శ్రీకృష్ణ శతకం.!........( 15/5/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీకృష్ణ శతకం.!........( 15/5/15)... (శ్రీ నరసింహ కవి.)

.



నీవే తల్లివిఁ దండ్రివి


నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ


నీవే గురుడవు దైవము


నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!

.




భావం: ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, 

నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గురువు, 

దేవుడు కూడా నీవే. నీవే నాకు ప్రభువు. నాకు దిక్కు నీవే. నా సమస్తము నీవే.

.




కృష్ణా అంటే ఓ కృష్ణా; నిజముగ అంటే వాస్తవంగా; నీవే అంటే నువ్వే; నాకు అంటే నిన్ను పూజించే నాకు; తల్లివి అంటే కనిపెంచే తల్లితో సమానం; తండ్రివి అంటే కన్నతండ్రివలె రక్షించేవాడివి; నీవే అంటే నువ్వే; నా తోడు అంటే నాకు సహాయకుడివి; నీడ అంటే వెన్నంటి ఉండే నీడ వంటి వాడివి; నీవే అంటే నువ్వే; సఖుడు + ఔ అంటే ప్రాణమిత్రుడివి; 

నీవే అంటే నువ్వే; గురుడవు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి; 

దైవము అంటే దేవుడవు; నీవే అంటే నువ్వే; నా పతియు అంటే నాకు ప్రభువు; 

గతియు అంటే దిక్కు.

.




ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడని, ఆయనే శ్రీకృష్ణుడని కవి 

ఈ పద్యంలో వివరించాడు. ఇందులో ఉపయోగించిన పదాలన్నీ చాలా చిన్నవి. 

అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఇటువంటి చిన్నచిన్న పద్యాలయితే పిల్లలు చక్కగా పలుకుతారు. పిల్లలకు బాల్యం నుంచే భగవంతుడికి నమస్కరించే అలవాటును ఇటువంటి పద్యాలతో ఆరంభిస్తే వారికి కూడా ఆసక్తి కలుగుతుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!