ని ఏ విధంగా;పొగడుదు అంటే పొగడగలను.
భావం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు.
కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.

పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.)


పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.)
.
మా అమ్మగారికి ఇష్టమైన పద్యం .
( భాగవత దశంస్కంధంలో కనిపిస్తుందీ కమనీయ పద్యం .)
.

"నంద తపఃఫలంబు ,సుగుణంబుల పుంజము , గోపకామినీ
 బృందము నోముపంట ; సిరి విందు ; దయాంబుధి ; యోగి బృందముల్
 డెందములందు గోరెదు కడింది నిధానము సేర వచ్చె నో
 సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్"
.
రోహిణీ నక్షత్రం . గోపాలకృష్ణుని పుట్టిన దినం . కమ్మని కస్తూరి తావులు పుడమి అంతా అల్లుకున్నాయి . మనసు ఆనంద పరవశమయింది . తటాలున మా అమ్మ జ్ఞాపకం వచ్చింది . చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ నేర్పించిన పద్యం జ్ఞప్తికి వచ్చింది . శ్రీకృష్ణుడు మధురానగరానికి వస్తున్నాడు . సరస సంగీత శృగార చక్రవర్తి , సకల భువనైక చారుమూర్తి తమ నగరానికి వస్తున్నాడని తెలిసిన మధురానగర మనోహారిణుల మనసులు ఆనంద పరిప్లుతాలయినాయి .పరమాత్మ  దర్శనమిస్తే   హృదయం ఝల్లుమనదా !
శ్రీయుతమూర్తియై కరుణ చిందే చూపులతో శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో ప్రవేశించాడు . శ్యామలాంగుడు అల్లనల్లన అడుగులిడుతూ కనిపించాడు , ఆ పట్టణంలో నివసించే రమణులకు .  స్వామిని చూచిన ఆ భామినులు ముగ్ధులైపోయారు . తమ స్నేహితులను స్వామిని చూడమని అహ్వానిస్తున్నారు :
.

“నందుడు చేసిన తపస్సుకు ఫలితంగా లభించిన మాధవుడితడు . సుగుణాలకు ఆలవాలం . గోపకామినులు నోచిన నోముల పంట . శ్రీ మహాలక్ష్మికి విందుభోజనం లాంటివాడు . ( ఈ స్వామిని చూడగానే ఆమె కడుపు నిండిపోతుంది . విందు అక్కర లేదు ) . కరుణా సముద్రుడు . యోగులు తమ హృదయాలలో నింపుకోవాలని కోరుకునే పెన్నిధి . రమణీలలామలారా ! పరుగు పరుగున రండి . కనులనిండుగా కృష్ణుని దర్శనం చేసుకుందాం . పునీతుల మవుదాం “.

తమకు కలిగిన భాగ్యాన్ని తమకు కావలసిన వారితో పంచుకోవాలనే మధురానగర మగువల తపన ఈ పద్యంలో కనిపిస్తుంది .   మంచి అందరూ కలిసి అనుభవించాలి . అప్పుడది ద్విగుణీకృతమవుతుంది . ఆ భావన మనలో కలిగించితే ఈ పద్యం సార్థక మవుతుంది .

 

చోద్యం చూస్తో చిన్నది.....(పొన్నాడ వారి రంగుల బాపు..ఎంకి..)

చోద్యం చూస్తో చిన్నది.....(పొన్నాడ వారి రంగుల బాపు..ఎంకి..)

.

.ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

కూకుండ నీదురా కూసింతసేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది

దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

యీడుండ మంటాది యిలుదూరిపోతాది

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

మందో మాకో యెట్టి మరిగించినాదీ

వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

(శ్రీ నండూరి సుబ్బారావు..)

Wednesday, May 20, 2015

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.).

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.).

.

కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణ క్రియా

లీలాచాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత

వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రా నాహార్య వజ్రంబు ది

క్చేలాలంకృత! నీదు నామ మరయన్; శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! దిక్కులనే వస్త్రములుగా ధరించిన వాడా ! దిగంబరా ! శంకరా ! నీ నామము యమధర్మరాజు లోకమున ప్రవేశించుటకు గల తలుపు నకు గడియ వంటిది.యముని విజృంఙణలను లీలగా అడ్డుకో గల్గినది. చిత్రగుప్తుని నోరు అనెడి పుట్టయందు కదలాడెడి నాలుక యనెడి మహాసర్పమునకు గరుత్మంతుని వంటిది . మృత్యుదేవత నోటియందలి కోరలనెడి పర్వతాలకు వజ్రాయుధము వంటిది. నీ నామమును స్మరించి నంతనే మృత్యువు దూరంగా తొలగి మోక్షము లభించును కదా !

“దిక్చేలాలంకృత “ ఎంత అందమైన సంబోధన . మహాకవి ఏకేశ్వరోపాసకుడై మహాశివుని మాత్రమే పరదైవతం గా భావించి ,పూజించాడు . తాను వ్రాసిన రెండు కావ్యాలను ఆ మహాదేవునికే సమర్పించిన పరమభక్తుడు. “ నమశ్శివాయ “ అంటేనే పాపాలు పటాపంచలౌతాయి. “నమశ్శివయ్య” అంటే ఆ స్వామి అక్కున చేర్చుకుంటాడు .

శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). .

శ్రీకృష్ణ శతకం.!........( 21 /5/15)... (శ్రీ నరసింహ కవి.). .

.

అందెలు గజ్జెలు మ్రోయగ

చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా

నందుని సతి యా గోపిక

ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!

.

.

ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు.

.

ప్రతిపదార్థం: కృష్ణా అంటే శ్రీకృష్ణా; అందెలు అంటే కాలికి అలంకారంగా పెట్టుకునే కడియాల వంటి ఆభరణం; గజ్జెలు అంటే ఘల్లుఘల్లుమని శబ్దం చేసే కాలియందు ధరించిన గ జ్జెలు; మ్రోయగన్ అంటే శబ్దం చేస్తుండగా; చిందులు అంటే కాళ్లతో అస్తవ్యస్తంగా చిందులు; త్రొక్కుచును అంటే వేస్తూ; వేడ్క అంటే ఆనందం; చెలువారంగా అంటే అందం ఎక్కువ అవుతుండగా; నందుని సతి అంటే గోకులంలో ఉండే నందుని భార్య అయిన యశోద; ఆ గోపిక అంటే గోపకాంతకు (తల్లి అయిన యశోదకు); ముందర అంటే ఎదురుగా నిలబడి; మిగుల అంటే ఎక్కువగా; మురియుచు అంటే ఆనందిస్తూ; ఆడుదువు అంటే నాట్యం చేస్తావు

..

పసిపిల్లల కాళ్లకు కడియాలు అలంకరించి తల్లి మురిసిపోతుంది. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని శబ్దం చేస్తూ పిల్లలు నడుస్తూంటే ఆ ఇంటికి కొత్త అందం వస్తుంది. చిన్నికృష్ణుడు యశోదకు ఆనందం కలిగిస్తే, ఇంటింటా బుల్లి కృష్ణులు తల్లులను మురిపిస్తారని కవి ఈ పద్యంలో వివరించాడు.

కరుణ శ్రీ.!

కరుణ శ్రీ.!
.
"ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై."

x

Tuesday, May 19, 2015

ఉత్తర రామాయణంలో సీత.!

ఉత్తర రామాయణంలో సీత.!

.

తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు

     దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు

     గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు

     బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు.

.

పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది.

.రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు “ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది.


రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్నది. కేతనమూ కనుమరుగై పోయింది. గుర్రపు గిట్టలవల్లా, రథచక్రాలవల్లా రేగుతున్న దుమ్ము మాత్రమే కనిపిస్తున్నది. ఆమె ఆ రథ పరాగాన్నే చూస్తున్నది. ఆ ధూళి కూడా మాయమైపోయింది. ఇంకేమున్నది, వట్టి బయలు! ఆమె అలానే చూస్తూ వుండిపోయింది. ఎంత చూస్తే మాత్రం ఏమున్నది. అంతా శూన్యం. వట్టి బయలు. బైటా, మనసు లోపలా కూడా.

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(20/5/15.).

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(20/5/15.).

.

మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా ! మోక్షంబు నేడే మయా

ముదియంగా ముదియంగ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న

న్నది సత్యంబు , కృప దలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ న్గొ

ల్చి దినంబు న్మొరపెట్టగా కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! పూర్వము నీ భక్తుల కెందరకో మోక్షమిచ్చావు కదా . మరి ఇప్పుడేమయ్యింది. ముసలి తనం లో రాను రాను పిసినారితనం పెరుగునన్న మాటలు నిజమే . లేకపోతే ఒక పుణ్యాత్ముడు ఆత్మ లో నిన్నే ఆరాధిస్తూ , రోజంతా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవు. అయ్యో ! ఎంత దారుణమయ్యా !

.

ఈ పద్యంలో “రోజంతా వేడుకుంటున్న పుణ్యాత్ముడు “ ఎవరో కాదు మహాకవి ధూర్జటి యే. ఇంతకు ముందు , రాబోయే పద్యాల్లో కూడ తాను పాపాత్ముడ నని ,చెడ్డవాడనని ఆదుకోమని వేడుకున్న కవి ఇక్కడ తానొక పుణ్యాత్ముడనని చెప్పుకుంటున్నాడు . అంటే ముసలి తనం పైకొచ్చి ఆత్మస్తుతి పెరిగిందా అనిపిస్తుంది. కాని కాదు. పాపం శమించుగాక !

.

ఒక మహాకవి హృదయం లో ఏ సమయం లో ఎటువంటి భావతరంగాలు ఎగసి పడి, ఎటువంటి భావాలను పండిస్తాయో విశ్లేషించడం సామాన్యులకు కసాధ్యమైన విషయం . విశ్వకవి రవీంద్రుడు , కవిసమ్రాట్ విశ్వనాథ లు కూడ దీని కతీతులు కారనేది విద్వల్లోక విదితం.

శ్రీకృష్ణ శతకం.!........( 20/5/15)... (శ్రీ నరసింహ కవి.). .

శ్రీకృష్ణ శతకం.!........( 20/5/15)... (శ్రీ నరసింహ కవి.).

.

చిలుకనొక రమణి ముద్దులు


చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం


బిలిచిన మోక్షము నిచ్చితి


వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!

.

ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; ఒక రమణి అంటే ఒక స్త్రీ; ముద్దులు చిలుకను అంటే అందంగా, ముద్దులొలికేలా; చిలుకన్ అంటే ఒక చిలుకను; శ్రీరామ + అనుచు అంటే శ్రీరామా అని పలికేలా; శ్రీపతి అంటే విష్ణుమూర్తి యొక్క; పేరున్ అంటే పేరును; పిలిచినన్ అంటే పలికినంతచేతనే; మోక్షమున్ అంటే మోక్షాన్ని; ఇచ్చితివి అంటే అనుగ్రహించావు; మిమున్ అంటే భగవంతుడవైన నిన్ను; తలచు అంటే స్మరించే; జనులకున్ అంటే మామూలు మనుషులకు లభించటంలో; అరుదా అంటే లభించదా (లభిస్తుంది).
భావం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం.


ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.


Monday, May 18, 2015

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

 

పోతన గారి భాగవత పద్యం.!
.
'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా...
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".!
.
(చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .)
.
సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు .
ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు .
అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు .
శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ ,
పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి .
ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు .
మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు ” అమ్మా భారతీ , స్వచ్ఛమైన తెలుపురంగుతో మిరుమిట్లుగొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో గదా !” .

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(19/5/15.)

 
శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(19/5/15.)
.
ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేఁడెల్లియో
కడ నేడాది కొ యెన్నడో యెరుగమీ కాయంబు లీ భూమిపై
...
బడగా నున్నవి , ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో ? శ్రీ కాళహస్తీశ్వరా !
.
.
ఈశ్వరా ! ఘడియకో ,రెండు ఘడియలకో ,మూడు ఘడియలకో కాకపోతే
రేపో , ఎల్లుండో మరి ఏడాదికో ఈ శరీరాలు భూమిపైన పడబోతున్నాయన్న
విషయం తెలిసి కూడ ఈ మానవులు ధర్మమార్గాన్ని అనుసరించడం లేదు.
మూర్ఖులైన వీరు నీ పాదాలను సేవించడం వలన కలిగే ప్రయోజనం కూడ తెలుసుకోలేకపోతున్నారు .
 

Sunday, May 17, 2015

సు0దరకా0డ

                           
సు0దరకా0డ.!

.

శ్రీ హను మాను గురుదేవులు నాయెద..పలికిన సీతా రామకథ.

.

(సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారి సీతా రామకథ.)

శ్రీ హను మాను గురుదేవులు నాయెద

పలికిన సీతా  రామకథ

నే పలికెద సీతా రామకధ

(వరుస క్రమముగా చదవవలేను)

సి0ధుభైరవి

1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు   / అతి బలవ0తుడు రామభక్తుడు

ల0కకు పోయి రాగల ధీరుడు              /మహిమోపేతుడు శత్రు కర్మనుడు

జా0బవదాది వీరు ల0దరును              /ప్రేరెపి0పగ సమ్మతి0చెను

ల౦కేశ్వరుడు అపహరి0చిన                /జానకి మాత జాడ తెలిసికొన

2) తన త0డ్రి యైన వాయుదేవునకు       /సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు

వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై              / వ0దనములిడె పూర్వాభి ముఖుడై

రామనామమున పరవశుడయ్యె         /రోమ రోమమున పులికితుడయ్యె

కాయము పె0చె కుప్పి0చి ఎగసె          /దక్షిణ దిశగా ల0క చేరగ

3) పవన తనయుని పదఘట్టనకె         / పర్వత రాజము గడగడ వణకె

ఫలపుష్పాదులు జలజల  రాలె          /పరిమళాలు గిరి శిఖరాలు  ని0డె

పగిలిన శిలల  దాతువు లెగసె            /రత్నకాంతులు  నలుదిశల మెరసె

గుహలను దాగిన భూతములదిరి       / ధీనారవముల పరుగిడె బెదిరి.         

                                                                                             (శ్రీహనుమాను ) .

                       

దర్బారుకానడ

4)  రఘుకులోత్తముని రామచ0ద్రుని,       /పురుషోత్తముని పావనచరితుని

 నమ్మిన బ0టుని అనిలాత్మజుని             / శ్రీ హనుమ0తుస్వాగతమిమ్మని

నీ కడకొ0త విశ్రా0తి దీసికొని                  / పూజల0దుకొని పోవచ్చునని

సకల ప్రవర్ధితుడు సాగరుడె0తొ                /ముదమున పలికె మైనాకునితో

5)  మైనాకుడు ఉన్నతుడై నిలచె             హనుమ0తుడుఆగ్రహమునగా0చె

ఇది  ఒక విఘ్నము కాబోలునని             / వారధి పడద్రోసె ఉరముచే గిరిని

పర్వత శ్రేష్టుడా పోటున క్రు0గె                   /పవనతనయునిబలముగనపొ0గె

తిరిగి నిలిచె హనుమ0తుని పిలిచె            / తన శిఖరముపై నరుని రూపమై        

     ( శ్రీ హనుమాను )

      శ్రీ ర0జని

6)  వానరోత్తమా ఒక సారి నిలుమా           /  నాశిఖరాల శ్రమ తీర్చుకొనుమా 

క0దమూలములు ఫలములు తినుమా     /నాపూజలుగొనిమన్ననల0దుమ

శతయోజనముల పరిమితము గల            / జలనిదినవలీల దాటిపోగల

 నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు                / నీదు త0డ్రి కడుపూజ్యుడునాకు

       

7) పర్వతోత్తముని కరమున నిమిరి            /పవనతనయుడు పలికెను ప్రీతిని

ఓ గిరీ0ద్రమా స0తసి0చితిని                       /  నీ సత్కారము ప్రీతిన0దితిని

రామకార్యమై ఎఏగు చు0టిని                       / సాధి0చువరకు ఆగన౦టిని

నే పోవలె క్షణమె0తో విలువలె                       నీ దీవెనలె నాకు బలములె               

                                                                                  

 ( శ్రీ హనుమాను )  

  మా0డు

8)  అనాయాసముగ అ0బరవీధిని     /  పయనము జేసెడు పవనకుమారుని

ఇ0ద్రాదులు మహర్షులు  సిధ్దులు                 / పులకా0కితులై ప్రస్తుతి0చిరి

రామకార్యమతి సాహసమ్మని                /   రాక్షస బలమతి భయ0కరమని

కపివరుడె0తటి ఘన తరుడోయని,               /  పరిశీలనగా ప0పిరి సురసను

9) ఎపుడో నన్ను నిన్ను మ్రి0గమని        /  వరమొసగి మరీ బ్రహ్మ ప0పెనని

అతిగా  సురస నోటిని దెరచె                 హనుమ౦తు అలిగి కాయము పె౦చె

ఒకరినొకరు మి౦చి కాయము పె౦చిరి             /శతయోజనములు విస్తరి0చిరి          

పై ను0డి సురలు తహతహలాడిరి        / ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి

10)సురస ముఖము విశాల మౌటగని / సూక్ష్మ బుద్దిగొనిసమయమినదేనని,

క్షణములోన అ0గుష్టమాత్రుడై        /  ముఖము జొచ్చి  వెలివచ్చె విజయుడై

పవనకుమారుని సాహసముగని            / దీవి0చె సురస నిజరూపముగొని

నిరాల0బ నీలా0బరము గనుచు        /  మారుతి సాగెను వేగము పె0చుచు

11)జలనిధి తేలె మారుతి ఛాయను        / రాక్షసి సి0హిక అట్టె గ్రహి0చెను

గుహనుబోలు తన నోటిని తెరిచెను       /  కపివరుని గు0జి మ్రి0గ జూచెను

అ0తట మారుతి సూక్ష్మ రూపమున    /  సి0హిక ముఖమున చొచ్చి చీల్చెను

సి0హిక  హృదయము చీలికలాయెను   /సాగరమున బఢి అసువులు బాసెను

12) వారధి దాటెను వాయుకుమారుడు        /  ల0క చేరెను కార్యశూరుడు

నలువ0కలను కలయజూచుచు              /నిజరూపమున మెల్లగ సాగుచు

త్రికూటాచల శిఖరము పైన                   / విశ్వ కర్మ వినిర్మితమైన 

 స్వర్గపురముతొ సమానమైన            /  ల0కాపురమును మారుతి గా0చెను

                                                                                                    (శ్రీహనుమాను)

సి0ధుభైరవి               

13)ఆనిలకుమరుడు రాత్రివేళను             /  సూక్ష్మ రూపుడై బయలు దేరెను

రజనీకరుని వెలుగున తాను                       /  రజనీచరుల కనుల బడకను

పిల్లివలె పొ0చి మెల్లగ సాగెను        /    ఉత్తర ప్రా కార ద్వారము జేరెను

ల0కా రాక్షసి కపినరు గా0చెను            /  గర్జన సేయుచు ఆడ్డగి0చెను   

         

14)కొ0డకోనల తిరుగాడు కోతివి                 /ఈపురుకి ఏపనికై వచ్చితివి

ల0కేశ్వరుని ఆనతిమేర                             / ల0కాపురికి కావలియున్న

ల0కను నేను ల0కాధి దేవతను                  / నీ ప్రాణములను నిలువున దీతును

కదలక మెదలక నిజము పల్కుమని            /ల0క ఎధుర్కొనె కపికిషోరుని

15) అతిసు0దరమీ ల0కపురమని              /ముచ్చటబడి నే చూడవచ్చితిని

ఈ మాత్రమునకు కోపమె0దుకులె              పురముగా0చి నే మరలిపోదులె

ఆని నెమ్మదిగా పలుకగా విని                    /  అనిలాత్మజుని చులకనగా గొని

ల0కా రాక్షసి కపికిశోరుని                         /  గర్జి0చి కసరె గద్ది0చి చరచెను      

16)సి0హనాదమును మారుతి జేసె         / కొ0డ0తగ తనకాయము పె0చె

వామ హస్తమున పిడికిలి బిగి0చె               / ఒకే పోటున ల0కను గూల్చె

కొ0డ బ0డలా రక్కసి దొల్లె                       /  కనులప్పగి0చి నోటిని తెరిచె

అబలను జ0పుట ధర్మముగాదని           / ల0కను విడిచె మారుతి దయగొని

 17) ఓ బలభీమా వానరోత్తమా              /నేటికి నీచె ఓటమెరిగితి

ఈ నా ఓటమి ల0కకు చేటని                / పూర్వమే బ్రహ్మ వరమొసగెనని

రావణుడాదిగ రాక్షసుల0దరు               / సీత మూలమున అ0తమొ0దెదరు

ఇది నిజమౌనని మీదె జయమని         /ల0కా రాక్షసి  ప0పె హరీశుని       

                                                                                        (శ్రీహనుమాను) 

కల్యాణి 

18) కోటగోడ అవలీలగ ప్రాకెను                   కపికిశోరుడు లోనికి దుమికెను

శత్రుపతనముగ వామపాదమును             ము0దుగ మోపెను ము0దుకు సాగెను

ఆణిముత్యముల  తోరణాలుగల               /  రమ్యతరమైన రాజవీదుల

వెన్నెలలో ల౦కాపురి శోభను                     /శోధనగా హరీశుడు గా0చెను  

19)సువర్ణమయ సౌధరాజముల            / ధగధగమెరసె ఉన్నత గృహముల 

కలకలలాడె నవ్వుల జల్లులు                 /మ0గళకరమౌ నృత్యగీతములు

అప్సరసల మరపి0చు మదవతుల        / త్రిస్ధాయిబలుకు గాన మాధురులు

వెన్నెలలో ల0కా పురి శోభను                / శోధనగా హరీశుడు గా0చెను

20) సు0దరమైన హేమమ0దిరము        / రత్న ఖచితమౌ సి0హద్వారము

పతాకా0కిత ధ్వజాకీర్ణము                      / నవరత్న కా0తి స0కీర్ణము

నృత్య మృద0గ గ0భీర నాదితము          / వీణాగాన వినోద స0కులము

ల0కేశ్వరుని దివ్య భవనమది                 / శోధనగా హరీశుడు గా0చెను

21)అత్తరు పన్నీట జలకములు             /  కాలాగరు సుగ0ధ ధూపములు,

స్వర్ణ ఛత్రములు వి0జామరలు          / కస్తూరి పునుగు జవ్వాది గ0ధములు,

నిత్యపూజలు శివార్చనలు                    /   మాస పర్వముల హామములు,

ల0కేశ్వేరుని దివ్య భవనమది                  / శోదనగా హరీశుడు గా0చెను.

                                                                                               (శ్రీహనుమాను) 

  హి0దోళ0 

22)యమకుబేర వరుణ దేవే0ద్రాదుల       / సర్వస0పదల మి0చినది

విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది             / బ్రహ్మవరమున కుబేరుడ0దినది 

రావణు0డు కుబేరుని రణమ0దు           /  ఓడి0చి ల0కకు గొని తెచ్చినది

పుష్పకమను మహావిమానమది            / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

23) నేలను తాకక నిలచియు0డునది     /రావణ భవన మద్య0బుననున్నది

వాయు పథమున ప్రతిష్టితమైనది       /   మనమున తలచిన రీతి పోగలది

దివిను0డి భువికి దిగిన స్వర్గమది        /  సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది

పుష్పకమను మహా విమానమది        /   మారుతి గా0చెను అచ్చెరువొ0ది.                   

24) ల౦కాధీశుని ప్రేమమ0దిరము       /  రత్నఖచితమౌ హేమమ0దిరము 

చ0దనాది సుగ0ధ బ0ధురము             / పానభక్ష్య పదార్ధ సమ్రుధ్ధము

ఆయాపరిమళ రూపానిలయము          /  అనిలాత్మజుచే ఆఘ్రాణితము  

పుష్పకమ0దు రావణమ0దిరమ్మది     /  మారుతి గా0చెను అచ్చెరువొ0ది

25) మత్తున శయని0చు సుదతుల మోములు  / పద్మములనుకొని మూగు భ్రమరములు

నిమీలిత విశాల నేత్రములు                    /  నిశాముకుళిత పద్మపత్రములు

ఉత్తమకా0తల కూడి రావణుడు                 /  తారాపతి వాలె తేజరిల్లెడు

పుష్పకమ0దు రావణమ0దిరమ్మది        /మారుతిగా0చెను అచ్చెరువొ0ది

26) రావణు0డు రణమ0దున గెలిచి       /   స్త్రీలె0దరినో ల0కకు జేర్చెను

పితృదైత్య గ0ధర్వకన్యలు                       /  ఎ0దె0దరో రాజర్షి కన్యలు

సీతదక్క వార0దరు కన్యలె                   / రావణుమెచ్చి వరి0చిన వారలె

పుష్పకమ0దు రావణ మ0దిరమ్మది        / మారుతిగా0చెను అచ్చెరువొ0ది 

                                                                                           (శ్రీహనుమాను) 

దర్భారుకా0డ

27) ఐరావతము ద0తపు మొనలతో           /పోరున బొడిచిన గ0టులతో

వజ్రాయుధపు ప్రఘాతములతో                 /  చక్రాయుదపు ప్రహరణములతో

జయపర0పరల గురుతులతో                  /   కీర్తిచిహ్నములకా0తులతో

ల0కేశుడు శయని0చె కా0తలతో                / సీతకై వెదకె మారుతి ఆశతో  

28) మినపరాశివలె నల్లనివాడు                 /  తీక్షణ దృక్కుల లోహితాక్షుడు

రక్త చ0దన చర్చిత గాత్రుడు                        స0ధ్యారుణ ఘన తేజోవ0తుడు

సతులగూడి మధు గ్రోలినవాడు                   /  రతికేళి సలిపి సోలినవాడు

ల0కశుడు శయని0చె కా0తలతో                 /  సీతకై వెదకె మారుతి  ఆశతో

29) అ0దొక వ0క పర్య0కము జేరి              /నిదురి0చుచు0డె డివ్యమనోహరి

నవరత్న ఖచిత భూషణధారిణి                   / నలువ0కలను కా0తి ప్రసారిణి

స్వర్ణదేహిని చారురూపిణి                           / రాణులకు రాణి పట్టపురాణి

ల0కేశ్వరుని హ్రుదయేశ్వరి                      / మ0డోదరి లోకోత్తర సు0దరి

30) మ0డోదరిని జానకియనుకొని              / ఆడుచు పాడుచు గ0తులు పెట్టి

వాలము బట్టి ముద్దులు పెట్టి                      / నేలను గొట్టి భుజములు తట్టి

స్త0భము లెగసి క్రి0దకు దుమికి                 / పల్లటీలు గొట్టి చె0గున చుట్టి,

చ0చలమౌ కపి స్వభావమును             /  పవనతనయుడు ప్రదర్శన జేసెను

                                                                                           (శ్రీహనుమాను)

శ్రీర0జని

31) రాముని సీత ఇటులు0డునా  / రావణుజేరి శయని0చునా

రాముని బాసి నిదురి0చునా         /  భుజియి0చునా భూషణముల దాల్చునా

పరమపురుషుని రాముని మరచునా    / పరపురుషునితో కాపురము0డునా

సీతకాదు కాదు కానే కాదని                      /  మారుతి వగచుచు వెదకసాగెను

32)పోవగరాని  తావుల బోతి                      /   చూడగరానివి ఎన్నో జూచితి

నగ్నముగా పరున్న పరకా0తల                /   పరిశీలనగా పరికి0చితిని

రతికేళి సలిపి సోలిన రమణుల                   /   ఎ0దె0దరినో పొడగా0చితిని

ధర్మముగానని పాపినైతినని                 /   పరితాపముతో మారుతి కృ0గెను

33) సుదతులతోడ సీతయు0డగ               /   వారల జూడక వెదకుటెలాగ

మనసున ఏమి వికారము నొ0దక               /  నిష్కామముగ వివేకము వీడక

సీతను వెదకుచు చూచితిగాని                 /   మనసున ఏమి పాపమెరుగనని 

స్వామి సేవ వరమార్ధముగా గొని                  /మారుతి సాగెను సీత కోసమని

34)భూమీ గృహములు నిశాగృహముల /  క్రీడాగృహములు లతాగృహములు

ఆరామములు చిత్రశాలలు                        / బావులు తిన్నెలు రచ్చవీధులు

మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు           / స0దులు గొ0దులు బాటలు తోటలు

ఆగిఆగి అడుగడుగున వెదకుచు               /   సీతనుగానక మారుతి వగచె

35) సీతామాత బ్ర తికి యు0డునో          / క్రూరరాక్షసుల పాల్పడి యు0డునో

తాను పొ0దని సీత ఎ0దుకని               /   రావణుడే హతమార్చి యు0డునో 

ఆని యోచి0చుచు అ0తట వెదకుచు        /  తిరిగిన తావుల తిరిగి తిరుగుచు

ఆగిఆగి అడుగడుగున వెదకుచు,              /  సీతను గానక మారుతి వగచె

36) సీత జాడ కనలేదను వార్తను             / తెలిపిన రాముడు బ్రతుక జాలడు

రాముడు లేనిదే లక్ష్మణుడు0డడు        /  ఆపై రఘుకుల మ0తయు నశి0చు

ఇ0తటి ఘోరము  కా0చిన0తనే             /   సుగ్రీవాదులు మడియక మానరు

అని చి0తి0చుచు  పుష్పకము వీడి         / మారుతి చేరె ప్రాకారము పైకి

37)ఇ0త వినాశము నా వల్ల నేను               /నే కిష్కి0దకు పోనే పోను

 వాన ప్రస్థాశ్రమ వాసుడనై                       / నియమ నిష్టలతో బ్రతుకువాడనై

 సీత మాతను చూచి తీరెదను                   /   లేకున్న నేను అగ్ని దూకెతను

 అని హనుమ0తుడు కృతనిశ్చయుడై          /నలుదెసలగనె సాహసవ0తుడై

38) చూడ మరచిన అశోకవనమును        / చూపు మేరలో మారుతి గా0చెను

సీతారామ లక్ష్మణాదులకు                          / ఏకాదశ రుద్రాది దేవులకు

ఇ0ద్రాది యమ వాయుదేవులకు                / సూర్య చ0ద్ర మరుద్గణములకు

వాయున0దనుడు వ0దనములిడి                /అశోకవని చేరెను వడివడి

                                                                                              (శ్రీహనుమాను) 

మోహన  

39) విరి తేనియలుగ్రోలు భృ0గములు          వి0దారగ జేయు ఝ0కారములు,

 లే చివురాకుల మెసవు కోయిలలు             ప0చమ స్వరముల పలికే పాటలు,

పురులు విప్పి నాట్యమాడు నెమళులు        కిలకిలలాడే పక్షుల గు0పులు,

సు0దరమైన అశోకవనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన

40) కపికిశోరుడు కొమ్మకొమ్మను                ఊపుచు ఊగుచు దూకసాగెను

పూవులు రాలెను తీవెలు తెగెను                 ఆకులు కొమ్మలు నేలపై బడెను

పూలు పైరాల పవనకుమారుడు                   పుష్పరథమువలె వనమున దోచెడు

సు0దరమైన అశోక వనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన  

41) పూవులనిన పూతీవియలనిన               జానకి కె0తో మనసౌనని  

పద్మపత్రముల పద్మాక్షునిగన                     పద్మాకరముల  పొ0త చేరునని

అన్నిరీతుల ఆనువైనదని                            అశోకవని సీతయు0డునని

శోభిల్లు శి0శుపా తరుశాఖలపై                     మారుతి కూర్చొని కలయజూచెను

                                                                                                      (శ్రీహనుమాను) 

 సి0ధుభైరవి  

42) సు0దరమైన అశోక వనమున               తను కూర్చొనిన తరువు క్రి0దున

క్రు0గి క్రుశి0చిన సన్నగిల్లిన                        శుక్ల పక్షపు చ0ద్రరేఖను 

ఉపవాసముల వాడిపోయిన                        నివురు గప్పిన నిప్పు కణమును

ఛిక్కిన వనితను మారుతిగా0చెను               రాక్షస వనితల క్రూర వలయమున

43) మాసిన పీతవసనమును దాల్చిన          మన్నున పుట్టిన పద్జ్మమును

పతి వియోగ శోకాగ్ని వేగిన                          అ0గారక పీడిత రోహిణిని

మాటిమాటికి వేడి నిట్టూర్పుల                      సెగలను గ్రక్కె అగ్నిజ్వాలను

చిక్కిన వనితను మారుతిగా0చెను                రాక్షస వనితల క్రూరవలయమున 

 44) నీలవేణి స0చాలిత జఘనను                సుప్రతిష్టను సి0హమద్యమును

కా0తులొలుకు ఏకా0త ప్రశా0తను              రతీదేవి వలె వెలయు కా0తను

పుణ్యము తరిగి దివిను0డి జారి                    శోక జలధి పడి మునిగిన తారను

చిక్కిన వనితను మారుతి గా0చెను               రాక్షస వనితల క్రూరవలయమున

45) పతి చె0తలేని సతికేలనని                      సీత సొమ్ముల దగిల్చె శాఖల

మణిమయ కా0చన కర్ణవేష్టములు                మరకత మాణిక్య చె0పసరాలు

రత్నఖచితమౌ హస్తభూషలు                        నవరత్నా0కిత మణి హారములు

రాముడు తెలిపిన గురుతులు గలిగిన            ఆభరణముల గుర్తి0చె మారుతి

46) సర్వ సులక్షణ లక్షత జాత                      సీత గాక మరి ఎవరీ మాత

కౌసల్య సుప్రజా రాముని                              సీతగాక మరి ఎవరీ మాత

వనమున తపి0చు మేఘశ్యాముని                సీతగాక మరి ఎవరీ మాత

ఆహా క0టి కనుగొ0టి సీతనని                       పొ0గి పొ0గి ఉప్పొ0గె మారుతి

                                                                                          (శ్రీహనుమాను)  

 
చక్రవాక0 

47)పూవులు ని0డిన పొలముల0దున         నాగేటి చాలున జనన మ0దున

జనక మహారాజు కూతురైన                          దశరథ నరపాలు కోడలైన

సీతా లక్ష్మికి కాదు సమానము                     త్రైలోక్య రాజ్య లక్ష్మి సహితము

అ0తటి మాతకా కాని కాలమని                    మారుతి వగచె సీతను కనుగొని 

                                                                            

48) శతృతాపహరుడు మహాశూరుడు           సౌమిత్రికి పూజ్యురాలైన

ఆశ్రితజన స0రక్షకుడైన                                శ్రీ రఘురాముని ప్రియ సతియైన

పతి సన్నిధియే సుఖమని యె0చి                  పదునాల్గే0డ్లు వనమున కేగిన

అ0తటిమాతకా కానికాలమని                       మారుతి వగచె సీతను కనుగొని

49) బ0గరుమేని కా0తులు మెరయ              మ0దస్మితముఖ పద్మము విరియ

హ0సతూలికా తల్పమ0దునా                       రామునిగూడి సుఖి0పగ తగిన

పురుషొత్తముని పావన చరితుని                    శ్రీ రఘురాముని ప్రియ సతియైన

అ0తటి మాతకా కానికాలమని                      మారుతి వగచె సీతను కనుగొని

                                                                                       (శ్రీ హనుమాను)

భూపాల0

50) మూడుజాముల రేయి గడువగ              నాల్గవ జాము నడచు చు0డగ

మ0గళవాద్య మనోహర ధ్వనులు                ల0కేశ్వరుని మేలు కొలుపులు

క్రతువులొనర్చు షడ0గ వేదవిధుల             స్వరయుత శబ్ద తర0గ ఘోషలు

శోభిల్లు శి0శుపా శాఖల0దున                     మారుతి కూర్చొని ఆలకి0చెను

51) రావణాసురుడు శాస్త్రోక్తముగా                వేకువనే విధులన్ని యొనర్చెను

మదోత్కటుడై మదనతాపమున                   మరిమరి సీతను మదిలో నె0చెను

నూర్గురు భార్యలు సురకన్యలవలె                పరిసేవి0పగ దేవే0ద్రుని వలె

దశక0ఠుడు దేదీప్యమానముగ                    వెడలెను అశోకవనము చేరగ   

52) ల0కేశునితో వెడలిరి సతులు                మేఘము వె0ట విద్యుల్లతలవలె

మధువు గ్రోలిన పద్మముఖుల                    ము0గురులు రేగె భ్రు0గములవలె

క్రీడల తేలిన కామినీమణుల                       నిద్రలేమిపడు ఆడుగులు తూలె

దశక0ఠుడు దేదీప్య మానముగ                  చేరెను అశోకవనము వేగముగ

53) ల0కేశుని మహాతేజమునుగని             మారుతి కూడ విభ్రా0తి జె0దెను

దశక0ఠుడు సమీపి0చి నిలిచెను                 సీతపైననే చూపులు నిలిపెను

తొడలు చేర్చుకొని కడుపును దాచి              కరములు ముడిచి చనుగవ గాచి

సుడిగాలిపడిన కదళీతరువువలె                 కటిక నేలపై జానకి తూలె

                                                                                          (శ్రీ హనుమాను)          

 
కళ్యాణి 

54)ఓ సీతా ఓ పద్మనేత్ర,                             నా చె0త నీకు ఏల చి0త

ఎక్కడిరాముడు ఎక్కడి అయోద్య                ఎ0దుకోసమీ వనవాస వ్యథ

నవయవ్వన త్రిలోక  సు0దరి                      నీ కె0దుకు యీ ముని  వేషధారి

అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికే

                                                                                

55) రాముడు నీకు సరిగాని వాడు               నిను సుఖపెట్టడు తను సుఖపడడు 

గతిచెడి వనమున తిరుగు చు0డెను            తిరిగి తిరిగి తుదకు రాలి పోయెను 

మరచి పొమ్ము  కొరగాని రాముని               వలచి రమ్మునను యశో విశాలుని

అని రావణుడు కామా0ధుడై నిలిచె              నోటికి వచ్చిన దెల్ల పలికె

56) రాముడు వచ్చుట నన్ను గెల్చుట         నిన్ను పొ0దుట కలలోని మాట

బల విక్రమ ధన యశముల0దున                అల్పుడు రాముడు నా ము0దె0దున

యమకుబేర యి0ద్రాది దేవతల                   గెలిచిన నాకిల నరభయమేల

అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికె

                                                                                             (శ్రీ హనుమాను)           

శ్రీరాగ0  

57) నిరతము పతినే మనమున దలచుచు      క్షణమొక యుగముగ కాలము గడుపుచు 

రావణగర్వ మద0బుల ద్రు0చు                       రాముని శౌర్య ధ్రైర్యముల దలచుచు

శోకతప్తయై శిరమును వ0చి                           తృణమును ద్రు0చి తన ము0దు0చి

మారు పల్కె సీత దీన స్వరమున                    తృణముకన్న రావణుడే హీనమన

58) రామలక్షణులు లేని సమయమున           అపహరి0చితివె నను ఆశ్రమమున

పురుష సి0హముల గాలికి బెదిరి                    పారిపోతిని శునకము మాదిరి

యమకుబేర యి0ద్రాది దేవతల                      గెలిచిన నీకీ వ0చన లేల

అని పల్కె సీత దీన స్వరమున                       తృణముకన్న రావణుడే హీనమన     

59) ఓయి రావణా నా మాట వినుము              శ్రీరామునితో వైరము మానుము

శీఘ్రముగా నను రాముని జేర్చుము                త్రికరణ శుద్ధిగా శరణు వేడుము

నిను మన్ని0చి అనుగ్రహి0పుమని                  కోరుకొ0దునా కరుణామూర్తిని

అని పల్కె సీత దీన స్వరమున                        తృణము కన్న రావణుడే హీనమన  

                                                                                                  (శ్రీ హానుమాను)

కల్యాణి 

60) ఓ సీతా నీ వె0త గడసరివె                        ఎవరితో ఎమి పల్కుచు0టివె

ఎ0తటి కర్ణకఠోర వచనములు                         ఎ0తటి ఘోర అసభ్య దూషణలు

నీపై మోహము నను బ0ధి0చెను                    లేకున్న నిను వధి0చి యు0దును

అని గర్జి0చెను ఘనతరగాత్రుడు                      క్రోధో దీప్తుడై దశక0ఠుడు   

61) నీ కొసగిన ఏడాది గడువును                    రె0డు నెలలలో తీరి పోవును

అ0తదనుక నిన్న0టగ రాను                          ఈలోపున బాగోగులు కనుగొను

నను కోరని నిను బలాత్కరి0చను                    నను కాదను నిను కనికరి0చను

అని గర్జి0చెను ఘనతర గాత్రుడు                     క్రోధో దీప్తుడై దశక0ఠుడు

62) ఓ రావణా నీక్రొవ్విన నాలుక                     గిజ గిజలాడి తెగిపడదేమి

కామా0ధుడా నీ క్రూర నేత్రములు                   గిరగిర తిరిగి రాలి పడవేమి

పతి ఆగ్ఞలేక యిటులు0టిగాని                       తృటిలో నిన్ను దహి0పనా ఏమి

అని పల్కె సీత దివ్యస్వరమున                      తృణముకన్న రావణుడే హీనమన

63) క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు    కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు

తన కా0తలెల్ల కలవర మొ0దగ            గర్జన సేయుచు దిక్కులదరగ

సీత నెటులైన ఒప్పి0చుడని                  ఒప్పుకొననిచో భక్షి0చుడని

రావణాసరుడు అసుర వనితలను          ఆజ్ఞాపి0చి మరలి పోయెను

                                                                                    (శ్రీహనుమాను)

దర్బారుకానడ  

64) అ0దున్న ఒక వృద్ధ రాక్షసి             తోటి రాక్షసుల ఆవల త్రోసి

కావలెనన్న నన్ను వధి0పుడు             సీతను మాత్రము హి0సి0పకుడు

దారుణమైన కలగ0టి నేను                   దానవులకది ప్రళయ0బేను

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పిత లైరి రాక్షసిగణము       

65) శుక్లా0బరములు దాల్చిన వారు       రామలక్ష్మణులు అగుపి0చినారు

వైదేహికి యిరువ0కల నిలచి                  దివ్య తేజమున వెలుగొ0దినారు

తెల్లని కరిపై మువ్వురు కలసి                 ల0కా పురిపై పయని0చినారు

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము     భయక0పితలైరి రాక్షసే  గణము,

66) దేవతల0దరు పరిసేవి0ప                ఋషిగణ0బులు అభిషేకి0ప

గ0ధర్వాదులు స0కీర్తి0ప                      బ్రహ్మాదులు మునుము0దు స్తుతి0ప 

సీతా రాముడు విష్ణుదేవుడై                  శోభిల్లెను కోటి సూర్య తేజుడై

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీ గణము                                                  

67) తైలమలదుకొని రావణాసురుడు     నూనె ద్రాగుచు అగుపి0చినాడు 

కాలా0బరమును ధరియి0చినాడు         కరవీరమాల దాల్చినాడు

పుష్పకమ0దు0డి నేలబడినాడు           కడకొక స్త్రీచే యీడ్వబడినాడు

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీగణము

68) రావణు0డు వరాహముపైన            కు0భ కర్ణుడు ఒ0టెపైన

ఇ0ద్రజిత్తు మకరముపైన                     దక్షిణ దిశగా పడిపోయినారు

రాక్షనుల0దరు గు0పుగు0పులుగ       మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము   భయ క0పితలైరి రాక్షసీ గణము  

69)తెల్లని మాలలు వలువలు దాల్చి    తెల్లని గ0ధము మేనబూసికొని

నృత్య మృద0గ మ0గళా ధ్వనులతో     చ0ద్రకా0తులెగజిమ్ము ఛత్రముతో

తెల్లని కరిపై మ0త్రి వర్యులతో              వెడలె విభీషణుడు దివ్య కా0తితో

అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము  భయక0పితలైరి రాక్షసీ గణము

70) విశ్వకర్మ నిర్మి0చిన ల0కను        రావణు0డు పాలి0చెడు ల0కను

రామదూత ఒక వారరోత్తముడు          రుద్రరూపుడై దహియి0చినాడు

ప్రళయ భయానక సదృశమాయెను    సాగరమున ల0క మునిగిపోయెను

అని పల్కు త్రిజట మాటలు వినుచు    నిద్ర తూగిరి రాక్షస వనితలు   

71) హృదయ తాపమున జానకి తూలుచు        శోక భారమున గడగడ వణకుచు

జరిగి జరిగి అశోక శాఖలను                             ఊతగా గొని మెల్లగ నిలచి

శ్రీరాముని కడసారి తలచుకొని                         తనమెడ జడతో వురిబోసుకొని

ప్రాణత్యాగము చేయబూనగా                           శుభశకునములు తోచె వి0తగా

                                                                                                 (శ్రీహనుమాను)

శుభప0తువరాళి 

72) సీతకె0త దురవస్థ ఘటిల్లె                       నా తల్లినెటుల వూరడి0చవలె

నన్ను నేనెటుల తెలుపుకోవలె                      తల్లి నెటుల కాపాడు కోవలె

ఈ మాత్రము నే ఆలసి0చినా                         సీతా మాత ప్రాణములు0డునా

అని హనుమ0తుడు శాఖల మాటున            తహ తహలాడుచు మెదలసాగెను  

73) ననుగని జానకి బెదరక ము0దే            పలికెద సీతా రామకథ

సత్యమైనది వ్యర్థముగానిది                        పావనమైనది శుభకరమైనది

సీతామాతకు కడుప్రియమైనది                   పలుకు పలుకున తేనెలొలుకునది 

అని హనుమ0తుడు మృదుమధురముగ   పలికెను సీతారామకధ

74) దశరధ విభుడు రాజోత్తముడు             యశము గొన్న యిక్ష్వాకు వ0శజుడు 

దశరధునకు కడు ప్రియమైన వాడు           జేష్టకుమారుడు శ్రీ రఘురాముడు 

సత్యవ0తుడు జ్ఞాన శ్రేష్టుడు                      పితృవాక్య పరిపాలన శీలుడు

అని హనుమ0తుడు మృదుమధురముగ  పలికెను సీతా రామకథ     

75)శ్రీరాముని పట్టాభిషేకము                        నిర్ణయమైన శుభసమయమున

చిన్న భార్య కైక దశరధు చేరి                         తన కొసగిన రె0డు వరములు కోరె

భరతునకు పట్టాభిషేకము                            పదునాల్గే0డ్లు రామ వనవాసము

అని హనుమ0తుడు మృదు మధురముగ     పలికెను సీతా రామకథ

76) త0డ్రి మాట నిలుప రామచ0ద్రుడు          వల్కల ధారియై రాజ్యము వీడె

సీతా లక్ష్మణులు తనతో రాగ                         పదునాల్గే0డ్లు వనవాస మేగె

ఖరదూషణాది పదునాల్గువేల                       అసురుల జ0పె జన స్థానమున

అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతారామకథ   

77) రాముడు వెడలె సీత కోర్కెపై                  మాయలేడిని కొని తెచ్చుటకై 

రామ లక్ష్మణులు లేని సమయమున            అపహరి0చె ల౦కేశుడు సీతను

సీతనుగానక రామచ0ద్రుడు                         అడవుల పాలై వెదకు చు0డెను

అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతా రామకథ

78) రామ సుగ్రీవులు వనమున గలిసిరి         మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి

శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను               సుగ్రీవుని కపిరాజుగ జేసెను

సుగ్రీవునాన ల0క చేరితి                               సీతామాతను కనుగొన గలిగితి

అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతరామకథ     

79) వానరోత్తముడు పలుకుట మానెను         జానకి కె0తో విస్మయమాయెను

భయము భయముగ నలువ0కలు గని         మెల్లగ మోమెత్తి పైకి చూచెను

శోభిల్లు శి0శుపా శాఖల0దున                      బాలార్కుని వలె మారుతి తోచెను 

మారుతి రూపము చిన్నదైనను                    తేజోమయమై భీతిగొల్పెను

                                                                                        (శ్రీహనుమాను)

వలజి 

 వలజి 
80) తల్లీ తెల్పుము నీవు ఎవరవో                  దేవ గ0ధర్వ కిన్నరా0గనవో
కా0తులు మెరసే బ0గరు మేన                    మలినా0బరమేల తాల్చితివో
ఓ కమలాక్షి నీ కునుదోయి                           నీలాలేల ని0పితివో
అని హనుమ0తుడు తరువు ను0డి దిగి        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె     

81) రావణాసురుడు అపహరి0చిన              రాముని సతివో నీవు సీతవో
రామలక్ష్మణులు వనమున వెదకెడు           ఆవనీ జాతవో నీవు సీతవో
సర్వ సులక్షణ లక్షిత జాతవు                     తల్లీ తెల్పుము నీవు ఎవరవో
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

82) జనక మహీపతి ప్రియ పుత్రికను          దశరధ మహిపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియసతి నెను                సీతయను  పేర వరలు దానను
పరిణయమైన పది రె0డేడులు                   అనుభవి0చితిమి భోగభాగ్యములు
అని పల్కె సీత వానరే0ద్రునితో                  రామకధను కీర్తి0చిన వానితో 

83) రావణుడొసగిన ఏడాది గడువు                    రె0డు నెలలలో యిక తీరిపోవు
రాముడు నన్ను కాపాడునని                            వేచివేచి వేసారి పోతిని
అసురులు నన్ను చ0పక మున్నె                      నాకై నేను పోనె0చితిని
అ పల్కె సీత వానరే0ద్రునితో                          రామకధను కీర్తి0చిన వానితొ

84) అమ్మా సీతా నమ్ముము నన్ను                  రాముని దూతగ వచ్చినాడను
రామలక్ష్మణులు క్షేమమన్నారు                       నీ క్షేమ మరసి రమ్మన్నారు
రాముడు నీకు దీవెనల0పె                               సౌమిత్రి నీకు వ0దనములిడె
అని హనుమ0తుడు సీతతో పలికె                    అ0జలి ఘటి0చి ము0దుకు జరిగె

85) మారుతి ఎ0తగ ము0దుకు జరిగెనో           జానకి అ0తగ అనుమాని0చెను
రావణాసురుడె ఈ వానరుడని                         కామరూపుడై వచ్చి యు0డునని
ఆశ్రమమున ఒ0టిగనున్న తనను                  వ0చి0చిన సన్యాసి యీతడని
తల వాల్చుకొని భయక0పితయై                     కటిక నేలపై జానకి తూలె

86) వానర రాజు సుగ్రీవుని మ0త్రిని                నన్ను పిలుతురు హనుమ0తుడని
రామ సుగ్రీవులు మిత్రులైనారు                      నీ జాడ తెలియ వేచియున్నారు
రామ లక్ష్మణులు వానర రాజుతో                    ల0క చేరెదరు వానర కోటితో
అని హనుమ0తుడు సీతతో పలికె                  అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

హి0దోళ0 
87) ఓ హనుమ0తా హాయి బొ0దితిని           నీ పలికిన శ్రీరామకధ విని
రామలక్ష్మణుల ఎట్లెరిగితివి                          రూపురేఖలను ఎట్లు గా0చితివి
వారి మాటలను ఎట్లు వి0టివి                      వారి గుణములను ఎట్లు తెలిసితివి
అని పల్కె సీత హనుమ0తునితో                 రామకధను కీర్తి0చిన వానితో

88) సర్వ జీవన స0ప్రీతి పాత్రుడు                 కమలనేత్రుడు దయాసా0ద్రుడు
బుద్ధియ0దు బృహస్పతి సముడు               కీర్తియ0దు దేవే0ద్రుని సముడు
క్షమాగుణమున పృధివీ సముడు               సూర్య తేజుడు శ్రీ రఘురాముడు
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
89) అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు      అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు                   అజేయుడు శతృ భయ0కరుడు
సామాన్యులు కారు సోదరులిరువురు          నిన్ను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

90) పవన కుమారుని పలుకులను విని      అతడు నిజముగా రామదూతయని
ఆన0దాశ్రులు కన్నులు ని0డగ                 చిరునగవులతో జానకి చూడగ
ఇదిగో తల్లి  ఇది తిలకి0పుము                   రాముడ0పిన అ0గుళీయకము
అని హనుమ0తుడు భక్తి మీరగను            అ0గుళీయకమును సీత కొసగెను
                                                                                       (శ్రీ హనుమాను

ద్విజావ0తి

91) రామచ0ద్రుని ముద్రిక చేకొని             ఆశ్రులు ని0డిన కనుల కద్దుకొని

మధుర స్మృతులు మదిలో మెదల           సిగ్గు చేత తన శిరము వ0చుకొని

ఇన్ని రోజులకు తనకు కలిగిన                 శుభశకునముల విశేషమనుకొని

జానకి పల్కె హనుమ0తునితో                స0పూర్ణమైన విశ్వాసముతో

92) ఎన్నడు రాముడు ఇటకే తె0చునో      ఎన్నడు రావణుని హతము సేయునో

లక్ష్మణు0డు తన అగ్ని శరములతో          క్రూర రాక్షసుల రూపుమాపునో

సుగ్రీవుడు తన వానర సేనతో                  చుట్టుముట్టి యీ ల0కను గూల్చునో

అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో                                                                                             

93) రామలక్ష్మణులు వచ్చు దాకను       బ్రతుకనిత్తురా అసురులు నన్ను

రావణుడొసగిన ఏడాది గడువు               రె0డు నెలలలో యిక తీరిపోవు 

ప్రాణములను అరచేత నిల్పుకొని           ఎదురుచూతు నీ రె0డు మాసములు

అని పల్కె సీత హనుమ0తునితో          స0పూర్ణమైన విశ్వాసముతో

94) నీ వలెనె శ్రీ రామచ0ద్రుడు             నిద్రాహారములు మరచెనమ్మా

ఫల పుష్పాదులు ప్రియమైనవిగని        హా సీతాయని శోకి0చునమ్మా

నీ జాడ తెలిసి కోద0డ పాణి                  తడవు సేయకే రాగలడమ్మా

అని హనుమ0తుడు సీతతోపలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె   

95) ఓ హనుమ0తా నినుగనిన0త       నాలో కలిగె ప్రశా0తత కొ0త 

వానరోత్తమా నిను వినిన0త                నే పొ0దితిని ఊరట కొ0త

రాముని వేగమె రమ్మని తెల్పుము      రె0డు నెలల గడువు మరువబోకుము

అని పల్కె సీత హనుమ0తునితో         స0పూర్ణమైన విశ్వాసముతో

                                                                                          (శ్రీ హనుమాను)

కల్యాణి  

96) తల్లీ నీవిటు శోకి0పనేల                వగచి వగచి యిటు భీతిల్లనేల

ఇపుడే నీకీ చెర విడిపి0తును             కూర్చు0డుము నామూపు మీదను

వచ్చిన త్రోవనే కొని పోయెదను           శ్రీ రామునితో నిను చెర్చెదను 

అని హనుమ0తుడు సీతతోపలికె        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె 

97) పోనివ్వక పోతివిగా హనుమ              సహజమైన నీ చె0చల భావము 

అరయగ అల్ప శరీరుడ వీవు                    ఏ తీరుగ నను గొనిపోగలవు 

రాముని కడకే నను చేర్చెదవో                  కడలిలో ననే జార విడుతువో

అని పల్కె సీత హనుమ0తునితో             తనలో కలిగిన వాత్సల్యముతో

98) సీత పలికిన మాటల తీరును             హనుమ0తుడు విని చిన్నబోయెను 

సీత చె0త తన కామరూపమును             ప్రదర్శి0పగ స0కల్పి0చెను

కొ0డ0తగ తన కాయము బె0చెను          కా0తి వ0తుడై చె0త నిలచెను

జయ హనుమ0తుని కామరూపమును   ఆశ్చర్యముతో జానకి చూచెను 

99) అద్భుతమౌ నీ కామరూపమును      కా0చితినయ్యా శా0తి0పుమయ్యా

పవన కుమారా నీవుగాకమరి                 ఎవరీ వారిధి దాటెదరయ్యా

క్రూర రాక్షసుల క0టబడకయే                 ల0క వెదకినను కనగలరయ్యా

అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో

                                                                                       (శ్రీ హనుమాను)

సి0ధుభైరవి 

100) తల్లీ నేను నీయ0దుగల                భక్తి భావమున అటుల తెల్పితి

క్రూర రాక్షనుల బారిను0డి నిను            కాపాడనె0చి అటుల పల్కితి

వేగమె నిన్ను రాముని చేర్చెడు             శుభగడియలకై త్వరపడిపల్కితి

అని హనుమ0తుడు సీతతో పలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె    

101) తల్లీ నీవు తెలిపినవన్నీ                     శ్రీరామునకు విన్నవి0చెదను

సత్య ధర్మ పవిత్ర చరిత్రవు                         శ్రీరామునకు తగిన భార్యవు

అమ్మాయిమ్ము ఏదో గురుతుగ                 శ్రీరాముడు గని ఆన0ది0పగ

అని హనుమ0తుడు సీతతో పలికె             అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

102) చిత్ర కూటమున కాకాసురుకధ         కన్నీరొలుకగ గురుతుగ తెలిపి

చె0గుముడి నున్న చూడమణిని               మెల్లగ తీసి మారుతి కొసగి

పదిలముగా కొని పోయి రమ్మని               శ్రీ రామునకు గురుతుగనిమ్మని

ప్రీతి బల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో  

103) చేతులారగ చూడామణిగొని              ఆన0దముగ కనుల కద్దుకొని

వైదేహికి ప్రదక్షిణలు జేసి                           పదముల వ్రాలి వ0దనములిడి

మనమున రాముని ధ్యాని0చుకొని            మరలిపోవగ అనుమతిగైకొని

అ0జనీ సుతుడు కాయము బె0చె              ఉత్తర దిశగా కుప్పి0చి ఎగసె

                                                                                (శ్రీ హనుమాను)

మా0డు 

104) సీత జాడగని మరలిన చాలదు          చెయవలసినది యి0కను కలదు

కల్పి0చుకొని కలహము పె0చెద               అసుర వీరుల పరిశీలి0చెద

రాక్షసబలముల శక్తి గ్రహి0చెద                 సుగ్రీవాదులకు విన్నవి0చెద

అని హనుమ0తుడు యోచన జేయుచు   తోరణ స్త0భము పైన నిల్చెను   

105) పద్మాకరముల పాడొనరి0చి            జలాశయముల  గట్టులు త్రె0చి

ఫల వృక్షముల నేలను గూల్చి                ఉద్యానముల రూపును మాపి

ప్రాకారముల బ్రద్దలు చేసి                        ద్వార బ0ధముల ధ్వ0సము చేసి

సు0దరమైన అశోకవనమును                చి0దరవ0దర చేసె మారుతి

106) మృగసమూహములు భీతిల్లినవై    తత్తరపాటుగ పరుగులు తీయగ

పక్షుల గు0పులు చెల్లాచెదరై                  దీనారవముల ఎగిరి పోవగ

సీతయున్న శి0శుపాతరువు వినా         వనమ0తయు వినాశము కాగా

సు0దరమైన అశోకవనమును               చి0దర వ0దర చేసె మారుతి    

107)వనమున రేగిన ధ్వనులకు అదిరి     ల0కావాసులు నిద్ర లేచిరి

కావలియున్న రాక్షస వనితలు                రావణుచేరి విన్నవి0చిరి

దశక0ఠుడు మహోగ్రుడై పల్కె               వానరుని బట్టి ద0డి0పుడనే

ఎనుబదివేల కి0కర వీరులు                    హనుమ0తునిపై దాడి వెడలిరి

108) ఎనుబదివేల కి0కర వీరుల             ఒక్క వానరుడు హతము చేసెను 

ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను

జ0బు మాలిని తగిన బలముగొని           ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను 

జ0బుమాలి ప్రహస్తుని సుతుడు             హనుమ0తునిపై దాడి వెడలెను

                                                                                    (శ్రీ హనుమాను)

కల్యాణి  

109) జ0బు మాలిని సర్వ సైన్యమును    ఒక్క వానరుడు ఉక్కడ గి0చెను

ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపి0చెను

మ0త్రి కుమారుల తగిన బలముగొని      ఆ వానరుని ద0డి0పగ పొమ్మనె

మ0త్రి కుమారులు ఏడ్గురు చేరి              హనుమ0తునిపై దాడి వెడలిరి

110) మ0త్రి సుతులను సర్వ సైన్యమును   మారుతి త్రుటిలో స0హరి0చెను

ఎటు జూచినను మృతదేహములు               ఎటు పోయినను రక్తపుటేరులు 

ఈ వృత్తా0తము వినిన రావణుడు               కొ0త తడవు యోచి0చి పల్కెను

సేనాపతులను తగిన బలముగొని               ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను                              

111) సేనాపతులను సర్వ సైన్యమును        పవన కుమారుడు నిర్మూలి0చెను 

ఈ వృత్తా0తము వినిన రావణుడు               నిశ్చేష్టితుడై పరివీక్షి0చెను 

త0డ్రి చూపులు తనపై సోకగ                      అక్షకుమారుడు దిటవుగ నిలువగ

రావణు0డు పల్కె కుమారుని గని               ఆ వానరుని ద0డి0ప పొమ్మని

                                                                                            (శ్రీ హనుమాను)

సి0ధుభైరవి  

112) అక్షకుమారుడు నవయౌవ్వనుడు       వేగవ0తుడు తేజోవ0తుడు

దివ్యాస్త్రములను పొ0దినవాడు                    మణిమయస్వర్ణ కిరీట శోభితుడు

కాలగ్ని వోలె ప్రజ్వరిల్లెడు                            రణధీరుడు మహావీరుడు

అక్షకుమారుడు దివ్య రధముపై                   దాడి వెడలెను హనుమ0తునిపై           

113) మూడు శరములతో మారుతి శిరమును     పది శరములతో మారుతి ఉరమును

అక్షకుమారుడు బలముగ నాటెను                     రక్తము చి0దగ గాయపరచెను

ఉదయ భాస్కర సమాన తేజమున                     మారుతి ఎగసె గగన మార్గమున

ఇరువురి నడుమ భీకరమైన                              పోరు చెరేగె ఆకాశమున

114) అతినేర్పుతోడ రణము సల్పెడు                 అక్షకుమారుని మారుతి దయగొని

బాలుని చ0పగ చేతులు రావని                         వేచి చూచెను నిగ్రహి0చుకొని

అక్షకుమారుడు అ0తక0తకును                        అగ్ని హోత్రుడై రణమున రేగెను

ఇరువురి నడుమ భీకరమైన                             పోరు చెలరేగె ఆకాశమున 

115) అగ్ని కణమని జాలికూడదని                    రగులక మునుపే ఆర్పుట మేలని

సి0హనాదమును మారుతి జేసెను                   అరచేత చరచి హయములజ0పెను

రథమును బట్టి విరిచివేసెను                            అక్షుని ద్రు0చి విసరివేసెను

అక్షుని మొ0డెము అతి ఘోరముగ                  నేలపై బడె రక్తపుముద్దగ

116) అక్షకుమారుని మరణవార్త విని                ల0కేశ్వరుడు కడు దుఖి0చెను

మెల్లగ తేరి క్రోధము బూని                               తన కుమారుని ఇ0ద్రజిత్తుగని

ఆ వానరుడు సామాన్యుడు గాడని                    వానిని వేగ బ0ధి0చి తెమ్మని

రావణాసురుడు ఇ0ద్రజిత్తును                       హనుమ0తునిపై దాడి ప0పెను 

117) కపికు0జరుడు భయ0కరముగ               కాయము పె0చి సమరము సేయగ

ఈ వానరుడు సామాన్యుడు గాడని                   మహిమోపేతుడు కామరూపుడని

ఇ0ద్రజిత్తు బహుయోచన జేసి                         భ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె

దేవగణ0బులు స0గ్రామముగని                      తహతహలాడిరి ఏమగునోయని

118)భ్రహ్మాస్త్రముచే  బ0ది0పబడి                     పవనకుమారుడు నేలపై బడె

వనజభవుడు తనకు ఒసగిన వరము              స్మరియి0చుకొని ప్రార్ధన చేసె 

వాయు, బ్రహ్మ ఇ0ద్రాది దేవతల                       కాపాడుమని ధ్యానము చేసె

దేవగణ0బులు స0గ్రామముగని                     తహతహలాడిరి ఏమగునోయని  

119) కట్టుపడియున్న వానరోత్తముని             అసురులు తలచిరి తమకులొ0గెనని

త్వరత్వరగా దానవులు దరిచేరి                      నార చీరలతో బిగి బ0ధి0చిరి 

బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బ0ధము                  క్షణకాలములో తొలగిపోయెను

మారుతి మాత్రము నారచీరలకే                      కట్టుపడినటుల కదలకయు0డె

120) వానరోత్తముని దూషణలాడుచు             రావణుకడకు ఈడ్చుకు బోవగ

ఈవానరుని వధి0చి వేయుడని                      మనయెడ ద్రోహము చేసినాడని

రక్తనేత్రముల నిప్పులు రాలగ                          ల0కేశ్వరుడు గర్జన సేయగ

రావణుతమ్ముడు విభీషణుడు                       దూతను చ0పుట తగదని తెల్పెను

                                                                                               (శ్రీ హనుమాను)    

మోహన 

121) అన్నా రావణ తెలిసినవాడవు         శా0తముగా నా మనవిని వినుమా

దూతను జ0పుట ధర్మముగానిది           లోకముచే గర్హి0పబడునది

శూరుడవైన నీకు తగనిది                       రాజధర్మ విరుద్ధమైనది

అని విభీశణుడు ల0కేశునితో                  దూతను చ0పుట తగదని తెల్పెను

122) అన్నా వీనిని వధి0పకుమా            తగురీతిని ద0డి0చి ప0పుమా

దూతయెడల విధి0పబడినవి                  వధగాక తగిన ద0డనలున్నవి

తల గొరిగి0చుట చబుకు వేయుట           గురుతువేయుట వికలా0గు సేయుట 

ఆని విభీశణుడు ల0కేశునితో                 దూతనుచ0పుట తగదని తెల్పెను

                                                                                           (శ్రీ హనుమాను)                    

మా0డు 

123) కపులకు జ వాలము ప్రియభూషణము        కావున కాల్చుడు వీని వాలము

వాడవాడల ఊరేగి0పుడు                               పరాభవి0చి వదలి వేయుడు

కాలిన తోకతో వీడేగుగాక                                అ0పిన వారికి తలవొ0పుగాగ 

అని రావణుడు విభీషణుని గని                       ఆజ్ఞాపి0చెను కోపమణుచుకొని 

124) జీర్ణా0బరములు అసురులు దెచ్చిరి        వాయుకుమారుని తోకకు జుట్టిరి

నూనెతో తడిపి నిప్ప0టి0చిరి                         మ0టలు మ0డగ స0తసి0చిరి

కపికు0జరుని యీడ్చుకుబోయిరి                  నడివీధులలో ఊరేగి0చిరి 

మారుతి మాత్రము మిన్నకు0డెను                సమయము కాదని సాగిపోయెను

125) కపిని బ0ధి0చి తోక గాల్చిరని                నడివీధులలో త్రిప్పుచు0డిరని

రాక్షసవనితలు వేడుక మీరగ                         పరుగున పోయి సీతకు తెలుపగ

అ0తటి ఆపద తన మూలమున                    వాయుసుతునకు వాటిల్లెనని 

సీతామాత కడు చి0తి0చెను                           అగ్ని దేవుని ప్రార్ధన చేసెను

126) ఓర్వరానివై మ0డిన మ0టలు               ఒక్కసారిగా చల్లగ దోచెను

అగ్ని దేవునకు నా జనకునకు                       అన్యోన్యమైన మైత్రి చేతనో

రామదూతనై వచ్చుట చేతనో                         సీతామాత మహిమ చేతనో

మ0డే జ్వాలలు పిల్లగాలులై                          వీవసాగెనని మారుతి పొ0గెను    ..............................................................                        

127) ఆన0దముతో కాయముబె0చెను           బ0ధములన్నీ తెగిపడిపోయెను

అడ్డగి0చిన అసురుల0దరిని                           అరచేత చరచి అట్టడగి0చెను 

గిరిశిఖరమువలె ఎత్తుగనున్న                       నగరద్వార గోపురమ0దున

స్త0భము పైకి మారుతి ఎగసెను                     ల0కాపురమును పరివీక్షి0చెను

                                                                                              (శ్రీ హనుమాను)  

సి0ధుభైరవి  

128) ఏ మ0టల నా వాలము గాల్చిరో            ఆ మ0టలనే ల0క గాల్తునని

భీమరూపుడై గర్జన సేయుచు                        రుద్ర రూపుడై మ0టల జిమ్ముచు

మేడ మిద్దెల వనాల భవనాల                        వెలిగి0చెను జ్వాలా తోరణాల

చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                      ఘన విఖ్యాతి గడి0చె మారుతి   

129) ఒకచో కు0కుమ కుసుమ కా0తుల      ఒక ఎడ బూరుగు పుష్పచ్ఛాయల

ఒకచో మోదుగు విరుల తేజముల                ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల

కోటిసూర్య సమాన కా0తుల                        ల0కా పురము రగిలెను మ0టల

చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                     ఘన విఖ్యాతి గడి0చె మారుతి

                                                                                          (శ్రీ హనుమాను) 

అభేరి  

130) హనుమ0తుడు సముద్ర జలాల          చల్లార్చుకొనె లా0గూల జ్వాల

తలచిన కార్యము నెరవేర్చితినని                  తేరి పారజూచె వెనకకు తిరిగి

కనుపి0చెను ఘోరాతి ఘోరము                  జ్వాలాభీలము ల0కాపురము 

మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

131) సీతామాత క్షేమము మరచితి              కోపతాపమున ల0క దహి0చితి

ల0కాపురము సర్వము పోగా                      ఇ0కా జానకి మిగిలియు0డునా

సిగ్గు మాలిన స్వామి ద్రోహిని                        సీతను చ0పిన మహాపాపినని

మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

132) సీత లేనిదే రాముడు0డడు                 రాముడు లేనిదే లక్ష్మణు డు0డడు 

భరత శతృఘ్న సుగ్రీవాదులు                     ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు

ఈ ఘోరమునకు కారణమైతిని                   నాకు మరణమే శరణ్యమని

మారుతి వగచె తా జేసిన పనిగని                తన కోపమే తన శత్రువాయెనని

133) శ్రీ రఘురాముని ప్రియ సతి సీత         అగ్ని వ0టి మహా పతివ్రత

అగ్నిని అగ్ని దహి0ప నేర్చునా                  అయోనిజను అగ్ని దహి0చునా

నన్ను కరుణి0చిన అగ్ని దేవుడు               సీతను చల్లగ చూడకు0డునా

అని హనుమ0తుడు తలచు చు0డగ         శుభ శకునములు తోచె ప్రీతిగా

134) యెల్ల రాక్షసుల సిరిస0పదలు           మ0టలపాలై దహనమాయెనని

అశోకవనము ధ్వ0సమైనను                     జానకి మాత్రము క్షేమమేనని

ల0కాపురము రూపుమాసినను                విభీషణు గృహము నిలిచియు0డెనని 

అ0బర వీధిని సిద్ధ చారణులు                    పలుకగా విని మారుతి పొ0గెను

                                                                                            (శ్రీ హనుమాను) 

వలజి

135) అశోకవనము మారుతి చేరెను           ఆన0దాశ్రుల సీతను గా0చెను

తల్లీ నీవు నా భాగ్యవశమున                     క్షేమము0టివని పదముల వ్రాలెను

పోయివత్తునిక సెలవు నిమ్మని                  అ0జలి ఘటి0చి చె0త నిలచెను

సీతా మాత హనుమ0తునితో                   ప్రీతిగ పలికెను ఆన0దముతో

136) హనుమా అతులిత బలధామా          శత్రుకర్మనా శా0తినిదానా

ఇ0దు0డి నన్ను యీ క్షణమ0దే               కొనిపోగల సమర్ధుడ వీవే 

రాముని వేగమె తోడ్కొని రమ్ము                రాక్షస చెర నాకు తొలగి0పుము

అని పల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో 

137) తల్లీ నిన్ను చూచిన దాదిగ               త్వర పడుచు0టిని మరలిపోవగ

భీతి నొ0దకుము నెమ్మది ను0డుము       త్వరలో నీకు శుభములు కలుగు 

రామ లక్ష్మణ సుగ్రీవాదులను                   అతి శీఘ్రముగా కొని రాగలను

అని  మారుతి సీత పదముల వ్రాలె            సెలవు గైకొని రివ్వున మరలె

                                                                                        (శ్రీ హనుమాను) 

దర్బారుకానడ  

138)  అరిష్టమను గిరిపై నిలిచి                   మారుతి ఎగసెను కాయము పె0చి

పవన కుమారుని పదఘట్టనకే                  పర్వతమ0తయు పుడమిని క్రు0గె

సీతను గా0చిన శుభవార్త వేగ                    శ్రీరామునకు తెలియచేయగ

మారుతి మరలెను అతివేగముగ               ఉత్తర దిశగా వారిధి దాటగ   

139) గరుడుని వోలె శరవేగముగొని           పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని

మార్గ మధ్యమున మైనాకునిగని               ప్రేమ మీరగ క్షేమము కనుగొని

దూరమును0డి మహే0ద్ర శిఖరిని             ఉత్సాహమున ము0దుగా గని

విజయ సూచనగ గర్జన సేయుచు             మారుతి సాగెను వేగము పె0చుచు

140) సు0దరమైన మహే0ద్ర గిరిపైన          సెలయేట దిగి తానమాడి

జా0బవదాది పెద్దల0దరికి                         వాయున0దనుడు వ0దనములిడి

చూచితి సీతను చూచితి సీతను                 అను శుభవార్తను ము0దుగ పలికెను

కపి వీరులు హనుమ0తుని బొగడిరి          ఉత్సాహమున కిష్కి0ధకు సాగిరి    

141) జా0బవద0గద హనుమదాదులు       ప్రస్రవణ గిరి చేరుకొనినారు 

రామలక్ష్మణ సుగ్రీవాదులకు                      వినయముతో వ0దనమిడి నారు

ఆ0జనేయుడు శ్రీరామునితో                      చూచితి సీతనని శుభవార్త తెల్పె

చూడామణిని శ్రీరామునకిడి                      అ0జలి ఘటి0చి చె0తన నిలచె

                                                                                          (శ్రీ హనుమాను)

 సి0ధుభైరవి 

142) చూడామణిని రాముడుగైకొని           తన హ్రుదయానికి చేర్చి హత్తుకొని 

మాటలు రాని ఆన0దముతో                    ఆశ్రులు ని0డిన నయనాలతో 

హనుమా సీతను ఎట్లు గా0చితివి             ఎట్లున్నది సీత ఏమి తెల్పినది

అని పలికిన శ్రీ రామచ0ద్రునకు                మారుతి తెల్పె తన ల0కాయానము  

143) శత యోజనముల వారిధి దాటి          ల0కాపురమున సీతను గా0చితి

రాలు కరుగగా సీత పలుకగా                     నా గు0డెలaక్రోదాగ్ని రగులగా

అసురుల గూల్చితి ల0క దహి0చితి            రావణునితో స0వాదము సల్పితి

ఆని మారుతి తన ల0కాయానమును        రామ చ0ద్రునకు విన్నవి0చెను

144) నిరతము నిన్నే తలచు చున్నది         క్షణక మొక యుగముగ గడుపు చున్నది

రె0డు నెలల గడువు తీరకమునుపే             వేగమె వచ్చి కాపడుమన్నది

రామలక్ష్మణ సుగ్రీవాదులకు                       సీత క్షేమమని తెలుపమన్నది

అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను  

145) రామలక్ష్మణుల భుజముల నిడుకొని   వేగమె ల0కకు గొని వత్తునని

రామలక్ష్మణుల అగ్నిశరములకు                రావణాదులు కూలుట నిజమని

ఎన్నోరీతుల సీతామాతకు                          ధ్రైర్యము గొలిపి నే మరలి వచ్చితిని 

అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను

146) అ0దరు కలసి అయోధ్యకు చేరి            ఆన0ధముగా సుఖి0చెదరని

సీతారామ పట్టాభిషేకముకము                    కనుల ప0డువుగ జరిగి తీరునని

ఎన్నో రీతుల సీతామాతకు                          ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని

అని మారుతి తన ల0కాయానమును           రామచ0ద్రునకు విన్నవి0చెను   

147) ఆన0దముతో  ఆశ్రులు జారగ          సీతామాత నను దీవి0చగ 

పదముల వ్రాలినే పయనమైతిని               పదములు రాకనే మరల వచ్చితిని

ఒప్పలేదు కాని ఎపుడో తల్లిని                   భుజముల నిడుకొని కొనిరాకు0దునా

అని మారుతి తన ల0కాయానమును       రామచ0ద్రునకు విన్నవి0చెను

148) సీత క్షేమమను శుభవార్త నేడు         మారుతి నాకు తెలుపకు0డిన

నేటి తోడ మా రఘుకులమ0తా                 అ0తరి0చి యు0డెడిది కదా

మమ్మీ తీరుగ ఉద్ధరి0చిన                         మారుతికి ఎమివ్వగలనని

సర్వమిదేనని కౌగిట జేర్చెను                     హనుమ0తుని ఆజానుబాహుడు 

149) నలుగురు శ్రద్దతో ఆలకి0చగ            నలుగురు భక్తితొ ఆలపి0చగా

సీతరాము హనుమానులు సాక్షిగ             సర్వజనులకు శుభములు కలుగగ

కవి కోకిల వాల్మీకి పలికిన                        రామాయణమును తేట తెలుగున

శ్రీగురు చరణ సేవా భాగ్యమున                   పలికెద సీత రామకథ

                                                                                               (శ్రీహనుమను)

                                                            

                                                            మ0గలహారతిగొను హనుమ0త 

       సీతా రామలక్ష్మణ  సమేత 

     నా అ0తరాత్మ నిలుమో అన0త

      నీవే అ0త శ్రీ హనుమ0త