పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .! ౩/5/15.

పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .! ౩/5/15.
.

...
పలికెడిది భాగవతమట , పలికించు విభుండు రామభద్రుండట ! నే
పలికిన భవహరమౌనట ! పలికెద వేరొండు గాథ పలుకగనేలా ?
.
“పలికేది భాగవతం , పలికించేవాడు రామచంద్రుడు . అది నేను పలికితే ముక్తి లభిస్తుందట . నేను నాది అన్న భావం మటు మాయమవుతుందట . వేరేగాధలను పలకడమెందుకు . భాగవతాన్నే పలుకుతాను ” అని అన్నాడు పోతన్న . అదే పలికాడు , మనభాగ్యం కొద్దీ .
.
” భాగవతం తెలిసి పలుకడం శూలికీ , తమ్మిచూలికీ కూడా అసాధ్యమని తెలిసినా ” తను పలికాడు .
చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి . పూజలో లోపాలు రానీయం కదా . తలపెట్టిన పని దిగ్విజయంగా ముగుస్తుంది . ఫలితాన్ని మాత్రం ఆతనికే వదిలి వేయాలి . ఇలా చేసినందు వల్ల ఏకారణంవల్లనైనా చేసిన పనికి ఫలితం లభించకున్నా బాధ కలుగదు . ఫలితం లభించక పోవడమన్నది నూటికో కోటికో ఒక సారి కలుగుతుంది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!