పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 9 /5/15. )

పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 9 /5/15. )
.
అంబరీషుడు :
.
హరియని సంభావించును ; హరియని దర్శించు ; నంటు ; నాఘ్రాణించున్ ;...
హరియని రుచిగొనదలచును , హరిహరి ! ఘను నంబరీషు నలవియె పొగదన్
.
అంబరీషుడు” మాటలాడేముందు హరీ అని పలికేవాడు , హరి అన్న శబ్దం ఉచ్చరించాకే ఇతరులను చూచే వాడు , హరి అన్న తరవాతే ఇతరులను తాకే వాడు , వాసన చూడాలన్నా , రుచి చుడాలన్నా మొదలు హరి నామం ఉచ్చరించ వలసినదే . అటువంటి నిష్టాగరిష్టుడయిన అంబరీషుని పొగడడానికి సాధ్యమా ” అంటాడు పోతన . స్వామి సౌందర్య సందర్శనానుభూతిలో పొంగి ప్రవహించిపోయేవాడే భక్తుడు . కాదంటారా ?
.
భక్తులందరికీ ఈ పృవృత్తి సహజం . పోతన అయినా , విదురుడైనా , అంబరీషుడైనా , ప్రహ్లాదకుమారుడైనా — తనువూ , తలపూ , తపస్సూ అంతా భగవంతుని మీదే . అటువంటి భక్తి లభించడం ఒక సౌభాగ్యం . దానికి కూడా ఆ పరమాత్ముని అనుగ్రహం ఉండాలి మరి .
అంబరీషుని కథ అందరికీ తెలిసిందే కదా . సుదర్శన చక్రం ఆతనికి ఏవిధమైన ఆపదా రాకుండా కాపాడింది . తన భక్తులను రక్షించుకోవడానికి పరమాత్మ సర్వదా సన్నిధ్ధంగా ఉంటాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!